1
00:00:05,440 --> 00:00:08,360
4 గంటల ముందు

2
00:00:08,680 --> 00:00:11,240
నేను, అనురాధ కిశోర్,

3
00:00:12,000 --> 00:00:13,960
దేవుడిపై ప్రమాణం చేసి

4
00:00:14,000 --> 00:00:17,520
రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం,
విధేయత ఉంచుతానని...

5
00:00:17,600 --> 00:00:22,000
భారత రాజ్యాన్ని
మరియు సమగ్రతను సంరక్షిస్తానని.

6
00:00:22,800 --> 00:00:26,080
భయం, బంధుప్రీతి లేకుండా,
అప్యాయత, ద్వేషమూ లేకుండా,

7
00:00:26,160 --> 00:00:28,200
అందరికీ...

8
00:00:28,280 --> 00:00:30,880
రాజ్యంగానికి, చట్టానికి
కట్టుబడి నడుచుకుంటాను.

9
00:00:43,320 --> 00:00:46,240
ఎక్కడికి వెళ్ళారు? అసలు ఎక్కడికి వెళ్ళారు?

10
00:00:46,320 --> 00:00:48,560
బ్రెడ్ అయిపోయింది, తినడానికి ఏం లేదు.

11
00:00:48,640 --> 00:00:50,560
బయట నుండి తాళం వేసుకుని వెళ్ళారు.

12
00:00:51,040 --> 00:00:53,120
-సరే, ఇప్పుడు అది తెరిచే ఉంది.
-అంటే ఏంటి?

13
00:00:53,200 --> 00:00:54,520
నువ్వు ఇక వెళ్ళవచ్చు.

14
00:00:55,600 --> 00:00:57,560
నీకు ఇష్టమైన ఆహారం తెచ్చాను.

15
00:00:59,080 --> 00:01:00,880
నువ్వు నాకోసం చాలా చేశావు,

16
00:01:01,760 --> 00:01:04,720
నేను నీకోసం కనీసం బిర్యానీ తీసుకురాగలను.

17
00:01:04,800 --> 00:01:06,360
రా, కూర్చో. తిను.

18
00:01:19,680 --> 00:01:22,280
బిర్యానీ రుచి మాంసంలో ఉంటుంది.

19
00:01:23,720 --> 00:01:25,560
నాదేమో వెజ్ పులావ్.

20
00:01:26,480 --> 00:01:27,600
సర్...

21
00:01:28,640 --> 00:01:30,120
మీరు ఏం చేస్తుంటారు?

22
00:01:31,760 --> 00:01:33,760
అంటే, పనేం చేస్తుంటారు?

23
00:01:34,920 --> 00:01:36,960
కనీసం అసలు ప్లాన్ ఏంటో చెప్పండి.

24
00:01:38,400 --> 00:01:40,200
మీకు నాపై నమ్మకం లేదా?

25
00:01:40,280 --> 00:01:43,440
గత రెండ్రోజులుగా నేను గుట్టు
చప్పుడు చేయకుండా ఉన్నాను.

26
00:01:44,480 --> 00:01:46,960
నేను నీకు సూటిగా చెప్పలేను

27
00:01:49,560 --> 00:01:51,160
కానీ పరోక్షంగా చెబుతాను.

28
00:01:53,960 --> 00:01:55,200
ఒక రాజు ఉన్నాడు.

29
00:01:57,160 --> 00:01:58,520
అతని గద్దె పోయింది.

30
00:02:00,120 --> 00:02:01,720
ఎవరో ఆయనను

31
00:02:02,440 --> 00:02:04,440
యజ్ఞం చేయమన్నారు.

32
00:02:05,360 --> 00:02:06,680
ఆయన చేశాడు.

33
00:02:09,000 --> 00:02:11,600
ఎవరో అతనిని
కొత్త రాజుపై యుద్ధం చేయమన్నారు.

34
00:02:13,240 --> 00:02:15,160
అదీ ప్రయత్నించాడు.

35
00:02:16,760 --> 00:02:17,960
ఓడిపోయాడు.

36
00:02:23,440 --> 00:02:24,880
జాగ్రత్తగా విను, విశాల్.

37
00:02:25,520 --> 00:02:27,000
ఇది నీ కథ.

38
00:02:29,080 --> 00:02:30,360
నా కథా?

39
00:02:36,120 --> 00:02:37,600
అప్పుడు ఎవరో సూచించారు...

40
00:02:40,240 --> 00:02:42,120
నీ కూతురి పెళ్ళి...

41
00:02:44,360 --> 00:02:46,040
కొత్త రాజుతో చేయమని చెప్పారు.

42
00:02:47,080 --> 00:02:48,560
అప్పుడు అదీ చేశాడా?

43
00:02:49,840 --> 00:02:52,920
-లేదు. చేయలేదు.
-అయితే ఏం చేశాడు?

44
00:02:55,320 --> 00:02:57,000
అతను ఒక గొడ్డలి తీసుకున్నాడు...

45
00:02:59,160 --> 00:03:01,640
ఒక తుమ్మ మొక్కను నరికాడు.

46
00:03:07,360 --> 00:03:10,320
సర్, దీనికీ నాకూ ఏంటి సంబంధం?

47
00:03:12,360 --> 00:03:15,040
దయచేసి నా ఫోన్ తిరిగి ఇచ్చేయండి.

48
00:03:15,360 --> 00:03:18,400
ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను.
నేను తినడం పూర్తయింది.

49
00:03:22,600 --> 00:03:24,200
ఈ కథలో...

50
00:03:25,920 --> 00:03:28,400
తుమ్మ మొక్కవు నువ్వే, విశాల్.

51
00:03:42,600 --> 00:03:45,000
ఇందులో నీ తప్పు ఏం లేదు, విశాల్.

52
00:03:47,560 --> 00:03:49,640
కానీ రాజు గద్దెను కాపాడటానికి,

53
00:03:50,960 --> 00:03:53,320
ఈ తుమ్మ మొక్కను నరకాలి.

54
00:03:54,000 --> 00:03:56,960
మరణం ఒక్కటే సత్యం.

55
00:03:57,040 --> 00:04:00,120
అంతిమ సత్యం మరణం.

56
00:04:00,640 --> 00:04:02,720
ఎంత దూరం పారిపోయినా...

57
00:04:02,880 --> 00:04:04,400
మీ జీవితాంతం...

58
00:04:05,760 --> 00:04:09,600
మరణాన్ని తప్పించుకోలేరు.

59
00:04:09,680 --> 00:04:11,920
మనుషులు వారి జీవితమంతా

60
00:04:12,000 --> 00:04:14,120
ఐఫోన్, ఇల్లు,

61
00:04:14,200 --> 00:04:17,000
కారు, స్త్రీ, డబ్బు వెనుక,

62
00:04:17,080 --> 00:04:20,320
పరిగెడుతూనే ఉంటాడు.

63
00:04:20,400 --> 00:04:22,160
కానీ మీరు మీ

64
00:04:22,640 --> 00:04:24,680
చివరి శ్వాస తీసుకున్న రోజు...

65
00:04:26,040 --> 00:04:29,800
ఈ పరుగు ఆగిపోతుంది.

