1
00:00:59,640 --> 00:01:01,240
రేచెల్ లాజరస్
1953-1992

2
00:01:01,320 --> 00:01:03,880
సట్టన్ లాజరస్
1980-1998

3
00:01:18,720 --> 00:01:24,720
హార్లాన్ కోబెన్స్
లాజరస్

4
00:01:35,240 --> 00:01:36,080
ల్యాజ్.

5
00:01:38,080 --> 00:01:39,720
-ఏం చేస్తున్నావు?
-మన్నించండి.

6
00:01:44,120 --> 00:01:45,080
ల్యాజ్!

7
00:01:46,120 --> 00:01:48,200
ల్యాజ్, వద్దు, నువ్వు చాలా తాగావు.

8
00:01:50,840 --> 00:01:52,560
-ల్యాజ్.
-నాకు అడ్డు తప్పుకో!

9
00:01:54,400 --> 00:01:56,520
నేను నీ అద్దాలను పగలగొడతా.

10
00:01:57,000 --> 00:01:59,320
-ఇంజన్ ఆఫ్ చేయి.
-అడ్డు తప్పుకో!

11
00:01:59,400 --> 00:02:02,560
నేను నిజంగా అంటున్నాను.
నన్ను పరీక్షించకు.

12
00:02:12,320 --> 00:02:13,560
నువ్వేం చేస్తున్నావు?

13
00:02:14,040 --> 00:02:16,440
ఇది సట్టన్ ఆమె చనిపోయిన రాత్రి
ఆమె బెడ్‌రూమ్‌లో ఉంది,

14
00:02:16,520 --> 00:02:18,320
ఆ వెధవ ఓల్సన్ దగ్గర ఇది ఉంది.

15
00:02:18,400 --> 00:02:19,400
అది వాడి ఇంట్లో ఉంది.

16
00:02:19,480 --> 00:02:20,960
అది వాడే నాకు ఒక రోజున ఇచ్చాడు.

17
00:02:21,040 --> 00:02:23,280
-అవును, నాకది తెలుసు.
-అంటే, దేవుడా!

18
00:02:23,360 --> 00:02:26,200
రాత్రి బిల్లీ మీద బాగా దృష్టి పెట్టి,
ఓల్సన్‌ను కాపాడాను.

19
00:02:26,280 --> 00:02:28,200
వాడు మార్గొట్ శవం పక్కనే ఉన్నాడు.

20
00:02:28,280 --> 00:02:30,600
ఆగు. సట్టన్, మార్గొట్‌లను
ఓల్సన్ చంపాడని అనుకుంటున్నావా?

21
00:02:30,680 --> 00:02:33,280
లేదు, వాడే చేశాడని అనుకోవడం కాదు,
వాడే చేశాడని నాకు తెలుసు.

22
00:02:33,680 --> 00:02:34,960
ఎక్కడకు వెళుతున్నావు?

23
00:02:35,440 --> 00:02:36,840
సరే, వాడెక్కడ ఉన్నాడో తెలుసు.

24
00:02:37,880 --> 00:02:40,200
హాస్పిటల్‌లో ఉన్నాడు,
ఇక నేను వాడికిది చూపించి

25
00:02:40,280 --> 00:02:41,760
తనేం చేశాడో నాకు తెలుసని చెబుతా.

26
00:02:41,840 --> 00:02:44,680
సరే. సరే, అలాగే, అయితే,
అదేమీ పని చేయదు.

27
00:02:44,760 --> 00:02:47,400
కానీ వాడు మన చెల్లిని చంపాడు, జెన్.

28
00:02:47,480 --> 00:02:49,920
నేనేమో ఈ రాత్రి వాడిని కాపాడాను.
నేను వాడిని కాపాడాను.

29
00:02:50,000 --> 00:02:53,920
అరే, పోలీసులు తనను పట్టుకునే ముందే,
నువ్వు అది ఓల్సన్‌కు చూపిస్తే

30
00:02:54,000 --> 00:02:56,000
అతనికి ముందస్తు హెచ్చరిక ఇవ్వడమే.

31
00:03:01,240 --> 00:03:02,240
అవును.

32
00:03:02,840 --> 00:03:05,120
అరే, కానీ నీకు ఒక విషయం తెలిసింది.

33
00:03:05,680 --> 00:03:08,320
అందుకే దానినేం చేయాలో తెలిసిన వ్యక్తికి
ఆ సంగతి చెబుదాం.

34
00:03:11,640 --> 00:03:13,920
-ఓయ్, నేనే.
-హా, ఇక్కడున్నా.

35
00:03:16,040 --> 00:03:16,880
ఏంటి…

36
00:03:22,840 --> 00:03:24,880
-హాయ్.
-హాయ్.

37
00:03:24,960 --> 00:03:26,160
నిన్ను చూడటం ఎప్పుడూ సంతోషమే.

38
00:03:26,240 --> 00:03:29,320
కానీ నేను ఉదయం 3:30కి అనుకుంటా,
ఏదో జరిగింది.

39
00:03:29,400 --> 00:03:30,360
నువ్వు ఇది చూడాలి.

40
00:03:30,440 --> 00:03:33,640
-వద్దు. మళ్లీ అలా చేయకు, ల్యాజ్.
-సెఠ్, పిశాచాలు కాదు, దెయ్యాలు కాదు,

41
00:03:33,720 --> 00:03:35,760
ఇది అత్యంత నమ్మదగినదని
హామీ ఇస్తున్నాను.

42
00:03:35,840 --> 00:03:37,120
ఇది ఒకసారి చూడు.

43
00:03:39,400 --> 00:03:41,320
ఇదిగో. నువ్విది చూశావా?

44
00:03:42,080 --> 00:03:42,920
చూశాను.

45
00:03:43,400 --> 00:03:45,560
సరే. ఇప్పుడు ఆ రోజు
ఓల్సన్ నాకేం ఇచ్చాడో చూడు.

46
00:03:46,400 --> 00:03:48,360
ఆమె హత్యకు గురైన రాత్రి
ఇది ఆమె గదిలో ఉంది.

47
00:03:48,960 --> 00:03:50,200
ఇక, అతని ఆచూకీ మనకు తెలుసు.

48
00:03:51,560 --> 00:03:54,920
ట్రామా యూనిట్

49
00:04:21,240 --> 00:04:22,880
వార్డ్ ప్లాన్
శామ్ ఓల్సన్

50
00:04:46,720 --> 00:04:50,120
సరే, మనం అతన్ని కారిడార్‌లోకి తేవాలి,
వీలైనంత త్వరగా, నిశ్శబ్దంగా.

51
00:05:08,480 --> 00:05:11,720
-ఇది దారుణం. మనం ఇప్పుడే కూర్చున్నాం.
-ఒక ప్రక్రియ ఉంది, ల్యాజ్.

52
00:05:15,960 --> 00:05:16,840
ఇప్పటికైనా చేద్దాం.

53
00:05:18,080 --> 00:05:21,000
ధన్యవాదాలు. మనకు ఆ వీహెచ్ఎస్ కావాలి.

54
00:05:21,080 --> 00:05:23,680
సరే. ఓల్సన్ సంగతేంటి?
వాడిని అరెస్ట్ చేశావా?

55
00:05:25,120 --> 00:05:26,600
నియమాల ప్రకారం చేస్తున్నాము, జోయెల్.

56
00:05:26,680 --> 00:05:30,760
సరేనా? మా విధానంలో వివరాల పరిశీలనే కాకుండా
అన్ని విషయాలను సరిదిద్దుతున్నాము.

57
00:05:31,360 --> 00:05:32,360
వారంట్ తీసుకుంటున్నాం.

58
00:05:32,440 --> 00:05:33,680
అది రెండు గంటల క్రితం చెప్పావు.

59
00:05:33,760 --> 00:05:35,640
-సరే, పద్ధతి ఉంటుంది.
-అది కూడా చెప్పావు.

60
00:05:35,720 --> 00:05:37,040
ఎందుకంటే అది ఉంటుంది కాబట్టి.

61
00:05:37,120 --> 00:05:38,280
సరే.

62
00:05:38,360 --> 00:05:40,680
సరే, మనం వేచి ఉండగా,
సట్టన్ హంతకుడు కూడా చంపబడితే,

63
00:05:40,760 --> 00:05:42,480
కసాండ్రా, హ్యారీ ఇంకా మార్గొట్,

64
00:05:42,560 --> 00:05:44,680
-అంటే దానర్థం…
-మన్నించు, హ్యారీ? హ్యారీ ఎవరు?

65
00:05:44,760 --> 00:05:45,600
హ్యారీ న్యాష్.

66
00:05:46,360 --> 00:05:49,680
తనను చంపినందుకు ప్రీస్ట్‌కు శిక్ష పడింది.
కానీ అది అతనే చేశాడని అనుకోను.

67
00:05:49,760 --> 00:05:51,560
ఆ ప్రీస్ట్ దానిని కాదనడం మినహాయించి.

