1
00:00:01,000 --> 00:00:03,760
ఈ ఎపిసోడ్ ఆత్మహత్యల విషయాలతో సహా
సునిశితమైన సమస్యలను డీల్ చేస్తుంది.

2
00:00:03,840 --> 00:00:04,960
వీక్షకుల విచక్షణకు సూచించబడింది

3
00:00:22,800 --> 00:00:23,920
సట్టన్?

4
00:00:36,840 --> 00:00:38,240
సట్టన్!

5
00:00:39,160 --> 00:00:40,320
అయ్యో దేవుడా.

6
00:00:56,160 --> 00:00:57,200
నాన్నా!

7
00:01:12,600 --> 00:01:13,760
ఆమె చనిపోయింది.

8
00:01:16,120 --> 00:01:17,240
సట్టన్ చనిపోయింది.

9
00:01:20,840 --> 00:01:22,160
డాక్టర్ లాజరస్?

10
00:01:24,680 --> 00:01:25,840
డాక్టర్ లాజరస్?

11
00:01:25,920 --> 00:01:28,840
నేడు

12
00:01:28,920 --> 00:01:30,840
కొత్త రోగి సిద్ధం.

13
00:01:33,040 --> 00:01:34,040
ఆర్లో విచారణ
దోషిగా నిర్థారణ

14
00:01:34,120 --> 00:01:35,040
జోన్స్ దోషి - జ్యూరీ

15
00:01:35,120 --> 00:01:36,000
ఆర్లోకు జీవిత ఖైదు

16
00:01:54,200 --> 00:01:57,160
సురక్షిత మానసిక చికిత్సా విభాగం

17
00:02:17,200 --> 00:02:19,880
ఇన్‌కమింగ్ కాల్
నాన్న

18
00:02:37,400 --> 00:02:38,600
సరే అయితే.

19
00:02:40,160 --> 00:02:41,160
ఆర్లో.

20
00:02:43,320 --> 00:02:44,600
నన్ను బయటకు తీసుకురా.

21
00:02:44,680 --> 00:02:46,960
ఇప్పుడు ఆ పని చేయలేను.

22
00:02:47,480 --> 00:02:49,160
అయితే నీతో ఉపయోగం ఏమిటి?

23
00:02:49,240 --> 00:02:53,000
నీ ఆలోచన గురించి మాట్లాడటానికి
నేను వచ్చాను,

24
00:02:53,080 --> 00:02:57,000
ఇంకా… నీ బుర్రలో ఉన్న
ఆలోచనల గురించి.

25
00:02:57,640 --> 00:02:58,680
ఏ ఆలోచనలు?

26
00:02:58,760 --> 00:03:00,600
ఏ ఆలోచనల గురించి చర్చించాలని ఉంది?

27
00:03:03,520 --> 00:03:04,360
దేవుడి గురించి.

28
00:03:05,200 --> 00:03:06,880
నేను ఆయనతో మాట్లాడుతున్నాను.

29
00:03:06,960 --> 00:03:10,120
మరి నీ దేవుడితో
దేని గురించి మాట్లాడుతున్నావు?

30
00:03:13,400 --> 00:03:14,400
నీ నేరాల గురించా?

31
00:03:15,640 --> 00:03:16,640
నీ గురించి.

32
00:03:19,000 --> 00:03:20,240
నేనే ఎందుకు?

33
00:03:20,320 --> 00:03:23,160
నేను నిన్ను నమ్మగలనా అని అడిగాను.

34
00:03:23,240 --> 00:03:24,920
మరి ఆయన సమాధానం చెప్పాడా?

35
00:03:25,400 --> 00:03:29,080
ఆయన నమ్మవద్దని చెప్పాడు.

36
00:03:29,760 --> 00:03:32,400
నువ్వు నకిలీవని చెప్పాడు,

37
00:03:32,480 --> 00:03:35,680
అప్పుడు నిన్ను శిక్షించమని ఆయనను అడిగితే,
ఆయన ఏం చెప్పాడో నీకు తెలుసా?

38
00:03:36,720 --> 00:03:38,280
అతను ఏం చెప్పాడు?

39
00:03:40,520 --> 00:03:42,040
ఆయన ఆ పని చేస్తానన్నాడు,

40
00:03:42,760 --> 00:03:46,800
అది కూడా నా కోసం.

41
00:04:02,200 --> 00:04:03,160
హే.

42
00:04:03,840 --> 00:04:05,000
నాన్న గురించి.

43
00:04:05,080 --> 00:04:08,240
అవును, ఆయన నాకు ఫోన్ చేసాడు.
నేను అది పట్టించుకోలేదు. ఏమైంది?

44
00:04:08,320 --> 00:04:10,600
లాజ్, ఆయన చనిపోయారు.

45
00:04:11,920 --> 00:04:12,800
ఏమిటి?

46
00:04:12,880 --> 00:04:16,680
ఆయన తన ఆఫీసులో
తనను తాను కాల్చుకున్నారు.

47
00:04:25,960 --> 00:04:27,800
లైన్‌లో ఉన్నావా?

48
00:04:31,680 --> 00:04:37,680
హార్లాన్ కోబెన్స్
లాజరస్

49
00:04:46,600 --> 00:04:49,160
ప్రముఖ మనోరోగ వైద్యుడు,
డాక్టర్ జొనథన్ లాజరస్,

50
00:04:49,240 --> 00:04:51,160
ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.

51
00:04:51,240 --> 00:04:54,920
25 సంవత్సరాల క్రితం దారుణంగా హత్య చేయబడిన
సట్టన్ లాజరస్‌కు తండ్రిగా,

52
00:04:55,000 --> 00:04:57,680
ఆయన జీవితంలో
విషాదాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.

53
00:04:57,760 --> 00:05:00,520
ఆమెను చంపినవాడి కోసం అన్వేషణ
దేశం అంతటినీ ఆకర్షించింది,

54
00:05:00,600 --> 00:05:02,640
కానీ ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి.

55
00:05:02,720 --> 00:05:06,760
డాక్టర్ జొనథన్ లాజరస్ తన మిగిలిన
ఇద్దరు పిల్లలు,

56
00:05:06,840 --> 00:05:08,440
జోయెల్, జెన్నాతో జీవిస్తున్నారు.

57
00:05:10,560 --> 00:05:14,160
తరువాత వాతావరణం,
మనం ఎక్కడకు వెళతామంటే…

58
00:05:29,720 --> 00:05:31,200
ఎడమవైపు వెళుతూ ఉండండి.

59
00:05:31,920 --> 00:05:33,360
పద. పద, మిత్రమా.

60
00:05:33,440 --> 00:05:34,960
ఎడమవైపుకు చుట్టూ తిరగండి.

61
00:06:18,120 --> 00:06:20,240
దీనికి అసలు అర్థం లేదు.

62
00:06:22,120 --> 00:06:23,600
ఆయన దగ్గర ఎప్పటి నుండి తుపాకీ ఉంది?

63
00:06:25,000 --> 00:06:25,960
ఆయన దగ్గర లేదు.

64
00:06:27,200 --> 00:06:28,360
నోట్ ఎక్కడ ఉంది?

65
00:06:28,440 --> 00:06:31,760
సరే, పోలీసుల దగ్గర అసలు కాపీ ఉంది,
కానీ వాళ్లు నాకు ఈ ఫోటోకాపీ ఇచ్చారు.

66
00:06:31,840 --> 00:06:34,400
తన జీవన విధానంగా,
మనసుల్లోకి తొంగి చూసే ఒక మనిషిగా,

67
00:06:34,480 --> 00:06:36,640
ఆయన మనకు
కొంచెం స్పష్టత ఇచ్చి ఉండేవారు.

68
00:06:37,120 --> 00:06:38,120
"ఇది ఇంకా అయిపోలేదు."