66
00:05:08,920 --> 00:05:14,360
తాండవం

67
00:05:36,520 --> 00:05:41,160
ప్రస్తుత సమయం
వీఎన్‌యూ హాస్టల్ గ్రౌండ్

68
00:06:28,840 --> 00:06:30,360
జిగర్!

69
00:06:30,640 --> 00:06:31,880
జిగర్!

70
00:06:32,720 --> 00:06:34,400
-జిగర్!
-సనా?

71
00:06:36,480 --> 00:06:38,120
-ఏం జరిగింది?
-విశాల్...

72
00:06:39,640 --> 00:06:41,480
విశాల్ చనిపోయాడు.

73
00:06:42,160 --> 00:06:43,400
ఏంటి?

74
00:06:44,120 --> 00:06:45,440
నాకు ఏం తెలియదు, సనా?

75
00:06:45,520 --> 00:06:48,240
నువ్వు ఏం చేస్తున్నావో
నాకు అనవసరం. కానీ ఇది...

76
00:06:48,320 --> 00:06:50,120
ఇది చాలా పెద్దది, జిగర్!

77
00:06:50,200 --> 00:06:52,880
వాళ్ళు అతను వారంలో
తిరిగి వస్తాడని అన్నారు, సనా.

78
00:06:52,960 --> 00:06:56,160
ఎవరు చెప్పారు? వాళ్ళు ఎవరు?
ఏం జరుగుతోంది, జిగర్? చెప్పు.

79
00:06:56,240 --> 00:06:59,640
ఇదంతా తెలిస్తే నేను నిన్ను
ఇది చేయమని చెప్పేవాడినా?

80
00:06:59,720 --> 00:07:02,600
-నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు?
-ఏదో శాపం వలన!

81
00:07:02,680 --> 00:07:05,400
నీ సంగతి ఏమోగానీ,
నాకిప్పటికే చాలా ఉన్నాయి!

82
00:07:05,480 --> 00:07:08,480
నాకు తెలుసు! కానీ మనకు మరో మార్గం లేదు.

83
00:07:08,600 --> 00:07:10,920
నువ్వు కాస్త శాంతించు, దయచేసి...

84
00:07:11,000 --> 00:07:12,440
-పోలీసులకు చెబుతా.
-వద్దు...

85
00:07:12,520 --> 00:07:16,480
సనా, నువ్వు అలాంటిది ఏదీ చేయవు!
సనా, వాళ్ళు చాలా శక్తిమంతులు!

86
00:07:16,800 --> 00:07:19,280
జైలుకు వెళ్ళేది నువ్వే.

87
00:07:19,360 --> 00:07:23,080
నేను నీకు ఫోన్ ఇచ్చానని నీ దగ్గర
ఏ ఆధారం లేదు. సరేనా?

88
00:07:23,880 --> 00:07:26,320
-ఏంటిది!
-ఇది నాకు ఇవ్వు! సనా!

89
00:07:27,160 --> 00:07:28,400
ఇది ఇక్కడితో ఆపేద్దాం.

90
00:07:32,080 --> 00:07:33,640
దయచేసి నా మాట విను, సనా.

91
00:07:34,280 --> 00:07:35,880
సనా, సనా...

92
00:07:38,000 --> 00:07:39,800
నేను నీ మంచే కోరుతున్నా.

93
00:07:48,320 --> 00:07:50,240
నీ డబ్బు అరలో ఉంది.

94
00:07:52,200 --> 00:07:53,880
నన్ను క్షమించు, సనా.

95
00:08:19,440 --> 00:08:22,120
ఆ అబ్బాయి పని పూర్తి చేశాను, సర్,
విశాల్ అవాస్తీ.

96
00:08:31,640 --> 00:08:33,280
మరి శివ శేఖర్ సంగతి ఏంటి?

97
00:08:33,360 --> 00:08:36,880
నేను జిగర్‌తో మాట్లాడాను, సర్.
అతను ఆ అమ్మాయితో మాట్లాడాడు.

98
00:08:47,360 --> 00:08:49,200
మనం అనుకున్నదే జరుగుతోంది సార్.

99
00:08:56,280 --> 00:08:59,040
-ఫుటేజీలో ఏమన్నా తెలిసిందా?
-ఇంకా చూస్తున్నాను.

100
00:08:59,120 --> 00:09:01,960
-దేనికోసం?
-నేను ఒక జాబితా తయారు చేస్తున్నాను...

101
00:09:02,960 --> 00:09:05,640
ఆ రాత్రి ఆ అంతస్తులోకి
ఎవరెవరు వచ్చారా అని.

102
00:09:05,720 --> 00:09:09,120
అలాగే నేను డాక్టర్ల
కదలికలు కూడా గమనిస్తున్నాను.

103
00:09:09,200 --> 00:09:11,240
నాకు ఏదైనా దొరుకుతుందని నమ్మకం లేదు.

104
00:09:11,320 --> 00:09:15,840
ఎందుకంటే ఆ రాత్రి నాలుగు కెెమెరాలలో,
మూడు పని చేయడం లేదు.

105
00:09:15,880 --> 00:09:17,720
-అవి ఎవరైనా ఆపేశారా?
-లేదు.

106
00:09:17,760 --> 00:09:21,120
అవి నెల రోజులనుండి,
ఇప్పటికీ పని చేయడం లేదు.

107
00:09:21,200 --> 00:09:24,640
మనకు సమయం లేదు, గుర్పాల్.
అది ఏంటో తెలుసుకో.

108
00:09:24,720 --> 00:09:26,200
అలాగే, మేడం.

109
00:09:36,240 --> 00:09:37,880
గుర్పాల్, నీకు అనిపించడం లేదా...

110
00:09:40,240 --> 00:09:42,760
ఈ పిచ్చితనం కాస్త ఎక్కువవునట్టు?

111
00:09:45,760 --> 00:09:48,240
పిచ్చితనానికి కొలమానం ఉండదు, సర్.

112
00:09:48,760 --> 00:09:50,640
ఉంటే పిచ్చి ఉండడం లేదా లేకపోవడం.

113
00:09:53,240 --> 00:09:54,880
మిమ్మల్ని ఆపాలనుకుంటున్నాను, సర్.

114
00:09:55,520 --> 00:09:57,400
ఇది పిచ్చితనం అని కాదు.

115
00:09:59,640 --> 00:10:02,760
కానీ, మీరు గాయపడ్డారని.

116
00:10:03,520 --> 00:10:04,960
మీరు అంగుళం కూడా కదలలేరు.

117
00:10:05,880 --> 00:10:08,360
బయటంతా చిమ్మ చీకటి.

118
00:10:09,520 --> 00:10:13,160
ఎక్కువ కదలికల వలన
క్రూర మృగాల నుండి ప్రమాదముండవచ్చు.

119
00:10:20,400 --> 00:10:21,760
అంత ప్రేమా?

120
00:10:23,520 --> 00:10:26,080
ఎవరూ గమనించనిది ఒకటి ఉంది, గుర్పాల్,

121
00:10:27,040 --> 00:10:29,240
అది నేను బయటకి అరవడం లేదు కాబట్టి.

122
00:10:30,880 --> 00:10:33,080
కానీ నా రక్తం ఎలా ఉండుకుతోందంటే

123
00:10:34,600 --> 00:10:36,880
సూర్యోదయం వరకూ ఆగితే...

