1
00:00:11,971 --> 00:00:14,181
ద సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెట్టీ
ముందు భాగాల్లో…

2
00:00:14,265 --> 00:00:17,351
ఫించ్ కాలేజ్ మంచి కాలేజ్ కాబట్టి దానికి
అప్లై చేసానని అందరికీ చెప్పాను.

3
00:00:17,435 --> 00:00:20,980
కానీ నిజం ఏమిటంటే
నేను అతనికి దగ్గరగా ఉండాలని అనుకున్నాను.

4
00:00:21,063 --> 00:00:22,106
ఇప్పుడు ఇక్కడున్నాం.

5
00:00:22,189 --> 00:00:24,734
మనం ఇది మన జీవితాంతం చేస్తాము.

6
00:00:24,817 --> 00:00:27,111
-స్టడీ అబ్రాడ్ ప్రోగ్రాంలో సీటు వచ్చింది.
-పారిస్?

7
00:00:27,194 --> 00:00:30,114
అంకితం చేసే వేడుక కోసం నువ్వు, కాన్రాడ్
మీ స్పీచ్ మొదలుపెట్టారా?

8
00:00:30,197 --> 00:00:32,783
సుసన్నా మెమోరియల్ గార్డెన్‌కి
సగం కజిన్స్ వస్తోంది.

9
00:00:32,867 --> 00:00:36,287
క్యాప్, గౌను కోసం వెళ్తే నా పేరు
లిస్టులో లేదు. నేను గ్రాడ్యుయేటవ్వట్లేదు.

10
00:00:36,370 --> 00:00:39,498
మేము తిరిగి ఒకటవడం.
అది అయిపోయిందని ఎప్పుడూ అనిపించదు.

11
00:00:39,582 --> 00:00:41,208
నాకు వేసవి క్లినిక్ ఉద్యోగం వచ్చింది.

12
00:00:41,292 --> 00:00:42,877
-నువ్వు ఎప్పుడైనా ప్రేమించావా?
-ఒకసారి.

13
00:00:42,960 --> 00:00:44,253
ఆమె పేరేంటి?

14
00:00:44,336 --> 00:00:46,422
-బెల్లీ.
-ఏంటి, మీ తమ్ముడి గర్ల్ ఫ్రెండా?

15
00:00:46,505 --> 00:00:50,718
హే, జెర్. చూడు. నేను అమ్మ దానికి రాలేను.

16
00:00:50,801 --> 00:00:53,679
కాబోలో జరిగేది కాబోలోనే ఉంటుంది.

17
00:00:53,763 --> 00:00:55,890
స్ప్రింగ్ బ్రేక్ సమయంలో
నువ్వు లేసీతో సెక్స్ చేసావా?

18
00:00:55,973 --> 00:00:57,641
-ఛ.
-అది మనం విడిపోయినప్పుడు జరిగింది.

19
00:00:57,725 --> 00:00:58,893
చూడు, దానికి అర్థం లేదు.

20
00:00:58,976 --> 00:01:00,603
-దానిలో నాకు అర్థం ఉంది!
-నీ మీద ఒట్టు!

21
00:01:00,686 --> 00:01:01,979
నువ్వు అంతా పాడు చేశావు.

22
00:01:07,568 --> 00:01:10,988
ద సమ్మర్ ఐ టర్న్‌డ్ ప్రెట్టీ

23
00:01:20,581 --> 00:01:22,333
బెల్స్, కాఫీ తాగడానికి వెళదామా?

24
00:01:22,875 --> 00:01:27,922
నీ మీడియా ఎథిక్స్ పరీక్షలో కనీసం
బీ రాకపోతే, నీ పని అయిపోయినట్టే

25
00:01:28,005 --> 00:01:29,840
అని అన్నావనుకున్నాను.

26
00:01:31,133 --> 00:01:33,052
సరే. నువ్వు సరదా మనిషివి కాదు.

27
00:01:37,431 --> 00:01:38,766
ఆగు. ఇదేంటి?

28
00:01:39,600 --> 00:01:43,729
"కాబోకి ముఖ్యమైన ఫ్లైట్ అప్‌డేట్"
నువ్వు కాబో ఎప్పుడు వెళ్తున్నావు?

29
00:01:44,480 --> 00:01:47,191
నేను చివరి నిమిషంలో ఫ్లైట్
బుక్ చేసుకున్నానని చెప్పాను కదా.

30
00:01:47,858 --> 00:01:50,611
నువ్వు మెక్సికో వెళ్తున్నావంటే
నాకది గుర్తుంటుంది.

31
00:01:50,694 --> 00:01:54,698
బెల్స్, ఇది నా ఆఖరి స్ప్రింగ్ బ్రేక్.
నువ్వు ఫిల్లీ వెళతావు. అందుకని…

32
00:01:54,782 --> 00:01:57,034
అవును, కానీ మనం కజిన్స్‌లో
కలుద్దామనుకున్నాము కదా.

33
00:01:57,117 --> 00:01:59,662
నువ్వు మీ నాన్నతో సమయం గడుపుతావనుకున్నాను.

34
00:02:00,204 --> 00:02:03,749
సరే. మా నాన్న గురించి నాకు అపరాధభావం
కలిగించకు. ఆయనని గత వారమే కలిసాను.

35
00:02:04,625 --> 00:02:08,420
మీ మధ్య ఏమైనా అయిందా?
అప్పటి నుంచి నువ్వు మూడీగా ఉన్నావు.

36
00:02:09,713 --> 00:02:12,508
మ ఆమ్మ సమాధిని
చూడడం కన్నా ఘోరమైనదా? లేదు.

37
00:02:12,591 --> 00:02:17,304
హే, సరే, అలా అనడం అన్యాయం.
నువ్వు స్వార్ధంతో మాట్లాడుతున్నావు.

38
00:02:19,139 --> 00:02:23,686
సరే. సారీ. నన్ను విసిగించడం ఆపుతావా?
నీకు కాబో రావాలని ఉంటే, రా.

39
00:02:23,769 --> 00:02:25,855
లేదు, నాకు మీ అబ్బాయిల
ట్రిప్‌కి రావాలని లేదు.

40
00:02:25,938 --> 00:02:27,815
అబ్బాయిలే కాదు.
సొరోరిటీలు కూడా వస్తున్నారు.

41
00:02:28,399 --> 00:02:31,402
అమ్మాయిలని పిలిచారు
కానీ గర్ల్ ఫ్రెండ్స్ కాదు. బాగుంది.

42
00:02:31,485 --> 00:02:34,738
నాకు నీ తడి టీ షర్ట్ పోటీలలో
లేదా నువ్వు ఊహించుకునే

43
00:02:34,822 --> 00:02:37,032
-దాంట్లో ఆసక్తి లేదు.
-అది అది కాదు.

44
00:02:37,116 --> 00:02:39,493
-అయితే మరేంటి?
-నీకేమైంది ఇప్పుడు?

45
00:02:39,577 --> 00:02:41,620
నువ్వే కదా నాకు వెళ్తున్నానని చెప్పనిది.

46
00:02:41,704 --> 00:02:43,956
ఎందుకంటే నీకు ఫ్రాట్స్ నచ్చవు కదా.

47
00:02:44,039 --> 00:02:45,332
నేనలా ఎప్పుడన్నాను?

48
00:02:45,416 --> 00:02:47,293
నువ్వు అనక్కర్లేదు.
నాకది కనిపిస్తుంది.

49
00:02:47,376 --> 00:02:50,212
పరిక్షల్లో నేను ఫెయిల్ అయ్యేంత
దద్దమ్మని అయినందుకు క్షమించు.

50
00:02:50,296 --> 00:02:52,089
స్ప్రింగ్ బ్రేక్ సరదాగా గడపాలనుకున్నందుకు.

51
00:02:52,172 --> 00:02:54,133
కాన్రాడ్‌లా ఏ గ్రేడ్లు వచ్చి

52
00:02:54,216 --> 00:02:55,843
మెడికల్ స్కూల్‌కి వెళ్లనందుకు క్షమించు.

53
00:02:55,926 --> 00:03:00,014
అబ్బా, ఏంటి?
నీ ఆత్మన్యూనతా భావాన్ని నా మీద రుద్దకు.

54
00:03:01,140 --> 00:03:02,600
-అదెక్కడి నుంచి వచ్చిందో.
-అది,

55
00:03:02,683 --> 00:03:05,227
నాతో మొదలవలేదు,
అందుకని మీ నాన్నని చూడు.

56
00:03:05,311 --> 00:03:08,522
వావ్. నేనంత మూర్ఖుడిని,
స్వార్ధపరుడిని అని నువ్వనుకుంటే,

57
00:03:08,606 --> 00:03:11,775
నాతో ఎందుకున్నావు?
వదిలేయ్. నీ సమయం వృధా చేయను.

58
00:03:11,859 --> 00:03:13,319
పిచ్చిగా మాట్లాడకు.

59
00:03:13,402 --> 00:03:16,864
నేను చేసేదంతా పిచ్చనుకుంటావు,
నేను విసిగి పోయాను! అందుకని ముగిద్దాము.

60
00:03:17,489 --> 00:03:19,491
-నిజంగా అంటున్నావా?
-అవును, నిజంగానే అంటున్నాను.

61
00:03:19,575 --> 00:03:21,577
-సరే. నువ్వలా అనుకుంటే…
-అవును.

62
00:03:21,660 --> 00:03:23,495
-మంచిది! సరే, అద్భుతం! బై.
-బై!

63
00:03:26,790 --> 00:03:30,294
స్ప్రింగ్ బ్రేక్‌కి నేను ఇంటికి వెళ్లాను,
మేము అప్పటికీ ఇంకా మాట్లాడుకోలేదు.

64
00:03:32,713 --> 00:03:36,008
ఇప్పటికి ఐదు రోజులు అయింది,
అతనింకా టెక్స్ట్ చేయలేదు.

65
00:03:36,091 --> 00:03:38,761
నువ్వు కూడా టెక్స్ట్ చేయలేదు కదా?

66
00:03:38,844 --> 00:03:41,764
అవును, కానీ ఏమీ లేనిదే
గొడవ మొదలుపెట్టింది అతను.

67
00:03:42,514 --> 00:03:45,476
నాతో కొన్ని రోజులు
న్యూ యార్క్ రావచ్చు కదా?

68
00:03:45,559 --> 00:03:48,437
నా ఇంటర్వ్యూ అయిన
తరువాత మనం ఊరు చూడచ్చు.

69
00:03:48,520 --> 00:03:51,231
-నేను చాలా బాధలో ఉనన్ను.
-ఇన్స్టాగ్రామ్ చూడడం ఆపు!

70
00:03:51,732 --> 00:03:54,068
ఏమైందో నాకింకా అర్థం కావడం లేదు.

71
00:03:54,151 --> 00:03:55,152
నన్ను చూడనివ్వు.

72
00:03:56,278 --> 00:03:58,322
-సరే, నేను బయటకి వెళ్తున్నాను!
-బై, అమ్మ!

73
00:03:58,781 --> 00:03:59,782
కాబాలో జరిగేది

74
00:03:59,865 --> 00:04:02,534
శుభవార్త ఏమిటంటే,
అతను చాలా బాధలో ఉన్నాడు.

75
00:04:03,160 --> 00:04:05,746
అంటే గ్రేడ్ల విషయంలో
బాధగా ఉన్నాడు కానీ నేను…

76
00:04:05,829 --> 00:04:09,083
ఇదంతా ఆపు. ఏమవుతోందో తెలుసుకోవాలని
ఉంటే, అతన్నే అడుగచ్చుగా?

77
00:04:09,166 --> 00:04:12,002
-అవును, కానీ అతనే ఇదంతా…
-అతను తిరిగి వచ్చాక మాట్లాడు.

78
00:04:12,086 --> 00:04:14,922
అబ్బాయిలు కుక్కలా ఉంటారు.
తప్పు చేసినప్పుడు దాక్కుంటారు,

79
00:04:15,005 --> 00:04:18,384
ప్రపంచంలో అత్యుత్తమ బాయ్ ఫ్రెండ్
కూడా కొన్నిసార్లు తప్పు చేస్తాడు.

80
00:04:18,467 --> 00:04:21,178
అతనికి అందుకు బాధగా ఉండి ఉంటుంది.
అది జెర్.

81
00:04:21,261 --> 00:04:23,889
నువ్వు అతని ఆక్సిజెన్.
నువ్వు లేకుండా ఊపిరి తీసుకోలేడు.

82
00:04:29,603 --> 00:04:31,438
టేలర్ కరెక్టే చెప్పిందని అనుకున్నాను,

83
00:04:32,523 --> 00:04:35,526
అందుకని, కాలేజీకి రాగానే
అతన్ని కలవడానికి వెళ్లాను.

84
00:04:36,193 --> 00:04:38,278
నా కోసం నువ్వు
నిజంగా వచ్చేవాడివి కాదా?

85
00:04:38,362 --> 00:04:40,698
నాతో గొడవపడి, వెళ్లింది నువ్వు,

86
00:04:40,781 --> 00:04:44,201
-అయినా వారం వరకు మాట్లాడవా.
-నేను వెధవని, బెల్లీ.

