1
00:00:06,040 --> 00:00:06,880
ఈ సిరీస్ వినోదం కోసం రూపొందించబడింది,
మరియు కల్పిత రూపం.

2
00:00:06,960 --> 00:00:07,800
పేర్లు, ప్రాంతాలు, సంఘటనలు వంటివి
రచయిత ఊహ లేదా కల్పించబడినవి.

3
00:00:07,880 --> 00:00:08,720
ఏదైనా పోలిక కాకతాళీం. ఏ సంభాషణలు లేదా
పాత్రలు ఎవరినీ బాధించాలనే ఉద్దేశించబడలేదు.

4
00:00:08,800 --> 00:00:09,640
ఎల్‌జీబీటీక్యూయూఐఏ+
సమాజం చేసే పోరాటాన్ని,

5
00:00:09,720 --> 00:00:10,520
వారు ఎదుర్కునే సమస్యను,
సదుద్దేశ్యంతో చూపుతుంది.

6
00:00:10,640 --> 00:00:11,480
ఎల్‌జీబీటీక్యూయూఐఏ+ సమాజాన్ని బాధించే,
అగౌరవపరిచే ఉద్దేశం రూపకర్తలకు లేదు.

7
00:00:11,520 --> 00:00:12,400
కటువైన భాష ఉంటుంది. మాదకద్రవ్యాలు,
మద్యం, లేదా పొగాకు వినియోగించడాన్ని,

8
00:00:12,480 --> 00:00:13,320
లేదా చేతబడి, క్షుద్ర, అతీంద్రియ శక్తులను
ఉపయోగించడాన్ని ప్రోత్సహించదు.

9
00:00:13,400 --> 00:00:14,560
ఏ జంతువలకు హాని జరగలేదు. వ్యక్తం చేసిన
అభిప్రాయాలకు అమెజాన్ ఆమోదించదు.

10
00:00:14,640 --> 00:00:15,920
చిన్నారులకు హాని జరగలేదు. సున్నిత అంశం
ఉంటుంది. వీక్షకుల విచక్షణ సూచించబడింది.

11
00:00:24,200 --> 00:00:25,280
గెలిచా!

12
00:00:31,320 --> 00:00:34,320
నీలగిరి వ్యాలీ స్కూల్, ఊటీ
సెప్టెంబర్ 2022

13
00:00:43,160 --> 00:00:45,040
డీన్ ఇంకా బయటకు రాలేదు.

14
00:00:45,120 --> 00:00:48,280
ఆయన సామాను కొత్త క్వార్టర్స్‌కు
నిన్న రాత్రే పంపేశాం,

15
00:00:48,360 --> 00:00:50,120
కానీ ఆయన రాత్రంతా ఇక్కడే ఉన్నారు.

16
00:00:50,200 --> 00:00:52,600
-ఆయనకు వెళ్లాలని లేదేమో.
-అవును.

17
00:00:53,320 --> 00:00:55,960
-శుభోదయం, సర్.
-శుభోదయం.

18
00:00:59,360 --> 00:01:01,920
డీన్ సత్యాంశు వ్యాస్
బంగళా సం. 8

19
00:01:07,560 --> 00:01:08,440
డీన్ వ్యాస్.

20
00:01:23,320 --> 00:01:24,400
డీన్ వ్యాస్?

21
00:01:36,680 --> 00:01:37,840
డీన్ వ్యాస్?

22
00:02:24,840 --> 00:02:27,400
నీలగిరి వ్యాలీ - అడవి
అతిక్రమించరాదు - ప్రమాదం

23
00:03:19,160 --> 00:03:20,920
అరె, చంద్ర ప్రకాశ్ గారు?

24
00:03:22,480 --> 00:03:25,600
ఏమైందండీ?
మీరేదో భూతాన్ని చూసినట్లుగా ఉన్నారు.

25
00:03:25,680 --> 00:03:26,960
డీన్ వ్యాస్...

26
00:03:30,160 --> 00:03:31,400
చనిపోయారు.

27
00:04:11,000 --> 00:04:14,280
అధూరా

28
00:04:17,760 --> 00:04:21,000
3 నెలల తరువాత
నేడు

29
00:04:21,080 --> 00:04:23,800
5వ తరగతి అబ్బాయిల వసతి గది

30
00:05:38,160 --> 00:05:41,000
సార్థక్, నన్ను వదులు. నేను ఏమీ చెప్పను!

31
00:05:41,080 --> 00:05:44,440
దయచేసి, కబీర్, నన్ను వెళ్లనివ్వు.
నాకు ఊపిరాడడం లేదు.

32
00:05:44,520 --> 00:05:47,520
సార్థక్, వద్దు.
నేను... నేను ఏమీ చెప్పను.

33
00:05:47,920 --> 00:05:50,120
సార్థక్, ప్లీజ్. నేను ఎవరికీ చెప్పను.

34
00:05:50,200 --> 00:05:53,360
నన్ను బయటకు రానివ్వు!
దయచేసి సార్థక్, ఎవరికీ చెప్పను.

35
00:05:53,440 --> 00:05:55,080
బయటకు రానివ్వు! ఊపిరాడ్డం లేదు!

36
00:05:55,160 --> 00:05:57,480
ఏం జరిగింది, వేదాంత్?
పాంట్‌లో పోసుకున్నావా?

37
00:05:59,400 --> 00:06:01,240
అమెరికా నుంచి డయపర్లు తెచ్చుకోలేదా?

38
00:06:02,720 --> 00:06:04,800
సార్థక్, వద్దు, నాకు ఊపిరాడ్డం లేదు.

39
00:06:04,880 --> 00:06:07,040
నన్ను బయటకు రానివ్వు.
ఊపిరాడ్డం లేదు.

40
00:06:07,120 --> 00:06:09,800
శుభరాత్రి. బాగా నిద్రపో.

41
00:06:09,880 --> 00:06:12,560
సార్థక్, కబీర్, ప్లీజ్!

42
00:06:12,640 --> 00:06:14,160
నన్ను బయటకు రానివ్వండి!

43
00:06:14,720 --> 00:06:16,160
వాడికి ఏదైనా జరిగితే?

44
00:06:16,240 --> 00:06:18,000
నువ్వు ఆడపిల్లవు, కబీర్.

45
00:06:18,080 --> 00:06:19,200
లేదు, నేనలా కాదు.

46
00:06:19,280 --> 00:06:21,280
స్కూల్ నుంచి గెంటించుకోకూడదని అంతే.

47
00:06:21,720 --> 00:06:23,480
ఒకవేళ ఎవరికైనా తెలిస్తే?

48
00:06:23,920 --> 00:06:25,120
ఎవరికి తెలుస్తుంది?

49
00:06:25,200 --> 00:06:27,600
వాడు బయటకు వచ్చాక ఎవరికైనా చెబుతాడు.

50
00:06:28,080 --> 00:06:29,160
సరే.

51
00:06:29,960 --> 00:06:31,440
వీడిని కూడా లోపల పెడదాం.

52
00:06:32,040 --> 00:06:33,840
మిమ్మల్నే, ప్లీజ్!

53
00:06:36,720 --> 00:06:37,880
నేను ఏమీ చెప్పను.

54
00:06:37,960 --> 00:06:40,680
సార్థక్, ప్లీజ్, నేను ఎవరికీ చెప్పను.

55
00:06:40,760 --> 00:06:43,200
నన్ను బయటకు రానివ్వండి.
నాకు ఊపిరాడ్డం లేదు.

56
00:06:48,080 --> 00:06:50,320
సార్థక్! బయటకు రానివ్వు.

57
00:06:54,720 --> 00:06:56,480
ఇక విను, వేదాంత్.

58
00:06:56,560 --> 00:07:00,360
డీన్ వ్యాస్ భూతం ప్రతి రాత్రి
హాస్టల్‌లో తిరుగుతుంది.

59
00:07:00,880 --> 00:07:04,640
నువ్వు ఏం చేసినా సరే,
అతని కళ్లలోకి మాత్రం చూడకు.