124
00:10:39,000 --> 00:10:40,720
నేను బ్రతకను.

125
00:10:51,160 --> 00:10:53,760
ఇంత త్వరగా డబ్బు ఎలా ఏర్పాటు చేశావు?

126
00:10:54,280 --> 00:10:55,640
బ్యాంక్ దోపిడీ చేశాను.

127
00:10:58,080 --> 00:10:59,600
ఇంతే దోపిడీ చేశావా?

128
00:11:13,000 --> 00:11:16,040
నీకు చెప్పాను కదా, జిగర్!
మళ్ళీ ఇంకెప్పుడూ ఫోన్ చేయకు.

129
00:11:16,120 --> 00:11:18,360
సనా, నేను మళ్ళీ చెప్పను!

130
00:11:19,200 --> 00:11:20,360
జాగ్రత్తగా విను.

131
00:11:20,440 --> 00:11:24,120
అందరూ నా అంత దయగల వాళ్ళు కాదు, అర్థమైందా?

132
00:11:31,280 --> 00:11:34,320
ఇది పెట్టారు, బ్రో!
ఎవరో ఇది అక్కడ పెట్టించారు.

133
00:11:34,400 --> 00:11:36,160
చివరి ఫోన్ కాల్ సంగతి ఏంటి?

134
00:11:36,240 --> 00:11:39,080
మనం పోలీసుల దగ్గరకు
వెళదామంటే అతనేగా ఆపాడు!

135
00:11:39,160 --> 00:11:41,040
నీకు ఏమైనా పిచ్చా?

136
00:11:41,120 --> 00:11:43,880
ఇది కుట్ర! వాళ్ళు మనల్ని
విడదీయాలనుకుంటున్నారు.

137
00:11:44,640 --> 00:11:46,560
నేను తప్పయితే నన్ను ఉరి తీయండి.

138
00:11:46,640 --> 00:11:48,200
ఇక ఆపండి!

139
00:11:48,320 --> 00:11:50,120
బయట మనకోసం వేచి చూస్తున్నారు.

140
00:11:57,160 --> 00:11:59,120
రండి. వీడు రాడు.

141
00:12:04,120 --> 00:12:05,680
ఛ!

142
00:12:07,360 --> 00:12:11,280
మా స్నేహితుడు కనిపించకుండా పోయాడు,
వారం తరువాత అతని శవం దొరికింది.

143
00:12:11,360 --> 00:12:15,800
ప్రచార సమయంలో,
సీజేఎల్‌డీ కార్యకర్తలు మమల్ని బెదిరిచారు,

144
00:12:16,720 --> 00:12:18,400
వారం రోజుల్లో,

145
00:12:18,480 --> 00:12:20,440
వాళ్ళు ఎన్నికల రూపమే మారుస్తాం అని.

146
00:12:21,600 --> 00:12:23,480
ఆ తరువాత, అమిత్ మెవానీ

147
00:12:24,200 --> 00:12:25,880
విశాల్ బైక్‌తో కనిపించాడు!

148
00:12:26,880 --> 00:12:28,640
ఇది సాక్ష్యం కాదా?

149
00:12:28,720 --> 00:12:32,840
ఇప్పటి వరకూ పోలీసులు
ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

150
00:12:34,240 --> 00:12:36,960
కనీసం పరిశోధించడానికి కూడా పూనుకోలేదు!

151
00:12:37,040 --> 00:12:39,560
పోలీసులు మనకు జవాబు ఇవ్వాలి!

152
00:12:40,240 --> 00:12:43,400
కాలేజీ యాజమాన్యం మనకు జవాబు ఇవ్వాలి!

153
00:12:44,680 --> 00:12:46,760
మనం పోలీసుల దగ్గరికి వెళ్ళాలనుకుంటా.

154
00:12:49,560 --> 00:12:51,680
విశాల్‌ను చేతన్ చంపాడని అనుకోను.

155
00:12:53,400 --> 00:12:55,280
విశాల్‌ను చాలా దారుణంగా చంపారు.

156
00:12:55,360 --> 00:12:58,000
అతని శవం చూసిన తరువాత
తన కళ్ళు మర్చిపోలేకపోతున్నా.

157
00:12:59,080 --> 00:13:01,000
మనది కొన్నేళ్ళ పరిచయం.

158
00:13:02,000 --> 00:13:03,800
మనకు అతను బాగా తెలుసు.

159
00:13:04,480 --> 00:13:05,920
అతను ఎందుకు చేస్తాడు?

160
00:13:07,240 --> 00:13:08,640
అతను ఇది చేసి ఉండడు.

161
00:13:10,080 --> 00:13:12,040
నీ దగ్గర ఆ ఫోన్ ఉందా?

162
00:13:13,320 --> 00:13:17,560
చూడు, మనం వేచి చూడాలనుకుంటా.

163
00:13:19,680 --> 00:13:21,160
మనమది ఒకసారి ఆలోచించాలి.

164
00:13:22,440 --> 00:13:24,880
మనం అది ఇప్పుడే పోలీసులకు ఇవ్వకూడదు.

165
00:13:25,600 --> 00:13:26,560
నిజానికి...

166
00:13:27,960 --> 00:13:31,440
మనం ప్రస్తుతం అసలు
ఆ ఫోన్ గురించి మర్చిపోదాం.

167
00:13:33,280 --> 00:13:34,840
ఏం అంటున్నావు, సనా?

168
00:13:43,120 --> 00:13:44,240
సంధ్యా!

169
00:13:45,560 --> 00:13:47,800
-హాయ్!
-హాయ్, జిగర్.

170
00:13:48,720 --> 00:13:51,160
-విడాకుల పత్రాలా?
-త్వరలోనే పంపుతాను.

171
00:13:51,800 --> 00:13:53,120
అంత తొందరేంటి?

172
00:13:53,400 --> 00:13:56,200
చెప్పు, సంధ్యా.
నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు?

173
00:13:56,720 --> 00:13:58,440
అతను నీకు ఏం ఇస్తున్నాడు?

174
00:13:58,520 --> 00:14:01,840
ఎదుగు, జిగర్.
నువ్వు ఇప్పుడు కాలేజీ కుర్రాడివి కాదు.

175
00:14:01,920 --> 00:14:03,760
ఎవరూ ఎవరికీ ఏదీ ఇవ్వరు.

176
00:14:03,840 --> 00:14:05,960
ఇది సరిసమానుల సంబంధం.

177
00:14:06,760 --> 00:14:08,800
అతను నీలా కాదు, నన్నర్థం చేసుకుంటాడు.

178
00:14:08,880 --> 00:14:11,080
నాకు నిజం చెప్పు, సంధ్యా!

179
00:14:11,160 --> 00:14:14,680
ఇది పరపతి విషయమా?
లేదా ఏమైనా నాపై ఆధిపత్య పోరా?

180
00:14:14,760 --> 00:14:17,000
-ఏంటి?
-నిజాయితీగా చెప్పాలంటే...

181
00:14:19,280 --> 00:14:20,760
అతను పడకలో గొప్పగా ఉంటాడు!

