1
00:00:07,550 --> 00:00:11,762
ద సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెట్టీ

2
00:00:22,815 --> 00:00:23,733
మార్నింగ్, బెల్స్.

3
00:00:26,694 --> 00:00:27,611
జెరెమియా?

4
00:00:27,987 --> 00:00:29,071
నువ్వు ఏం...

5
00:00:37,246 --> 00:00:39,540
-ఆగు, కాన్రాడ్, ఇదేంటి--
-పరవాలేదు.

6
00:00:43,169 --> 00:00:44,712
నువ్వు, నేను కలిసి ఉండాలి.

7
00:00:46,756 --> 00:00:47,590
బెల్లీ, ఆగు.

8
00:00:48,549 --> 00:00:49,759
అది ఎప్పుడూ మనమే.

9
00:00:50,634 --> 00:00:51,969
నీకెలా తెలీలేదు?

10
00:00:58,309 --> 00:01:00,478
నా కలలు కూడా క్లిష్టంగా ఉన్నాయి.

11
00:01:07,401 --> 00:01:10,654
నిజం ఏమిటంటే,
ఆ ముద్దు తరువాత అన్నీ క్లిష్టంగా మారాయి.

12
00:01:10,738 --> 00:01:11,781
కాన్రాడ్ - జెరెమియా

13
00:01:11,864 --> 00:01:15,951
నేను ఆలోచించడం ఆపలేని ఆ ముద్దు.
నా కలలో కూడా అదే!

14
00:01:16,035 --> 00:01:17,912
అది అన్నిటిలో ఉంటోంది!

15
00:01:24,877 --> 00:01:25,711
గుడ్ మార్నింగ్.

16
00:01:26,837 --> 00:01:29,340
గుడ్ మార్నింగ్, బాబు. హే, ఒక నిమిషం ఉందా?

17
00:01:29,423 --> 00:01:31,592
క్లీవ్‌ల్యాండ్ ఫోన్ చేశాడు. వెళ్లాలి.

18
00:01:33,009 --> 00:01:34,345
ఒక్క క్షణం.

19
00:01:35,179 --> 00:01:38,223
నువ్వు ఆ డెబ్యుటాంటే బాల్‌కు బెల్లీకి

20
00:01:39,183 --> 00:01:41,101
-తోడుగా వెళ్లాలి.
-వెళ్లలేనమ్మా.

21
00:01:41,769 --> 00:01:43,354
ఎందుకు?

22
00:01:44,021 --> 00:01:45,271
జెరెమియాను అడగమను.

23
00:01:45,356 --> 00:01:48,442
అది నువ్వయితే తనకెంత
నచ్చుతుందో నీకు తెలుసు కదా, కానీ.

24
00:01:48,526 --> 00:01:50,485
ఆమె రాకుమారుడివి నువ్వే. తెలుసుగా.

25
00:01:50,569 --> 00:01:53,155
-కాదు, అది--
-తనతో ఎప్పుడూ మంచిగా ఉన్నావు.

26
00:01:53,239 --> 00:01:56,491
అబ్బాయిలతో తనను కలిసి
అన్ని చోట్లకు రానిచ్చింది నువ్వే.

27
00:01:56,575 --> 00:01:58,828
ఆమెకిది బాగా జరగాలని కోరుకుంటున్నాను.

28
00:01:59,703 --> 00:02:01,372
ప్లీజ్? నా కోసం?

29
00:02:03,082 --> 00:02:04,291
నేను ఆలోచిస్తాను.

30
00:02:04,375 --> 00:02:05,793
సరే, నా మంచి కానీవి.

31
00:02:05,876 --> 00:02:07,044
నేను చేస్తానననలేదు.

32
00:02:07,127 --> 00:02:10,214
టోర్నమెంట్‌కు లేటుగా రాకు.
ఏర్పాట్లలో సహాయం కావాలి.

33
00:02:10,297 --> 00:02:11,131
సరే.

34
00:02:11,715 --> 00:02:12,925
ప్లే ఇట్ ఫార్వర్డ్!

35
00:02:13,425 --> 00:02:14,760
ప్లే ఇట్ ఫార్వర్డ్.

36
00:02:14,844 --> 00:02:17,054
నువ్వు ఇప్పుడు కూడా సైనప్ చేయొచ్చు.

37
00:02:17,429 --> 00:02:18,848
అమ్మా, కాదు.

38
00:02:20,015 --> 00:02:20,933
బహుశా.

39
00:02:25,020 --> 00:02:26,605
-క్షమించు.
-గుడ్ మార్నింగ్.

40
00:02:27,106 --> 00:02:28,190
హాయ్!

41
00:02:28,274 --> 00:02:30,609
-ఎలా పడుకున్నావు?
-బాగానే పడుకున్నాను.

42
00:02:30,693 --> 00:02:31,861
కలలేమీ రాలేదా.

43
00:02:32,236 --> 00:02:35,656
ఏంటి.

44
00:02:37,116 --> 00:02:40,244
ఇవాళ్టి వాలీబాల్ టోర్నమెంట్ కోసం
ఉత్సాహంగా ఉందా?

45
00:02:40,327 --> 00:02:41,537
బెల్లీ!

46
00:02:43,163 --> 00:02:45,583
నువ్వు బాత్రూమ్‌లో
జుట్టు ఎందుకు వదిలేసావు?

47
00:02:45,666 --> 00:02:47,793
-శాంతించు!
-లేదు, ఇది చెత్త.

48
00:02:47,877 --> 00:02:50,588
ఈసారి అలా చేస్తే,
అది నీ దిండు మీద పెడతాను.

49
00:02:50,671 --> 00:02:51,589
స్టీవెన్!

50
00:02:53,048 --> 00:02:55,301
నిన్ను తొందరపెట్టడం లేదు,

51
00:02:55,384 --> 00:02:59,138
కానీ నిన్న రాత్రి జరిగిన దాని గురించి
మనం మాట్లాడుకోవాలి.

52
00:02:59,221 --> 00:03:00,389
అవును. కాదు, అంటే,

53
00:03:00,472 --> 00:03:04,393
టేలర్ వస్తోంది,
టోర్నమెంట్ వీటన్నిటితో గందరగోళంగా ఉంది.

54
00:03:04,476 --> 00:03:06,687
సరే. బహుశా అవన్నీ అయిన తరువాత...

55
00:03:06,770 --> 00:03:08,272
ఆ. సరే, అలాగే.

56
00:03:08,355 --> 00:03:09,815
-సరే.
-సరే.

57
00:03:12,026 --> 00:03:17,156
సరే. నేను వెళ్లి తయారవ్వాలి.
మీ అమ్మ నా కోసం ఎదురు చూస్తోందనుకుంటాను.

58
00:03:17,239 --> 00:03:18,949
-ఆ, సరే. మళ్లీ కలుస్తాను.
-బై.

59
00:03:24,747 --> 00:03:26,206
ఆ, ఈ చెక్క కుళ్లింది.

60
00:03:26,749 --> 00:03:28,667
లోపల ఎంత పెళుసుగా ఉందో చూడండి.

61
00:03:28,751 --> 00:03:32,838
ఇది బాగాలేదు. మనం మంచి చెక్కను
చేరే వరకు దాన్ని పీకేయాలి.

62
00:03:34,757 --> 00:03:35,966
ఛ!

63
00:03:36,050 --> 00:03:37,718
నువ్వు కొంచెం కోపంగా ఉన్నావు.

64
00:03:37,801 --> 00:03:39,261
ఈ వారం నాకు బాగాలేదు.

65
00:03:39,345 --> 00:03:41,889
-మీ నాన్న వచ్చారా?
-కాదు, వేరేది.

66
00:03:42,305 --> 00:03:45,309
-ఆ అమ్మాయితో ఎలా ఉంది?
-బాగాలేదు.

67
00:03:46,435 --> 00:03:50,272
ఇది కూడా బాగాలేదు.
ఇదిలా వెళ్తూనే ఉంది.

68
00:03:50,356 --> 00:03:52,775
ఇదంతా పురుగు పట్టింది, నేను చూడనే లేదు.

69
00:03:52,858 --> 00:03:55,736
-ఇదన్నిచోట్లా ఉంది, నేను గమనించలేదు.
-కాన్రాడ్, ఓవ్!

70
00:03:56,820 --> 00:03:58,280
ఏమవుతోంది, బాబు!

71
00:03:58,739 --> 00:04:00,658
నా గుండె వేగంగా కొట్టుకుంటోంది...

72
00:04:03,577 --> 00:04:05,454
ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది.

73
00:04:06,455 --> 00:04:07,373
హే.

74
00:04:09,667 --> 00:04:12,169
ఇది మామూలే. నీకు పానిక్ అటాక్ అవుతోంది.

75
00:04:13,545 --> 00:04:15,464
పరవాలేదు. సరే, నన్ను చూడు.

76
00:04:16,173 --> 00:04:18,050
దీర్ఘ శ్వాస తీసుకో, సరేనా?

77
00:04:18,926 --> 00:04:19,843
లోపలికి తీసుకో.

78
00:04:20,803 --> 00:04:21,762
బయటకు వదులు.

79
00:04:22,471 --> 00:04:23,430
లోపలికి.

80
00:04:25,224 --> 00:04:26,141
బయటకు.

