1
00:00:30,365 --> 00:00:31,866
మనం ముందంజలో ఉన్నాం.

2
00:00:37,956 --> 00:00:39,833
హాయ్. నా పేరు ఫ్రాంక్లిన్.

3
00:00:39,916 --> 00:00:42,586
పూర్తి పేరు చెప్పాలంటే, ఫ్రాంక్లిన్ ఆర్మ్ స్ట్రాంగ్.

4
00:00:42,669 --> 00:00:47,132
"ఇలాంటి పరిస్థితిలో నేను ఎలా చిక్కుకున్నాను" అని
మీలో మీరు ఎప్పుడయినా అనుకున్నారా?

5
00:00:47,215 --> 00:00:51,469
ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చిందో చెప్పాలంటే
ముందుగా మిమ్మల్ని కొద్దిగా గతంలోకి తీసుకువెళ్లాలి.

6
00:00:52,637 --> 00:00:54,264
ఫ్రాంక్లిన్

7
00:00:54,347 --> 00:00:57,309
చూడండి, మా నాన్న సైన్యంలో పని చేస్తాడు.

8
00:00:57,392 --> 00:00:59,936
అందువల్ల మా కుటుంబం ఎప్పుడూ
ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

9
00:01:01,438 --> 00:01:03,064
నీ ప్రయాణాలలో ఈ నోట్ బుక్ ఉపయోగపడుతుందని నా ఆశ

10
00:01:03,148 --> 00:01:05,150
తాతయ్య ఎప్పుడూ చెబుతాడు,
"మార్పుని అడ్డుకోవాలని ప్రయత్నించకు,

11
00:01:05,233 --> 00:01:06,818
ఎందుకంటే మార్పుని ఎవరూ గెలవలేరు."

12
00:01:09,529 --> 00:01:10,530
నేను వస్తున్నాను.

13
00:01:15,368 --> 00:01:19,539
నేను చాలా ప్రదేశాలలో నివసించాను
కానీ నా సొంత ఇల్లు అని చెప్పుకోవడానికి ఏదీ లేదు.

14
00:01:21,958 --> 00:01:24,669
చాలా కష్టమైన పని ఏమిటంటే
నా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ బై చెప్పాల్సి రావడం.

15
00:01:25,170 --> 00:01:26,338
హేయ్, ఫ్రాంక్లిన్.

16
00:01:26,421 --> 00:01:29,007
హేయ్. మీరు నాకు గుడ్ బై చెప్పడానికి వచ్చారా?

17
00:01:30,425 --> 00:01:31,426
నువ్వు వెళ్లిపోతున్నావా?

18
00:01:32,177 --> 00:01:34,054
నా బాస్కెట్ బాల్ ఇంకా నీ దగ్గరే ఉందా?

19
00:01:37,265 --> 00:01:38,433
నా దగ్గరే ఉన్నందుకు సారీ.

20
00:01:38,516 --> 00:01:40,185
థాంక్స్. కలుస్తాం.

21
00:01:41,102 --> 00:01:43,563
సరే. కలుద్దాం.

22
00:01:55,784 --> 00:01:58,536
కన్సాస్ కి స్వాగతం
ఇది సన్ ఫ్లవర్ రాష్ట్రం

23
00:02:03,291 --> 00:02:05,710
డైనర్

24
00:02:23,019 --> 00:02:26,189
అయితే ఇదే అన్నమాట. మా కొత్త ఊరు.

25
00:02:26,273 --> 00:02:27,774
ఏది ఏమైనా, ఇంకా చాలా చూడాలి.

26
00:02:37,826 --> 00:02:42,122
ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
ఈ ఊరిలో పెద్దగా వెరైటీ ఏమీ లేదు.

27
00:02:58,847 --> 00:03:02,350
ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం నివసించలేకపోవడం గురించి
మీకు చెప్పాల్సిన ఇంకో విషయం ఏమిటంటే

28
00:03:02,434 --> 00:03:05,478
మన సూట్ కేస్ ని పూర్తిగా ఖాళీ చేయాల్సిన పని ఉండదు.

29
00:03:06,605 --> 00:03:08,857
అది సరదాగా ఉంది. రేపు ఇదే టైమ్ కి కలుద్దామా?

30
00:03:08,940 --> 00:03:10,317
తప్పకుండా.

31
00:03:10,400 --> 00:03:13,862
కొత్తగా స్నేహాలు చేసుకోవడం అనేది
కష్టమైన పని అని కొందరు అంటారు.

32
00:03:13,945 --> 00:03:18,241
కానీ మా తాతయ్య నాకు ఇచ్చిన ఈ చిన్న నోట్ బుక్ తో
ఆ పనిని తేలికగా చేసేయచ్చు.

33
00:03:18,325 --> 00:03:21,828
కొత్త పరిచయాలు ఎలా చేసుకోవాలో
ఇందులో ఆయనకి ఇష్టమైన సూచనలు చాలా ఉన్నాయి.