68
00:05:51,640 --> 00:05:55,160
ఎందుకంటే సట్టన్, కసాండ్రా, ఈ హ్యారీ,
మార్గొట్, అందరికీ నాన్నతో సంబంధం ఉంది,

69
00:05:55,240 --> 00:05:56,800
అందుకే ఓల్సన్ తనను కూడా చంపుతాడు.

70
00:05:56,880 --> 00:05:58,880
ఓరి దేవుడా, ల్యాజ్.

71
00:05:58,960 --> 00:06:00,360
మీ నాన్నను ఎవరూ చంపలేదు.

72
00:06:00,440 --> 00:06:03,640
-ఆయనది ఆత్మహత్య. అది నిరూపితం.
-ఆయన ఆత్మహత్య చేసుకోలేదు!

73
00:06:03,720 --> 00:06:05,720
-మీరసలు…
-సరే, అలాగే. ఇక చాలు.

74
00:06:07,280 --> 00:06:08,120
ధన్యవాదాలు.

75
00:06:10,040 --> 00:06:11,760
నేను అనుకోవడం
నువ్విక్కడ చేయాల్సినది

76
00:06:11,840 --> 00:06:15,040
ఓల్సన్, సట్టన్ విషయంలో ఇది బలవంతం,
కానీ నిశ్చయాత్మకం కాదు.

77
00:06:15,120 --> 00:06:18,160
-ఆ ఫోటో అలా ఎలా కాదు…
-హే, హే, హే. ఆమె పూర్తి చేయనివ్వు.

78
00:06:18,240 --> 00:06:21,720
ఉదాహరణకు, ఇది ఓల్సన్ ఇంట్లో ఉందని
నువ్వు అంటున్నావు.

79
00:06:22,200 --> 00:06:23,120
అవును, అక్కడే ఉంది.

80
00:06:23,200 --> 00:06:26,040
మరి ఓల్సన్, "లేదు, నా దగ్గర లేదు.
ఇంతకు ముందెప్పుడూ చూడలేదు," అని చెబితే?

81
00:06:26,560 --> 00:06:29,320
డీఎన్ఏ పరీక్షలు చేయించండి.
అంటే, దాని మీద అతనివి ఉంటాయిగా.

82
00:06:29,400 --> 00:06:30,920
అప్పుడు తన న్యాయ బృందం చెప్పేది,

83
00:06:31,000 --> 00:06:33,440
"ఈ బొమ్మ ఫోటోలో ఉన్నదే అని
ఎవరు చెప్పగలరు?" అని.

84
00:06:34,240 --> 00:06:36,240
కానీ సట్టన్ దగ్గర
ఇది చిన్నప్పటి నుండి ఉంది.

85
00:06:36,320 --> 00:06:39,200
సట్టన్‌కు రెండు కుక్కలుంటే,
ఆమె ఒకటి ఇతరులకు ఇచ్చింది.

86
00:06:39,280 --> 00:06:40,600
-కానీ ఆమె దగ్గర లేవు.
-పిచ్చితనం.

87
00:06:40,680 --> 00:06:42,960
-ఆమె దగ్గర రెండు కుక్కలు ఎందుకు ఉంటాయి?
-వాళ్లు చెప్పేదదే.

88
00:06:43,040 --> 00:06:45,600
సరే, ఇది… ఓరి, దేవుడా.

89
00:06:47,200 --> 00:06:49,440
వారెంట్ వచ్చింది.
వెళ్లి అతన్ని తీసుకురండి.

90
00:07:06,600 --> 00:07:08,920
సాయుధ పోలీసులు! సాయుధ పోలీసులు!
అక్కడే ఉండు!

91
00:07:09,760 --> 00:07:12,240
సరే, వీలైనంత త్వరగా,
అతను ఏదైనా నాశనం చేసే ముందే.

92
00:07:12,320 --> 00:07:14,760
-అందరూ, మీరే బయటకు రండి!
-అందరూ, కదలకండి!

93
00:07:14,840 --> 00:07:16,360
-సాయుధ పోలీసులు!
-సాయుధ పోలీసులు!

94
00:07:17,200 --> 00:07:18,720
-సాయుధ పోలీసులు!
-సాయుధ పోలీసులు!

95
00:07:18,800 --> 00:07:20,440
-ఆగు!
-సాయుధ పోలీసులు!

96
00:07:21,360 --> 00:07:22,640
అంతా ఖాళీ!

97
00:07:22,720 --> 00:07:25,080
-అంతా ఖాళీ!
-సాయుధ పోలీసులం! అక్కడే ఉండాలి!

98
00:07:25,160 --> 00:07:26,000
అంతా ఖాళీ!

99
00:07:28,800 --> 00:07:29,640
అంతా ఖాళీ!

100
00:07:30,880 --> 00:07:32,320
సాయుధ పోలీసులం,
మీరే బయటకు రండి!

101
00:07:35,000 --> 00:07:35,840
అంతా ఖాళీ!

102
00:07:47,440 --> 00:07:48,360
అంతా ఖాళీ!

103
00:07:52,760 --> 00:07:53,760
ఏమీ లేదా?

104
00:07:54,160 --> 00:07:55,240
ఇక్కడేమీ లేదు.

105
00:07:55,320 --> 00:07:58,680
సరే, ఏదీ వదలకండి.
క్షుణ్ణంగా శోధించాలి. అంటే క్షుణ్ణంగా.

106
00:08:08,520 --> 00:08:09,360
ఏంటి?

107
00:08:10,800 --> 00:08:12,120
ఏంటి, తను వెళ్లిపోయాడా?

108
00:08:13,000 --> 00:08:15,200
-అవును, అతని జాడ లేదు.
-మేధావి.

109
00:08:15,680 --> 00:08:18,000
నిబంధనల ప్రకారం చేసి,
తనకు తగినంత సమయం ఇస్తే

110
00:08:18,080 --> 00:08:19,840
పారిపోయి, కోరుకున్న చోట దాక్కుంటాడు.

111
00:08:20,600 --> 00:08:21,720
ల్యాజ్, నన్ను మన్నించు.

112
00:08:21,800 --> 00:08:23,040
సరే, అదేం పర్వాలేదు.

113
00:08:30,400 --> 00:08:32,720
మేము అతన్ని పట్టుకుంటాం.
సరేనా? క్షమించు.

114
00:08:33,560 --> 00:08:34,400
తెలుసు.

115
00:08:35,400 --> 00:08:36,320
తన వెంట వెళతాను.

116
00:08:43,160 --> 00:08:44,000
హే.

117
00:08:46,520 --> 00:08:47,480
అరే, అబ్బో.

118
00:08:48,320 --> 00:08:49,360
వీటిలో దేనితోనైనా

119
00:08:49,440 --> 00:08:51,840
ప్రభావితమయ్యే ఒకే ఒకడివి
నువ్వే అనేలా ప్రవర్తించడం మానేస్తావా?

120
00:08:51,920 --> 00:08:53,320
-జరుగుతున్నది అది కాదు.
-కాదా?

121
00:08:53,400 --> 00:08:55,520
కాదు. కానీ నీకు ఇవేమైనా,
అవి ఏవైనా సరే,

122
00:08:55,600 --> 00:08:56,840
నీకు అన్నీ కనబడుతున్నాయా?

123
00:08:56,920 --> 00:08:58,160
-లేదు.
-నీవు మళ్లీ చేసేదదే.

124
00:08:58,240 --> 00:08:59,480
అంటే, నీ మాట నిజమే అంటావా?

125
00:09:03,480 --> 00:09:04,400
నా ఉద్దేశ్యం…

126
00:09:06,560 --> 00:09:08,120
అంటే, ఒకవేళ అలా కాకపోతే?

127
00:09:10,040 --> 00:09:12,880
నా ఆలోచనలో ఆ అవకాశం ఎప్పుడూ లేదని
నువ్వు అనుకుంటున్నావా?

128
00:09:13,720 --> 00:09:16,520
మళ్లీ పిచ్చివాడిని అవుతానేమోనని
నాకు తెలియదని అనుకుంటావా?

129
00:09:18,560 --> 00:09:19,640
ఇలా రా.

130
00:09:26,640 --> 00:09:27,760
టెడ్ ఇది గమనించాడు, సార్జ్.

131
00:09:42,920 --> 00:09:43,960
అసలు ఇవి ఏంటి?

132
00:09:45,280 --> 00:09:47,280
బట్టలా? అమ్మాయిల లోదుస్తులు.

133
00:09:50,480 --> 00:09:53,440
హే, బాగా చేశాడు. వాటిని సంచీలో పెట్టండి.
ఇతర ఫోటోలు పరిశీలించండి.

134
00:09:53,520 --> 00:09:54,360
సరే, సర్.

135
00:10:50,200 --> 00:10:52,480
రా, రా, రా.

136
00:11:08,160 --> 00:11:09,000
నాన్నా?

137
00:11:16,680 --> 00:11:18,000
మన్నించు, నాన్నా.

138
00:11:21,880 --> 00:11:23,520
మన్నించు, కొంత సమయం ఇవ్వగలవా?

139
00:11:25,560 --> 00:11:26,400
ఓరి దేవుడా.

140
00:11:31,920 --> 00:11:33,720
లేదు. పైకి చూడు.