81
00:04:26,850 --> 00:04:27,768
లోపలికి.

82
00:04:29,269 --> 00:04:30,187
బయటకు.

83
00:04:31,981 --> 00:04:32,940
బయటకు వదులు, బాబు.

84
00:04:35,526 --> 00:04:37,569
కాన్రాడ్, ఏమవుతోంది?

85
00:04:48,122 --> 00:04:49,707
అది మా అమ్మ. ఆమె...

86
00:04:57,881 --> 00:04:59,091
అంతా బాగానే ఉందా?

87
00:05:00,009 --> 00:05:01,552
అవును, ఇవాళ వేడిగా ఉంది.

88
00:05:02,219 --> 00:05:03,470
ఇంకొంచెం సేపు.

89
00:05:06,515 --> 00:05:08,559
నీకా డ్రెస్సు నచ్చింది కదా?

90
00:05:10,644 --> 00:05:11,937
అవును, నాకు నచ్చింది.

91
00:05:13,564 --> 00:05:15,649
వాలీబాల్ టోర్నమెంట్‌కు ఉత్సాహంగా ఉందా?

92
00:05:16,567 --> 00:05:20,112
అవును, నేను ఆగలేను.
నాకు చాలా ఎక్కువ డబ్బు పోగు చేయాలని ఉంది.

93
00:05:21,030 --> 00:05:22,823
స్టీవెన్ గురించి ఆందోళనగా ఉంది.

94
00:05:22,906 --> 00:05:24,867
నీ చారిటీ ఏది?

95
00:05:25,534 --> 00:05:28,287
మీరు సహాయం చేసే చారిటీ.
ఆసరాలేని మహిళల ఆశ్రయం.

96
00:05:29,705 --> 00:05:31,957
చాలా బాగుంది. ధన్యవాదాలు, బెల్లీ.

97
00:05:33,876 --> 00:05:37,796
కదలకుండా కూర్చో.
ఆ ఫ్రిల్స్‌కు కొంచెం సమయం కావాలి.

98
00:05:42,551 --> 00:05:45,596
పానిక్ అటాక్‌ల కోసం
శ్వాస తీసుకునే టెక్నిక్ ఒకటుంది.

99
00:05:46,472 --> 00:05:50,893
నాలుగు సెకన్లు ముక్కుతో పీల్చు.
ఏడు సెకన్లు అలా ఉంచు. 8 సెకన్లలో వదులు.

100
00:05:52,603 --> 00:05:54,438
ఇదంతా మీకెలా తెలుసు.

101
00:05:54,521 --> 00:05:56,398
నా రెండో పుస్తకం విడుదలైంది.

102
00:05:56,482 --> 00:05:59,318
అది నా మొట్ట మొదటి పానిక్ అటాక్.

103
00:05:59,401 --> 00:06:02,112
హార్ట్ అటాక్ వచ్చిందనునుకుని
ఈఆర్‌కు వెళ్లాను.

104
00:06:02,196 --> 00:06:04,198
తరువాత సర్దుకోవడం నేర్చుకున్నాను.

105
00:06:09,828 --> 00:06:12,206
నీకు తెలుసని మీ అమ్మకు చెప్పాలేమో.

106
00:06:12,581 --> 00:06:14,166
అవును. నాకు చెప్పాలనుంది.

107
00:06:15,125 --> 00:06:17,920
అవును. కానీ ప్రతిసారి,
ఎలా చెప్పాలో తెలియట్లేదు.

108
00:06:19,421 --> 00:06:22,007
నాకు, నా తమ్ముడికి తెలియడం
ఆమెకు ఇష్టం లేదు.

109
00:06:22,091 --> 00:06:24,760
అది ఆమెను బాధ పెడుతుంది.
అదంతా పాడు చేస్తుంది.

110
00:06:28,263 --> 00:06:34,228
నేనిది నాలోనే ఉంచుకుంటే, అప్పుడు...

111
00:06:39,191 --> 00:06:41,193
అది ఆమెను ప్రాణాలతో ఉంచుతుందేమో.

112
00:06:44,738 --> 00:06:46,698
నీకు చెడు జరుగుతుందని భయంగా ఉంది.

113
00:06:47,032 --> 00:06:49,784
నువ్వది నిజం చేస్తావేమోనని భయపడుతున్నావు.

114
00:06:52,579 --> 00:06:54,790
దీన్ని నువ్వు నియంత్రించలేవు.

115
00:06:55,916 --> 00:06:59,002
ఇది నువ్వు పైకి అన్నా,
అనకపోయినా జరుగుతుంది.

116
00:07:00,087 --> 00:07:03,757
కాన్రాడ్, ఇది నీ బాధ్యత కాదు.

117
00:07:05,259 --> 00:07:06,176
సరేనా?

118
00:07:14,726 --> 00:07:15,811
ఇది నా బాధ్యత కాదు.

119
00:07:19,773 --> 00:07:20,941
పొకారి స్వెట్

120
00:07:21,024 --> 00:07:23,068
ప్లే ఇట్ ఫార్వర్డ్
వాలీబాల్ టోర్నమెంట్

121
00:07:23,735 --> 00:07:24,736
టీమ్ బెల్లీ

122
00:07:24,820 --> 00:07:25,696
హే, బెల్లీ.

123
00:07:26,113 --> 00:07:27,030
హే.

124
00:07:27,906 --> 00:07:28,740
అదేంటి?

125
00:07:29,533 --> 00:07:30,534
నా రహస్య ఆయుధం.

126
00:07:32,911 --> 00:07:35,789
-టోర్నమెంట్ గురించి ఎలా అనిపిస్తోంది?
-రెడీగా ఉన్నాను.

127
00:07:35,873 --> 00:07:38,584
నువ్వు రెడీగా ఉంటే,
రెడీ కానవసరం లేదు.

128
00:07:42,504 --> 00:07:43,672
మరీ అతిశయం వద్దు.

129
00:07:43,755 --> 00:07:47,676
అవును. అలా ఉండని ఏదైనా
ప్రేరణాత్మక పదం చెప్పు.

130
00:07:49,178 --> 00:07:50,179
ఆలోచిస్తున్నాను.

131
00:07:52,764 --> 00:07:53,765
ఆలోచిస్తున్నాను...

132
00:07:55,100 --> 00:07:55,976
బెల్లీ.

133
00:07:56,768 --> 00:07:57,728
ఏంటి?

134
00:07:59,438 --> 00:08:00,272
నన్ను క్షమించు.

135
00:08:00,772 --> 00:08:02,024
అలా అతిశయంగా ఉన్నందుకా?

136
00:08:04,151 --> 00:08:05,819
నిన్న వెధవలా ప్రవర్తించినందుకు.

137
00:08:05,903 --> 00:08:09,615
నాకంతా గుర్తున్నా,
గుర్తు లేనట్టు నటించినందుకు.

138
00:08:10,240 --> 00:08:13,243
అది నా మనసులో పదే
పదే తిరుగుతూ ఉంది.

139
00:08:14,953 --> 00:08:16,455
నాకేమనాలో తెలియట్లేదు.

140
00:08:16,914 --> 00:08:19,582
అవును. ఆలస్యమైంది,
చాలా తక్కువ. నాకు తెలుసు.

141
00:08:25,631 --> 00:08:27,424
నిన్ను బాల్‌కు తీసుకెళ్లొచ్చా?

142
00:08:30,385 --> 00:08:31,303
ఏంటి?

143
00:08:31,762 --> 00:08:34,722
నాకు డాన్స్ వచ్చు.
ఇబ్బందేమీ కాదు.

144
00:08:38,602 --> 00:08:40,979
-నేను ఆలోచిస్తాను.
-ఆలోచించు.

145
00:08:44,149 --> 00:08:46,944
ఎందులో ఇరుక్కున్నావు, సిండర్‌బెల్లీ?

146
00:08:47,361 --> 00:08:49,029
నువ్వు రావడం ఆనందంగా ఉంది.

147
00:08:49,446 --> 00:08:52,199
నా షర్ట్ ఎక్కడుంది?
వాళ్లందరి పని పట్టబోతున్నాం.

148
00:08:52,282 --> 00:08:53,992
అవును. పద వెళ్దాం.

149
00:08:58,664 --> 00:09:00,082
-ఎలా ఉన్నావు, టేలర్?
-హే.

150
00:09:03,877 --> 00:09:05,754
మీ ఇద్దరితో ఏమవుతోంది?

151
00:09:06,380 --> 00:09:08,006
చెప్పాల్సింది చాలా ఉంది.

152
00:09:09,675 --> 00:09:11,260
ఇంకా నయం!

153
00:09:11,760 --> 00:09:12,761
లేదు నిజంగా.

154
00:09:12,844 --> 00:09:14,638
ఉత్సాహంగా అన్నాడా, భయంగా అన్నాడా?

155
00:09:14,721 --> 00:09:17,391
లేదా బతిమిలాడాడా?
దయచేసి బతిమిలాడాడని చెప్పు.

156
00:09:17,474 --> 00:09:18,850
బతిమిలాడలేదు.

157
00:09:20,269 --> 00:09:21,979
కానీ కొంచెం భయంగా అనిపించాడు.