69
00:06:38,200 --> 00:06:39,760
ఇది ఇంకా అయిపోలేదు.

70
00:06:39,840 --> 00:06:41,320
అసలు దాని అర్థం ఏమిటి?

71
00:06:42,400 --> 00:06:43,280
నువ్వే చెప్పు.

72
00:06:43,360 --> 00:06:46,760
మరి ఆ టేబుల్? మూడు కాళ్లు.
ఏదో కోడ్ లాగా ఉంది.

73
00:06:47,960 --> 00:06:49,800
అక్కడ ఇది కూడా ఉంది…

74
00:06:52,640 --> 00:06:54,520
ఆఫీసులో ఆయన డెస్క్ మీద.

75
00:07:06,560 --> 00:07:08,240
ఆయన సట్టన్ గురించి మాట్లాడారా?

76
00:07:08,320 --> 00:07:09,840
తను ఆమె గురించి ఏనాడూ మాట్లాడలేదు.

77
00:07:10,680 --> 00:07:13,120
ఆయన ఇలా ఎందుకు చేశారో
నాకు అర్థం కావడం లేదు.

78
00:07:16,360 --> 00:07:18,960
ఇది ఇంకా అయిపోలేదు.

79
00:07:29,080 --> 00:07:30,240
సట్టన్?

80
00:07:48,480 --> 00:07:49,520
అసలు ఏంటిది?

81
00:09:06,720 --> 00:09:08,160
సెఠ్ మెక్‌గొవర్న్
పని అవనుంది. నీకు?

82
00:09:08,240 --> 00:09:13,360
మహిళలారా, ఇది విచారకరమైన రోజు, ఎందుకంటే
ఈ సెఠ్, అధికారికంగా మార్కెట్ నుండి దూరం.

83
00:09:13,720 --> 00:09:15,800
నేనేం చెప్పగలను?
జెన్నాకు గొప్ప అభిరుచి ఉంది.

84
00:09:16,400 --> 00:09:17,640
-నోరు మూసుకో.
-అది ఇలా ఇవ్వు.

85
00:09:21,360 --> 00:09:22,320
సెఠ్!

86
00:09:22,400 --> 00:09:25,600
అతను ఉన్నాడు. రండి, తీసుకురండి.

87
00:09:25,680 --> 00:09:27,920
-నిన్ను చూసుకో.
-దంతాలు నచ్చాయి. అవి ఎవరివి?

88
00:09:29,080 --> 00:09:31,760
గడ్డం నచ్చింది,
రెండు గడ్డాలను కప్పుతుంది.

89
00:09:31,840 --> 00:09:32,800
నీకు భలే ధైర్యంరా.

90
00:09:34,000 --> 00:09:35,840
అభినందనలు. ఎప్పుడు కంటున్నావు?

91
00:09:35,920 --> 00:09:38,960
వదిలెయ్. అది నా బీర్ బిడ్డ.
పద. రోజీ క్యుకు వెళదామా?

92
00:09:39,360 --> 00:09:40,480
వేరే ఎక్కడకు వెళతాం?

93
00:09:56,280 --> 00:09:59,000
నగర సంస్కృతి ఇంకా ఇక్కడకు
చేరుకోకపోవడం చూడటం ఆనందం.

94
00:09:59,080 --> 00:10:01,160
అవును. నీకు బెల్లా తెలుసుగా.
"మార్పు అంటే మరణం."

95
00:10:04,640 --> 00:10:05,880
నువ్వు ఏం తాగుతావు?

96
00:10:06,440 --> 00:10:07,440
వోడ్కా టానిక్.

97
00:10:08,920 --> 00:10:10,080
ఎందుకు?

98
00:10:10,160 --> 00:10:12,200
ఫోడ్‌మాప్ డైట్. గోధుమలు వద్దు.

99
00:10:13,200 --> 00:10:16,360
మనం డైవ్ బార్‌లో ఉంటే,
నువ్వు ఫోడ్‌మాప్ డైట్‌కి కట్టుబడి ఉంటావు.

100
00:10:16,440 --> 00:10:19,160
నువ్వు కడుపు ఉబ్బరంతో
అరాచకంగా ఉండాలని చూస్తున్నావు.

101
00:10:22,360 --> 00:10:23,680
అదిగో బెల్లా.

102
00:10:24,800 --> 00:10:27,160
నేను డ్రింక్స్ తెస్తాను.
వెళ్లి పలకరించు.

103
00:10:38,640 --> 00:10:39,680
నువ్వు బాగున్నావా?

104
00:10:39,760 --> 00:10:40,880
-ఇంతకంటే బాగుండదులే.
-అవును.

105
00:10:45,080 --> 00:10:46,080
హలో, సుందరీ.

106
00:10:48,280 --> 00:10:51,400
ల్యాజ్! మనస్తత్వవేత్త తిరిగి వచ్చాడు.

107
00:10:51,480 --> 00:10:52,840
మానసిక వైద్యుడిని.

108
00:10:52,920 --> 00:10:54,960
ఎవరోఒకరులే. ఇక్కడ ఏం చేస్తున్నావు?

109
00:10:56,280 --> 00:10:57,840
మా నాన్న చనిపోయారు.

110
00:11:00,000 --> 00:11:01,200
అయ్యయ్యో.

111
00:11:02,640 --> 00:11:06,040
మనం విడిపోయాక, నన్ను కలిసిన
అత్యుత్తమ మహిళను కోల్పోయానని ఆయన అన్నారు.

112
00:11:08,000 --> 00:11:09,280
ఆయన చెప్పింది నిజమే.

113
00:11:11,080 --> 00:11:12,320
ఆయన మాట నిజమే కావచ్చు.

114
00:11:13,280 --> 00:11:14,280
బెల్లా!

115
00:11:16,160 --> 00:11:17,440
నేను వడ్డించాలి.

116
00:11:23,240 --> 00:11:24,880
నాకు చాలా బాధగా ఉంది, ల్యాజ్.

117
00:11:30,360 --> 00:11:32,760
రోజీ క్యు

118
00:11:33,640 --> 00:11:35,760
తను స్పష్టంగా
సట్టన్ గురించి ఆలోచిస్తున్నాడు.

119
00:11:36,680 --> 00:11:38,280
ఇది తన డెస్క్ మీద ఉంది.

120
00:11:46,120 --> 00:11:49,600
ఆ రాత్రి ఏం జరిగిందో మనలో ఎవరూ కూడా
ఎప్పటికీ మర్చిపోగలమని అనుకోను.

121
00:11:52,120 --> 00:11:54,680
ఆయన దానితో కుంగిపోయారు.
సట్టన్ ఆయనకు ప్రియమైన బిడ్డ.

122
00:11:54,760 --> 00:11:55,880
కాదు, మిత్రమా.

123
00:11:55,960 --> 00:11:57,760
తను అలా ఏనాడూ చెప్పలేదు,
కానీ మనందరికీ తెలుసు.

124
00:11:57,840 --> 00:12:01,200
"అంతగా నచ్చని" కవలగా చెబుతున్నా,
నన్ను నమ్ము, ఇది గమనించే విషయం.

125
00:12:02,840 --> 00:12:06,160
ఆయనకు ముగింపు దొరికితే బాగుండేది,
దీనికి ఎవరైనా పట్టుబడితే చూసి ఉంటే.

126
00:12:08,720 --> 00:12:10,400
నేను అడిగేది ఏంటంటే,
జెన్నా ఎలా ఉంది?

127
00:12:11,600 --> 00:12:12,880
ఆమె బాగానే ఉంది.

128
00:12:13,960 --> 00:12:15,200
నేను ఆమెకు ఫోన్ చేయాలంటావా?