60
00:07:28,360 --> 00:07:29,400
దయచేసి...

61
00:07:40,080 --> 00:07:41,000
హలో?

62
00:07:50,360 --> 00:07:51,800
కబీర్, నువ్వేనా?

63
00:07:51,880 --> 00:07:54,480
కబీర్, ప్లీజ్. నాకు ఊపిరాడ్డం లేదు.

64
00:07:54,560 --> 00:07:56,720
నాకు భయంగా ఉంది.
నన్ను బయటకు రానివ్వు.

65
00:08:00,720 --> 00:08:02,560
అక్కడే నిలబడ్డావేంటి?

66
00:08:02,640 --> 00:08:04,960
నాకు సాయం చెయ్. ఇక్కడ చనిపోతాను.

67
00:08:05,040 --> 00:08:06,200
నాకు సాయం చెయ్.

68
00:09:11,400 --> 00:09:13,240
నా అసలు ఉద్దేశం అది కాదు.

69
00:09:13,320 --> 00:09:16,840
అతను మంచి విద్యార్థి,
కానీ వేరే సమస్యలు ఉన్నాయి.

70
00:09:16,880 --> 00:09:19,120
మేము ఆస్తి సమస్యల పరిష్కారం కోసం వచ్చాము.

71
00:09:19,200 --> 00:09:21,480
వెళ్లే ముందు వేదాంత్‌ను చూద్దామనుకున్నాం,

72
00:09:22,200 --> 00:09:25,640
కానీ మీరేమో ఫిర్యాదుల చిట్టా తెరిచారు.

73
00:09:25,720 --> 00:09:26,760
మలిక్ గారు...

74
00:09:31,120 --> 00:09:33,760
నా ఉద్దేశం మీకు చెప్పాలని నా ప్రయత్నం.

75
00:09:35,040 --> 00:09:36,640
వేదాంత్ ఇక్కడ సంతోషంగా లేడు.

76
00:09:36,760 --> 00:09:39,160
హాస్టల్ నుంచి పారిపోవాలని చూశాడు,

77
00:09:39,240 --> 00:09:40,720
తను సరిగ్గా తినడు,

78
00:09:40,760 --> 00:09:42,120
ప్రతి రోజూ ఏడుస్తాడు,

79
00:09:42,200 --> 00:09:43,320
మంచం తడుపుకుంటాడు.

80
00:09:44,200 --> 00:09:45,400
నేనూ ఇక్కడే చదివాను.

81
00:09:46,160 --> 00:09:48,520
బోర్డింగ్ స్కూల్‌లో తొలి ఏడాది
తేలికగా ఉండదు.

82
00:09:49,320 --> 00:09:52,520
ఒకవేళ ఏడిచే ప్రతి పిల్లాడిని
మీరు ఇంటికి పంపుతుంటే,

83
00:09:52,600 --> 00:09:54,720
మీ స్కూల్ ఖాళీ అయిపోతుంది.

84
00:09:54,760 --> 00:09:56,240
స్కూల్ బ్యాంక్ ఖాతా కూడా.

85
00:09:57,240 --> 00:10:00,880
అలా మీరు కొత్త వింగ్ పనులు
మొదలు కాకుండానే ఎందుకు ఆగిపోయాయో

86
00:10:00,960 --> 00:10:03,120
బోర్డు డైరెక్టర్లకు వివరించవచ్చు.

87
00:10:03,200 --> 00:10:06,120
మలిక్ గారు, నేను ఇలా చెప్పే
ప్రయత్నం చేస్తాను.

88
00:10:07,160 --> 00:10:11,240
వేదాంత్ మిగతా ఏడిచే పిల్లల మాదిరిగా కాదు.

89
00:10:12,200 --> 00:10:14,160
అతను అతి సున్నితం.

90
00:10:15,720 --> 00:10:16,880
ఇంకా అలాంటి పిల్లలకు...

91
00:10:17,000 --> 00:10:18,400
బడిలో కౌన్సిలర్లు ఉంటారు.

92
00:10:19,880 --> 00:10:20,760
ఇక చాలు!

93
00:10:26,320 --> 00:10:28,120
పునః
స్వాగతం!

94
00:10:28,200 --> 00:10:30,640
రేపు మీ 2007 బ్యాచ్‌కు పునఃకలయిక ఉందా?

95
00:10:32,440 --> 00:10:35,120
అవును, మేము చాలా హుషారుగా ఉన్నాం.

96
00:10:35,600 --> 00:10:38,840
-మిసెస్ మలిక్, నేను అనుకోవడం మనం...
-చెప్పాలంటే, డీన్,

97
00:10:38,880 --> 00:10:42,240
మేము మా పిల్లలను తరాల కొద్దీ
ఇక్కడకు పంపుతున్నాం.

98
00:10:42,320 --> 00:10:43,760
ఎందుకంటే ఇది మా గుర్తింపు.

99
00:10:44,360 --> 00:10:45,440
మా వారసత్వం.

100
00:10:46,520 --> 00:10:51,760
కానీ మీరు ఏదో చవకబారు దుప్పటిపై నా కొడుకు
మూత్రం పోశాడని మీరు బాధపడుతుంటే,

101
00:10:52,440 --> 00:10:56,120
మీ ఉద్యోగం ప్రమాదంలో పడేసుకోవచ్చు,
ఇంకా మన స్కూల్ ఖ్యాతి పోవచ్చు.

102
00:10:56,600 --> 00:10:58,840
రేపు మీకు అదృష్టం దక్కాలి. ధన్యవాదాలు.

103
00:10:58,920 --> 00:11:01,080
శ్రీ కే. సీ. స్వామి
డీన్

104
00:11:16,720 --> 00:11:18,880
మీలో ఎవరైనా వాడిని బయటకు తీశారా?

105
00:11:18,960 --> 00:11:19,960
చెప్పండి.

106
00:11:20,760 --> 00:11:22,520
లేదు, నేనలా చేయలేదు. నేను కాదు.

107
00:11:22,600 --> 00:11:24,480
అయితే వాడెలా బయటకొచ్చాడు?

108
00:11:43,280 --> 00:11:44,120
ఆర్కైవ్ గది

109
00:11:44,200 --> 00:11:45,680
సార్థక్, నన్ను వెళ్లనీ.

110
00:11:45,760 --> 00:11:48,800
సార్థక్, నేను ఏమీ చేయలేదు.
సార్థక్, వద్దు.

111
00:12:22,040 --> 00:12:24,960
నీలగిరి వ్యాలీ స్కూల్
వార్షికపుస్తకం 2007

112
00:12:30,200 --> 00:12:32,480
2007 బ్యాచ్

113
00:12:32,560 --> 00:12:36,120
ఎడమ నుండి కుడికి: రజత్ సిన్హా,
అధిరాజ్ జైసింగ్, దేవ్ ప్రతాప్ జామ్వాల్

114
00:12:44,240 --> 00:12:46,640
వేదాంత్.

115
00:12:53,080 --> 00:12:55,120
వేదాంత్, ఇక్కడున్నావా?

116
00:12:55,760 --> 00:12:57,920
మీ అమ్మానాన్నలకు వీడ్కోలు చెప్పవా?

117
00:12:58,000 --> 00:13:00,000
రా, వెళదాం.

118
00:13:13,240 --> 00:13:16,280
అమెరికన్ కాలేజ్ ఆఫ్ మోడర్న్ స్టడీస్
బోస్టన్

119
00:13:16,920 --> 00:13:18,600
"నా సొంత అన్నయ్యను చంపాను. "

120
00:13:22,680 --> 00:13:24,680
అర్జునుడిలో అపరాధ భావం పెరిగిపోయింది.

121
00:13:24,760 --> 00:13:27,480
ఏం జరిగినా, కర్ణుడు అతని అన్నయ్య.