87
00:04:44,284 --> 00:04:46,286
నేను చెత్త చేశాను, చాలా చెత్త చేసాను.

88
00:04:46,370 --> 00:04:48,122
హే. కాదు. ఫరవాలేదు.

89
00:04:50,666 --> 00:04:53,085
లేదు, లేదు. అలా కాదు.

90
00:04:53,168 --> 00:04:55,879
నా వారం బాగా జరగలేదు,
ఆ కోపం నీ మీద చూపించాను.

91
00:04:57,047 --> 00:04:58,757
నన్ను క్షమించు. నన్ను క్షమించు, బెల్లీ.

92
00:04:59,341 --> 00:05:04,221
అంతే, మనం గొడవపడ్డాము.
దానితో అంతా ముగిసిపోదు.

93
00:05:07,016 --> 00:05:08,225
అంటే…

94
00:05:09,143 --> 00:05:10,853
అంటే, మనం విడిపోనట్టా?

95
00:05:12,688 --> 00:05:14,523
మనం ఎప్పుడూ కలిసి ఉండడం అపలేదు.

96
00:05:19,445 --> 00:05:22,614
బెల్లీ, నేను కాబోలో ఉన్నప్పుడు…

97
00:05:24,324 --> 00:05:25,242
నేననుకున్నాను…

98
00:05:25,325 --> 00:05:26,785
-హే.
-నేననుకున్నాను మనం…

99
00:05:34,293 --> 00:05:36,837
అంత చెత్త విషయం కోసం
నిన్ను పోగొట్టుకున్నానని అనుకున్నాను.

100
00:05:39,590 --> 00:05:40,841
నన్ను ఎప్పటికీ పోగొట్టుకోవు.

101
00:05:51,560 --> 00:05:55,230
నీకిది తెచ్చాను. నేను బీచ్‌లో ఉన్నప్పుడు
నీ గురించి ఆలోచిస్తున్నాను.

102
00:05:55,314 --> 00:05:57,733
మనం మళ్లీ మాట్లాడుకుంటామో
లేదో నాకు నాకు తెలియలేదు.

103
00:05:57,816 --> 00:05:58,901
ఇది బాలేదు.

104
00:05:58,984 --> 00:06:01,945
-నువ్వు వేసుకోవక్కర్లేదు.
-లేదు. నాకు నచ్చింది.

105
00:06:05,616 --> 00:06:06,617
ఐ లవ్ యు.

106
00:06:22,841 --> 00:06:24,551
పనికిరాని చెత్త!

107
00:06:32,101 --> 00:06:35,229
ఏం చేయాలో చెప్పు
నాకు నేను నచ్చట్లేదు - క్షమించు

108
00:06:50,828 --> 00:06:51,912
టేలర్ వచ్చింది.

109
00:06:52,454 --> 00:06:54,039
-నేను పడుకున్నాను.
-సరే.

110
00:06:59,211 --> 00:07:00,212
ఆమె పడుకుంది.

111
00:07:00,796 --> 00:07:03,465
-నాకు తనతో మాట్లాడాలనుంది.
-ఆమె పడుకుంటుంది.

112
00:07:05,467 --> 00:07:07,886
సరే. ఇది బ్రేక్ ఫాస్ట్ బురీటో.

113
00:07:07,970 --> 00:07:11,390
బాగా వేగిన బేకన్, తనకి నచ్చేట్టు.
తినేలా చూడు.

114
00:07:11,473 --> 00:07:14,309
సరే. బై.

115
00:07:20,649 --> 00:07:24,444
బెల్లీ, లేసీ గురించి నాకు నిజంగా తెలియదు.

116
00:07:24,528 --> 00:07:27,030
నీ కోసం ఆ ఇద్దరినీ చంపేసేదాని సరేనా?

117
00:07:27,114 --> 00:07:29,616
ప్లీజ్, నాకు ఫోన్ చెయ్యి. ఫోన్ చెయ్యి.

118
00:07:30,617 --> 00:07:32,786
-లేదు, చెంప దెబ్బ తినాలంటే…
-టే…

119
00:07:32,870 --> 00:07:35,455
-తప్ప నేనైితే దగ్గరకి రాను.
-తనెలా ఉందో చెప్పవా, ప్లీజ్.

120
00:07:35,539 --> 00:07:37,291
నాకు తెలీదు. నాతో కూడా మాట్లాడట్లేదు.

121
00:07:37,374 --> 00:07:41,378
నీ పిల్ల నా సొరోరిటీలో ఉంది, అలా తను
నాకు తెలిసినందుకు నేను కూడా దోషినే.

122
00:07:41,461 --> 00:07:43,839
-టేలర్. నేను చెప్పేది విను.
-నేను ఎప్పుడూ నీ తరఫే ఉన్నాను.

123
00:07:43,922 --> 00:07:46,133
నేను టీమ్ జెరెమియా సిఇఓని,

124
00:07:46,216 --> 00:07:48,719
ఇప్పుడు నువ్వొక వెధవవని తెలిసింది!

125
00:07:48,802 --> 00:07:50,971
-అది పిచ్చి!
-నేను మోసం చేయలేదు. మేము విడిపోయాం.

126
00:07:51,054 --> 00:07:55,142
కాదు. అది చెత్త.
నువ్విలా అని తప్పించుకోలేవు.

127
00:07:55,225 --> 00:07:58,103
మీరు విడిపోయింది
కేవలం రెండు నిమిషాలకు, జెరెమియా.

128
00:07:58,187 --> 00:08:01,899
దాని తర్వాత నువ్వు తనకు పిచ్చి
గవ్వల బ్రేస్లేట్ తెచ్చావు,

129
00:08:01,982 --> 00:08:04,359
ఏం చేస్తున్నావు?
ఏం ఆలోచిస్తున్నావు?

130
00:08:04,443 --> 00:08:06,486
-ఇప్పుడు మోసం చేయడంలో నువ్వు ‌ఎక్స్‌పర్టా?
-ఏంటి?

131
00:08:06,570 --> 00:08:09,239
విన్నావు కదా. డేవిస్, మియా ఎలా ఉన్నారు?

132
00:08:09,990 --> 00:08:14,244
ఇది నా మీదకి తిప్పకు.
మీరు ఆదర్శంగా ఉన్నారు కదా.

133
00:08:14,328 --> 00:08:18,707
ఆమెకి నువ్వు అర్హత పొందాలి.
కానీ పొందలేదు. నీకా అర్హత ఎప్పుడూ లేదేమో.

134
00:08:21,168 --> 00:08:22,211
ఇక్కడి నుంచి వెళతావా?

135
00:08:28,550 --> 00:08:29,468
స్టీవెన్

136
00:08:33,513 --> 00:08:35,390
హే, నేను టేలర్. సందేశం వదలండి.

137
00:08:38,185 --> 00:08:40,395
ఈ మీటింగ్‌కి ఆడమ్ నిన్ను కూడా పిలిచాడా?

138
00:08:41,271 --> 00:08:44,524
అవును. ఆదివారం నాడు
పెద్దవాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే,

139
00:08:44,608 --> 00:08:46,902
వెనుక కూర్చుని వినడం సరదాగా ఉంటుంది.

140
00:08:46,985 --> 00:08:49,363
శుక్రవారం నీకు పంపిన ఫైల్ అందిందా?

141
00:08:50,614 --> 00:08:55,244
-ఆ, అందింది.
-అయితే, దాని స్టార్‌కేడ్‌ఎక్స్ చూశావా?

142
00:08:56,495 --> 00:08:58,497
స్టార్‌కేడ్‌ఎక్స్,
గేమింగ్ స్టార్టప్, అదేనా?

143
00:08:58,580 --> 00:09:00,415
అబ్బా. నువ్వు గేమర్ అని నాకు తెలుసు.

144
00:09:00,499 --> 00:09:02,459
దేవుడా. నర్డ్ లక్షణాలన్నీ ఉన్నాయి.

145
00:09:02,542 --> 00:09:05,921
సరే. కాదు, కాదు, శాంతించు. సరేనా?
నేను దానికి ప్రోగ్రాం రాసాను.

146
00:09:06,004 --> 00:09:08,048
ప్రిన్స్‌టన్‌లో
కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివాను.

147
00:09:08,131 --> 00:09:10,509
-మర్చిపోయావా?
-అవును. అదెలా మర్చిపోతాను?

148
00:09:10,592 --> 00:09:12,678
అది నీ ఇమెయిల్ సంతకంలో ఉంది.

149
00:09:13,720 --> 00:09:15,180
చూడు. ఒక చిన్న సహాయం చెయ్యి, సరేనా?

150
00:09:15,264 --> 00:09:20,185
ఆ ఫైల్ చదివి, ఆ తర్వాత
నీ గర్ల్ ఫ్రెండ్‌కి ఫోన్ చెయ్యి. సరేనా?

151
00:09:20,727 --> 00:09:24,481
నేను నా గర్ల్ ఫ్రెండ్‌తో విడిపోయాను.

152
00:09:24,564 --> 00:09:28,485
తను నా ఎక్స్, అంటే, ఎక్స్-ఎక్స్…

153
00:09:28,568 --> 00:09:30,946
అబ్బా. వద్దు, వద్దు.
ఆపు. వెంటనే. వద్దు.

154
00:09:31,029 --> 00:09:33,115
వ్యక్తిగత విషయాలు వద్దు. సరేనా?

155
00:09:33,198 --> 00:09:36,827
నీ డ్రామాలో పాలుపంచుకునే
తోటి సహోద్యోగిని కాను.

156
00:09:37,452 --> 00:09:39,246
-నాకనవసరం.
-సరే.

157
00:09:41,415 --> 00:09:43,959
సరే. స్టార్‌కేడ్‌ఎక్స్?

158
00:09:44,042 --> 00:09:46,712
ప్రతి విసి షాప్ ఈ కంపెనీ
కోసం ప్రయత్నిస్తోంది, సరేనా?

159
00:09:46,795 --> 00:09:50,048
-మనం దీని మీద దృష్టి పెట్టాలి.
-సరే. సరే. అర్థమైంది.

160
00:09:50,132 --> 00:09:51,133
ధన్యవాదాలు.

161
00:10:14,156 --> 00:10:16,867
డిన్నర్?

162
00:10:32,799 --> 00:10:35,844
నువ్వు లైబ్రరీ దాకా వెళ్లాలి.
ఒక్కొక్కటిగా చేద్దాము.

163
00:10:37,346 --> 00:10:40,223
అవును, కానీ అన్నీ
అతని దగ్గరకే వెళ్తున్నాయి.

164
00:10:41,558 --> 00:10:44,311
నేను చదవలేను.

165
00:10:44,394 --> 00:10:47,564
నేను నా వేసవి ఉద్యోగానికి రానని
ఫోన్ చేసి చెప్పాలి

166
00:10:47,647 --> 00:10:52,027
ఎందుకంటే నేను కజిన్స్‌కి వెళ్లలేను,
ఎందుకంటే జెరెమియా.

167
00:10:53,612 --> 00:10:55,572
నేను సుసన్నా మెమోరియల్‌కి ఎందుకు రాలేనో

168
00:10:55,655 --> 00:10:59,076
మా అమ్మకి ఎలా చెప్పాలో చూడాలి,
ఎందుకంటే అది మళ్లీ

169
00:10:59,159 --> 00:11:00,619
జెరెమియా.

170
00:11:02,329 --> 00:11:04,456
నేను మళ్లీ ఎప్పుడూ
ఆ వేసవి ఇంటికి వెళ్లలేనేమో,

171
00:11:04,539 --> 00:11:05,957
జెరెమియా కారణంగా.

172
00:11:06,041 --> 00:11:08,251
ఒక్కొక్కటిగా చేయడం నీకు పని చేయదేమో.

173
00:11:08,335 --> 00:11:11,004
లేదు! లేదు. ఏదీ పనిచేయదు,
ఎందుకంటే అన్నీ…

174
00:11:12,464 --> 00:11:13,673
అబ్బా.

175
00:11:17,302 --> 00:11:19,221
హే, నువ్వు బాగానే ఉంటావు.

176
00:11:20,722 --> 00:11:22,599
నిన్ను స్టడీ గ్రూప్ తర్వాత కలుస్తాను.

177
00:11:22,682 --> 00:11:27,270
నేను తప్పించుకోలేనిది లేసీని మాత్రమే కాదు,
నాకన్ని చోట్లా జెరెమియా కనిపిస్తున్నాడు.

178
00:11:31,650 --> 00:11:33,652
అతనక్కడ లేకపోయినా కూడా.

179
00:12:20,574 --> 00:12:22,033
ఆగు. ఆగు, ఆగు.

180
00:12:30,584 --> 00:12:35,839
నేనెక్కడికి వెళితే అక్కడ మా జ్ఞాపకం ఉంది.
మా మంచి రోజుల జ్ఞాపకాలు.

181
00:12:35,922 --> 00:12:37,174
నేను రెడీ.