141
00:11:36,000 --> 00:11:37,520
నేను తన కళ్లలోకి చూసాను.

142
00:11:38,520 --> 00:11:39,400
మన్నించు, నాన్నా.

143
00:11:40,680 --> 00:11:41,920
మన్నించు, కొంత సమయం ఇవ్వగలవా?

144
00:11:43,200 --> 00:11:44,800
నేను కొంత సమయం ఇవ్వగలనా?

145
00:11:45,280 --> 00:11:47,920
సమయం చాలా క్షణికమైనది.

146
00:11:49,000 --> 00:11:50,960
అదిగో. అది అయిపోయింది.

147
00:11:51,480 --> 00:11:52,680
కొంత సమయం ఇవ్వగలవా?

148
00:11:53,800 --> 00:11:55,040
సమయం చాలా క్షణికమైనది.

149
00:11:58,960 --> 00:11:59,800
అదిగో.

150
00:12:01,040 --> 00:12:02,000
అది అయిపోయింది.

151
00:12:02,600 --> 00:12:03,720
మన్నించు. అవును.

152
00:12:14,360 --> 00:12:15,320
మనం మాట్లాడుకోవచ్చా?

153
00:12:16,080 --> 00:12:16,960
తప్పకుండా మాట్లాడగలం.

154
00:12:19,120 --> 00:12:20,640
సట్టన్ ఆలోచన నన్ను వదలడం లేదు.

155
00:12:22,360 --> 00:12:25,720
నేను అలా చేయాలని, చేసుండాలని
ఆలోచన ఆపలేకపోతున్నాను…

156
00:12:27,000 --> 00:12:28,440
జరిగినది ఆపేందుకు అక్కడ ఉండేలా.

157
00:12:29,480 --> 00:12:33,080
ఆమె చనిపోవడం,
హత్యకు గురికావడం నా తప్పేనని.

158
00:12:34,080 --> 00:12:35,200
నీ తప్పా, ఎందుకు?

159
00:12:35,760 --> 00:12:37,360
ఆమె డాన్స్ నుండి వెళ్లడం చూశా,
ఇంకా…

160
00:12:39,000 --> 00:12:40,360
తను కోపంగా ఉండడం చూశాను, కానీ…

161
00:12:41,800 --> 00:12:42,640
నేను ఉండిపోయాను.

162
00:12:43,960 --> 00:12:46,000
దాని గురించి నేనేం చేయాలనుకుంటున్నావు?

163
00:12:47,200 --> 00:12:48,040
నాకు తెలియదు.

164
00:12:49,080 --> 00:12:51,800
నాకు మళ్లీ భరోసా కావాలనుకుంటా.

165
00:12:51,880 --> 00:12:54,120
ఏంటి? ఆ సట్టన్ మరణం నీదే తప్పు అనా?

166
00:12:54,640 --> 00:12:55,680
కాదు.

167
00:12:56,680 --> 00:12:57,840
నీకు విమోచన కావాలి.

168
00:12:59,040 --> 00:13:00,160
"మన్నించండి, నాన్నా."

169
00:13:02,240 --> 00:13:04,120
నాన్న తప్పు రకం అని నాకు భయం.

170
00:13:06,840 --> 00:13:08,520
నాన్న తప్పు రకం అని నాకు భయం.

171
00:13:10,360 --> 00:13:13,280
నేను అందించగలిగేది
మనస్సాక్షికి సంబంధించిన విషయాలలో మాత్రమే.

172
00:13:14,360 --> 00:13:18,040
ఉదాహరణకు, మీ చెల్లిని
ఇంటికి తీసుకెళ్తానని మాట ఇచ్చాక,

173
00:13:18,800 --> 00:13:21,520
నిన్ను క్షమించగలిగే ఏకైక వ్యక్తి
నువ్వు మాత్రమే.

174
00:13:23,080 --> 00:13:24,160
ఎందుకంటే నువ్వు మాత్రమే…

175
00:13:26,400 --> 00:13:27,520
జవాబుదారీ ఉండగలవు…

176
00:13:29,200 --> 00:13:32,040
ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టే
ఆనాటి నీ ఎంపికలకు.

177
00:13:35,120 --> 00:13:36,040
ఆమెను మిస్ అవుతాను.

178
00:13:37,840 --> 00:13:38,760
ఆమెను మిస్ అవుతాను.

179
00:13:40,200 --> 00:13:41,960
మేము ఎన్నడూ కలిసి లేము.

180
00:13:42,040 --> 00:13:42,880
అవును.

181
00:13:44,200 --> 00:13:45,760
అవును, ఎందుకంటే ఆమె నీకు కవల.

182
00:13:46,960 --> 00:13:48,920
ఎందుకంటే మీరు ఏమీ లేని స్థితి నుండి
కలిసి ఎదిగారు.

183
00:13:50,400 --> 00:13:53,600
ఇక అకస్మాత్తుగా నా జీవితంలో
సగం పోయినట్లు అనిపిస్తుంది, కానీ…

184
00:13:55,800 --> 00:13:57,040
ఇంకా ఇక్కడే ఉన్నావు.

185
00:14:00,840 --> 00:14:01,880
ఇక అది బాధిస్తుంది.

186
00:14:08,200 --> 00:14:10,440
నువ్వు, నేను నేర్చుకోవాల్సినదదే,
దానితో జీవించడమే.

187
00:14:26,920 --> 00:14:27,840
బాగున్నావా, బాబూ?

188
00:14:33,240 --> 00:14:34,840
అలా ఎందుకు జరగనిచ్చావు?

189
00:14:36,680 --> 00:14:38,800
నాకు ఎందుకు సహాయం చేయలేదు? ఎందుకు?

190
00:14:40,600 --> 00:14:43,240
నువ్వు చేయాల్సిందల్లా,
"ఇది నీ తప్పు కాదు" అని చెప్పడమే.

191
00:14:44,640 --> 00:14:46,160
నువ్వు నన్ను నిందించాలనుకున్నావు.

192
00:14:46,240 --> 00:14:47,440
కాదు. ఎప్పుడూ కాదు.

193
00:14:47,520 --> 00:14:50,400
మరి ఈత రాని ఆ పిల్లాడిని
మునిగి చనిపోయేలా ఎందుకు చేశావు?

194
00:14:50,480 --> 00:14:52,520
ఎందుకంటే నువ్వు చేసింది అదే! అదే!

195
00:14:53,240 --> 00:14:55,440
మా నాన్న,
నాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి

196
00:14:55,520 --> 00:14:58,320
నా చెల్లి మరణానికి
నన్ను బాధ్యురాడిని చేశాడు!

197
00:14:58,400 --> 00:14:59,680
-లేదు.
-అవును!

198
00:14:59,760 --> 00:15:00,960
కానీ అలాగే అనుకున్నావు.

199
00:15:01,040 --> 00:15:02,240
ఇప్పటికీ అనుకుంటున్నాను!

200
00:15:02,320 --> 00:15:05,400
-కానీ నేనలా అనుకోలేదు. ఏనాడూ.
-అప్పుడు నన్ను ఎందుకు కాపాడలేదు?

201
00:15:05,480 --> 00:15:07,480
-జోయెల్!
-నా స్థితి ఏంటో నువ్వు చూశావు!

202
00:15:07,560 --> 00:15:12,760
జోయెల్, మనస్ఫూర్తిగా, తప్పు నాదే, నిజంగా,

203
00:15:12,840 --> 00:15:16,720
కానీ నీకు ఒక బిడ్డ ఉన్నప్పుడు,
ఆ బిడ్డ చనిపోతే,

204
00:15:16,800 --> 00:15:20,200
ఈ శూన్యమే నీ ముందు తెరుచుకుంటుంది.

205
00:15:21,640 --> 00:15:25,880
ఎందుకంటే నీ పిల్లలు నీకు పిల్లలే.
వాళ్లు నీకంటే ముందు చనిపోకూడదు.

206
00:15:28,480 --> 00:15:29,920
ఇంకా అది సట్టన్.

207
00:15:30,960 --> 00:15:32,680
కానీ నేను కూడా నీ కొడుకునే.

208
00:15:33,600 --> 00:15:38,080
తెలుసు. నువ్వూ, జెన్నా.
నేను మీ ఇద్దరినీ నిరాశపరిచాను.

209
00:15:40,000 --> 00:15:43,640
కానీ ముఖ్యంగా నువ్వు, ఎందుకంటే నువ్వు కూడా
నాలాగే బాధ్యతగా భావించడం చూడగలిగాను.

210
00:15:43,720 --> 00:15:47,880
కానీ నిజమైన శాంతికి
ఏకైక మార్గం అనే అవగాహనలో

211
00:15:47,960 --> 00:15:50,000
తనను తాను ఎదుర్కుని క్షమించుకుంటుంది,

212
00:15:50,080 --> 00:15:52,400
నా మీద ఎంత కఠినంగా ఉన్నానో,
నీపై కూడా అంతే.

213
00:15:53,320 --> 00:15:56,400
అది ఒక యువకుడిని తనంతట తానుగా
కుంగదీసే మార్గం కాదు.