34
00:03:22,662 --> 00:03:26,708
నేను ఆ సూచనల్ని చాలాసార్లు పాటించాను,
అందువల్ల అది నాకు నల్లేరు మీద నడక.

35
00:03:40,347 --> 00:03:43,683
"ఒక మంచి జోక్ తో మాటలు మొదలుపెడితే
ఎప్పుడూ పెద్ద సమస్య రాదు.

36
00:03:43,767 --> 00:03:46,978
ఇంకా గుర్తుంచుకో,
నీ ఉత్సాహాన్ని ప్రదర్శించడం మర్చిపోవద్దు."

37
00:03:48,772 --> 00:03:49,981
ఇదిగో ఇక మొదలుపెడదాం.

38
00:03:59,199 --> 00:04:02,285
హాయ్. నా పేరు ఫ్రాంక్లిన్ ఆర్మ్ స్ట్రాంగ్.

39
00:04:03,578 --> 00:04:05,538
హలో. నా పేరు లైనస్.

40
00:04:06,039 --> 00:04:07,415
నిన్ను కలవడం సంతోషంగా ఉంది.

41
00:04:07,499 --> 00:04:09,334
బాగా నవ్వించే ఒక జోక్ వింటావా?

42
00:04:09,417 --> 00:04:10,627
అలాగే, తప్పకుండా.

43
00:04:10,710 --> 00:04:13,088
సముద్రం హలో అని ఎలా చెబుతుంది?

44
00:04:15,715 --> 00:04:17,384
నాకు తెలియడం లేదు.

45
00:04:19,009 --> 00:04:20,595
దాని వేవ్స్ తో.

46
00:04:23,223 --> 00:04:24,224
అర్థమైందా?

47
00:04:25,809 --> 00:04:28,144
మాటలతో ఆటలు. నవ్వొచ్చింది కదా.

48
00:04:30,105 --> 00:04:33,692
నువ్వు ఇక్కడకి ఏం పని మీద వచ్చావు?
గుమ్మడికాయ మిఠాయి చేయబోతున్నావా?

49
00:04:34,192 --> 00:04:37,946
లేదు, అది ఎప్పుడూ చేయను.
నా గుమ్మడి తోటని చూసుకోవడానికి వచ్చాను.

50
00:04:38,029 --> 00:04:41,074
ఇదివరకటి కన్నా ఈ ఏడాది నేను ఇంకా బాగా చూసుకోవాలి.

51
00:04:41,866 --> 00:04:44,452
తోటల్ని పెంచడంలో నాకు కూడా కొద్దిగా అనుభవం ఉంది.

52
00:04:44,536 --> 00:04:45,745
నీకు ఏమైనా సాయం కావాలా?

53
00:04:45,829 --> 00:04:47,664
తప్పకుండా. అది మంచి విషయం.

54
00:04:47,747 --> 00:04:49,583
ఆకురాలు కాలం రాబోతోంది,

55
00:04:49,666 --> 00:04:52,377
ఈ గుమ్మడికాయలు గనుక

56
00:04:52,460 --> 00:04:54,462
గొప్ప గుమ్మడికాయ కోసం తయారు కావాలంటే
మనం చాలా పని చేయాలి.

57
00:04:54,546 --> 00:04:56,172
గొప్ప ఏంటి?

58
00:04:56,256 --> 00:04:57,424
గొప్ప గుమ్మడికాయ.

59
00:04:57,507 --> 00:05:01,636
చాలా నిజాయితీగా పెంచే గుమ్మడి తోట నుండి
గొప్ప గుమ్మడికాయ పుట్టుకొచ్చి

60
00:05:01,720 --> 00:05:04,389
మంచి పిల్లలందరికీ మంచి బహుమతులు ఇస్తుంది.

61
00:05:05,682 --> 00:05:08,351
ఈ ఏడాది, అది నా తోటని ఎంచుకోవాలి.

62
00:05:08,435 --> 00:05:11,479
నేను ఇక్కడ నిజాయితీగా కష్టపడినట్లు
నీకు అనిపించడం లేదా?

63
00:05:11,563 --> 00:05:12,606
ఠప్ అని చప్పుడు!

64
00:05:12,689 --> 00:05:14,566
ఇది చాలా నిజాయితీగా పెంచినది అనుకుంటా.

65
00:05:15,400 --> 00:05:17,694
నువ్వు ఆ పాదుల్లో నుండి దీన్ని కోయకూడదు.

66
00:05:17,777 --> 00:05:20,780
ఇలా చేసినందుకు గొప్ప గుమ్మడికాయ
నన్ను ఎప్పటికీ ఎంచుకోదు.

67
00:05:20,864 --> 00:05:22,824
నా పని అయిపోయింది!

68
00:05:24,492 --> 00:05:26,494
ఆ పెద్ద గుమ్మడికాయకి నేను సారీ చెప్పానని చెప్పు.

