1
00:00:08,843 --> 00:00:11,804
ద సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెట్టీ

2
00:00:15,474 --> 00:00:18,352
చిన్నప్పటి నుంచి కజిన్స్‌లో
సుసన్నా వాళ్ల బీచ్ ఇంటికి

3
00:00:18,436 --> 00:00:20,396
ప్రతి వేసవికి వెళ్లేవాళ్లం.

4
00:00:21,063 --> 00:00:22,773
నేను పుట్టక ముందు నుంచీ.

5
00:00:24,066 --> 00:00:27,486
ఆ ఇంటికి
వెళ్లడానికి రోజులు లెక్కపెట్టుకునేదాన్ని.

6
00:00:30,448 --> 00:00:33,367
నాన్నలు వచ్చేవాళ్లు,
కానీ అది వారి చోటు కాదు.

7
00:00:33,451 --> 00:00:34,910
వాళ్లు దానికి చెందరు.

8
00:00:34,994 --> 00:00:38,247
మేము పిల్లలం, అమ్మలు చెందినట్టుగా కాదు.

9
00:00:48,632 --> 00:00:49,467
ఒకటి...

10
00:00:49,550 --> 00:00:51,927
వేసవి ఇంటితో చాలా ముడి పడి ఉంది.

11
00:00:52,011 --> 00:00:53,053
...మూడు!

12
00:00:54,138 --> 00:00:55,014
బీచ్.

13
00:00:55,097 --> 00:00:56,140
-పదండి!
-వస్తున్నాను.

14
00:01:03,230 --> 00:01:04,315
అర్థమైంది.

15
00:01:08,194 --> 00:01:10,196
రాత్రి సమయాల్లో స్విమ్మింగ్ పూల్.

16
00:01:11,947 --> 00:01:13,616
అమ్మలతో సినిమా రాత్రులు.

17
00:01:17,077 --> 00:01:18,287
కానీ అబ్బాయిలు...

18
00:01:19,163 --> 00:01:20,539
ముఖ్యంగా అబ్బాయిలు.

19
00:01:23,250 --> 00:01:25,002
ప్రతి వేసవిలోనూ అదే.

20
00:01:25,836 --> 00:01:27,755
నాకది ఎప్పుడూ నచ్చేది.

21
00:01:28,380 --> 00:01:30,090
స్టీవెన్!

22
00:01:37,056 --> 00:01:40,351
నాకు జూన్, ఆగస్ట్ నెలల
మధ్యలో జరిగే ప్రతిదీ

23
00:01:40,434 --> 00:01:43,103
బాగుంటుంది, అదో మాయలా ఉంటుంది.

24
00:02:00,371 --> 00:02:03,415
అబ్బాయిలతో మ్యాచ్
మిస్ అవుతున్నావని డ్రూకు బాధగా ఉంది.

25
00:02:03,499 --> 00:02:05,835
సోఫీని నిలకడగా ఆడమని చెప్పు.

26
00:02:06,335 --> 00:02:10,339
డ్రూ మార్టీనెజ్ నీ గురించి మెసేజ్ చేస్తే
నువ్వు వాలీబాల్ అంటున్నావా?

27
00:02:10,422 --> 00:02:12,007
నిజంగానా?

28
00:02:12,091 --> 00:02:15,594
డ్రూకు అనవసరం. నీకు మెసేజ్
చేయాలంటే అతనికి కారణం కావాలి.

29
00:02:16,136 --> 00:02:20,391
నువ్వు ఈ గేమ్‌ను సీరియస్‌గా తీసుకో.
ఇక్కడ పణంగా ఉన్నది టీమ్ పరువు, టేలర్.

30
00:02:20,474 --> 00:02:22,184
నీకు నా గురించి తెలుసు కదా.

31
00:02:22,268 --> 00:02:24,562
నేను ఎప్పుడూ ఒక అబ్బాయి చేతిలో ఓడిపోలేదు.

32
00:02:25,145 --> 00:02:26,981
సర్దడంలో సాయం చేస్తావనుకున్నాను.

33
00:02:27,064 --> 00:02:30,442
సరే. చేస్తాను.
ఒక సలహా. అ స్పీడో తీసుకు వెళ్లకు.

34
00:02:30,985 --> 00:02:33,028
అందులో నీ స్తనాలు ఆకర్షణీయంగా కనిపించవు.

35
00:02:33,654 --> 00:02:34,738
అది స్పీడో కాదు.

36
00:02:34,822 --> 00:02:36,949
నేను అందమైన వాటిని సర్దుకోమంటున్నాను.

37
00:02:37,032 --> 00:02:38,826
నేనక్కడ కొత్తది కొనుక్కోవచ్చులే.

38
00:02:38,909 --> 00:02:41,662
స్విమ్ టీమ్‌లో ఉన్నట్టు
చూపించే దాన్ని కొనకు.

39
00:02:42,079 --> 00:02:43,247
నిజంగా అంటున్నావా?

40
00:02:47,710 --> 00:02:50,045
బెల్లీ. పది నిమిషాల్లో బయలుదేరుతున్నాం.

41
00:02:50,129 --> 00:02:51,755
-నేను వెళ్లాలి.
-కాదు.

42
00:02:51,839 --> 00:02:53,841
-అవును.
-మనకింకా పది నిమిషాలున్నాయి.

43
00:03:00,556 --> 00:03:03,934
నువ్వు వెళ్లే ముందు నాకు
నీ ఈ వేసవి కోరిక ఏమిటో చెప్పాలి.

44
00:03:04,018 --> 00:03:06,645
ఈ వేసవిలో నువ్వేం
కావాలని కోరుకుంటున్నావో.

45
00:03:07,521 --> 00:03:08,355
నాకు తెలీదు.

46
00:03:09,189 --> 00:03:11,483
అబద్ధాల కోరు. నీకు తెలుసు.

47
00:03:11,567 --> 00:03:14,612
కాన్రాడ్ ఫిషర్‌ను
ముద్దు పెట్టుకోవాలని అనుకుంటున్నావు.

48
00:03:14,695 --> 00:03:18,407
నీకతని నాలుక నీ నోట్లో కావాలి, కాదనకు!

49
00:03:18,490 --> 00:03:20,367
-నోరు మూసుకో.
-నేను అంటున్నాను,

50
00:03:20,451 --> 00:03:23,329
పన్నెండేళ్ల నుంచీ
నువ్వతనితో ప్రేమలో ఉన్నావు.

51
00:03:23,871 --> 00:03:25,456
ఈ విషయంలో సమయం వృథా చేశావు.

52
00:03:25,915 --> 00:03:30,419
ఒకటి, అది చెత్త.
రెండు, నేనేం చేస్తానన్నది అనవసరం.

53
00:03:30,502 --> 00:03:33,380
-అతను నన్నలా చూడడు.
-అతను నిన్నలా చూస్తాడు,

54
00:03:33,756 --> 00:03:35,507
కావాలనుకున్నా, వద్దనుకున్నా.

55
00:03:35,591 --> 00:03:38,510
నువ్వు పోయిన వేసవి కన్నా
ఈసారి చాలా వేరుగా ఉన్నావు.

56
00:03:41,347 --> 00:03:43,724
నాకీ డ్రైవ్ ఇష్టం. ఈ క్షణం.

57
00:03:43,807 --> 00:03:47,144
చాలా కాలం ఇంటికి
దూరంగా ఉన్న తరువాత ఇంటికి వస్తున్నట్టు.

58
00:03:49,772 --> 00:03:54,401
ఆమె జుట్టు,
అందరూ కంగారు పడుతున్నారు

59
00:03:54,485 --> 00:03:56,987
నేను నిన్ను వెళ్లనివ్వలేను

60
00:03:57,071 --> 00:04:00,783
అందుకని నా అభద్రతను చంపుకుని

61
00:04:03,702 --> 00:04:07,414
నువ్వింతకన్నా బాగా చెయ్యలేవు

62
00:04:10,876 --> 00:04:14,588
నువ్వింతకన్నా బాగా చెయ్యలేవు

63
00:04:15,255 --> 00:04:17,883
-సౌండ్ తగ్గిస్తారా, ప్లీజ్?
-అవును, ప్లీజ్.

64
00:04:17,967 --> 00:04:18,801
ధన్యవాదాలు.

65
00:04:18,884 --> 00:04:21,637
ఈ వేసవిలో నువ్వు కొంచెం
పనులు బాగా చెయ్యాలి.

66
00:04:21,720 --> 00:04:24,974
గిన్నెలు సింకులో వదిలేయకు.
వాటిని డిష్ వాషర్‌లో పెట్టు.

67
00:04:25,057 --> 00:04:27,142
నీ ఒక్కడివి మాత్రమే కాదు, స్టీవెన్.

68
00:04:27,226 --> 00:04:29,019
-కానీ...
-మంచి అతిథిలా ఉండు.

69
00:04:29,103 --> 00:04:32,481
అమ్మా, సుసన్నాకు
గిన్నెలు కడిగేవాళ్లు ఉన్నారు, కదా?

70
00:04:32,564 --> 00:04:33,524
స్టీవెన్!

71
00:04:35,359 --> 00:04:37,069
సరే, క్షమించు.

72
00:04:37,403 --> 00:04:39,196
అమ్మ డబ్బు విషయంలో వింతగా ఉంటుంది.

73
00:04:39,613 --> 00:04:42,324
సుసన్నా ధనవంతురాలు,
మేమంత కాదన్న విషయం నిజం.

74
00:04:42,408 --> 00:04:45,911
మంచిగా ఉండండి,
మీ పెంపకం బాగుందన్నట్టు ప్రవర్తించండి.

75
00:04:45,995 --> 00:04:48,205
స్టీవెన్, రాత్రి ఎక్కువ సేపు
బయట ఉండకూడదు.

76
00:04:48,288 --> 00:04:50,499
అమ్మా, నేను కర్ఫ్యూకు పెద్దవాడిని అయ్యాను.