214
00:15:56,480 --> 00:15:58,280
నీకు పట్టింపు లేనట్లుంది.

215
00:15:58,360 --> 00:16:00,720
నేను ఒంటరివాడిని.
నేను భరించలేకపోయాను.

216
00:16:04,120 --> 00:16:05,200
జాగ్రత్త తీసుకున్నాను.

217
00:16:05,760 --> 00:16:07,960
కానీ నాకు ఎప్పుడూ చూపించలేదు!

218
00:16:11,680 --> 00:16:13,960
నువ్వలా అనుకోవాలనే కోరుకున్నాను…

219
00:16:16,280 --> 00:16:17,520
కష్టం తరువాత బతికేలా.

220
00:16:22,200 --> 00:16:23,040
దేవుడా. అయ్యో.

221
00:16:25,320 --> 00:16:26,200
కానీ అసలు బాగోలేను.

222
00:16:42,000 --> 00:16:43,760
జెన్, ఇక్కడే ఉన్నావా?

223
00:16:44,760 --> 00:16:46,160
ల్యాజ్, ఎయిడాన్ కనిపించాడా?

224
00:16:46,440 --> 00:16:47,960
-నేను చూశానా…
-అవును.

225
00:16:49,480 --> 00:16:51,160
ఎప్పటి గురించి మాట్లాడుతున్నాం?

226
00:16:51,240 --> 00:16:54,200
తను నిన్న రాత్రి ఇంటికి పోలేదు,
తన ఫోన్‌కు కూడా సమాధానం ఇవ్వలేదు.

227
00:16:54,280 --> 00:16:55,120
అతన్ని చూశావా?

228
00:16:56,120 --> 00:16:57,320
-చూశాను. సరే.
-చూశావా?

229
00:16:57,400 --> 00:16:59,920
చూశాను. జెన్, మాకు సమయం ఇవ్వగలవా?

230
00:17:01,600 --> 00:17:02,760
అలాగే. సరే.

231
00:17:02,840 --> 00:17:05,240
మన్నించు, ఏం జరుగుతోంది?
వాడిని చూశావా?

232
00:17:05,320 --> 00:17:07,640
జెన్, అక్కడే ఉండు,
నువ్వు మాట్లాడటం మొదలుపెడితే మంచిది.

233
00:17:07,720 --> 00:17:10,240
తను నిన్న రాత్రి నన్ను కలవటానికి వచ్చాడు.

234
00:17:10,320 --> 00:17:13,200
-నీ ఉద్దేశ్యం ఏంటి?
-తర్వాత తనను మీ ఇంటి దగ్గర దింపాను.

235
00:17:13,280 --> 00:17:15,800
-మా ఇంటి దగ్గర దింపలేదు.
-నువ్వు అక్కడ నిలబడి ఉన్నావు,

236
00:17:15,880 --> 00:17:17,720
అక్కడే కిటికీ దగ్గర,
అందుకే కారులో వెళ్లిపోయా.

237
00:17:17,800 --> 00:17:19,840
తను ఇంటికి రాలేదని నేను ఇప్పుడే చెప్పాను!

238
00:17:21,000 --> 00:17:23,800
అలాగే, మన్నించు, అతను నిన్ను
ఎందుకు చూడాలనుకుంటున్నాడు?

239
00:17:23,880 --> 00:17:25,400
నిన్ను కలవవద్దని వాడికి చెప్పాను!

240
00:17:28,760 --> 00:17:30,720
తను పితృత్వ పరీక్ష చేయించాడు.

241
00:17:32,800 --> 00:17:37,160
ఇది అతని సొంత నిర్ణయం, సరేనా?
నాకు దానితో సంబంధం లేదు. తను…

242
00:17:38,880 --> 00:17:41,840
నా టూత్ బ్రష్ తీసుకున్నాడు, దాని నుండి
అవసరమైనది తీసుకుని, పంపించాడు, ఇక…

243
00:17:43,120 --> 00:17:46,560
నిన్న ఫలితాలు వచ్చాయి,
అతని తండ్రి పాల్ కాదు, నేనే అని.

244
00:17:46,640 --> 00:17:48,640
-ఏంటి?
-ఇప్పుడు వద్దు, జెన్.

245
00:17:51,160 --> 00:17:54,880
చూడు, నన్ను మన్నించు,
నేను దీని కోసం వెతకలేదు.

246
00:17:57,680 --> 00:17:58,600
కానీ మనం…

247
00:18:00,040 --> 00:18:02,960
పాల్, నేను కలిసిన తర్వాత
ఒక్కసారి మాత్రమే మనం కలుసుకున్నాం.

248
00:18:03,840 --> 00:18:04,680
అవును.

249
00:18:07,160 --> 00:18:08,120
ఎయిడాన్
పాల్ కొడుకే.

250
00:18:10,360 --> 00:18:12,720
అవును. పాల్ తనను పెంచాడు.

251
00:18:12,800 --> 00:18:16,200
చూడు, తన స్థానంలోకి రావాలనేది
నా ఉద్దేశ్యం కాదు.

252
00:18:16,280 --> 00:18:17,120
-నిజమా?
-బెల్లా, నేను…

253
00:18:17,200 --> 00:18:18,280
గయ్స్.

254
00:18:18,360 --> 00:18:19,320
మన్నించాలి.

255
00:18:20,440 --> 00:18:21,280
మన్నించాలి, నేను…

256
00:18:22,760 --> 00:18:24,880
ఇది మీరు తెలియజేయాలని.
మాకు సీసీటీవీ ఫుటేజ్ అందింది.

257
00:18:25,880 --> 00:18:28,240
ఓల్సన్ కారు నిన్న రాత్రి దాటాక
ఊరు దాటి ఉత్తరం వైపు వెళ్లింది.

258
00:18:29,320 --> 00:18:32,200
-ఎక్కడకు? తెలుసా?
-నగరం దాటాక, తన జాడ తెలియలేదు.

259
00:18:32,280 --> 00:18:33,520
-సరే, నాకు చూపించగలవా?
-హా.

260
00:18:36,280 --> 00:18:37,880
మీకు అసలేమీ కనబడదు, కానీ…

261
00:18:39,920 --> 00:18:41,640
అతనితో ఎవరో ఉన్నారు.

262
00:18:41,720 --> 00:18:43,880
అవును, కానీ నాణ్యత చాలా దారుణం,
మీకు కనబడదు.

263
00:18:43,960 --> 00:18:45,000
-అబ్బా ఛ.
-ఏంటి?

264
00:18:47,240 --> 00:18:49,400
ఎయిడాన్ నిన్న రాత్రి
అదే జాకెట్ వేసుకున్నాడు.

265
00:18:50,040 --> 00:18:50,880
నన్ను చూడనీయండి.

266
00:18:52,400 --> 00:18:53,720
కానీ… ఎందుకు…

267
00:18:53,800 --> 00:18:55,800
మన్నించు, నువ్వనేది
తను ఎయిడాన్ అనా?

268
00:18:57,440 --> 00:18:59,120
-తను నిన్న రాత్రి ఇంటికి రాలేదు.
-హా…

269
00:18:59,880 --> 00:19:00,720
సరే. ఆ పనిలో ఉంటాం.

270
00:19:09,880 --> 00:19:12,720
తను ఓల్సన్‌ తో అప్పుడు ఉన్నాడని,
ఇప్పుడు ఉన్నాడని కాదు, సరేనా?

271
00:19:13,520 --> 00:19:14,440
మేము తనను కనుగొంటాము.

272
00:19:15,960 --> 00:19:19,120
పాల్‌ను వెతకడంలో సాయపడతాను.
అతను తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉండు.

273
00:19:19,200 --> 00:19:21,320
ఆ పిల్లాడే నా సర్వస్వం.

274
00:19:21,400 --> 00:19:23,600
నీకు వాడితో సంబంధం లేదు,
నువ్వు తన తండ్రివి కాదు,

275
00:19:23,680 --> 00:19:25,400
అందుకే ఇక
తను కావాలనే ధైర్యం చేయకు.

276
00:19:25,480 --> 00:19:27,320
-బెల్లా, నేనలా అనుకోను…
-అవును, అన్నావు.

277
00:19:44,960 --> 00:19:47,200
ఇక పోలీసులు నన్ను
మొదటి రోజు నుండే మార్క్ చేశారు.

278
00:19:47,280 --> 00:19:49,120
ఎవరినైనా తడిమినా, మొదటగా

279
00:19:50,080 --> 00:19:51,480
ఎవరిని ప్రశ్నిస్తున్నారో ఊహించగలవా?

280
00:19:53,280 --> 00:19:54,760
అది ఎలా ఉంటుందో ఊహించగలవా

281
00:19:54,840 --> 00:19:56,960
అందరూ నిన్ను అనుమానంగా చూస్తుంటే?

282
00:19:58,360 --> 00:19:59,720
మాకు సీసీటీవీ ఫుటేజ్ అందింది.