122
00:13:27,920 --> 00:13:29,640
అందుకే భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు,

123
00:13:30,600 --> 00:13:33,680
"మనసులో ఉండే అపరాధభావం,
ఇనుముపై ఉన్న తుప్పు లాంటిది. "

124
00:13:34,880 --> 00:13:37,920
దానిని ఎంతగా భరిస్తే,
అది నిన్ను అంతగా నాశనం చేస్తుంది.

125
00:13:38,000 --> 00:13:39,360
కానీ ఇందులో ఇది కూడా ఉంది,

126
00:13:39,440 --> 00:13:43,600
"నువ్వు చేయాల్సినదల్లా
నిన్ను వేధించే అన్నిటినీ వదిలేయడమే. "

127
00:13:44,280 --> 00:13:46,280
మరి అతను ఎందుకు వదిలేయలేదు?

128
00:13:47,360 --> 00:13:48,800
ఎందుకంటే కొన్నిసార్లు...

129
00:13:50,160 --> 00:13:52,400
చేసిన తప్పులు చాలా పెద్దవి అయ్యుంటాయి.

130
00:13:54,680 --> 00:13:57,000
మీరు కలిగించిన బాధ,
శాశ్వతమైనది కావచ్చు.

131
00:14:06,400 --> 00:14:08,320
అందరూ వెళ్లే ముందు ఓ విషయం.

132
00:14:08,400 --> 00:14:10,880
రేపటి నుంచి ఓ వారం వరకు
నేను ఉండను.

133
00:14:10,960 --> 00:14:12,760
మిస్ స్మిత్ నా బాధ్యత చూసుకుంటారు.

134
00:14:12,840 --> 00:14:14,640
మరి, ఎక్కడకు వెళుతున్నారు, మి. జే?

135
00:14:14,720 --> 00:14:15,600
ఇండియాకు.

136
00:14:15,680 --> 00:14:18,520
-పెళ్లి కోసమా?
-ఏంటి? లేదు.

137
00:14:19,080 --> 00:14:22,160
అంటే, మీరు ఏనాడూ సెలవు తీసుకోరు.
ఇదేదో ప్రత్యేకం అయ్యుండాలి.

138
00:14:22,240 --> 00:14:25,040
మా హైస్కూల్ పునఃకలయికకు వెళుతున్నాను.

139
00:14:25,120 --> 00:14:27,640
నేను 15 సంవత్సరాలు ఇంటికి వెళ్లలేదు.

140
00:14:28,200 --> 00:14:29,160
కానీ ఎందుకు?

141
00:14:31,360 --> 00:14:34,360
మీకు శుక్రవారం రాత్రి చేసేందుకు
చక్కని పనులే ఉండుంటాయి.

142
00:14:36,480 --> 00:14:37,880
బాగా గడపండి, మిస్టర్ జే.

143
00:14:37,960 --> 00:14:38,920
-ధన్యవాదాలు.
-ఉంటాం.

144
00:14:53,240 --> 00:14:54,080
ఏంటి?

145
00:14:59,640 --> 00:15:00,680
ఎవరది?

146
00:15:26,800 --> 00:15:29,040
అవును, తర్వాత మాట్లాడతాను.

147
00:15:30,960 --> 00:15:32,720
శుభ సాయంత్రం, మి. జే.

148
00:15:38,520 --> 00:15:39,360
హలో.

149
00:15:39,440 --> 00:15:41,200
నేను మిసెస్ సిన్హాను.

150
00:15:41,280 --> 00:15:43,320
నీలగిరి వ్యాలీ స్కూల్‌లో అడ్మిన్ హెడ్.

151
00:15:43,400 --> 00:15:44,760
హా, మేడం, చెప్పండి.

152
00:15:44,840 --> 00:15:47,600
మా స్వాగత వేడుక 1:00 కు ఉంటుంది.

153
00:15:48,000 --> 00:15:52,440
ఒకవేళ మీ విమానం ఆలస్యమైతే,
దయచేసి మాకు సమాచారం ఇవ్వండి.

154
00:15:52,520 --> 00:15:54,960
మేడం, మీరు నినాద్ రమణ్‌తో మాట్లాడారా?

155
00:15:56,200 --> 00:15:58,000
అతను కూడా అమెరికాలో ఉంటాడా?

156
00:15:59,000 --> 00:16:01,560
అంటే, కచ్చితంగా అయితే తెలియదు.

157
00:16:01,640 --> 00:16:07,640
మన్నించాలి, నా దగ్గర ఇండియాకు వెలుపల ఉన్న
పాత విద్యార్థుల జాబితా వరకే ఉంది.

158
00:16:08,160 --> 00:16:09,000
ధన్యవాదాలు.

159
00:16:12,400 --> 00:16:16,640
హేయ్, అధిరాజ్. మన అపాయింట్‌మెంట్
ఆఖరి నిమిషంలో రద్దు చేసినందుకు మన్నించు.

160
00:16:16,720 --> 00:16:19,520
నీకు ఈ విషయాన్ని
నీ ప్రయాణానికి ముందే గుర్తు చేయాలి,

161
00:16:19,600 --> 00:16:23,920
నీ కుంగుబాటు మందుల కొత్త మోతాదుకు
అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది.

162
00:16:24,000 --> 00:16:27,880
కానీ నీకు వాంతులు, వికారంగా అనిపిస్తే

163
00:16:27,960 --> 00:16:30,080
దయచేసి నాకు వెంటనే కాల్ చెయ్.

164
00:16:30,160 --> 00:16:32,680
మధుర జ్ఞాపకాలు, నీ స్నేహితులపై
ధ్యాస పెట్టడం

165
00:16:32,760 --> 00:16:33,720
నువ్వు మరిచిపోకు,

166
00:16:33,800 --> 00:16:37,040
ఎందుకంటే, స్కూల్ అంటే
నీకు ఇల్లులాంటిదని నువ్వే చెప్పావు.

167
00:16:37,120 --> 00:16:38,640
జాగ్రత్తగా ఉండు.

168
00:16:41,600 --> 00:16:44,520
స్కూల్ ఆఖరి రోజు

169
00:16:48,920 --> 00:16:49,920
ఆది!

170
00:16:55,440 --> 00:16:58,080
హాయ్. నన్ను మన్నించు. క్షమించు.

171
00:16:58,160 --> 00:17:01,000
నాకు చెప్పకుండానే
అమెరికాలో కాలేజీకి దరఖాస్తు చేశావు.

172
00:17:01,080 --> 00:17:03,280
ఇప్పుడు నన్ను ఎదురుచూసేలా చేస్తావా?

173
00:17:04,120 --> 00:17:06,560
అధిరాజ్, నీ వాగ్దానం మరిచిపోయావా?

174
00:17:06,640 --> 00:17:07,520
ఎన్నటికీ మరువను.

175
00:17:08,280 --> 00:17:11,520
ఈ ఆఖరి వారంలో ప్రతి నిమిషం
నీతోనే గడుపుతానని మాట ఇస్తున్నాను.

176
00:17:11,560 --> 00:17:14,000
ఈత దగ్గర ఆలస్యమైంది,

177
00:17:14,080 --> 00:17:17,440
తర్వాత నా బ్యాడ్జీ తీసుకున్నాక,
వెంటనే డీన్ ఇక్కడకు పంపారు.

178
00:17:17,960 --> 00:17:19,640
ప్రదర్శించే అవసరం ఏమీ లేదు.

179
00:17:19,720 --> 00:17:21,680
నా బ్యాడ్జీ కూడా ఎంతో ప్రత్యేకం.

180
00:17:24,080 --> 00:17:25,920
నీ బ్యాడ్జీ వరకే కాదు, మాల్విక.

181
00:17:26,320 --> 00:17:28,320
నీ గురించి ప్రతిదీ ప్రత్యేకమే.

182
00:17:29,280 --> 00:17:30,800
నువ్వు నిజంగా స్టార్‌వు.

183
00:17:33,080 --> 00:17:35,320
అరె, మీ నాన్న ఇక్కడే ఉన్నారేమో.