182
00:14:22,720 --> 00:14:24,760
అంతేకాకుండా ఖచ్చితంగా శక్తిమంతుడు.

183
00:14:25,160 --> 00:14:27,320
ఒక్కోసారి, నన్ను నియంత్రించే శక్తిమంతుడు.

184
00:14:32,240 --> 00:14:33,840
గుర్పాల్

185
00:14:35,000 --> 00:14:35,960
ఏంటి?

186
00:14:36,040 --> 00:14:38,560
శివ దగ్గర ఇంకా ఆ ఫోన్ ఎందుకు ఉంది?

187
00:14:38,640 --> 00:14:42,480
ఆ అమ్మాయికి ఆ ఫోన్‌ను
వెంటనే పోలీసులకు ఇమ్మను.

188
00:14:42,560 --> 00:14:44,160
-నేనది చేస్తాను.
-చేస్తావా?

189
00:14:44,720 --> 00:14:46,160
చెప్పానుగా, చేస్తాను!

190
00:14:49,160 --> 00:14:51,000
ప్రవేశం లేదు

191
00:15:02,760 --> 00:15:05,400
నువ్వు పోలీసులకు ఫోన్ ఎందుకు ఇవ్వడం లేదు?

192
00:15:05,480 --> 00:15:07,240
నేనేం చేస్తున్నానో తెలియడం లేదు.

193
00:15:07,600 --> 00:15:11,440
ఇది తప్పు.
ఇది మనం మాట్లాడుకోలేదు.

194
00:15:11,520 --> 00:15:15,120
విను! ఇప్పుడు నువ్వు ఇందులో భాగం.

195
00:15:16,240 --> 00:15:20,120
దీనికి నీకు డబ్బు చెల్లించబడింది.
అది చెల్లించింది వాళ్ళే.

196
00:15:20,200 --> 00:15:22,160
ఇది జోక్ కాదు, సనా.

197
00:15:22,240 --> 00:15:24,720
నువ్వూ ఇందులో సమాన భాగస్తురాలివే!

198
00:15:24,800 --> 00:15:26,400
ఇప్పుడిక వెనకడుగు వేయలేవు.

199
00:15:27,560 --> 00:15:30,880
అందుకే శివకు
ఆ ఫోన్ పోలీసులకు ఇవ్వమని చెప్పు.

200
00:15:31,320 --> 00:15:33,760
వాళ్ళకు నిన్ను ఇరికించడం పెద్ద పనేం కాదు.

201
00:15:36,000 --> 00:15:37,120
అర్థమైందా?

202
00:16:05,520 --> 00:16:07,520
-నన్ను చూడనీ.
-అలాగే, సర్.

203
00:16:11,040 --> 00:16:13,440
ఈ ఫోన్ మీ దగ్గర ఎప్పటి నుండి ఉంది?

204
00:16:13,520 --> 00:16:14,840
నిన్న సాయంత్రం దొరికింది.

205
00:16:15,320 --> 00:16:16,880
అంటే అతను చనిపోకముందు.

206
00:16:19,360 --> 00:16:20,920
ఇది స్విచ్ ఆఫ్ చేసి ఉంది.

207
00:16:21,920 --> 00:16:23,400
మీరిది స్విచ్ ఆన్ చేశారా?

208
00:16:24,200 --> 00:16:26,320
అవును, సర్, కానీ అది లాక్ చేసి ఉంది.

209
00:16:26,800 --> 00:16:27,960
అలాగా.

210
00:16:28,040 --> 00:16:29,880
ఇది అతని ఫోన్ అని ఖచ్చితంగా తెలుసా?

211
00:16:31,680 --> 00:16:33,960
ఇది ఇప్పటి వరకూ ఎందుకు ఇవ్వలేదు?

212
00:16:34,840 --> 00:16:37,800
ఏం అడిగావు, కస్తూరి. సరైన సమయానికి!

213
00:16:37,880 --> 00:16:39,160
బాగా చేశావు!

214
00:16:40,160 --> 00:16:42,160
సర్, మాకు దానిని ఏం చేయాలో తెలియలేదు.

215
00:16:42,240 --> 00:16:44,840
మాకు అతని మీద అనుమానం మాత్రమే.
ఖచ్చితం కాదు.

216
00:16:45,440 --> 00:16:46,480
సరే.

217
00:16:48,320 --> 00:16:50,240
అతని పేరు ఏమన్నారు?

218
00:16:52,080 --> 00:16:53,240
చేతన్ క్రాంతి.

219
00:16:53,960 --> 00:16:55,520
-కస్తూరి.
-ఏంటి, సర్?

220
00:16:55,600 --> 00:16:57,920
కారు తీసుకెళ్ళి ఆ అబ్బాయిని అరెస్ట్ చెయ్.

221
00:16:58,000 --> 00:16:59,440
సరేనా? త్వరగా!

222
00:17:05,960 --> 00:17:09,160
ఆ విషయం మాతో ఎందుకు మాట్లాడలేదు?
నీకు నువ్వు ఏం అనుకుంటున్నావు?

223
00:17:09,240 --> 00:17:11,280
ఎన్నికలు ముగిసిపోయాయి, శివ.

224
00:17:11,320 --> 00:17:13,280
సీజేఎల్‌డీ మనల్ని ఓడించేసింది.

225
00:17:13,320 --> 00:17:15,880
నేను పోలీసులకు సాక్ష్యం మాత్రమే ఇచ్చాను.

226
00:17:15,960 --> 00:17:18,680
నువ్వు పార్టీ తప్ప ఇంకేం పట్టించుకోవా?

227
00:17:18,760 --> 00:17:21,320
నువ్వు అతని తల్లిదండ్రుల ముఖం చూశావా?

228
00:17:24,520 --> 00:17:27,720
దేశానికి స్వతంత్రం కావాలంటారు,
ఇలాగ కాదు తెచ్చేది!

229
00:17:27,800 --> 00:17:29,080
"మీ పార్టీ"?

230
00:17:30,400 --> 00:17:33,560
శివ, నా మాట విను.
ఒక్కసారి దీని గురించి ఆలోచించు.

231
00:17:33,680 --> 00:17:37,520
ఎవరి డ్రాలో అయినా ఫోన్ పెట్టడం,
తప్పు కాల్ చేయడం పెద్ద కష్టం ఏం కాదు.

232
00:17:37,560 --> 00:17:39,520
ఎవరైనా అలా ఎందుకు చేస్తారు? పిచ్చా?

233
00:17:39,560 --> 00:17:42,080
కనీసం అతను చెప్పేది విను. శివ కరక్టే.

234
00:17:42,160 --> 00:17:44,000
ఫోన్ ఇచ్చేయడం మంచి పనే.

235
00:17:44,080 --> 00:17:47,760
చేతన్ అమాయకుడైనా,
మనకు ఏం జరుగుతుందో తెలియదు.

236
00:17:47,800 --> 00:17:49,560
ఇప్పుడు నిజమైనా బయటకు వస్తుంది.

237
00:17:49,640 --> 00:17:51,760
నేను ఇక ఇందులో భాగం కాలేను.

238
00:17:52,800 --> 00:17:55,240
నేను నా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నాను.

239
00:17:55,320 --> 00:17:57,320
-సనా.
-సనా!