283
00:19:59,800 --> 00:20:02,280
ఓల్సన్ కారు నిన్న రాత్రి దాటాక
ఊరు దాటి ఉత్తరం వైపు వెళ్లింది.

284
00:20:03,480 --> 00:20:04,960
నేను ఊరి నుండి బయటకు వెళుతున్నాను.

285
00:20:05,040 --> 00:20:07,280
ఆర్కిటిక్ చార్‌లో చేపలు పట్టడానికి.

286
00:20:16,360 --> 00:20:18,400
ఆర్కిటిక్ చార్
లోకల్ ఫిషింగ్

287
00:20:18,480 --> 00:20:21,040
టాల్‌వాటర్
దిశలు

288
00:20:21,440 --> 00:20:24,000
23 నిమిషాలు (6 మైళ్లు)
వేగమైన మార్గం

289
00:20:30,760 --> 00:20:31,600
సెఠ్.

290
00:20:33,040 --> 00:20:34,000
ఓల్సన్ అదృశ్యమయ్యాడు.

291
00:20:35,080 --> 00:20:37,560
అవును, అతని కారు
ఏ ఏఎన్‌పీఆర్ కెమెరాలలో కనబడలేదు,

292
00:20:37,640 --> 00:20:39,160
అంటే అతను ఎక్కడో దాగి ఉండాలి.

293
00:20:39,840 --> 00:20:41,800
సరే, ఆ పని చూడు. వీటిని చూడు.

294
00:20:43,120 --> 00:20:46,120
ఇది వీడియో నుండి,
ఇవి నీకు ఓల్సన్ ఇంటిలో దొరికిన ఫోటోలు.

295
00:20:47,640 --> 00:20:48,520
సట్టన్ బెడ్‌రూమ్.

296
00:20:49,280 --> 00:20:50,320
అవును.

297
00:22:05,680 --> 00:22:07,480
ఓల్సన్ కారు ఇక్కడ ఉంది!

298
00:22:18,320 --> 00:22:20,520
మేడమ్? ఓల్సన్ కారును ల్యాజ్ కనుగొన్నాడు.

299
00:22:41,480 --> 00:22:44,880
లేదు, లేదు. లేదు! లేదు!

300
00:23:02,240 --> 00:23:05,120
లేదు! అయ్యో, ఓరి నాయనో.

301
00:23:05,200 --> 00:23:08,120
ఆగు, నేను దాన్ని తీసుకొస్తాను.
అది వెనుకకు లాగు.

302
00:23:08,200 --> 00:23:09,800
అది వెనుకకు లాగు. సున్నితంగా, లాగు.

303
00:23:10,200 --> 00:23:11,440
మనం దాన్నెలా చంపాలి?

304
00:23:11,520 --> 00:23:13,440
మనం తినకూడని వాటిని చంపము.

305
00:23:14,640 --> 00:23:15,920
అది వెనక్కు వదిలేస్తాం.

306
00:23:16,640 --> 00:23:17,520
అలా అది వెళుతుంది.

307
00:23:18,800 --> 00:23:19,640
ఎయిడాన్!

308
00:23:22,360 --> 00:23:25,960
ఎయిడాన్, వెళ్లి నా కారులో ఎదురుచూడు.
నువ్వు వచ్చిన కారు దగ్గరకు వెళ్లు.

309
00:23:26,600 --> 00:23:28,160
నాకు ఇక్కడే ఉండాలని ఉంది.
ఇక్కడ బాగున్నా.

310
00:23:28,240 --> 00:23:30,280
ఎయిడాన్, మీ అమ్మానాన్నలు
చాలా కంగారు పడుతున్నారు.

311
00:23:31,080 --> 00:23:32,200
నువ్వే నాకు నాన్నవి.

312
00:23:32,280 --> 00:23:33,200
మీ అమ్మ, ఇంకా పాల్.

313
00:23:34,360 --> 00:23:36,080
-నాకు శామ్‌తోనే ఉండాలనుంది.
-ఎయిడాన్.

314
00:23:36,160 --> 00:23:38,600
-నాకు ఇంటికి వెళ్లాలని లేదు.
-ఇది నన్ను చూసుకోమంటావా?

315
00:23:40,800 --> 00:23:41,640
ఏమంటున్నావు?

316
00:23:41,720 --> 00:23:44,520
చూడు, ఏమీ జరగలేదు, సరేనా?

317
00:23:45,360 --> 00:23:46,280
ఏమీ జరగడం లేదు.

318
00:23:47,560 --> 00:23:50,160
అలాగే అతనిని ఇంటికి ఫోన్ చేసి
బాగానే ఉన్నాడని చెప్పమన్నా.

319
00:23:50,240 --> 00:23:51,440
కానీ అతనికి కొంత ఏకాంతం కావాలి.

320
00:23:52,080 --> 00:23:54,240
అది తన హక్కు. అందరికీ ఉంటుంది.

321
00:23:56,240 --> 00:23:59,440
సట్టన్ హత్యకు గురైన రాత్రి తీసినది.
పైన ఎడమ మూల.

322
00:24:00,080 --> 00:24:02,160
బొమ్మ పైన. చూశావా?

323
00:24:03,400 --> 00:24:05,440
పోలీసులు దీనిని చూశారు,
వాళ్లు వస్తున్నారు.

324
00:24:09,000 --> 00:24:10,160
కారు దగ్గరకు వెళ్లు.

325
00:24:11,840 --> 00:24:12,680
వెళ్లరా!

326
00:24:20,120 --> 00:24:21,360
నేనేమీ చేయలేదు…

327
00:24:23,560 --> 00:24:24,680
ఆమెను చంపావు!

328
00:24:25,760 --> 00:24:27,840
ఆ విషయం కాదనే ధైర్యం చేయకు!

329
00:24:28,240 --> 00:24:30,280
నేను ఆమెను ప్రేమించాను.
ఆమెను ప్రేమించాను!

330
00:24:33,640 --> 00:24:35,760
ఆమెను ప్రేమించాను, రక్షించాను,

331
00:24:36,880 --> 00:24:38,120
బతికున్నపుడు, తరువాత కూడా.

332
00:24:38,200 --> 00:24:39,840
ఆమె సమాధి దగ్గరకు వెళతాను.

333
00:24:40,720 --> 00:24:41,640
వేరే ఎవరూ చేయలేదు.

334
00:24:42,720 --> 00:24:43,840
నువ్వు ముందుకు సాగిపోయావు.

335
00:24:44,920 --> 00:24:47,520
ఆమె కోసం ఏమి చేశానో చూపించడానికి
నిన్ను అక్కడికి తీసుకెళ్లా.

336
00:24:47,600 --> 00:24:49,160
హే! హే!

337
00:24:54,280 --> 00:24:55,840
సట్టన్ లాజరస్
1980-1998

338
00:24:55,920 --> 00:24:57,000
ఎక్కడ ఉన్నావు?

339
00:24:58,480 --> 00:24:59,440
ఆమెను హత్య చేశావు.

340
00:24:59,920 --> 00:25:01,720
లేదు, నీకు అర్థం కాలేదు.

341
00:25:04,480 --> 00:25:06,760
నేను కలకాలం సట్టన్ పట్ల
అదే గౌరవాన్ని చూపించాను.

342
00:25:11,480 --> 00:25:12,440
చెప్పు.

343
00:25:12,520 --> 00:25:15,120
ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పు!

344
00:25:15,760 --> 00:25:18,680
నువ్వు మా ఇంట్లోకి చొరబడ్డావు! ఎలా?

345
00:25:18,760 --> 00:25:21,200
-ఎలా?
-ఒకప్పుడు రాయి కింద తాళంచెవి వదిలేవాడివి.

346
00:25:22,920 --> 00:25:24,480
చాలా ఏళ్లు లోపలకు, బయటికి వెళ్లేవాడిని.

347
00:25:26,520 --> 00:25:28,360
అదేమీ అసహ్యకర విషయం కాదు.

348
00:25:29,440 --> 00:25:32,440
సట్టన్ గదిలో సమయం గడపడానికి వెళతాను,

349
00:25:33,200 --> 00:25:34,680
ఆమె పడుకునే చోటుకు సమీపాన ఉండటానికి.

350
00:25:34,760 --> 00:25:35,840
ఆ కుక్క,

351
00:25:37,280 --> 00:25:39,200
ఆమెను మొదటిసారి కలిసినప్పుడు
అది తన దగ్గరుంది.

352
00:25:39,680 --> 00:25:42,680
తను త్వరలో యూనివర్సిటీకి వెళుతుంటే,
తన గుర్తును కోరుకున్నాను.

353
00:25:43,600 --> 00:25:45,280
-అందుకే అక్కడ ఉన్నాను.
-అబద్ధాలకోరు!

354
00:25:45,680 --> 00:25:48,560
-ఆమెను చంపడానికే వచ్చావు!
-అలా కాదు.

355
00:25:48,640 --> 00:25:50,040
అది అలా కాదు.

356
00:25:50,120 --> 00:25:52,480
అది అలా కాదు.
దయచేసి, అది అలా జరగలేదు.

357
00:25:57,640 --> 00:25:58,600
మన్నించు.