182
00:12:39,301 --> 00:12:41,094
-బాగా చేసావు.
-అది మంచి టాస్.

183
00:12:41,178 --> 00:12:43,263
-బాగుంది.
-ఆ టాస్ ఇంకా బాగా కావచ్చు.

184
00:12:45,223 --> 00:12:48,560
అయితే… నేను ఇక్కడ ఉండకూడదు.

185
00:12:59,362 --> 00:13:00,739
-హాయ్.
-అమ్మా, హాయ్.

186
00:13:01,364 --> 00:13:04,284
చిన్న ప్రశ్న.
నువ్వు నా బర్త్ సర్టిఫికేట్ పంపగలవా?

187
00:13:04,367 --> 00:13:05,827
వీలయితే, రాత్రికి.

188
00:13:05,911 --> 00:13:10,040
నీకూ హలో, తల్లీ. నేను బాగానే ఉన్నాను.
అడిగినందుకు ధన్యవాదాలు. ఎలా ఉన్నావు?

189
00:13:10,123 --> 00:13:12,042
సారీ. ఎలా ఉన్నావమ్మా?

190
00:13:13,043 --> 00:13:14,669
బోరు కొట్టే కాన్ఫరెన్స్.

191
00:13:14,753 --> 00:13:17,297
దాని అర్థం నీ బర్త్ సర్టిఫికేట్‌కి
దరిదాపుల్లో లేను.

192
00:13:17,380 --> 00:13:18,965
అయినా నీకు దాని అవసరం ఏమిటి?

193
00:13:19,049 --> 00:13:23,178
పాస్పోర్ట్. నాకు పారిస్
వెళ్లడానికి సీటు వచ్చింది.

194
00:13:25,305 --> 00:13:28,558
అది అద్భుతం! అభినందనలు, తల్లీ.

195
00:13:29,976 --> 00:13:31,061
జెర్ ఏమంటున్నాడు?

196
00:13:31,645 --> 00:13:33,980
నిన్ను మిస్ అవుతాడు,
కానీ అతను గర్వ పడతాడు.

197
00:13:34,064 --> 00:13:35,065
అవును.

198
00:13:37,025 --> 00:13:39,444
-అమ్మా, నేను వెళ్లాలి.
-సరే. లవ్ యు.

199
00:13:44,741 --> 00:13:47,410
బాబు, నువ్వు వణికిపోతున్నావు, నువ్వు…

200
00:13:48,703 --> 00:13:49,788
శాంతించు.

201
00:13:49,871 --> 00:13:52,749
నేను తెచ్చిన గంజాయి ప్రయత్నించు.
బాధ తగ్గిస్తుందేమో.

202
00:13:53,416 --> 00:13:55,835
నేను నా జీవితంలో
అతి ముఖ్యమైన వ్యక్తిని పోగొట్టుకున్నాను.

203
00:13:55,919 --> 00:13:58,129
సజీవంగా ఉండడానికి
నాలో శక్తి లేనందుకు క్షమించు.

204
00:13:58,213 --> 00:14:00,674
విడిపోవాడాల గురించి తెలియదనుకుంటున్నావా?
నాకు తెలుసు.

205
00:14:00,757 --> 00:14:01,758
షాన్ తరువాత నన్ను చూసావు.

206
00:14:01,841 --> 00:14:04,177
రెడ్‌బర్డ్, మీరు కలిసి
ఉన్నది రెండు నిమిషాలకు.

207
00:14:04,261 --> 00:14:07,347
-నాకది అర్థవంతం అనిపించింది.
-నేనింత పాడు చేసుకున్నానంటే నేను నమ్మలేను.

208
00:14:08,390 --> 00:14:11,268
నీ అమ్మాయి నాకు నచ్చింది. నిజంగా.

209
00:14:11,351 --> 00:14:15,480
నేనది ప్రేమతో అంటున్నాను.
కానీ మీరు విడిపోయారు. కదా?

210
00:14:15,564 --> 00:14:18,858
నువ్వు మత్తులో ఉన్నావు,
లేసీ నీ మీద పడింది…

211
00:14:18,942 --> 00:14:22,529
అదేమీ కారణం కాదు, నేను తిరిగి వచ్చిన
వెంటనే తనకి చెప్పి ఉండాల్సింది.

212
00:14:22,612 --> 00:14:25,198
అవును. చెప్పి ఉండాలి,

213
00:14:34,833 --> 00:14:40,297
మా అమ్మ పోయినప్పటి
నుంచీ బెల్లీ నా ప్రపంచం.

214
00:14:43,049 --> 00:14:44,718
ఆమె నా సర్వస్వం.

215
00:14:46,636 --> 00:14:48,513
ఆమెని కోల్పోవడం…

216
00:14:51,474 --> 00:14:55,770
నాలో ముఖ్యమైన
భాగాన్ని కోల్పోయినట్లు అనిపిస్తోంది.

217
00:14:56,396 --> 00:14:57,939
చాలా బాగుంది.

218
00:15:02,485 --> 00:15:03,486
అయితే, ఆమె కోసం పోరాడు.

219
00:15:03,945 --> 00:15:06,823
సారీ చెప్పడం ఆపు.
అది ఆమెకి చూపించడానికి దారి వెతుకు.

220
00:15:09,534 --> 00:15:12,662
-చాలా తేలికగా చెప్తున్నావు.
-అదంతా తేలికగా ఉండదు.

221
00:15:17,417 --> 00:15:18,710
నేనిది నమ్మలేను.

222
00:15:18,793 --> 00:15:21,921
అంకితభావం ఉన్నవాడిలా ప్రవర్తిస్తాడు,
కానీ అతనూ అందరిలాంటి వాడే.

223
00:15:22,756 --> 00:15:25,133
మన డార్మ్‌‌కి వస్తే కన్పిస్తే కాల్చివేతే.

224
00:15:26,051 --> 00:15:28,595
-దయచేసి నవ్వద్దు.
-అది సమస్యే కాదు.

225
00:15:28,678 --> 00:15:31,181
నువ్వు పారిస్ రేపే వెళ్లలేకపోవడం బాలేదు.

226
00:15:32,390 --> 00:15:34,726
-అతని పట్ల మరీ కటువుగా ఉన్నానంటావా?
-చూడు.

227
00:15:36,561 --> 00:15:41,650
మీరు విడిపోయారని అతను నిజంగా అనుకుని ఉంటే,
అది మోసం కిందకి రాదు.

228
00:15:41,733 --> 00:15:43,360
కానీ దాన్ని రహస్యంగా ఉంచడం?

229
00:15:43,902 --> 00:15:46,071
అది అతను తప్పు చేసాడని
అతనికి తెలుసనీ చెప్తుంది,

230
00:15:46,154 --> 00:15:50,992
అది నీ నుంచి దాయలనుకున్నాడు.
అది నేను మర్చిపోలేను.

231
00:15:52,202 --> 00:15:56,081
అనికకి తెలియనిది ఏమిటంటే,
నాకూ ఒక రహస్యం ఉంది.

232
00:15:57,916 --> 00:16:00,168
గత స్సంవత్సరం,
క్రిస్మస్ తరువాతి రోజున,

233
00:16:00,251 --> 00:16:03,338
అమ్మ రైటర్స్ రిట్రీట్‌కి వెళ్లింది,
స్టీవెన్ స్నేహితుల దగ్గరకి వెళ్లాడు.

234
00:16:03,421 --> 00:16:05,674
జెర్ అతని నాన్న, కాన్రాడ్‌తో
స్కీయింగ్‌కి వెళ్తున్నాడు.

235
00:16:06,633 --> 00:16:08,259
ప్రపంచంలో నాకు ఇష్టమైన చోటుకి వెళ్లకుండా

236
00:16:08,343 --> 00:16:10,929
ఇంట్లో ఒక్కదాన్నే
ఎందుకు ఉండాలి అనుకున్నాను?

237
00:16:11,471 --> 00:16:13,848
స్టీవెన్ కాంక్లిన్ కార్
తీసుకుని కజిన్స్ వెళ్లాను.

238
00:16:20,647 --> 00:16:23,233
ఛ. ఛ, ఛ, ఛ.

239
00:16:24,150 --> 00:16:26,361
అబ్బా. కెవిన్ ఏం చేస్తాడు?

240
00:16:26,444 --> 00:16:29,406
కెవిన్ ఏం చేస్తాడు? సరే.

241
00:16:43,253 --> 00:16:44,838
స్టీవెన్, తలుపు తెరువు. నేను.

242
00:16:50,343 --> 00:16:51,219
బెల్లీ.

243
00:16:51,845 --> 00:16:52,762
బాగానే ఉన్నావా?

244
00:16:53,680 --> 00:16:56,766
హా. హా.
క్షమించండి. ఫ్లాష్ కళ్లలో పడింది.

245
00:16:57,308 --> 00:16:59,102
-సరే.
-తరువాత.

246
00:17:11,156 --> 00:17:13,199
బెల్లీ. వద్దు. ప్లీజ్. వెళ్లకు.

247
00:17:13,283 --> 00:17:16,619
నా జీవితంలో అతి పెద్ద పొరపాటు చేశాను.

248
00:17:17,996 --> 00:17:20,540
చూడు, నీకు ఏమైనా చెప్తాను.
ఏమైనా…

249
00:17:20,623 --> 00:17:22,917
నాకు మన మధ్య రహస్యాలు వద్దు.

250
00:17:24,919 --> 00:17:25,920
సరే.

251
00:17:29,507 --> 00:17:30,508
అదెలా జరిగింది?

252
00:17:31,968 --> 00:17:34,471
నేను చాలా బాధలో ఉన్నాను. బాగా తాగాను.

253
00:17:36,514 --> 00:17:37,557
ఆమె అక్కడుంది.

254
00:17:40,226 --> 00:17:41,227
ఎన్ని సార్లు?

255
00:17:46,441 --> 00:17:47,442
రెండు సార్లు.

256
00:17:49,527 --> 00:17:52,197
-జెర్, నాతో ఇలా ఎలా చేశావు?
-బెల్లీ, ప్లీజ్.

257
00:17:52,280 --> 00:17:53,698
నీకు తగినవాడిని కాదని నాకు తెలుసు.

258
00:17:53,782 --> 00:17:56,034
కానీ ప్రపంచంలో అందరికన్నా
ఎక్కువ నిన్నే ప్రేమిస్తాను,

259
00:17:56,117 --> 00:17:57,494
నువ్వు బాధపడితే నాకు కష్టంగా ఉంది,

260
00:17:57,577 --> 00:18:02,081
-అది వెనక్కి తీసుకోవడానికి ఏమైనా చేస్తాను.
-ఆపు. చేసినదాన్ని వెనక్కి తీసుకోలేవు.

261
00:18:02,165 --> 00:18:03,374
బెల్లి. ప్లీజ్.

262
00:18:04,042 --> 00:18:07,045
నన్ను క్షమించు.
నిన్ను తప్ప నేనెవరినీ ప్రేమించలేదు.

263
00:18:08,421 --> 00:18:11,883
నేనతన్ని ప్రేమిస్తున్నాను.
నాకతన్ని క్షమించాలని ఉంది.

264
00:18:11,966 --> 00:18:14,385
ఎలానో తెలియదు.

265
00:18:16,721 --> 00:18:19,557
నన్ను బాధపెట్టని
వాడివి నువ్వొక్కడివే అవ్వాలి.

266
00:18:22,018 --> 00:18:24,187
అలాంటిది నువ్వే నన్ను అందరికన్నా
ఎక్కువ బాధపెట్టావు.

267
00:18:33,279 --> 00:18:34,656
లారెల్!

268
00:18:35,281 --> 00:18:36,407
-ఎలియట్!
-హే!

269
00:18:36,491 --> 00:18:39,786
హే. వావ్. మంచి పుస్తకాలు తీసుకున్నావు.

270
00:18:39,869 --> 00:18:43,456
హా. నేను ఇప్పటికే మాన్క్రీఫ్ అనువాదం
రెండు సార్లు చదివాను…

271
00:18:43,540 --> 00:18:45,124
-అందరిలా.
-అవును.

272
00:18:45,834 --> 00:18:47,293
ఈ సంవత్సరం,

273
00:18:47,377 --> 00:18:51,840
ఫ్రెంచ్‌లో ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్
చదివాలని నిర్ణయించుకున్నాను.

274
00:18:52,590 --> 00:18:54,759
చదువు. పెద్ద సాహసమే.

275
00:18:55,426 --> 00:18:58,638
మీకు ఆసక్తి ఉంటే, మనం మన సొంత

276
00:18:58,721 --> 00:19:00,682
బుక్ గ్రూప్ చేసుకోవచ్చు.

277
00:19:00,765 --> 00:19:04,811
ప్రొఫెసర్ పార్క్ మొదటి సంవత్సరంలోనే
ఫ్రెంచ్ క్లాసులు తీసుకోవడం ఆపేశారు.

278
00:19:04,894 --> 00:19:07,188
జాన్, నువ్విక్కడ ఏం చేస్తున్నావు?

279
00:19:07,272 --> 00:19:08,815
నీతో మాట్లాడాలని వచ్చాను.

