1
00:00:06,048 --> 00:00:08,175
ద సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెట్టీ లో
గతంలో...

2
00:00:08,259 --> 00:00:10,302
అమ్మకాన్ని వెనక్కి
తీసుకోవాలనుకుంటున్నాను.

3
00:00:10,386 --> 00:00:11,637
స్టాన్‌ఫర్డ్ నీ కలల కాలేజీ.

4
00:00:11,721 --> 00:00:14,348
అది వదిలేసి, నా కోసం బ్రౌన్‌లో
ఉండడానికి ఒప్పుకోను.

5
00:00:14,432 --> 00:00:16,892
ఫైనల్ పరీక్ష రాయనందుకు
సీటు వెనక్కి తీసుకుంటారేమో.

6
00:00:16,976 --> 00:00:17,935
అయితే నువ్వది రాస్తావు.

7
00:00:18,018 --> 00:00:19,562
-నీకు ఫించ్ చూపిస్తాను.
-సరే.

8
00:00:19,645 --> 00:00:22,857
నాకెలా అనిపించిందో,
లేదా ఎలా అనిపిస్తోందో చెప్పుండాల్సింది.

9
00:00:22,940 --> 00:00:24,900
తనను ప్రేమిస్తే,
ఎలా అనిపిస్తోందో చెప్పు.

10
00:00:24,984 --> 00:00:27,528
నీకు, కాన్రాడ్‌కు మధ్య
ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది.

11
00:00:27,611 --> 00:00:30,990
పోయినసారిలా నువ్వు మనసు మార్చుకుంటే
నేను తట్టుకోలేను.

12
00:00:31,073 --> 00:00:32,324
నాకు నువ్వు కావాలి.

13
00:00:40,166 --> 00:00:46,172
ద సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెట్టీ

14
00:00:57,558 --> 00:00:59,643
హే. పరీక్ష ఎలా రాసావు?

15
00:00:59,727 --> 00:01:02,646
యో! కాలిఫోర్నియాలో
నన్ను కలవడానికి వస్తావా?

16
00:01:04,023 --> 00:01:04,982
వస్తాను!

17
00:01:05,065 --> 00:01:06,484
అభినందనలు, కానీ!

18
00:01:06,567 --> 00:01:07,985
ఫ్లాష్ కార్డుల వలనా?

19
00:01:08,068 --> 00:01:10,696
ఫ్లాష్ కార్డుల వలనే.
ధన్యవాదాలు తరువాత చెప్పు.

20
00:01:10,780 --> 00:01:14,116
నువ్వింకా ధైర్యంగానే ఉన్నావా...

21
00:01:16,035 --> 00:01:17,161
ఆ ప్లాన్ గురించి?

22
00:01:17,411 --> 00:01:18,579
ప్లాన్ బెల్లీ?

23
00:01:18,662 --> 00:01:20,289
అదెవరో గుర్తు చేయకు.

24
00:01:21,123 --> 00:01:23,292
కానీ ఒక వియుక్త భావనగా,

25
00:01:24,543 --> 00:01:27,004
-నీ ప్రయత్నం చెయ్యి.
-ధన్యవాదాలు.

26
00:01:27,087 --> 00:01:28,964
సరే, నేను వెళ్ళాలి. బై.

27
00:01:45,815 --> 00:01:47,024
-కాన్రాడ్--
-కాదు.

28
00:01:47,900 --> 00:01:49,026
దయచేసి ఆపొద్దు.

29
00:01:49,109 --> 00:01:51,487
ఇక్కడ అంతరాయం కలిగిస్తోంది నేనే.

30
00:01:51,570 --> 00:01:53,072
కాన్రాడ్, అబ్బా.

31
00:02:03,207 --> 00:02:04,542
అతని వెనుక వెళ్తావా?

32
00:02:07,461 --> 00:02:08,379
ప్లీజ్.

33
00:02:11,423 --> 00:02:12,424
సరే.

34
00:02:14,802 --> 00:02:15,719
కాన్రాడ్.

35
00:02:17,513 --> 00:02:18,514
ఆగు, కాన్రాడ్.

36
00:02:18,597 --> 00:02:20,558
-నాకు నీతో మాట్లాడాలని లేదు.
-అబ్బ.

37
00:02:20,641 --> 00:02:22,601
ప్లీజ్, నాతో మళ్లీ అలా చేయకు.

38
00:02:23,769 --> 00:02:26,230
ముగ్గరం అలా ఈ సంవత్సరంలో
చాలా సార్లు చేసాము,

39
00:02:26,313 --> 00:02:28,232
అది పరిస్థితులను పాడు చేసింది.

40
00:02:32,319 --> 00:02:34,113
మాట్లాడదామంటే సరే, మాట్లాడదాం.

41
00:02:39,034 --> 00:02:40,828
నువ్వది చూసినందుకు బాధగా ఉంది.

42
00:02:40,911 --> 00:02:42,913
అదంతా గందరగోళంగా ఉంది.

43
00:02:44,790 --> 00:02:48,002
నిన్న రాత్రి నాకెలా
అనిపిస్తోందో నీకు చెప్పాలనుకున్నాను--

44
00:02:48,085 --> 00:02:49,336
సరే. అర్థమైంది.

45
00:02:50,546 --> 00:02:52,882
-నీకు జెరెమియాతో ఉండాలనుంది.
-కాన్రాడ్.

46
00:02:52,965 --> 00:02:55,092
లేక నా దృష్టిని ఆకర్షించడానికా?

47
00:02:56,093 --> 00:02:57,052
నిజంగా అంటున్నావా?

48
00:02:58,178 --> 00:03:00,848
అలా చేసి నిన్ను తిరిగి
పొందుతానని అనుకుంటున్నావా?

49
00:03:04,852 --> 00:03:05,978
అందుకు సమాధానం కాదు.

50
00:03:07,521 --> 00:03:08,856
ఇది నీ గురించి కాదు.

51
00:03:11,358 --> 00:03:12,359
అయితే వెళ్లు!

52
00:03:13,360 --> 00:03:14,278
వెళ్లు!

53
00:03:15,404 --> 00:03:17,239
నా వెంటపడడం ఆపి, జెర్ దగ్గరకు వెళ్లు.

54
00:03:17,323 --> 00:03:18,991
నువ్వు కావాలనుకునేది వాడే.

55
00:03:21,577 --> 00:03:22,494
నేను కోరుకోను.

56
00:03:22,578 --> 00:03:23,787
ఇక పై కాదు.

57
00:03:36,884 --> 00:03:39,553
నువ్వు రెండు నెలల్లో
కాలేజీకి ఎలా వెళ్తున్నావు?

58
00:03:39,637 --> 00:03:42,264
అబ్బా. దయచేసి అది గుర్తు చేయకు.

59
00:03:42,348 --> 00:03:44,600
ఇప్పటికే చదవాల్సిన వాటిలో
వెనుకబడి ఉన్నాను.

60
00:03:44,683 --> 00:03:46,018
వేసవి మొదలయి వారమే అయింది.

61
00:03:46,101 --> 00:03:47,686
నువ్వు దృష్టి పెట్టాలి.

62
00:03:47,770 --> 00:03:50,189
ప్రిన్స్‌టన్‌తో పోలిస్తే
కాలేజీ చాలా తేలిక.

63
00:03:50,272 --> 00:03:53,817
పోయిన వారం అంతా
సమయం వృథా చేశాను, అందుకని--

64
00:03:53,901 --> 00:03:56,528
నువ్వు చేయాల్సింది అదే.

65
00:03:56,612 --> 00:03:58,906
తాగడం, మీ అమ్మకు అబద్ధం చెప్పడం,

66
00:03:58,989 --> 00:04:02,117
నీ గర్ల్‌ఫ్రెండ్‌తో షికార్లు కొట్టడం,
బీచ్‌కు వెళ్ళడం.

67
00:04:02,201 --> 00:04:05,371
నువ్వెవరు, మా అమ్మను ఏం చేసావు?

68
00:04:05,996 --> 00:04:08,332
నాలోని సుసన్నాను
బయటకు తీసుకువస్తున్నాను.

69
00:04:14,171 --> 00:04:16,006
గర్ల్‌ఫ్రెండ్ ఉందని ఎవరన్నారు?

70
00:04:16,090 --> 00:04:17,716
ఊరుకో, స్టీవెన్.

71
00:04:17,800 --> 00:04:20,552
టేలర్‌కు నీ కారు ఇచ్చి పంపావు.

72
00:04:21,011 --> 00:04:23,263
ప్రయాణమంతా తనకు సందేశం చేస్తున్నావు.

73
00:04:23,347 --> 00:04:24,765
-నేను--
-మామూలుగా లేవు.

74
00:04:24,848 --> 00:04:27,434
సరే. నువ్వు, క్లీవ్‌ల్యాండ్ ఎలా ఉన్నారు?

75
00:04:28,185 --> 00:04:32,690
న్యూయార్క్ నుంచి వచ్చాక సరదాగా ఉన్నావు.
ఏమైనా జరిగిందా?

76
00:04:32,773 --> 00:04:34,108
నిజంగా తెలుసుకోవాలనుందా?

77
00:04:34,191 --> 00:04:37,111
లేదు, లేదు,
ఎందుకు అడిగానో కూడా నాకు తెలీదు.

78
00:04:38,696 --> 00:04:41,031
అతని మూడు కాల్స్ ఎత్తలేదు.

79
00:04:41,115 --> 00:04:44,368
ఫిష్‌టౌన్‌లో లిటరరీ సమావేశానికి
పంపాలని అనుకుంటున్నాడు.

80
00:04:44,868 --> 00:04:45,869
అది బాగుంది కదా.

81
00:04:45,953 --> 00:04:48,539
అద్దె తగ్గుతుందని వచ్చిన
బ్రూక్లిన్ రచయితలు.

82
00:04:48,622 --> 00:04:50,290
మా మధ్య కలిసేది ఏదీ ఉండదు.

83
00:04:50,374 --> 00:04:51,875
అమ్మా, వాళ్లు నీ మనుషులు.

84
00:04:51,959 --> 00:04:54,378
నేను శివార్లలో ఉండే
మధ్య తరహా రచయితను.

85
00:04:54,461 --> 00:04:56,088
వాళ్ల అభిప్రాయం కనిపిస్తుంది.

86
00:04:57,047 --> 00:05:01,010
సరే, నువ్వు మాకు ఎప్పుడూ చెప్తావు,

87
00:05:01,093 --> 00:05:04,638
ఎదగాలంటే మనకు నచ్చని పనులు చేయాలని.