129
00:12:15,280 --> 00:12:17,960
నీ ఇష్టం, అది బాధ తరువాత సెక్స్‌కు
దారితీయవచ్చని అనిపిస్తే.

130
00:12:18,040 --> 00:12:20,360
ఏంటి? ఆమె కేవలం ఒక స్నేహితురాలు, సరేనా?

131
00:12:20,440 --> 00:12:22,080
నేను అడిగేది ఏంటంటే

132
00:12:22,160 --> 00:12:24,560
ఆమె కాల్ చేస్తే బాగుంటుందని
నీ ఆలోచనా కాదా అని.

133
00:12:25,600 --> 00:12:27,480
అవును, నువ్వు కాల్ చేయాలని
నేను అనుకుంటున్నా.

134
00:12:29,000 --> 00:12:31,840
అయినా బాధ తరువాత సెక్స్ ఉంటుంది.
నిజానికి, అది చాలా సాధారణం.

135
00:12:32,240 --> 00:12:34,400
బతికున్నామని భావన పొందాలంటే
అది చేయాల్సిన అవసరం ఉంది.

136
00:12:34,480 --> 00:12:35,560
నాకు తెలుసు.

137
00:12:36,640 --> 00:12:37,720
చాలా బాగుంది, కాదంటావా?

138
00:12:41,480 --> 00:12:43,080
-మరొకటా?
-సహజంగానే.

139
00:12:43,160 --> 00:12:44,400
ఫోడ్‌మాప్ లేదా అరాచకత్వమా?

140
00:12:45,520 --> 00:12:46,920
అదరగొట్టేద్దాం.

141
00:13:02,920 --> 00:13:05,280
ఆయన తన ఆఫీసులో
తనను తాను కాల్చుకున్నారు.

142
00:14:09,800 --> 00:14:12,360
ద జునిపెర్ బుష్

143
00:14:45,040 --> 00:14:46,800
డాక్టర్ ఎల్? మన్నించండి,
నాకు ఆలస్యమైంది.

144
00:14:47,160 --> 00:14:48,600
లేదు, మన్నించండి,
నేను ఆయన కొడుకుని.

145
00:14:48,680 --> 00:14:52,440
నాకు నచ్చలేదు. "కసాండ్రా, పది నిమిషాలే
సమయం ఉంది," అని నాలో నేను చెప్పుకున్నా,

146
00:14:52,520 --> 00:14:55,360
-నేను ఆయన కొడుకుని…
-ఒక్క నిమిషమే సమయం వరకు నాది హంగామానే.

147
00:14:55,440 --> 00:14:58,320
-కసాండ్రా, నేను ఆయన కొడుకుని.
-ఆపై నాకు భద్రత గల మూత్రశాల…

148
00:14:58,400 --> 00:15:01,600
-ఏమండీ?
-ఇక నేను మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చాను.

149
00:15:01,680 --> 00:15:03,040
ఇక అది ఎలాగంటే…

150
00:15:04,200 --> 00:15:05,720
నువ్వు కావాలనే చేస్తున్నావు.

151
00:15:05,800 --> 00:15:10,920
అవును. అవును! అంటే, ఒత్తిడికి
గురవుతున్నాను, ఆందోళన చెందుతున్నాను.

152
00:15:11,000 --> 00:15:12,880
నేను వేరే విధంగా పనిచేయలేను.

153
00:15:17,760 --> 00:15:21,440
డాక్టర్ ఎల్ గురించి ఒక విషయం
మీకు చెప్పడానికి నాకు బాధగా ఉంది…

154
00:15:21,520 --> 00:15:23,560
నాకు మళ్లీ ఆ ఆలోచనలు వస్తున్నాయి.

155
00:15:28,480 --> 00:15:31,240
నా మాట విన్నారా,
నాకూ ఆ ఆలోచనలు వస్తున్నాయని చెప్పాను.

156
00:15:34,880 --> 00:15:36,400
ఏ ఆలోచనలు?

157
00:15:36,960 --> 00:15:40,320
అవే… హత్యల గురించి.

158
00:15:42,680 --> 00:15:43,800
అలాగా.

159
00:15:51,760 --> 00:15:54,320
ఈ ఆలోచనలలో ఏవేవి ఉంటాయి?

160
00:15:56,480 --> 00:15:58,880
అతను ఉంటాడు. తను చనిపోయాడు.

161
00:15:59,480 --> 00:16:01,800
నేను అతని ప్రాణం లేని
ముఖంలోకి చూస్తున్నాను.

162
00:16:01,880 --> 00:16:04,520
నేను అతన్ని కొట్టిన చోట
అతని తల నుండి రక్తం కారుతోంది,

163
00:16:04,600 --> 00:16:07,200
నేను అతని వైపు నేలపై చూస్తుంటే,
నా భావన…

164
00:16:10,720 --> 00:16:12,040
శూన్యం.

165
00:16:12,920 --> 00:16:14,960
ఆనందం కాదు, ఉపశమనం కాదు, అంతా శూన్యం.

166
00:16:15,680 --> 00:16:16,920
మరి ఆ వ్యక్తి ఎవరు?

167
00:16:20,280 --> 00:16:21,280
అతనే.

168
00:16:22,840 --> 00:16:26,400
నీల్, నా బాయ్‌ఫ్రెండ్. ఆ పిచ్చివెధవ.

169
00:16:27,040 --> 00:16:31,520
ఈ ఆలోచనలు, ఇవేమైనా జ్ఞాపకాలా?

170
00:16:31,600 --> 00:16:33,480
అలా అయితే బాగుండేది.
తను ఇంకా బతికే ఉన్నాడు.

171
00:16:34,840 --> 00:16:37,960
ఇంట్లో నాకోసం వేచి చూస్తున్నాడు,
ఆలస్యం చేయవద్దని హెచ్చరించాడు.

172
00:16:39,720 --> 00:16:43,080
అలాగే, నేను మీకు చెప్పాలి,
నన్ను ఒక వ్యక్తి వెంటాడుతున్నాడు.

173
00:16:44,800 --> 00:16:45,800
నిన్ను వెంటాడుతున్నాడా?

174
00:16:45,880 --> 00:16:49,360
అతను నన్ను చూస్తాడు,
కొన్నిసార్లు నన్ను అనుసరిస్తాడు,

175
00:16:49,440 --> 00:16:51,200
ఇక నా ఆలోచనలో, నేను అతన్ని చంపుతాను.

176
00:16:52,360 --> 00:16:57,320
వెనక్కి తిరిగి అతన్ని పొడిచేస్తాను,
అయినా నాకు ఏమీ అనిపించదు.

177
00:17:00,360 --> 00:17:03,920
అంటే… అంటే, ఎందుకు,
నేను వీటి గురించి ఎందుకు ఆలోచిస్తాను?

178
00:17:04,000 --> 00:17:05,920
దీనికేమీ అర్థం లేదు.

179
00:17:06,000 --> 00:17:08,600
కసాండ్రా, ఆ మనిషి,

180
00:17:08,680 --> 00:17:12,520
ఆ నీల్ గురించి నీకున్న భావాలనే

181
00:17:13,200 --> 00:17:16,520
ఈ కొత్త ఆరాధకుడిపై కూడా చూపుతున్నావా?

182
00:17:21,160 --> 00:17:22,240
నేను పోసుకోవచ్చా?

183
00:17:25,960 --> 00:17:26,960
మీకు కూడా పోయనా?

184
00:17:34,600 --> 00:17:36,280
ఎందుకు వద్దనాలి? స్మాల్ పొయ్.

185
00:17:50,160 --> 00:17:54,360
నేను అతన్ని చంపి,
అతని వైపు చూస్తాను,

186
00:17:57,600 --> 00:17:59,520
అయినా నాకు ఏమీ అనిపించదు.