184
00:17:35,440 --> 00:17:37,320
ఆయన తన పత్రాలు ఇచ్చేశారు.

185
00:17:37,880 --> 00:17:39,240
ఇది ఆయనకూ ఆఖరి వారమే.

186
00:17:39,720 --> 00:17:43,680
అయినా సరే. అబ్బాయిల స్కూల్‌లో చదివించారని
ఆయనను శిక్షించాలనే నీ కోరిక తెలుసు.

187
00:17:43,760 --> 00:17:45,680
కానీ నన్ను శిక్షించకు.

188
00:17:45,760 --> 00:17:47,000
ఆది, వెళ్లకు.

189
00:17:47,080 --> 00:17:49,240
అంటే, అది స్కాలర్‌షిప్ అంతే. పెద్ద విషయం.

190
00:17:49,320 --> 00:17:50,240
మాల్విక.

191
00:17:52,920 --> 00:17:54,720
మంచిది. నన్ను మోసం చేయకపోవడం నయం.

192
00:17:55,520 --> 00:17:56,560
చావాలని కోరుకుంటానా?

193
00:18:10,320 --> 00:18:11,720
అరె, ఆపండ్రా.

194
00:18:11,800 --> 00:18:12,680
ఇది సరదాగా లేదు.

195
00:18:12,760 --> 00:18:14,080
ఇది సరదాగానే ఉందిరా.

196
00:18:14,720 --> 00:18:16,760
అది సరదాగా ఉందనే మేము నవ్వుతున్నాం.

197
00:18:18,960 --> 00:18:21,560
స్కూల్‌లో ఆఖరి వారం.
ఇవాళైనా పార్థ్‌ను వదిలేయండి.

198
00:18:21,680 --> 00:18:24,320
ఆఖరి వారం కదా,
అందుకే వాడిని వదలలేము.

199
00:18:26,800 --> 00:18:30,000
హేయ్, ఆది,
క్లాస్ ఫోటోకు ఆలస్యం చేశావంటే,

200
00:18:30,080 --> 00:18:32,520
కోచ్ గ్యాస్ నీ పట్ల
చాలా నిరుత్సాహపడతాడు.

201
00:18:32,560 --> 00:18:35,280
-అరె బాబూ!
-అరె బాబూ!

202
00:18:36,320 --> 00:18:38,240
ఏం భయపడకు. మంచి జరుగుతుంది, దేవ్.

203
00:18:38,320 --> 00:18:40,320
-దేవి ప్రసాద్, ఇలా రండి.
-హా, చెప్పండి.

204
00:18:40,440 --> 00:18:41,680
దేవ్‌కు పట్టా వచ్చింది.

205
00:18:41,760 --> 00:18:44,800
నీకు చిన్నపాటి పనులకు
పెద్ద నజరానాలు ఎవరిస్తారు?

206
00:18:44,880 --> 00:18:46,640
టీచర్ల ముందు అలాంటివి చెప్పకండి.

207
00:18:46,720 --> 00:18:49,400
మీరంతా వెళ్లిపోతున్నారు,
కానీ నన్ను తీసేస్తారు.

208
00:18:49,480 --> 00:18:51,240
విను, నా దగ్గర ఓ ఉపాయం ఉంది.

209
00:18:51,320 --> 00:18:53,880
వ్యక్తిగత నౌకరుగా
దేవ్‌తో పాటు కాలేజీకి వెళ్లు.

210
00:18:53,960 --> 00:18:55,560
మనసు బాధపడే మాటలు చెబుతావు.

211
00:18:55,640 --> 00:18:57,880
-అరే, ఎక్కడకు పోతున్నావు?
-విను...

212
00:18:58,720 --> 00:19:01,320
సరే, రండి, అబ్బాయిలు.
వర్షం పడే ముందే సిద్ధమవండి.

213
00:19:01,400 --> 00:19:03,920
-హేయ్, దేవ్.
-ఏంటి విషయం? ఏంటి సంగతి?

214
00:19:04,880 --> 00:19:06,800
సరే. మొదటి వరుసలో కౌన్సిల్ సభ్యులు.

215
00:19:06,880 --> 00:19:08,880
వెనుక వరుసలో పనికి మాలిన వెధవలు.

216
00:19:08,960 --> 00:19:10,040
ఏంటి సంగతి?

217
00:19:12,680 --> 00:19:13,920
కానివ్వు బాబూ.

218
00:19:20,040 --> 00:19:21,240
నినాద్ ఏడి?

219
00:19:21,320 --> 00:19:22,440
నాకు తెలియదు.

220
00:19:24,440 --> 00:19:27,680
నువ్వు మాట నిలబెట్టుకుంటావు.
ఆమె టీచర్‌కు కూతురు.

221
00:19:27,760 --> 00:19:31,240
ఇక నీకు, దేవ్ ప్రతాప్ జామ్వాల్,
మా పట్ల అసూయగా ఉందా?

222
00:19:32,560 --> 00:19:34,680
-సిద్ధమా?
-సర్!

223
00:19:34,760 --> 00:19:36,960
-నినాద్ రాలేదు!
-ఎవరూ పట్టించుకోరు, సోదరా.

224
00:19:37,040 --> 00:19:39,080
వాడిని క్లాస్ ఫోటోలో కూడా ఉంచకూడదు.

225
00:19:39,200 --> 00:19:40,960
-బాధ్యత ఉండదు.
-అవును, సర్.

226
00:19:45,040 --> 00:19:47,880
నినాద్, త్వరగా రా,
నీ కోసం ఎదురుచూస్తున్నాం.

227
00:19:53,240 --> 00:19:56,320
నినాద్, రా, త్వరగా.
అందరూ నీ కోసం ఎదురుచూస్తున్నారు.

228
00:19:56,440 --> 00:19:57,560
నినాద్, త్వరగా రా.

229
00:20:02,800 --> 00:20:05,760
-త్వరగా, బాబూ!
-రారా, మనం రోజంతా ఇదే చేయలేము!

230
00:20:07,320 --> 00:20:08,280
ఏమిటిది?

231
00:20:08,320 --> 00:20:09,640
రేయ్, రారా.

232
00:20:09,720 --> 00:20:11,960
-వాడు ఎప్పుడూ ఆలస్యమే.
-వెళ్లు, సోదరా.

233
00:20:13,240 --> 00:20:14,080
ఇక పో.

234
00:20:14,200 --> 00:20:15,080
ఓయ్!

235
00:20:17,320 --> 00:20:19,280
నిన్స్, నా చోటులో ఉన్నావురా.

236
00:20:19,320 --> 00:20:20,640
-మన్నించు.
-పర్వాలేదు, రా.

237
00:20:23,040 --> 00:20:24,640
మేకప్ వేసుకుంటున్నావా?

238
00:20:26,720 --> 00:20:29,920
ఇది చూడు! నినాద్ భర్త!

239
00:20:30,000 --> 00:20:31,000
షాడో బోయ్.

240
00:20:31,080 --> 00:20:32,520
హంగామా చేయడం ఆపరా.

241
00:20:33,000 --> 00:20:34,040
శాంతించు, సోదరా.

242
00:20:34,560 --> 00:20:35,640
-దేవ్.
-వదిలెయ్.

243
00:20:35,720 --> 00:20:37,800
-వాడికెందుకు అంత కోపం?
-మధ్యలోకి లాగకు.

244
00:20:37,920 --> 00:20:41,400
ఏదేమైనా అధిరాజ్, నినాద్, మాల్వికల మధ్య
ఇప్పటికే త్రయశృంగారం ఉంది.

245
00:20:43,680 --> 00:20:47,440
ఆదు, నేను లేకుండా
ఫోటో తీయనివ్వవని నాకు తెలుసు.

246
00:20:47,520 --> 00:20:48,320
అలా జరగదు.

247
00:20:50,200 --> 00:20:51,560
సరే, సిద్ధమా?