88
00:05:04,722 --> 00:05:05,931
దాని అర్థం ఏదైతే అది.

89
00:05:07,349 --> 00:05:09,309
నువ్వు నీ సొంత సలహా వినాలేమో.

90
00:05:12,730 --> 00:05:13,647
సరే.

91
00:05:21,739 --> 00:05:22,740
వస్తున్నాడా?

92
00:05:26,618 --> 00:05:28,746
వాడు కారు లేకుండా ఎక్కడికీ వెళ్ళలేడు,

93
00:05:28,829 --> 00:05:32,082
ఈ రాత్రికి డార్మ్స్
ఖాళీ చేయాలి, అందుకని...

94
00:05:33,709 --> 00:05:34,752
వాడు తిరిగొస్తాడు.

95
00:05:35,210 --> 00:05:36,336
నాకు తెలుసు.

96
00:05:36,420 --> 00:05:38,005
ఏమో. అంటే...

97
00:05:39,631 --> 00:05:43,177
మనకు, అతనికి మధ్య సంబంధం లేదని
స్పష్టం చేసాడు.

98
00:05:43,260 --> 00:05:44,928
ముఖ్యంగా, నాతో.

99
00:05:47,264 --> 00:05:49,058
నీతో ఏమన్నాడు, బెల్స్?

100
00:05:53,270 --> 00:05:54,521
అతని ఆలోచనలో...

101
00:05:56,273 --> 00:06:00,069
తనకు అసూయ తెప్పించడం కోసం
నీకు ముద్దు పెట్టానన్నాడు.

102
00:06:08,952 --> 00:06:10,662
హే, మనం వెళదాము.

103
00:06:10,746 --> 00:06:11,830
మనం ఆగుదాం.

104
00:06:13,665 --> 00:06:14,583
సరే.

105
00:06:25,928 --> 00:06:27,721
కాన్రాడ్, వచ్చేసావు.

106
00:06:29,515 --> 00:06:32,559
కాన్రాడ్, వచ్చేసావు!

107
00:06:34,478 --> 00:06:36,563
నీకేమైంది?

108
00:06:37,481 --> 00:06:39,900
మా తమ్ముడు ముద్దు పెట్టుకోవడం చూసాను...

109
00:06:42,528 --> 00:06:43,445
బెల్లీని.

110
00:06:45,280 --> 00:06:46,949
యో!

111
00:06:47,533 --> 00:06:51,203
వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని నాకనిపించింది.

112
00:06:51,829 --> 00:06:53,163
అబద్ధం చెప్పను,

113
00:06:53,497 --> 00:06:56,583
ఆ కళ్ళు బాబు.
అమ్మాయిలు వాటిని కాదనలేరు.

114
00:06:56,667 --> 00:07:00,129
మీ తమ్ముడు చాలా బాగుంటాడు.
నువ్వు బాగుండవని కాదు,

115
00:07:00,754 --> 00:07:03,924
కానీ మీ తమ్ముడి కళ్ళను చూశావా?
చూసే ఉంటావు.

116
00:07:04,007 --> 00:07:06,593
ఆ లోతైన కళ్ళు, బాబు?

117
00:07:06,677 --> 00:07:09,179
దాని గురించి బిల్లీ ఐలిష్ ఒక పాట రాసింది.

118
00:07:09,263 --> 00:07:12,432
నువ్వు చూడడం ఆపలేని కారణం--

119
00:07:12,516 --> 00:07:13,475
ట్రస్కీ?

120
00:07:13,559 --> 00:07:15,686
నువ్వు అది వినాలనుకోవు. క్షమించు--

121
00:07:15,769 --> 00:07:16,979
హే, నేను వెళ్తాను.

122
00:07:17,062 --> 00:07:19,064
నీకు కావాల్సింది ఉంచుకో, సరేనా?

123
00:07:24,695 --> 00:07:27,656
గంట అయింది, జెర్, ఇక వస్తాడనుకోను.

124
00:07:28,615 --> 00:07:30,117
ఎప్పటికైనా వస్తాడు.

125
00:07:30,868 --> 00:07:32,661
కారు, తాళాలు మన దగ్గరున్నాయి.

126
00:07:38,709 --> 00:07:40,919
అతన్ని సాధించడానికి ముద్దు పెట్టుకోలేదు.

127
00:07:42,796 --> 00:07:44,256
నీకది తెలుసు కదా?

128
00:07:53,557 --> 00:07:55,642
జరగండి.

129
00:07:57,519 --> 00:07:58,979
వెళ్ళడానికి రెడీగా ఉన్నారా?

130
00:07:59,062 --> 00:08:01,857
నువ్వు వస్తావో రావో తెలియదు.

131
00:08:01,940 --> 00:08:04,151
బెల్లీని దింపుతానని లారెల్‌కు చెప్పాను.

132
00:08:06,111 --> 00:08:08,405
-ఇదుగో. డ్రైవ్ చెయ్యి.
-వద్దు.

133
00:08:08,739 --> 00:08:10,991
నేను డ్రైవ్ చెయ్యలేను.

134
00:08:13,493 --> 00:08:15,078
రాత్రంతా పడుకోలేదు.

135
00:08:15,996 --> 00:08:16,872
కంగారు పడకు.

136
00:08:46,485 --> 00:08:48,612
చదివితే నీకు వాంతి అవుతుంది.

137
00:08:48,695 --> 00:08:49,988
తను బాగానే ఉంది.

138
00:08:50,072 --> 00:08:51,865
నీకు తెలుసో లేదో నాకు తెలియదు,

139
00:08:52,449 --> 00:08:55,661
కానీ కార్లో చదివితే బెల్లీకి
వాంతి అవుతుంది.

140
00:08:56,286 --> 00:08:57,454
నీకది తెలుసా?

141
00:08:57,537 --> 00:08:59,706
-తెలుసు.
-పొరపాటు నాదే.

142
00:08:59,790 --> 00:09:01,708
కానీ బెల్లీ నిన్ను నీ పరీక్షకు

143
00:09:01,792 --> 00:09:04,211
ప్రశ్నలు అడగడానికి టాబ్లెట్ వేసుకుంది.

144
00:09:07,589 --> 00:09:09,967
నా స్వెట్‌షర్ట్ నీకు నప్పింది, బెల్లీ.

145
00:09:10,550 --> 00:09:13,178
నువ్విది తీసుకోవచ్చు.
ఫించ్‌లో కొనుక్కున్నాను.

146
00:09:13,262 --> 00:09:14,179
ఉంచుకో.

147
00:09:16,390 --> 00:09:17,849
అది...

148
00:09:21,937 --> 00:09:23,563
మీరు ఫించ్‌కు వెళ్ళారా?

149
00:09:23,647 --> 00:09:27,234
రొమాంటిక్ పిక్నిక్‌లా ఉంది.

150
00:09:27,317 --> 00:09:29,778
స్కూల్ చూడడానికి తీసుకువెళ్ళాను.

151
00:09:31,488 --> 00:09:34,533
నీకు స్టాన్‌ఫర్డ్‌ది
తీసుకువద్దామని అనుకున్నాను...

152
00:09:34,616 --> 00:09:36,994
కానీ ఫించ్ బాగుంది.

153
00:09:39,329 --> 00:09:43,750
అయితే, ఇది ఎప్పటి నుంచి
నడుస్తోంది? వారమా?

154
00:09:45,669 --> 00:09:47,254
-కాదు.
-కాదు, సరే.

155
00:09:48,171 --> 00:09:50,048
అయితే, అది మీ మొదటి ముద్దా?

156
00:09:50,132 --> 00:09:51,758
ఎలా-- కాదు, కాదు, కాదు.

157
00:09:52,175 --> 00:09:54,594
పోయిన వేసవిలో బీచ్ వద్ద నాకు ఏం చెప్పావు?

158
00:09:54,678 --> 00:09:57,139
కొన్ని సార్లని చెప్పావు.

159
00:09:57,597 --> 00:10:00,392
కొన్ని సార్లు అంతే ఎన్నిసార్లు? మూడా?

160
00:10:01,435 --> 00:10:02,477
నాలుగా?

161
00:10:03,770 --> 00:10:05,772
గత వేసవిలో ఎన్ని సార్లు?

162
00:10:07,691 --> 00:10:09,192
అబ్బా.

163
00:10:13,530 --> 00:10:16,783
విచక్షణ. నాకు నచ్చింది.
అది నీకు నప్పింది, జెర్.

164
00:10:16,867 --> 00:10:18,201
ఎందుకంటే అది కొత్తది.

165
00:10:18,285 --> 00:10:19,703
చాలా కొత్తది.

166
00:10:19,786 --> 00:10:21,788
-అవును. అనుకుంటాను.
-అవును.

167
00:10:23,248 --> 00:10:26,376
ఎప్పుడూ అయితే, నీ గర్ల్‌ఫ్రెండ్స్ గురించి
చెప్పడం ఆపవు.

168
00:10:26,460 --> 00:10:29,713
బెల్లీ కాకుండా గత ఏడాది ఏడుగురు కదా.

169
00:10:29,796 --> 00:10:31,715
-నోరు మూసుకో!
-వెధవలా మాట్లాడకు.

170
00:10:36,887 --> 00:10:39,890
ఇంకొక్క ప్రశ్న. క్షమించండి.

171
00:10:39,973 --> 00:10:42,059
మాలో ఎవరు బాగా ముద్దు పెట్టుకుంటారు?

172
00:10:42,142 --> 00:10:43,643
వదిలేయ్, కాన్రాడ్!

173
00:10:48,231 --> 00:10:50,025
ప్రపంచానికి ఎప్పటికీ తెలియదు.

174
00:11:11,671 --> 00:11:13,673
-అవును.
-హాయ్!

175
00:11:13,757 --> 00:11:14,966
-అమ్మాయిలు.
-హే!

176
00:11:15,467 --> 00:11:17,719
నేనిది చకచకా తీసుకోవచ్చా?

177
00:11:19,346 --> 00:11:21,223
ఇది గ్రూప్ డేట్ అని నాకు తెలియదు.

178
00:11:22,265 --> 00:11:23,767
ఇది డేట్ అని నేననలేదు.

179
00:11:24,935 --> 00:11:27,062
సరే. సరే, సరే, సరే.

180
00:11:27,145 --> 00:11:28,563
పూలు బాగున్నాయి, స్టీవెన్.

181
00:11:29,106 --> 00:11:30,941
ధన్యవాదాలు, అవును! అవును, పూలు.

182
00:11:31,024 --> 00:11:34,528
నా పిల్లకు గులాబీలు.