187
00:18:09,200 --> 00:18:11,080
నేను నీకు మళ్లీ పోస్తాను.

188
00:18:15,240 --> 00:18:16,800
ఇది మీరు గతంలో చెప్పినట్లుగానే ఉంది.

189
00:18:17,400 --> 00:18:21,920
బాధతో జీవితాన్ని గడపడం గురించి
మీరు ఏమని చెప్పేవారు?

190
00:18:23,400 --> 00:18:24,560
నాకు గుర్తు చేయి.

191
00:18:38,440 --> 00:18:39,280
కసాండ్రా?

192
00:18:46,440 --> 00:18:47,560
కసాండ్రా?

193
00:19:08,800 --> 00:19:10,400
నిన్న రాత్రి ఏం చేసావు?

194
00:19:14,240 --> 00:19:17,840
నేను… బెల్లాను కలిశాను.

195
00:19:17,920 --> 00:19:20,320
ఏమిటి? ఆమె బార్‌లోనా?

196
00:19:21,760 --> 00:19:23,720
ఆమె అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయి.

197
00:19:24,920 --> 00:19:27,320
ఆమె… ఆమె ఇంకా అతనితోనే ఉందా…

198
00:19:27,400 --> 00:19:30,000
అతని పేరు ఏమిటి? పాల్.

199
00:19:31,120 --> 00:19:33,360
ప్రతిసారి "అతని పేరు
ఏమిటి?" అనే ప్రశ్న ఎందుకు?

200
00:19:33,680 --> 00:19:34,720
పాల్.

201
00:19:35,520 --> 00:19:37,680
మరి "అతని పేరు ఏమిటి" అని
ఎందుకు జోడించాలి?

202
00:19:37,760 --> 00:19:41,680
అవును, ఆమె ఇంకా పాల్‌తోనే ఉంది.
నీకు అతనంటే ద్వేషం.

203
00:19:42,400 --> 00:19:46,080
అతన్ని ద్వేషించను. ఏంటంటే…
అతనితో కొంచెం విసుగని అనుకోవచ్చు.

204
00:19:46,160 --> 00:19:49,640
"విసుగు"? అంటే, పాత ల్యాజ్ లాగా కాకుండానా?

205
00:19:50,520 --> 00:19:53,200
హే, బెల్లా బాగుంది. ఆమె…

206
00:19:54,040 --> 00:19:55,440
ఆమె చాలా మంచి మనిషి.

207
00:19:55,520 --> 00:20:00,520
ఇక పాల్‌కు మాత్రం గోల్ఫ్ అంటే పిచ్చి.
వాళ్లు ఎలా కలిసి ఉంటున్నారో అర్థం కాలేదు.

208
00:20:00,600 --> 00:20:02,920
వాళ్ల ఇద్దరి వివాహ బంధం
మీరు కలిసున్నదాని కంటే చాలా ఎక్కువ.

209
00:20:03,000 --> 00:20:05,720
పెద్ద సవాలు, జెన్. మేము చాలా
చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాం.

210
00:20:05,800 --> 00:20:09,520
అది ఎప్పటికీ నిలవదు, ఒకవేళ
మేము ఇప్పుడు కలిస్తే, ఎవరు చెప్పగలరులే.

211
00:20:12,800 --> 00:20:16,280
ఆ పిల్లాడి వయసు ఎంత… అతని పేరు ఏమిటి?

212
00:20:18,560 --> 00:20:21,680
ఎయిడాన్. పదిహేను.

213
00:20:23,080 --> 00:20:24,440
అతను మరింత వింతగా మారాడా?

214
00:20:24,520 --> 00:20:30,360
అతను వింతగా లేడు, ల్యాజ్.
అతను తనదైన మాయాజాలంలో ప్రత్యేకమైనవాడు.

215
00:20:31,040 --> 00:20:32,200
అంటే తను మరింత వింతగా మారాడు.

216
00:20:32,960 --> 00:20:34,120
అవును.

217
00:20:36,000 --> 00:20:40,840
ఇక చూడు… నేను మార్గోతో మాట్లాడాలి,

218
00:20:40,920 --> 00:20:45,040
నాన్న చివరి రోజులు
ఇంకా ఆయా విషయాల గురించి.

219
00:20:46,480 --> 00:20:51,120
ఆయన గురించి అడిగితే, ఆమె మరింత
బాధపడుతుందని నిన్ను హెచ్చరించాలి.

220
00:20:52,120 --> 00:20:53,760
నేను ఆమెకు కొంత రేకి ఇచ్చాను.

221
00:20:53,840 --> 00:20:58,280
ఆమె ప్రకాశం…
ఈ బూడిదరంగు పసుపు రంగులా ఉంది.

222
00:20:58,360 --> 00:20:59,960
అయ్యో, దేవుడా, అలా ఉందా?

223
00:21:00,960 --> 00:21:05,400
అవును, అలాగే ఉంది.
విశ్వ శక్తులకు నిన్ను నీవు తెరచుకుంటే,

224
00:21:05,480 --> 00:21:06,880
అది నీ జీవితాన్ని మార్చుతుంది.

225
00:21:07,480 --> 00:21:09,840
-మార్చుతుందా?
-అవును.

226
00:21:11,400 --> 00:21:13,240
మరి నా ప్రకాశం రంగు ఏమిటి?

227
00:21:17,800 --> 00:21:19,560
అది దిక్కుమాలిన రంగు.

228
00:21:21,000 --> 00:21:22,440
లోతుగా చెప్పావు.

229
00:21:47,240 --> 00:21:49,840
క్లయింట్ ఫైళ్ళు ఇక్కడ ఉన్నాయి.

230
00:21:49,920 --> 00:21:53,840
సంస్థగతంగా ఉంచడంలో
మీ నాన్నకు అంతగా అవగాహన లేదు.

231
00:21:54,640 --> 00:21:57,360
తెలుసు, మార్గో, కానీ అదృష్టవశాత్తూ,
అయనతో నువ్వు ఉన్నావు.

232
00:21:57,440 --> 00:21:58,600
ఆయనతో ఉన్నాను.

233
00:22:02,560 --> 00:22:04,320
ఇంకా మేము మంచి జట్టు.

234
00:22:08,640 --> 00:22:11,240
మన్నించాలి, అది…
ఆ విషయం మళ్లీ గుర్తుకు వస్తోంది…

235
00:22:12,240 --> 00:22:15,000
కసాండ్రా అని చెప్పావు. ఇంటిపేరు?

236
00:22:15,640 --> 00:22:16,600
తెలియదు.

237
00:22:16,680 --> 00:22:19,760
సరే, అయితే పని కష్టమే.
మేము ఇంటిపేరుతో ఫైల్ చేస్తాము.

238
00:22:19,840 --> 00:22:22,280
అయితే, మీకు డేటాబేస్ కానీ
కంప్యూటర్ సిస్టమ్ కానీ లేదా?

239
00:22:22,360 --> 00:22:23,840
మీ నాన్నకు పేపర్ ఆధారిత వ్యవస్థ ఇష్టం.

240
00:22:23,920 --> 00:22:28,440
తరచుగా రిఫరెన్స్ కోసం సెషన్లను రికార్డ్
చేసేవాడు, కానీ టెక్నాలజీని పట్టించుకోలేదు.

241
00:22:33,800 --> 00:22:35,640
నువ్వు మంచివాడివి, జోయెల్.

242
00:22:37,480 --> 00:22:40,560
నాకు తెలుసు, మీ ఇద్దరికీ తీరిక లేదని,
అనుకున్నంతగా మాట్లాడలేకపోయారని,

243
00:22:40,640 --> 00:22:42,920
అయినా ఆయన నీ గురించి
వృత్తిపరంగా చాలా గర్వపడ్డారు.