158
00:09:22,062 --> 00:09:26,149
న్వువు అతన్ని కాదనబోతున్నావు
కాబట్టి ఇది చాలా బాగుంటుంది.

159
00:09:32,823 --> 00:09:35,117
బెల్లీ, నువ్వతన్ని కాదంటున్నావు, కదా?

160
00:09:35,200 --> 00:09:38,370
పోయిన వారం కాన్రాడ్
చేసిన చెత్త నీకు గుర్తు చేయనాా.

161
00:09:38,453 --> 00:09:39,413
నాకు తెలుసు.

162
00:09:39,496 --> 00:09:44,042
నీకు ఆ సరదాగా ఉండే,
భావోద్వేగాలు ఉన్న అందమైన తమ్ముడు

163
00:09:44,126 --> 00:09:48,171
నీ కోసం ఎదురు చూస్తున్నాడని కూడా
గుర్తు చేయనవసరం లేదు.

164
00:09:48,714 --> 00:09:50,590
రెడీనా? నేను తీసుకువెళ్తున్నాను.

165
00:09:51,216 --> 00:09:53,176
-నేను డ్రైవ్ చేయొచ్చా?
-లేదు.

166
00:09:56,346 --> 00:09:59,308
చూడు, మనం దీని గురించి
ఇప్పుడే మాట్లాడుకోనవసరం లేదు.

167
00:09:59,391 --> 00:10:01,727
-వచ్చింది అందుకు కాదు.
-ఇందుకే వచ్చాను.

168
00:10:01,810 --> 00:10:04,438
మనం ఈ టోర్నమెంట్
గెలవడానికి వచ్చావు.

169
00:10:04,521 --> 00:10:07,983
నిన్ను టీమ్ జెరెమియాలో చేర్చడానికి
ఉత్సాహం చూపిస్తున్న

170
00:10:08,066 --> 00:10:10,402
సీఈఓ వచ్చినందుకు నీకు ఆనందంగా ఉంది.

171
00:10:15,657 --> 00:10:17,034
ఆ. మనం రెడీగా ఉన్నాము.

172
00:10:25,375 --> 00:10:26,543
నీ వైజర్లు బాగున్నాయి.

173
00:10:26,626 --> 00:10:27,461
టీమ్ షైలా

174
00:10:27,544 --> 00:10:29,296
ధన్యవాదాలు. ఇవాళే కొన్నాము.

175
00:10:29,379 --> 00:10:31,882
స్టీవెన్ పచ్చనివన్నాడు.
కళ్లు కనిపిస్తాయన్నాడు.

176
00:10:31,965 --> 00:10:34,092
అవును, అవి బాగా కనిపిస్తున్నాయి.

177
00:10:39,306 --> 00:10:41,725
అయితే, ఎన్ని రోజులు ఉంటావు, టేలర్?

178
00:10:42,476 --> 00:10:44,853
ఏమో. పరిస్థితుల్ని బట్టి ఆలోచిస్తాను.

179
00:10:48,774 --> 00:10:52,402
మొత్తానికి నిన్ను కలవడం బాగుంది.
ఇప్పటిదాకా నీ గురించి విన్నాను.

180
00:10:52,486 --> 00:10:53,403
అవును.

181
00:10:54,529 --> 00:10:57,032
-నేను సన్‌స్క్రీన్ రాసుకోవాలి.
-సరే.

182
00:11:02,788 --> 00:11:04,456
మీరిద్దరూ బాగున్నారు.

183
00:11:04,790 --> 00:11:05,707
అవునా?

184
00:11:06,083 --> 00:11:08,335
అవును. సరే, కోర్టులో కలుస్తాను.

185
00:11:12,255 --> 00:11:13,465
గుడ్ ఆఫ్టర్‌నూన్.

186
00:11:13,548 --> 00:11:14,966
నేను సుసన్నా ఫిషర్,

187
00:11:15,050 --> 00:11:17,636
ఈ క్లబ్బు కమ్యూనిటీ సర్వీస్ చైర్‌ను,

188
00:11:17,719 --> 00:11:21,264
ప్లే ఇట్ ఫార్వర్డ్‌కు
స్వాగతిస్తున్నందుకు ఆనందంగా ఉంది.

189
00:11:23,225 --> 00:11:25,685
మా అమ్మ చెప్పేది,

190
00:11:25,894 --> 00:11:29,356
"బీచ్‌కు వెళ్లే అదృష్టం ఉంది అంటే,
మీకు అదృష్టం ఉన్నట్టే."

191
00:11:29,439 --> 00:11:32,234
ఇంకా నిజంగానే మనం చాలా అదృష్టవంతులం.

192
00:11:32,317 --> 00:11:35,070
-అయితే, సరదా...
-మీరిది గెలుస్తారు.

193
00:11:35,153 --> 00:11:38,782
...ఇంకా స్నేహపూర్వక పోటీ స్ఫూర్తితో
మన మనసులను పర్సులను తెరిచి

194
00:11:38,865 --> 00:11:41,618
మనంత అదృష్టం లేని వారికి
అందిచే సమయం వచ్చింది.

195
00:11:41,701 --> 00:11:45,539
ఇళ్లులేని వారు, మహిళా ఆశ్రయాలు,
పర్యావరణ కారణాలు, మరిన్నిటికి

196
00:11:45,622 --> 00:11:48,083
విరాళాలు సేకరిస్తున్న టీములు ఉన్నాయి.

197
00:11:48,165 --> 00:11:51,795
ఈ టోర్నమెంట్ విజేత
ఇచ్చేదానికి సమానంగా

198
00:11:51,878 --> 00:11:53,839
ప్లే ఇట్ ఫార్వర్డ్ ఇస్తుంది.

199
00:11:56,258 --> 00:11:59,553
విరాళాలు తీసుకుంటున్నాం,
దయచేసి విరాళాలు ఉదారంగా ఇవ్వండి.

200
00:12:00,262 --> 00:12:01,304
దానితో,

201
00:12:01,638 --> 00:12:03,473
ఆటలు మొదలుపెడదాం!

202
00:12:08,228 --> 00:12:10,147
ఆ ట్రోఫీ నాది.

203
00:12:11,022 --> 00:12:12,816
ఆ ఇద్దరితో జాగ్రత్తగా ఉండు.

204
00:12:12,899 --> 00:12:14,192
ఆమె బాగా విసురుతుంది.

205
00:12:15,735 --> 00:12:16,611
మనం సాధిద్దాం.

206
00:12:22,993 --> 00:12:23,827
హాయ్.

207
00:12:25,620 --> 00:12:28,039
-బాగున్నావు, జెరెమీ.
-ఎలా ఉన్నావు, టేలర్?

208
00:12:33,170 --> 00:12:36,214
ప్లీజ్. కంగారు పడకు.
అతను సీన్ నుంచి వెళ్లిపోయాడు.

209
00:12:36,798 --> 00:12:38,049
నీకది తెలుసా?

210
00:12:39,634 --> 00:12:43,013
తెలుసు. నేను టీమ్ జెల్లీ.
నేను చూసుకుంటాను. సరేనా?

211
00:12:43,638 --> 00:12:44,723
ధన్యవాదాలు.

212
00:12:53,106 --> 00:12:54,024
హే.

213
00:12:54,149 --> 00:12:55,066
హే!

214
00:12:56,985 --> 00:12:58,987
నేను నీకొక విషయం చెప్పాలి.

215
00:12:59,070 --> 00:13:03,325
డాన్స్‌కు వెళ్లడానికి బెల్లీకి తోడు లేరని
మా అమ్మ కంగారు పడుతోంది.

216
00:13:03,533 --> 00:13:04,451
అవును.

217
00:13:04,868 --> 00:13:06,828
ఆమె తొందరగా నిర్ణయించుకోవాలి.

218
00:13:06,912 --> 00:13:08,538
విషయం ఏమిటంటే, తను...

219
00:13:09,372 --> 00:13:11,750
మా అమ్మ నన్ను బెల్లీతో వెళ్లమంటోంది.

220
00:13:11,833 --> 00:13:13,585
జెరెమియా ఎందుకు కాదు?

221
00:13:14,544 --> 00:13:16,046
ఆ. అంటే...

222
00:13:16,713 --> 00:13:19,299
జెర్ గురించి తెలుసు కదా,
వాడికి ఇలాంటివి నచ్చవు.

223
00:13:20,509 --> 00:13:22,385
అదీ కాక, నాకా డాన్స్ వచ్చు.

224
00:13:22,469 --> 00:13:25,639
అవును. నాకు గుర్తుంది.
నువ్వు డాన్స్ బాగా చేస్తావు.

225
00:13:26,932 --> 00:13:28,808
-అది మర్చిపోకు.
-నేను మర్చిపోను.

226
00:13:29,768 --> 00:13:31,228
-ఏమైనా తాగుతావా?
-తాగుతాను.

227
00:13:31,311 --> 00:13:32,145
సరే.

228
00:13:37,192 --> 00:13:38,360
ప్లే ఇట్ ఫార్వార్డ్

229
00:13:39,444 --> 00:13:40,362
సరే, పద వెళదాం.

230
00:13:41,696 --> 00:13:42,906
పద, బెల్లీ. బాగా ఆడు.

231
00:13:44,115 --> 00:13:44,950
సరే.

232
00:13:45,283 --> 00:13:47,077
తెలివిగా ఆడు, చురుకుగా ఆడు.