248
00:20:51,640 --> 00:20:52,680
అవును, సర్.

249
00:20:52,760 --> 00:20:53,880
ఇక మూడు...

250
00:20:57,400 --> 00:20:58,240
రెండు...

251
00:21:02,920 --> 00:21:04,320
ఒకటి...

252
00:21:35,920 --> 00:21:37,200
ప్రతి రోజూ ఇంతే!

253
00:21:37,800 --> 00:21:39,480
వీళ్లను తీసిపారేయాలి...

254
00:21:55,800 --> 00:21:59,600
డీన్ సత్యాంశు వ్యాస్
భూతంతో జాగ్రత్త

255
00:22:28,640 --> 00:22:30,120
ప్రమాదం

256
00:23:12,480 --> 00:23:17,240
పది కుక్కపిల్లలను చిన్న ముక్కలుగా నరికారని
కుమారన్ చెప్పాడు.

257
00:23:17,320 --> 00:23:19,200
వాడు సైకో, బాబూ.

258
00:23:19,800 --> 00:23:21,280
కుమారన్ అబద్ధాలకోరు.

259
00:23:22,040 --> 00:23:23,240
నువ్వది చూశావా?

260
00:23:23,920 --> 00:23:25,120
వేదాంత్ ఓ పిరికిపంద.

261
00:23:25,200 --> 00:23:26,960
వాడు కుక్కపిల్లలను చంపడం జరగదు.

262
00:23:27,040 --> 00:23:29,480
వాడు కాదు, డీన్ వ్యాస్ చంపాడు.

263
00:23:30,320 --> 00:23:31,440
వాడిని చూడు.

264
00:23:31,880 --> 00:23:35,880
వేదాంత్‌లోకి డీన్ వ్యాస్ భూతం దూరి
ఆ కుక్కపిల్లలను చంపేసింది.

265
00:23:36,360 --> 00:23:37,760
ఇంకెవరిని చంపుతాడో?

266
00:23:40,040 --> 00:23:40,880
శుభోదయం.

267
00:23:42,040 --> 00:23:43,600
శుభోదయం, సుప్రియ మేడం.

268
00:23:44,200 --> 00:23:47,000
అత్యుత్తమ స్కూల్‌లో
మీరు నేర్చుకుంటున్నది ఇదేనా?

269
00:23:49,240 --> 00:23:50,080
క్లాస్‌కు పొండి.

270
00:23:58,800 --> 00:24:00,840
నీ తలకు దెబ్బ తగిలిందా? చూపించు.

271
00:24:01,520 --> 00:24:03,080
తలకేమీ గాయాలు కాలేదు.

272
00:24:03,160 --> 00:24:05,160
రెండు నిమిషాల్లో తిరిగొస్తాను, సరేనా?

273
00:24:28,320 --> 00:24:31,920
మనోహర్ గారు,
ఆ హౌస్‌కు మీరే వార్డెన్.

274
00:24:32,720 --> 00:24:36,640
వేదాంత్ అర్థరాత్రి హాస్టల్ నుంచి పారిపోతే,
మీకు ఆ విషయం తెలియదా?

275
00:24:36,720 --> 00:24:37,880
డీన్, ఊరుకోండి.

276
00:24:38,320 --> 00:24:40,400
ఈ పిల్లాడి కారణంగా నాకు నిద్ర లేదు...

277
00:24:40,480 --> 00:24:44,080
స్కూల్‌లో ప్రతి పిల్లాడి భద్రత
మన స్కూల్ బాధ్యత.

278
00:24:46,600 --> 00:24:49,520
సిన్హా గారు, నిర్మాణ ప్రాంతమంతా
రక్షణ ఏర్పాటు చేయండి.

279
00:24:49,600 --> 00:24:52,720
-సరే, సర్.
-మరి ఈ స్కూల్‌లో అనర్థం జరిగింది,

280
00:24:52,800 --> 00:24:54,400
దాని సంగతి ఏం చేశారు?

281
00:24:55,680 --> 00:24:59,720
పది సంవత్సరాల విద్యార్థి
నిస్సహాయమైన కుక్కపిల్లలను చంపాడని

282
00:24:59,800 --> 00:25:01,680
అందరూ చర్చించుకుంటున్నారు.

283
00:25:01,760 --> 00:25:04,520
ఇలా చర్చించే ముందు
ఆ పిల్లాడిని ఎవరైనా అడిగారా?

284
00:25:04,600 --> 00:25:07,120
అతనే వాటిని చంపాడని మీకు ఎలా తెలుసు?

285
00:25:07,680 --> 00:25:11,440
ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి,
కానీ నా దగ్గర జవాబులు లేవు.

286
00:25:12,400 --> 00:25:15,160
చెప్పండి, ఆ పిల్లాడు
హాస్టల్ నుంచి ఎందుకు పారిపోయాడు?

287
00:25:15,240 --> 00:25:18,560
అంత రాత్రి వేళలో
డీన్ వ్యాస్ బంగళా దగ్గర ఏం చేస్తున్నాడు?

288
00:25:18,640 --> 00:25:22,040
అతనికి హాస్టల్ నచ్చలేదు కాబట్టి,
అక్కడి నుంచి పారిపోయాడు.

289
00:25:22,120 --> 00:25:24,600
అతని చేతిలో ఆ రాడ్ ఎక్కడి నుంచి వచ్చింది?

290
00:25:24,680 --> 00:25:29,640
తను ఓ పిల్లాడు, ఆసక్తిగా ఉంటాడు.
నిర్మాణ ప్రాంతంలో చూసి పట్టుకుని ఉంటాడు.

291
00:25:29,720 --> 00:25:33,280
అతను వాటిని చంపకపోతే,
ఆ కుక్కపిల్లలు ఎలా చనిపోయాయి?

292
00:25:33,360 --> 00:25:37,680
-ప్రమాద ప్రాంతం, ఏదైనా పడి ఉండవచ్చు.
-అది వేదాంత్ మీద పడకపోవడం అదృష్టం.

293
00:25:37,760 --> 00:25:38,800
కచ్చితంగా.

294
00:25:38,880 --> 00:25:40,840
లేదంటే మనం ఇక్కడ కాదు, జైలులో ఉంటాం.

295
00:25:43,320 --> 00:25:48,120
రేపు ముప్ఫై మంది పాత విద్యార్థులు
తమ 15 ఏళ్ల పునఃకలయికకు వస్తున్నారు.

296
00:25:48,200 --> 00:25:50,000
వాళ్లలో చాలామంది వీవీఐపీలు.

297
00:25:50,480 --> 00:25:52,920
-చూడండి, నేను కేవలం...
-చంద్ర ప్రకాశ్ గారు,

298
00:25:53,720 --> 00:25:55,960
మీరు ఈ స్కూల్‌లో
ఐదేళ్లుగా బోధిస్తున్నారుగా?

299
00:25:56,040 --> 00:25:57,000
అవును.

300
00:25:57,080 --> 00:26:00,160
అయితే రేపటి కార్యక్రమం
ఎంత ముఖ్యమో అర్థం చేసుకోగలరు.

301
00:26:00,240 --> 00:26:01,720
-అవును.
-నాది ఓ అభ్యర్థన.

302
00:26:02,200 --> 00:26:03,680
ఈ పిచ్చివాగుడు ఆపండి!

303
00:26:04,840 --> 00:26:06,240
వెళ్లి పని చూసుకుందాం.

304
00:26:06,320 --> 00:26:07,720
ధన్యవాదాలు. అంతే సంగతులు.

305
00:26:11,600 --> 00:26:14,440
మిస్ ఘోష్‌,
ఓ క్షణం మీతో మాట్లాడవచ్చా?

306
00:26:14,520 --> 00:26:18,200
కుమారన్, నిర్మాణ ప్రాంతానికి వెళ్లి,
సెక్యూరిటీని పిలువు.

307
00:26:18,640 --> 00:26:21,000
మనోహర్‌, మీరు కూడా నాతో రండి.