69
00:05:31,583 --> 00:05:36,171
పద్నాలుగో పేజీ.
"స్నేహం చేసుకోవాలంటే, నవ్వడం మర్చిపోవద్దు.

70
00:05:36,671 --> 00:05:40,133
ఇంకా గుర్తుంచుకో, సరైన ప్రశంస చాలా ఉపయోగపడుతుంది."

71
00:05:40,217 --> 00:05:42,219
డాక్టర్ లోపల ఉన్నారు

72
00:05:46,306 --> 00:05:49,392
తాజా నిమ్మరసం. ఎంత బాగుంది.

73
00:05:56,524 --> 00:05:57,692
చాలా రుచిగా ఉంది.

74
00:05:59,110 --> 00:06:00,862
ఈ గ్లాసులో మళ్లీ నింపాలంటే ఎంత అవుతుంది?

75
00:06:00,946 --> 00:06:04,366
హేయ్! నువ్వు ఏం చేస్తున్నావు?

76
00:06:04,449 --> 00:06:09,371
ఆ నిమ్మకాయలన్నీ పిండటానికి ఎంత సమయం పట్టిందో
నీకు ఏమైనా తెలుసా?

77
00:06:09,454 --> 00:06:12,624
సారీ. కానీ అది నీ వ్యాపారంలో భాగమే కదా?

78
00:06:13,124 --> 00:06:14,751
ఇక్కడ ఏం రాసుందో చూడు.

79
00:06:14,834 --> 00:06:16,002
మానసిక వైద్య సహాయం ఐదు సెంట్లు

80
00:06:16,086 --> 00:06:17,921
నేను మానసిక వ్యాధుల్ని నయం చేస్తాను, నిమ్మరసం అమ్మను.

81
00:06:18,922 --> 00:06:20,924
నవ్వు. ప్రశంసించు.

82
00:06:22,050 --> 00:06:24,678
మానసిక శాస్త్రమా? ఆసక్తికరంగా ఉంది.

83
00:06:24,761 --> 00:06:27,514
నీకు చాలామంది క్లయింట్లు ఉన్నారా? వాళ్లకి ఏం చెబుతావు?

84
00:06:28,014 --> 00:06:32,435
ఆ విషయాలన్నీ నీకు చెప్పలేను.
డాక్టర్, పేషంట్ మధ్య రహస్యాలు ఉంటాయి.

85
00:06:34,437 --> 00:06:36,856
సముద్రం హలో ఎలా చెబుతుందో ఎప్పుడైనా విన్నావా?

86
00:06:38,900 --> 00:06:41,611
తెలుసు, తెలుసు. అది వేవ్ చేస్తుంది.
ఇది పాత పొడుపు కథ.

87
00:06:41,695 --> 00:06:45,657
విను, పిల్లవాడా. నీకు ఏమైనా వైద్య సహాయం కావాలంటే,
టోకెన్ తీసుకో.

88
00:06:45,740 --> 00:06:47,325
అప్పుడు నీతో అన్ని విషయాలు మాట్లాడతాను.

89
00:06:47,409 --> 00:06:52,038
ఆందోళన, భయాలు, ఆత్మవిశ్వాసం లేకపోవడం
ఇంకా నీలో ఉన్న లోపాల గురించి మాట్లాడతాను.

90
00:06:52,122 --> 00:06:55,542
ఇప్పుడు, నువ్వు నన్ను మన్నిస్తే,
నా పదకొండు గంటల సమయం కావచ్చింది.

91
00:06:56,209 --> 00:06:57,294
క్రిముల్ని ఇష్టపడేవాడు.

92
00:06:58,795 --> 00:07:00,797
హలో, పిగ్పెన్. కూర్చో.

93
00:07:00,881 --> 00:07:02,048
పిగ్పెన్?

94
00:07:07,971 --> 00:07:09,681
నాకు అర్థం కావడం లేదు.

95
00:07:09,764 --> 00:07:12,601
ఫ్రెండ్స్ ని చేసుకోవడం ఇంతకుముందు ఎప్పుడూ
ఇంత కష్టం కాలేదు.

96
00:07:12,684 --> 00:07:16,354
నా నోట్ బుక్ మామూలుగా అయితే
మంచిగా ఎలా మాట్లాడాలో చెబుతుంది.

97
00:07:16,438 --> 00:07:17,939
కానీ ఈ జనం దగ్గర అది పని చేయడం లేదు.

98
00:07:18,023 --> 00:07:20,233
ఒక భ్రమలో ఉండే నకిలీ డాక్టర్,

99
00:07:20,317 --> 00:07:23,778
గొప్ప గుమ్మడికాయ అనబడే ఒక ఆకారానికి భక్తుడు

100
00:07:23,862 --> 00:07:26,489
ఇంకా తల్లిదండ్రులు పిగ్పెన్ అని పెట్టిన పిల్లవాడు?