77
00:04:50,582 --> 00:04:53,168
నా సంగతి ఏంటి?
నాకు కూడా కర్ఫ్యూ లేదు కదా?

78
00:04:53,252 --> 00:04:56,130
నీకు కర్ఫ్యూ ఎందుకు కావాలి?
నువ్వు ఎక్కడికి వెళ్లావు.

79
00:04:56,213 --> 00:04:58,298
-వెధవలా మాట్లాడకు, స్టీవెన్.
-ఏంటి?

80
00:04:58,382 --> 00:05:00,968
బెల్లీ, మనమది
సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం.

81
00:05:02,094 --> 00:05:04,096
నాకు డ్రైవింగ్ నేర్పిస్తానన్నావు.

82
00:05:04,179 --> 00:05:06,056
బెల్లీ, నేను నేర్పిస్తానన్నాను కదా.

83
00:05:06,932 --> 00:05:09,059
అవును, కానీ అభిప్రాయం ఏర్పరచుకుంటావు.

84
00:05:09,143 --> 00:05:11,562
-ఏంటి?
-అవును. క్షమించు.

85
00:05:30,706 --> 00:05:31,665
హేయ్.

86
00:05:32,666 --> 00:05:34,793
స్కూల్లో అబ్బాయిలు అసలు నా వైపు చూడరు.

87
00:05:35,294 --> 00:05:37,087
వాళ్లు టైలర్ వైపే చూస్తారు.

88
00:05:37,171 --> 00:05:40,716
నేను అక్కడ అలా ఉంటానంతే.

89
00:05:44,470 --> 00:05:46,180
ఈ వేసవికి కొత్తగా వచ్చారా?

90
00:05:47,014 --> 00:05:48,265
నేనా? కాదు.

91
00:05:48,932 --> 00:05:49,850
నిజంగా?

92
00:05:52,019 --> 00:05:54,354
కజిన్స్‌లో అందమైన అమ్మాయిలు
నాకు తెలుసు.

93
00:05:55,773 --> 00:05:58,734
రాత్రికి బాన్‌పైర్‌కు వస్తున్నావా?
ఈ వేసవికి మొదటిది.

94
00:05:58,817 --> 00:06:00,152
ఏమో.

95
00:06:00,235 --> 00:06:02,654
రా. నా స్నేహితులకు పరిచయం చేస్తాను.

96
00:06:03,363 --> 00:06:04,531
బహుశా వస్తానేమో.

97
00:06:05,282 --> 00:06:07,618
నాతో వేల్ ఆఫ్ ఎ టేల్‌కు వస్తావా,

98
00:06:07,701 --> 00:06:10,204
నేను సంతకాలకు ముందు
అక్కడ ఎన్నున్నాయో చూడాలి?

99
00:06:10,996 --> 00:06:15,292
నేనక్కడ సంతకాలు చేసేటప్పుడు
నువ్వు నా ఒళ్లో కూర్చునేదానివి, గుర్తుందా?

100
00:06:15,375 --> 00:06:18,087
సంతకం చేసిన ప్రతి పుస్తకం మీద
సొరచేప బొమ్మ గీసావు.

101
00:06:18,170 --> 00:06:20,089
లేదు, నాకది గుర్తులేదు.

102
00:06:21,423 --> 00:06:23,383
నేనది తీసుకుంటాను. ధన్యవాదాలు.

103
00:06:23,467 --> 00:06:24,635
నీతో ఒక డీల్ చేస్తాను.

104
00:06:24,718 --> 00:06:28,097
నాకు తోడుగా వస్తే,
రాత్రికి నీకు కావాల్సిన డిజర్ట్ తిందాము.

105
00:06:28,180 --> 00:06:29,890
-తరువాత కలుస్తానా?
-తరువాత ఏంటి?

106
00:06:29,973 --> 00:06:31,100
ఏం లేదు.

107
00:07:03,590 --> 00:07:07,094
కజిన్స్ బీచ్‌లోకి ప్రవేశిస్తున్నారు

108
00:07:07,177 --> 00:07:09,096
అదే వాసన.

109
00:07:09,930 --> 00:07:11,598
అదే రుచి.

110
00:07:13,267 --> 00:07:15,978
నేను రావడం కోసం ఎదురు చూస్తున్నట్టు.

111
00:07:45,674 --> 00:07:46,925
వాళ్లు వచ్చేశారు!

112
00:07:48,343 --> 00:07:49,261
బెక్ ఇల్లు

113
00:07:49,970 --> 00:07:51,221
ఎలా ఉన్నావు?

114
00:07:51,305 --> 00:07:52,848
హాయ్! అబ్బా!

115
00:07:53,182 --> 00:07:54,141
హలో!

116
00:07:55,976 --> 00:07:58,103
-చూసి చాలా కాలమైంది!
-కలిసినందుకు సంతోషం!

117
00:07:58,187 --> 00:08:00,606
-హాయ్!
-నిన్ను మిస్ అయ్యాను!

118
00:08:01,106 --> 00:08:04,443
-నిన్ను కలవడం బాగుంది!
-నువ్వు జిమ్‌కు వెళ్తున్నావా?

119
00:08:04,526 --> 00:08:05,652
నిజంగా?

120
00:08:09,031 --> 00:08:10,032
హాయ్.

121
00:08:10,991 --> 00:08:13,744
-బాగా ఎదిగిపోయిన ఎవరొచ్చారో చూడండి.
-హాయ్!

122
00:08:13,827 --> 00:08:17,080
-నన్ను దించు!
-జెర్, ఇలా రా.

123
00:08:17,164 --> 00:08:18,123
రా.

124
00:08:41,480 --> 00:08:43,398
నువ్వు కళ్లద్దాలతోనే బాగున్నావు.

125
00:08:45,609 --> 00:08:47,986
అయ్యో. నేనవి లేకపోతేనే బాగున్నాను.

126
00:08:51,490 --> 00:08:54,243
సరే. హే, వినండి...

127
00:08:55,327 --> 00:08:58,121
-అంటే నాకు మీ గురించి తెలీదు కానీ, నేను...
-అది...

128
00:08:58,372 --> 00:09:03,418
-ఇప్పుడు బెల్లీ ఫ్లాప్ చేసే సమయం!
-బెల్లీ ఫ్లాప్‌కు!

129
00:09:13,011 --> 00:09:14,179
బెల్లీ ఫ్లాప్!

130
00:09:16,515 --> 00:09:19,059
ఇక్కడే. సరే. సిద్ధమా?

131
00:09:19,142 --> 00:09:22,187
ఒకటి! రెండు!

132
00:09:22,688 --> 00:09:23,855
మూడు!

133
00:09:27,067 --> 00:09:28,277
నీళ్లు ఎలా ఉన్నాయి?

134
00:09:29,736 --> 00:09:31,280
నా మడమ నొప్పిగా ఉంది.

135
00:09:32,030 --> 00:09:33,156
రా.

136
00:09:38,787 --> 00:09:39,788
బెల్లీ!

137
00:09:49,298 --> 00:09:50,424
పద.

138
00:10:02,311 --> 00:10:03,895
అబ్బా, లారెల్!

139
00:10:03,979 --> 00:10:06,940
ఎన్ని బాక్సులు తెచ్చావు?
నిన్ను తేవద్దన్నాను కదా.

140
00:10:07,024 --> 00:10:09,359
నీ ఫాన్సీ మార్కెట్లో డైట్ కోక్ ఉండదు.

141
00:10:11,278 --> 00:10:14,281
-హాయ్.
-నువ్వు ఇళ్లంతా నీళ్లు కారుస్తున్నావు.

142
00:10:14,364 --> 00:10:15,282
లారెల్...

143
00:10:15,365 --> 00:10:17,200
అది అందంగా ఉంది.

144
00:10:17,284 --> 00:10:18,618
ధన్యవాదాలు.

145
00:10:19,661 --> 00:10:23,790
నువ్వు ఎప్పుడూ అందంగా ఉన్నావు,
కానీ, తల్లీ, ఇప్పుడు చాలా బాగున్నావు.

146
00:10:23,874 --> 00:10:25,709
నేను అలానే ఉన్నాను.

147
00:10:25,792 --> 00:10:27,336
అలా లేనే లేవు.

148
00:10:27,919 --> 00:10:29,046
నువ్వు ఎదుగుతున్నావు.

149
00:10:31,006 --> 00:10:32,257
వికసిస్తున్నావు.

150
00:10:32,841 --> 00:10:36,720
సుసన్నాలో తను చెప్పే విషయాలు
నేను నమ్మే విధంగా చెప్పే కళ ఉంది.

151
00:10:36,803 --> 00:10:38,555
లార్, తను అచ్చు నీలానే ఉంది.

152
00:10:38,638 --> 00:10:40,432
అందరూ మా నాన్నలా ఉంటానంటారు.

153
00:10:40,515 --> 00:10:42,642
మీ అమ్మను కలిసినప్పుడు తను నీలానే ఉంది.

154
00:10:42,726 --> 00:10:45,896
-కాకపోతే నాకు వక్షాలు లేవు.
-అబ్బా, అమ్మా.

155
00:10:48,440 --> 00:10:51,151
మీ నాన్నకు ఫోన్ చేసి
సురక్షితంగా చేరామని చెప్పు.

156
00:10:51,234 --> 00:10:53,320
అది స్టీవెన్‌కు ఎందుకు చెప్పవు?

157
00:10:53,403 --> 00:10:56,323
నీకు చెప్పాను కదా.
నువ్వు లేకపోతే నిన్ను మిస్ అవుతారు.

158
00:10:56,406 --> 00:11:00,410
-మనల్ని వేసవి చివర్లో కలుస్తారు కదా.
-ఆయన నాలుగో తారీఖున వస్తారు.

159
00:11:00,494 --> 00:11:03,163
-ఇక్కడికి వస్తున్నారా?
-ఎప్పుడూ నాలుగుకు వస్తారు కదా/

160
00:11:03,246 --> 00:11:05,499
ఆయన పోయిన వేసవిలో రాలేదు కదా.