240
00:17:57,920 --> 00:17:59,480
విఎన్‌యూ విద్యార్థుల ఆరోపణ,

241
00:17:59,560 --> 00:18:03,080
పోలీసులు విశాల్ హత్య అసలు నిందితులను
కనుగొనడానికి బదులు...

242
00:18:03,200 --> 00:18:06,560
చేతన్ క్రాంతిని అరెస్టు చేశారు.

243
00:18:06,760 --> 00:18:09,240
వాళ్ళు ఈ రోజూ తరగతులు బహిష్కరించారు.

244
00:18:09,480 --> 00:18:10,760
ప్రైవేట్ నంబర్

245
00:18:11,320 --> 00:18:13,440
-హలో?
-గరిమ దేశ్వాల్‌గారు.

246
00:18:13,720 --> 00:18:17,200
-అవును. ఎవరు మాట్లాడుతున్నారు?
-నేను పెద్ద అభిమానిని.

247
00:18:18,200 --> 00:18:19,760
మీకోసం సంచలన వార్త ఉంది.

248
00:18:20,040 --> 00:18:22,320
దేవకీ నందన్‌గారిది సహజ మరణం కాదు,

249
00:18:22,400 --> 00:18:23,760
అతనిది హత్య.

250
00:18:23,800 --> 00:18:26,080
అందుకు నా దగ్గర సాక్ష్యం ఉంది.

251
00:18:36,520 --> 00:18:37,720
అజయ్.

252
00:18:38,080 --> 00:18:41,080
ఎవరో దేవకీ నందన్‌ని
హత్య చేశారని ఫోన్ చేశారు.

253
00:18:43,040 --> 00:18:44,560
ఎవరు... ఎవరది?

254
00:18:45,560 --> 00:18:48,280
ఏదో తెలియని నంబర్.
నాకది కనిపించలేదు. క్షమించు.

255
00:18:49,040 --> 00:18:50,320
అతను హాస్యమాడుతున్నాడు.

256
00:18:50,440 --> 00:18:51,720
అది అర్థం లేనిది.

257
00:18:53,680 --> 00:18:55,080
హత్య ఎలా అయ్యుంటుంది?

258
00:18:56,160 --> 00:18:58,880
అది గుండెపోటు. అందరికీ తెలుసు...

259
00:18:58,960 --> 00:19:01,280
జనం వార్తల్లో రావడానికి ఏదైనా చేస్తారు.

260
00:19:03,640 --> 00:19:07,240
నాకు నిన్నొక ఈ మెయిల్ వచ్చింది,
పంచగనీలో దావూద్‌ను కనుగొన్నట్టు.

261
00:19:07,320 --> 00:19:09,320
అది ప్రసారం చేస్తే, అతను పట్టుబడతాడని.

262
00:19:10,640 --> 00:19:13,760
లేదు, నువ్వన్నది కరక్టే.
నేనది పట్టించుకోకుండా ఉండాల్సింది.

263
00:19:14,640 --> 00:19:17,480
-నువ్వు ఈమధ్య చాలా కష్టపడుతున్నావు.
-అవును.

264
00:19:17,560 --> 00:19:19,520
-సరే, బై.
-బై.

265
00:19:21,320 --> 00:19:22,400
అజయ్ అహ్లూవాలియా

266
00:19:43,520 --> 00:19:45,320
నన్ను అవమానిస్తున్నారు.

267
00:19:45,440 --> 00:19:47,880
నన్ను అవమానిస్తున్నా, నువ్వు పట్టించుకోవు!

268
00:19:47,960 --> 00:19:51,800
జనం నన్ను ఒక వెధవలా చూస్తున్నారు!
అయినా నువ్వు పట్టించుకోవు!

269
00:19:52,800 --> 00:19:54,640
-అది మళ్ళీ తీసుకున్నావా?
-అవును.

270
00:19:54,720 --> 00:19:56,800
నీకు రక్షణ శాఖ ఎందుకు కావాలి?

271
00:19:56,920 --> 00:20:00,680
రక్షణ శాఖ కాకపోతే, ఆర్థిక,
విదేశాంగ, రైల్వే ఇచ్చుండాల్సింది.

272
00:20:00,760 --> 00:20:03,960
-ఏదైనా సరే!
-నువ్వు ఒక వెధవవి, రఘు!

273
00:20:04,040 --> 00:20:06,800
ఎందుకంటే నువ్వుఇది ఫ్యాన్సీ
డ్రెస్ పోటీ లో

274
00:20:06,880 --> 00:20:09,800
మంచి డ్రెస్‌కు చాక్లెట్లు
గెలవచ్చని అనుకుంటున్నావు!

275
00:20:10,400 --> 00:20:12,960
అనుకోకుండా,
ఒక రెండో స్థాయి లీడర్ పీఎం అయింది

276
00:20:13,040 --> 00:20:15,000
వెంటనే ఆమె కొడుకు, రక్షణ మంత్రి!

277
00:20:15,080 --> 00:20:18,520
ప్రపంచం అంతా నీలాగా
మత్తులో ఉందని అనుకుంటున్నావా?

278
00:20:19,200 --> 00:20:21,640
ఏం జరుగుతుందో ఎవరూ
పట్టించుకోరనుకుంటున్నావా?

279
00:20:27,000 --> 00:20:30,080
సమయం పడుతుంది, రఘు. సమయం పడుతుంది.

280
00:20:32,080 --> 00:20:33,960
ఆరు నెలలు, ఎనిమిది నెలలు...

281
00:20:34,040 --> 00:20:35,960
అదితీకి చెడుతుంది!

282
00:20:36,040 --> 00:20:37,560
నాకు తెలిసింది నీకు తెలియదు.

283
00:20:37,640 --> 00:20:39,480
అప్పుడు ఆ స్థానం ఖాళీ అవుతుంది.

284
00:20:39,560 --> 00:20:42,040
ఈలోపు, మన స్థానాన్ని బలపరుచుకోవాలి.

285
00:20:42,560 --> 00:20:45,480
మనం కోర్ కమిటీలో కూడా
తక్కువ స్థాయిలో ఉన్నాము.

286
00:20:46,520 --> 00:20:49,080
వాళ్ళు పాముల్లా, దాడికి వేచి చూస్తున్నారు.

287
00:20:50,560 --> 00:20:53,080
నీకిది హోలిడే లా వుంది కదా, రఘు?

288
00:20:53,160 --> 00:20:55,200
కానీ నేను చూసేది మన పూర్తి జీవితాన్ని.

289
00:20:56,560 --> 00:20:59,040
మొండిగా చేయకుండా, సరిగ్గా నడుచుకో.

290
00:20:59,080 --> 00:21:02,240
కొన్ని రోజులు కాస్త తగ్గి ఉండు, రఘు.

291
00:21:02,320 --> 00:21:04,920
ఆ తరువాత నేలబడినప్పుడు
తగ్గాల్సిన అవసరం ఉండదు.

292
00:21:17,160 --> 00:21:19,560
నన్నీ ప్రపంచంలోకి తీసుకురావడం
ఒక తప్పు, కదా?

293
00:21:21,720 --> 00:21:24,240
నన్ను కొడుకుగా చూడడం సిగ్గు, కదా?