101
00:07:28,408 --> 00:07:31,828
బాబూ, నువ్వు చూడటానికి ఎంత ముచ్చటగా ఉన్నావు.

102
00:07:31,912 --> 00:07:34,623
కుక్కలు ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని ఆహ్లాదకరంగా చేస్తాయి.

103
00:07:34,706 --> 00:07:38,168
చివరికి, ఇక్కడ మాత్రం పరిస్థితి
కాస్త మామూలుగా ఉన్నట్లు అనిపిస్తోంది.

104
00:07:43,673 --> 00:07:45,759
కోవాబుంగా!

105
00:07:48,595 --> 00:07:52,515
నేను ఏదైనా మతిభ్రమించిన స్థితిలో ఉన్నానా అని
నాకు అనుమానంగా ఉంది.

106
00:08:57,372 --> 00:08:58,790
ఈ బీచ్ బాల్ నీదేనా?

107
00:08:59,291 --> 00:09:01,835
ఇది నిజానికి దాని ఇష్టానుసారం పోతుంటుంది.

108
00:09:01,918 --> 00:09:03,253
దీన్ని పట్టుకున్నందుకు థాంక్స్.

109
00:09:03,962 --> 00:09:05,130
సంతోషం.

110
00:09:05,213 --> 00:09:07,716
నా పేరు ఫ్రాంక్లిన్. ఫ్రాంక్లిన్ ఆర్మ్ స్ట్రాంగ్.

111
00:09:07,799 --> 00:09:09,593
నా పేరు చార్లీ బ్రౌన్.

112
00:09:09,676 --> 00:09:10,677
మళ్లీ థాంక్స్.

113
00:09:13,680 --> 00:09:15,682
నా ఇసుక కోటని చూస్తావా, ఫ్రాంక్లిన్?

114
00:09:17,934 --> 00:09:20,312
నువ్వు మీ కుటుంబంతో పాటు ఇక్కడికి విహారయాత్రకి వచ్చావా?

115
00:09:20,395 --> 00:09:22,814
నిజానికి, మేము ఈ మధ్యనే ఈ ఊరికి బదిలీ అయ్యాం.

116
00:09:22,898 --> 00:09:26,234
మా నాన్న మిలటరీలో పని చేస్తాడు,
ఇంకా ఆయనని ఇక్కడికి బదిలీ చేశారు.

117
00:09:26,318 --> 00:09:29,237
ఓహ్, అవునా? మా నాన్న కూడా సైన్యంలో పని చేశాడు.

118
00:09:29,321 --> 00:09:30,655
ఆయన ఇప్పుడు బార్బర్ గా ఉన్నాడు.

119
00:09:30,739 --> 00:09:33,658
తెలివైన పని. కత్తిరించడానికి జుట్టు ఎప్పుడూ
పెరుగుతూనే ఉంటుంది.

120
00:09:35,577 --> 00:09:36,870
ఇది నీకు ఎలా అనిపిస్తోంది, ఫ్రాంక్లిన్?

121
00:09:44,628 --> 00:09:46,630
సముద్రం హలో అని ఎలా చెబుతుందో నీకు తెలుసా?

122
00:09:47,631 --> 00:09:48,965
దాని వేవ్స్ తో.

123
00:09:52,677 --> 00:09:55,680
మా అమ్మ పిలుస్తోంది. నేను ఇంక వెళ్లాలి.

124
00:09:56,389 --> 00:09:58,516
నువ్వు రేపు ఖాళీగా ఉంటే, మనం కలుసుకోవచ్చు…

125
00:10:06,983 --> 00:10:08,610
కాసేపట్లో వస్తాను, అమ్మా.

126
00:10:08,693 --> 00:10:10,779
ఈ రోజు కూడా పరిస్థితులు బాగానే ఉంటాయి అనుకుంటా.

127
00:10:13,490 --> 00:10:18,286
"కొత్త ఫ్రెండ్స్ ని కలుసుకోవాలి అనుకుంటే,
నీ కొత్త ఫ్రెండ్స్ ఎక్కడ కలుస్తారో తెలుసుకో."

128
00:10:22,958 --> 00:10:27,128
పిజ్జా. అవును. పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు?

129
00:10:48,942 --> 00:10:50,944
నువ్వు అతడిని చూసి ఉండాల్సింది.

130
00:10:51,027 --> 00:10:53,363
అతను కనీసం హలో అని పలకరించకుండా,

131
00:10:53,863 --> 00:10:56,908
నేరుగా వచ్చేసి నా నిమ్మరసం అంతా తాగేశాడు.

132
00:10:57,617 --> 00:10:59,286
అలా ఎవరు చేస్తారు?

133
00:11:00,287 --> 00:11:02,914
నేను లోపలికి వెళ్లలేను.

134
00:11:02,998 --> 00:11:05,292
నేను ఏం చెప్పాలి?