161
00:11:05,582 --> 00:11:08,794
మేమప్పుడే విడాకులు తీసుకున్నాము.
ఇప్పుడు బాగానే ఉన్నాము.

162
00:11:09,836 --> 00:11:11,088
మి. ఫిషర్ ఎక్కడున్నారు?

163
00:11:11,838 --> 00:11:13,131
లండన్‌లో ఉన్నాడు.

164
00:11:13,215 --> 00:11:15,425
వాళ్లు అటూ, ఇటూ తిప్పిస్తున్నారు.

165
00:11:15,509 --> 00:11:17,511
వేసవి ముగిసేలోపు వస్తాడు.

166
00:11:17,594 --> 00:11:21,306
ప్రస్తుతానికి, మనం అమ్మాయిలం, పిల్లలం,
మనకు నచ్చినట్టు, అంతే.

167
00:11:38,615 --> 00:11:39,866
హే, జూనియర్ మింట్.

168
00:11:43,370 --> 00:11:45,580
నీ దగ్గర ఇంకా ఆ బొమ్మ ఉందంటే నమ్మలేను.

169
00:11:45,664 --> 00:11:48,166
ఆ. నేను జూనియర్ మింట్‌ను ఎప్పుడూ పడేయను.

170
00:11:48,250 --> 00:11:50,794
రా. భోజనానికి ముందు ఈతకు వెళ్దాం, ప్లీజ్.

171
00:11:51,878 --> 00:11:55,006
నేను రాలేను.
అమ్మతో వేల్ ఆఫ్ ఎ టేల్‌కు వెళ్లాలి.

172
00:11:55,090 --> 00:11:58,927
నేను రోజంతా సముద్రంలో ఉండాలనుకున్నాను,
నీ కోసమే ఎదురు చూస్తున్నాను.

173
00:12:00,387 --> 00:12:01,638
ప్లీజ్.

174
00:12:01,721 --> 00:12:04,850
ప్లీజ్, దయచేసి రావా!

175
00:12:06,143 --> 00:12:08,645
సరే, వదిలేయ్. పద ఈతకు వెళ్దాం.

176
00:12:08,728 --> 00:12:10,981
అవును! నిన్ను బయట కలుస్తాను, సరేనా?

177
00:12:11,064 --> 00:12:12,607
సరే. కిందకు వస్తాను.

178
00:12:19,781 --> 00:12:20,949
నేను ఇప్పుడే వస్తాను.

179
00:12:21,032 --> 00:12:22,409
ఊర్లోకి వెళ్తున్నావా?

180
00:12:22,492 --> 00:12:25,203
బెల్లీ, నేను వేల్ ఆఫ్ ఏ టేల్‌కు
వెళదామనుకున్నాము,

181
00:12:25,287 --> 00:12:27,372
కానీ ఈతకు వెళ్లడం కోసం నాతో రానంది.

182
00:12:27,456 --> 00:12:30,542
నేను నీతో వస్తాను.
కానీ ముందు కంట్రీ క్లబ్బులో ఆగాలి.

183
00:12:30,625 --> 00:12:31,668
కంట్రీ క్లబ్బా?

184
00:12:31,751 --> 00:12:34,171
అబ్బా. పోనీలే. నేనే వెళ్తాను.

185
00:12:34,254 --> 00:12:37,048
-నీ పార్టీకి కేటరింగ్ కోసం.
-కేటరింగా?

186
00:12:37,132 --> 00:12:40,719
నువ్వు కేవలం
కొన్ని బాటిల్స్ వైన్ అన్నావు కదా.

187
00:12:40,802 --> 00:12:43,472
కొన్ని అపిటైజర్లు అంతే. శాంతించు.

188
00:12:43,555 --> 00:12:46,183
నువ్వు లోపలికి రావక్కర్లేదు.
కారులో ఉండవచ్చు.

189
00:12:46,266 --> 00:12:47,642
సరే.

190
00:13:12,042 --> 00:13:13,001
తొందరగా రా.

191
00:13:13,084 --> 00:13:16,338
నన్నక్కడ ఎక్కువ సేపు వదిలేస్తే
నాకు పిచ్చెక్కిపోతుంది!

192
00:13:22,093 --> 00:13:23,303
రా.

193
00:13:24,054 --> 00:13:25,472
సరే, నేను రెడీ.

194
00:13:30,560 --> 00:13:34,231
హే, మా నాన్న నాలుగో తారీఖున
వస్తున్నారని నీకు తెలుసా?

195
00:13:34,314 --> 00:13:35,315
బాగుంది.

196
00:13:35,649 --> 00:13:38,568
-అది నీకు వింతగా లేదా?
-లేదు, నాకు మీ నాన్న ఇష్టం.

197
00:13:38,652 --> 00:13:41,238
విడాకులు తీసుకుని ఏడాదిన్నరే అయింది.

198
00:13:41,321 --> 00:13:44,324
అదే మీ అమ్మ గొప్పతనం,
ఆమె ఏదీ పట్టించుకోదు.

199
00:13:44,407 --> 00:13:48,912
అవును. ఆమెకు విడాకులు కావాలి
కాబట్టి ఇంకేదీ పట్టించుకోదు.

200
00:13:48,995 --> 00:13:52,082
పెళ్లి చేసుకోవాలని లేకపోతే
పెళ్లి చేసుకోవు, అంతే.

201
00:13:52,165 --> 00:13:53,792
అది మా నానమ్మకు చెప్పు.

202
00:13:53,875 --> 00:13:56,503
మా అమ్మ చెప్పినప్పుడు
ఆమె కుప్పకూలిపోయింది.

203
00:13:57,337 --> 00:14:00,173
తెలుసా, మా నాన్నకు అప్పుడే
కొత్త గర్ల్ ఫ్రెండ్ ఉంది?

204
00:14:00,882 --> 00:14:03,510
మీ అమ్మ సంగతి ఏంటి?
ఎవరినైనా డేట్ చేస్తోందా?

205
00:14:03,593 --> 00:14:04,719
లేదు.

206
00:14:05,512 --> 00:14:06,972
ఆయన గడ్డం పెంచుతున్నారు.

207
00:14:07,305 --> 00:14:09,266
-మీ నాన్న గడ్డం పెంచుతున్నారా?
-అవును.

208
00:14:09,349 --> 00:14:11,309
అది తనకు అందంగా ఉంటుందట.

209
00:14:11,393 --> 00:14:12,519
అవునా?

210
00:14:13,144 --> 00:14:14,229
కొంచెం.

211
00:14:16,898 --> 00:14:18,692
దీని కోసం ఏడాదంతాా ఎదురు చూశాను.

212
00:14:19,150 --> 00:14:20,569
రేస్ చేద్దామా?

213
00:14:21,069 --> 00:14:22,696
-నేను చెయ్యలేను.
-అబ్బా!

214
00:14:22,779 --> 00:14:25,323
నీ కాళ్లు పొడుగ్గా ఉన్నాయి.
నేను చెయ్యలేను.

215
00:14:26,241 --> 00:14:28,285
-అది మంచి ఆరంభం.
-మోసగత్తె!

216
00:14:50,265 --> 00:14:53,435
-మీ పార్టీకి అంతా రెడీగా ఉంది.
-అద్భుతం. ధన్యవాదాలు.

217
00:14:53,518 --> 00:14:57,063
-టూర్ ఎలా జరిగింది?
-నేను దీనికి టూర్ మీద వెళ్లలేదు.

218
00:14:57,147 --> 00:14:58,690
ఇది హంగూ ఆర్భాటం లేని విడుదల.

219
00:14:59,232 --> 00:15:00,150
అయ్యో.

220
00:15:00,233 --> 00:15:03,111
నువ్వు సోషల్ మీడియాలో ఉన్నావా?
నువ్వు ఉండాలి.

221
00:15:03,194 --> 00:15:05,447
నేను లేను.

222
00:15:05,530 --> 00:15:08,074
-కొత్తదాని మీద పని చేస్తున్నావా?
-ఎప్పుడూ.

223
00:15:08,158 --> 00:15:10,327
రేపటికి ఎన్ని కాపీలు ఆర్డర్ చేశావు?

224
00:15:10,410 --> 00:15:13,246
-ఇరవై అనుకుంటాను.
-అవి సరిపోవు.

225
00:15:13,330 --> 00:15:17,000
-నేను సగం ఊరిని పిలిచాను.
-ఇది చిన్నగా ఉంటుందన్నావు.

226
00:15:17,083 --> 00:15:21,087
మీకా, ఏదో ఒక రోజు నువ్వు
పెద్ద ప్రచురణకర్తవు అవుతావు.

227
00:15:21,171 --> 00:15:24,007
పెద్దగా గిరాకీ లేదు.
ఎక్కువ స్టాక్ ఉంచుకోలేదు.

228
00:15:24,090 --> 00:15:27,093
దీని సంగతి ఏంటి?
దీనివి వంద కాపీలు ఉండుంటాయి.

229
00:15:27,177 --> 00:15:29,846
జోనాథన్ ఫ్రాన్జేన్ కు.
క్లీవ్‌ల్యాండ్ కాస్టిలో కాపీ.

230
00:15:29,929 --> 00:15:31,765
క్లీవ్‌ల్యాండ్ కాస్టిలో నకిలీ పేరు.

231
00:15:31,848 --> 00:15:34,684
"హాయ్, నేను మగవాడిని
కానీ మేధావిని" అన్నట్టు ఉంటుంది.

232
00:15:34,768 --> 00:15:39,022
హెమింగ్వే అతని హీరో అంటాను.
అంచున్న కళ్లద్దాలు ఖాయంగా పెట్టుకుంటాడు.

233
00:15:39,105 --> 00:15:40,357
అవును. చూశావా?

234
00:15:43,026 --> 00:15:45,445
అవును, లెన్స్‌లతో
నా కళ్లకు మంటగా ఉంటుంది.