280
00:19:08,898 --> 00:19:10,525
ప్రైవేట్‌గా. ప్రొఫెసర్ పార్క్.

281
00:19:11,442 --> 00:19:12,443
సరే.

282
00:19:13,444 --> 00:19:14,529
మళ్లీ కలుస్తాను, ఎలియట్?

283
00:19:15,488 --> 00:19:16,656
సరే. ఆలాగే.

284
00:19:17,240 --> 00:19:20,535
మాట్లాడాలనుకుంటే
ఫ్లాబర్ట్ సింపోజియంలో ఉంటాను.

285
00:19:20,618 --> 00:19:22,495
-సరే. అలాగే.
-సరే.

286
00:19:25,748 --> 00:19:26,875
అదేంటి?

287
00:19:26,958 --> 00:19:29,502
ఇప్పుడు టిఏలు ప్రొఫెసర్లతో సరసాలడచ్చా?

288
00:19:29,586 --> 00:19:32,547
అతను ఆడ్జంక్ట్.
నేనూ సరసాలాడుతున్నానేమో.

289
00:19:32,630 --> 00:19:34,090
అయితే అతనికి సహాయం చేశాను.

290
00:19:34,173 --> 00:19:36,259
ఐదు నిమిషాలలో అతని పని పట్టేదానివి.

291
00:19:36,342 --> 00:19:38,720
చరిత్ర ప్రొఫెసర్
సాహిత్య సమావేశంలో ఏం చేస్తున్నారు?

292
00:19:38,803 --> 00:19:41,097
సంభావ్య క్రాస్ఓవర్
కోర్సులను పరిశోధిస్తున్నాను.

293
00:19:41,180 --> 00:19:44,142
మన ఇన్చార్జ్ చరిత్రను మళ్లీ సెక్సీగా
మార్చడానికి మార్గాలను వెతుకుతున్నారు.

294
00:19:45,518 --> 00:19:47,687
అందుకు సాహిత్య సమావేశమే దానికి మార్గం.

295
00:19:47,770 --> 00:19:48,897
నన్ను చంపేయ్.

296
00:19:49,772 --> 00:19:54,444
ట్రోప్స్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్ ఎపిక్ పొయెట్రీ
కోసం దయచేసి బాల్‌రూమ్ బికి వెళ్లండి.

297
00:19:55,069 --> 00:19:56,321
ధన్యవాదాలు.

298
00:19:58,698 --> 00:20:00,575
-అది చాలా…
-బోరింగ్ అనిపిస్తోంది.

299
00:20:00,658 --> 00:20:01,993
అవును.

300
00:20:02,911 --> 00:20:03,870
సరే.

301
00:20:06,039 --> 00:20:08,833
కొత్త ప్లాన్. ఇది తాగడానికి చోటు
వెతుకుదాం. వైన్ ఓపెనర్ దొంగిలించు.

302
00:20:08,917 --> 00:20:10,752
-నేను చేయలేను.
-నీ వంతు చెయ్యి.

303
00:20:26,517 --> 00:20:28,853
ఒకటో రోజుకు స్వాగతం.

304
00:20:29,729 --> 00:20:32,982
వేసవి ముగిసే సమయానికి,
మీలో సగం మందన్నా ఉంటారని ఆశిస్తాను.

305
00:20:33,566 --> 00:20:35,485
నాకు కోపం తెప్పించకపోతే,
మనం బాగానే ఉంటాము.

306
00:20:37,779 --> 00:20:39,572
సరే, మొదటి పేషెంట్.

307
00:20:39,656 --> 00:20:42,575
మూర్చ వచ్చిందని
ఒక 15 ఏళ్ల అబ్బాయి వచ్చాడు.

308
00:20:43,201 --> 00:20:45,161
ఏమవుతోందో ఎవరైనా చెప్పగలరా?

309
00:20:46,621 --> 00:20:49,374
మొదటి సంవత్సరం వారితో మొదలు పెడదాము.
నువ్వేమంటావు?

310
00:20:49,457 --> 00:20:50,583
-అది…
-అది…

311
00:20:52,877 --> 00:20:55,546
ప్యూబర్టీ హార్మోన్లు కావచ్చు.
అతనికి 15. అది…

312
00:20:55,630 --> 00:20:57,465
ఫ్లూ నుంచి కోలుకుంటున్నాడు,

313
00:20:57,548 --> 00:21:00,134
ఈ వయసులో మూర్చకి ప్రధాన కారణం జ్వరం.

314
00:21:00,218 --> 00:21:02,845
-బాగా చెప్పావు.
-అతనికి ఈఆర్‌లో వికారానికి మందులు ఇచ్చారు,

315
00:21:02,929 --> 00:21:05,223
-అది ప్రమాదాన్ని పెంచుతుంది.
-బాగా పట్టుకున్నావు.

316
00:21:06,057 --> 00:21:08,142
కొన్నిసార్లు స్పష్టంగా కనిపించేదే సమాధానం.

317
00:21:08,226 --> 00:21:11,521
అవును. ధన్యవాదాలు, డాక్టర్ నామజి.
నేనది గుర్తు పెట్టుకుంటాను.

318
00:21:11,604 --> 00:21:12,981
సరే. తరువాతి పేషెంట్.

319
00:21:14,190 --> 00:21:17,110
మొదటి రోజే పంపేయబడే వైద్య విద్యార్ధిగా
నన్ను చేయాలనుకుంటున్నావా?

320
00:21:17,193 --> 00:21:19,779
-అది పుకారు.
-సరే, నేను ఓటమి ఒప్పుకుంటాను.

321
00:21:19,862 --> 00:21:21,280
తరువాతి దానిలో చూసుకుంటాను.

322
00:21:21,364 --> 00:21:23,950
నామజికి మస్కా కొట్టడం
నీ తమ్ముడి గర్ల్ ఫ్రెండ్‌కి

323
00:21:24,033 --> 00:21:26,244
నీ ప్రేమను తట్టుకునే
పద్దతి అని నాకు తెలుసు.

324
00:21:26,327 --> 00:21:29,080
-అది నీకెందుకు చెప్పాను?
-నువ్వు చెప్పాలని తహతహలాడావు.

325
00:21:29,831 --> 00:21:30,832
ఏదోలే.

326
00:21:31,457 --> 00:21:34,252
అకడమిక్ కాన్ఫరెన్స్‌లో
సమయం గడపడానికి సురక్షితమైన ప్రదేశం

327
00:21:34,335 --> 00:21:37,380
హోటల్ జిమ్. బాగుంది!

328
00:21:37,463 --> 00:21:40,049
నీ ఫోన్ ఇవ్వు. నా బ్యాటరీ అయిపోయింది,
పిల్లలకు ఫోన్ చేయాలి.

329
00:21:40,133 --> 00:21:44,053
నా గదిలో ఉంది. పిల్లలు బానే ఉన్నారు.
నువ్వు తలకిందులుగా ఉన్నావు.

330
00:21:44,137 --> 00:21:45,596
అవును.

331
00:21:49,642 --> 00:21:50,768
ఏం చేస్తున్నావు?

332
00:21:51,185 --> 00:21:53,229
మనసు దింపుకుంటున్నాను.

333
00:21:53,813 --> 00:21:54,814
ఎందుకడిగాను?

334
00:21:55,857 --> 00:21:58,651
మన పెళ్లి పెటాకులు అయినా,

335
00:21:58,735 --> 00:22:02,030
మనం మన పిల్లలకు మంచి తల్లిదండ్రులం.

336
00:22:02,822 --> 00:22:03,823
అవును.

337
00:22:07,577 --> 00:22:09,078
అయ్యో. నాకిప్పుడే గుర్తొచ్చింది.

338
00:22:09,954 --> 00:22:11,080
బెల్లీ ఇవాళ ఫోన్ చేసింది

339
00:22:11,956 --> 00:22:15,334
అది తరువాతి సెమిస్టర్
పారిస్‌లో చదువుతోందట.

340
00:22:16,461 --> 00:22:19,547
పారిస్ పోలీసు కాసిమోడోను
ఎలా పట్టుకున్నారని తెలుసా?

341
00:22:20,381 --> 00:22:21,883
వాళ్లు ఆలోచనని అనుసరించారు.

342
00:22:23,051 --> 00:22:24,761
ఆ జోక్ మళ్లీ ఎప్పుడూ చెప్పకు.

343
00:22:25,595 --> 00:22:26,929
నీకు నా జోకులు నచ్చేవి.

344
00:22:27,013 --> 00:22:29,515
నీ ముక్కులోంచి బీర్
బయటకి వచ్చేలా నవ్వేదానివి.

345
00:22:29,599 --> 00:22:32,268
అందుకే కదా మొదటి డేట్
నాడు సెక్స్ చేసుకున్నాం?

346
00:22:32,351 --> 00:22:35,980
నేను నవ్వినట్టు నటించాను.
నీతో సెక్స్ చేయాలనే అనుకున్నాను.

347
00:22:37,899 --> 00:22:38,900
అవునా?

348
00:22:40,068 --> 00:22:41,152
నేను చేసుకోవచ్చా?

349
00:22:42,361 --> 00:22:44,155
-చేసుకోండి. మీకే.
-మాది అయిపోయింది.

350
00:22:44,238 --> 00:22:45,239
ధన్యవాదాలు.

351
00:23:00,004 --> 00:23:01,089
ఇక్కడికి ఎందుకు వచ్చావు?

352
00:23:01,172 --> 00:23:03,591
రోజంతా నా టెక్స్ట్‌లకు సమాధానం ఇవ్వలేదు.

353
00:23:04,342 --> 00:23:07,136
పరీక్షలు. వత్తిడిగా ఉంది.

354
00:23:07,220 --> 00:23:08,971
టే, బాగానే ఉన్నావా? ఏమైంది?

355
00:23:10,223 --> 00:23:11,474
నాకు ఆకలేస్తోంది.

356
00:23:12,642 --> 00:23:15,895
సరే. ఏమైనా తిందాము. కార్ ఎక్కు.

357
00:23:20,149 --> 00:23:21,150
సరే.

358
00:23:40,211 --> 00:23:41,754
తినడానికి ఎక్కడికి వెళదాము?

359
00:23:42,672 --> 00:23:43,673
ఏమో.

360
00:23:49,470 --> 00:23:50,471
ఏంటి?

361
00:23:54,517 --> 00:23:55,810
నేను మియాతో విడిపోయాను.

362
00:24:01,983 --> 00:24:03,442
నా కోసం అలా చేయలేదనుకుంటాను.

363
00:24:04,152 --> 00:24:05,153
ఏంటి?

364
00:24:08,739 --> 00:24:09,782
క్షమించు.

365
00:24:10,533 --> 00:24:13,786
నీతోనే ఉండాలనుకున్నందుకు
సంతోషిస్తావనుకున్నాను.

366
00:24:13,870 --> 00:24:16,205
మొన్న రాత్రి, రాత్రి గడిపిన తర్వాత.

367
00:24:16,289 --> 00:24:18,040
స్టీవెన్, నువ్వు తప్పుగా అనుకున్నావు.

368
00:24:18,124 --> 00:24:20,877
నీకు ముందే చెప్పాను.
ఇది కాజువల్‌గా ఉంచుదామని.

369
00:24:20,960 --> 00:24:23,796
సరే. నీతో, నాతో ఎప్పుడూ కాజువల్‌గా ఉండదు.
నీకది తెలుసు.

370
00:24:23,880 --> 00:24:25,715
-అబ్బ!
-ఇతరులను బాధ పెట్టకుండా ఉండడానికి,

371
00:24:25,798 --> 00:24:27,800
మనం ఇది నిజంగా చేద్దాం.

372
00:24:27,884 --> 00:24:30,553
-వాళ్లకి మన గురించి తెలియదు.
-అనవసరం. ఇది చెత్తే.

373
00:24:32,138 --> 00:24:34,557
టేలర్, నీకు, నాకు కొత్త ప్రారంభం కావాలి.

374
00:24:34,640 --> 00:24:37,727
-మంచిగా, స్పష్టంగా, శుభ్రంగా.
-స్టీవెన్, మనం ఇంతకు ముందు ప్రయత్నించాము.

375
00:24:37,810 --> 00:24:39,687
-లక్షసార్లు ప్రయత్నించాము.
-అప్పుడు చిన్నపిల్లలం.

376
00:24:39,770 --> 00:24:42,356
-మనం సరిపోము. ఎప్పుడూ సరిపోము.
-టేలర్, నేను నీ ఒక్కదానితోనే

377
00:24:42,440 --> 00:24:43,900
-ఉండాలనుకుంటున్నాను.
-దేవుడా.

378
00:24:43,983 --> 00:24:47,320
-నేను చెప్తున్నాను, ఐ లవ్ యు.
-ఆపు. ఆపు! వద్దు. అనకు.

379
00:24:47,403 --> 00:24:49,530
-నేనిది చేయలేను. నువ్వు…
-ఏమంటున్నావు…

380
00:24:49,614 --> 00:24:51,782
-పక్కన ఆపు, నన్ను కార్ దిగనివ్వు.
-టేలర్, వద్దు.