183
00:11:35,445 --> 00:11:38,115
టేలర్‌ను నీ పిల్ల అన్నావా?

184
00:11:38,198 --> 00:11:39,366
ఏంటి, స్టీవెన్?

185
00:11:39,449 --> 00:11:41,451
లేదు, లేదు. అది మా మధ్య జోక్.

186
00:11:41,535 --> 00:11:42,661
వదిలేయండి.

187
00:11:42,744 --> 00:11:44,413
అది "పిచ్చి పిల్ల," డమ్మీ.

188
00:11:44,496 --> 00:11:47,582
అవును, "పిచ్చి". అదే నేనన్నది.
అదే నేనన్నది.

189
00:11:48,041 --> 00:11:49,751
సరే, ధన్యవాదాలు.

190
00:11:51,628 --> 00:11:52,754
నా కారు ఎలా ఉంది?

191
00:11:53,547 --> 00:11:56,007
-నిజంగా అంటున్నావా?
-లేదు, ఊరికే అన్నాను.

192
00:11:56,091 --> 00:11:57,634
-నిన్ను...
-ఊరికే అన్నాను.

193
00:11:57,717 --> 00:12:01,805
సొట్టలు పడలేదు, గీతలు లేవు, చలానాలు లేవు.
అంతా బాగుంది.

194
00:12:01,888 --> 00:12:04,724
రేపు ఉదయం దాన్ని శుభ్రం చేయించి ఇస్తాను.

195
00:12:05,559 --> 00:12:07,644
నన్ను వాడుకోనిచ్చినందుకు ధన్యవాదాలు.

196
00:12:09,229 --> 00:12:10,313
ఎప్పుడైనా సరే.

197
00:12:10,897 --> 00:12:11,731
అది బాగుంది.

198
00:12:12,399 --> 00:12:15,610
అయితే, స్టీవెన్, నువ్వు
మైలో కొత్త పాటలు విన్నావా?

199
00:12:15,986 --> 00:12:17,320
నువ్వు అందరికీ తెలుసు.

200
00:12:17,612 --> 00:12:18,447
ఏంటి?

201
00:12:19,489 --> 00:12:20,407
ఏంటి?

202
00:12:20,490 --> 00:12:22,159
సరే, అబ్బా,

203
00:12:23,160 --> 00:12:25,287
కజిన్స్ పార్టీ నుంచి వచ్చి, మైలో...

204
00:12:25,370 --> 00:12:26,371
హా.

205
00:12:27,831 --> 00:12:31,668
నిన్ను తిడుతూ ఒక పూర్తి ఆల్బమ్ రాసాడు.

206
00:12:32,794 --> 00:12:33,837
భయంకరంగా ఉంది.

207
00:12:33,920 --> 00:12:35,630
-నీ దవడ ఎలా ఉంది?
-ఏంటి?

208
00:12:35,714 --> 00:12:37,632
నిన్ను గట్టిగా కొట్టినట్టున్నాడు.

209
00:12:37,716 --> 00:12:41,136
అది-- కాదు, కాదు,
అది చెత్త, సరేనా?

210
00:12:41,219 --> 00:12:42,512
మీకు చెప్పడానికి,

211
00:12:42,596 --> 00:12:44,347
అతన్ని పడిపోయేలా కొట్టాను.

212
00:12:44,431 --> 00:12:46,016
మూడో పాట ప్రకారం అయితే కాదు.

213
00:12:46,099 --> 00:12:49,144
దయచేసి మనం
మైలో గురించి ఆపుదామా, ధన్యవాదాలు?

214
00:12:49,769 --> 00:12:50,770
-క్షమించు.
-సరే.

215
00:12:53,648 --> 00:12:56,693
బెల్లీ ఎక్కడుంది?
వాలీబాల్ క్యాంప్‌కు వస్తోందా?

216
00:12:56,776 --> 00:12:57,736
తను రావాలి.

217
00:12:59,029 --> 00:13:01,281
ప్రావిడెన్స్‌లో తనకు చిన్న పని ఉంది.

218
00:13:02,282 --> 00:13:04,701
అవును. తను రాత్రికి వస్తుంది, అందుకని...

219
00:13:05,076 --> 00:13:06,077
సరే.

220
00:13:07,162 --> 00:13:10,290
మొత్తానికి ఏదో అవుతోందని విన్నాను.

221
00:13:10,373 --> 00:13:12,876
అవును. నాకు ఎప్పటికప్పుడు తెలుస్తోంది.

222
00:13:12,959 --> 00:13:13,877
-నిజంగా?
-అవును.

223
00:13:16,046 --> 00:13:18,131
ఏమో. అంతా సరయితే బాగుంటుంది.

224
00:13:18,215 --> 00:13:19,883
ఆమె అతనితోనే ఉండాలి.

225
00:13:19,966 --> 00:13:21,968
-కాన్రాడ్ తన ఆత్మబంధువు.
-జెర్ బెస్ట్.

226
00:13:22,469 --> 00:13:23,345
ఆగు, ఏంటి?

227
00:13:36,149 --> 00:13:39,110
మనం చేరే సమయానికి ఇంకో అరగంట చేర్చింది.

228
00:13:39,194 --> 00:13:40,695
అబ్బా. నిజంగానా?

229
00:13:41,196 --> 00:13:43,823
మనం దిగి పక్క రోడ్డు తీసుకుందామా?

230
00:13:43,907 --> 00:13:45,242
పక్క రోడ్లు ఘోరంగా ఉంటాయి.

231
00:13:46,409 --> 00:13:49,412
తుఫాను తగ్గితే, రోడ్లు ఖాళీ అవుతాయి.

232
00:13:49,496 --> 00:13:53,250
అదీ కాక, మీ సంగతి తెలియదు కానీ
నాకైతే సరదాగా ఉంది.

233
00:13:55,335 --> 00:13:56,836
ఏం చేద్దామంటావు, బెల్లీ?

234
00:13:57,921 --> 00:14:01,132
అవును, ఏం చేద్దాం, బెల్స్?

235
00:14:07,180 --> 00:14:11,268
నాకు ఆకలిగా ఉంది, బాత్రూంకు వెళ్లాలి,
ఈ కార్లో మునిగిపోవాలని లేదు.

236
00:14:14,354 --> 00:14:15,355
ఓటు మారుస్తున్నాను.

237
00:14:15,438 --> 00:14:20,443
ఆకలి కోపిష్టి బెల్లీ
ప్రకృతి విపత్తు కన్నా ఘోరం.

238
00:14:21,486 --> 00:14:23,947
సరే. మనం దిగిపోదాం.

239
00:14:43,717 --> 00:14:44,884
దేవుడా.

240
00:14:53,602 --> 00:14:54,936
అత్యవసర హెచ్చరిక
వరద హెచ్చరిక ప్రభావంలో ఉంది.

241
00:14:55,020 --> 00:14:56,313
వరద ప్రాంతాలను నివారించండి.
స్థానిక మీడియా చూడండి.

242
00:14:58,023 --> 00:14:59,024
అద్భుతం.

243
00:15:13,496 --> 00:15:16,166
డబ్బు వృథా చేసుకోకు.
తనకు ఇవి ఇష్టం.

244
00:15:16,249 --> 00:15:17,709
ఇవి రెండూ ఒకటే.

245
00:15:17,792 --> 00:15:21,588
బెల్లీకి కాదు. స్వీడిష్ ఫిష్‌ది
కొవ్వొత్తుల రుచి అంటుంది. పులుపు ఇష్టం.

246
00:15:21,671 --> 00:15:22,756
అయినా నీకెందుకు?

247
00:15:23,882 --> 00:15:25,759
-నాకనవసరం.
-అది చెత్త.

248
00:15:25,842 --> 00:15:28,345
-మీకు ఇవి కావాలా లేక-- సరే.
-కావాలి. కావాలి.

249
00:15:29,095 --> 00:15:30,263
వాడికి చెప్పాను.

250
00:15:30,513 --> 00:15:32,015
ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు?

251
00:15:32,098 --> 00:15:34,309
శాంతించు, పెద్ద అబ్బాయ్.

252
00:15:34,684 --> 00:15:36,144
నేను ఊరికే అంటున్నాను.

253
00:15:37,103 --> 00:15:38,438
19.17 డాలర్లు.

254
00:15:38,521 --> 00:15:40,315
ఇదిగో. చిల్లర ఉంచుకో.

255
00:15:41,358 --> 00:15:42,692
నీకు తనంటే ఇంకా ఇష్టమేనా?

256
00:15:43,735 --> 00:15:44,986
తనంటే నాకు ఇష్టం.

257
00:15:46,196 --> 00:15:48,448
తనంటే నాకు ఇష్టం,
నేనది ఎన్నడూ ఆపలేదు.

258
00:15:49,491 --> 00:15:51,993
హైవే మూసేస్తున్నారని విన్నారా?

259
00:15:53,286 --> 00:15:55,872
మీరు ఉండాలనుకుంటే వీధి చివర
ఒక హోటల్ ఉంది.

260
00:15:56,873 --> 00:15:57,832
ధన్యవాదాలు.

261
00:16:03,546 --> 00:16:04,547
అబ్బా!

262
00:16:05,924 --> 00:16:06,883
ఏం తెచ్చావు?

263
00:16:09,219 --> 00:16:10,887
సోర్ ప్యాచ్. నాకు ఇష్టం.

264
00:16:11,721 --> 00:16:14,724
నేను స్వీడిష్ ఫిష్ తరువాత తింటాను.

265
00:16:14,808 --> 00:16:16,976
పరవాలేదు. నా కోసం తెచ్చుకున్నాను.

266
00:16:17,977 --> 00:16:18,978
సరే.

267
00:16:26,319 --> 00:16:27,487
అంతా బాగానే ఉందా?

268
00:16:27,570 --> 00:16:28,446
లేదు.

269
00:16:30,240 --> 00:16:32,033
హైవే మూసేస్తున్నారట.

270
00:16:32,826 --> 00:16:34,703
లోపలతను చెప్పాడు.

271
00:16:34,786 --> 00:16:37,747
దగ్గరలో హోటల్ ఉందని,
కావాలంటే అక్కడ ఉండవచ్చని చెప్పాడు.

272
00:16:38,164 --> 00:16:40,166
ఇక్కడికి బదులు.

273
00:16:41,418 --> 00:16:42,293
ఏదో ఒకటి.

274
00:16:43,086 --> 00:16:44,170
నాకు పరవాలేదు.

275
00:16:46,423 --> 00:16:47,424
-వెళదామా?
-సరే.

276
00:16:47,507 --> 00:16:49,384
-నువ్వు?
-సరే.