294
00:21:24,320 --> 00:21:25,720
ఈ చెత్త వాగుడు ఆపు.

295
00:21:29,200 --> 00:21:30,640
నాకు నాలుగేళ్ళప్పుడే

296
00:21:31,800 --> 00:21:34,680
నీకు తెలిసింది నేను ఒక తప్పు అని.

297
00:21:34,760 --> 00:21:38,440
దాని కారణంగా నువ్వు నాన్నతో
ఇంకా రెండేళ్ళు ఉండాల్సి వచ్చింది.

298
00:21:38,520 --> 00:21:40,320
లెంప వాయించేస్తా, రఘు!

299
00:21:47,080 --> 00:21:48,880
అది చాలా క్లిష్టమైనది.

300
00:21:50,560 --> 00:21:52,760
ఏది తెలుపు నలుపు కాదు.

301
00:21:53,240 --> 00:21:54,520
నీకు తెలుసా...

302
00:21:56,400 --> 00:21:58,840
నేను కలిసిన ప్రతి మనిషిలో
నాన్నను వెతుకున్నాను.

303
00:22:01,680 --> 00:22:05,880
కానీ నువ్వు ఎంచుకున్నతనంటే,
నాకు చాలా ద్వేషం!

304
00:22:18,320 --> 00:22:22,320
మరులు కొలుపునది

305
00:22:22,400 --> 00:22:25,200
ఆమె ఆయుధాన్ని చూసుకుంటుందా?

306
00:22:26,080 --> 00:22:29,600
హే, ఇక్కడ ఎందుకు పార్క్ చేశావు?

307
00:22:29,920 --> 00:22:33,520
లైసెన్స్, రిజిస్ట్రేషన్ చూపించు.

308
00:22:34,840 --> 00:22:36,880
హాస్యమాడాను, సర్.

309
00:22:36,960 --> 00:22:39,680
మిమ్మల్ని పత్రాలు ఎవరు అడగగలరు?

310
00:22:39,760 --> 00:22:42,240
మీకు మీరు ప్రభుత్వ లైసెన్స్.

311
00:22:42,320 --> 00:22:46,840
చెప్పండి, సర్. నేను ఏం చేయాలి?

312
00:22:46,920 --> 00:22:49,000
వీఎన్‌యూలో అబ్బాయిని అరెస్ట్ చేశావా?

313
00:22:51,400 --> 00:22:52,880
చేతన్ క్రాంతా?

314
00:22:54,040 --> 00:22:55,120
అవును, సర్.

315
00:22:55,200 --> 00:22:57,880
అతని భవిష్యత్తు నాశనం కాకూడదని
సర్ చెప్పారు.

316
00:22:57,960 --> 00:23:00,200
ఏం అంటున్నారు, గుర్పాల్‌‌గారు?

317
00:23:00,280 --> 00:23:03,400
ఇది విని మీరు ఆనందిస్తారని అనుకున్నాను.

318
00:23:04,160 --> 00:23:07,400
-అతనిని వదిలేయ్.
-అది అంత సులభం కాదు, సర్.

319
00:23:07,960 --> 00:23:10,600
ఈ కథనంతో మీడియా పిచ్చెక్కిపోయి ఉంది.

320
00:23:10,680 --> 00:23:13,200
పార్టీ కూడా అది ఆనందిస్తోంది.

321
00:23:13,280 --> 00:23:15,520
అందుకే నీకు కలాకండ్ ఇవ్వడానికి వచ్చాను.

322
00:23:16,680 --> 00:23:17,920
అవి తాజాగా ఉన్నాయి.

323
00:23:21,960 --> 00:23:25,880
డీమానిటైజేషన్‌లో
ఎలా డబ్బు తీసుకు రాగలుగుతున్నారు, సర్?

324
00:23:25,960 --> 00:23:27,400
నిజంగా!

325
00:23:27,480 --> 00:23:31,120
మీరు నిర్వహించే స్థాయి చూస్తే మతి పోతుంది!

326
00:23:31,200 --> 00:23:34,120
అయినా, నోటు రంగు ఎలా ఉన్నా,

327
00:23:34,200 --> 00:23:37,720
దాని విలువ మారదు. అది నాకు ముఖ్యం.

328
00:23:39,280 --> 00:23:40,720
కానీ సర్...

329
00:23:40,800 --> 00:23:44,640
మీలాంటి పెద్దవారు కాలేజీ రాజకీయాలలో
ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు.

330
00:23:44,720 --> 00:23:48,280
అనవసరమైన వాటి గురించి
బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు, జాకర్?

331
00:23:48,360 --> 00:23:49,360
అలాగే.

332
00:23:49,440 --> 00:23:53,240
దుబాయ్‌లో కొత్త ఐస్ వరల్డ్ తెరిచారు.
మీ కుటుంబంతో సరదాగా గడిపి రా.

333
00:23:53,320 --> 00:23:55,800
ఆనందించు. దేశం అంతా ఆనందిస్తున్నట్టు.

334
00:23:56,960 --> 00:23:58,360
-మాకు న్యాయం...
-కావాలి!

335
00:23:58,480 --> 00:24:00,320
-మాకు న్యాయం...
-కావాలి!

336
00:24:00,400 --> 00:24:01,880
-మాకు న్యాయం...
-కావాలి!

337
00:24:02,000 --> 00:24:03,400
-మాకు న్యాయం...
-కావాలి!

338
00:24:03,480 --> 00:24:05,000
-మాకు న్యాయం...
-కావాలి!

339
00:24:05,080 --> 00:24:07,040
-మాకు న్యాయం...
-కావాలి!

340
00:24:12,080 --> 00:24:13,640
విశాల్‌కు న్యాయం కావాలి

341
00:24:17,520 --> 00:24:19,240
-మాకు న్యాయం...
-కావాలి!

342
00:24:19,320 --> 00:24:20,880
-మాకు న్యాయం...
-కావాలి!

343
00:24:20,960 --> 00:24:22,360
-మాకు న్యాయం...
-కావాలి!

344
00:24:22,440 --> 00:24:23,960
-మాకు న్యాయం...
-కావాలి!

345
00:24:24,040 --> 00:24:25,360
-మాకు న్యాయం...
-కావాలి!

346
00:24:32,400 --> 00:24:34,800
ఇక్కడకు సమర్ ప్రతాప్ ఎందుకు వస్తున్నారు?

347
00:24:34,880 --> 00:24:37,040
సమర్ ప్రతాప్? అతను ఇక్కడేం చేస్తున్నాడు?

348
00:24:37,120 --> 00:24:39,160
సమర్ ప్రతాప్ నా ఆప్త మిత్రుడు.

349
00:24:39,240 --> 00:24:42,280
ఆయన స్టూడెంట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు.

350
00:24:42,360 --> 00:24:45,840
ఈ యూనివర్శిటీలోనే
ఏడాదిపాటు ఒకే గదిలో ఉన్నాం.

351
00:24:46,360 --> 00:24:48,920
ముక్తిబోద్ హాస్టల్, 214 గది.

352
00:24:49,000 --> 00:24:53,000
దేవకీ నందన్‌గారిపై నేను వ్రాస్తున్న
పుస్తకం గురించి మేము కలిశాము.