135
00:11:05,917 --> 00:11:07,294
హేయ్, బాబూ, చూసుకో!

136
00:11:07,377 --> 00:11:08,587
దారికి అడ్డులే!

137
00:11:11,590 --> 00:11:12,424
ఢీ కొంది!!!

138
00:11:14,676 --> 00:11:15,760
ఏం జరుగుతోంది?

139
00:11:15,844 --> 00:11:18,013
-ఏం జరిగిందో చూశావా?
-ఇది ఏంటి?

140
00:11:18,096 --> 00:11:20,348
అక్కడ ఏం చేస్తున్నావు, షెర్మీ?

141
00:11:21,892 --> 00:11:25,270
మా సోప్ బాక్స్ డెర్బీ కారుని
ఊరికే ట్రయిల్ రన్ నడుపుతున్నాం.

142
00:11:25,353 --> 00:11:27,105
స్టీరింగ్ ని ఇంకా కాస్త సరిచేయాలి.

143
00:11:27,188 --> 00:11:28,064
ఏంటి?

144
00:11:28,148 --> 00:11:32,235
మీరంతా ఎక్కడ ఉన్నారు? భారీ సోప్ బాక్స్ డెర్బీ రేసు
త్వరలో మన ఊరిలో జరగబోతోంది.

145
00:11:32,319 --> 00:11:37,574
ఈ రేసులో గెలిచిన జట్టుకు ఒక ట్రోఫీతో పాటు
ఏడాది అంతా ఉచితంగా పిజ్జా కూడా ఇస్తారు.

146
00:11:37,657 --> 00:11:39,868
సోప్ బాక్స్ డెర్బీ రేసు జరుగుతోందా?

147
00:11:39,951 --> 00:11:41,119
ట్రోఫీ ఇస్తారా?

148
00:11:41,202 --> 00:11:42,537
ఉచితంగా పిజ్జా!

149
00:11:47,459 --> 00:11:51,713
"ఫ్రాంక్లిన్, ఫ్రెండ్స్ చేసుకోవడానికి సరైన మార్గం ఏమిటంటే
నువ్వు ఒక విజేతవి అని వాళ్లకి తెలియజేయాలి.

150
00:11:51,796 --> 00:11:53,548
విన్నర్ ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు."

151
00:11:54,341 --> 00:11:56,551
నేను ఇప్పుడు చేయాల్సిందల్లా ఒక భాగస్వామిని వెతుక్కోవాలి.

152
00:11:57,052 --> 00:11:58,970
-ఇది భలే ఉండబోతోంది…
-నాతో జత కడతావా?

153
00:11:59,054 --> 00:12:01,181
-తప్పకుండా.
-ఆ ట్రోఫీని మనమే గెలవబోతున్నాం.

154
00:12:01,264 --> 00:12:02,307
నువ్వు నాతో…

155
00:12:03,058 --> 00:12:04,351
నువ్వు నాతో జత కడతావా…

156
00:12:04,434 --> 00:12:05,435
మార్సీ!

157
00:12:07,312 --> 00:12:09,981
ఎక్స్ క్యూజ్ మీ. నువ్వు నాతో జతగా ఉంటావా…

158
00:12:10,565 --> 00:12:13,485
-నీకు ఎవరైనా జోడీ ఉన్నారా…
-ఓహ్, ష్రోడర్!

159
00:12:15,237 --> 00:12:17,697
నువ్వు ఏం అంటావు, స్నూపీ? మనం జట్టుగా ఉందామా?

160
00:12:25,121 --> 00:12:27,290
కాలయాపన చేస్తే ఓటమి తప్పదు, చక్.

161
00:12:27,958 --> 00:12:31,253
చార్లీ బ్రౌన్ కారు నడుపుతాడంటే ఊహించగలవా?

162
00:12:31,336 --> 00:12:33,838
అతను గడ్డినే సరిగ్గా చదును చేయలేడు.

163
00:12:40,595 --> 00:12:43,223
హలో మళ్లీ. బీచ్ లో కలిశాము గుర్తుందా?

164
00:12:43,848 --> 00:12:45,517
అవును గుర్తుంది, ఫ్రాంక్లిన్.

165
00:12:45,600 --> 00:12:48,687
అయితే, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, చార్లీ బ్రౌన్?
మనం జట్టుగా ఉందామా?

166
00:12:50,564 --> 00:12:51,731
మనం ఒక జట్టు.

167
00:12:55,026 --> 00:12:56,695
నాకు ప్రాక్టీసు మొదలుపెట్టాలని ఆత్రుతగా ఉంది.

168
00:12:58,405 --> 00:12:59,406
హేయ్!

169
00:13:00,865 --> 00:13:04,786
కారుని తయారు చేయాలంటే, మనకి చాలా సామాన్లు కావాలి.