308
00:26:21,080 --> 00:26:25,720
వేదాంత్ తల్లిదండ్రులను ఒప్పించాలని
చాలా ప్రయత్నించాను, కానీ...

309
00:26:27,440 --> 00:26:32,600
ఇలా బలవంతం చేసి పిల్లాడిని
బోర్డింగ్ స్కూల్‌లో వేయడమా?

310
00:26:33,680 --> 00:26:35,160
ఇది కచ్చితంగా సరైన పని కాదు.

311
00:26:35,680 --> 00:26:38,000
ఏదేమైనా సరే,
స్కూల్ కౌన్సిలర్‌గా,

312
00:26:38,080 --> 00:26:41,360
మీరు అతనికి అర్థమయ్యేలా చేయాలి,
తను ఇక్కడ ఉన్నంత కాలం,

313
00:26:41,440 --> 00:26:43,280
అతను మంచి నడవడిక నేర్చుకోవాలి.

314
00:26:43,360 --> 00:26:45,920
తను నెమ్మదైన పిల్లాడు,
తనను భోజన గదిలో చూశాను.

315
00:26:46,000 --> 00:26:48,360
ఒంటరిగా కూర్చుంటాడు,
ఏకాంతంగా ఉంటాడు.

316
00:26:49,080 --> 00:26:52,480
మొదట నేను అతనితో మాట్లాడి,
తనను అర్థం చేసుకోనివ్వండి.

317
00:26:52,560 --> 00:26:55,480
సరే, తప్పకుండా. మీ పని ఎలా చేయాలో
నేను చెప్పబోను.

318
00:26:55,560 --> 00:27:00,840
కానీ పునఃకలయిక కార్యకలాపాలు అన్నింటికీ
వేదాంత్‌ను దూరం పెట్టాలని నిర్ణయించాను.

319
00:27:00,920 --> 00:27:04,280
అతను నేరుగా క్లాస్ నుండి మీ ఆఫీస్‌కు,
తర్వాత వసతి గదికి వెళతాడు.

320
00:27:04,600 --> 00:27:06,560
కానీ అది పరిస్థితులు దారుణం చేయగలదు.

321
00:27:06,640 --> 00:27:10,800
అవును, సుప్రియ,
కానీ వీవీఐపీలు చుట్టూ తిరుగుతుండగా,

322
00:27:10,880 --> 00:27:14,400
నేను ఎలాంటి అవకాశాలు తీసుకోలేనుగా?
మీకు స్పష్టమైందా?

323
00:27:15,080 --> 00:27:17,760
-సరే, ధన్యవాదాలు.
-ధన్యవాదాలు.

324
00:27:29,000 --> 00:27:30,760
మనం మన తప్పులు మరిచిపోవచ్చు,

325
00:27:31,480 --> 00:27:34,680
కానీ మన తప్పులు మనల్ని మరిచిపోవు.

326
00:27:36,200 --> 00:27:37,840
డీన్ వ్యాస్ మరణించాక,

327
00:27:37,920 --> 00:27:41,600
స్కూల్‌లో భూతాలను పారద్రోలాల్సిన
అవసరం ఉందని చెప్పాను.

328
00:27:41,680 --> 00:27:44,400
-అతని శవం మారిన తీరు...
-చంద్ర ప్రకాశ్ గారు,

329
00:27:44,480 --> 00:27:49,280
ఆయనకు గుండె పోటు రావడంతో,
శవం అలా మారుతుందని డాక్టర్ కూడా చెప్పారు.

330
00:27:49,360 --> 00:27:50,600
ఆయన చనిపోవడం చూశావా?

331
00:27:51,680 --> 00:27:52,760
లేదు, కదా?

332
00:27:54,160 --> 00:27:55,560
నేను ఆయనను చూశాను.

333
00:27:57,680 --> 00:28:01,480
నీ కళ్ల ముందే ఎవరైనా చనిపోవడం

334
00:28:01,560 --> 00:28:03,800
ఎప్పుడైనా చూశావా?

335
00:28:22,000 --> 00:28:23,240
నిరక్షరాస్యులు.

336
00:28:35,720 --> 00:28:38,120
ధ్రువ్, నువ్వు నీ లెగ్ పీస్ ఇవ్వు,

337
00:28:39,280 --> 00:28:40,840
నీకు నా మిఠాయి ఇస్తాను.

338
00:28:40,920 --> 00:28:41,760
కుదరదు.

339
00:28:51,680 --> 00:28:53,080
సార్థక్, సైకో.

340
00:28:56,320 --> 00:28:58,040
కుక్కపిల్లలను చంపినవాడు!

341
00:29:00,560 --> 00:29:02,160
కుక్కపిల్లలను చంపినోడు వచ్చాడు.

342
00:29:21,040 --> 00:29:23,000
వినండి, నాకు ఇంకా అర్థం కాలేదు.

343
00:29:23,400 --> 00:29:26,120
వాడు ఆ రాత్రి లాకర్ నుంచి
ఎలా బయటకు వచ్చాడు?

344
00:29:26,560 --> 00:29:28,920
అది నేను కాదు. నీకు ఇప్పటికే చెప్పాను.

345
00:29:29,920 --> 00:29:31,960
బహుశా వార్డెన్ మనోహరేమో?

346
00:29:33,560 --> 00:29:37,200
అంటే దాని అర్థం వార్డెన్ మనోహర్‌కు
వాడు ఇంకా చెప్పలేదు.

347
00:29:37,680 --> 00:29:39,800
లేదంటే ఈపాటికి మనల్ని తీసేసేవాడు.

348
00:29:39,880 --> 00:29:41,520
వాడు చెప్పకపోవడమే నయం.

349
00:29:43,640 --> 00:29:45,800
భయపడకు, వాడు చెప్పడు.

350
00:29:46,680 --> 00:29:48,560
చెబితే ఏమవుతుందో
వాడికి చూపిస్తా.

351
00:30:01,640 --> 00:30:04,560
త్వరగా! ఐదు నిమిషాల్లో లైట్లు ఆర్పుతారు!

352
00:30:12,280 --> 00:30:13,720
మనోహర్ సర్! సర్!

353
00:30:13,800 --> 00:30:15,040
వార్డెన్

354
00:30:16,160 --> 00:30:17,840
-ఏం జరిగింది?
-సర్, వేదాంత్!

355
00:30:18,560 --> 00:30:20,640
-సర్, త్వరగా రండి. దయచేసి...
-పదండి.

356
00:30:20,720 --> 00:30:22,040
తప్పుకోండి. పిల్లలారా.

357
00:30:22,120 --> 00:30:22,960
సర్, వేదాంత్...

358
00:30:23,040 --> 00:30:25,200
వేదాంత్‌ను సార్థక్ ఏడిపిస్తున్నాడు.

359
00:30:26,040 --> 00:30:27,200
బాలుర బాత్రూం

360
00:30:27,360 --> 00:30:28,720
సార్థక్, తలుపు తెరువు!

361
00:30:29,920 --> 00:30:31,560
సార్థక్, తలుపు తెరువు!

362
00:30:33,320 --> 00:30:34,400
వేదాంత్!

363
00:30:34,480 --> 00:30:36,560
వేదాంత్, ఏడవకు. మేమంతా వచ్చాము.

364
00:30:37,240 --> 00:30:40,440
సార్థక్, తలుపు తెరువు.
లేదంటే, నిన్ను బడి నుంచి పంపేస్తాను!

365
00:30:40,520 --> 00:30:43,560
ధ్రువ్, వెళ్లి కుమారన్‌ను
వెంటనే తీసుకురా.

366
00:31:22,320 --> 00:31:23,640
వేదాంత్, బాగానే ఉన్నావా?

367
00:31:28,640 --> 00:31:29,640
సార్థక్ ఏడి?

368
00:31:30,480 --> 00:31:31,440
నాకు తెలియదు.

369
00:31:50,640 --> 00:31:51,480
సార్థక్?