353
00:24:54,120 --> 00:24:57,400
ఆయనకు విశాల్ మరణం గురించి చెప్పాను.

354
00:24:57,800 --> 00:25:00,680
ఆయన మిమ్మల్ని కలవాలని అన్నారు.

355
00:25:01,240 --> 00:25:02,160
వెంటనే.

356
00:25:03,880 --> 00:25:05,000
సమర్.

357
00:25:07,480 --> 00:25:09,240
జిగర్ చెప్పినట్టుగా,

358
00:25:09,720 --> 00:25:12,240
ఈ యూనివర్శిటీ నా నిజమైన జన్మ స్థానం.

359
00:25:13,240 --> 00:25:17,800
మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు,
ఎందుకంటే ఇక్కడున్న చాలామంది

360
00:25:18,360 --> 00:25:20,120
నా పార్టీని తిట్టేవాళ్ళే.

361
00:25:21,600 --> 00:25:24,560
ఈ "రైట్," "లెఫ్ట్" ఇవన్నీ విదేశీ అంశాలు.

362
00:25:24,640 --> 00:25:26,120
నిజానికి ఏది ముఖ్యం అంటే,

363
00:25:26,640 --> 00:25:29,000
నిజం కోసం నిలబడడం!

364
00:25:31,120 --> 00:25:32,600
అజాద్ కూడా మీలాంటి వాడే.

365
00:25:33,960 --> 00:25:35,760
కాస్త వామపక్షం వైపు మొగ్గు చూపాడు.

366
00:25:36,640 --> 00:25:39,320
అప్పట్లో 1996లో నా బ్యాచ్‌మేట్.

367
00:25:39,440 --> 00:25:42,600
జిగర్, ఆజాద్, నేను
మేము కాలేజీలో ముగ్గురు హీరోలం.

368
00:25:43,640 --> 00:25:48,840
మేము వేరువేరు పార్టీలలో ఉన్నాం,
కానీ అతను మాట్లాడితే, నన్నూ ఒప్పించేవాడు.

369
00:25:48,920 --> 00:25:52,800
అతని మాటలో నిజాయితీ నిజాన్ని తెలిపేది.

370
00:25:53,440 --> 00:25:55,600
ఈరోజు, నాకు విశాల్ సంగతి చెప్పినప్పుడు,

371
00:25:56,200 --> 00:25:57,760
నాకు అజాద్ గుర్తుకు వచ్చాడు.

372
00:25:59,880 --> 00:26:01,560
అతనిలో ఆ జ్వాల ఉండేది.

373
00:26:01,800 --> 00:26:04,400
అతను రాజకీయాలలో
మార్పు తీసుకురావాలని అనుకున్నాడు.

374
00:26:05,600 --> 00:26:07,040
కానీ అతను చేయగలిగే లోపే,

375
00:26:07,800 --> 00:26:09,080
అతన్ని చంపేశారు.

376
00:26:14,880 --> 00:26:17,800
శ్రీమతి మరియు శ్రీ అవాస్తీ,
క్షమాపణలు కోరుతున్నాను.

377
00:26:19,040 --> 00:26:20,520
ఎందుకంటే...

378
00:26:21,600 --> 00:26:23,480
ఇందుకు మనందరం బాధ్యులం,

379
00:26:23,560 --> 00:26:26,520
విద్యార్థి రాజకీయాలను
ఈ స్థితికి దిగజార్చచాం!

380
00:26:28,240 --> 00:26:30,480
నేను ఇక్కడకు నా పార్టీ తరఫున రాలేదు.

381
00:26:31,840 --> 00:26:33,480
విశాల్ కోసం వచ్చాను.

382
00:26:34,400 --> 00:26:37,080
ఎందుకంటే నిజంవైపు నిలబడే ధైర్యం

383
00:26:37,160 --> 00:26:39,640
అజాద్, విశాల్ లాంటి వారి నుండి వస్తుంది.

384
00:26:48,000 --> 00:26:49,440
విశాల్ నీకోసం మేము పోరాడతాం

385
00:26:57,800 --> 00:26:58,920
మేము పోరాడతాం విశాల్

386
00:27:02,880 --> 00:27:04,040
సమర్.

387
00:27:05,640 --> 00:27:06,960
శివ శేఖర్.

388
00:27:07,480 --> 00:27:09,440
ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు.

389
00:27:10,880 --> 00:27:11,960
హలో, సర్.

390
00:27:12,360 --> 00:27:15,320
-నువ్వు అద్భుతమైన వక్తవు.
-ధన్యవాదాలు, సర్.

391
00:27:16,240 --> 00:27:17,520
శుభాశీస్సులు.

392
00:27:18,000 --> 00:27:20,080
అద్భుతమైన రాజకీయ భవిష్యత్తు కోసం.

393
00:27:20,720 --> 00:27:23,440
లేదు, సర్. నాకు రాజకీయాలలోకి రావాలని లేదు.

394
00:27:23,520 --> 00:27:25,880
-అయితే?
-సివిల్ సర్వీస్, సర్.

395
00:27:27,080 --> 00:27:30,520
మంచి వాళ్ళు సివిల్ సర్వీస్‌లోనూ అలాగే
పార్లమెంట్‌లోనూ కావాలి.

396
00:27:31,480 --> 00:27:34,320
ఒకటే తేడా, ఒకరు ఆదేశాలు తీసుకుంటారు.

397
00:27:34,440 --> 00:27:36,720
మరొకరు ఆదేశాలు ఇస్తారు.

398
00:27:38,240 --> 00:27:39,600
ఇది బాధకరమైనది, కానీ నిజం.

399
00:27:43,160 --> 00:27:45,680
శుభాశీస్సులు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.

400
00:27:57,840 --> 00:27:59,560
ఏం చేయాలని అనుకుంటున్నావు?

401
00:28:02,720 --> 00:28:04,360
అతను బీహార్ వాడు.

402
00:28:04,440 --> 00:28:09,040
పుస్తకాలు ఎంత చదివినా, అతని రక్తంలో
ఉన్నది రాజకీయాలు అన్నది వాస్తవం.

403
00:28:15,440 --> 00:28:17,520
"రైట్"కి చిన్న మలుపు...

404
00:28:18,040 --> 00:28:20,360
అతనిని సరైన మార్గంలో పెడుతుంది.

405
00:28:22,200 --> 00:28:23,360
ఉంటాను.

406
00:28:33,640 --> 00:28:35,920
వీఎన్‌యూ హాస్టల్

407
00:28:36,000 --> 00:28:37,400
ఏం జరిగింది, సనా?

408
00:28:39,400 --> 00:28:41,160
నాకు తెలియదు.

409
00:28:42,640 --> 00:28:44,600
నాకు నిద్ర పట్టడం లేదు.

410
00:28:59,640 --> 00:29:01,680
నాకు చాలా ఆశ్చర్యం వేసింది.

411
00:29:02,920 --> 00:29:04,200
సమర్...

412
00:29:04,800 --> 00:29:06,800
అతను మన దగ్గరకొచ్చి, మనతో మాట్లాడాడు.

413
00:29:08,680 --> 00:29:10,400
అతని గురించి తప్పుగా అనుకున్నాను.

414
00:29:13,040 --> 00:29:14,680
నువ్వూ అక్కడే ఉన్నావుగా.