277
00:16:49,467 --> 00:16:50,510
సరే, బై.

278
00:16:50,593 --> 00:16:52,011
బై! రేపు కలుస్తామా?

279
00:16:52,095 --> 00:16:54,180
-బై. జాగ్రత్తగా వెళ్ళండి.
-బై.

280
00:16:56,266 --> 00:16:57,600
మనం కూడా వెళదామా?

281
00:16:58,601 --> 00:17:01,354
మనం ఉండవచ్చు. ఫ్రోజెన్ కస్టర్డ్ తిందాము.

282
00:17:03,106 --> 00:17:05,233
సరే, నువ్వు నన్నలా

283
00:17:05,316 --> 00:17:08,194
విచిత్ర మౌనంలా,
చూడడం ఆపితే.

284
00:17:08,278 --> 00:17:09,279
ఎలా?

285
00:17:10,572 --> 00:17:12,240
నేనేమంటున్నానో నీకు తెలుసు కదా.

286
00:17:12,699 --> 00:17:15,577
నువ్వు తప్పు గుర్రం మీద పందెం కడితే
అది నా తప్పు కాదు.

287
00:17:16,453 --> 00:17:18,371
నువ్వు నిజంగా టీమ్ జెరెమియానా?

288
00:17:19,456 --> 00:17:21,833
అది టీమ్ జెల్లీఫిష్. అవును.

289
00:17:22,709 --> 00:17:24,669
జెల్లీఫిష్. అది వింతగా ఉంది.

290
00:17:24,753 --> 00:17:26,212
అది వింతగా లేదు.

291
00:17:26,296 --> 00:17:28,673
అది కాన్రాడ్ అవ్వాలని ఎలా అనుకుంటావు?

292
00:17:28,757 --> 00:17:31,301
ఈ సంవత్సరం మీ చెల్లెలి మనసు గాయపరిచాడు.

293
00:17:33,219 --> 00:17:35,764
ప్రామ్‌లో కాన్రాడ్ చేసింది తప్పే.
ఒప్పుకుంటాను.

294
00:17:36,765 --> 00:17:39,225
వాళ్ల అమ్మ చివరి రోజులు.
అతను బాధలో ఉన్నాడు.

295
00:17:39,309 --> 00:17:40,560
జెరెమియా కూడా.

296
00:17:40,643 --> 00:17:44,272
అతను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా?
అతన్ని ఎలా కాదంటున్నావు?

297
00:17:44,355 --> 00:17:46,024
కాన్రాడ్ కూడా మంచి స్నేహితుడే.

298
00:17:46,483 --> 00:17:48,735
అతను దూరం చేసుకుంది బెల్లీనే కాదు.

299
00:17:48,818 --> 00:17:49,819
అది గుర్తుందా?

300
00:17:50,737 --> 00:17:54,157
అవును, అతను అందరినీ దూరం పెట్టగలడు.

301
00:17:55,325 --> 00:17:56,785
నన్ను నమ్ము, మారుతున్నాడు.

302
00:17:57,744 --> 00:18:00,455
కచ్చితంగా జెర్‌తో తేలిక.

303
00:18:00,538 --> 00:18:03,750
కానీ విషయం అదే కదా.
బెల్లీని సవాలు చేయడు.

304
00:18:03,833 --> 00:18:05,376
కాన్రాడ్ చేసినట్లు.

305
00:18:05,460 --> 00:18:07,837
అందరూ అనుకునే దానికన్నా
ఆమె చాలా లోతైనది.

306
00:18:07,921 --> 00:18:11,090
ఆమె ఇచ్చే అందమైన వాటిని
చూడగల వాళ్లు కావాలి.

307
00:18:11,174 --> 00:18:13,593
-అది కాన్రాడ్ అనుకుంటావా?
-జెరెమియా అయితే కాదు.

308
00:18:13,676 --> 00:18:15,386
సరే, అది బెల్లీ ఇష్టం.

309
00:18:15,470 --> 00:18:16,846
అవును.

310
00:18:16,930 --> 00:18:20,266
మనం మొదటి డేట్ ఇలా ఉంటుందని అనుకోలేదు.
ఇద్దరం గొడవపడడం.

311
00:18:20,350 --> 00:18:22,060
ఇది డేట్ కాదనుకున్నానే?

312
00:18:24,020 --> 00:18:25,271
నన్ను క్షమించు.

313
00:18:26,856 --> 00:18:28,900
మనం గొడవపడతాం. అది సరదాగా ఉంటుంది.

314
00:18:29,317 --> 00:18:30,443
ఎప్పుడూ కాదు.

315
00:18:33,988 --> 00:18:34,989
అతను చెల్లిస్తాడు.

316
00:18:38,493 --> 00:18:39,786
మోటెల్

317
00:18:39,869 --> 00:18:42,121
అనడానికి ఏమీ లేదు. ఒక్క గదే ఉంది.

318
00:18:42,205 --> 00:18:44,290
మీరు వద్దంటే,
ట్రక్ డ్రైవర్ తీసుకుంటాడు.

319
00:18:44,374 --> 00:18:46,459
లేదు. మేము తీసుకుంటాం.

320
00:18:49,504 --> 00:18:50,547
ధన్యవాదాలు.

321
00:18:57,220 --> 00:18:58,721
మీరు వెళ్ళండి. నేను వస్తాను.

322
00:19:01,057 --> 00:19:02,392
నువ్వేం చేస్తావు?

323
00:19:03,309 --> 00:19:06,729
కొన్ని ఫోన్లు చేసుకోవాలి.
ఎవరికీ బై చెప్పలేదు.

324
00:19:07,856 --> 00:19:08,857
సరే.

325
00:19:26,791 --> 00:19:30,003
ఒక్క మంచం.
ఈరోజు గడుస్తున్న కొద్దీ గొప్పగా అవుతోంది.

326
00:19:48,563 --> 00:19:50,106
నువ్వు మౌనంగా ఉన్నావు.

327
00:19:53,943 --> 00:19:55,278
ఆలోచించడానికి చాలా ఉంది.

328
00:19:58,865 --> 00:20:00,366
నాకైతే ఏమీ మారలేదు.

329
00:20:02,160 --> 00:20:03,828
అంతా మారిపోయింది, బెల్స్.

330
00:20:06,623 --> 00:20:09,542
వాడు నిన్నింకా ప్రేమిస్తున్నాడు.
నువ్వది చూడాలి.

331
00:20:09,626 --> 00:20:12,045
కాదు, అది నిజం కాదు. నన్ను నమ్ము.

332
00:20:12,128 --> 00:20:14,047
కాన్రాడ్ అది స్పష్టం చేశాడు.

333
00:20:15,048 --> 00:20:16,382
అవును, చేసే ఉంటాడు.

334
00:20:17,091 --> 00:20:18,217
అది వాడి ఉద్దేశం కాదు.

335
00:20:20,970 --> 00:20:22,972
మా ఇద్దరి మధ్య ఇద్దరికీ అయిపోయింది.

336
00:20:24,641 --> 00:20:28,144
మనం ముద్దు పెట్టుకున్నది నిజం.
నిజంగా అంటున్నాను.

337
00:20:28,227 --> 00:20:30,188
అది నాకు నిజం.

338
00:20:30,772 --> 00:20:32,148
అది నాకు కూడా నిజం.

339
00:20:35,401 --> 00:20:36,778
కాన్రాడ్ తనకు నీ పట్ల...

340
00:20:36,861 --> 00:20:40,323
ఉన్న భావనను చెప్పినప్పుడు...
కాదు, చెబితే ఏమవుతుంది?

341
00:20:40,406 --> 00:20:41,699
అది ఏమీ మార్చదు.

342
00:20:42,992 --> 00:20:45,328
ఈ సారి వేరుగా ఉంటుందని నమ్మాలనుంది.

343
00:20:45,995 --> 00:20:48,748
జరగరాని దాని కోసం
ఎదురు చూస్తున్నట్టు ఉంది.

344
00:20:49,499 --> 00:20:52,877
నువ్వు కాన్రాడ్ సరిగ్గా మాట్లాడుకోవాలి.

345
00:20:54,253 --> 00:20:57,548
నా గురించి నీకు అప్పుడు కూడా
అలానే అనిపిస్తే, అప్పుడు...

346
00:20:58,841 --> 00:21:00,051
నేను నీ వాడిని.

347
00:21:01,928 --> 00:21:02,929
నువ్వు నా వాడివే.

348
00:21:04,472 --> 00:21:05,682
నేను నీ దాన్నే.

349
00:21:06,474 --> 00:21:07,433
సరే.

350
00:21:08,434 --> 00:21:13,439
అతని మూడ్ మారిన తరువాత
రేపు ఉదయం మాట్లాడతాను.

351
00:21:13,856 --> 00:21:15,525
నేను కరెక్ట్ అని తెలుస్తుంది.

352
00:21:17,610 --> 00:21:20,113
కానీ ఇప్పుడు నాకు చలేస్తోంది, అలసిపోయాను.

353
00:21:21,030 --> 00:21:23,032
నేను స్నానం చేయాలి.

354
00:21:25,660 --> 00:21:26,911
-సరేనా?
-సరే.

355
00:22:24,886 --> 00:22:26,012
మనం మాట్లాడుకోవాలి.

356
00:22:26,929 --> 00:22:29,515
-నేను అలసిపోయాను.
-అయినా తప్పదు.

357
00:22:30,683 --> 00:22:32,185
ఏం చేస్తున్నావో నాకు తెలుసు.

358
00:22:34,353 --> 00:22:38,524
నువ్వెంత బాధపడుతున్నావో కనిపించకూడదని
వెధవలా ప్రవర్తిస్తున్నావు.

359
00:22:42,528 --> 00:22:44,030
తనను ప్రేమిస్తున్నావు, కాన్.

360
00:22:46,949 --> 00:22:47,992
ఒప్పుకో.

361
00:22:51,996 --> 00:22:52,955
హా.

362
00:22:54,665 --> 00:22:55,708
అవును.

363
00:23:02,006 --> 00:23:03,549
నువ్వు తనకు చెప్పాలి.

364
00:23:06,302 --> 00:23:07,136
ఎందుకు?

365
00:23:08,262 --> 00:23:09,347
ఆమె నిన్ను ఎంచుకుంది.

366
00:23:10,973 --> 00:23:12,225
అలా అనిపించడం లేదు.

367
00:23:14,894 --> 00:23:17,897
నీతో ఇంకా అవకాశం ఉందని
తనకు తెలియనప్పుడు కాదు.

368
00:23:19,982 --> 00:23:22,610
తనకు ఇక అనవసరం.
తనకు నాతో ఎటువంటి సంబంధం వద్దు.