244
00:22:45,720 --> 00:22:48,680
నా ఉద్దేశంలో, ఆయనలా ఉండాలని కోరుకుని
నీ కెరీర్‌ను ఎంచుకున్నావు.

245
00:22:49,480 --> 00:22:50,840
అవును, అంతే కావచ్చు.

246
00:22:52,880 --> 00:22:55,840
తను నీ మనసులోకి చొచ్చుకుపోవడం
చాలా బాగా చేయగలరు.

247
00:22:57,080 --> 00:22:58,400
మీరు తన లోపలికి వెళ్లారా?

248
00:23:00,760 --> 00:23:01,920
అప్పుడప్పుడు.

249
00:23:02,600 --> 00:23:08,280
ఆయన ఎప్పుడైనా సట్టన్ గురించి,
ఆమె చంపబడిన రాత్రి గురించి మాట్లాడాడా?

250
00:23:10,320 --> 00:23:12,920
కొంచెం. ఎందుకు?

251
00:23:14,160 --> 00:23:16,120
నాకు ఎప్పుడూ అనిపించేది…

252
00:23:16,200 --> 00:23:17,760
నిన్ను నిందించారనా?

253
00:23:22,040 --> 00:23:24,320
అంటే, దాని గురించి నాకు ఏమీ తెలియదు.

254
00:23:26,960 --> 00:23:28,840
ఇక, నువ్వు ఏమీ అనుకోకపోతే.

255
00:23:29,360 --> 00:23:31,920
ఇక్కడికి తిరిగి రావడం
నాకు కొంచెం భారంగా అనిపిస్తోంది.

256
00:24:00,240 --> 00:24:02,680
క్లయింట్ పేరు
కసాండ్రా రోడ్స్

257
00:24:05,680 --> 00:24:06,520
చివరి సెషన్

258
00:24:06,600 --> 00:24:07,920
1999.

259
00:24:12,880 --> 00:24:14,480
అబ్బా ఛ.

260
00:24:20,920 --> 00:24:23,960
కేసు ముగిసింది
12/06/99

261
00:24:29,320 --> 00:24:32,680
క్లయింట్ పేరు: కసాండ్రా రోడ్స్
చిరునామా: ఫ్లాట్ 43, 68 హాజెల్టన్ వీధి

262
00:24:32,760 --> 00:24:38,760
హాజెల్టన్
వీధి

263
00:24:51,320 --> 00:24:52,680
హాయ్. అవును…

264
00:24:53,440 --> 00:24:55,320
నేను కసాండ్రా కోసం వెతుకుతున్నాను.

265
00:25:10,800 --> 00:25:11,880
హలో.

266
00:25:11,960 --> 00:25:16,360
అరే. కసాండ్రా ఇంకా ఇక్కడే ఉంటోందా?

267
00:25:16,960 --> 00:25:18,280
కసాండ్రా?

268
00:25:18,360 --> 00:25:20,200
అవును, కసాండ్రా రోడ్స్.

269
00:25:21,760 --> 00:25:24,160
సరే. అబ్బో.

270
00:25:25,680 --> 00:25:26,920
మీరు వెతకలేరు…

271
00:25:29,760 --> 00:25:31,240
అంటే, అది 20 ఏళ్ల క్రితం.

272
00:25:31,320 --> 00:25:33,720
నాకు తెలుసు.
ఆమె మా నాన్నకు క్లయింట్ కాగా,

273
00:25:33,800 --> 00:25:36,720
మా నాన్న ఈ మధ్యనే చనిపోయారు,
అందుకే నేను కొంచెం…

274
00:25:36,800 --> 00:25:39,840
వినండి, మన్నించండి,
కానీ ఆమె చనిపోయింది.

275
00:25:42,600 --> 00:25:43,440
చనిపోయిందా?

276
00:25:44,920 --> 00:25:45,920
నిజానికి హత్య చేయబడింది.

277
00:25:51,480 --> 00:25:52,640
లేదు…

278
00:25:55,680 --> 00:26:00,160
నేను ఆమెను కలిశాను… నిన్ననే.

279
00:26:01,760 --> 00:26:03,400
కసాండ్రా రోడ్స్‌నా?

280
00:26:03,480 --> 00:26:06,720
నన్ను నమ్మండి, ఆమె హత్యకు గురై
20 ఏళ్లకు పైగా అయింది.

281
00:26:08,080 --> 00:26:10,720
ఆ ఇంటిని కొనుగోలు చేసినది
మేము మాత్రమే.

282
00:26:10,800 --> 00:26:12,840
నిజానికి, మాకు ఇది చాలా చవకగా దొరికింది.

283
00:26:12,920 --> 00:26:15,280
ఇది చాలా ఏళ్లపాటు ఖాళీగా ఉండిపోయింది.

284
00:26:15,360 --> 00:26:18,000
అటకపై వదిలేసిన చెత్త అంతా కాకుండా.

285
00:26:19,280 --> 00:26:22,640
నిన్న మీరు కచ్చితంగా ఆమెను కలవలేదు.

286
00:26:23,480 --> 00:26:24,640
నిజం.

287
00:26:41,360 --> 00:26:43,520
హత్యా బాధితుడి వేధింపులు
దావా

288
00:26:49,000 --> 00:26:51,480
కసాండ్రా హంతకుడిని కనుగొనండి

289
00:26:54,600 --> 00:26:55,440
రింగ్ అవుతోంది…
మార్గో

290
00:26:55,520 --> 00:26:57,560
-హలో.
-కసాండ్రా రోడ్స్‌ను గొంతు కోసి చంపగా

291
00:26:57,640 --> 00:26:59,440
ఆమెను చంపినవాడు అసలు దొరకనే లేదు.

292
00:26:59,520 --> 00:27:01,920
నీకు అది గుర్తులేదా?
ఒక క్లయింట్ హత్యకు గురవుతుంటే?

293
00:27:02,000 --> 00:27:03,800
ఎందుకంటే అది
బాగా గుర్తుండిపోయేలా కనబడుతోంది.

294
00:27:03,880 --> 00:27:06,040
మన్నించు, నీ మాటలు నాకు వినబడటం లేదు.

295
00:27:06,120 --> 00:27:08,120
కసాండ్రా రోడ్స్ హత్యకు గురైందని చెప్పాను.

296
00:27:08,200 --> 00:27:10,560
-నువ్వు…
-మన్నించు, నీ మాట వినబడడం లేదు.

297
00:27:11,440 --> 00:27:12,440
హలో?

298
00:27:17,680 --> 00:27:20,560
అలాగే, నేను మీకు చెప్పాలి,
నన్ను ఒక వ్యక్తి వెంటాడుతున్నాడు.

299
00:27:31,320 --> 00:27:33,200
ఇన్‌కమింగ్ కాల్
సెఠ్ మెక్‌గొవర్న్

300
00:27:33,880 --> 00:27:34,760
చెప్పు.

301
00:27:34,840 --> 00:27:39,040
అరే బాబూ. మార్చురీ వాళ్లు మీ నాన్న శవాన్ని
అంత్యక్రియల నిర్వాహకులకు అప్పగించారు.

302
00:29:27,120 --> 00:29:32,880
సట్టన్ లాజరస్
1980-1998

303
00:30:05,040 --> 00:30:08,040
నేను నాన్న పాత ఫైళ్లను చూస్తూ,
ఆయన ఆఫీసు శుభ్రం చేస్తుండగా,

304
00:30:08,120 --> 00:30:09,760
అప్పుడు నేను దీనిని చూశాను.

305
00:30:09,840 --> 00:30:14,080
పరిష్కారం కాని మరో హత్య,
1999, నాలుగు మైళ్ల దూరంలో.

306
00:30:14,560 --> 00:30:16,960
అయితే, సట్టన్‌తో పోల్చితే
చాలా భిన్నమైన పరిస్థితులలో.