233
00:13:50,038 --> 00:13:51,456
-ఆడు, బెల్లీ.
-రెడీనా?

234
00:13:51,957 --> 00:13:54,209
-నువ్వు చెయ్యగలవు. అవును.
-బాగుంది.

235
00:14:03,677 --> 00:14:04,594
ఆడు, బెల్లీ.

236
00:14:05,971 --> 00:14:08,139
బాగుంది. మీరు బాగా ఆడారు. బాగుంది!

237
00:14:10,642 --> 00:14:13,436
బాగుంది! బాగా ఆడండి, టీమ్ బెల్లీ.

238
00:14:18,233 --> 00:14:19,359
బాగా ఆడావు, టేలర్.

239
00:14:20,902 --> 00:14:22,320
-బాగానే ఉన్నావా?
-పరవాలేదా?

240
00:14:23,572 --> 00:14:25,031
లేదు, అది... నా మడమ.

241
00:14:25,824 --> 00:14:27,617
-సహాయం చేయనా?
-బాగున్నావా, టేలర్?

242
00:14:27,701 --> 00:14:29,536
-అది మెలితిరిగింది.
-సరే.

243
00:14:30,120 --> 00:14:30,954
నడవగలవా?

244
00:14:32,414 --> 00:14:34,833
-నువ్వు నా బదులు ఆడతావా?
-సరే.

245
00:14:36,751 --> 00:14:39,087
-నీకు సహాయం కావాలా?
-బానే ఉన్నావా?

246
00:14:39,170 --> 00:14:41,339
లేదు, పరవాలేదు. బానే ఉంది. నువ్వు ఆడు.

247
00:14:51,558 --> 00:14:53,101
మనం చేద్దాం!

248
00:14:58,523 --> 00:14:59,858
-బాగుంది!
-సరే, రెడీనా?

249
00:15:01,276 --> 00:15:03,194
పైకి. కిందకు. నడుము.

250
00:15:04,696 --> 00:15:06,364
అవును!

251
00:15:10,410 --> 00:15:11,828
-ఇదుగో.
-ధన్యవాదాలు.

252
00:15:11,911 --> 00:15:12,746
పరవాలేదు.

253
00:15:12,829 --> 00:15:13,747
బాగుంది.

254
00:15:18,543 --> 00:15:20,253
-బాగా ఆడావు!
-మంచి షాట్!

255
00:15:20,337 --> 00:15:22,839
-అవును.
-మనం సాధించాం!

256
00:15:22,922 --> 00:15:24,007
బాగా ఆడారు.

257
00:15:24,090 --> 00:15:25,175
టీమ్ బెల్లీ

258
00:15:25,258 --> 00:15:26,509
బాగా ఆడండి, టీమ్ బెల్లీ.

259
00:15:48,782 --> 00:15:49,699
మంచి ప్రయత్నం.

260
00:15:55,747 --> 00:15:57,915
వాటికి ముందుకు దూకాలి!
మనం ఇసుకలో ఉన్నాం.

261
00:15:57,999 --> 00:15:58,917
సరే.

262
00:16:04,923 --> 00:16:06,758
నేను బాగా దూకాలి, కదా?

263
00:16:06,841 --> 00:16:08,843
దృష్టి పెట్టు. వీళ్లు బాగా ఆడుతున్నారు.

264
00:16:15,850 --> 00:16:16,768
సరే.

265
00:16:17,310 --> 00:16:20,063
-నన్ను చూడకు బాల్‌ను చూడు.
-సరే.

266
00:16:20,146 --> 00:16:21,189
జెర్, దృష్టి పెట్టు.

267
00:16:33,034 --> 00:16:34,661
ఇదుగో. నేను.

268
00:16:43,670 --> 00:16:44,838
రెఫరీ. మేము...

269
00:16:52,887 --> 00:16:54,639
క్షమించు. నేనిది గెలవాలి.

270
00:16:54,723 --> 00:16:56,891
-వాళ్లు నేను గెలిచినంత ఇస్తారు.
-అర్థమైంది.

271
00:16:56,975 --> 00:16:59,310
కాన్రాడ్, నువ్వు రావాలి.

272
00:16:59,394 --> 00:17:00,437
ఇప్పుడే.

273
00:17:08,903 --> 00:17:10,155
బాగా ఆడావు, జెర్ బేర్.

274
00:17:11,698 --> 00:17:13,742
-నన్నెక్కడ ఉండమంటావు?
-మొదలు పెట్టు.

275
00:17:13,825 --> 00:17:15,034
మనమిది గెలుద్దాం.

276
00:18:10,298 --> 00:18:11,257
-అవును!
-గెలిచాం!

277
00:18:15,011 --> 00:18:16,971
టీమ్ బెల్లీ - టీమ్ స్విఫ్టీ

278
00:18:24,437 --> 00:18:26,397
టీమ్ బెల్లీ -టీమ్ ఎ-టీమ్

279
00:18:46,334 --> 00:18:48,795
అవును!
-అవును! అబ్బా!

280
00:18:49,003 --> 00:18:50,922
టీమ్ బెల్లీ వర్సెస్ టీమ్ షైలా

281
00:19:05,478 --> 00:19:06,479
బాగుంది.

282
00:19:18,867 --> 00:19:19,826
అవును!

283
00:19:23,788 --> 00:19:25,415
బూమ్, బేబీ! పద!

284
00:19:40,555 --> 00:19:41,848
అవును!

285
00:19:44,767 --> 00:19:46,728
అంతే. నువ్వు చేసావు.

286
00:20:15,131 --> 00:20:17,342
-బాగా ఆడావు, బెల్స్.
-ఇజబెల్ కాంక్లిన్,

287
00:20:17,425 --> 00:20:18,801
కాన్రాడ్ ఫిషర్ విజేతలు!

288
00:20:21,220 --> 00:20:23,598
అబ్బా! మీరు చాలా బాగా ఆడారు.

289
00:20:23,681 --> 00:20:25,433
మీరు మంచి టీమ్.

290
00:20:25,850 --> 00:20:27,143
నువ్వు ఆమెను అడిగావా?

291
00:20:27,226 --> 00:20:29,354
-ఏం అడగాలి?
-నీకు తోడుగా రావడం గురించి.

292
00:20:29,771 --> 00:20:33,066
నిర్ణయించుకోవడానికి సమయం పట్టినందుకు
నిన్నడగమని చెప్పాను.

293
00:20:33,441 --> 00:20:34,692
అభినందనలు!

294
00:20:37,111 --> 00:20:38,988
-గర్వంగా ఉంది.
-ఆనందంగా ఉంది.

295
00:20:46,120 --> 00:20:47,997
-నీ మడమ ఎలా ఉంది?
-పరవాలేదు.

296
00:20:48,081 --> 00:20:50,583
బెల్లీ. హే, బెల్లీ.

297
00:20:51,250 --> 00:20:52,335
హే, నికోల్.

298
00:20:52,418 --> 00:20:54,671
-నా ఫ్రెండ్ టేలర్ గుర్తుందా?
-ఆ. హాయ్.

299
00:20:55,213 --> 00:20:57,632
మా నాన్న బోటు అంగ్విలా నుండి
ఇప్పుడే వచ్చింది.

300
00:20:57,715 --> 00:21:00,510
కొన్ని గంటల తరువాత పిజ్జా,
గులాబి ఎలా ఉంటుంది?

301
00:21:02,053 --> 00:21:05,723
రోజు సరదాగా ముగించడానికి.
నువ్వూ రావచ్చు, టేలర్.

302
00:21:05,807 --> 00:21:07,183
కేలా వస్తోందా?

303
00:21:07,725 --> 00:21:11,521
షైలానా. లేదు,
ఆమెకు లియాం వాళ్లతో ప్లాన్లు ఉన్నాయి.

304
00:21:11,604 --> 00:21:13,648
-సరే, మేము వస్తాం.
-సరే.

305
00:21:15,149 --> 00:21:18,528
ఇవి చాలా బాగున్నాయి.
వాటిని ఇంకోసారి ఆవిరి పడతావా?

306
00:21:18,611 --> 00:21:19,988
సరే, తప్పకుండా.

307
00:21:20,446 --> 00:21:22,991
-నాకలా కావాలని లేదు.
-దాని గురించి ఆలోచించకు.

308
00:21:23,074 --> 00:21:24,075
-బెక్!
-ఏంటి?

309
00:21:24,158 --> 00:21:26,160
అవన్నీ నలిగిపోయాయి.
కానే కాదు.

310
00:21:26,244 --> 00:21:27,328
సరే, ఏదో ఒకటి.

311
00:21:28,162 --> 00:21:30,790
-నువ్వు ఎండకు నల్లబడ్డావు.
-అవునా?

312
00:21:30,873 --> 00:21:33,626
-సరే. ఇదుగోండి, అమ్మాయిలు.
-ధన్యవాదాలు

313
00:21:47,974 --> 00:21:50,601
నేను నా జీవితమంతా కావాలనుకున్నది ఇదొక్కటే,

314
00:21:50,685 --> 00:21:54,605
కాన్రాడ్ నన్ను ఎక్కడికైనా వెళ్దామని
అడగడం కోసం, అది కూడా ఒక బాల్‌కు.