235
00:15:49,491 --> 00:15:51,660
వీడ్కోలు, క్లీవ్‌ల్యాండ్.

236
00:15:52,327 --> 00:15:55,664
అది అతనే. ఈ వేసవికి
బర్క్ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.

237
00:15:56,706 --> 00:15:58,166
ఆ ఇల్లు బాగుంటుంది.

238
00:15:58,917 --> 00:15:59,959
క్షమించండి.

239
00:16:05,256 --> 00:16:08,802
నువ్వా ఫోన్ కేసి మళ్లీ చూస్తే
అది బుట్టలోకి వెళ్తుంది.

240
00:16:08,885 --> 00:16:12,764
మేము మీ అందమైన ముఖాలు చూడాలి.
భోజన సమయం స్క్రీన్ చూడని సమయం కావచ్చా?

241
00:16:12,847 --> 00:16:14,808
పాత రోజుల్లోలా.

242
00:16:15,642 --> 00:16:18,478
-స్టీవెన్.
-ఏంటి, ఊరికే అంటున్నావా?

243
00:16:18,561 --> 00:16:20,438
బూమ్! బాగా చేశాను!

244
00:16:20,522 --> 00:16:22,732
మాకర్థమైంది! ఎక్సర్‌సైజ్ చేస్తున్నావని.

245
00:16:22,816 --> 00:16:25,652
నీ కన్నా జెర్ శరీరం
బాగుందని నీకు అసూయగా ఉంది.

246
00:16:26,403 --> 00:16:30,365
అందరూ సన్నగా ఉండాలనుకుంటున్నారు.
లేకపోతే, కుట్టిన సూట్లు వేసుకోలేరు.

247
00:16:30,448 --> 00:16:31,825
అవును, తప్పకుండా.

248
00:16:31,908 --> 00:16:32,909
కుట్టిన సూట్లు.

249
00:16:32,992 --> 00:16:34,994
ట్రైనింగ్ క్యాంప్‌కు ఎప్పుడు వెళ్లాలి?

250
00:16:36,621 --> 00:16:38,206
వాడు ఫుట్‌బాల్ మానేశాడు.

251
00:16:41,960 --> 00:16:43,086
నిజంగా, మానేశావా?

252
00:16:44,546 --> 00:16:47,757
-కాలేజ్ బాల్ ఆడడానికి ఏమైనా చేస్తాను.
-వాడి మనసు మారొచ్చు.

253
00:16:47,841 --> 00:16:51,428
నాది మారదు. అయినా సీజన్ అంతా
బెంచ్ మీదే కూర్చుంటాను.

254
00:16:51,511 --> 00:16:55,098
నువ్వు ఫుట్‌బాల్ ఆడకపోతే,
వేసవి అంతా ఏం చేస్తావు?

255
00:16:55,181 --> 00:16:58,435
నువ్వు నాతో, జెర్‌తో
క్లబ్బులో పని చేయచ్చు.

256
00:16:58,518 --> 00:17:01,396
-నేను క్లబ్బులో పని చేయను.
-మీరు పని చేస్తున్నారా?

257
00:17:01,479 --> 00:17:04,482
నేను లైఫ్ గార్డ్ని,
స్టీవెన్ స్నాక్ షాక్‌లో చేస్తున్నాడు.

258
00:17:06,735 --> 00:17:08,486
బెల్లీ, నేను దాదాపు మర్చిపోయాను.

259
00:17:09,446 --> 00:17:10,947
నీ కోసం ఒక సర్‌ప్రైజ్.

260
00:17:12,615 --> 00:17:15,410
ఇందుకనే నువ్వు కంట్రీ క్లబ్ దగ్గర ఆగాలి.

261
00:17:15,493 --> 00:17:18,163
అదేంటి?

262
00:17:18,246 --> 00:17:21,082
డెబ్యుటాంటేగా బెల్లీకి
ఆహ్వానం కోసం అడిగాను.

263
00:17:21,166 --> 00:17:24,919
అమ్మాయిలు తెల్ల డ్రెస్ వేసుకుని,
వంగి నమస్కారం చేసేది అందులోనేనా?

264
00:17:25,003 --> 00:17:28,381
వయసు వచ్చిన అమ్మాయిలను
సమాజానికి అక్కడే పరిచయం చేస్తారు.

265
00:17:28,465 --> 00:17:30,508
వినడానికి బాగాలేదు,
కానీ అది బాగుంటుంది.

266
00:17:30,592 --> 00:17:34,012
ఇందులో పాల్గొనడానికి
న్యూ ఇంగ్లాండ్ అంతటి నుంచీ వస్తారు.

267
00:17:34,095 --> 00:17:35,638
కొత్త స్నేహాలు కలుస్తాయి.

268
00:17:35,722 --> 00:17:38,516
నువ్వు ఈ పిచ్చి కలను
కంటున్నావంటే నమ్మలేను.

269
00:17:38,600 --> 00:17:42,604
అప్పట్లో అది భర్త కోసం,
కానీ ఇప్పుడది నెట్‌వర్కింగ్ కోసం చేస్తారు.

270
00:17:42,687 --> 00:17:46,024
అవి నాయకత్వ లక్షణాలు,
నిన్ను చూపించుకోవడం నేర్పిస్తాయి.

271
00:17:46,107 --> 00:17:48,568
చారిటీకి కూడా లాభమే.
బ్యాట్ మిట్జ్వాలా.

272
00:17:48,651 --> 00:17:50,320
అది బ్యాట్ మిట్జ్వాలా ఉండదు.

273
00:17:50,403 --> 00:17:53,406
ఒక డెబ్యుటాంటే బాల్‌లో
మతపరమైంది ఏమీ లేదు.

274
00:17:53,490 --> 00:17:56,075
ఇదంతా చెత్త. అది గొర్రెల కోసం.

275
00:17:56,159 --> 00:17:57,994
-అవును.
-కాదు, అలా కాదు.

276
00:17:58,077 --> 00:17:59,662
ఒకమ్మాయి వయసుకు వచ్చినప్పుడు,

277
00:17:59,746 --> 00:18:02,332
పరిపక్వం చెందిందని
సమాజానికి తెలిపే గుర్తింపు.

278
00:18:04,083 --> 00:18:07,086
-నన్ను క్షమించు. ఏంటి. పరిపక్వతా?
-అవును.

279
00:18:07,170 --> 00:18:08,421
బెల్లీ?

280
00:18:08,505 --> 00:18:11,382
పిల్లి అంత్యక్రియలు చేశావు.
నల్ల దుస్తులు వేసుకున్నాం.

281
00:18:11,466 --> 00:18:14,052
ఆపు, స్టీవెన్.
నువ్వు గదిలో ఏడవడం చూశాను.

282
00:18:14,135 --> 00:18:16,679
ఆగు, మోచీ చచ్చిపోయిందా?
అబ్బా, అయ్యో, బెల్స్.

283
00:18:16,763 --> 00:18:20,058
బెల్లీ. నీకు బాగా తయారవ్వాలని లేదా?

284
00:18:21,059 --> 00:18:25,146
బెల్లీకి అలాంటివి నచ్చవు.
అది మన వీధి పిల్లిలాంటిది.

285
00:18:28,191 --> 00:18:29,359
"వీధి పిల్లి."

286
00:18:30,568 --> 00:18:33,029
-నేను ఆలోచిస్తాను.
-దాని గురించి ఆలోచిస్తుంది.

287
00:18:34,656 --> 00:18:40,119
ఓహ్, అమ్మాయ్, అది నువ్వే

288
00:18:41,913 --> 00:18:46,751
నేను పడుకునేది

289
00:18:46,835 --> 00:18:52,507
ఆటం బాంబు

290
00:18:52,590 --> 00:18:55,343
పేలే ముందు

291
00:18:55,760 --> 00:18:59,681
ఓహ్, అమ్మాయ్, అది నువ్వే

292
00:18:59,764 --> 00:19:02,809
నేను టీవీ చూసేది

293
00:19:02,892 --> 00:19:04,894
-రాత్రి ఈతకా?
-ఆ, అవును.

294
00:19:04,978 --> 00:19:07,605
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతమంది
ఫాలోవర్లు ఉంటే ఎక్కువ?

295
00:19:07,689 --> 00:19:10,650
అది వెరిఫై అయిన వాళ్లా, అవని వాళ్లా?

296
00:19:10,733 --> 00:19:13,319
-"వెరిఫైడ్" అంటే?
-అబ్బా, అమ్మా.

297
00:19:14,904 --> 00:19:17,323
టేలర్ వాళ్ల నాన్న
ఒక పుస్తకం చదువుతున్నాడు.

298
00:19:18,408 --> 00:19:22,871
నూట యాభై వేల ఫాలోవర్లు చాలా ఎక్కువ.
అదీ ఒక రచయితకు.

299
00:19:22,954 --> 00:19:24,289
సరే, ధన్యవాదాలు.

300
00:19:44,767 --> 00:19:49,105
డ్రగ్స్ వాడితే అది మెదడు సమాచారం
ప్రాసెస్ చేసే విధానం మారుస్తుందన్నావు.

301
00:19:49,188 --> 00:19:51,107
నీ సెల్ ఫోన్ కూడా అదే చేస్తుంది.

302
00:20:07,290 --> 00:20:09,626
గంజాయి మన మెదడును
పాడు చేస్తుందని చెప్పావు.

303
00:20:11,044 --> 00:20:12,837
అసలదంటే ఏంటో నీకు తెలుసా?

304
00:20:12,921 --> 00:20:15,798
మన మెదళ్లు ఇంకా అభివృద్ధి...

305
00:20:15,882 --> 00:20:18,551
నేను చెప్పినదంతా నువ్వు బట్టీ కొడతావా?

306
00:20:21,012 --> 00:20:22,722
నీ గురించి అంతగా అనుకోకు.