358
00:25:59,520 --> 00:26:01,000
సరే. సరే.

359
00:26:07,520 --> 00:26:08,760
అయితే ఎలా ఉండేది?

360
00:26:10,200 --> 00:26:11,880
దయచేసి చెప్పు.

361
00:26:15,720 --> 00:26:17,240
సట్టన్ త్వరగా తిరిగి వచ్చేసింది,

362
00:26:18,560 --> 00:26:19,400
బాల్ నుండి,

363
00:26:20,200 --> 00:26:21,360
నీకు ప్రమాణం చేస్తున్నా,

364
00:26:23,040 --> 00:26:24,320
నేను గది నుండి బయటకు వచ్చేసరికి,

365
00:26:26,040 --> 00:26:27,120
ఆమె అకస్మాత్తుగా అక్కడ ఉంది.

366
00:26:28,880 --> 00:26:31,840
-అక్కడే కాదు. నా చేతుల్లోకి పరిగెత్తుతూ.
-లోపలకు ఎలా వచ్చావు?

367
00:26:32,640 --> 00:26:34,000
ఆమె నా దగ్గరకు వస్తుండగా,

368
00:26:35,000 --> 00:26:36,320
ఆమె చేతులు నా చుట్టూ ఉన్నాయి,

369
00:26:37,840 --> 00:26:39,040
నా మెడ చుట్టూ.

370
00:26:39,120 --> 00:26:40,720
ఆమె తనే నాకు అర్పించుకుంది.

371
00:26:40,800 --> 00:26:42,000
వెళ్లిపో!

372
00:26:42,560 --> 00:26:43,640
ఆమె నా మీద పడిపోయింది.

373
00:26:46,160 --> 00:26:47,280
ఇక నేను ఆమెను ముద్దాడా.

374
00:26:47,760 --> 00:26:50,960
ఆమె ముఖాన్ని నా చేతుల్లోకి తీసుకుని
ప్రపంచంలోని ప్రేమతో ముద్దాడాను.

375
00:26:51,040 --> 00:26:53,160
దేవుడా, నువ్వు సన్నాసివి!

376
00:27:05,840 --> 00:27:07,600
దానిని తనే ప్రారంభించింది!

377
00:27:08,400 --> 00:27:09,920
ఆమె నన్ను పట్టుకుంది!

378
00:27:10,760 --> 00:27:12,120
తనేం చేస్తోందో ఆమెకు తెలుసు.

379
00:27:14,800 --> 00:27:16,800
తర్వాత నువ్వు ఇంటికి రావడం విన్నాను.

380
00:27:16,880 --> 00:27:18,560
ల్యాజ్! ల్యాజ్!

381
00:27:19,000 --> 00:27:20,080
నాకు వేరే మార్గం లేదు.

382
00:27:21,200 --> 00:27:22,160
ఆమె నాతో అలా చేయించింది.

383
00:27:24,120 --> 00:27:25,320
నేను తనను కొట్టేలా చేసింది…

384
00:27:43,200 --> 00:27:45,000
ఆమెను డాన్స్ నుండి ఎందుకు వెళ్లనిచ్చావు?

385
00:27:54,960 --> 00:27:56,120
నన్ను వదులు!

386
00:27:56,200 --> 00:27:57,040
వదులు!

387
00:27:59,360 --> 00:28:00,200
నాన్నా!

388
00:28:35,120 --> 00:28:35,960
జోయెల్!

389
00:28:39,040 --> 00:28:40,120
ల్యాజ్!

390
00:28:42,440 --> 00:28:43,280
ల్యాజ్!

391
00:29:08,000 --> 00:29:10,160
ధన్యవాదాలు, బాబూ.

392
00:29:20,920 --> 00:29:24,560
మేము ఓల్సన్ ఇంట్లో
సట్టన్ గది ఫోటోలను కనుగొన్నాము,

393
00:29:25,760 --> 00:29:26,800
ఆమె వస్తువులు,

394
00:29:28,160 --> 00:29:29,880
అన్నీ ఆమె చంపబడినప్పటి నుండి ఉన్నాయి.

395
00:29:33,280 --> 00:29:34,520
అయితే ఓల్సన్ హంతకుడు.

396
00:29:38,080 --> 00:29:39,160
ఇప్పుడు నా మాట నమ్ముతావా?

397
00:29:40,800 --> 00:29:41,960
నీ మాట నమ్ముతాను.

398
00:29:46,040 --> 00:29:48,480
మేము ఈ సమయానికి రాకపోతే
నువ్వేం చేసేవాడివి?

399
00:30:02,000 --> 00:30:04,640
నేను నీకు అండగా ఉండాలని
మీ నాన్న కోరుకుంటారు.

400
00:30:07,280 --> 00:30:09,640
నా నంబర్ నీ దగ్గర ఉంది.
ఎప్పుడైనా నాకు కాల్ చేయి.

401
00:30:14,120 --> 00:30:15,200
ఆయన నీకు రేటింగ్ ఇచ్చాడు.

402
00:30:17,400 --> 00:30:18,360
నీకు తెలుసని ఆశిస్తా.

403
00:30:21,960 --> 00:30:22,880
తనను మిస్ అవుతున్నా.

404
00:30:42,400 --> 00:30:43,720
ఎయిడాన్ బాగున్నాడా?

405
00:30:44,240 --> 00:30:45,160
నాకు తెలియదు.

406
00:30:45,800 --> 00:30:47,240
అతను మాతో మాట్లాడటం లేదు.

407
00:30:49,880 --> 00:30:51,120
వద్దు, మన్నించమని అనకు.

408
00:30:51,200 --> 00:30:53,920
నేను కాదు… నేను చెప్పబోవడం లేదు.

409
00:30:55,040 --> 00:30:56,640
నువ్వు తెలుసుకోవాలనే నా కోరిక,

410
00:30:57,800 --> 00:30:59,280
వాడి కోసం ఎప్పడూ తోడుగా ఉంటాను.

411
00:31:05,720 --> 00:31:06,920
ఎయిడాన్ గురించి నా ఆందోళన.

412
00:31:08,080 --> 00:31:09,120
ఆందోళన అంటే ఏ రకంగా?

413
00:31:11,760 --> 00:31:15,480
వాడు ఇతర పిల్లల్లా లేకపోవడం,
లేదా ఇతర పిల్లలకు నచ్చకపోవడం గురించి,

414
00:31:15,560 --> 00:31:18,160
లేదా, నాకు తెలియదు,
వింతగా ప్రవర్తిస్తూ ఉండడం.

415
00:31:19,280 --> 00:31:20,120
సరే.

416
00:31:22,320 --> 00:31:25,000
నేను అనుకుంటున్నా,
నువ్వు వాడితో గడిపిన ఈ కొద్ది సమయంలోనే,

417
00:31:25,080 --> 00:31:29,520
వాడిలో నిన్ను నువ్వు
ఏమైనా చూసుకున్నావేమోనని, ఆ రకంగా.

418
00:31:31,440 --> 00:31:33,240
సట్టన్ వల్ల క్రుంగిపోయావని తెలుసు.

419
00:31:33,320 --> 00:31:35,640
ఎయిడాన్‌కు అలాంటిదేమీ
ఎప్పుడూ జరగలేదు, కానీ నేను…

420
00:31:38,200 --> 00:31:41,040
కానీ సట్టన్ చనిపోయే ముందు
నాకు ఏమైనా సమస్యలు ఉన్నాయా?

421
00:31:41,120 --> 00:31:41,960
ఉన్నాయి.

422
00:31:43,080 --> 00:31:44,240
మన్నించు, నేను అడగాలి.

423
00:31:47,320 --> 00:31:49,520
అంటే, నిజాయితీగా చెప్పాలంటే నాకు తెలియదు.

424
00:31:51,120 --> 00:31:52,200
అవును.

425
00:31:54,760 --> 00:31:57,960
మీ నాన్న వాడితో రెండుసార్లు మాట్లాడారు.
ఆయన కొన్ని సెషన్లు నిర్వహించాడు.

426
00:31:59,520 --> 00:32:01,760
కానీ… ఎయిడాన్‌కు అది ఇష్టం లేదు

427
00:32:01,840 --> 00:32:04,160
వాడితో అలా చేయించడం
ఒక విధంగా తేడాగా అనిపించింది.

428
00:32:05,400 --> 00:32:06,600
సరే, లేదు.

429
00:32:08,720 --> 00:32:10,920
తను మాట్లాడాలని కోరుకున్నాడు.

430
00:32:16,560 --> 00:32:17,400
మనం ఏమైనా…

431
00:32:18,720 --> 00:32:20,680
దీని గురించి మళ్లీ మాట్లాడుతూ ఉండగలమా?

432
00:32:22,960 --> 00:32:23,960
అవును.

433
00:32:24,320 --> 00:32:25,280
అవునా?

434
00:32:26,280 --> 00:32:27,600
కానీ పాల్‌కి చెప్పాలి, అందుకే…

435
00:32:28,040 --> 00:32:29,000
తప్పకుండా.