307
00:30:17,040 --> 00:30:19,840
అవును, కానీ రెండు పరిష్కారం కాని హత్యలు.

308
00:30:19,920 --> 00:30:23,040
ఒక ఏడాది తేడాతో, ఇక ఆ ఇద్దరికీ,
నేరస్తుడు పట్టుబడనే లేదు.

309
00:30:23,520 --> 00:30:25,120
అవును, అది 25 ఏళ్ల క్రితం.

310
00:30:25,880 --> 00:30:29,800
ఆమె నాన్న పేషెంట్లలో ఒకరు.
ఆమెను వెంటాడే వ్యక్తి ఉన్నాడనుకుంది.

311
00:30:29,880 --> 00:30:31,520
అది ప్రైవేట్ విషయం కాదా, ల్యాజ్?

312
00:30:31,600 --> 00:30:32,840
ఆమె చనిపోయింది, సెఠ్.

313
00:30:34,240 --> 00:30:38,600
నువ్వు… ఆమె కేసులో
ఏం జరిగిందో కనుగొనగలవా?

314
00:30:38,680 --> 00:30:41,720
1999 నాటి ఫైళ్ల గురించి
నేను వెతకడం మొదలుపెట్టాలనా?

315
00:30:41,800 --> 00:30:45,200
అది కూడా నేను భాగం కాని దర్యాప్తులలో.
నీకు పిచ్చి పట్టిందా?

316
00:30:45,280 --> 00:30:46,440
నేను అసలు…

317
00:30:47,200 --> 00:30:48,200
జోయెల్.

318
00:30:48,920 --> 00:30:50,160
ఆలిసన్.

319
00:30:50,240 --> 00:30:51,720
నాకు చాలా బాధగా ఉంది.

320
00:30:56,520 --> 00:30:58,280
-మేడమ్.
-సెఠ్.

321
00:31:01,080 --> 00:31:03,680
అతను చనిపోయాడంటే నమ్మలేకపోతున్నాను.
ముఖ్యంగా ఇలా.

322
00:31:04,160 --> 00:31:05,920
మీరు నోట్ గురించి ఏమనుకుంటున్నారు?

323
00:31:06,000 --> 00:31:10,200
ఆశ్చర్యం. బహుశా… పునర్జన్మ విషయమా?

324
00:31:10,280 --> 00:31:12,400
అంటే, నాన్నకు ఎప్పుడూ
ఆ రహస్యం అంటే ఇష్టం,

325
00:31:12,480 --> 00:31:14,800
కానీ అతను చివరికి కొంచెం
అతి చేశారని నా అంచనా.

326
00:31:14,880 --> 00:31:18,960
మనలో ఎవరికీ నిజంగా తెలియదు,
అక్కడ ఏం జరుగుతుందో, మనకు తెలియదుగా.

327
00:31:22,920 --> 00:31:24,320
మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది.

328
00:31:29,480 --> 00:31:30,800
-జెన్నా, హాయ్.
-హలో, ఆలిసన్.

329
00:31:30,880 --> 00:31:32,640
మీ నాన్న ఆమెతో పడుకునేవాడని అనుకునేవాడిని.

330
00:31:34,920 --> 00:31:37,880
అమ్మ చనిపోయిన తర్వాత,
ఇంటికి వచ్చిన ప్రతి మహిళ

331
00:31:37,960 --> 00:31:39,600
నా కొత్త తల్లి కాబోయేది.

332
00:31:40,240 --> 00:31:43,520
ఇప్పుడు, భార్య లేనివాళ్లు నిర్దిష్ట రకమైన
మహిళను మోసగించారని గ్రహించాను.

333
00:31:46,520 --> 00:31:48,600
నా కోసం ఆ సమాచారం తేగలవా?

334
00:31:49,120 --> 00:31:52,400
ఒక అవినీతి పోలీసు అధికారితో
నీ ప్రయత్నాల గురించి మనం మాట్లాడాలి…

335
00:31:53,400 --> 00:31:56,560
తరువాత, మందు తాగుతూ.

336
00:31:58,760 --> 00:31:59,600
ఏంటి?

337
00:32:06,880 --> 00:32:09,040
ల్యాజ్, చక్కని స్మారక సేవ.

338
00:32:09,480 --> 00:32:12,200
ధన్యవాదాలు. ధన్యవాదాలు. హే, పాల్.

339
00:32:12,280 --> 00:32:13,440
జోయెల్.

340
00:32:13,840 --> 00:32:16,240
నువ్వు… ల్యాజ్ అంటే చాలు.

341
00:32:16,320 --> 00:32:17,640
నేను జోయెల్ అనే అంటాను.

342
00:32:19,440 --> 00:32:21,960
అయితే, గోల్ఫ్ ఎలా ఉంది?

343
00:32:22,040 --> 00:32:24,000
బాగుంది. నా హ్యాండిక్యాప్ ఇప్పుడు
పదికి తగ్గింది.

344
00:32:24,920 --> 00:32:25,840
మంచి విషయం.

345
00:32:25,920 --> 00:32:28,640
అవును. మోంట్‌గోమెరీలో పచ్చదనం
అద్భుతంగా ఉంటుంది.

346
00:32:28,720 --> 00:32:31,320
వాళ్లు అధిక పొటాషియం,
ఫాస్ఫేట్ ఎరువులను ఉపయోగిస్తారు.

347
00:32:31,400 --> 00:32:33,760
ఇది ఎదిగే కాలంలో
ఏవైనా లోపాలను సరిచేస్తుంది.

348
00:32:34,880 --> 00:32:36,080
నీకు డ్రింక్ తీసుకురానా?

349
00:32:36,760 --> 00:32:38,720
పర్వాలేదు. ధన్యవాదాలు.

350
00:32:39,040 --> 00:32:41,240
-నేను మనకు నింపుతాను.
-సరే.

351
00:32:41,840 --> 00:32:44,120
-పాల్, నువ్వు కూడా నాతో వస్తావా?
-అలాగే. సరే.

352
00:33:14,200 --> 00:33:17,760
ఆ రాత్రి ఏం జరిగిందో మనలో ఎవరూ కూడా
ఎప్పటికీ మర్చిపోగలమని అనుకోను.

353
00:33:27,720 --> 00:33:28,960
ల్యాజ్.

354
00:33:32,520 --> 00:33:33,520
ల్యాజ్, వెళదాం.

355
00:33:48,840 --> 00:33:50,840
శామ్ ఓల్సన్,
మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాను,

356
00:33:50,920 --> 00:33:53,360
సట్టన్ లాజరస్ హత్య చేశారనే అనుమానంతో.

357
00:33:54,000 --> 00:33:55,760
మీరు ఏమీ మాట్లాడే అవసరం లేదు.

358
00:33:55,840 --> 00:33:57,640
ఒకవేళ మాట్లాడితే,
మీకు వ్యతిరేకంగా వాడవచ్చు.

359
00:34:00,760 --> 00:34:02,240
వాళ్లు అతన్ని విడుదల చేశారు.

360
00:34:02,720 --> 00:34:04,480
వాళ్లు అతన్ని విడుదల చేసేశారు!

361
00:34:18,200 --> 00:34:21,240
నేను రాత్రి వెళ్లిన తర్వాత, శామ్ ఓల్సన్
ఇంటి పక్క నుండి వెళ్లాను.

362
00:34:23,280 --> 00:34:26,560
మీ నాన్న అంత్యక్రియల రాత్రి,
నువ్వు అక్కను చంపాడని

363
00:34:26,640 --> 00:34:28,520
ఆరోపణలు ఎదుర్కున్నవాడి ఇంటికి వెళ్లావా?