369
00:23:24,070 --> 00:23:25,029
కావచ్చు.

370
00:23:27,865 --> 00:23:28,825
కాకపోవచ్చు.

371
00:23:32,036 --> 00:23:34,038
నీకెలా అనిపిస్తోందో తనకు తెలియాలి.

372
00:23:43,047 --> 00:23:44,298
తను...

373
00:23:45,675 --> 00:23:47,844
తను నిన్ను ఎంచుకుంటే...

374
00:23:54,267 --> 00:23:55,476
నేను తనను వదిలేస్తాను.

375
00:23:57,103 --> 00:24:00,356
ప్రపంచంలో మరెవరైనా అయితే,
తప్పకుండా పోరాడేవాడిని, కానీ...

376
00:24:03,609 --> 00:24:05,278
తను నిన్ను కావాలనుకుంటే...

377
00:24:08,197 --> 00:24:11,159
తను నిన్ను కావాలనుకుంటే,
నేను దారికి అడ్డు రాను.

378
00:24:13,494 --> 00:24:14,871
నాకు...

379
00:24:18,791 --> 00:24:20,459
నాకు తన సంతోషం కావాలి, అంతే.

380
00:24:22,962 --> 00:24:26,924
నాకు... తను సంతోషంగా ఉండాలి,
నువ్వు కూడా సంతోషంగా ఉండాలి.

381
00:24:32,013 --> 00:24:32,972
నాకు కూడా.

382
00:24:34,307 --> 00:24:35,850
అయితే, తనకు చెప్తావా?

383
00:24:40,813 --> 00:24:43,274
నీ కోసం నువ్వు చెయ్యకపోతే...

384
00:24:45,443 --> 00:24:48,070
లేదా తన కోసం చెయ్యకపోతే
దయచేసి నా కోసం చెయ్యి.

385
00:24:54,869 --> 00:24:55,703
సరే.

386
00:25:20,394 --> 00:25:21,395
హే, అమ్మా.

387
00:25:22,605 --> 00:25:24,690
హే, బీన్. నీ సందేశం చదివాను.

388
00:25:24,774 --> 00:25:27,526
తుఫాను తీవ్రంగా ఉంది.
మీరు బాగానే ఉన్నారా?

389
00:25:27,610 --> 00:25:28,736
మాకు హోటల్ దొరికింది.

390
00:25:28,819 --> 00:25:30,947
ప్రతి తల్లి వినాలనుకునే పదాలు.

391
00:25:32,448 --> 00:25:35,993
ఊరికే అన్నాను. నువ్వు వాళ్లతో ఉన్నావు.
అంతా బాగానే ఉంటుంది.

392
00:25:38,037 --> 00:25:39,205
లేదా బాగుండదా?

393
00:25:41,874 --> 00:25:43,542
ఈరోజు రోజు వింతగా ఉంది.

394
00:25:43,876 --> 00:25:45,211
దాని గురించి చెప్తావా?

395
00:25:48,714 --> 00:25:50,424
పోయిన సంవత్సరం...

396
00:25:52,551 --> 00:25:54,887
నీ గురించి, నాన్న గురించి...

397
00:25:56,347 --> 00:25:57,556
మాట్లాడుకుంది గుర్తుందా?

398
00:25:58,099 --> 00:25:59,308
ప్రేమలో ఉండడం గురించి?

399
00:26:00,977 --> 00:26:02,353
నేను ఆలోచిస్తున్నా...

400
00:26:07,358 --> 00:26:11,070
నువ్వు ఆయనతో ప్రేమలో లేనప్పుడు
ఎలా అనిపించింది?

401
00:26:11,988 --> 00:26:13,239
నీకెలా తెలిసింది?

402
00:26:13,739 --> 00:26:16,701
నాలో ఒక భాగం మీ నాన్నను
ఎప్పుడూ ప్రేమిస్తుంది,

403
00:26:16,784 --> 00:26:19,036
కానీ అది ఇప్పుడు వేరు.

404
00:26:20,663 --> 00:26:25,960
ప్రేమకు వేరు వేరు కాలాలు ఉంటాయనుకుంటాను,
మన జీవితంలో ఎక్కడున్నాము అన్నదాన్ని బట్టి.

405
00:26:26,043 --> 00:26:29,005
ఒక రచయితలా మాట్లాడుతున్నావు, అమ్మా.
దాని అర్థం ఏంటి?

406
00:26:30,923 --> 00:26:33,592
అంటే, మీకు మధ్య ఉన్నదానిని

407
00:26:33,676 --> 00:26:37,471
గుర్తు చేసుకుంటున్నావా లేదంటే
జరగబోయేదాని కోసం

408
00:26:37,555 --> 00:26:40,016
ఎదురు చూస్తున్నావా అని
నిన్ను నువ్వు అడగాలేమో?

409
00:26:40,808 --> 00:26:42,184
అది నీకు తెలియకపోతే?

410
00:26:43,519 --> 00:26:47,189
దాని గురించి ఆలోచించకు.

411
00:26:47,648 --> 00:26:48,899
నువ్వింకా చిన్నదానివి.

412
00:26:49,525 --> 00:26:53,362
నువ్వు ఒకరితో స్థిరపడే ముందు
నీకు చాలా మంది ప్రేమికులు ఉండాలి.

413
00:26:53,446 --> 00:26:56,615
అమ్మా! ఛీ.
"ప్రేమికులు" అనకు.

414
00:26:58,367 --> 00:27:00,328
సరే. ఆలస్యం అవుతోంది, వెళతాను.

415
00:27:00,411 --> 00:27:01,412
నీకు ప్లాన్లున్నాయా?

416
00:27:01,495 --> 00:27:02,872
అంత ఆశ్చర్యపడకు.

417
00:27:02,955 --> 00:27:06,584
వేరే రచయితలను కలుస్తున్నాను.
భయంకరంగా ఉంటుందని తెలుసు.

418
00:27:07,543 --> 00:27:08,544
జాగ్రత్త, తల్లీ.

419
00:27:09,295 --> 00:27:10,379
ఐ లవ్ యు, అమ్మా.

420
00:27:10,463 --> 00:27:11,505
లవ్ యు, తల్లీ.

421
00:27:41,327 --> 00:27:43,579
లారెల్? నేను సాండ్రా.

422
00:27:43,662 --> 00:27:45,790
క్లీవ్‌ల్యాండ్ మీరొస్తారని చెప్పారు.

423
00:27:45,873 --> 00:27:48,584
నేనే అని మీకెలా తెలిసింది?
నేనెలా ఉంటానో చెప్పారా?

424
00:27:48,667 --> 00:27:52,755
"ఆన్ టేలర్‌ దుస్తులలో మధ్య వయస్కురాలైన
సబర్బన్ తల్లి కోసం చూడు." భయపడ్డాను.

425
00:27:53,589 --> 00:27:56,217
లేదు. మీరు రాసినవన్నీ చదివాను.

426
00:27:56,300 --> 00:28:00,513
మీకు తెలియడం కోసం,
నేను మిమ్మల్ని కలవడానికి భయపడ్డాను.

427
00:28:01,514 --> 00:28:02,598
నేనది ద్వేషించను.

428
00:28:03,682 --> 00:28:05,017
మీకు ఏం ఇవ్వను?

429
00:28:06,268 --> 00:28:07,311
టకీలా.

430
00:28:07,853 --> 00:28:08,979
మంచు గడ్డలు వేసి.

431
00:28:10,689 --> 00:28:12,024
మంచి స్నేహితులం అవుతాము.

432
00:28:28,833 --> 00:28:29,667
సరే.

433
00:28:31,293 --> 00:28:33,295
ముందే చెప్తున్నాను, అవి ఎప్పటి నుంచి

434
00:28:33,379 --> 00:28:36,006
వెండింగ్ మెషీన్‌లో ఉన్నాయో మనకు తెలియదు.

435
00:28:36,090 --> 00:28:38,342
సరే. అయితే, నాకు వద్దు.

436
00:28:43,389 --> 00:28:44,682
ఎటు వైపు పడుకుంటావు?

437
00:28:44,765 --> 00:28:46,767
ఇటు వైపు పడుకుంటాను. ధన్యవాదాలు.

438
00:28:49,019 --> 00:28:51,856
మీరు మంచం మీద పడుకోండి.

439
00:28:52,273 --> 00:28:55,276
మీరు ఇద్దరు. నేను నేల మీద పడుకుంటాను.

440
00:28:56,694 --> 00:28:59,321
లేదు, నువ్వు పడుకో. అమ్మాయిలు ముందు.

441
00:29:00,156 --> 00:29:02,283
ఎప్పుడూ అయితే వాదించేదాన్ని,

442
00:29:02,366 --> 00:29:06,745
ఎందుకంటే అమ్మాయి అయితే
నేల మీద పడుకోకూడదని కాదు కదా?

443
00:29:07,246 --> 00:29:10,624
కానీ నేను ఒక బొద్దింకను చూసాను,
అందుకని మీరే పడుకోండి.

444
00:29:24,346 --> 00:29:25,431
గుడ్ నైట్, బెల్స్.

445
00:29:26,265 --> 00:29:27,266
గుడ్ నైట్.

446
00:30:14,021 --> 00:30:17,024
ఎవరైనా ఏమైనా చెప్తారా?

447
00:30:18,734 --> 00:30:20,110
నువ్వు చెప్తావా?

448
00:30:21,237 --> 00:30:24,782
లేదు. నేనిప్పుడు కొత్తది ఏమీ రాయడం లేదు.

449
00:30:24,865 --> 00:30:27,826
పుస్తకం నుంచి ఏమైనా చదవొచ్చు.
నా పుస్తకం తెచ్చాను.

450
00:30:29,119 --> 00:30:30,120
ఏదైనా చదువు.

451
00:30:30,204 --> 00:30:33,040
దేవుడా. మీరు నాతో ఇది చేయిస్తున్నారు, కదా?

452
00:30:33,123 --> 00:30:36,794
అవును, పుస్తకం చదివిన తరువాత,

453
00:30:36,877 --> 00:30:40,089
సుసన్నాకు అందరి దృష్టి
తన మీద ఉండడం ఇష్టమని తెలిసింది.

454
00:30:40,422 --> 00:30:42,174
బెక్‌కు అది చాలా ఇష్టం.

455
00:30:45,219 --> 00:30:46,679
బెక్...

456
00:30:47,513 --> 00:30:49,431
నా ప్రాణ స్నేహితురాలు.

457
00:30:50,349 --> 00:30:52,434
భూతకాలం వాడడం వింతగా ఉంది.