307
00:20:31,105 --> 00:20:34,317
కాన్రాడ్, పొగ తాగడం మంచిది కాదు,
నిజమైన క్రీడాకారులు

308
00:20:34,400 --> 00:20:37,278
తమ శరీరాలకు చెత్త ఇవ్వరని
చెప్పింది నువ్వే కదా.

309
00:20:37,362 --> 00:20:38,905
నేను చాలా చెప్పాను.

310
00:20:39,238 --> 00:20:41,699
నేను ఇక క్రీడాకారుడిని కాదు, అందుకని...

311
00:20:43,409 --> 00:20:45,870
అయినా కూడా నువ్వు మానేయాలనుకుంటాను.

312
00:20:51,209 --> 00:20:53,086
నేను మానేస్తే నాకు ఏమిస్తావు?

313
00:21:00,802 --> 00:21:03,471
ఏమీ ఇవ్వను. నువ్వు నీ కోసం మానెయ్యాలి.

314
00:21:12,355 --> 00:21:15,024
ఈ డెబ్యుటాంటేది
ఎందుకు చెయ్యాలనుకుంటున్నావు?

315
00:21:16,025 --> 00:21:17,318
ఏమో.

316
00:21:17,402 --> 00:21:21,197
నాకు చేయడానికి వేరే ఏమీ లేదు.

317
00:21:21,280 --> 00:21:22,615
కానీ అది నువ్వు కాదు.

318
00:21:23,825 --> 00:21:27,870
మా అమ్మకు కూతురు లేదని
నిన్ను బొమ్మలా వాడుకోనివ్వకు.

319
00:21:28,496 --> 00:21:29,664
నాకు బాగానే ఉంది.

320
00:21:30,331 --> 00:21:32,583
ఆమె కూతురినైతే బాగుండేదనిపిస్తుంది.

321
00:21:33,084 --> 00:21:35,586
నువ్వు లారెల్‌తోనే బాగున్నావు,
నన్ను నమ్ము.

322
00:21:38,548 --> 00:21:40,550
నువ్వలా ఎందుకున్నావు?

323
00:21:45,263 --> 00:21:47,390
-నేను లేను.
-నాకు నీ గురించి తెలుసు.

324
00:21:47,765 --> 00:21:49,600
అంటే, ఏదో అవుతోంది.

325
00:21:50,893 --> 00:21:52,145
నాకు చెప్పు.

326
00:21:56,858 --> 00:21:58,317
బెల్లీ...

327
00:21:59,402 --> 00:22:01,362
వేసవి మొట్టమొదటి బాన్‌ఫైర్!

328
00:22:02,989 --> 00:22:06,534
నా కార్ తీసుకెళ్తున్నాము.
నువ్వు డ్రైవ్ చేయట్లేదు.

329
00:22:06,617 --> 00:22:08,703
రా, మేము వెళ్తున్నాం. నువ్వు రెడీనా?

330
00:22:08,786 --> 00:22:10,788
-నేనూ రావచ్చా?
-లేదు.

331
00:22:10,872 --> 00:22:13,249
అమ్మలు నీకు
సినిమా రాత్రి పెడుతున్నారు.

332
00:22:15,334 --> 00:22:16,586
బై.

333
00:22:16,669 --> 00:22:18,129
పద వెళ్దాం, నత్త నడక.

334
00:22:19,213 --> 00:22:21,758
అమ్మలతో సరదాగా గడుపు!

335
00:22:33,603 --> 00:22:36,647
-బ్రౌనీలు ఓవెన్‌లోకి వెళ్తున్నాయి.
-డీవీడీ పెడదాం.

336
00:22:37,273 --> 00:22:39,609
మనం వేరేది ఏమైనా చేద్దామా?

337
00:22:39,692 --> 00:22:41,819
మనం ఇట్ హ్యాపెండ్ వన్ నైట్ చూస్తాము.

338
00:22:41,903 --> 00:22:45,323
డానికి బదులు మనం
ఫిలడెల్ఫియా స్టోరీ చూడొచ్చు.

339
00:22:47,617 --> 00:22:48,618
అంతా బాగానే ఉందా?

340
00:22:48,701 --> 00:22:52,997
ఆ, లేదు, నేను అలసిపోయాను,
అందుకని సినిమా చూడను, వెళ్లి పడుకుంటాను.

341
00:22:53,998 --> 00:22:57,627
సరే, తల్లీ. అలాగే.
మనం బ్రౌనీలు ఇంకో రోజు చేసుకుందాం.

342
00:23:05,301 --> 00:23:08,387
ఫోన్ చేసావేంటి?
ఎప్పుడూ మొదటి రాత్రి ఫోన్ చెయ్యవుగా.

343
00:23:09,222 --> 00:23:11,516
-ఎక్కడికి వెళ్తున్నావు?
-ఒక షోకు.

344
00:23:11,933 --> 00:23:13,351
ఏమైంది?

345
00:23:14,393 --> 00:23:17,355
ఇవాళ రాత్రి నేను, కాన్రాడ్
పూల్ దగ్గర మాట్లాడుకున్నాం,

346
00:23:17,438 --> 00:23:21,567
మేమిద్దరమే, నాకు వేరుగా అనిపించింది.

347
00:23:21,651 --> 00:23:23,361
మంచి వేరా? నేను చెప్పాను కదా.

348
00:23:23,444 --> 00:23:25,613
ఏమో. జెరెమియా, స్టీవెన్‌లు వచ్చారు,

349
00:23:25,696 --> 00:23:27,865
వాళ్లందరూ బీచ్‌కు వెళ్లారు.

350
00:23:27,949 --> 00:23:30,118
నువ్వు వాళ్లతో ఎందుకు వెళ్లలేదు?

351
00:23:30,660 --> 00:23:33,579
ఆ బీచ్ బాన్‌ఫైర్ నాకు అనవసరం.

352
00:23:33,663 --> 00:23:37,500
-నన్ను వాళ్లు రమ్మని పిలవలేదు కూడా.
-బీచ్ వాళ్ల సొంతం కాదు.

353
00:23:37,583 --> 00:23:40,878
నేను మాట్లాడిన ఒక వ్యక్తి
నన్ను రమ్మని పిలిచాడు.

354
00:23:41,003 --> 00:23:43,464
చూశావా? రా, అమ్మాయ్. సరదాగా గడుపు.

355
00:23:43,548 --> 00:23:46,801
అవును, కానీ నాకతను నచ్చలేదు.

356
00:23:46,884 --> 00:23:49,137
విషయం అది కాదు.
కాన్రాడ్ అక్కడే ఉంటాడు.

357
00:23:49,220 --> 00:23:51,097
వెళ్లి అతనికి కనిపించు.

358
00:23:51,180 --> 00:23:53,808
నువ్వు అందంగా,
ముద్దుగా తయారై అతనికి కనిపించు.

359
00:23:53,891 --> 00:23:55,434
నీ డఫుల్ బ్యాగులో చూడు.

360
00:23:55,518 --> 00:23:58,271
నీకు నా రహస్య ఆయుధాన్ని బహుమతిగా ఇచ్చాను.

361
00:23:58,354 --> 00:24:00,356
ఉంచుకోవడానికి కాదు, అప్పుగా.

362
00:24:01,232 --> 00:24:02,733
కనిపించిందా?

363
00:24:04,485 --> 00:24:06,237
ఇంకా నయం!

364
00:24:06,320 --> 00:24:08,281
నువ్వు నీ గదిలో కూర్చుని ఏడుస్తూ,

365
00:24:08,364 --> 00:24:12,285
అబ్బాయిలు తిరిగి రావడం కోసం
ఎదురు చూస్తూ ఉంటే ఎప్పుడూ ఏమీ జరగదు.

366
00:24:12,368 --> 00:24:15,663
కానీ దాని కింద
నా అండర్‌వేర్ కనిపిస్తుంది కదా?

367
00:24:15,746 --> 00:24:17,248
అయితే తాంగ్ వేసుకో!

368
00:24:17,331 --> 00:24:19,125
లేదు, తాంగ్‌లు శుభ్రంగా ఉండవు.

369
00:24:19,208 --> 00:24:22,378
తాంగ్ వేసుకోవడం అంటే
పిరుదుల రంధ్రం శుభ్రం చెయ్యడం.

370
00:24:23,671 --> 00:24:25,798
బెల్లీ, అవి అందరూ వేసుకుంటున్నారు.

371
00:24:25,882 --> 00:24:28,050
సరే, నోరు మూసుకో. నేను వెళ్తాను.

372
00:24:35,099 --> 00:24:36,475
నేను ప్రయత్నించనా?

373
00:24:37,768 --> 00:24:41,564
నువ్వా? నన్ను నవ్వించకు.

374
00:24:42,899 --> 00:24:46,611
నువ్వు తెలివైన వాడివి.
నీకు తప్ప ఎవరికీ ఏమీ తెలీదు.

375
00:24:47,236 --> 00:24:50,323
నేను కారు ఆపుతాను, కానీ నా బొటనవేలు వాడను.

376
00:24:50,948 --> 00:24:52,325
ఏం చేస్తావు?

377
00:24:52,825 --> 00:24:54,785
ఇదంతా నా సొంతం.

378
00:25:05,254 --> 00:25:07,882
నువ్వు నాకు ఏమాత్రం పేరు ఇవ్వడం లేదా?

379
00:25:07,965 --> 00:25:09,217
దేనికి?

380
00:25:31,113 --> 00:25:32,782
నేను టేలర్‌ను చంపేస్తాను.

381
00:25:36,077 --> 00:25:37,411
పెట్రోల్ బంక్ అమ్మాయి.

382
00:25:38,621 --> 00:25:41,457
హే. ఎక్కడి నుంచి వస్తున్నావు?

383
00:25:42,291 --> 00:25:43,584
ఇంకో పార్టీ.

384
00:25:44,168 --> 00:25:46,254
బాగుంది. నా బీర్ తీసుకో.

385
00:25:46,337 --> 00:25:47,964
నాకు వద్దు. ధన్యవాదాలు.