381
00:24:51,866 --> 00:24:53,284
నా మాట విను. ప్లీజ్.

382
00:24:53,367 --> 00:24:55,244
-నేనడుగుతోంది అంతే.
-నన్ను కార్ దిగనివ్వు.

383
00:24:55,328 --> 00:24:56,579
మనం రోడ్డు మధ్యలో ఉన్నాము.

384
00:24:56,662 --> 00:24:59,123
-నేనలా చేయను.
-నాకనవసరం. నేను దిగాలి. ఆపు,

385
00:24:59,207 --> 00:25:01,292
నన్ను కార్ దిగనివ్వు!

386
00:25:01,375 --> 00:25:03,753
సరే! సరే! సరే. ఛ!

387
00:25:03,836 --> 00:25:06,088
నేను ఆపుతున్నాను! సరేనా?

388
00:25:11,552 --> 00:25:12,845
టేలర్, ఏంటిది?

389
00:25:27,944 --> 00:25:29,862
టేలర్. నేను చెప్పానా…

390
00:25:31,822 --> 00:25:33,115
దేవుడా!

391
00:25:36,202 --> 00:25:37,995
-టేలర్!
-హాయ్.

392
00:25:40,373 --> 00:25:41,874
నన్ను క్షమించు.

393
00:25:42,458 --> 00:25:45,002
ఏమైంది? వాడితో ఉన్నావా?
నువ్వు గాయపడ్డావా?

394
00:25:46,545 --> 00:25:49,507
-ఏమైంది?
-నేను కార్లో లేను.

395
00:25:49,590 --> 00:25:51,884
-సరే.
-మేము వాదించుకుంటున్నాము.

396
00:25:53,928 --> 00:25:56,722
నేను కార్ దిగాను,
అతను నా వెనుక వస్తున్నాడు.

397
00:25:56,806 --> 00:25:57,890
సరే.

398
00:26:00,142 --> 00:26:01,269
ఏంటి?

399
00:26:04,313 --> 00:26:09,151
-ఏంటి? హే. ఏమైంది?
-అదంతా నా తప్పే.

400
00:26:09,235 --> 00:26:11,612
కాదు, కాదు. అది నీ తప్పు కాదు.

401
00:26:12,446 --> 00:26:13,906
నా తప్పే.

402
00:26:13,990 --> 00:26:15,533
మీరు స్టీవెన్ కాంక్లిన్‌తో ఉన్నారా?

403
00:26:15,616 --> 00:26:17,618
అవును. అతను బాగానే ఉన్నాడా?

404
00:26:17,702 --> 00:26:21,289
ప్రారంభ స్కాన్లు పక్కేతెముక విరిగిందని,
సెరిబ్రల్ కంట్యూషన్ ఉందని చూపిస్తున్నాయి.

405
00:26:21,831 --> 00:26:24,583
-సెరిబ్రల్ కంట్యూషన్? అదేంటి…
-అది మెదడుకి తగిలిన దెబ్బ.

406
00:26:24,667 --> 00:26:27,003
వాపు తగ్గే వరకు అది ఎంత సీరియస్
అనేది మనకు తెలియదు.

407
00:26:27,086 --> 00:26:29,588
అప్పటి వరకు అతన్ని నిద్రలో ఉంచుతాము.

408
00:26:29,672 --> 00:26:31,841
మనం వేచి చూడాలి. అంతేనా?

409
00:26:31,924 --> 00:26:33,467
కొన్ని పేపర్లు పూర్తి చేయాలి,

410
00:26:33,551 --> 00:26:35,678
అతని తరఫున ఎవరైనా నిర్ణయాలు తీసుకోవాలి.

411
00:26:35,761 --> 00:26:38,306
-మీలో ఎవరు తీసుకుంటారు?
-నేనతని చెల్లెలిని. క్షమించండి.

412
00:26:38,389 --> 00:26:39,640
చెల్లెలు ఫరవాలేదు.

413
00:26:39,724 --> 00:26:42,226
సరే. నేను ఎలాంటి నిర్ణయాలు…

414
00:26:42,310 --> 00:26:44,228
అదంతా అందులో ఉంటుంది.

415
00:26:47,648 --> 00:26:50,818
నేను మా తల్లిదండ్రులకి ఫోన్ చేయాలి,
ఇంతకు ముందు ఫోన్ కలవలేదు.

416
00:26:50,901 --> 00:26:53,654
-సరే, నేను చేస్తాను.
-సరే.

417
00:26:54,822 --> 00:26:56,490
స్టీవెన్ ఇన్సూరెన్స్ సంగతి నాకు తెలియదు,

418
00:26:56,574 --> 00:26:58,784
మా అమ్మావాళ్లదా
లేక ఆఫీసుదా అన్నది నాకు తెలియదు.

419
00:26:58,868 --> 00:27:01,078
అతని రక్తం టైప్ నాకెలా తెలుస్తుంది.

420
00:27:01,162 --> 00:27:05,583
స్టీవెన్ తను యూనివర్సల్ డోనార్
అని గొప్పలు చెప్పుకోవడం గుర్తుంది.

421
00:27:05,666 --> 00:27:07,710
అవును, వాడు దేని గురించి
అయినా గొప్పలు చెప్పుకుంటాడు.

422
00:27:10,212 --> 00:27:13,299
-సరే. ఓ-నెగెటివ్. అతను ఓ-నెగెటివ్.
-ఓ-నెగెటివ్.

423
00:27:13,966 --> 00:27:14,925
సరే.

424
00:27:15,009 --> 00:27:17,011
-మీ అమ్మావాళ్లకు మళ్లీ ఫోన్ చేస్తాను.
-సరే.

425
00:27:17,511 --> 00:27:21,182
ఇంకొంత మందికి కూడా చెప్పాలేమో.

426
00:27:22,183 --> 00:27:23,434
జెర్‌కి ఫోన్ చేయనా?

427
00:27:26,062 --> 00:27:29,523
ఏమో. ఒక గంట క్రితం, అతని గురించి
ఆలోచిస్తేనే వాంతి వచ్చేలా అనిపించింది.

428
00:27:29,607 --> 00:27:33,361
ఇప్పుడు… అతనిక్కడ
ఉంటే బాగుంటుందనిపిస్తోంది.

429
00:27:33,444 --> 00:27:34,445
నేనర్థం చేసుకుంటాను.

430
00:27:35,404 --> 00:27:37,990
నాకు బాగా ఆనిపించడానికి
ఏమనాలో అతనికి తెలుసు.

431
00:27:41,702 --> 00:27:43,621
ఈ రోజు నేను నీ జెర్ అవుతాను.

432
00:27:44,455 --> 00:27:45,956
-సరే.
-మీ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తాను.

433
00:27:46,040 --> 00:27:48,709
జెర్‌కి కూడా ఫోన్ చేస్తాను. సరేనా?

434
00:27:48,793 --> 00:27:52,129
పేపర్లు పూర్తి చెయ్యి,
మిగతాదంతా నాకు వదిలెయ్యి.

435
00:27:52,213 --> 00:27:54,298
-నేను చేస్తాను.
-సరే. ధన్యవాదాలు.

436
00:27:55,007 --> 00:27:56,759
-కాన్రాడ్‌కి కూడా ఫోన్ చేస్తావా?
-కాన్రాడ్.

437
00:27:56,842 --> 00:27:59,428
అతనికి ఇదంతా అర్థమవుతుందేమో.
ధన్యవాదాలు.

438
00:27:59,512 --> 00:28:01,847
సరే. అలాగే. కాన్రాడ్‌కి ఫోన్ చేస్తాను.

439
00:28:06,602 --> 00:28:08,729
-నేను తరువాతి ఫ్లైట్‌కి వస్తాను.
-లేదు, అవసరం లేదు.

440
00:28:08,813 --> 00:28:10,731
లారెల్, జాన్ అప్పటికి వచ్చేస్తారు.

441
00:28:10,815 --> 00:28:14,860
సరే. డాక్టర్ ఏమన్నారో చెప్పు.

442
00:28:14,944 --> 00:28:17,196
డాక్టర్ మంచిగా మాట్లాడలేదు.
మాకేమీ చెప్పలేదు.

443
00:28:17,279 --> 00:28:18,864
మేము ఏమైందో అడిగాము, అంతే…

444
00:28:18,948 --> 00:28:20,908
నేను సహాయం చేయగలనేమో.
ఏ ఆసుపత్రిలో చేర్చారు?

445
00:28:20,991 --> 00:28:25,454
ప్రావిడెన్స్ జనరల్‌లో ఉన్నాము.
కానీ నువ్వెలా…

446
00:28:25,538 --> 00:28:26,747
నేను చూసుకుంటాను.

447
00:28:28,165 --> 00:28:29,583
నాకేమైనా చేయాలని ఉంది.

448
00:28:32,503 --> 00:28:33,921
బెల్లీ ఎలా ఉంది?

449
00:28:34,004 --> 00:28:36,173
-బాగానే ఉంది.
-అవునా? సరే.

450
00:28:36,799 --> 00:28:37,967
-సరే.
-సరే, అలాగే.

451
00:28:38,050 --> 00:28:39,009
సరే.

452
00:28:40,052 --> 00:28:42,513
-నాకు ఏమైందో చెప్తూ ఉండు, సరేనా?
-సరే, చెప్తాను.

453
00:28:42,596 --> 00:28:43,597
సరే.

454
00:28:45,724 --> 00:28:47,351
డాక్టర్ నామజి. ఒక్క నిమిషం.

455
00:28:48,018 --> 00:28:49,019
ఏమైంది?

456
00:28:49,103 --> 00:28:51,605
నా ఫ్రెండ్‌కి కార్ ఆక్సిడెంట్ అయింది.

457
00:28:52,690 --> 00:28:54,608
దగ్గరి ఫ్రెండ్. కుటుంబంలో వాడు.

458
00:28:54,692 --> 00:28:57,194
ప్రావిడెన్స్ జనరల్‌లో ఉన్నాడు.

459
00:28:57,278 --> 00:29:00,197
మీకు అక్కడ న్యూరాలజీలో ఎవరైనా తెలుసా?

460
00:29:00,281 --> 00:29:02,241
న్యూరాలజీ హెడ్ ఫ్రెండ్‌కి ఫ్రెండ్.

461
00:29:02,324 --> 00:29:03,993
అతని పేరు స్టీవెన్ కాంక్లిన్.

462
00:29:04,076 --> 00:29:07,746
మీరు ఏమైనా ఫోన్ చేసే అవకాశం ఉందా?

463
00:29:09,999 --> 00:29:12,001
-నేనేం చేయగలనో చూస్తాను.
-ధన్యవాదాలు.

464
00:29:12,877 --> 00:29:14,795
నీకు సెలవు కావాలా?

465
00:29:17,715 --> 00:29:19,884
లేదు, నేను బాగానే ఉన్నాను.

466
00:29:20,801 --> 00:29:21,802
సరే.

467
00:29:24,889 --> 00:29:26,140
సరే.

468
00:29:27,683 --> 00:29:30,186
ప్రావిడెన్స్ జనరల్ హాస్పిటల్

469
00:29:50,372 --> 00:29:51,624
జెర్ లాబీలో ఉన్నాడు.

470
00:29:52,249 --> 00:29:53,250
అవును, నాకు తెలుసు.

471
00:29:53,834 --> 00:29:55,961
మనకి ఏమైనా అవసరం
వస్తుందేమోనని ఇక్కడే ఉంటానన్నాడు.

472
00:29:56,045 --> 00:29:58,631
వచ్చి నీతో మాట్లాడడులే.

473
00:29:59,924 --> 00:30:03,010
ఎంత మంచివాడు. అంత మంచిగా ఎందుకుండాలి?

474
00:30:04,678 --> 00:30:05,971
నేను టెక్స్ట్ చేయనా?

475
00:30:07,515 --> 00:30:08,682
స్టీవెన్ బానే ఉంటాడా?

476
00:30:08,766 --> 00:30:09,934
ఇజబెల్ కాంక్లిన్?

477
00:30:10,893 --> 00:30:12,228
అవును.

478
00:30:12,311 --> 00:30:14,647
నేను డాక్టర్ జూన్ క్వాన్.
న్యూరాలజీ టీమ్ హెడ్‌ని.

479
00:30:14,730 --> 00:30:17,650
-నేను మీ అన్నయ్య కేసు చూస్తాను.
-ఆయన పరిస్థితి పాడయిందా?

480
00:30:17,733 --> 00:30:20,486
లేదు. దాని అర్థం ఎవరో
తెలిసినవారు మీ కోసం చూస్తున్నారు.

481
00:30:21,654 --> 00:30:23,864
స్టాన్‌ఫర్డ్ నుంచి కొలీగ్ ఫోన్ వచ్చింది.

482
00:30:25,032 --> 00:30:26,617
స్టీవెన్‌ మత్తులో, నిద్రపోతున్నాడు.

483
00:30:26,700 --> 00:30:30,246
పరిస్థితి స్థిరంగా ఉంది, సిటి
స్కాన్ చేస్తాము. అతన్ని చూసారా?