364
00:34:28,600 --> 00:34:30,960
రెండు విషయాలకు
సంబంధం లేనట్లు కాదు.

365
00:34:31,040 --> 00:34:33,160
కానీ, తెలుసుగా, నేను అక్కడ తిరుగుతున్నాను.

366
00:34:33,760 --> 00:34:36,400
నాకు ఆ ప్రదేశాన్ని మళ్లీ చూడాలనిపించింది.

367
00:34:37,520 --> 00:34:39,400
అతనిపై కేసు కొట్టేశారు, ల్యాజ్.

368
00:34:39,840 --> 00:34:43,880
ఫోరెన్సిక్స్ లేదు, సాక్షులు లేరు,
ఇక అతనే చేశాడని నాన్న ఎప్పుడూ నమ్మలేదు.

369
00:34:44,440 --> 00:34:47,400
వ్యక్తిగతంగా, అతను ధరించే
కార్డిగాన్స్ విషయంలో అతన్ని జైలులో పెడతా,

370
00:34:47,480 --> 00:34:49,520
కానీ చట్టాలను నేను చేయలేను.

371
00:34:52,720 --> 00:34:55,640
అంత్యక్రియల్లో బాగా చేసావు.

372
00:34:57,560 --> 00:35:00,960
ఆ ప్రసంగం చాలా బాగుంది.
నాకు హిప్పీ సోది అంతా నచ్చింది.

373
00:35:03,320 --> 00:35:07,200
మనం జీవిస్తున్నాం, ల్యాజ్, జీవించాలి.
ఈ శరీరాలను విడిచిపెట్టిన తర్వాత.

374
00:35:09,800 --> 00:35:10,960
నిజంగానా?

375
00:35:11,040 --> 00:35:12,040
నిజంగా.

376
00:35:13,560 --> 00:35:15,080
సట్టన్ ఇక్కడే ఉందని నాకు తెలుసు.

377
00:35:16,680 --> 00:35:18,640
నేను కొన్నిసార్లు ఆమెను అనుభూతి చెందుతాను.

378
00:35:24,200 --> 00:35:26,320
సరే, నేను నిన్ను ఇది అడుగుతాను.

379
00:35:27,920 --> 00:35:32,640
మనుషులు ఎప్పుడైనా చనిపోయిన వారిని
చూస్తారని అనుకుంటావా?

380
00:35:34,480 --> 00:35:37,040
నిజంగా వాళ్లను చూడడం? ఎలాగంటే…

381
00:35:38,480 --> 00:35:40,400
చెప్పాలంటే, తమ కళ్ల ముందు ఉన్నట్లుగా?

382
00:35:41,760 --> 00:35:46,800
నువ్వు దుఃఖంలో ఉన్నావు. నువ్వు నాన్నను
చూస్తున్నానని అనుకుంటే, అప్పుడు…

383
00:35:46,880 --> 00:35:50,680
నాకు వియోగం గురించి అన్నీ తెలుసు,
అవి భ్రాంతులు. నేను అడుగుతున్నది అది కాదు.

384
00:35:50,760 --> 00:35:52,680
సరే, మరి ఏం అడుగుతున్నావు?

385
00:35:55,560 --> 00:35:59,200
అది వదిలెయ్.
చనిపోతే, ఇక చనిపోవడమే.

386
00:36:04,840 --> 00:36:07,960
కసాండ్రా రోడ్స్‌ను గొంతు కోసి చంపగా
ఆమెను చంపినవాడు అసలు దొరకనే లేదు.

387
00:36:08,040 --> 00:36:10,560
నీకు అది గుర్తులేదా?
ఒక క్లయింట్ హత్యకు గురవుతుంటే?

388
00:36:10,640 --> 00:36:13,360
నిన్న నువ్వు కచ్చితంగా ఆమెను కలవలేదు.

389
00:36:41,600 --> 00:36:43,080
ఓయ్! నువ్వు ఎయిడాన్‌వేగా?

390
00:36:47,480 --> 00:36:49,000
నువ్వు బెల్లా కొడుకువి.

391
00:36:52,520 --> 00:36:53,880
నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?

392
00:36:55,400 --> 00:36:57,640
నువ్వు ఎలా ఉన్నావో చూడాలనుకున్నాను.

393
00:37:05,440 --> 00:37:07,440
నువ్వు ఇక్కడకు
వెనక్కు రాకుండా ఉండాల్సింది.

394
00:37:11,840 --> 00:37:13,120
మా నాన్న చనిపోయారు.

395
00:37:14,440 --> 00:37:17,200
నాకు తెలుసు. నేను విన్నాను.

396
00:37:20,320 --> 00:37:22,880
మీ అమ్మ అంత్యక్రియలకు హాజరైంది.
మీ నాన్న కూడా.

397
00:37:24,160 --> 00:37:25,640
నేనూ వస్తానని అడిగాను.

398
00:37:25,720 --> 00:37:27,120
మా నాన్న అంత్యక్రియలకా?

399
00:37:28,440 --> 00:37:29,760
అవి నన్ను ఆకర్షిస్తాయి.

400
00:37:29,840 --> 00:37:31,560
అది పెద్ద ప్రమాణం.

401
00:37:31,640 --> 00:37:33,760
నువ్వు ఎన్నిటికి వెళ్లావో నాకు తెలియదు,

402
00:37:34,480 --> 00:37:36,720
కానీ అదంతా మామూలే,

403
00:37:37,760 --> 00:37:41,800
ఒక శవపేటిక, కొన్ని మంచి మాటలు,
కొంచెం సంగీతం.

404
00:37:42,720 --> 00:37:43,640
నీకు తెలుసు.

405
00:37:46,000 --> 00:37:47,360
నువ్వు ఏం చేస్తావు?

406
00:37:49,160 --> 00:37:53,280
నేను ఒక ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్‌ని.

407
00:37:54,920 --> 00:37:56,120
పిచ్చివాళ్లతో మాట్లాడతావా?

408
00:37:57,080 --> 00:37:58,480
అవును. అవును, ఒక రకంగా అంతే.

409
00:37:58,920 --> 00:37:59,880
సీరియల్ హంతకులతోనా?

410
00:38:01,280 --> 00:38:03,760
ఎక్కువ మంది సీరియల్ హంతకులు కారు.

411
00:38:06,400 --> 00:38:11,160
పిచ్చివాళ్లతో వ్యవహరించడం, అది నీకు
పిచ్చి పట్టించవచ్చని అనిపిస్తోంది.

412
00:38:12,800 --> 00:38:14,240
నీ మాట నిజమే అనిపిస్తోంది.

413
00:38:16,720 --> 00:38:18,320
చక్కని ఇల్లు వచ్చేసింది.

414
00:38:18,920 --> 00:38:21,000
నువ్వు వెనక్కు రాకుండా ఉండాల్సింది.

415
00:38:21,520 --> 00:38:23,360
దాని గురించి నాకు చెడు భావన కలుగుతోంది.

416
00:38:28,600 --> 00:38:31,840
లోపలికి పద, ఎయిడాన్. నేను…

417
00:38:31,920 --> 00:38:35,920
మన్నించు. నువ్వు వచ్చావని నేను వాడికి
చెప్పడంతో, తనకు ఈ ఆలోచనలు చెలరేగాయి.

418
00:38:36,000 --> 00:38:38,480
పర్వాలేదు. హే, పాల్.

419
00:38:38,560 --> 00:38:39,640
జోయెల్.

420
00:38:39,720 --> 00:38:41,160
వెళ్లు. నువ్వు లోపలకు పద.

421
00:38:41,440 --> 00:38:43,240
సరే, ఇక. నేను బయలుదేరుతాను.

422
00:38:43,320 --> 00:38:46,240
వాడిని తిరిగి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు,
నిజంగా అభినందిస్తున్నాను.