458
00:30:52,518 --> 00:30:54,520
ఆమె ఒక నెల క్రితం మరణించింది.

459
00:30:56,605 --> 00:30:59,358
ఈ జ్ఞాపిక మా స్నేహం గురించి.

460
00:31:01,110 --> 00:31:03,696
ఆమె నా నిజమైన ఆత్మబంధువు
అని ఎప్పుడూ అనేదాన్ని.

461
00:31:06,198 --> 00:31:09,952
"అది దాదాపు తెల్లవారు ఝామున రెండింటికి,
నాకు ప్రసవం మొదలయింది,

462
00:31:10,035 --> 00:31:11,870
ఇచ్చిన తేదీకి మూడు వారాల ముందు.

463
00:31:12,454 --> 00:31:15,165
జాన్ కాన్ఫరెన్స్ కోసం
శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాడు.

464
00:31:15,249 --> 00:31:18,294
బిడ్డ ముందుగా వస్తోంది,
నేను ఒంటరిగా ఉన్నానని చెప్పాను,

465
00:31:18,377 --> 00:31:22,631
తను నాకు తోడుగా ఉండానికి బోస్టన్
నుంచి డ్రైవ్ చేసుకుని వచ్చింది.

466
00:31:23,924 --> 00:31:28,721
మా అమ్మాయి ఇజబెల్ సుసన్నా కాంక్లిన్,
మరుసటి రోజు మధ్యాహ్నం పుట్టింది.

467
00:31:29,972 --> 00:31:32,474
బెక్ ఆ సమయం అంతా నా పక్కనే ఉంది,

468
00:31:32,558 --> 00:31:34,935
బిడ్డను నా చేతికి ఇచ్చినప్పుడు, ఆమె,

469
00:31:35,019 --> 00:31:36,437
అదుగో.

470
00:31:39,231 --> 00:31:41,066
మన ప్రత్యేకమైన అమ్మాయి' అంది."

471
00:32:17,603 --> 00:32:18,604
బెల్లీ?

472
00:32:26,362 --> 00:32:27,613
నా ఉద్దేశం అది కాదు.

473
00:32:29,782 --> 00:32:31,867
ఇంతకుముందు అన్నది. నా ఉద్దేశం కాదు.

474
00:32:37,623 --> 00:32:38,749
నాకు నువ్వు కావాలి.

475
00:32:40,793 --> 00:32:42,211
అవును, నాకు కావాలి.

476
00:32:44,171 --> 00:32:46,548
-కాన్రాడ్.
-నువ్వు ఏమీ అననవసరం లేదు.

477
00:32:48,258 --> 00:32:49,468
ఇప్పుడే కాదు.

478
00:32:54,973 --> 00:32:56,850
నీకది తెలియాలని చెప్పాను.

479
00:33:10,364 --> 00:33:14,076
సుసన్నా ఆరోగ్యం మళ్లీ పాడయినపుడు,
ఎవరూ నాకు వెంటనే చెప్పలేదు.

480
00:33:15,244 --> 00:33:17,913
కాన్రాడ్, మా అమ్మ, సుసన్నా,

481
00:33:17,996 --> 00:33:19,206
ఎవరూ చెప్పలేదు.

482
00:33:19,289 --> 00:33:22,376
ఆమె చాలా నీరసంగా ఉందని
ముందే హెచ్చరిస్తున్నాను.

483
00:33:23,419 --> 00:33:26,588
తను అలసిపోయింది. చాలా అలసిపోయింది.

484
00:33:27,673 --> 00:33:29,425
నిన్ను చూడాలని ఉత్సాహంగా ఉంది.

485
00:33:31,760 --> 00:33:33,721
తనను చూడడానికి నాకూ ఉత్సాహంగా ఉంది.

486
00:33:33,804 --> 00:33:36,557
తనను చూడకుండా తప్పించుకుందామనుకున్నాను.

487
00:33:36,640 --> 00:33:39,059
భయపడినందుకు నా మీద కోపంగా ఉంది,

488
00:33:39,143 --> 00:33:41,103
నేను మా అమ్మలా కాదు,

489
00:33:41,186 --> 00:33:43,480
ఉక్కులా బలంగా, మన్నికగా.

490
00:33:44,022 --> 00:33:46,608
సుసన్నాను అలా చూడడం దాన్ని నిజం చేస్తుంది.

491
00:33:52,990 --> 00:33:55,325
కాన్రాడ్ - జెరెమియా - బెల్లీ

492
00:34:04,001 --> 00:34:05,627
నాకు ఇష్టమైన అమ్మాయి వచ్చింది.

493
00:34:06,378 --> 00:34:07,379
నువ్వు...

494
00:34:07,463 --> 00:34:09,047
నువ్వు చాలా అందంగా ఉన్నావు.

495
00:34:09,131 --> 00:34:10,299
ఇది తీయనివ్వు.

496
00:34:10,382 --> 00:34:12,176
వద్దు, నేనిది పూర్తి చేద్దా--

497
00:34:15,429 --> 00:34:18,432
ఇదుగో. దీనితో సహాయం చేస్తాను.

498
00:34:26,148 --> 00:34:28,859
నేను తీస్తాను.
నువ్వు బెల్లీతో ఉండు.

499
00:34:29,651 --> 00:34:30,778
నువ్వు వెళ్తున్నావా?

500
00:34:30,861 --> 00:34:32,362
నాకు పనులున్నాయి.

501
00:34:35,616 --> 00:34:36,658
పరవాలేదు!

502
00:34:37,993 --> 00:34:39,703
నీకు పీడియాలైట్ తెస్తాను.

503
00:34:48,462 --> 00:34:50,756
కాన్రాడ్‌ కనిపిస్తాడేమోనని

504
00:34:52,508 --> 00:34:54,343
కంగారు పడకు, బంగారం.

505
00:34:54,426 --> 00:34:56,136
ఈరోజు వాడిక్కడ లేడు.

506
00:34:58,305 --> 00:34:59,681
నీకు చెప్పాడా?

507
00:35:00,390 --> 00:35:01,350
ఇంకా నయం.

508
00:35:02,351 --> 00:35:04,394
వాడు నాకేమీ చెప్పడు.

509
00:35:08,190 --> 00:35:09,942
మీ అమ్మ చెప్పింది...

510
00:35:11,902 --> 00:35:13,821
ప్రామ్ అనుకున్న విధంగా అవలేదని.

511
00:35:14,613 --> 00:35:16,824
దాని గురించి మాట్లాడద్దు.
అది ముఖ్యం కాదు.

512
00:35:16,907 --> 00:35:18,283
అది ముఖ్యం.

513
00:35:18,826 --> 00:35:22,329
అది చాలా ముఖ్యం, ఎందుకంటే నువ్వు ముఖ్యం.

514
00:35:24,289 --> 00:35:25,499
నువ్వు నా గనివి.

515
00:35:28,210 --> 00:35:31,213
అతను... నాతో విడిపోయాడు.

516
00:35:33,632 --> 00:35:35,092
కాన్రాడ్‌ను ద్వేషించకు.

517
00:35:36,385 --> 00:35:37,386
నేను ద్వేషించట్లేదు.

518
00:35:38,637 --> 00:35:39,930
వాడికి...

519
00:35:41,056 --> 00:35:43,684
వాడికి దీనంతటితో చాలా కష్టంగా ఉంటోంది.

520
00:35:45,310 --> 00:35:48,355
నిన్ను దూరం చేసుకోనివ్వకు.
వాడికి నీ అవసరం ఉంది.

521
00:35:52,192 --> 00:35:53,861
వాడికి నువ్వంటే ఇష్టం, తెలుసా?

522
00:35:55,028 --> 00:35:56,071
లేదు, ఇష్టం లేదు.

523
00:35:57,990 --> 00:35:59,116
ఉంది.

524
00:36:02,578 --> 00:36:03,745
నీకు వాడంటే ఇష్టమా?

525
00:36:13,005 --> 00:36:14,506
నాకోసం ఒకటి చేస్తావా?

526
00:36:20,470 --> 00:36:21,889
వాడిని చూసుకో.

527
00:36:24,600 --> 00:36:25,684
నువ్వది చేస్తావా?

528
00:36:28,437 --> 00:36:31,732
నేను చూసుకోనవసరం లేదు.
నువ్వే చూసుకుంటావు.

529
00:36:36,445 --> 00:36:39,156
ఇలా రా, తల్లీ. రా, పడుకో.

530
00:36:47,789 --> 00:36:49,833
నా ప్రత్యేకమైన అమ్మాయివి, బెల్లీ.

531
00:36:56,173 --> 00:36:57,174
అమ్మా?

532
00:37:00,469 --> 00:37:01,595
జెరెమియా.

533
00:37:04,598 --> 00:37:06,141
నేను మళ్లీ వస్తాను.

534
00:37:13,148 --> 00:37:14,733
క్షమించు, బెల్లీ.

535
00:37:17,152 --> 00:37:17,986
ఎందుకు?

536
00:37:18,487 --> 00:37:20,322
అంతా పాడుచేసింది నేనే.

537
00:37:20,405 --> 00:37:21,281
కాదు.

538
00:37:25,369 --> 00:37:27,245
ఎప్పటికీ ఇలానే అనిపించదు.

539
00:37:31,083 --> 00:37:33,251
అంతా తిరిగి వస్తుంది, ఒట్టు.

540
00:37:37,589 --> 00:37:40,342
నేను జెర్‌తోనా? లేదంటే నేను కాన్రాడ్‌తోనా?

541
00:37:41,760 --> 00:37:42,844
మీరందరూ.

542
00:37:45,847 --> 00:37:46,932
ఒకరికొకరు.

543
00:38:03,865 --> 00:38:05,534
ఐ లవ్ యు, బెల్లీ.

544
00:38:09,204 --> 00:38:10,455
ఐ లవ్ యు.

545
00:38:32,728 --> 00:38:34,813
స్టీవెన్‌పై బదులు తీర్చుకుంటున్నాను
మైలో

546
00:38:41,653 --> 00:38:42,654
అవును, అవును.

547
00:38:59,796 --> 00:39:01,256
నేనేమీ సన్నగా ఉండను.

548
00:39:22,194 --> 00:39:23,028
నేను చేయగలను.

549
00:39:39,503 --> 00:39:41,463
టేలర్ - మనం జోక్ చేస్తున్నామనుకున్నాను.
అది మనది కదా!!!!!! టేలర్? టేటే?

550
00:39:41,546 --> 00:39:44,007
నీకు సందేశం పంపిస్తూనే ఉండను.
మూడు చుక్కలు చూశాను కానీ ఏమీ రాలేదేంటి?