386
00:25:49,465 --> 00:25:53,094
అయితే, నీకు మీ ఊర్లో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా?

387
00:25:55,429 --> 00:25:56,347
స్టీవెన్!

388
00:25:58,140 --> 00:25:59,767
నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?

389
00:26:00,977 --> 00:26:03,020
ఏంటిది, ఏం వేసుకున్నావు?

390
00:26:03,104 --> 00:26:05,481
-నేను పిలిచాను. నువ్వెవరు?
-తన అన్నయ్యను.

391
00:26:05,564 --> 00:26:08,901
-ఆమెకు పదిహేనేళ్లు. పెడోఫిల్.
-నాకు దాదాపు పదహారు.

392
00:26:08,985 --> 00:26:10,152
తప్పు నాదే.

393
00:26:11,404 --> 00:26:14,156
-దేవుడా. బెల్లీ, అబ్బా.
-ఏం చేస్తున్నావు?

394
00:26:14,240 --> 00:26:16,409
నన్ను వదులు.
నాకు సిగ్గుగా ఉంది.

395
00:26:16,492 --> 00:26:18,452
-నాకు సిగ్గుగా ఉంది.
-ఎందుకు?

396
00:26:18,536 --> 00:26:21,080
-నువ్వు సిగ్గుపడేలా చేసుకోకు.
-ఆపు! స్టీవెన్!

397
00:26:21,163 --> 00:26:23,124
-బాగానే ఉన్నావా?
-బెల్లీ?

398
00:26:29,130 --> 00:26:31,048
నీకు రెడ్ సాక్స్ నచ్చరనుకున్నాను!

399
00:26:32,049 --> 00:26:33,759
-నువ్వెవరు?
-నువ్వెవరు?

400
00:26:33,843 --> 00:26:34,969
నికోల్.

401
00:26:35,761 --> 00:26:38,472
మనం పోయిన సంవత్సరం డెబ్ బాల్‌కు వెళ్ళాము.

402
00:26:38,556 --> 00:26:41,017
మీరు, స్టీవెన్
కాలేజీలు చూడడానికి వెళ్లినప్పుడు.

403
00:26:41,100 --> 00:26:44,061
నువ్వు డెబ్ బాల్స్ చెత్త,
డెబ్స్ గొర్రెలని అన్నావు!

404
00:26:44,145 --> 00:26:45,187
నేననలేదు...

405
00:26:46,939 --> 00:26:49,317
-నువ్వు పొగరుబోతువు.
-నువ్వు వెధవవు.

406
00:26:49,400 --> 00:26:51,110
బెల్లీ, నువ్వు వచ్చావు.

407
00:26:51,193 --> 00:26:53,321
-మనం కలిసి గడపవచ్చు.
-ఇంటికి వెళ్తున్నాము.

408
00:26:53,404 --> 00:26:55,531
-ఏంటి?
-మనం వెళ్తున్నాం.

409
00:26:55,614 --> 00:26:58,409
స్టీవెన్, శాంతించు.

410
00:26:59,493 --> 00:27:00,411
వెళ్దాం పద.

411
00:27:01,329 --> 00:27:02,204
రా.

412
00:27:03,122 --> 00:27:06,584
సరే. కానీ ఇక్కడే ఉండు, ఎవరితో మాట్లాడకు.

413
00:27:06,667 --> 00:27:07,877
సరే, శాంతించు.

414
00:27:09,420 --> 00:27:10,338
ఛ!

415
00:27:12,214 --> 00:27:15,092
విను, నువ్వు వచ్చినందుకు
నాకు సంతోషంగా ఉంది.

416
00:27:16,010 --> 00:27:17,261
జెరెమియా!

417
00:27:19,013 --> 00:27:21,057
సరే. నేను ఇప్పుడే వస్తాను.

418
00:27:33,027 --> 00:27:35,363
ఈరోజు అబ్బాయిలు బెల్లీని
పూల్‌లోకి తోసినప్పుడు,

419
00:27:35,446 --> 00:27:38,657
నాకు కానీ ముఖంలో నవ్వు కనిపించింది.

420
00:27:39,742 --> 00:27:43,579
వాడు, ఆబ్రే విడిపోయిన తరువాత
మొదటిసారి వాడి మూడ్ బాగుంది.

421
00:27:43,662 --> 00:27:46,957
-వాళ్లు అంత సీరియస్ అని నేననుకోలేదు.
-నేనూ అనుకోలేదు.

422
00:27:48,250 --> 00:27:50,920
వాడి చెత్త మూడ్‌లో ఉన్నాడు.

423
00:27:51,003 --> 00:27:52,296
వాడలా ఉండడు.

424
00:27:54,006 --> 00:27:55,549
ఫుట్‌బాల్ ఎప్పుడు మానేసాడు?

425
00:27:55,633 --> 00:27:57,426
కొన్ని వారాల క్రితం.

426
00:27:57,510 --> 00:28:00,137
ఆడమ్ను సంతోషపెట్టడం కోసం
ఫుట్‌బాల్ ఆడాడు.

427
00:28:00,221 --> 00:28:02,681
వాళ్ల మధ్య ఏదో గొడవ అయింది.

428
00:28:02,765 --> 00:28:06,227
నేను వాడికి కాస్త స్పేస్ ఇస్తున్నాను.

429
00:28:06,310 --> 00:28:08,229
వాడికి కావాల్సింది చేయనిస్తున్నాను.

430
00:28:10,940 --> 00:28:14,110
నువ్వు వాడితో మాట్లాడాలని అనుకోవట్లేదా?

431
00:28:15,903 --> 00:28:17,905
మాట్లాడడానికి ఏమీ లేదు.

432
00:28:20,157 --> 00:28:22,785
మనం అనుకున్నట్టు మంచి వేసవి గడుపుదామా?

433
00:28:25,371 --> 00:28:27,039
నీ రచన ఎంతవరకు వచ్చింది?

434
00:28:27,123 --> 00:28:29,250
నీ కోసం ఆఫీస్ ఏర్పాటు చేశాను.

435
00:28:29,333 --> 00:28:30,876
అక్కడ తాజా పూలు పెట్టాను.

436
00:28:31,502 --> 00:28:35,339
నాకు నీతో సమయం గడపాలని ఉంది.
ఆ పుస్తకం అనవసరం.

437
00:28:35,881 --> 00:28:39,427
అబద్ధాలకోరు. నువ్వు నీ పుస్తకాలను
చాలా పట్టించుకుంటావు.

438
00:28:39,510 --> 00:28:42,388
అది మిడ్‌లిస్ట్‌లో ఉంది. అమ్ముడవడం లేదు.

439
00:28:43,139 --> 00:28:46,308
నేను ఆసియన్-అమెరికన్
అనుభవం గురించి రాసుంటే,

440
00:28:46,392 --> 00:28:47,768
అది బాగా అమ్ముడయ్యేదేమో.

441
00:28:47,852 --> 00:28:51,939
రేపది టన్నుల కొద్దీ కాపీలు అమ్ముడవుతుంది.
నేనది చదువుతాను.

442
00:28:52,022 --> 00:28:53,691
నువ్వు నా పుస్తకాలే చదవవు.

443
00:28:55,609 --> 00:28:56,735
నేను చదువుతాను.

444
00:28:59,613 --> 00:29:03,617
క్లీవ్‌ల్యాండ్ కాస్టిలో బుక్ చదివాను.
ఇన్‌స్టాగ్రామ్‌లో 150,000 ఫాలోవర్లు.

445
00:29:04,869 --> 00:29:07,580
నువ్వు ఎక్కువగా కనిపిస్తే నష్టం ఏమీ లేదు.

446
00:29:07,663 --> 00:29:09,707
-టిండర్‌లో ఉండు.
-ప్లీజ్, ఆపు.

447
00:29:09,790 --> 00:29:12,960
టిండర్ కాదు, ఆ నలభై
పైవారి యాప్ పేరేంటి?

448
00:29:13,586 --> 00:29:15,838
-బతిమిలాడుతున్నాను. ఆపు.
-ఇది మన సమయం.

449
00:29:15,921 --> 00:29:17,423
కాదు, ఇది కాదు.

450
00:29:28,559 --> 00:29:30,769
-ఏంటి?
-సరే, నా మీద కోపం తెచ్చుకోకు.

451
00:29:31,812 --> 00:29:35,149
నువ్వు బెల్లీని
డెబ్ సీజన్‌కు వెళ్లనిస్తే బాగుంటుంది.

452
00:29:35,232 --> 00:29:38,235
-డెబ్యుటాంటే బాల్స్ సమస్యలు తెస్తాయి.
-ప్లీజ్.

453
00:29:40,905 --> 00:29:43,782
నాకు మన అమ్మాయిని
తెల్ల డ్రెస్‌లో చూడాలనుంది.

454
00:29:49,872 --> 00:29:50,789
సరే.

455
00:29:51,707 --> 00:29:53,792
-నువ్వు గెలిచావు!
-నేను గెలుస్తాను.

456
00:29:53,876 --> 00:29:56,253
అది చేస్తుందని నేననుకోను.

457
00:29:56,337 --> 00:29:58,088
నిన్ను ఆశ్చర్యపరుస్తుందేమో.

458
00:29:58,881 --> 00:30:00,216
మనుషులు మారవచ్చు.

459
00:30:03,302 --> 00:30:04,512
మనం కాదు.

460
00:30:05,346 --> 00:30:06,263
కాదు.

461
00:30:07,139 --> 00:30:09,850
నువ్వు, నేను కదలిక లేని మనుషులం.

462
00:30:28,077 --> 00:30:28,953
ఫ్లావియా?

463
00:30:30,496 --> 00:30:32,248
హాయ్, నేను, సెక్స్‌టస్!

464
00:30:32,331 --> 00:30:34,542
-ఏమన్నావు?
-లేదు!