170
00:13:04,869 --> 00:13:07,872
మేకులు, ప్లైవుడ్, జిగురు.

171
00:13:16,423 --> 00:13:17,340
దబ్బుమని శబ్దం!

172
00:13:30,562 --> 00:13:33,064
కానీ, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది.

173
00:13:33,148 --> 00:13:35,025
నువ్వే కదా ఆ నిమ్మరసం అమ్మాయివి.

174
00:13:36,526 --> 00:13:37,819
నా మాట విను,

175
00:13:37,903 --> 00:13:40,614
నా సోప్ బాక్స్ డెర్బీ కారు కోసం నాకు ఈ స్టీరింగ్ చక్రం కావాలి.

176
00:13:40,697 --> 00:13:43,867
పైగా నీకు రూల్సు తెలుసు అనుకుంటా. లేడీస్ ఫస్ట్.

177
00:13:43,950 --> 00:13:45,327
కాబట్టి దీన్ని నాకు ఇచ్చేయ్.

178
00:13:45,410 --> 00:13:48,622
కానీ నా భాగస్వామి ప్రత్యేకంగా ఇదే కావాలని అడిగాడు.

179
00:13:48,705 --> 00:13:51,249
ఓహ్, అవునా? నీ భాగస్వామి ఎవరు?

180
00:13:51,333 --> 00:13:53,084
చార్లీ బ్రౌన్ అనే కుర్రవాడు.

181
00:13:53,168 --> 00:13:57,547
చార్లీ బ్రౌన్ అడిగాడా? నీకు భలే తోడు దొరికాడు.

182
00:13:57,631 --> 00:13:59,049
అలా అనడంలో నీ ఉద్దేశం ఏంటి?

183
00:13:59,132 --> 00:14:00,634
నువ్వే చూస్తావు.

184
00:14:00,717 --> 00:14:02,093
అన్నట్లు, తను ఎక్కడ ఉన్నాడు?

185
00:14:02,177 --> 00:14:04,262
ఇప్పటికే పోటీ నుండి జారుకున్నాడేమో?

186
00:14:04,346 --> 00:14:08,767
లేదు. అతను స్క్రాప్ యార్డులో కారుకి
కావలసిన సామాగ్రిని సేకరిస్తున్నాడు.

187
00:14:08,850 --> 00:14:09,976
సరే, నీకు గుడ్ లక్,

188
00:14:10,060 --> 00:14:12,646
ఎందుకంటే నువ్వు ఈ రేసులో

189
00:14:12,729 --> 00:14:15,065
చార్లీ బ్రౌన్ ని భాగస్వామిగా చేసుకుంటే
ఈ స్టీరింగ్ కన్నా నీకు ఇంకా చాలా కావాలి.

190
00:14:15,148 --> 00:14:17,692
ఈ మాటలు ఇంక ఆపు. మాకు అదృష్టం అవసరం లేదు.

191
00:14:17,776 --> 00:14:20,612
అది నిజం. మీకు అద్భుతం కావాలి.

192
00:14:21,571 --> 00:14:23,698
ఇది నీదే, కొత్త కుర్రాడా.

193
00:14:25,951 --> 00:14:29,913
ఇదిగో నా కార్డు. రేసు తరువాత నువ్వు ఎవరితో అయినా
మాట్లాడాలి అనుకుంటే ఇది ఉపయోగపడుతుంది.

194
00:14:49,766 --> 00:14:51,768
నీ పనిముట్లు వాడుకోవడానికి ఇచ్చినందుకు థాంక్స్, నాన్నా.

195
00:14:53,228 --> 00:14:54,563
హాయ్, ఫ్రాంక్లిన్.

196
00:14:54,646 --> 00:14:57,274
అదిగో వచ్చేశాడు. హాయ్, చార్లీ బ్రౌన్.

197
00:15:01,361 --> 00:15:03,697
ఈ పాత ప్లంబింగ్ పైపు దేని కోసం?

198
00:15:03,780 --> 00:15:06,241
నేను పాత రేసు కార్ల ఫోటోల్ని చూశాను

199
00:15:06,324 --> 00:15:09,536
వాటి పక్క నుండి ఇలాంటి పైపులు బయటకి రావడం చూశాను.

200
00:15:09,619 --> 00:15:11,371
చూడు, ఇది తెలివైన పని.

201
00:15:11,454 --> 00:15:15,250
మనం వేగంగా వెళ్లడానికి ఇవి ఉపయోగపడకపోవచ్చు, కానీ
పోటీలో ప్రత్యర్థుల్ని మానసికంగా దెబ్బతీయవచ్చు.

202
00:15:17,377 --> 00:15:21,131
కొన్ని చక్రాలు వెతమని నిన్ను అడిగినప్పుడు
నా ఉద్దేశం ఈ చిన్న చక్రాలని కాదు.

203
00:15:21,214 --> 00:15:23,633
మనం గెలవాలి అంటే ఈ చిన్నవి సరిపోవు.