436
00:33:04,600 --> 00:33:05,880
నాకు అర్థం కానిదేంటంటే,

437
00:33:06,600 --> 00:33:09,280
ఎయిడాన్ సురక్షితంగా ఉన్నాడు,
ఓల్సన్‌ను పట్టుకున్నారు,

438
00:33:09,360 --> 00:33:12,040
అయినా ఇప్పటికీ మూసివేత భావన లేదు.

439
00:33:12,120 --> 00:33:13,240
అవును, నాకు తెలుసు.

440
00:33:13,320 --> 00:33:16,240
ఎందుకంటే సట్టన్‌ను ఏదీ తిరిగి తీసుకురాదు.

441
00:33:17,040 --> 00:33:17,880
తీసుకురాదు.

442
00:33:20,040 --> 00:33:22,800
మన పరిస్థితిలో ఉన్న వ్యక్తులు
బహుశా చెప్పేది ఇదే కావచ్చు,

443
00:33:23,840 --> 00:33:25,160
"ఇక మన దుఃఖించడం ప్రారంభించవచ్చు."

444
00:33:28,000 --> 00:33:29,560
బహుశా ఇప్పుడు మనం అక్కడకు చేరాం.

445
00:33:31,880 --> 00:33:35,880
హే, నాన్నతో ఎయిడాన్ రెండు సెషన్లు చేశాడని
నీకు తెలుసా,

446
00:33:36,400 --> 00:33:37,360
ఒక రోగిగా?

447
00:33:39,680 --> 00:33:41,960
తెలుసు. అవును, మార్గోట్ నాకు చెప్పింది.

448
00:33:42,520 --> 00:33:46,640
అతనికి కొన్ని నిజమైన సమస్యలు ఉన్నాయని,
సహాయం అవసరమని ఆమె చెప్పింది,

449
00:33:46,720 --> 00:33:49,160
కానీ అది అతనే అని మాకు తెలియక ముందే…

450
00:33:53,080 --> 00:33:56,320
ల్యాజ్, ఎయిడాన్ సమస్యలకు
నువ్వే కారణమని అనుకోకూడదు.

451
00:33:56,400 --> 00:33:57,920
అలా ఉండలేవు. అలా ఎలా ఉండగలవు?

452
00:34:00,680 --> 00:34:03,440
-అనుకోకుండానే, కావచ్చు.
-హే, విను,

453
00:34:04,520 --> 00:34:06,280
మీ ఇద్దరూ చాలా విషయాలు
ఎదుర్కోవలసి వచ్చింది.

454
00:34:07,080 --> 00:34:11,040
బహుశా ఇప్పుడు మీరు కలిసి
కోలుకోవడం ప్రారంభించవచ్చు.

455
00:34:17,160 --> 00:34:19,360
నువ్వక్కడే కూర్చున్నావంటే
నేను కొనాలని కావచ్చు.

456
00:34:19,440 --> 00:34:20,280
అవును, తప్పకుండా.

457
00:34:20,880 --> 00:34:21,800
ఏం తాగుతావు?

458
00:34:22,240 --> 00:34:23,440
బోలెడన్ని.

459
00:34:30,920 --> 00:34:31,760
-సరేనా?
-సరే.

460
00:34:34,160 --> 00:34:35,080
నన్ను పట్టుకుంటావా?

461
00:34:38,320 --> 00:34:39,360
-బిగుతుగా.
-సరే.

462
00:34:56,640 --> 00:34:58,760
-హలో?
-హే. హే, నేను ల్యాజ్‌ని.

463
00:35:00,680 --> 00:35:02,200
నేను అనుకుంటున్నా…

464
00:35:04,680 --> 00:35:08,480
ధన్యవాదాలు. దీనికి నా అభినందనలు.

465
00:35:09,480 --> 00:35:10,560
-నిజంగా.
-సరే.

466
00:35:10,640 --> 00:35:14,120
ల్యాజ్, నేను చెప్పాలంటే,
నేను చాలా సాధారణ గంటలు పని చేస్తాను.

467
00:35:15,040 --> 00:35:19,960
సరే. సరే. ఇది సాధారణం కాదు, కదా?

468
00:35:20,040 --> 00:35:22,280
ఇది… ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.

469
00:35:22,360 --> 00:35:23,960
నేనయితే చాలా ఆలస్యం అంటాను.

470
00:35:24,360 --> 00:35:26,280
-చాలా ఆలస్యం అయింది.
-థెరపీ కోసం.

471
00:35:27,000 --> 00:35:28,960
థెరపీ కోసం, ఖచ్చితంగా.

472
00:35:30,040 --> 00:35:31,080
సరే, అవును.

473
00:35:32,160 --> 00:35:34,240
మరి డ్రింక్ సంగతేంటి…

474
00:35:36,720 --> 00:35:39,200
ఇంకా కొంచెం సమయం గడిపితే?

475
00:35:41,400 --> 00:35:44,680
-అది నైతికంగా సరి కాదు, అవునంటావా?
-కాదు, కానీ అది మంచిదే.

476
00:35:45,240 --> 00:35:46,800
-అది మంచిదా?
-అవును,

477
00:35:47,400 --> 00:35:48,920
ఎందుకంటే ఈ సాయంత్రం,

478
00:35:49,440 --> 00:35:51,920
నిన్ను పిలవడానికి ముందే,
నాకు అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది…

479
00:35:53,160 --> 00:35:54,800
నేను మరో థెరపిస్ట్‌ని కనుగొనగలను,

480
00:35:55,640 --> 00:35:58,600
కానీ నేను మరో నిన్ను కనుగొనగలనా?

481
00:36:04,520 --> 00:36:05,800
ఇవాళ ఏదైనా జరిగిందా?

482
00:36:06,560 --> 00:36:09,720
అబ్బో, చాలా జరిగింది. అవును, చాలా ఎక్కువ.

483
00:36:09,800 --> 00:36:13,360
నా ఉద్దేశ్యం, ఈరోజు పూర్తిగా
బుర్ర చెడిపోయింది.

484
00:36:14,320 --> 00:36:15,800
సరే, నా డైరీ తీసుకు వస్తాను,

485
00:36:15,880 --> 00:36:18,640
-నీకు బుక్ చేస్తా…
-వద్దు, వద్దు, నీ డైరీని తీసుకురాకు.

486
00:36:18,720 --> 00:36:19,560
మనం అలా…

487
00:36:21,520 --> 00:36:22,600
బయటకు వెళదాం పద.

488
00:36:27,560 --> 00:36:29,720
లేదా లోపలే ఉందాం.

489
00:36:30,840 --> 00:36:32,760
లేదా, నాకు తెలియదు, బహుశా…

490
00:36:34,760 --> 00:36:37,080
నాకు తెలియదు. నీకేం కావాలన్నా సరే.

491
00:36:38,680 --> 00:36:39,520
సరే.

492
00:36:41,640 --> 00:36:43,320
ఇది పూర్తిగా తగని విషయం.

493
00:36:44,120 --> 00:36:46,400
-మన్నించు.
-నేను ఇకపై నీ థెరపిస్ట్‌ని కాదు,

494
00:36:46,480 --> 00:36:48,000
అర్థమైందా?

495
00:36:48,080 --> 00:36:49,240
నీకు కోపం వచ్చింది.

496
00:36:49,320 --> 00:36:50,200
ఇక నేను చేయబోయేది

497
00:36:51,160 --> 00:36:55,000
రెండు ప్రత్యామ్నాయాల సంప్రదింపు వివరాలను
నీకు అందిస్తాను.

498
00:36:55,080 --> 00:36:55,920
చాలా కోపం.

499
00:36:56,000 --> 00:36:59,600
సరే, నేను క్షమాపణ చెప్పాలి.

500
00:37:03,360 --> 00:37:04,440
హృదయపూర్వకంగా.

501
00:37:07,960 --> 00:37:08,920
నన్ను మన్నించు.

502
00:37:09,600 --> 00:37:11,120
క్షమాపణ అంగీకరించాను.

503
00:37:16,560 --> 00:37:17,800
వాళ్లిద్దరూ చాలా మంచివారు.

504
00:37:20,520 --> 00:37:21,520
సరే, ఇక…

505
00:37:23,720 --> 00:37:25,480
ఈ డ్రింక్ కోసం మనం ఎక్కడకు వెళతాం?

506
00:38:09,240 --> 00:38:10,200
ఏంటి?

507
00:38:12,360 --> 00:38:14,920
మీ నాన్న చనిపోయిన రోజు
ఓల్సన్ 200 మైళ్ల దూరంలో ఉన్నాడు.

508
00:38:15,960 --> 00:38:17,160
ఇది చాలా గట్టి ఎలిబీ.

509
00:38:18,440 --> 00:38:20,320
అది చాలా దృఢంగా ఉంది.
నిరూపితమైన రుజువు ఉంది.

510
00:38:22,120 --> 00:38:23,200
అతని ఇంటిని బాగా వెతకండి.

511
00:38:24,520 --> 00:38:27,520
తను ట్రోఫీలు ఉంచుకుంటాడు. నాన్న వదిలిన
నోట్‌లో మిగిలినది అతని దగ్గరే ఉంటుంది.