415
00:29:15,520 --> 00:29:16,760
అతను...

416
00:29:17,960 --> 00:29:19,760
నన్ను చూసి గర్వపడుతున్నానన్నాడు.

417
00:29:24,720 --> 00:29:26,240
ఏదైనా పాట విందాము.

418
00:29:30,280 --> 00:29:32,560
-ఇదిగో. తీసుకో!
-శివ.

419
00:29:33,880 --> 00:29:34,920
ఇదిగో.

420
00:29:35,880 --> 00:29:40,600
నువ్వు నీ ఇంటి పేరు మార్చుకున్నావు,
చేతన్ క్రాంతి.

421
00:29:40,960 --> 00:29:43,240
కానీ నువ్వు చాలా అమాయకుడివి.

422
00:29:44,120 --> 00:29:47,640
ఆ వెధవలు నిన్ను పీకుని తినేస్తారు.
పట్టించుకోరు.

423
00:29:47,720 --> 00:29:49,040
చెప్పింది అర్థమవుతుందా?

424
00:29:51,240 --> 00:29:52,480
జాగ్రత్తగా విను.

425
00:29:53,640 --> 00:29:56,600
మన సమాజ గౌరవం తగ్గకుండా చూడాలి.

426
00:29:58,000 --> 00:29:59,160
మంచిది.

427
00:30:01,360 --> 00:30:03,160
నువ్వు ఇంగ్లిష్ మ్యూజిక్ వింటావా?

428
00:30:04,360 --> 00:30:06,840
ఎందుకు? వినకూడదా?

429
00:30:08,080 --> 00:30:09,280
వినొచ్చు.

430
00:30:09,360 --> 00:30:14,320
ఓహో, అవును. మహా నగరాల్లో నివసించే
కుర్రకారే ఇంగ్లిష్ పాటలు వినాలి.

431
00:30:17,000 --> 00:30:18,520
నేనేమో బీహార్ నుండి వచ్చాను.

432
00:30:18,600 --> 00:30:21,200
ప్రవీణ్, మనీష్
నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు.

433
00:30:21,280 --> 00:30:24,120
బీహార్ వాళ్ళు మొత్తం.
అది శివ వేసిన ప్లాన్.

434
00:30:24,640 --> 00:30:25,960
ఏదేమైనా,

435
00:30:26,360 --> 00:30:28,560
బీహారీలకు ఇంగ్లిష్ పాటలు చాలా ఇష్టం.

436
00:30:31,760 --> 00:30:33,040
అయిఉంటుంది...

437
00:30:34,680 --> 00:30:36,680
కానీ నువ్వు ఆ తరహా వాడివి కాదు.

438
00:30:38,520 --> 00:30:40,000
అంటే ఏంటి?

439
00:30:42,000 --> 00:30:43,280
నీ తరహా అంటే?

440
00:31:01,360 --> 00:31:03,480
నేను నీకో విషయం చెప్పాలి, శివ.

441
00:31:10,640 --> 00:31:12,160
నాలో...

442
00:31:14,040 --> 00:31:15,720
చాలా అంధకారం ఉంది.

443
00:31:17,520 --> 00:31:18,960
అది ఎలా అంటే, నేను...

444
00:31:32,680 --> 00:31:34,520
అతనికి అధ్యక్షుడు కావాలని ఉంది.

445
00:31:34,600 --> 00:31:37,560
అందుకే అతని
దారిలోకి వచ్చిన వారిని చిదిమేస్తున్నాడు.

446
00:31:37,640 --> 00:31:40,320
నువ్వేమో నీ పద్యాలు,
నినాదాల్లో మునిగిపోయావు.

447
00:31:40,400 --> 00:31:45,000
చూడు, వాళ్ళు చాలా తీయగా మాట్లాడతారు,
ఇబ్బందులు ఎదుర్కున్నప్పుడు తెలుస్తుంది.

448
00:31:45,080 --> 00:31:47,200
వాళ్ళని నాశనం చేయాలి లేదా నాశనం అవ్వాలి!

449
00:32:08,080 --> 00:32:09,800
చేతన్‌కు మతిపోయింది.

450
00:32:09,880 --> 00:32:11,920
-నన్ను తలపై కొట్టాడు!
-ఏం జరిగింది?

451
00:32:12,000 --> 00:32:14,200
-నాతో రా.
-రా.

452
00:32:45,680 --> 00:32:46,880
తనను ఎందుకు కొట్టావు?

453
00:32:46,960 --> 00:32:49,600
ఏంటి విషయం?
రోషన్, నీకు బాగా దెబ్బలు తగిలాయా?

454
00:33:01,480 --> 00:33:03,840
నువ్వేగా నాకు వ్యతిరేకంగా
రిపోర్ట్ చేసింది?

455
00:33:04,440 --> 00:33:05,920
చూడు పోలీసులు నన్నేం చేశారో?

456
00:33:08,800 --> 00:33:11,040
రాత్రంతా కొట్టారు, యాదవ నా కొడకా.

457
00:33:12,360 --> 00:33:14,680
ఇప్పుడు నేను మీ పని పడతాను.

458
00:33:22,360 --> 00:33:23,640
చెత్త వెధవలు!

459
00:33:24,160 --> 00:33:25,280
లెగండి!

460
00:33:26,760 --> 00:33:29,000
మీరు ఎందుకు గొడవపడుతున్నారు? ఆపండి!

461
00:33:54,640 --> 00:33:55,480
అమిత్

462
00:34:01,320 --> 00:34:03,040
మీరు అద్భుతం, సర్.

463
00:34:03,120 --> 00:34:04,840
ఇక్కడ రణభూమిలా ఉంది.

464
00:34:05,360 --> 00:34:07,680
ఇక అదనపు నిధులు అవసరం లేదేమో.

465
00:34:07,800 --> 00:34:09,560
-ఏం ఎత్తు వేశారు, సర్.
-మంచిది.

466
00:34:15,960 --> 00:34:18,680
సమర్ ప్రతాప్
ఎస్ఏఐ విద్యార్థులతో మాట్లాడుతూ,

467
00:34:18,800 --> 00:34:22,120
తన వీఎన్‌యూ రోజులు గుర్తుకు చేసుకున్నారు.

468
00:34:27,640 --> 00:34:30,640
నువ్వు ఫిర్యాదు ఇస్తావా? చెత్త వెధవ!

469
00:34:30,680 --> 00:34:34,040
ఇదిగో ఇవ్వు! ఇవ్వు, వెధవ!

470
00:34:43,200 --> 00:34:44,160
సర్...

471
00:34:45,640 --> 00:34:47,520
మనం నరికేసిన తుమ్మ చెట్టుకి...

472
00:34:52,000 --> 00:34:54,160
విత్తనాలు మొలకెత్తాయి.

473
00:34:57,640 --> 00:34:59,040
అతను మన స్నేహితుడు!

474
00:35:00,040 --> 00:35:01,480
విశాల్ మన స్నేహితుడు!

475
00:37:06,600 --> 00:37:08,600
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత

476
00:37:08,640 --> 00:37:10,640
క్రియేటివ్ సూపర్‌వైజర్
నిశాంతి ఈవని
నారు.