484
00:30:31,205 --> 00:30:32,456
రండి, తీసుకు వెళతాను.

485
00:30:32,540 --> 00:30:35,167
కుటుంబంలోని వారిని మాత్రమే,
ఇద్దరు సందర్శకులని అనుమతిస్తాము.

486
00:30:35,251 --> 00:30:39,255
ఈమె స్టీవెన్ మరో చెల్లెలు
అనుకుంటాను. నాతో రండి.

487
00:30:47,388 --> 00:30:49,390
-నీ ఫ్రెండ్ గురించి ఏమైనా తెలిసిందా?
-లేదు.

488
00:30:50,724 --> 00:30:52,476
నువ్వు వెళ్లవా?

489
00:30:52,560 --> 00:30:54,228
వెళ్లినా ఏం చేయాలో తెలియదు.

490
00:30:54,311 --> 00:30:55,896
నేనింకా డాక్టర్ కాదు కదా.

491
00:30:56,522 --> 00:30:58,566
అదీ కాక, మేము గత కొన్ని
సంవత్సరాలుగా మాట్లాడుకోలేదు.

492
00:31:00,276 --> 00:31:01,610
సెల్ ఫోన్లు వాడకూడదు.

493
00:31:02,278 --> 00:31:03,654
సరే.

494
00:31:03,737 --> 00:31:05,573
ఆ రక్తం సేకరణ ఎలా అయింది?

495
00:31:05,656 --> 00:31:06,782
-బాగా అయింది.
-బాగా అయింది.

496
00:31:11,912 --> 00:31:13,038
పేరు తప్పు రాసావు.

497
00:31:14,123 --> 00:31:16,458
అది నాది. నా పొరపాటు.

498
00:31:16,542 --> 00:31:19,712
-నీ పేషెంట్‌ని రిస్క్‌లో పెట్టే పొరపాటు.
-నేనిప్పుడే సరి చేస్తాను.

499
00:31:19,795 --> 00:31:21,797
అవకాశం ఇచ్చినప్పుడు
నువ్వు ఇంటికి వెళ్లి ఉండాల్సింది.

500
00:31:21,880 --> 00:31:23,799
-ఇలా మళ్లీ జరగదు.
-అవును, జరగదు.

501
00:31:23,882 --> 00:31:26,594
ఇక్కడ నీ పని అయిపోయింది.
నువ్విందుకు సిద్ధంగా లేవు.

502
00:31:28,137 --> 00:31:31,974
ఒక్క పొరపాటుకు నన్ను తీసేస్తున్నారా?
డాక్టర్ నామజి, ప్లీజ్. నేను…

503
00:31:32,057 --> 00:31:33,684
నువ్వు దీన్ని ఒక పొరపాటులా చూడవచ్చు.

504
00:31:34,268 --> 00:31:36,687
కానీ ఇది నీ పరిమితుల
గురించి తెలుసుకోకపోవడం,

505
00:31:36,770 --> 00:31:39,356
అది నిన్నొక నష్టంగా చేస్తుంది.
నా నష్టం.

506
00:31:39,440 --> 00:31:41,233
-డాక్టర్ నామజి, నేను…
-లేదు.

507
00:31:42,109 --> 00:31:43,986
నువ్వు మళ్లీ వచ్చే సంవత్సరం అప్లై చేయచ్చు.

508
00:32:07,843 --> 00:32:09,470
స్టీవెన్, నీకో రహస్యం చెప్పనా?

509
00:32:10,304 --> 00:32:12,348
నిన్ను ప్రేమించినంతగా
నేను ఎవరినీ ప్రేమించలేదు.

510
00:32:16,769 --> 00:32:18,437
అదేంత భయం వేస్తుందో తెలుసా?

511
00:32:23,400 --> 00:32:28,906
నాకు ఏమీ పట్టనట్టు నటిస్తాను కానీ,
నేను చాలా కావాలనుకుంటాను.

512
00:32:33,494 --> 00:32:36,163
నువ్వు నా దగ్గరకు వచ్చి నేను
నీకు తగిన దానిని కాదని

513
00:32:36,246 --> 00:32:38,165
చెప్తావేమోనని నాకు ఎప్పుడూ భయంగా ఉంటుంది.

514
00:32:38,874 --> 00:32:42,544
నువ్వు "నువ్వు నాకు తగిన దానివి
కాదు" అంటావేమో అనిపిస్తుంది.

515
00:32:55,224 --> 00:32:57,601
అందుకని నిన్ను దూరంగా ఉంచితే,

516
00:32:57,685 --> 00:33:00,020
నువ్వు నాకు ఏమీ కానట్టు నటిస్తే,

517
00:33:00,104 --> 00:33:01,522
నువ్వు నన్ను బాధ పెట్టలేవనుకున్నాను.

518
00:33:03,816 --> 00:33:06,276
నాకది ఎలా ఆపాలో తెలియలేదు.

519
00:33:17,121 --> 00:33:19,373
మనం మొదటిసారి కలిసి ఉన్నప్పుడు,

520
00:33:19,456 --> 00:33:21,792
నువ్వు నాకు చెప్పావు…

521
00:33:21,875 --> 00:33:24,169
నువ్వు మనను కాదనుకోనని చెప్పావు.

522
00:33:27,131 --> 00:33:31,009
నాకు నిన్ను ఎంతగా
నమ్మాలని అనిపించిందో తెలుసా.

523
00:33:48,277 --> 00:33:50,738
మీకు మంచి సమాచారం. సిటి స్కాన్ బాగుంది.

524
00:33:50,821 --> 00:33:53,240
"సిటి స్కాన్ బాగుంది."
అంటే ఏంటి?

525
00:33:53,323 --> 00:33:55,534
స్టీవెన్ మెదడులో వాపు తగ్గింది,

526
00:33:55,617 --> 00:33:57,953
అతని నిద్ర మందులు తగ్గించవచ్చు.

527
00:33:58,036 --> 00:33:59,705
అతను లేవడానికి కొంత సమయం పడుతుంది.

528
00:33:59,788 --> 00:34:01,623
అతను కలవడానికి రెడీగా
ఉన్నప్పుడు మీకు చెప్తాము.

529
00:34:01,707 --> 00:34:02,708
ధన్యవాదాలు.

530
00:34:05,627 --> 00:34:09,757
-అతను బాగానే ఉన్నాడు. బాగవుతాడు.
-నాకు భయం వేసింది.

531
00:34:17,181 --> 00:34:19,057
నీకు ఇదంతా చెప్పినందుకు ఏమనుకోకు.

532
00:34:19,141 --> 00:34:21,477
స్టీవెన్, నేను తిరిగి ఒకటవకూడదని
నువ్వనుకుంటున్నావని తెలుసు.

533
00:34:21,560 --> 00:34:23,687
లేదు. నేను నీ గురించి ఆలా అనుకోకూడదు.

534
00:34:23,771 --> 00:34:27,107
లేదు. నా మానసిక స్థితి బాలేదు.

535
00:34:28,192 --> 00:34:31,779
స్టీవెన్‌ని వదిలిపెట్టకపోవడం,
భావోద్వేగాల కోసం

536
00:34:31,862 --> 00:34:36,158
డేవిస్‌ని ఉంచుకోవడం.
అది చెత్త, స్వార్ధం.

537
00:34:37,159 --> 00:34:39,328
స్టీవెన్ సరైనది చేయాలనుకున్నాడు,

538
00:34:39,411 --> 00:34:43,081
నాకు భయం వేసింది.
కానీ ఇదంతా, ఇది…

539
00:34:48,128 --> 00:34:52,758
నేను భయపడినా…
స్టీవెన్‌ని మళ్లీ పోగొట్టుకుంటానేమోనని

540
00:34:52,841 --> 00:34:58,388
భయపడడం కన్నా ప్రయత్నించకపోవడం
ఇంకా భయపెడుతోంది.

541
00:35:03,185 --> 00:35:04,770
నేను డేవిస్‌తో విడిపోతాను.

542
00:35:07,105 --> 00:35:09,775
నువ్వేం చేయాలనుకున్నా నేను నీతో ఉంటాను.

543
00:35:19,076 --> 00:35:22,287
సరే. నేను ఎలా ఉన్నాను? బాగున్నానా?

544
00:35:23,413 --> 00:35:25,582
-నేను అబద్ధం చెప్పను.
-అంతాగా బాగా లేనా?

545
00:35:28,836 --> 00:35:31,255
ఇంటికి వెళ్లు, ఏమైనా తిను.

546
00:35:31,797 --> 00:35:32,798
స్నానం చెయ్యి.

547
00:35:34,424 --> 00:35:35,509
డాక్టర్ అన్నది విన్నావుగా.

548
00:35:35,592 --> 00:35:37,469
కొంత సేపటి వరకు లేవడు.

549
00:35:37,553 --> 00:35:38,554
సరే. ధన్యవాదాలు.

550
00:35:43,559 --> 00:35:44,685
హే, ఆగు.

551
00:35:47,521 --> 00:35:50,357
జెరెమియాతో ఉందామనుకుంటే, ఉండు.

552
00:35:51,024 --> 00:35:53,485
-నేనలా అనలేదు…
-అతన్ని బతిమిలాడనివ్వు,

553
00:35:53,569 --> 00:35:56,029
కానీ గత నాలుగేళ్లుగా మీ మధ్య ఉన్నదాన్ని

554
00:35:56,113 --> 00:35:58,323
అలా ఊరికే వదిలేసుకోకు.

555
00:36:02,077 --> 00:36:04,037
అది నువ్వు కావాలనుకుంటే.

556
00:36:09,042 --> 00:36:10,085
సరే.

557
00:36:19,344 --> 00:36:20,345
లార్.

558
00:36:23,599 --> 00:36:24,683
మనం లేవాలి.

559
00:36:26,226 --> 00:36:27,311
నోరు మూసుకో.

560
00:36:28,979 --> 00:36:30,606
ఇంకా పొద్దునే లేవలేవా?

561
00:36:33,483 --> 00:36:35,319
నా కళ్లు మూసుకుపోయాయి.

562
00:36:36,153 --> 00:36:38,447
నీ కాంటాక్ట్ సొల్యూషన్ ఇస్తావా?

563
00:36:38,530 --> 00:36:39,740
హా.

564
00:36:50,167 --> 00:36:51,376
దేవుడా!

565
00:36:53,045 --> 00:36:54,296
జాన్, ఇలా రా!

566
00:36:55,839 --> 00:36:57,841
-దేవుడా. అమ్మా, ఎక్కడున్నావు?
-ఏంటి?

567
00:36:57,925 --> 00:36:59,593
-నీ మెసేజులు చూశాను.
-ఏమైంది?

568
00:36:59,676 --> 00:37:03,388
ఏమైంది? స్టీవెన్‌కి ఆక్సిడెంట్
అయింది. ఎలా ఉన్నాడు?

569
00:37:03,472 --> 00:37:04,640
వాడు బాగానే ఉంటాడు.

570
00:37:05,974 --> 00:37:10,062
నేను ధైర్యంగా ఉండడానికి
ప్రయత్నించాను, కానీ చాలా భయం వేసింది.

571
00:37:11,647 --> 00:37:13,065
బీన్… నోరు మూసుకో.

572
00:37:13,148 --> 00:37:15,734
నీకెంత భయం వేసిందో నేను ఊహించలేను.

573
00:37:15,817 --> 00:37:20,113
అయ్యో, తల్లీ.
నువ్వక్కడ ఒక్కదానివే ఉన్నావా?

574
00:37:20,739 --> 00:37:24,952
లేదు, లేదు. టేలర్ కూడా ఉంది,
తను తోడుగా ఉంది.

575
00:37:26,787 --> 00:37:30,248
జెర్ కూడా ఉన్నాడు. రాత్రంతా ఉన్నాడు.

576
00:37:30,332 --> 00:37:32,918
అమ్మ, అంతా పిచ్చిగా ఉంది.

577
00:37:33,001 --> 00:37:35,462
తల్లీ. నేను రాగాలిగినంత త్వరగా వస్తాను,

578
00:37:35,545 --> 00:37:39,007
మీ నాన్నతో మాట్లాడి,
ఆయనకి కూడా చెప్తాను.

579
00:37:40,092 --> 00:37:41,426
నువ్వంటే నాకు చాలా ఇష్టం, బెల్లీ.

580
00:37:42,052 --> 00:37:43,470
ఐ లవ్ యు, అమ్మా.

581
00:37:46,098 --> 00:37:47,557
స్టీవెన్‌కి కార్ ఆక్సిడెంట్ అయిందా?

582
00:37:47,641 --> 00:37:49,810
-వాడు బాగానే ఉన్నాడు.
-సరే. ఛ!

583
00:37:49,893 --> 00:37:52,187
బెల్లీ మనలో ఎవరితోనూ
రాత్రి మాట్లాడలేకపోయింది.

584
00:37:52,270 --> 00:37:55,065
-ఫరావలేదులే. అది…
-నన్ను ఐదు నిమిషాలలో లాబీలో కలువు!