315
00:21:55,064 --> 00:21:57,483
అది కూడా వాళ్ల అమ్మ అడిగిందని.

316
00:21:57,567 --> 00:22:00,820
జెల్లీ పని చేసి, బాన్రాడ్ పనిచేయదని
నేనన్నది నిరూపిస్తుంది.

317
00:22:01,195 --> 00:22:04,073
-బాన్రాడ్ పేరు చెత్తగా ఉంది.
-అవును.

318
00:22:04,157 --> 00:22:07,785
జెల్లీ ముద్దుగా బాగుంది.
నేను ఇన్‌స్టా కోసం టీమ్ జెల్లీ చేశాను.

319
00:22:10,830 --> 00:22:11,956
అబ్బా, టేలర్.

320
00:22:12,040 --> 00:22:12,957
గో టీమ్ జెల్లీ

321
00:22:14,167 --> 00:22:15,626
-అబ్బా.
-అవును.

322
00:22:17,962 --> 00:22:19,422
నేనేం చెయ్యను?

323
00:22:19,505 --> 00:22:23,843
నా మనసులో ఒక భాగం ఇంకా
అతని అన్నయ్యను కోరుకుంటున్నప్పుడు...

324
00:22:25,053 --> 00:22:28,056
నేను జెరెమియాతో
ఎలా సంబంధం ఏర్పరుచుకుంటాను?

325
00:22:28,931 --> 00:22:33,102
నా మనసులో ఒక భాగం
ఎప్పుడూ మీ అన్నయ్యను కోరుకుంటుంది.

326
00:22:33,186 --> 00:22:37,982
దాని అర్థం అతనికన్నా అద్భుతమైన వ్యక్తి
వస్తే అతనిని ప్రేమించనని అర్థం కాదు.

327
00:22:38,066 --> 00:22:39,192
-టేలర్.
-ఏంటి?

328
00:22:41,819 --> 00:22:42,653
బెల్లీ!

329
00:22:43,905 --> 00:22:45,156
-దేవుడా.
-అబ్బా.

330
00:22:52,622 --> 00:22:55,291
జెర్, నువ్వా పార్టీకి రావాలి.
అది చాలా బాగుంటుంది.

331
00:22:55,374 --> 00:22:57,752
లియాం ఐస్ లూజ్
తెప్పించాడని షైలా అంది.

332
00:22:58,711 --> 00:22:59,754
బాగుంది.

333
00:23:01,130 --> 00:23:02,340
నీకేమైంది?

334
00:23:03,424 --> 00:23:06,094
ఏమీ లేదు. నాకివాళ రాత్రికి
బయటకు వెళ్లాలని లేదు.

335
00:23:06,177 --> 00:23:09,305
ఏంటి? లేదు. బాబు, నాకు నీ అవసరం ఉంది.

336
00:23:09,388 --> 00:23:10,807
నువ్వు లేకపోతే సరదాగా ఉండదు.

337
00:23:11,516 --> 00:23:15,228
బాబు, షైలా ఉంటుందిగా.
తనంటే అందరికీ భయం.

338
00:23:21,067 --> 00:23:24,237
అవును! నువ్వు దృష్టి పెట్టకపోతే
ఏమైందో చూశావు కదా?

339
00:23:26,739 --> 00:23:28,950
సరే, నాకు కొంచెం పనుంది.

340
00:23:29,283 --> 00:23:30,243
సరదాగా గడుపు.

341
00:23:30,660 --> 00:23:31,536
ఆగు. ఏంటి?

342
00:23:36,791 --> 00:23:37,834
వాడికేమైంది?

343
00:23:38,584 --> 00:23:40,294
ఏమో. వింతగా ప్రవర్తిస్తున్నాడు.

344
00:23:40,920 --> 00:23:43,881
కానీ రాత్రికి రావట్లేదు,
నువ్వు, నేనే వెళ్తున్నాం.

345
00:23:43,965 --> 00:23:45,424
ఆ, ఆ విషయానికి వస్తే.

346
00:23:46,384 --> 00:23:47,718
నేనూ రాకపోవచ్చు.

347
00:23:48,136 --> 00:23:51,305
-నువ్వు ఈ వేసవి అంతా కలవలేదు.
-అది...

348
00:23:51,389 --> 00:23:55,768
కాన్రాడ్, నువ్వా పార్టీకి రాకపోతే
నాకు నీ మీద చాలా కోపం వస్తుంది.

349
00:23:56,769 --> 00:23:57,687
-సరే.
-నిజంగా?

350
00:23:57,770 --> 00:23:58,604
సరే. అలాగే.

351
00:23:59,730 --> 00:24:00,940
మొత్తానికి!

352
00:24:01,274 --> 00:24:03,192
నువ్వు నన్నసలు పట్టించుకోలేదు.

353
00:24:04,318 --> 00:24:05,778
అవును!

354
00:24:06,487 --> 00:24:09,699
అది చూశావా? అవును! బాగుంది.

355
00:24:11,742 --> 00:24:13,536
ఇరవై నాలుగు గంటల తేడాలో...

356
00:24:14,203 --> 00:24:17,665
మీరు ఇద్దరితో కలిసి సమయం
గడిపి ఉంటే వేలు కిందకు దించండి.

357
00:24:21,294 --> 00:24:22,128
నేను కూడా.

358
00:24:22,587 --> 00:24:26,507
సరే, మీరు ఎప్పుడైనా
ఒక సాఫ్ట్ టాయ్‌ని అందుకు వాడి ఉంటే వేలు...

359
00:24:27,383 --> 00:24:28,301
కిందకు దించండి.

360
00:24:28,926 --> 00:24:31,387
అతని పేరు హ్యారీ బేర్ స్టైల్స్. అంటే...

361
00:24:31,637 --> 00:24:33,055
నీ దానికి పేరు ఉందా?

362
00:24:33,639 --> 00:24:34,807
ఏంటి!

363
00:24:36,392 --> 00:24:39,103
సరే, నువ్వు సెక్స్ చేసుంటే
వేలు కిందకు దించండి.

364
00:24:45,443 --> 00:24:47,153
జననాంగాలు తాకేదాకా వెళ్లారా?

365
00:24:51,157 --> 00:24:53,701
తాకేదాకా వెళ్లుంటే వేలు కిందకు దించండి?

366
00:24:55,828 --> 00:24:58,998
జెరెమియా ఫిషర్‌ను ముద్దు పెట్టుకుంటే
వేలు కిందకు దించండి!

367
00:25:02,501 --> 00:25:04,420
-నోరు మూసుకో!
-వావ్!

368
00:25:04,503 --> 00:25:07,048
ఆగు, బెల్లీ, మాకంతా చెప్పు.

369
00:25:08,674 --> 00:25:10,968
-క్షమించు, జీజీ.
-లేదు, పరవాలేదు.

370
00:25:11,719 --> 00:25:15,181
అంటే చెప్పడానికి ఏమీ లేదు.
అతను నా బెస్ట్ ఫ్రెండ్.

371
00:25:15,264 --> 00:25:16,474
అది ఎప్పుడు మొదలైంది?

372
00:25:17,516 --> 00:25:21,729
ఒక వారం క్రితం మా ఇంట్లో
పూల్ దగ్గర ముద్దు పెట్టుకున్నాం.

373
00:25:22,980 --> 00:25:26,400
నేను నీకు, కాన్రాడ్‌కు మధ్య
ఏదో ఉందని అనుకున్నాను,

374
00:25:26,859 --> 00:25:29,403
కానీ తప్పు సోదరుడి గురించి అనుకున్నానేమో.

375
00:25:31,739 --> 00:25:33,115
ఆ, లేదు, అది...

376
00:25:33,658 --> 00:25:34,909
అది, నేను...

377
00:25:35,993 --> 00:25:36,994
ఏమో.

378
00:25:37,078 --> 00:25:38,871
పోనీలే. జెరెమియా గురించి చాలు.

379
00:25:38,955 --> 00:25:41,832
నగ్నంగా నీళ్లలోకి దిగితే
వేలు కిందకు దించండి?

380
00:25:42,291 --> 00:25:46,754
హాపర్స్ కోవ్‌లో నగ్నంగా నీళ్లలోకి దిగితే
వేలు కిందకు దించండి.

381
00:25:47,588 --> 00:25:48,756
అదేమైనా సవాలా?

382
00:25:49,382 --> 00:25:50,466
అవును.

383
00:25:52,843 --> 00:25:54,720
నీలో లోపమేమీ లేదు, లీసా.

384
00:25:54,804 --> 00:25:57,265
ఈ ఊరిని నీ గుప్పిట్లో పెట్టుకున్నావు.

385
00:25:59,100 --> 00:26:00,935
అలా ఏమీ కాదు.

386
00:26:04,021 --> 00:26:06,816
నువ్వు కానీ,
స్టీవెన్‌తో వెళ్లావనుకున్నాను.

387
00:26:06,899 --> 00:26:09,402
నాకు పార్టీకి రావాలని లేదు.

388
00:26:09,485 --> 00:26:11,279
అది నీలా అనిపించట్లేదు.

389
00:26:13,447 --> 00:26:15,408
నేను టోర్నమెంట్‌తో అలసిపోయాను.

390
00:26:17,076 --> 00:26:18,744
-బాగానే ఉన్నావా?
-ఆ. నేను...