551
00:39:53,266 --> 00:39:55,727
హిల్ పాయింట్
మోటెల్

552
00:42:02,479 --> 00:42:04,564
హే, నేను జెరెమియాను. సందేశం పంపండి.

553
00:42:09,903 --> 00:42:11,321
బెల్స్, హే.

554
00:42:13,198 --> 00:42:14,115
హే.

555
00:42:14,532 --> 00:42:16,034
నువ్వు వెళిపోయావనుకున్నాను.

556
00:42:16,117 --> 00:42:19,663
టిఫిన్ తేవడానికి వెళ్ళాను.
నీకు ఆకలేస్తోందని గమనించాను...

557
00:42:21,706 --> 00:42:22,582
ధన్యవాదాలు.

558
00:42:22,666 --> 00:42:23,500
సరే.

559
00:42:27,587 --> 00:42:29,005
నీతో మాట్లాడాలి.

560
00:42:30,048 --> 00:42:31,007
సరే.

561
00:42:34,844 --> 00:42:36,429
నువ్వు కరెక్ట్, జెర్.

562
00:42:37,472 --> 00:42:39,724
-కాన్రాడ్ రాత్రి మాట్లాడాడు--
-హే, బెల్స్,

563
00:42:39,808 --> 00:42:41,685
నువ్వు ఏమైనా చెప్పే ముందు...

564
00:42:43,436 --> 00:42:46,273
పోయిన వేసవిలా మళ్లీ అవదు.

565
00:42:47,148 --> 00:42:48,984
నువ్వు సంతోషంగా ఉండు, సరేనా?

566
00:42:49,067 --> 00:42:51,403
నువ్వు, నేను బాగానే ఉన్నాము. ఎప్పుడూ.

567
00:42:51,486 --> 00:42:52,612
జెరెమియా, ఆపు.

568
00:42:54,864 --> 00:42:55,907
హే, నాకేసి చూడు.

569
00:42:57,909 --> 00:42:58,994
నాకేసి చూడు.

570
00:43:02,747 --> 00:43:03,873
నేనేం ఆలోచిస్తున్నాను?

571
00:43:05,250 --> 00:43:06,167
నాకు తెలీదు.

572
00:43:13,008 --> 00:43:14,050
నీకు తెలుసు.

573
00:44:07,937 --> 00:44:08,938
హే.

574
00:44:09,022 --> 00:44:10,023
హే.

575
00:44:16,863 --> 00:44:18,198
మనం మాట్లాడుకుందామా?

576
00:44:18,281 --> 00:44:22,077
అవును. నేను నీతో మాట్లాడాలనుకున్నాను.

577
00:44:22,160 --> 00:44:23,161
సరే.

578
00:44:24,871 --> 00:44:26,122
ముందు నన్ను చెప్పనివ్వు.

579
00:44:29,250 --> 00:44:30,335
రాత్రి గురించి...

580
00:44:31,753 --> 00:44:34,923
నాకు నీ మీద, జెర్ మీద కోపం వచ్చింది,

581
00:44:36,091 --> 00:44:40,595
అందుకని అది పాడుచేయాలని చూసాను.

582
00:44:41,888 --> 00:44:43,932
నాకు మీ మధ్యలోకి రావాలని లేదు,

583
00:44:44,015 --> 00:44:47,644
అందుకని నేను చెప్పినది
ఏదీ నేను నిజంగా అనలేదు.

584
00:44:50,188 --> 00:44:51,189
మనం బాగానే ఉన్నాము.

585
00:44:53,233 --> 00:44:54,317
మనం స్నేహితులం.

586
00:44:55,610 --> 00:44:59,280
అతను ఇంతేనని అనుకుని
నేను కోపంగా కూడా ఉండలేను.

587
00:44:59,697 --> 00:45:01,783
అతను ఎప్పుడూ ఇలానే ఉంటాడు.

588
00:45:02,033 --> 00:45:03,535
దానిగురించి అబద్ధం చెప్పలేదు.

589
00:45:04,202 --> 00:45:06,704
ఇస్తాడు, తిరిగి తీసుకుంటాడు.

590
00:45:07,956 --> 00:45:09,916
విడుదల చేస్తున్నాను, కాన్రాడ్ ఫిషర్.

591
00:45:10,792 --> 00:45:12,335
నా మనసు నుంచి తీసేస్తున్నాను.

592
00:45:12,961 --> 00:45:14,003
సరే.

593
00:45:15,255 --> 00:45:16,381
స్నేహితులం.

594
00:45:17,132 --> 00:45:18,133
అవును.

595
00:45:21,177 --> 00:45:22,637
నేను వెళ్ళబోతున్నాను.

596
00:45:22,720 --> 00:45:23,763
అవును. సరే.

597
00:45:31,729 --> 00:45:34,190
ఇది తీసుకో. ఇది నీదే.

598
00:45:34,274 --> 00:45:36,443
-వద్దు.
-నాకిది ఉంచుకోవాలని లేదు.

599
00:45:37,485 --> 00:45:38,945
మనమిది ఇంతకుముందు చేసాము.

600
00:45:40,113 --> 00:45:41,781
పోయినసారిలా అనిపించడం లేదు.

601
00:46:06,681 --> 00:46:07,599
టిఫిన్?

602
00:46:07,682 --> 00:46:10,643
వద్దు, నేను వెళ్తున్నాను.

603
00:46:10,727 --> 00:46:14,397
8:30 కు బస్ ఉందని ఫ్రంట్ డెస్క్ చెప్పింది.
కజిన్స్ వెళ్తున్నాను.

604
00:46:14,481 --> 00:46:17,275
అవునా? నేను కారు కోసం ఎలాగూ వెళ్లాలి.

605
00:46:17,358 --> 00:46:18,902
లేదు, నా కారు తీసుకో.

606
00:46:18,985 --> 00:46:21,321
నీ కారు బోస్టన్‌కు తెస్తాను.
పెద్ద విషయం కాదు.

607
00:46:24,532 --> 00:46:26,117
మిమ్మల్ని జూలై నాలుగుకు కలుస్తానా?

608
00:46:30,330 --> 00:46:31,539
నేను వస్తాను.

609
00:46:33,458 --> 00:46:37,045
హా. సుసన్నాకు ఇష్టమైన
సెలవులకు తప్పకుండా వస్తాను.

610
00:46:46,554 --> 00:46:48,306
తనను జాగ్రత్తగా దింపు, సరేనా?

611
00:46:50,725 --> 00:46:53,394
బై, కాన్రాడ్.

612
00:47:42,151 --> 00:47:43,152
టేలర్.

613
00:47:50,535 --> 00:47:51,744
నువ్విక్కడేం చేస్తున్నావు?

614
00:47:51,828 --> 00:47:55,290
బెల్లీ కోసం. క్యాంప్‌కు.
తను కనుక వస్తే.

615
00:47:55,707 --> 00:47:56,541
సరే.

616
00:47:58,209 --> 00:47:59,502
అంతేనా. నిజంగా?

617
00:47:59,586 --> 00:48:02,755
రాత్రి నన్నలా వదిలేసి వెళ్ళినందుకు,
సందేశాలకు సమాధానం

618
00:48:02,839 --> 00:48:04,173
ఇవ్వనందుకు సారీ చెప్పవా?

619
00:48:05,008 --> 00:48:05,883
చెప్పను.

620
00:48:05,967 --> 00:48:08,136
సరే. బాగుంది. అద్భుతం.

621
00:48:08,219 --> 00:48:09,470
ఆగు. ఆగు, ఆగు.

622
00:48:13,057 --> 00:48:16,728
క్షమించు. సరేనా?
నాకు భయం వేసింది...

623
00:48:16,811 --> 00:48:17,895
ఎందుకు?

624
00:48:18,771 --> 00:48:20,356
నీకు గులాబీలు ఇచ్చినందుకా?

625
00:48:20,440 --> 00:48:22,650
మైలో అలా చేస్తే నీకు నచ్చేది కదా.

626
00:48:22,734 --> 00:48:23,651
అది మైలో.

627
00:48:23,735 --> 00:48:26,112
ఎవెలిన్ వాళ్ల ముందు
నిన్ను ఇబ్బంది పెట్టానా?

628
00:48:26,863 --> 00:48:27,697
అవును.

629
00:48:31,492 --> 00:48:32,577
-సరే.
-కాదు.

630
00:48:34,662 --> 00:48:36,164
అది నువ్వనుకునేలా కాదు.

631
00:48:36,247 --> 00:48:37,582
అయితే ఎలా?

632
00:48:40,251 --> 00:48:42,920
స్టీవెన్, నువ్వంటే నాకు చాలా కాలంగా ఇష్టం.

633
00:48:43,004 --> 00:48:44,756
అది నేను ఎవరికీ చెప్పలేదు.

634
00:48:44,839 --> 00:48:47,300
బెల్లీకి కూడా. చాలా సిగ్గుగా అనిపించింది.

635
00:48:48,301 --> 00:48:49,677
అది కటువు.

636
00:48:49,761 --> 00:48:52,388
నువ్వంటే ఇష్టం కాబట్టి
సిగ్గుగా అనిపించింది.

637
00:48:52,472 --> 00:48:54,349
నాకది చాలా ఎక్కువ.

638
00:48:54,432 --> 00:48:57,727
గత వేసవిలో బెల్లీ పుట్టినరోజు
పార్టీలో ముద్దు పెట్టుకుని,

639
00:48:57,810 --> 00:49:00,772
కాదన్న తరువాత కూడా
"హే! నువ్వంటే నాకిష్టం" అనుకున్నాను.

640
00:49:00,855 --> 00:49:03,107
అది మూర్ఖంగా అనిపించింది.

641
00:49:04,233 --> 00:49:08,780
సంబంధాలలో నాది... నాది ఎప్పుడూ పై చేయి,

642
00:49:08,863 --> 00:49:11,449
ఎందుకంటే నేను ఇతరులను పట్టించుకోను...

643
00:49:13,284 --> 00:49:16,454
కానీ నువ్వంటే నాకిష్టం,
అందుకని భయంగా ఉంది.

644
00:49:17,789 --> 00:49:21,084
నువ్వు కాలేజీకి వెళ్తున్నావు,
నీ వలన నాకు బాధ కలగాలనుకోను.

645
00:49:21,167 --> 00:49:22,627
అలా జరగదు.

646
00:49:25,296 --> 00:49:26,756
అలా జరగదు.

647
00:49:33,179 --> 00:49:35,014
ఏమైనా అవుతుంది అంటే...