370
00:31:58,880 --> 00:32:00,080
ఏం జరిగింది, సార్థక్?

371
00:32:01,440 --> 00:32:02,960
సార్థక్ పాంట్‌లో పోసుకున్నాడు.

372
00:32:04,440 --> 00:32:05,680
అబ్బాయిలు, ఆపండి.

373
00:32:08,680 --> 00:32:10,360
సార్థక్, వేదాంత్ ఏం చేశాడు?

374
00:32:14,440 --> 00:32:15,960
వాడు వేదాంత్ కాదు.

375
00:32:49,760 --> 00:32:52,320
సోదర సోదరీమణులారా,
మీ కెప్టెన్‌ను మాట్లాడుతున్నాను,

376
00:32:52,400 --> 00:32:56,880
మీ విమాన ప్రయాణం ఆస్వాదించి ఉంటారు.
కాసేపట్లో బెంగళూరులో ల్యాండ్ అవుతాం.

377
00:32:56,960 --> 00:32:59,120
మీ సీట్‌బెల్ట్‌లు పెట్టుకోండి. ధన్యవాదాలు.

378
00:33:02,200 --> 00:33:04,640
టార్గెట్ గురి పెట్టి, బహుమతి గెలవండి!

379
00:33:07,560 --> 00:33:09,080
మనకు ఓ విజేత ఉన్నారు!

380
00:33:15,560 --> 00:33:17,120
దయచేసి నా కోసం లైట్లు ఉంచండి.

381
00:33:17,200 --> 00:33:19,080
అలాగే, సర్. అందుకు మన్నించండి.

382
00:33:19,800 --> 00:33:23,360
-మీకు ఇంకేమైనా సాయం కావాలా?
-హా. కొంచెం నీళ్లు ఇస్తారా?

383
00:34:28,560 --> 00:34:30,640
నేరుగా 20 కిలోమీటర్లు వెళ్లండి.

384
00:34:30,760 --> 00:34:34,760
మీరు 17 నిమిషాలలో
నీలగిరి వ్యాలీ స్కూల్‌కు చేరుకుంటారు.

385
00:34:37,360 --> 00:34:39,800
నీలగిరి వ్యాలీ స్కూల్
20 కిమీలు

386
00:34:39,880 --> 00:34:43,440
బయటకు దారి లేదు.
తను బయటకు రాలేడు, నాలాగే.

387
00:34:43,520 --> 00:34:45,000
నేను ఇరుక్కుపోయాను.

388
00:34:47,280 --> 00:34:48,840
ఏపీయూ

389
00:34:51,960 --> 00:34:54,520
వాడు బయటకు రాలేడు, నాలాగే.

390
00:35:00,960 --> 00:35:02,160
ఎక్కడ ఇరుక్కుపోయావు?

391
00:35:03,600 --> 00:35:05,480
ఇక్కడ ఇరుక్కున్నాను!

392
00:35:09,440 --> 00:35:11,120
నువ్వు ఒప్పుకుంటే సాయపడతాను.

393
00:35:12,120 --> 00:35:13,480
మనం కలిసి బయట పడదాం.

394
00:35:25,800 --> 00:35:29,000
వేదాంత్, ఓ క్షణం ఉండు.
ఇప్పుడే వస్తాను.

395
00:35:29,080 --> 00:35:30,280
ఒంటరిగా పర్వాలేదుగా?

396
00:35:30,960 --> 00:35:32,320
నేను ఒంటరిగా లేను.

397
00:35:44,640 --> 00:35:45,520
అది నిజం.

398
00:35:46,280 --> 00:35:48,480
అతనికి సాయం చేయగలవేమో?

399
00:36:28,800 --> 00:36:32,880
ఇక, ఇదే నేను చదివిన స్కూల్.
నీలగిరి వ్యాలీ స్కూల్.

400
00:36:36,360 --> 00:36:37,560
సుస్వాగతం, సుయాశ్.

401
00:36:37,640 --> 00:36:39,520
నేను కేసీ స్వామి. ప్రస్తుతం డీన్‌ను.

402
00:36:39,600 --> 00:36:41,160
-హాయ్.
-మీరు తిరిగి రావడం ఆనందం.

403
00:36:41,280 --> 00:36:42,280
-హలో, స్వాగతం.
-హాయ్.

404
00:36:42,360 --> 00:36:45,360
మీ ఆటోగ్రాఫ్ కోసం
పిల్లలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

405
00:36:45,680 --> 00:36:48,480
మిమ్మల్ని టీవీలో చూడడంపై
మాకెంతో గౌరవం.

406
00:36:49,200 --> 00:36:52,080
ధన్యవాదాలు. నా ప్రియురాలు నాన్సీ.
టాలీవుడ్ స్టార్.

407
00:36:52,160 --> 00:36:55,560
ఆవిడ అందరికీ తెలుసు.
మీరు స్టార్ అయితే, ఆవిడ సూపర్‌స్టార్.

408
00:36:55,640 --> 00:36:56,640
రజత్!

409
00:37:00,480 --> 00:37:02,160
-ఏంటి సంగతి?
-బాగున్నావా, సోదరా?

410
00:37:02,200 --> 00:37:05,320
నిన్ను చూడడం ఎంతో ఆనందంరా.

411
00:37:06,160 --> 00:37:07,120
సరే చెప్పు, సోదరా.

412
00:37:07,160 --> 00:37:08,600
అన్నీ అమ్మేస్తావు.

413
00:37:08,960 --> 00:37:11,840
సోషల్ మీడియాలో అమ్మకాల బిడ్‌ల
ఫోటోలు పెడుతూనే ఉంటావు.

414
00:37:11,920 --> 00:37:13,480
ఎన్ని వాటర్ ప్యూరిఫయర్లు?

415
00:37:13,560 --> 00:37:14,760
నేను అమ్మేవాడినా?

416
00:37:14,840 --> 00:37:16,920
అవార్డు షోలలో ఉచితంగా డాన్స్ చేస్తావా?

417
00:37:17,000 --> 00:37:17,960
లేదు.

418
00:37:18,480 --> 00:37:19,760
నాన్సీ, తను రజత్.

419
00:37:19,840 --> 00:37:21,840
-హాయ్.
-నాన్సీ, నా ప్రియురాలు.

420
00:37:21,920 --> 00:37:22,800
ఆమెకు తెలుసా?

421
00:37:23,520 --> 00:37:24,360
నీకు తెలుసు.

422
00:37:24,760 --> 00:37:25,600
అవును.

423
00:37:25,640 --> 00:37:27,000
ట్రస్టీ గారు వచ్చారు.

424
00:37:39,160 --> 00:37:40,320
తిరిగి స్వాగతం.

425
00:37:43,200 --> 00:37:45,000
-శ్రీ జామ్వాల్ గారు.
-డీన్ స్వామి.

426
00:37:45,080 --> 00:37:47,160
శ్రీమతి జామ్వాల్.
మీరు రావడం సంతోషం.

427
00:37:47,280 --> 00:37:49,040
-ధన్యవాదాలు.
-తిరిగి రావడం బాగుంది.

428
00:37:49,120 --> 00:37:50,080
ప్రకాశ్. త్వరగా.

429
00:37:50,160 --> 00:37:51,040
సరే.

430
00:37:53,080 --> 00:37:55,960
బోర్డు డైరెక్టర్లకు
మీ మీద చాలా నమ్మకం ఉంది.

431
00:37:56,640 --> 00:37:59,160
ట్రస్టీలతో మాట్లాడాను,

432
00:37:59,200 --> 00:38:02,960
స్కూల్‌కు కొత్త మార్పులు అవసరమని
మాకు అనిపించింది.

433
00:38:03,640 --> 00:38:06,160
ఆ మార్పు తీసుకురావడం పైనే
నా కృషి చేస్తాను.

434
00:38:06,200 --> 00:38:07,280
ఏమీ అనుకోకండి.

435
00:38:07,360 --> 00:38:08,640
ఇలా రా.