391
00:26:19,745 --> 00:26:20,997
నేను అలసిపోయాను.

392
00:26:22,206 --> 00:26:24,000
నాతో సినిమా చూస్తావా?

393
00:26:25,334 --> 00:26:27,837
లేదా జాంబీలను చంపుదామా?

394
00:26:31,340 --> 00:26:33,467
సరే. ఇదెలా వాడాలి?

395
00:26:34,010 --> 00:26:36,512
అటూ ఇటూ చూడడానికి దీన్ని వాడాలి.

396
00:26:37,221 --> 00:26:38,222
ఇది కదపడానికి.

397
00:26:38,973 --> 00:26:40,266
ఎక్కు పెట్టు. షూట్ చేయ్.

398
00:26:41,767 --> 00:26:42,727
సరే, రెడీనా?

399
00:26:42,810 --> 00:26:44,562
జాంబీ డెత్ ప్లేగ్

400
00:26:45,354 --> 00:26:46,272
వాళ్లు వచ్చేశారు.

401
00:26:46,355 --> 00:26:48,482
-ఎక్కడ?
-అక్కడే, ఎడమ వైపు.

402
00:26:48,566 --> 00:26:50,651
-నా ఎడమా, నీ ఎడమా?
-అక్కడా.

403
00:26:55,364 --> 00:26:56,574
ప్రాక్టిస్ కావాలంతే.

404
00:26:57,950 --> 00:27:01,245
మీరివాళ నిరాశ్రయులకు
ఎంత విరాళం సేకరించారో తెలుసా?

405
00:27:01,329 --> 00:27:02,913
ఐదు వేల డాలర్లు.

406
00:27:03,998 --> 00:27:06,709
నీ పట్ల చాలా గర్వంగా ఉంది.
బెల్లీ గెలిచింది.

407
00:27:08,127 --> 00:27:10,546
అది బాల్‌లో అందరికన్నా బాగుంటుంది.

408
00:27:11,714 --> 00:27:13,424
ఎవరితో వెళ్తోందో చెప్పిందా?

409
00:27:13,716 --> 00:27:15,634
ఆ, కానీని తీసుకువెళ్లమని చెప్పాను.

410
00:27:16,469 --> 00:27:19,722
నిన్నే అడుగుదామనుకున్నాను
కానీ నీకివి నచ్చవని నాకు తెలుసు.

411
00:27:20,181 --> 00:27:21,265
అవును.

412
00:27:22,808 --> 00:27:24,935
అయితే, వెళ్తున్నారా? కాన్రాడ్, బెల్లీ?

413
00:27:25,019 --> 00:27:26,312
ఏమో తెలీదు.

414
00:27:27,229 --> 00:27:31,317
ఇవాళ పాత కానీలా
కనిపించాడు కదా? సంతోషంగా.

415
00:27:32,276 --> 00:27:33,319
అవుననుకుంటాను.

416
00:27:35,237 --> 00:27:38,866
వాడిని పట్టుకున్న చెడ్డ ఆలోచనా భావన
నీ దగ్గరకు రాలేదు కదా?

417
00:27:40,201 --> 00:27:41,077
లేదు.

418
00:27:42,495 --> 00:27:43,871
వచ్చిందేమో. నాకు తెలీదు.

419
00:27:44,997 --> 00:27:46,582
నేనేమైనా చేయగలనా?

420
00:27:48,501 --> 00:27:50,252
లేదు. ఇవాళ కొంచెం వింతగా ఉంది.

421
00:27:50,336 --> 00:27:52,421
అవునా? నేను ఇక్కడే ఉన్నాను.

422
00:27:56,592 --> 00:27:59,428
నేను పార్టీకి వెళ్తాను.

423
00:27:59,887 --> 00:28:02,264
-నువ్వు వస్తావా?
-ధన్యవాదాలు.

424
00:28:04,767 --> 00:28:05,893
నేను పడుకుంటాను.

425
00:28:06,894 --> 00:28:07,812
సరే.

426
00:28:17,029 --> 00:28:18,072
దేవుడా.

427
00:29:08,414 --> 00:29:12,126
నువ్వు గారేజీలో ఆ కారు చూశావా?
అది డీనో 246 అనుకుంటాను.

428
00:29:12,209 --> 00:29:14,253
లియాం కుటుంబానికి గొప్పలు కావాలి.

429
00:29:14,336 --> 00:29:16,839
నేనిలా పెరగడం ఊహించుకోలేను.

430
00:29:16,922 --> 00:29:18,424
ఇది అద్భుతం, కదా?

431
00:29:18,966 --> 00:29:20,926
ఏమీ కాదులే. నీకూ డబ్బుంది కదా.

432
00:29:21,343 --> 00:29:25,389
ఇలా కాదు.
వీళ్లు బోర్డింగ్ స్కూల్లో పెరిగారు.

433
00:29:25,473 --> 00:29:27,641
కుటుంబాన్ని ఏడాదికి ఒకసారే కలుస్తారు.

434
00:29:27,725 --> 00:29:30,311
అందుకనే వీళ్లు వెధవలు.
ఎవరూ సంతోషంగా లేరు.

435
00:29:30,394 --> 00:29:31,562
నువ్వు నిరాశావాదివి.

436
00:29:36,066 --> 00:29:38,652
అబ్బా! ఇతను వస్తాడని నాకు తెలుసు. అవును!

437
00:29:41,363 --> 00:29:42,490
అవును!

438
00:29:46,785 --> 00:29:49,580
-ఈ మధ్య జెరెమియా ఎవరితో వెళ్తున్నాడు?
-ఎవరూ లేరు.

439
00:29:49,872 --> 00:29:54,919
కాదు. షైలా ఒక కథ చెప్తోంది.
వాడు నా చెల్లెలితో వెళ్తున్నాడని అంటోంది.

440
00:29:55,878 --> 00:29:58,255
-నిజంగానా?
-అవును. నాకూ నచ్చలేదు.

441
00:29:58,339 --> 00:30:00,299
అది... వావ్.

442
00:30:00,382 --> 00:30:02,384
షైలాకు చాలా పిచ్చి కథనాలు ఉన్నాయి.

443
00:30:02,468 --> 00:30:05,679
నా చెల్లెల్ని ముట్టుకుంటే
చంపేస్తానని జెర్‌కు తెలుసు.

444
00:30:05,763 --> 00:30:08,224
అయో! ఇది చూడండి. ఒక ఐస్ లూజ్.

445
00:30:08,307 --> 00:30:10,059
ఇది ప్రయత్నించు! స్టీవెన్, రా.

446
00:30:10,142 --> 00:30:11,602
హే, నేను వెళ్లాలి.

447
00:30:27,368 --> 00:30:28,953
-సరే.
-అవును.

448
00:30:30,246 --> 00:30:31,539
వోవ్! అబ్బా.

449
00:30:31,622 --> 00:30:34,750
దేవుడా, వీధి చివరి నుంచి
నాకా గోల వినిపిస్తోంది.

450
00:30:34,833 --> 00:30:36,460
అదేంటో నీకు తెలుసు.

451
00:30:36,544 --> 00:30:37,503
హే!

452
00:30:38,879 --> 00:30:43,425
బేస్‌మెంట్‌లో ఒక గేమ్ జరుగుతోంది.
మీరు వెళ్లగలిగితే.

453
00:30:45,135 --> 00:30:46,136
నువ్వు ఆడతావా?

454
00:30:46,845 --> 00:30:47,721
ఆడు.

455
00:30:48,430 --> 00:30:49,765
సరే, ఆడతాను.

456
00:30:50,015 --> 00:30:50,933
మంచిది.

457
00:30:54,687 --> 00:30:55,563
సరదాగా గడుపు.

458
00:31:20,170 --> 00:31:21,964
హే. జెల్లీ ఫిష్ కోసం చూడు!

459
00:31:22,047 --> 00:31:24,800
నాకు మీలో ఎవరి మీద మూత్రం చెయ్యాలని లేదు.

460
00:31:24,883 --> 00:31:26,635
ఆ ఇద్దరమ్మాయిలు మిస్ అయ్యారు.

461
00:31:26,719 --> 00:31:28,887
అవును. డారా రాదనుకున్నాను,
కానీ మరిస్సా?

462
00:31:28,971 --> 00:31:31,307
-అవును. నేనూ అదే అనుకున్నాను!
-నికోల్.

463
00:31:31,515 --> 00:31:33,183
-ఏంటి?
-నీకు కాన్రాడ్ మెసేజ్!

464
00:31:33,267 --> 00:31:34,310
సరే, వస్తున్నాను.

465
00:31:41,900 --> 00:31:43,027
ఇది చాలా బాగుంది.

466
00:31:44,278 --> 00:31:45,821
నాకు నీ స్నేహితులు నచ్చారు.

467
00:31:45,904 --> 00:31:49,450
-నీకు నచ్చుతారని తెలుసు.
-నిన్ను, జెరెమియాను ఒప్పుకున్నారు.

468
00:31:49,533 --> 00:31:53,370
జీజీ కూడా, అది విన్నప్పుడు
కోపంతో రగిలిపోయింది.

469
00:31:53,787 --> 00:31:55,122
-అబ్బా!
-ఏమైంది?