204
00:15:24,843 --> 00:15:28,179
కానీ నీ వ్యాగన్ కి ఉన్న చక్రాలు సరిగ్గా సరిపోతాయి.

205
00:15:28,263 --> 00:15:29,264
నిజంగానా?

206
00:15:29,890 --> 00:15:32,684
నాకు తెలియదు. ఇది నా చెల్లెలి వ్యాగన్.

207
00:15:32,767 --> 00:15:37,022
టెక్నికల్ గా, మనం ఈ చక్రాల్ని కొద్ది రోజుల వరకే
అరువు తీసుకుంటాం.

208
00:15:37,105 --> 00:15:39,190
కానీ మనకి నిజంగా ఈ చక్రాలు కావాలి.

209
00:15:39,691 --> 00:15:43,278
రేసు పూర్తయ్యాక వాటిని తిరిగి పెట్టేద్దాం,
అప్పుడు తన వ్యాగన్ మళ్లీ కొత్తదానిలా తయారయిపోతుంది.

210
00:15:44,905 --> 00:15:46,948
మనకి చక్రాలు దొరికేసినట్లు అనిపిస్తోంది.

211
00:15:47,449 --> 00:15:49,159
మంచిది. మనం కారుని తయారు చేయడం మొదలుపెడదాం.

212
00:15:53,872 --> 00:15:57,292
"స్నేహాన్ని పెంచుకునే గొప్ప మార్గం ఏమిటంటే
ఒకే రకమైన ఇష్టాలను తెలుసుకోవడమే."

213
00:15:58,251 --> 00:16:00,170
అయితే నీకు బేస్ బాల్ అంటే ఇష్టం అన్నావు కదా?

214
00:16:00,253 --> 00:16:02,547
ఖచ్చితంగా. నీకు ఏ ఆట అంటే ఇష్టం?

215
00:16:03,131 --> 00:16:05,717
చాలామంది బేస్ బాల్ ఆటగాళ్లు ఉన్న కుటుంబం మాది.

216
00:16:06,343 --> 00:16:09,596
మా పెద్దనాన్న యూజీన్ బెన్సన్ నీగ్రో లీగ్స్ లో ఆడేవాడు.

217
00:16:10,096 --> 00:16:11,514
అది ఏంటి?

218
00:16:11,598 --> 00:16:13,099
అంటే, ఆ రోజుల్లో

219
00:16:13,183 --> 00:16:17,145
బేస్ బాల్ ఆటలో నల్ల ఆటగాళ్లు, తెల్ల ఆటగాళ్లు
కలిసి ఆడటానికి అనుమతించేవారు కాదు.

220
00:16:17,229 --> 00:16:20,190
దానితో నల్ల ఆటగాళ్లు సొంత లీగ్ పెట్టుకున్నారు.

221
00:16:20,273 --> 00:16:22,525
ఆ లీగ్ లోనే జాకీ రాబిన్సన్ కూడా ఆడేవాడు.

222
00:16:23,777 --> 00:16:27,989
వావ్. నీతో పాటు ఉంటే ఏ పిల్లవాడైనా
చాలా విషయాలు తెలుసుకోవచ్చు, ఫ్రాంక్లిన్.

223
00:16:30,700 --> 00:16:34,496
అన్నట్లు, నేను నా సొంత బేస్ బాల్ టీమ్ ని నిర్వహిస్తుంటాను.

224
00:16:34,579 --> 00:16:36,498
అవునా? మీ ఆటగాళ్లు బాగానే ఆడతారా?

225
00:16:36,581 --> 00:16:40,377
నా నినాదం ఏమిటంటే,
"మొదటగా ముగించడం కోసం మనం గెలవాల్సిన అవసరం లేదు."

226
00:16:41,836 --> 00:16:43,547
అలాంటి నినాదాన్ని ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు.

227
00:16:45,215 --> 00:16:46,841
మా తాతయ్య నాకు చెప్పేవాడు,

228
00:16:46,925 --> 00:16:50,387
"ఫ్రాంక్లిన్, వస్తువులు కొనే బదులు
వాటిని తయారు చేసుకోవడం మంచిది."

229
00:16:50,470 --> 00:16:54,599
మా తాతయ్య కూడా నాకు అదే చెప్పేవాడు.
సాధారణంగా క్రిస్మస్ రోజుల్లో ఇంకా పుట్టినరోజు వేడుకల్లో.

230
00:16:57,352 --> 00:16:58,353
పటకారు ఇస్తావా, ప్లీజ్?

231
00:16:58,937 --> 00:17:01,356
హేయ్, ఫ్రాంక్లిన్, నీకు ఎలాంటి మ్యూజిక్ అంటే ఇష్టం?