512
00:38:27,600 --> 00:38:31,240
మన దగ్గర ఉన్నది ఒక పేజీనే, ఇంకా ఉండాలి,
అది అక్కడే ఇంట్లోనే ఉంటుంది, తప్పకుండా.

513
00:38:31,840 --> 00:38:33,640
ఆ ఇంటిని మేము క్షుణ్ణంగా శోధించాం.

514
00:38:34,960 --> 00:38:36,720
మీ నాన్నకు సంబంధించినది అక్కడేమీ లేదు.

515
00:38:38,120 --> 00:38:39,480
అంగీకరించడం కష్టమని తెలుసు,

516
00:38:40,800 --> 00:38:42,240
కానీ అది ఖచ్చితమైన విషయం, ల్యాజ్.

517
00:38:44,240 --> 00:38:45,760
మీ నాన్న తన ప్రాణం తానే తీసుకున్నాడు.

518
00:38:48,680 --> 00:38:49,520
మన్నించు.

519
00:38:56,160 --> 00:38:58,480
ల్యాజ్, రా. మిత్రమా.

520
00:39:01,240 --> 00:39:03,400
నువ్వంటే నాకిష్టం, సరేనా?
అందుకే నన్ను నమ్ము,

521
00:39:04,080 --> 00:39:05,320
ఓల్సన్ మీ నాన్నను చంపలేదు.

522
00:39:05,400 --> 00:39:07,200
ఎవరూ చంపలేదు.
ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.

523
00:39:07,280 --> 00:39:08,840
కసాండ్రా సంగతేంటి?

524
00:39:08,920 --> 00:39:10,440
అలాగే హ్యారీ, మార్గొట్?

525
00:39:10,520 --> 00:39:12,640
అవును, తనింకా వాళ్ల విషయంలో
నిందితుడే, కానీ అతను…

526
00:39:13,680 --> 00:39:15,360
అతను సట్టన్ కేసు మాత్రమే ఒప్పుకుంటున్నాడు.

527
00:39:15,440 --> 00:39:16,400
సెఠ్.

528
00:39:16,480 --> 00:39:19,000
సెఠ్, నేను చనిపోయినవారిని చూస్తున్నాను.

529
00:39:19,080 --> 00:39:21,160
వాళ్లను చూడడమంటే
నిన్ను ఇప్పుడు చూస్తున్నట్లుగానే.

530
00:39:21,240 --> 00:39:23,320
వాళ్లు హత్య చేయబడ్డారు. అందరూ.

531
00:39:23,400 --> 00:39:26,120
ఇక వాళ్లలో మా నాన్నకూడా ఉన్నాడు,
తనను హత్య చేశారని ఆయనే చెప్పాడు.

532
00:39:26,600 --> 00:39:29,560
అరే, మిత్రమా, చూడు,
ఇవన్నీ కనెక్ట్ అవ్వాలి.

533
00:39:30,000 --> 00:39:32,120
నేను సట్టన్‌ను చూశాను,
సట్టన్ నా దగ్గరకు వచ్చింది,

534
00:39:32,200 --> 00:39:34,040
ఆమెను ఓల్సనే హత్య చేశాడని మనకు తెలుసు.

535
00:39:36,400 --> 00:39:38,400
ఓల్సన్ మీ నాన్నను చంపలేదు.

536
00:40:19,280 --> 00:40:21,840
సరే, నిన్ను కలవాల్సిందే.

537
00:40:26,520 --> 00:40:27,360
రా.

538
00:40:28,080 --> 00:40:29,400
రా, నువ్వు బయటకు రా.

539
00:40:31,640 --> 00:40:35,240
నాన్నా, మీరేమీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు,
నాకు కొంచెం మార్గదర్శకత్వం కావాలి.

540
00:40:35,960 --> 00:40:37,600
దయచేసి. దయచేసి.

541
00:40:41,800 --> 00:40:43,840
డాక్టర్, డాక్టర్.

542
00:40:47,040 --> 00:40:48,800
నాకు ఒక్క నిమిషం ఇవ్వండి,
నేను సిద్ధమవుతాను.

543
00:40:50,080 --> 00:40:52,480
నేను రోజంతా దీని గురించే ఆలోచిస్తున్నాను.

544
00:40:53,920 --> 00:40:55,880
నేను పిలిచే వరకు రాకండి.

545
00:41:00,400 --> 00:41:01,240
ఒక్క నిమిషం ఆగు.

546
00:41:02,400 --> 00:41:03,240
లేదు.

547
00:41:05,160 --> 00:41:06,120
నువ్వు ఎవరో నాకు తెలుసు.

548
00:41:25,320 --> 00:41:26,960
బాధితురాలిని హంతకుడు
ఊపిరాడకుండా చంపాడు.

549
00:41:29,000 --> 00:41:31,080
ఇమోజెన్ కార్స్‌వుడ్ హత్యలో
దోషిగా నిర్ధారణ

550
00:41:33,080 --> 00:41:34,320
ఆర్లో జోన్స్.

551
00:41:37,080 --> 00:41:38,960
నమ్మకాలకు పెద్ద ద్రోహం చేసిన వ్యక్తివి.

552
00:41:39,040 --> 00:41:41,880
అయినా, "ప్రతీకారం నాది," అని
ప్రభువు చెబుతున్నాడు.

553
00:41:41,960 --> 00:41:44,520
"నాది, అంటే అర్లో జోన్స్‌ది!"

554
00:41:55,680 --> 00:41:56,680
హే, చూడు,

555
00:41:58,160 --> 00:42:01,480
ఆ భయంకరమైన హెచ్చరించే "జూనిపర్" చెత్త.

556
00:42:02,120 --> 00:42:04,440
మనం తదుపరి సెషన్ మొత్తాన్ని
ఎందుకు చదవకూడదు?

557
00:42:10,840 --> 00:42:12,160
నువ్వే చూడు,

558
00:42:12,240 --> 00:42:13,160
దేవుడు నా దగ్గరకొచ్చి,

559
00:42:13,240 --> 00:42:16,080
జరుగుతున్న ప్రతిదానితో
అతను ఎంతో ముడిపడిపోయి ఉండడంతో,

560
00:42:16,160 --> 00:42:19,800
ఆయన, "అతని శిక్ష అమలు" చేయడానికి
నాకు అభ్యంతరమా అని అడిగాడు.

561
00:42:20,360 --> 00:42:23,240
ఇక నేను, "చాలా సంతోషం" అన్నాను.

562
00:42:23,320 --> 00:42:24,280
నిజానికి,

563
00:42:24,960 --> 00:42:28,680
మన డా. లాజరస్ తన పేరు కంటే
తగిన పేరు ఇస్తే,

564
00:42:29,160 --> 00:42:30,760
తను చావు నుండి లేస్తాడేమో చూద్దాం.

565
00:43:14,400 --> 00:43:15,360
లాజరస్!

566
00:43:19,040 --> 00:43:20,480
లాజరస్!

567
00:43:22,280 --> 00:43:23,560
నువ్వేం చేస్తావో నాకు తెలుసు!

568
00:43:23,960 --> 00:43:26,200
-తెరచుకో!
-ఇది ఇంకా అయిపోలేదు!

569
00:43:28,120 --> 00:43:29,360
రింగ్ అవుతోంది…
వర్క్

570
00:43:29,800 --> 00:43:30,640
లాజరస్!

571
00:43:32,160 --> 00:43:34,000
-హలో?
-నేను జోయెల్ లాజరస్‌ని.

572
00:43:34,080 --> 00:43:37,360
-హాయ్, డా. లాజరస్.
-అవును, లేదు, వినండి, వినండి, వినండి.

573
00:43:37,440 --> 00:43:40,440
-…చాలా సమయం పట్టింది.
-ఆర్లో జోన్స్. నోరు మూసుకో!

574
00:43:40,920 --> 00:43:43,480
నువ్వు వెంటనే ఆర్లో జోన్స్ గదికి వెళ్లి,

575
00:43:43,840 --> 00:43:45,400
అతను అక్కడ ఉన్నాడో లేదో చెబుతావా?

576
00:43:45,480 --> 00:43:46,680
తను బతికే ఉన్నాడా?

577
00:43:48,720 --> 00:43:50,800
సురక్షిత మానసిక విభాగం

578
00:44:08,080 --> 00:44:12,080
ఇది ఇంకా అయిపోలేదు.

579
00:44:12,160 --> 00:44:14,600
ఇది ఒక వాక్యం ముగింపులా ఉంది.
ప్రారంభం కాదు.

580
00:44:15,760 --> 00:44:16,880
అందుకే, ఒకవేళ…

581
00:44:18,160 --> 00:44:19,480
మొదటి పేజీ ఉంటే?

582
00:44:21,280 --> 00:44:25,200
నాకు అత్యంత ప్రియమైన జోయెల్, జెన్నా

583
00:45:33,360 --> 00:45:35,360
సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల

584
00:45:35,440 --> 00:45:37,440
క్రియేటివ్ సూపర్‌వైజర్
సమత
ణమోహన్ తంగిరాల