470
00:31:55,205 --> 00:31:59,585
నాకిప్పుడే ఒకటి తట్టింది.
హ్యాష్‌ట్యాగ్ టీమ్ జెల్లీ ఫిష-ర్.

471
00:32:00,044 --> 00:32:01,003
జెల్లీ ఫిషర్.

472
00:32:01,670 --> 00:32:05,257
-టేలర్, అది పిచ్చిగా ఉంది.
-లేదు, నిజంగా అంటున్నాను. బాగుంది.

473
00:32:08,427 --> 00:32:11,096
-వాళ్లు చెత్త అని నాకు తెలుసు.
-ఏమవుతోంది?

474
00:32:12,139 --> 00:32:13,015
ఆగు...

475
00:32:17,186 --> 00:32:18,479
టేలర్, ఏమవుతోంది?

476
00:32:18,562 --> 00:32:21,315
వాళ్లు అంతా తీసుకు వెళ్లారు.
నీ ఫోన్ తప్ప.

477
00:32:21,940 --> 00:32:24,860
ఇందులో కాన్రాడ్ నుంచి ఒక టెక్స్ట్ ఉంది.

478
00:32:25,402 --> 00:32:26,862
అగు, ఏమని పంపాడు?

479
00:32:27,279 --> 00:32:30,407
"మా అమ్మ అడగమందని నిన్ను బాల్‌కు అడగలేదు."

480
00:32:30,491 --> 00:32:32,409
"నాకు అడగాలని ఉందని అడిగాను."

481
00:32:32,993 --> 00:32:34,036
దేవుడా!

482
00:32:35,162 --> 00:32:36,747
బెల్లీ, దృష్టి పెట్టు.

483
00:32:38,290 --> 00:32:39,458
-బెల్లీ!
-ఏంటి?

484
00:32:40,000 --> 00:32:44,129
సరే, మనం ఇప్పుడేం చెయ్యాలి?
మనం ఇంటికి నగ్నంగా వెళ్లలేము.

485
00:32:44,213 --> 00:32:46,006
అది ఇంకా ఘోరంగా కావచ్చు.

486
00:32:46,090 --> 00:32:49,259
-మనం వెళ్తున్నాం.
-టేలర్, ఇంతకన్నా ఘోరం ఇంకేం ఉంటుంది?

487
00:32:53,722 --> 00:32:55,224
సరే, అయితే...

488
00:32:56,350 --> 00:32:57,893
దాని సంగతి ఏంటి?

489
00:32:58,018 --> 00:32:58,894
కాదు!

490
00:33:11,699 --> 00:33:12,616
హే.

491
00:33:14,118 --> 00:33:15,035
ఏంటి సంగతులు?

492
00:33:16,537 --> 00:33:17,454
ఏమీ లేదు.

493
00:33:20,457 --> 00:33:24,837
హే, నువ్వు ఈ మధ్య అమ్మ గురించి
ఏదైనా వింతగా గమనించావా?

494
00:33:26,171 --> 00:33:28,173
ఏంటి? ఏం మాట్లాడుతున్నావు?

495
00:33:28,716 --> 00:33:30,551
ఆమె ఎక్కువ సేపు పడుకుంటోంది.

496
00:33:31,343 --> 00:33:32,886
ఇది వేసవి కాలం, జెర్.

497
00:33:32,970 --> 00:33:35,472
అమ్మ సెలవుల్లో ఎక్కువసేపు పడుకుంటుంది.

498
00:33:35,556 --> 00:33:37,349
సరే, అలాగే.

499
00:33:40,394 --> 00:33:42,229
ఇవాళ నీ గెలుపుకు అభినందనలు.

500
00:33:42,604 --> 00:33:44,356
ఓడిపోవడం నీకు నచ్చదని తెలుసు.

501
00:33:44,440 --> 00:33:46,191
అది గెలవడం గురించి కాదు.

502
00:33:48,277 --> 00:33:50,529
అది సరిగ్గా చేయడం గురించి.

503
00:33:52,698 --> 00:33:53,699
సరే. అలాగే.

504
00:34:00,956 --> 00:34:03,041
-ఇది బాగాలేదు.
-వాళ్లు చెత్తని తెలుసు.

505
00:34:03,125 --> 00:34:04,042
చాలు.

506
00:34:04,585 --> 00:34:06,086
నాకర్థమైంది. నువ్వు కరెక్ట్.

507
00:34:06,170 --> 00:34:08,672
జెరెమియాకు ఫోన్ చేద్దామా?
మనను చంపేస్తారు.

508
00:34:08,755 --> 00:34:11,300
వద్దు. జెరెమియాకు ఫోన్ చేస్తే
చాలా డ్రామా.

509
00:34:12,009 --> 00:34:14,011
నేను ఇంకా రెండు మైళ్లు నడవలేను.

510
00:34:14,511 --> 00:34:17,014
-నువ్వు నడవాలి.
-అబ్బా.

511
00:34:22,770 --> 00:34:23,645
నోరు మూసుకో.

512
00:34:24,480 --> 00:34:27,107
కాదు, ఇందుకే కాన్రాడ్ ఒక విపత్తు.

513
00:34:27,190 --> 00:34:30,694
అందంగా, రహస్యంగా ఉంటాడు,
నాకు అర్థమైంది. అవును.

514
00:34:31,445 --> 00:34:34,239
కానీ అతను తాకినదంతా చెత్త అవుతుంది.

515
00:34:34,782 --> 00:34:37,868
అవును. నేను ఎందుకంత
ప్రభావితం అవుతానో నాకు తెలీదు.

516
00:34:38,659 --> 00:34:42,080
ఇవాల్టిలా, పాత కాన్రాడ్‌లా ఉన్నాడు.

517
00:34:42,164 --> 00:34:44,500
నాకు అలానే అనిపించింది, తెలుసా.

518
00:34:44,583 --> 00:34:46,627
అతను నిన్ను మళ్లీ మాయలో పడేశాడు.

519
00:34:46,918 --> 00:34:48,545
ఆ మాయ చెదిరింది,

520
00:34:48,629 --> 00:34:52,591
అతని కోసం జెరెమియాను పక్కకు
నెట్టేసానని తెలుసుకున్నాను.

521
00:34:52,674 --> 00:34:54,467
అవును, నువ్వు అలానే చేశావు.

522
00:34:55,719 --> 00:34:56,594
నీకు తెలుసా...

523
00:34:59,097 --> 00:35:01,350
నేను కాన్రాడ్‌తో ఎలా ఉంటుందో

524
00:35:01,433 --> 00:35:04,436
ఊహించుకునే దాన్ని,
నాకు సురక్షితంగా అనిపించేది.

525
00:35:04,520 --> 00:35:06,271
ఎందుకంటే అది ఎప్పటికీ నిజం కాదు.

526
00:35:06,355 --> 00:35:09,107
నాకతని పట్ల అనిపించినట్లు
అతనికెప్పుడూ అనిపించదు.

527
00:35:10,275 --> 00:35:11,985
నేను, జెరెమియా ముద్దెట్టుకుంటే...

528
00:35:13,362 --> 00:35:14,321
నిజం అనిపించింది.

529
00:35:16,573 --> 00:35:19,576
నిజం, అంటే భయం వేసేట్టు.

530
00:35:23,163 --> 00:35:25,874
కానీ ప్రేమంటే భయం వేస్తుంది కదా?

531
00:35:30,337 --> 00:35:31,505
ఆ, సరిగ్గా చెప్పావు.

532
00:35:31,922 --> 00:35:34,508
నేనెప్పుడూ సరిగ్గానే చెప్తాను,
కనీసం 98 శాతం.

533
00:35:37,135 --> 00:35:38,011
నోరు మూసుకో.

534
00:35:39,805 --> 00:35:40,722
సరే.

535
00:35:42,391 --> 00:35:43,392
హమ్మయ్య.

536
00:35:45,519 --> 00:35:48,522
కాన్రాడ్ నేను నీతో విడిగా మాట్లాడాలి.

537
00:35:49,815 --> 00:35:51,567
సరే. నాకు పనుంది.

538
00:35:59,825 --> 00:36:00,826
హే, బెల్లీ.

539
00:36:04,454 --> 00:36:05,372
ఏంటి?

540
00:36:09,084 --> 00:36:10,002
ఏమైంది?

541
00:36:10,085 --> 00:36:12,880
హాపర్స్ కోవ్‌లో బెల్లీకి
పంపిన మెసేజ్ చూశాను.

542
00:36:13,422 --> 00:36:14,840
ఎంత పెద్ద అబద్ధం చెప్పావు.

543
00:36:15,257 --> 00:36:17,885
నువ్వు ఎడా పెడా అబద్దాలు చెప్పావు.

544
00:36:17,968 --> 00:36:21,930
నన్ను బ్యాకప్‌లా వాడుకున్నావు.
ఇది ఏదో అవుతుందనుకునేలా చేశావు.

545
00:36:22,014 --> 00:36:25,517
మీ అమ్మ తనను బాల్‌కు తీసుకువెళ్లమని
బలవంతం చేసిందని చెప్పావు.

546
00:36:25,601 --> 00:36:28,520
-నికోల్, ఒట్టు, మా అమ్మ నిజంగా--
-ఇక ఆపు!