423
00:38:47,560 --> 00:38:49,840
నాకు ఇద్దరు భర్తలు అని తెలిసి
అతని మనసు విస్తుపోయింది.

424
00:38:50,400 --> 00:38:52,840
అది పిల్లాడికి వింతగా ఉంటుందని
నా అంచనా.

425
00:38:52,920 --> 00:38:54,080
అంతే, అవును.

426
00:38:55,480 --> 00:38:56,320
ఏంటి?

427
00:38:56,400 --> 00:38:58,720
"అంతే, అవును" అని నువ్వు చెప్పిన విధానం.

428
00:38:59,440 --> 00:39:01,280
నాకు మళ్లీ 19 వయసులా అనిపించింది.

429
00:39:03,760 --> 00:39:05,920
అవును. నాకు తెలుసు. మన్నించు.

430
00:39:10,680 --> 00:39:11,720
ఉంటాను.

431
00:39:22,440 --> 00:39:25,720
అరే, బాబూ. నన్ను రోజీ క్యు దగ్గర కలువు.
ఒక విషయం నీకు చెప్పాలి.

432
00:39:27,080 --> 00:39:28,360
నువ్వే ఆనందించు.

433
00:39:28,440 --> 00:39:29,480
నువ్వు సూపర్‌స్టార్‌వి.

434
00:39:31,160 --> 00:39:33,640
సరే. నీకు సంక్షిప్తంగా చెప్పాలా?

435
00:39:33,720 --> 00:39:38,480
ఆమె పిచ్చిది, కసాండ్రా, పెద్ద సోది.
ఫాస్టర్ కేర్‌లో, బయట, సమస్యాత్మక బిడ్డ.

436
00:39:38,560 --> 00:39:39,400
కసాండ్రా
రోడ్స్

437
00:39:39,480 --> 00:39:41,960
రెండు వేధింపుల సంబంధాలు,
చివరకు ఆమె చనిపోయింది,

438
00:39:42,040 --> 00:39:44,760
దాదాపుగా ఆమె ప్రేమికుడు
నీల్ క్రాఫ్ట్ చేతిలోనే.

439
00:39:44,840 --> 00:39:46,440
అతనిపై అభియోగం మోపబడలేదు,
ఎటో పారిపోయాడు.

440
00:39:46,520 --> 00:39:47,400
అనుమానితుల జాబితా

441
00:39:47,480 --> 00:39:49,400
ఇది ఒక విచారకరమైన ఇంకా నీచమైన కథ.

442
00:39:50,160 --> 00:39:52,280
అది రాసిన విషయం. కానీ ఆమె ఒక మనిషి.

443
00:39:53,600 --> 00:39:57,200
ఇదంతా జైళ్లలో చూస్తుంటాను, ఎల్లప్పుడూ
అది రాసిన విధంగానే జరిగుండకపోవచ్చు.

444
00:39:57,280 --> 00:39:59,240
కొన్నిసార్లు, నీకు ఈ మనుషులు నచ్చుతారు.

445
00:39:59,320 --> 00:40:01,440
అసలు దానికి దీనికి సంబంధం ఏంటి?

446
00:40:01,520 --> 00:40:02,800
మీ నాన్న ఆమెతో పడుకునేవాడా?

447
00:40:02,880 --> 00:40:04,680
అది ఎప్పుడూ పడుకునే గొడవలే కదా?

448
00:40:04,760 --> 00:40:07,200
సెక్స్, డబ్బు తీసేస్తే,
నాకు ఉద్యోగమే ఉండదు.

449
00:40:07,760 --> 00:40:10,720
నాకు తెలియదు. సట్టన్ విషయంతో,
ఏదైనా సంబంధం…

450
00:40:10,800 --> 00:40:12,880
ఎవరూ లేరు. ఈ అమ్మాయి ఒక సమస్య.

451
00:40:12,960 --> 00:40:17,040
సమస్య ఆమెను కనుగొంది, అదే ఆమెను చంపేసింది.
కేసు ముగిసింది. ఇరవై ఐదు ఏళ్ల క్రితం.

452
00:40:19,360 --> 00:40:20,480
నువ్వు వెళ్తున్నావా?

453
00:40:20,560 --> 00:40:21,960
చేయవలసిన పనులు ఉన్నాయి.

454
00:40:23,120 --> 00:40:24,880
నువ్వు జెన్నాని కలుస్తున్నావు కదా?

455
00:40:25,480 --> 00:40:26,360
ఏంటి?

456
00:40:26,440 --> 00:40:31,560
నీ భయంకరమైన అబద్ధపు ముఖాన్ని చూడు.
ఎప్పుడూ నేరం చేయకు, సెఠ్.

457
00:40:31,640 --> 00:40:35,040
సరే. నిజానికి ఇది చాలా వింతగా ఉంది,
ఎందుకంటే ఆమె ఏం చెప్పిందంటే

458
00:40:35,120 --> 00:40:39,360
విశ్వం ఆమె జీవితంలోకి
దయను తీసుకువస్తుందని,

459
00:40:39,440 --> 00:40:43,200
ఇంకా కొన్ని నిమిషాల తర్వాత, నేను ఆమెకు
ఫోన్ చేసి డ్రింక్ కోసం బయటకు రమ్మన్నాను.

460
00:40:43,280 --> 00:40:44,600
అదృష్టం.

461
00:40:44,680 --> 00:40:48,080
అవును, ల్యాజ్, అదృష్టం. ఎంతో అదృష్టం.

462
00:40:48,160 --> 00:40:51,240
-నీకు దాని అర్థం తెలియదు, అవునా?
-అస్సలు తెలియదు.

463
00:40:51,320 --> 00:40:53,200
కానీ నేను దానిని
మీ చెల్లి మీద వాడబోతున్నాను.

464
00:40:54,480 --> 00:40:56,640
చీర్స్, మిత్రమా. వెళతాను!

465
00:41:53,160 --> 00:41:54,200
హే!

466
00:41:56,680 --> 00:41:59,000
నువ్వు నన్ను అనుసరిస్తున్నావా? ఓయ్!

467
00:42:00,600 --> 00:42:03,120
హే! హే!

468
00:42:08,320 --> 00:42:09,160
బాగానే ఉన్నారా?

469
00:42:23,000 --> 00:42:24,720
ఓయ్! ఓయ్!

470
00:43:08,440 --> 00:43:09,840
హలో!

471
00:43:17,080 --> 00:43:18,120
నువ్వు ఎక్కడ ఉన్నావు?

472
00:43:33,240 --> 00:43:38,200
ద జునిపర్ బుష్
ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్

473
00:44:19,160 --> 00:44:22,280
"మీరు ఒక నిప్పుపెట్టేవాడిని
మీ ఇంటికి ఆహ్వానిస్తే,

474
00:44:23,280 --> 00:44:25,520
అతని గదిలో అగ్గిపెట్టె ఉంచకండి."

475
00:44:41,560 --> 00:44:43,720
అయితే, నువ్వు కసాండ్రాను కలిశావా?

476
00:44:44,720 --> 00:44:46,840
మరికొందరు వస్తారు, బాబూ.

477
00:44:47,920 --> 00:44:49,240
వాళ్లు కూడా నీ దగ్గరకు వస్తారు.

478
00:44:50,800 --> 00:44:53,240
హత్యకు గురైన ఇతర వ్యక్తులు.

479
00:44:54,640 --> 00:44:56,160
కసాండ్రా లాగా.

480
00:45:00,160 --> 00:45:01,360
ఇంకా నాలాగా.

481
00:45:56,960 --> 00:45:58,960
సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల

482
00:45:59,040 --> 00:46:01,040
క్రియేటివ్ సూపర్‌వైజర్
సమత
ణమోహన్ తంగిరాల