648
00:49:37,767 --> 00:49:40,269
నువ్వే నా మనసును బాధ పెడతావు.

649
00:49:41,062 --> 00:49:42,563
అంతే కానీ మరోలా కాదు.

650
00:50:01,374 --> 00:50:02,500
టీమ్ స్టేలర్?

651
00:50:06,087 --> 00:50:07,004
స్టేలర్?

652
00:50:10,383 --> 00:50:12,051
అవును, 1,000 శాతం.

653
00:50:44,125 --> 00:50:45,543
దింపుతున్నందుకు ధన్యవాదాలు.

654
00:50:45,626 --> 00:50:46,753
ఎప్పుడైనా సరే.

655
00:50:55,887 --> 00:50:58,222
ఇలా చేయాలని ఎప్పటి నుంచి ఉందో
నీకు తెలీదు.

656
00:51:08,149 --> 00:51:13,070
ఎయిర్ వెంట్స్‌లోకి చీటో దుమ్ము
ఎలా వచ్చింది?

657
00:51:13,154 --> 00:51:14,405
మరీ ఎక్కువ చెప్తున్నావు.

658
00:51:14,489 --> 00:51:16,407
-కాదు! నిజంగా కాదు.
-చెప్తున్నావు.

659
00:51:16,491 --> 00:51:18,576
కాదు, స్టీరింగ్ వీల్ అంటుకుంటోంది.

660
00:51:19,786 --> 00:51:22,914
అది నేను పడేసుకున్న
బ్లూ రాస్ప్‌బెర్రీ ఐస్.

661
00:51:23,331 --> 00:51:24,415
నువ్వు...

662
00:51:25,166 --> 00:51:26,375
నువ్వు!

663
00:51:26,876 --> 00:51:28,878
కారు శుభ్రం చేయించాలనుకున్నాను,

664
00:51:28,961 --> 00:51:33,758
కానీ ఒక వింతవాడు మా ఇంటికి వచ్చి
నేనంటే ప్రేమ అని చెప్పాడు.

665
00:51:33,841 --> 00:51:36,761
తరువాత ముద్దు పెట్టుకున్నాము,
సమయం తెలియలేదు, అందుకే...

666
00:51:37,261 --> 00:51:39,597
-క్షమించు, ఇది సరిగ్గా లేదు.
-మరీ ఎక్కువ.

667
00:51:39,680 --> 00:51:41,599
ఆ వింత వాడు బాగా చెప్పాడు.

668
00:51:41,682 --> 00:51:43,643
అవును, నీకు అలానే చెప్పుకో.

669
00:51:45,686 --> 00:51:46,896
బెల్లీ వచ్చేసింది.

670
00:51:53,611 --> 00:51:56,447
టీమ్ జెల్లీఫిష్!

671
00:51:56,531 --> 00:51:58,699
సరే, సరే, సరే.

672
00:52:00,284 --> 00:52:01,285
-హాయ్!
-హాయ్!

673
00:52:02,620 --> 00:52:04,413
సరే. ఉత్సాహం బాగుంది,

674
00:52:04,497 --> 00:52:07,708
-కానీ ఊపిరాడనివ్వు.
-ఇంకొక్క క్షణం.

675
00:52:07,792 --> 00:52:08,960
హే, జెర్.

676
00:52:09,043 --> 00:52:10,253
హే.

677
00:52:11,212 --> 00:52:14,715
నువ్వు వస్తావని తెలుసు
కానీ నీ పట్ల చాలా గర్వంగా ఉంది.

678
00:52:15,049 --> 00:52:15,925
ధన్యవాదాలు.

679
00:52:16,884 --> 00:52:17,885
ఏమంటావు?

680
00:52:17,969 --> 00:52:19,887
అమ్మాయిలను వాళ్ల పని చేసుకోనిచ్చి,

681
00:52:19,971 --> 00:52:21,848
మనం వీడియో గేమ్స్ ఆడదామా?

682
00:52:21,931 --> 00:52:27,311
ధన్యవాదాలు, నేను బెల్లీ ఆట చూస్తాను.

683
00:52:28,563 --> 00:52:32,108
నువ్వూ ఉండవచ్చు.
నీ అమ్మాయి ఆట చూడవచ్చు.

684
00:52:32,191 --> 00:52:34,277
నాది కాక నేను ఎవరి అమ్మాయినీ కాను.

685
00:52:34,360 --> 00:52:38,239
మేము... మేమలాంటి జంట కాదు,
నేననేది నీకు తెలుసు కదా?

686
00:52:38,322 --> 00:52:39,991
-తెలీదు.
-మేమలా కాదు.

687
00:52:40,074 --> 00:52:41,284
-అస్సలు కాదు.
-అవును.

688
00:52:43,452 --> 00:52:44,495
తరువాత ఫోన్ చెయ్యి.

689
00:52:45,872 --> 00:52:48,499
సరే! బాగుంది, అమ్మాయిలూ! బాగా చేశారు!

690
00:52:48,583 --> 00:52:52,920
సరే! బాగుంది, అమ్మాయిలూ, పదండి!
మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో గుర్తుంచుకోండి...

691
00:52:53,004 --> 00:52:55,047
చేతులను వదులుగా ఉంచండి.

692
00:52:55,131 --> 00:52:57,008
-బెల్లీ వచ్చింది.
-రండి!

693
00:52:57,091 --> 00:52:58,718
-బెల్లీ!
-స్వాగతం!

694
00:52:58,801 --> 00:53:00,803
కిల్లా బీ వచ్చింది! అవును!

695
00:53:02,388 --> 00:53:05,349
కాంక్లిన్, నిన్ను క్యాంప్‌కు రావద్దని
చెప్పాను కదా.

696
00:53:05,433 --> 00:53:08,436
మేమందరం తను రావాలనుకుంటున్నాం.
తను మాలో ఒకరు.

697
00:53:09,353 --> 00:53:11,188
కోచ్ షా, దయచేసి చెప్పేది వినండి.

698
00:53:13,149 --> 00:53:16,027
గత సీజన్‌లో మిమ్మల్ని నిరాశ పరిచానని
నాకు తెలుసు.

699
00:53:17,486 --> 00:53:21,157
జట్టు పట్ల నా నిబద్ధత ఎక్కడా
ఉండాల్సిన విధంగా లేదు.

700
00:53:21,949 --> 00:53:24,285
నేను సాకులు చెప్పను,
మిమ్మల్ని నిరాశపరిచాను.

701
00:53:25,703 --> 00:53:28,456
చివరికి నువ్వు బాధ్యత
వహించడం బాగుంది, కానీ--

702
00:53:28,539 --> 00:53:29,498
కాదు. నాకు తెలుసు.

703
00:53:29,582 --> 00:53:33,461
నేనిది చాలా ముందు చేసి ఉండాలి,
అందుకు నేను చాలా సిగ్గుపడ్డాను.

704
00:53:35,129 --> 00:53:36,923
మీరు అవకాశం ఇస్తే, పాడు చేసాను.

705
00:53:38,507 --> 00:53:43,554
నన్ను నేను వదిలేసి,
జట్టును కూడా వదులుకున్నాను.

706
00:53:45,723 --> 00:53:48,893
కానీ మీరు నాకు అవకాశం ఇస్తే,
ఈ జట్టుకు సహకరించగలనని

707
00:53:48,976 --> 00:53:51,437
నిరూపించడానికి చేయగలిగినదంతా చేస్తాను.

708
00:53:51,520 --> 00:53:55,274
ప్లీజ్, నేను బెంచ్ మీద ఉంటాను,
సామగ్రిని తీసుకువెళతాను.

709
00:53:55,358 --> 00:53:58,319
నేను అందరి గేటరేడ్‌ను నింపుతాను.
ఏమైనా చేస్తాను.

710
00:53:58,402 --> 00:54:02,490
అంతా సరిగ్గా చేయడానికి
నేను నిజంగా మరొక అవకాశం కోరుకుంటున్నాను.

711
00:54:04,158 --> 00:54:06,369
దయచేసి నాకు మరో అవకాశం ఇవ్వండి.

712
00:54:07,787 --> 00:54:08,663
ప్లీజ్.

713
00:54:08,746 --> 00:54:09,997
-ప్లీజ్.
-కోచ్ షా.

714
00:54:10,081 --> 00:54:13,167
-ప్లీజ్. కోచ్.
-ప్లీజ్. ప్లీజ్.

715
00:54:13,250 --> 00:54:15,586
సరే, కానీ నువ్వు మాట
నిలబెట్టుకోవాలి, సరేనా?

716
00:54:15,670 --> 00:54:16,671
సరే.

717
00:54:17,254 --> 00:54:19,507
వెళ్లు, వార్మ్ అప్ చెయ్యి.

718
00:54:19,590 --> 00:54:21,592
డ్రెస్ మార్చుకో. ఎలా ఉంటుందో చూద్దాం.

719
00:54:21,676 --> 00:54:24,178
-అవును!
-మిమ్మల్ని నిరాశపరచను.

720
00:54:24,261 --> 00:54:25,429
హే, బెల్లీ.

721
00:54:25,513 --> 00:54:26,597
చాలు, బెల్లీ!

722
00:54:26,681 --> 00:54:29,433
-సరే.
-పదండి వెళదాం.

723
00:54:29,517 --> 00:54:31,811
అమ్మాయిలు, మళ్లీ.

724
00:54:37,358 --> 00:54:38,317
పదండి!

725
00:54:45,449 --> 00:54:46,659
-పదండి!
-బాగా చేశారు.

726
00:54:50,579 --> 00:54:52,164
నేను శాశ్వతంగా ఊహించుకునేటపుడు,

727
00:54:52,248 --> 00:54:54,542
ఎప్పుడూ ఒకే అబ్బాయి ఉండేవాడు.

728
00:54:58,587 --> 00:55:00,715
నా కలలలో, నా భవిష్యత్తు సెట్ అయి ఉండేది.

729
00:55:00,798 --> 00:55:02,008
కచ్చితంగా.

730
00:55:11,308 --> 00:55:13,060
నేనిలా ఊహించుకోలేదు.

731
00:55:16,897 --> 00:55:18,607
బాగా కొట్టావు, బెల్లీ!

732
00:55:41,797 --> 00:55:43,591
భవిష్యత్తు అస్పష్టంగా ఉంది,

733
00:55:43,674 --> 00:55:45,342
కానీ అది నాదే.

734
00:57:34,201 --> 00:57:36,203
సబ్‌టైటిల్ అనువాద కర్త మైథిలి

735
00:57:36,287 --> 00:57:38,289
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్ రెడ్డి