547
00:36:28,604 --> 00:36:32,316
ఈ వేసవి అంతా ఇది అర్థం చేసుకోవడంతోనే
అయిపోయింది. ఈ "ఇది" ఏంటో కానీ.

548
00:36:32,399 --> 00:36:35,444
కానీ అది అంతా బెల్లీ గురించే కదా?

549
00:36:36,111 --> 00:36:41,158
నేనిలా ఇరుక్కుపోయినందుకు నామీద నాకే కోపంగా
ఉంది ఎందుకంటే నాకేం కావాలో నాకు తెలుసు.

550
00:36:42,576 --> 00:36:44,119
నిన్ను బాధ పెట్టాలనుకోలేదు.

551
00:36:44,202 --> 00:36:46,163
ఇంకా నయం. నువ్వు బాధ పెట్టలేదు.

552
00:36:46,538 --> 00:36:48,248
నా సమయం వృథా చేశావు.

553
00:36:48,332 --> 00:36:49,583
తేడా ఉంది.

554
00:36:50,083 --> 00:36:52,210
చాలా మంది నాతో ఉండాలనుకున్నారు.

555
00:36:52,294 --> 00:36:55,505
ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకునే అబ్బాయికి
నేనంటే పిచ్చి.

556
00:36:55,589 --> 00:36:57,507
అతనికి ఏం కావాలో అతనికి తెలుసు.

557
00:36:58,675 --> 00:36:59,593
సరే.

558
00:37:00,552 --> 00:37:01,386
సరేనా?

559
00:37:01,970 --> 00:37:03,013
నాకు అర్థమైంది.

560
00:37:03,764 --> 00:37:06,725
నేను ఆశ చూపించాను. అంతా పాడు చేశాను.

561
00:37:07,893 --> 00:37:11,897
నేను చాలా చెత్త ఎదుర్కొంటున్నాను, అది...

562
00:37:11,980 --> 00:37:13,982
కానీ అది కారణం కాదు. నన్ను క్షమించు.

563
00:37:16,401 --> 00:37:17,736
అది నీ పట్ల అన్యాయం.

564
00:37:20,989 --> 00:37:21,990
నన్ను క్షమించు.

565
00:37:31,249 --> 00:37:33,877
నీ గర్ల్ ఫ్రెండ్,
ఆమె ఫ్రెండ్‌కు ఇవి అవసరం.

566
00:37:45,222 --> 00:37:46,348
నేను ఇరవై పెంచుతాను.

567
00:37:48,100 --> 00:37:50,560
అయితే మీరు ఎప్పటి నుంచి కలిసి ఆడుతున్నారు?

568
00:37:50,644 --> 00:37:54,147
కోయేట్‌లో మొదటి ఏడాది నుంచి.
లియాం పోకర్ సొసైటీ ప్రెసిడెంట్.

569
00:37:57,150 --> 00:37:58,777
నువ్వు షో చెప్తావా?

570
00:38:01,446 --> 00:38:03,782
ఆ. అంతా పెడుతున్నాను.

571
00:38:08,412 --> 00:38:12,082
పీఏ నుండి స్టీవెన్ ఈ అదృష్ట పరంపరను
కొనసాగించగలడో లేదో చూద్దాం.

572
00:38:21,174 --> 00:38:22,134
ఛ.

573
00:38:24,302 --> 00:38:25,137
అవును!

574
00:38:30,684 --> 00:38:33,145
అంతా బాగానే ఉంది.
అందరూ ఒకసారి ఓడిపోతారు.

575
00:38:33,228 --> 00:38:34,187
అవును.

576
00:38:35,272 --> 00:38:36,189
బ్రేక్ కావాలా?

577
00:38:38,108 --> 00:38:41,903
తరువాత పందెం పెంచుదాము.
మరో 200, సరేనా?

578
00:39:10,974 --> 00:39:12,601
అయ్యో, బెల్లీ, బాగానే ఉన్నావా?

579
00:39:15,312 --> 00:39:18,356
-నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?
-నికోల్ చెప్పింది...

580
00:39:20,484 --> 00:39:22,611
ఆమెను జాగ్రత్తగా ఉండమని చెప్పావు కదా.

581
00:39:23,278 --> 00:39:24,279
ఇదుగో.

582
00:39:27,074 --> 00:39:28,700
సరే. నువ్వు కొంచెం...

583
00:39:29,576 --> 00:39:30,911
-సహాయం కావాలా?
-సరే.

584
00:39:34,915 --> 00:39:36,291
జెరెమియాతో వెళ్లనా?

585
00:39:36,374 --> 00:39:39,419
ఇంకా నయం, ఏమంటున్నావు?
తప్పకుండా వెళ్లు.

586
00:40:02,651 --> 00:40:04,152
భయంకరమైన రాత్రి.

587
00:40:04,528 --> 00:40:05,862
అలా అయి ఉండేది కాదు.

588
00:40:06,071 --> 00:40:08,532
నువ్వు ఆటలు ఆపి,
ఆమెను వెళ్లనిచ్చి ఉంటే,

589
00:40:08,615 --> 00:40:10,492
ఈ రాత్రి చాలా బాగుండేది.

590
00:40:25,674 --> 00:40:28,009
నన్ను క్షమించు.
టోర్నమెంట్ విషయానికి.

591
00:40:28,093 --> 00:40:30,846
నాలో పోటీతత్వం ఎక్కువ...

592
00:40:33,098 --> 00:40:34,057
కోపంగా ఉన్నావా?

593
00:40:34,808 --> 00:40:35,976
లేదు. అంతా బాగానే ఉంది.

594
00:40:36,726 --> 00:40:38,812
కాన్రాడ్ బాగా ఆడతాడు.

595
00:40:42,149 --> 00:40:44,317
నీతో బాల్‌కు వస్తున్నాడని విన్నాను.

596
00:40:44,401 --> 00:40:45,694
నీకెవరు చెప్పారు?

597
00:40:46,027 --> 00:40:46,987
మా అమ్మ.

598
00:40:49,072 --> 00:40:50,031
అతను రావట్లేదు.

599
00:40:51,408 --> 00:40:53,201
నాకింకా డేట్ లేదు.

600
00:41:02,794 --> 00:41:03,879
పక్కన ఆపుతావా?

601
00:41:06,006 --> 00:41:06,923
సరే.

602
00:41:20,228 --> 00:41:22,063
నా కోసం వచ్చినందుకు ధన్యవాదాలు.

603
00:41:25,692 --> 00:41:27,861
బెల్లీ, నీ కోసం ఎప్పుడూ వస్తాను.

604
00:41:36,703 --> 00:41:37,829
అది వింటున్నావా?

605
00:41:40,582 --> 00:41:41,458
ఏం వినాలి?

606
00:41:45,253 --> 00:41:46,463
నా గుండె కొట్టుకుంటోంది.

607
00:41:54,304 --> 00:41:56,181
అవును, చాలా వేగంగా కొట్టుకుంటోంది.

608
00:42:13,156 --> 00:42:14,074
అవునా?

609
00:42:24,000 --> 00:42:27,379
ఈ క్షణం వస్తుందని ఎప్పుడూ భయపడే దాన్ని,

610
00:42:27,462 --> 00:42:29,923
కానీ వింతగా, నాకు బాగానే ఉంది.

611
00:42:30,006 --> 00:42:32,092
ఎందుకంటే, ఇది జెరెమియా కాబట్టి.

612
00:42:34,219 --> 00:42:35,136
అయితే...

613
00:42:37,681 --> 00:42:39,933
నాతో డెబ్యుటాంటే బాల్‌కు వస్తావా?

614
00:43:05,959 --> 00:43:08,003
కాన్రాడ్
పడుకోలేదా?

615
00:43:25,228 --> 00:43:26,146
హే.

616
00:43:27,314 --> 00:43:28,440
నాకు మెసేజ్‌లు పంపకు.

617
00:43:29,065 --> 00:43:31,443
ప్రకంపన రేపుతుంది.
నీ మెసేజ్‌తో మనసు పాడవుతోంది.

618
00:43:31,526 --> 00:43:32,944
నాకు తెలుసు.

619
00:43:34,029 --> 00:43:35,030
నన్ను క్షమించు.

620
00:43:37,073 --> 00:43:40,285
నీ విషయానికి వస్తే
అంతా తప్పే చేస్తున్నట్టనిపిస్తోంది.

621
00:43:44,247 --> 00:43:45,290
ఇది నీదే.

622
00:43:51,254 --> 00:43:54,591
నువ్విది ఉంచుకోనవసరం లేదు.

623
00:43:54,924 --> 00:43:58,011
నువ్వు దాన్ని చెత్తలో పడేయ్, కాల్చేయ్...

624
00:44:02,974 --> 00:44:03,975
నాకు...

625
00:44:05,477 --> 00:44:06,394
ఏంటి?

626
00:44:11,483 --> 00:44:12,484
నాకు...

627
00:44:15,820 --> 00:44:17,113
నిన్ను కోల్పోవాలని లేదు.

628
00:44:36,508 --> 00:44:37,592
అందుకు ఆలస్యమైంది.

629
00:46:42,300 --> 00:46:44,302
సబ్‌టైటిల్ అనువాద కర్త కర్త మైథిలి

630
00:46:44,385 --> 00:46:46,387
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్