465
00:30:34,625 --> 00:30:37,169
సెక్స్‌టస్! ఏడో తరగతి,
లాటిన్ కన్వెన్షన్.

466
00:30:37,253 --> 00:30:40,339
నువ్వు ఫ్లావియా.
కవిత చదవడంలో నీది రెండోో స్థానం.

467
00:30:40,422 --> 00:30:41,549
అవును.

468
00:30:41,632 --> 00:30:44,927
నువ్వు కాస్ట్యూమ్ పోటీకి
డ్రెస్ వేసుకున్నావు, కదా?

469
00:30:45,010 --> 00:30:46,720
నువ్వు విజార్డ్ కదా?

470
00:30:46,804 --> 00:30:49,223
దాదాపు. నేను కేరన్,
ఆత్మలను తీసుకువెళ్తాను.

471
00:30:49,890 --> 00:30:52,810
-సాల్వే, ఫ్లావియా.
-సాల్వే, సెక్స్‌టస్.

472
00:30:53,477 --> 00:30:56,105
నా అసలు పేరు సెక్స్‌టస్ కాదు. కామ్.

473
00:30:57,273 --> 00:30:59,733
నేను బెల్లీ. ఇజబెల్.

474
00:31:01,151 --> 00:31:02,278
బాగుంది.

475
00:31:03,529 --> 00:31:05,531
నువ్వు కావాలంటే కూర్చోవచ్చు.

476
00:31:05,614 --> 00:31:07,575
సరే, బాగుంది, కూర్చుంటాను.

477
00:31:07,950 --> 00:31:10,995
నేను వెళ్లే ముందు కనిపించావు,
కానీ కాసేపు ఉంటాను.

478
00:31:12,037 --> 00:31:14,873
-ఈ వేసవికి కొత్తగా వచ్చావా?
-లేదు, ఇక్కడే ఉంటాను.

479
00:31:14,957 --> 00:31:15,874
నువ్వు?

480
00:31:15,958 --> 00:31:19,003
లేదు, నా చిన్నప్పటి నుంచి
కజిన్స్‌కు వస్తున్నాను.

481
00:31:19,086 --> 00:31:22,172
మనం ఎందుకు కలవలేదు?
కలిస్తే నిన్ను గుర్తు పట్టేవాడిని.

482
00:31:24,425 --> 00:31:25,342
నీ కవిత.

483
00:31:26,552 --> 00:31:28,387
అది గుర్తుండిపోయే కవిత.

484
00:31:29,013 --> 00:31:32,683
ఆ. లేదు, నేనిక్కడికి వచ్చినప్పుడు
ఇంట్లోనే ఉంటాను, అందుకని...

485
00:31:33,309 --> 00:31:34,310
ఎందుకు?

486
00:31:35,060 --> 00:31:38,522
ఎందుకంటే నాకు నా కుటుంబం తప్ప ఎవరూ తెలీదు.

487
00:31:41,483 --> 00:31:42,818
ఇప్పుడు తెలుసు.

488
00:31:45,779 --> 00:31:46,905
నీకు చలేస్తొందా?

489
00:31:47,781 --> 00:31:49,450
లేదు. బాగానే ఉన్నాను.

490
00:31:49,533 --> 00:31:51,785
లేదు, లేదు. నాకీ హుడీ నచ్చదు.

491
00:31:52,453 --> 00:31:55,205
-ఇది అమ్మాయిలది...
-సరే, నేను తీసుకుంటాను.

492
00:31:55,289 --> 00:31:56,165
ధన్యవాదాలు.

493
00:31:59,710 --> 00:32:03,130
హే, నేను ఇంతకుముందు పడడం అందరూ చూశారా?

494
00:32:05,299 --> 00:32:07,343
అవును. చూసారు.

495
00:32:07,843 --> 00:32:09,845
మా అన్నయ్య వెధవ.

496
00:32:09,928 --> 00:32:13,515
అన్నయ్యా? అయితే,
నీతో ఇక్కడ ఉన్నది ఎవరు?

497
00:32:13,599 --> 00:32:15,976
వాళ్లలో నీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా?

498
00:32:16,810 --> 00:32:17,936
లేడు.

499
00:32:18,020 --> 00:32:21,857
మా అమ్మ ఫ్రెండ్ అబ్బాయిలు.
మేము ప్రతి వేసవికి వాళ్లింట్లో ఉంటాము.

500
00:32:22,316 --> 00:32:24,276
నేను వచ్చినందుకు కోపంగా ఉన్నారు.

501
00:32:26,236 --> 00:32:27,905
నువ్వు రావడం నాకానందంగా ఉంది.

502
00:32:27,988 --> 00:32:30,407
ఎందుకంటే నేను రావాలనుకోలేదు.

503
00:32:30,824 --> 00:32:35,037
కొంతమంది పిల్లలు
తాగడానికి వస్తారని తెలుసు,

504
00:32:35,120 --> 00:32:37,373
-నేనేమో తాగను.
-నేను కూడా.

505
00:32:38,791 --> 00:32:41,085
నీకీ వేసవి వాళ్లు ఎలా తెలుసు?

506
00:32:41,168 --> 00:32:44,088
అమ్మ కంట్రీ క్లబ్బులో పనిచేస్తుంది.
వాళ్లతో పెరిగాను.

507
00:32:45,255 --> 00:32:48,592
హే, నీకు అరంగేట్రం గురించి ఏమైనా తెలుసా?

508
00:32:48,676 --> 00:32:49,760
అది పిచ్చి, కదా?

509
00:32:49,843 --> 00:32:53,847
దాని గురించి మాట్లాడుతుంటే,
అది పితృస్వామ్యంతో నిండి ఉంది.

510
00:32:53,931 --> 00:32:56,100
అవును. అవును.

511
00:32:56,934 --> 00:32:58,644
అదంతా మొత్తం చెత్త కాదు.

512
00:32:58,727 --> 00:33:00,229
పెద్ద ఫండ్ రైజర్ ఉంటుంది.

513
00:33:00,854 --> 00:33:04,066
పోయిన ఏడాది, ఎలిజబెత్ వారెన్ వచ్చింది.

514
00:33:04,483 --> 00:33:06,652
వావ్! అది అద్భుతం!

515
00:33:06,735 --> 00:33:08,320
అవును. ధన్యవాదాలు.

516
00:33:10,656 --> 00:33:12,032
బాగా ఆలస్యం అయింది.

517
00:33:12,908 --> 00:33:15,244
నాకు వెళ్లాలని లేదు,

518
00:33:15,327 --> 00:33:17,746
కానీ నేను ఉదయమే లేవాలి.

519
00:33:17,830 --> 00:33:20,040
సొరచేపలు చూసే బోటులో
ఇంటర్న్ చేస్తున్నాను.

520
00:33:20,124 --> 00:33:22,876
-అది నిజంగా...
-నువ్వది చేస్తావా, హ?

521
00:33:23,794 --> 00:33:25,796
నీ సమస్య ఏంటి? ఒక్క బీరే కదా.

522
00:33:25,879 --> 00:33:27,923
-ఇది పార్టీ. శాంతించు.
-అది ఇచ్చేయ్.

523
00:33:28,006 --> 00:33:30,175
ఆపు. తాగున్నావు.
ఆ బీర్ ఇచ్చేయ్.

524
00:33:30,259 --> 00:33:33,387
-ఆ అమ్మాయి మాట విను.
-లేదు, నేను బాగానే ఉన్నాను.

525
00:33:33,470 --> 00:33:36,056
-నీ గొప్పతనం చూపిస్తావా?
-నోరు మూసుకో.

526
00:33:36,140 --> 00:33:37,224
దేవుడా.

527
00:33:38,100 --> 00:33:41,103
నేను ఇప్పుడే వస్తాను.
క్షమించు. ఎక్కడికీ వెళ్లకు.

528
00:33:41,186 --> 00:33:43,021
నువ్వు నా బీర్ తీసుకోవు.

529
00:33:43,105 --> 00:33:44,648
శాంతించు! అది ఒక్క బీరే!

530
00:33:44,732 --> 00:33:46,400
-అది నా...
-వినండి.

531
00:33:47,693 --> 00:33:48,777
బెల్లీ.

532
00:33:49,236 --> 00:33:51,488
-వినండి!
-నీకేమైంది?

533
00:33:52,072 --> 00:33:54,158
-బాగానే ఉన్నావా?
-రా, పోటుగాడా!

534
00:33:54,241 --> 00:33:57,327
హే. రా. ఆపండి.

535
00:34:00,122 --> 00:34:01,790
ఆపండి. అబ్బా!

536
00:34:01,874 --> 00:34:04,334
-పోలీసులు!
-ఇక్కడి నుంచి వెళ్దాం.

537
00:34:15,471 --> 00:34:18,140
నిజంగా, అబ్బా, కారెక్కు.

538
00:34:18,223 --> 00:34:20,684
తల చూసుకో. కాళ్లు.

539
00:34:20,768 --> 00:34:23,479
-సరే, కారు ఎలా ఎక్కలో నాకు తెలుసు.
-అవును, నిజమే.

540
00:34:24,354 --> 00:34:26,023
బెల్లీ, వెళ్దాం. ఎక్కు.

541
00:34:26,565 --> 00:34:29,401
-కామ్ నన్ను ఇంట్లో దింపుతాడు.
-నేను దింపుతాను.

542
00:34:29,485 --> 00:34:31,695
లేదు, అతన్ని ఇప్పుడే కలిసావు.

543
00:34:31,779 --> 00:34:34,782
-నేను కామ్, కామెరూన్.
-నీ పేరు కామ్ కామెరూనా?

544
00:34:34,865 --> 00:34:36,158
కాదు, కేవలం కామ్.

545
00:34:37,493 --> 00:34:38,952
మనం ఒకరికొకరం తెలుసు.

546
00:34:39,036 --> 00:34:42,247
ఏడో తరగతి లాటిన్ కన్వెన్షన్.
మేమేమీ అపరిచితులం కాదు.