585
00:38:06,535 --> 00:38:08,495
స్టీవెన్ గురించి ఏమైనా తెలిసిందా?

586
00:38:16,503 --> 00:38:18,839
మేము గత కొన్నిసంవత్సరలుగా కలవలేదు,

587
00:38:18,922 --> 00:38:21,049
ఒంటరిగా అయితే అస్సలు లేము…

588
00:38:21,133 --> 00:38:22,134
హే.

589
00:38:22,217 --> 00:38:23,969
ఆ రోజు హోటల్ తరువాత.

590
00:38:24,052 --> 00:38:25,387
-హే.
-హే.

591
00:38:32,728 --> 00:38:34,146
ఆ కడ్డీ ఎందుకు పట్టుకున్నావు?

592
00:38:37,441 --> 00:38:39,985
-నువ్వు దొంగ అనుకున్నాను.
-అవును.

593
00:38:45,198 --> 00:38:46,116
జెర్ ఎక్కడున్నాడు?

594
00:38:46,908 --> 00:38:49,119
అతను, మీ నాన్న షమోనిక్స్ వెళ్లారు.

595
00:38:51,246 --> 00:38:52,247
అవును.

596
00:38:53,206 --> 00:38:55,042
నవ్వు వాళ్లతో ఉండాలి కదా?

597
00:38:55,125 --> 00:38:57,711
అవును. నా ఫ్లైట్ వాతావరణం
కారణంగా ఆలస్యమైంది.

598
00:38:57,794 --> 00:39:00,047
నాకు 28కి టికెట్ బుక్
చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

599
00:39:01,757 --> 00:39:02,799
నవ్వు ఇక్కడేం చేస్తున్నావు?

600
00:39:04,009 --> 00:39:07,137
మా అమ్మ కొండల్లో రిట్రీట్‌కి వెళ్లింది,
స్టీవెన్ న్యూ యార్క్ వెళ్లాడు.

601
00:39:07,220 --> 00:39:10,223
నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను, అందుకని…

602
00:39:33,914 --> 00:39:35,874
నీ ముఖం అంతా చాక్లెట్ ఉంది.

603
00:39:35,957 --> 00:39:37,459
-ఏమీ లేదు.
-ఏం చేశావు?

604
00:39:37,542 --> 00:39:40,212
-టైం ఆదా చేసుకోడానికి ముఖం దూర్చావా?
-ఆపు.

605
00:39:43,298 --> 00:39:44,466
చల్లగా ఉందా? మంట వెలిగించనా?

606
00:39:50,055 --> 00:39:52,724
మంటకి ఆలస్యం అయింది.

607
00:39:53,308 --> 00:39:54,768
నేను వెళ్లి పడుకుంటాను.

608
00:39:56,853 --> 00:39:58,230
మెర్రీ క్రిస్మస్, బెల్లీ.

609
00:39:59,731 --> 00:40:01,149
నిన్ను కలవడం నిజంగా బాగుంది.

610
00:40:06,238 --> 00:40:07,239
నిన్ను కూడా.

611
00:40:15,455 --> 00:40:17,874
మరుసటి ఉదయం, నేను లేచిన వెంటనే,

612
00:40:17,958 --> 00:40:20,460
అతను వెళిపోయి ఉంటాడని అనిపించింది.

613
00:40:32,264 --> 00:40:33,265
బాగానే ఉన్నావా?

614
00:40:35,433 --> 00:40:36,726
వద్దు. నన్ను వదిలేయ్.

615
00:40:36,810 --> 00:40:40,814
-దెబ్బ తగిలిందా? కదలగలవా?
-నువ్వు వెళిపోయావనుకున్నాను.

616
00:40:40,897 --> 00:40:43,733
లేదు, ఇక్కడే ఉన్నాను.

617
00:40:47,612 --> 00:40:49,781
-సహాయం చేయనివ్వు.
-వద్దు, వద్దు.

618
00:40:49,865 --> 00:40:52,784
-నాకు… ఒక్క నిమిషం ఇవ్వు.
-సరే.

619
00:41:02,252 --> 00:41:05,088
ఒకటి నుంచి పదిలో ఎంత నొప్పిగా ఉంది?

620
00:41:05,547 --> 00:41:06,631
పదకొండు.

621
00:41:06,715 --> 00:41:09,926
-నొప్పి అస్సలు భరించలేవు.
-అవును, భరించలేను.

622
00:41:11,553 --> 00:41:13,638
అంతే ఆ పడడం మామూలుగా పడలేదనుకో.

623
00:41:15,265 --> 00:41:20,103
నిజంగా, కార్టూన్లలో అరటిపండు తొక్క
మీద జంతువులూ ఎలా పడతాయో….

624
00:41:21,688 --> 00:41:23,106
నన్ను జంతువు అంటున్నావా?

625
00:41:30,197 --> 00:41:33,158
నిన్ను ఎత్తుకుని సోఫా
దగ్గరకు తీసుకు వెళతాను.

626
00:41:33,241 --> 00:41:35,452
వద్దు, వద్దు. అది…

627
00:41:35,535 --> 00:41:36,953
లేదు. నువ్వు… నన్ను మోయలేవు.

628
00:41:37,037 --> 00:41:38,413
-నన్ను ఇక్కడ వదిలేయ్.
-సరే.

629
00:41:38,496 --> 00:41:42,584
జెర్ లాగా బెంచ్ ప్రెస్సులు
చేయలేనేమో కానీ నిన్ను మోయగలను, బెల్లీ.

630
00:41:44,127 --> 00:41:45,128
రెడీనా?

631
00:41:47,088 --> 00:41:48,673
-సరే, రా.
-సరే.

632
00:41:50,217 --> 00:41:52,302
నువ్వు బాగానే ఉన్నావు. రెడీనా?

633
00:41:57,098 --> 00:41:58,183
కాళ్లు చూసుకో.

634
00:42:02,771 --> 00:42:04,022
-నువ్వు బాగానే ఉన్నావు.
-హా.

635
00:42:10,153 --> 00:42:12,072
అప్పుడే నాకు హటాత్తుగా ఈ ఆలోచన వచ్చింది.

636
00:42:12,906 --> 00:42:15,158
నాలో ఒక భాగం నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తుంది.

637
00:42:27,170 --> 00:42:30,131
మేము రోజంతా కలిసి గడిపాము కానీ కలిసి కాదు.

638
00:42:34,886 --> 00:42:39,557
జీర్జ్ బెయిలీ నువ్వు చేస్తున్నది ఏమిటి?
నాకు చెందిన అమ్మాయిని దొంగిలించడమా?

639
00:42:39,975 --> 00:42:41,935
అంటే ఏంటి?

640
00:42:43,061 --> 00:42:47,524
"వినోదాత్మక వ్యక్తీకరణ"
హెచ్, ఖాళీ, ఖాళీ, ఖాళీ, వై?

641
00:42:51,444 --> 00:42:52,279
హ్యామీ.

642
00:42:53,363 --> 00:42:54,364
హ్యామీ?

643
00:42:57,951 --> 00:43:01,788
లూయిస్, ఇది అందమైన స్నేహానికి
ఆరంభం అనిపిస్తోంది.

644
00:43:04,124 --> 00:43:06,418
ఆమె లాస్లోతో ఉండడమే మంచిది.

645
00:43:06,501 --> 00:43:09,838
నీకు పిచ్చి. రిక్ మరియు ఇల్సా
స్పష్టంగా ఒకరి కోసం మరొకరు.

646
00:43:09,921 --> 00:43:12,173
లాస్లో రెసిస్టెన్స్ కోసం
చేస్తున్న పనితో పోలిస్తే

647
00:43:12,257 --> 00:43:14,634
వారి చిన్న ప్రేమకథ ఎందుకూ పనికి రాదు.

648
00:43:14,718 --> 00:43:17,262
అబ్బా. ఏంటి?

649
00:43:17,345 --> 00:43:18,847
నేను చెక్కలు తీసుకొస్తాను.

650
00:43:20,265 --> 00:43:22,267
నువ్వలా అనడానికి చాలా చిన్నవాడివి.

651
00:43:22,350 --> 00:43:23,727
అవును, అవును.

652
00:43:30,817 --> 00:43:31,818
-బెల్లీ.
-హే.

653
00:43:31,901 --> 00:43:34,404
బెల్లీ… హే. క్షమించు.
ఇక్కడ నెట్వర్క్ బాలేదు.

654
00:43:34,487 --> 00:43:36,865
నేను కొండ మీద చలిలో ఉన్నాను.
నువ్వేం చేస్తున్నావు?

655
00:43:36,948 --> 00:43:38,950
నేను కజిన్స్‌లో ఉన్నాను.

656
00:43:39,034 --> 00:43:41,786
నాకు ఒంటరిగా అనిపించింది,
అందుకని ఇక్కడికి వచ్చాను.

657
00:43:41,870 --> 00:43:43,955
బాగుంది. టేలర్ కూడ వచ్చిందా?

658
00:43:44,706 --> 00:43:46,124
లేదు. ఒక్కదాన్నే వచ్చాను.

659
00:43:46,791 --> 00:43:48,418
నువ్వు నాతో ఇక్కడ ఉంటే బాగుండేది.

660
00:43:48,501 --> 00:43:50,628
కాన్రాడ్ ఫ్లైట్ వాతావరణం వల్ల రాలేదు,

661
00:43:50,712 --> 00:43:52,130
మా నాన్నతో నేను ఇరుక్కుపోయాను.

662
00:43:52,881 --> 00:43:54,799
అవును, అతను…

663
00:43:54,883 --> 00:43:56,885
-ఏంటి?
-హలో?

664
00:43:56,968 --> 00:43:59,012
-బెల్లీ, వినిపిస్తోందా?
-జెర్…

665
00:43:59,095 --> 00:44:00,638
నువ్వనేది నాకేం వినిపించట్లేదు.

666
00:44:01,389 --> 00:44:02,682
పోనీలే. ఇది…

667
00:44:02,766 --> 00:44:03,767
ఏంటి?

668
00:44:04,351 --> 00:44:07,270
ఆగు, రేపు కాల్ చేస్తాను, సరేనా ?
బై, బెల్స్.

669
00:44:07,354 --> 00:44:09,189
సరే. సరే. లవ్ యు.

670
00:44:14,736 --> 00:44:17,781
హే, నేను జెర్‌కి నువ్వు ఇక్కడ
ఉన్నావని చెప్పేదాన్ని. అది…

671
00:44:17,864 --> 00:44:19,324
ఫరవాలేదులే.

672
00:44:19,407 --> 00:44:22,327
కాన్రాడ్ నాతో కజిన్స్‌లో ఉన్నాడని
నేను జెరెమియాకి చెప్పలేదు.

673
00:44:22,410 --> 00:44:23,745
ఎందుకంటే చెప్పడానికి ఏమీ లేదు.

674
00:44:24,913 --> 00:44:28,833
కాన్రాడ్‌తో ఏమీ అవలేదు.
ఎప్పుడూ ఏమీ అయ్యే అవకాశం లేదు.

675
00:44:39,177 --> 00:44:41,429
మరుసటి ఉదయం, కాన్రాడ్ వెళిపోయాడు.

676
00:44:44,474 --> 00:44:46,559
వెళతాడని అనుకున్నట్టే వెళిపోయాడు.

677
00:44:50,063 --> 00:44:52,941
గుడ్ బై లేదు. దెయ్యంలా వెళిపోయాడు.

678
00:45:01,199 --> 00:45:04,327
మెర్రీ క్రిస్మస్, బెల్లీ
నిన్ను కలవడం బాగుంది

679
00:45:04,411 --> 00:45:07,747
కాన్రాడ్ ఫిషర్
క్రిస్మస్ గతం యొక్క దెయ్యం.

680
00:45:16,172 --> 00:45:19,592
12. జెన్నీ హాన్ నవల,
"పి.ఎస్. ఐ _______ లవ్ యు"

681
00:45:28,685 --> 00:45:31,438
స్టిల్

682
00:45:46,411 --> 00:45:53,042
స్టీవెన్‌కి సహాయం చేసిన పలుకుబడి ఉన్న
స్టాన్‌ఫర్డ్ వ్యక్తివి నువ్వే అనుకుంటాను?

683
00:45:56,129 --> 00:45:59,048
ధన్యవాదాలు. వాడు లేచాడు.
మేము బాగానే ఉన్నాం.

684
00:46:16,816 --> 00:46:18,026
లోపలికి రా.

685
00:46:24,365 --> 00:46:26,201
-హే.
-చెప్పులు విప్పుతావా?

686
00:46:26,284 --> 00:46:29,454
నేనిక్కడ ఒక్క నిమిషమే ఉంటాను.
నేను వస్తూ దారిలో…

687
00:46:29,537 --> 00:46:31,789
మొదటి రోజే తీసేయబడ్డానని
గుర్తు చేయడానికి వచ్చావా?

688
00:46:31,873 --> 00:46:34,292
లేదు, వెధవ. నీ ఫ్రెండ్ ఎలా
ఉన్నాడో అడగడానికి వచ్చాను.