436
00:38:12,000 --> 00:38:15,400
-హాయ్, బాగున్నావా?
-బాగున్నా, నువ్వెలా ఉన్నావు?

437
00:38:15,480 --> 00:38:18,440
"కొత్త మార్పు!"
వాడు తన తండ్రిలాగే మాట్లాడుతున్నాడు. కదా?

438
00:38:18,520 --> 00:38:22,800
"మాకు దేవ్‌పై చాలా నమ్మకం ఉంది.
వాడు మరుసటి సీఎం అవుతాడు. "

439
00:38:22,880 --> 00:38:25,920
నా కృషి పట్ల మీ నాన్న
సంతోషించారని ఆశిస్తాను.

440
00:38:26,000 --> 00:38:29,520
ఆయన నాయకత్వం కారణంగానే
ఈ కొత్త వింగ్ సాధ్యమైంది.

441
00:38:29,600 --> 00:38:30,600
మీరది చూస్తారా?

442
00:38:30,640 --> 00:38:31,520
హా, తప్పకుండా.

443
00:38:31,600 --> 00:38:33,040
నేను ఆ ఏర్పాట్లు చేస్తాను.

444
00:38:33,120 --> 00:38:34,760
ఇక శ్రీమతి జామ్వాల్?

445
00:38:35,600 --> 00:38:37,760
-ఊరుకో.
-నువ్వూ పాత విద్యార్థినివే,

446
00:38:37,840 --> 00:38:41,800
ఇక ఈ స్కూల్‌లో నీ పేరు
మిస్ మాల్వికా సేథ్. వాళ్లకు చెప్పు.

447
00:38:42,760 --> 00:38:46,080
జామ్వాల్ పేరు ఎలాంటిదంటే
అందరూ మాల్వికాను మర్చిపోతారు.

448
00:38:46,160 --> 00:38:48,040
అయ్యో! పాపం చిన్ని ధనిక పిల్ల!

449
00:38:48,840 --> 00:38:52,640
అధిరాజ్‌ను ఒక్క వేలుపై ఆడించిన మాల్వికానే
నాకు గుర్తుంది.

450
00:38:55,000 --> 00:38:55,880
అవును.

451
00:38:56,520 --> 00:38:57,360
సరే.

452
00:39:00,040 --> 00:39:00,960
ఆది.

453
00:39:02,440 --> 00:39:05,080
-ఎలా ఉన్నావు, దేవ్?
-అంతా బాగుంది. వెళదామా?

454
00:39:07,080 --> 00:39:09,760
నువ్వు పెళ్లికి రాలేదు.
లోటుగా అనిపించింది.

455
00:39:09,840 --> 00:39:10,680
అవును, అదీ...

456
00:39:11,480 --> 00:39:14,080
మీ తాతయ్య గురించి తెలిసి
బాధగా అనిపించింది.

457
00:39:15,040 --> 00:39:16,200
నువ్వు బాగున్నావుగా?

458
00:39:19,080 --> 00:39:22,640
వీడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాడు,
వీడేమో అసలు మాట్లాడడు.

459
00:39:22,760 --> 00:39:24,640
ఇక్కడ మామూలుగా ఉన్నది మనమేనా?

460
00:39:24,680 --> 00:39:26,480
మీరిద్దరూ మామూలుగా ఎన్నడూ ఉండరు.

461
00:39:29,400 --> 00:39:31,080
-ఎలా ఉన్నావు?
-ఏంటి సంగతి?

462
00:39:32,320 --> 00:39:34,000
నిన్ను కలవడం బాగుంది, మిత్రమా.

463
00:39:35,560 --> 00:39:37,320
-నాన్సీ, తను దేవ్.
-హాయ్.

464
00:39:37,840 --> 00:39:38,640
హాయ్.

465
00:39:41,080 --> 00:39:42,360
ఎలా ఉన్నావు, దేవ్?

466
00:40:06,480 --> 00:40:09,200
నినాద్

467
00:40:19,160 --> 00:40:21,120
అందరూ, మీ స్థానాలలో ఉండండి.

468
00:40:21,160 --> 00:40:23,680
ఎలా ఉన్నావు, బాబూ?
పదిహేనేళ్లు గడిచాయిరా.

469
00:40:23,800 --> 00:40:24,760
ఎలా ఉన్నావు?

470
00:40:25,320 --> 00:40:27,960
సరే కానీ, నీ ఆప్తమిత్రుడు
నినాద్ ఎలా ఉన్నాడు?

471
00:40:28,040 --> 00:40:31,920
ఆఖరి రోజున హంగామా తరువాత,
మీ ప్రేమికుల గొడవ తీరిందా?

472
00:40:32,000 --> 00:40:35,160
ఈ 15 ఏళ్లలో నీ జీవితంలో
ఏదైనా ఉత్సాహంగా ఉండాలిగా?

473
00:40:35,280 --> 00:40:38,080
అంటే... లేదు.

474
00:40:39,440 --> 00:40:43,280
బ్యాచ్ 2007
పునఃకలయిక

475
00:40:52,160 --> 00:40:54,040
రండి, విద్యార్థులారా. ఇలా రండి.

476
00:40:54,120 --> 00:40:55,480
ప్రకాశ్, సిద్ధమా?

477
00:40:58,160 --> 00:40:59,880
కుదురుకోండి, అబ్బాయిలు.

478
00:41:00,640 --> 00:41:03,120
కుదురుకోండి. ఇది ఫోటో అవకాశం.

479
00:41:03,160 --> 00:41:05,600
నీకు పాఠాలు చెప్పగలను, సోదరా.

480
00:41:05,640 --> 00:41:09,200
మంచిది, చెప్పు, ఆమెను ఎలా పడేశావు?

481
00:41:10,000 --> 00:41:10,920
ఎలా?

482
00:41:19,680 --> 00:41:23,320
సరే, బ్యాచ్ 2007,
ఫోటో తీసుకునే సమయం.

483
00:41:30,160 --> 00:41:31,080
మూడు...

484
00:41:31,800 --> 00:41:35,680
ఆదు, నేను లేకుండా
వాళ్లను ఫోటో తీయనివ్వవని నాకు తెలుసు.

485
00:41:35,800 --> 00:41:36,800
రెండు...

486
00:41:38,000 --> 00:41:39,320
ఒకటి...

487
00:41:39,920 --> 00:41:41,320
ఇంకా...

488
00:41:44,320 --> 00:41:45,280
ఛ.

489
00:41:46,120 --> 00:41:47,440
-ఛత్.
-డీన్, బాగున్నారా?

490
00:41:47,520 --> 00:41:49,200
-ఓరి దేవుడా.
-మాల్వికా.

491
00:41:49,320 --> 00:41:50,160
ఏం జరిగింది?

492
00:41:50,280 --> 00:41:51,520
అందరూ, వెనక్కు వెళ్లండి.

493
00:41:51,600 --> 00:41:53,160
-రజత్, బాగున్నావా?
-వెనుకకు!

494
00:41:53,200 --> 00:41:54,920
-నాన్సీ.
-పక్కకు తప్పుకోండి.

495
00:41:55,000 --> 00:41:56,560
దయచేసి ఇటువైపు రండి.

496
00:42:00,160 --> 00:42:01,360
అందరూ బాగానే ఉన్నారా?

497
00:42:04,400 --> 00:42:07,080
మనోహర్ గారు, పై అంతస్తులో చూడండి.

498
00:42:07,160 --> 00:42:08,040
సరే.

499
00:42:08,120 --> 00:42:10,320
వాళ్లను లోపలకు తీసుకెళ్లండి, దయచేసి.

500
00:42:20,200 --> 00:42:21,680
ఆదు!

501
00:42:53,000 --> 00:42:54,080
ఆర్కైవ్ గది

502
00:42:59,400 --> 00:43:01,840
వార్షికపుస్తకం

503
00:45:14,560 --> 00:45:16,560
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్ రెడ్డి