547
00:34:43,040 --> 00:34:45,334
సరే, తప్పుగా అనుకోకు, కానీ వద్దు.

548
00:34:45,417 --> 00:34:48,128
-బెల్లీ, కారెక్కు.
-కారెక్కు.

549
00:34:49,505 --> 00:34:51,089
నువ్వు వెళ్లాలి.

550
00:34:51,173 --> 00:34:53,425
నేను ఇంటర్న్ చేస్తున్న ఆ సొరచేపల నావ

551
00:34:53,509 --> 00:34:56,261
రోజూ తెల్లవారు ఝామునే
పియర్ నుంచి వెళ్తుంది.

552
00:34:56,345 --> 00:35:01,016
నువ్వు కూడా వస్తావా?

553
00:35:03,060 --> 00:35:04,978
ఆ. వస్తాను.

554
00:35:05,312 --> 00:35:08,232
-లేకపోతే నీకు నీ హుడీ ఎలా తిరిగి వస్తుంది?
-అవును.

555
00:35:11,401 --> 00:35:13,403
ఇది నా వేసవి కోరిక కావచ్చు.

556
00:35:13,487 --> 00:35:15,864
ఈ రాత్రి, ఈ అబ్బాయి.

557
00:35:23,330 --> 00:35:24,957
-నేను...
-సరే.

558
00:35:28,836 --> 00:35:29,920
బై.

559
00:35:39,888 --> 00:35:40,889
ఛ! స్టీవెన్!

560
00:35:40,973 --> 00:35:43,308
కాన్రాడ్‌ను చూస్తూండు. ఇప్పుడే వస్తాను.

561
00:36:02,327 --> 00:36:05,998
నీ జుట్టు చిన్న పిల్లల జుట్టులా ఉంది,
చిక్కుపడి ఉంది.

562
00:36:13,964 --> 00:36:14,798
బెల్లీ?

563
00:36:16,008 --> 00:36:17,718
మీరు తాగారా?

564
00:36:21,889 --> 00:36:25,100
ధన్యవాదాలు, ఆఫీసర్స్.
ఇలా మళ్లీ జరగదని మాట ఇస్తున్నాను.

565
00:36:25,183 --> 00:36:28,520
మి. ఫిషర్ వచ్చాక చీఫ్ గోల్ఫ్
ఆడాలనుకుంటున్నారని చెప్పండి.

566
00:36:29,521 --> 00:36:30,772
తప్పకుండా.

567
00:36:30,856 --> 00:36:32,774
మీ ఇబ్బందికి మళ్లీ ధన్యవాదాలు.

568
00:36:33,859 --> 00:36:35,903
గుడ్ నైట్, ఆఫీసర్స్.

569
00:36:39,156 --> 00:36:40,908
అంత బాధ్యత లేకుండా ఎలా ఉన్నారు?

570
00:36:40,991 --> 00:36:42,701
అమ్మ, ఇదేమీ పెద్ద విషయం కాదు.

571
00:36:42,784 --> 00:36:45,078
పోలీసులు బాన్‌ఫైర్ ఆపడానికి వచ్చారు.

572
00:36:45,162 --> 00:36:46,705
-పెద్ద విషయం కదా?
-అవును.

573
00:36:46,788 --> 00:36:50,626
చిన్న వయసు పిల్లలు తాగి
పోలీసులకు దొరకడం పెద్ద విషయం కదా?

574
00:36:54,004 --> 00:36:56,882
-ఆగండి, మీరు సిగరెట్ తాగారా?
-ఏంటి?

575
00:36:58,216 --> 00:37:00,177
మెల్లగా మాట్లాడండి.
సుసన్నా పడుకుంది.

576
00:37:00,260 --> 00:37:01,720
నేను అరవట్లేదు. నువ్వు...

577
00:37:01,803 --> 00:37:05,015
నేనివాళ తాగలేదు.
నేను డ్రైవ్ చేశాను.

578
00:37:05,098 --> 00:37:08,060
నువ్వు పెద్దవాడివి. నీకేమైంది?

579
00:37:08,143 --> 00:37:10,979
నువ్వు ఇంట్లోంచి ఎప్పుడు వెళ్లావు?
ఆ డ్రెస్ ఏంటి?

580
00:37:11,063 --> 00:37:13,941
ఇది టేలర్‌ది.
నేను ఎందుకు వెళ్లకూడదు?

581
00:37:14,024 --> 00:37:16,610
నువ్వు వెళ్తున్నానని చెప్పాలి కదా.

582
00:37:16,693 --> 00:37:18,737
-అక్కడికి ఎలా వెళ్లావు?
-నడుచుకుంటూ.

583
00:37:18,820 --> 00:37:22,282
దేవుడా. అలా చేయకూడదని నీకు తెలుసు కదా.

584
00:37:22,366 --> 00:37:24,076
నన్ను చిన్నపిల్లలా చూడకు!

585
00:37:24,159 --> 00:37:27,204
నిన్ను పెద్దదానిలా చూడాలంటే
ముందు అలా ప్రవర్తించు.

586
00:37:27,287 --> 00:37:28,789
మీరు కూడా అలానే ఉండాలేమో.

587
00:37:32,042 --> 00:37:33,251
అంటే?

588
00:37:35,212 --> 00:37:38,632
ఇది మీ కుటుంబం అయి
ఉండకపోతే ఇవాళ రాత్రి వేరే విధంగా

589
00:37:38,715 --> 00:37:40,759
ముగిసి ఉండేదని మీకు తెలుసనుకుంటాను.

590
00:37:41,385 --> 00:37:42,594
క్షమించండి, లార్.

591
00:37:43,428 --> 00:37:46,598
వెళ్లండి... వెళ్లి పడుకోండి.

592
00:37:54,189 --> 00:37:56,566
నీకు ఏమవుతోందో నాకు అర్థం కావడం లేదు.

593
00:37:58,568 --> 00:37:59,945
ఏమీ లేదు.

594
00:38:00,946 --> 00:38:03,240
-ఏమీ అవడం లేదు.
-కానీ.

595
00:38:47,909 --> 00:38:50,620
లారెల్‌పార్క్‌రైటర్
మీ ప్రొఫైల్ పూర్తి చేయండి

596
00:39:12,309 --> 00:39:13,518
అది జరిగింది.

597
00:39:14,853 --> 00:39:16,188
నువ్వు కాన్రాడ్‌ను ముద్దు పెట్టుకున్నావా?!

598
00:39:22,527 --> 00:39:28,408
లేదు. నేను బాన్‌ఫైర్ వద్ద కలిసిన
ఒక అబ్బాయి. సెక్స్‌టస్.

599
00:39:29,576 --> 00:39:31,453
సెక్స్ ఏంటి?! నాకు అంతా చెప్పు.

600
00:40:04,569 --> 00:40:06,863
మే మొదటి తేదీలోపు ప్రత్యుత్తరానికి
అనుకూలంగా అభ్యర్థించబడింది

601
00:40:06,947 --> 00:40:10,033
మీరు కావాలనుకున్నా, వద్దనుకున్నా
పరిస్థితులు మారతాయి.

602
00:40:11,535 --> 00:40:13,703
అందుకని నేను కూడా మారతానేమో.

603
00:40:18,041 --> 00:40:20,919
ఆనందంగా అంగీకరిస్తుంది

604
00:40:33,890 --> 00:40:35,058
హాయ్.

605
00:40:39,187 --> 00:40:41,356
-నిన్న రాత్రి చాలా బాగుంది.
-చెత్త.

606
00:40:43,733 --> 00:40:45,610
నీ కన్ను రేపు నల్లగా అవుతుంది.

607
00:40:47,487 --> 00:40:49,030
అప్పుడే రేపు వచ్చేసింది.

608
00:40:54,452 --> 00:40:55,954
హే, నువ్వు...

609
00:40:56,371 --> 00:40:58,707
నీకు జరిగింది ఏమైనా గుర్తుందా?

610
00:40:58,790 --> 00:41:00,500
నువ్వు బాగా తాగున్నావు.

611
00:41:02,919 --> 00:41:05,797
నేను తాగినప్పుడు జరిగే
ప్రతిదీ నాకు గుర్తుంటుంది.

612
00:41:16,474 --> 00:41:18,310
-నాకో దమ్ము ఇవ్వు.
-ఇవ్వను.

613
00:41:18,393 --> 00:41:19,394
-ఇవ్వను.
-ఇవ్వు.

614
00:41:19,477 --> 00:41:22,355
-ఇవ్వు!
-ఇవ్వను! లారెల్ నన్ను నిజంగా చంపేస్తుంది.

615
00:41:22,439 --> 00:41:23,565
సరే, అలాగే.

616
00:41:23,648 --> 00:41:26,193
నేను తాగలేకపోతే, నువ్వూ తాగవు.

617
00:41:30,989 --> 00:41:32,282
అదే పాత బెల్లీ.

618
00:41:43,501 --> 00:41:47,005
అందరూ లేచే లోపు మనం వెళ్లి
ఆ మఫిన్స్ తీసుకువద్దాము.

619
00:41:47,088 --> 00:41:50,634
ఈ వేసవి అన్ని వేసవుల్లానే
ఉంటుందని అనుకున్నాను.

620
00:41:50,717 --> 00:41:52,761
కానీ అది అలా లేదు.

621
00:41:53,929 --> 00:41:56,514
నేను ఒక చోటుకు వెళ్లాలి.

622
00:41:56,598 --> 00:41:58,308
నేను దాన్ని అలా కానివ్వను.

623
00:41:58,808 --> 00:42:00,352
ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు?

624
00:42:00,977 --> 00:42:02,312
ఒక సొరచేపను చూడడానికి!

625
00:42:03,688 --> 00:42:05,106
దాని అర్థం ఏంటి?

626
00:44:04,100 --> 00:44:06,102
ఉపశీర్షికలు అనువదించినది మైథిలి

627
00:44:06,186 --> 00:44:08,188
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్ రెడ్డి