689
00:46:34,375 --> 00:46:36,961
హా, అతను బానే ఉంటాడు. ధన్యవాదాలు.

690
00:46:37,045 --> 00:46:38,046
మంచిది.

691
00:46:38,588 --> 00:46:39,923
హే, ఇది నీ కోసం.

692
00:46:40,006 --> 00:46:40,924
ధన్యవాదాలు.

693
00:46:41,007 --> 00:46:42,091
ఫరవాలేదు.

694
00:46:45,386 --> 00:46:46,471
చూడు…

695
00:46:47,680 --> 00:46:48,806
నిన్నటి గురించి…

696
00:46:50,225 --> 00:46:52,602
-నామజి గట్టిదని మనందరికీ తెలుసు.
-నేను బాగానే ఉన్నాను.

697
00:46:54,270 --> 00:46:55,772
సరే. అది…

698
00:46:57,315 --> 00:47:00,610
ఆమె అన్న దానిలో విషయం ఉందంటాను.

699
00:47:02,820 --> 00:47:05,448
చూడు, నేను నీతో
ఎప్పుడూ నిజం చెప్తాను, కదా?

700
00:47:06,032 --> 00:47:09,452
నిజం ఏమిటంటే, నువ్వు తెలివైన వాడివి,

701
00:47:09,536 --> 00:47:11,913
కానీ నువ్వు నీ భావాల మీద దృష్టి పెట్టాలి.

702
00:47:11,996 --> 00:47:12,997
ఏంటి?

703
00:47:13,748 --> 00:47:16,960
నువ్వు నీ భావాలను కాదనుకోవచ్చు.

704
00:47:17,043 --> 00:47:18,253
కానీ అవి ఎక్కడికీ వెళ్లడం లేదు.

705
00:47:19,546 --> 00:47:24,467
వాటిని ఎదుర్కోవడానికి భయపడినంత కాలం అవి
నిన్ను నడిపిస్తాయి, నువ్వు వాటిని కాదు.

706
00:47:30,181 --> 00:47:31,599
హలో అంటే బాగుండేది.

707
00:47:32,767 --> 00:47:33,768
హలో.

708
00:47:36,521 --> 00:47:38,398
స్టీవెన్ కాంక్లిన్

709
00:47:38,481 --> 00:47:40,066
-హా.
-నువ్వు లేచావు.

710
00:47:40,149 --> 00:47:41,150
సరే.

711
00:47:42,360 --> 00:47:43,695
-పక్కటెముకలు జాగ్రత్త.
-మెల్లగా.

712
00:47:43,778 --> 00:47:45,697
లేదు, లేదు, ఇంకోటి కూడా విరక్కొడతావా?

713
00:47:45,780 --> 00:47:47,949
అది విరగనే లేదు, పసి పిల్లాడు.

714
00:47:48,491 --> 00:47:51,953
ఎలా… అమ్మా, నాన్నా ఎలా ఉన్నారు?
ఎక్కడున్నారు?

715
00:47:52,036 --> 00:47:53,413
-వస్తున్నారు.
-హే.

716
00:47:57,834 --> 00:47:58,835
హాయ్.

717
00:48:00,295 --> 00:48:03,548
మీ ఇద్దరూ మాట్లాడుకోండి.
నువ్వు బతికున్నందుకు సంతోషంగా ఉంది.

718
00:48:08,720 --> 00:48:11,264
అందరినీ ఎంత భయపెట్టావో తెలుసా?

719
00:48:11,931 --> 00:48:12,974
బెల్లీ చాలా భయపడింది.

720
00:48:13,057 --> 00:48:15,727
నువ్వు డ్రామా క్వీన్ అని
నాకు తెలుసు. అవును.

721
00:48:16,227 --> 00:48:17,895
నేను కోమాలో ఉన్నాను. అందుకని…

722
00:48:17,979 --> 00:48:21,316
అవును, మందులు ఇచ్చిన కోమా.

723
00:48:26,154 --> 00:48:29,574
స్టీవెన్, నేను ఊరికే అన్నాను.
నాకూ నీ గురించి భయం వేసింది.

724
00:48:29,657 --> 00:48:31,743
హా. హా. నేను లేచినప్పటి నుంచి

725
00:48:31,826 --> 00:48:33,828
నువ్వన్న దాని గురించి చాలా ఆలోచించాను.

726
00:48:33,911 --> 00:48:35,413
-ఆక్సిడెంట్‌కి ముందు.
-నేను కూడా.

727
00:48:35,496 --> 00:48:36,914
నువ్వు కరెక్ట్.

728
00:48:39,792 --> 00:48:41,127
నువ్వు, నేను మనం కలిసి ఉండలేము.

729
00:48:43,046 --> 00:48:44,047
ఏంటి?

730
00:48:47,759 --> 00:48:51,137
మనం ఆ రోజు న్యూ యార్క్‌లో కలిసి ఉండకపోతే,

731
00:48:51,220 --> 00:48:53,806
మనం మన జీవితాలు జీవించేవాళ్లం.

732
00:48:53,890 --> 00:48:55,767
అందుకని మనం కలవలేదని అనుకుందాం.

733
00:49:00,730 --> 00:49:03,941
నీ విషయానికి వచ్చినప్పుడు నేను ఎప్పుడూ
స్పష్టంగా ఆలోచించలేకపోయాను, టే.

734
00:49:06,778 --> 00:49:08,029
నిన్ను వదలలేకపోయాను.

735
00:49:09,739 --> 00:49:11,699
నాకు సవాలు అంటే ఇష్టం, కానీ…

736
00:49:15,328 --> 00:49:16,579
ఇది నాకొక హెచ్చరిక లాంటిది.

737
00:49:18,081 --> 00:49:21,709
నువ్వు కరెక్ట్.
నువ్వు, నేను కలిసి ఉండలేము.

738
00:49:26,214 --> 00:49:28,549
మంచిది. మనం ఒకేలా ఆలోచిస్తున్నాం.

739
00:49:29,050 --> 00:49:31,386
-సరే. మొత్తానికి.
-బెల్లీ ఎక్కడుందో చూస్తాను.

740
00:49:42,438 --> 00:49:46,234
మొదటి ప్రేమలు ముఖ్యమైనవి.
కాన్రాడ్ నా మొదటి ప్రేమ.

741
00:49:47,151 --> 00:49:50,113
నా జీవితాంతం అతని
గురించి ప్రేమగా అనుకుంటాను,

742
00:49:50,196 --> 00:49:53,533
మన మొదటి పెంపుడు జంతువు,
డ్రైవ్ చేసిన మొదటి కారు మీద ఉన్న ప్రేమలా,

743
00:49:55,159 --> 00:49:57,120
కానీ అవి చివరి వాటి అంత ముఖ్యం కాదు.

744
00:50:10,091 --> 00:50:11,426
స్టీవెన్ బానే ఉంటాడు.

745
00:50:12,677 --> 00:50:13,761
హమ్మయ్య.

746
00:50:19,142 --> 00:50:21,144
అలా బయటకి వెళదామా?

747
00:50:23,229 --> 00:50:24,772
హా. హా, వెళదాము.

748
00:50:30,319 --> 00:50:33,781
నాకు… నీ మీద చాలా కోపం వచ్చింది.

749
00:50:34,449 --> 00:50:35,950
నీకా హక్కు ఉంది.

750
00:50:36,492 --> 00:50:39,620
నీకు చేసిన దానికి నన్ను క్షమించు, నీకది
ముందుగా చెప్పనందుకు కూడా నన్ను క్షమించు.

751
00:50:39,704 --> 00:50:42,498
అదలా తెలుసుకున్నందుకు
కూడా నన్ను క్షమించు.

752
00:50:43,249 --> 00:50:47,128
నువ్వు నన్ను తిరిగి నమ్మడానికి
నేను చాలా కష్టపడాలని నాకు తెలుసు,

753
00:50:47,211 --> 00:50:50,673
కానీ నన్ను చేయనిస్తే,
నేను ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను.

754
00:50:54,677 --> 00:50:55,845
నన్ను కూడా క్షమించు.

755
00:50:58,264 --> 00:50:59,265
దేనికి?

756
00:51:01,392 --> 00:51:07,565
ఆ గొడవకు దారి తీసిన వాటన్నిటికీ, కాబోకి.

757
00:51:10,860 --> 00:51:13,070
మనం విడిపోయామని
ఎందుకు అనుకున్నావో నాకు అర్థమైంది.

758
00:51:15,031 --> 00:51:16,032
నువ్వు అర్థం చేసుకున్నావా?

759
00:51:17,825 --> 00:51:18,826
అవును, కానీ నాకు…

760
00:51:18,910 --> 00:51:23,164
నువ్వంత తేలికగా ఇంకొకరితో
ఎలా ఉండగలిగావో నాకర్థం కాలేదు.

761
00:51:23,247 --> 00:51:25,374
నేనైతే కదలలేకపోయాను.

762
00:51:25,458 --> 00:51:27,794
నువ్వు ఇంకొకరితో సెక్స్ ఎలా చేశావు?

763
00:51:27,877 --> 00:51:30,838
లేదు, బెల్లీ, ఆ వారమంతా
నేను మొద్దుబారిపోయాను.

764
00:51:31,339 --> 00:51:34,467
లేసీ, నేను సెక్స్ చేసినప్పుడు,
నాకు అక్కడ ఉన్నట్టు కూడా…

765
00:51:34,550 --> 00:51:35,468
అనిపించలేదు.

766
00:51:37,261 --> 00:51:42,183
అలా చేసిన తరువాత
నిన్ను పొందే అర్హత నాకు లేదని,

767
00:51:43,476 --> 00:51:46,896
బాత్రూంలో కూర్చుని
ఎంత సేపు ఏడ్చానో నాకే తెలియదు?

768
00:51:50,817 --> 00:51:55,988
ఒక్క పొరపాటుని ఇన్ని సంవత్సరాల
అనుబంధాన్ని తీసేయనీయకూడదు.

769
00:51:58,407 --> 00:52:05,164
మన మధ్య ఉన్నది మన పొరపాట్ల కన్నా
పెద్దది అని మనం ఇద్దరం అనుకుంటే,

770
00:52:07,416 --> 00:52:09,252
మనం మళ్లీ మొదలు పెట్టచ్చేమో.

771
00:52:10,211 --> 00:52:13,840
నాకది కావాలి, బెల్స్.
నాకాది చాలా చాలా కావాలి.

772
00:52:15,758 --> 00:52:18,052
నువ్వు నన్ను మళ్లీ ఎప్పుడూ
అలా బాధ పెట్టకూడదు.

773
00:52:18,719 --> 00:52:19,720
నేను మాట ఇస్తున్నాను.

774
00:52:23,349 --> 00:52:24,433
నేను మాట ఇస్తున్నాను.

775
00:52:38,447 --> 00:52:40,116
నాకు దీన్ని మళ్లీ పాడు చేసుకోవాలని లేదు.

776
00:52:41,826 --> 00:52:42,827
మనం చేసుకోము.

777
00:52:43,953 --> 00:52:46,289
స్టీవెన్‌కి ఇలా అయిన తరువాత,
నాకిప్పుడు అర్థమైంది.

778
00:52:47,331 --> 00:52:50,793
నువ్వు ప్రేమించే వ్యక్తితో జీవితం గడపకుండా
ఉండడానికి ఈ జీవితం చాలా చిన్నది.

779
00:52:53,379 --> 00:52:55,798
నాకు నీతో ఎప్పటికీ ఉండాలని ఉంది.
ఏది ఏమైనా సరే.

780
00:52:57,633 --> 00:52:59,385
నువ్వు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను.

781
00:53:00,219 --> 00:53:01,721
నేను కూడా.

782
00:53:01,804 --> 00:53:06,684
బెల్లీ, ఇది ఎప్పటికీ మన కథ.
నీది, నాది. మరెవరిదీ కాదు.

783
00:53:10,938 --> 00:53:12,106
ఏం ఆలోచిస్తున్నావు?

784
00:53:14,066 --> 00:53:16,277
అది… భవిష్యత్తు. పిచ్చిగా ఉంది.

785
00:53:16,360 --> 00:53:17,945
లేదు, ఏంటి? చెప్పు.

786
00:53:21,449 --> 00:53:23,117
-నువ్వు…
-అవును.

787
00:53:23,951 --> 00:53:25,578
నేను అనేదేమిటో నీకు తెలియదు కూడా.

788
00:53:27,747 --> 00:53:28,748
అడిగి చూడు.

789
00:53:33,878 --> 00:53:34,754
ఇజబెల్ కాంక్లిన్,

790
00:53:36,380 --> 00:53:37,214
నన్ను పెళ్లాడతావా?

791
00:53:39,258 --> 00:53:41,177
అవును. అవును. నిన్ను పెళ్లి చేసుకుంటాను.

792
00:53:51,562 --> 00:53:52,563
ఐ లవ్ యు.

793
00:53:53,105 --> 00:53:54,357
ఐ లవ్ యు.

794
00:55:56,937 --> 00:55:58,939
సబ్‌టైటిల్ అనువాద కర్త మైథిలి