232
00:17:01,439 --> 00:17:05,901
నాకు ఇష్టమైన వాళ్లు స్టీవీ వండర్,
లిటిల్ రిచర్డ్ ఇంకా, అలాగే,

233
00:17:05,986 --> 00:17:08,697
మనసుకి హత్తుకునే కళాకారుడు, జేమ్స్ బ్రౌన్.

234
00:17:09,738 --> 00:17:11,241
వీళ్లు నీకు తెలియకపోవచ్చు, కదా?

235
00:17:12,117 --> 00:17:13,368
వీళ్ల గురించి పెద్దగా తెలియదు.

236
00:17:15,536 --> 00:17:17,497
కానీ ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా వింటున్నది ఇదే.

237
00:17:18,081 --> 00:17:19,373
ఇది జాన్ కోల్ ట్రేన్ మ్యూజిక్.

238
00:17:20,542 --> 00:17:22,544
శ్రద్ధగా విను, చార్లీ బ్రౌన్.

239
00:17:22,627 --> 00:17:25,380
జాజ్ లో హార్మోనియం వాద్యాలు స్థిరంగా ఉంటాయి.

240
00:17:25,881 --> 00:17:26,923
కానీ శ్రద్ధగా విను.

241
00:17:27,007 --> 00:17:30,051
మిగతా వాయిద్యాలు కూడా బాగా వినిపిస్తూ ఉంటాయి.

242
00:17:30,135 --> 00:17:31,177
నీకు ఇది ఎలా అనిపిస్తోంది?

243
00:17:34,806 --> 00:17:35,891
నాకు నచ్చింది.

244
00:17:51,573 --> 00:17:52,490
కణకణ శబ్దం!

245
00:18:05,545 --> 00:18:06,546
థాంక్స్.

246
00:18:08,924 --> 00:18:13,094
నువ్వు పెద్దయ్యాక ఏం అవ్వాలో ఎప్పుడైనా అనుకున్నావా?

247
00:18:13,178 --> 00:18:16,973
నేను పెద్దగా ఆలోచించలేదు, చార్లీ బ్రౌన్.
కానీ నాకు ఎప్పుడూ అంతరిక్షం అంటే ఇష్టం.

248
00:18:17,474 --> 00:18:21,561
బహుశా ఏదో ఒక రోజు, నేను అక్కడికి వెళతానేమో.
నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మాదిరిగా.

249
00:18:22,270 --> 00:18:25,148
ఆర్మ్ స్ట్రాంగ్? ఏదైనా బంధుత్వం ఉందా?

250
00:18:26,191 --> 00:18:27,525
మంచి జోక్.

251
00:18:27,609 --> 00:18:29,861
నీ సంగతి ఏంటి, చార్లీ బ్రౌన్?

252
00:18:29,945 --> 00:18:32,739
నేను ప్రొఫెషనల్ బేస్ బాల్ ఆటగాడు కావాలని అనుకునేవాడిని.

253
00:18:32,822 --> 00:18:35,408
అప్పుడు మనం కొత్త కొత్త సిటీలన్నీ చూడచ్చు.

254
00:18:35,492 --> 00:18:38,411
మనం ఎప్పుడూ ప్రయాణాలు చేస్తుండచ్చు.
అది గొప్ప జీవితం.

255
00:18:39,621 --> 00:18:41,248
నేను చాలా ఊళ్లు తిరిగాను.

256
00:18:41,331 --> 00:18:45,544
కానీ నన్ను నమ్ము, ప్రయాణాలు చేసే జీవితం
వినడానికి బాగుంటుంది, చార్లీ బ్రౌన్,

257
00:18:45,627 --> 00:18:47,963
కానీ అది అంత గొప్ప జీవితం మాత్రం కాదు.

258
00:18:49,381 --> 00:18:53,093
హేయ్, మనకి ఏం కావాలో తెలుసా?
ఒక సీక్రెట్ హ్యాండ్ షేక్.

259
00:18:55,095 --> 00:18:56,096
అలా కాదు.

260
00:19:16,908 --> 00:19:20,161
మన కారుని ఇలా ఆకులతో కప్పి వేయాలన్నది
చాలా తెలివైన ఆలోచన, ఫ్రాంక్లిన్.

261
00:19:20,245 --> 00:19:22,956
అవును. మనం టెస్ట్ రన్ చేస్తున్నప్పుడు
మన అద్భుతమైన ఈ డిజైన్ ని

262
00:19:23,039 --> 00:19:24,666
ఎవరూ దొంగిలించకుండా చూసుకోవాలి.

263
00:19:29,087 --> 00:19:32,757
సర్, ఇంజను బలం వేగాన్ని రెండింతలు పెంచుతుంది.

264
00:19:32,841 --> 00:19:36,052
ఫిజిక్స్ మీద మనకి ఉన్న అవగాహన మీద
మన డిజైన్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

265
00:19:36,136 --> 00:19:40,599
అదంతా బాగానే ఉంది, మార్సీ,
కానీ "రాక్షస వాహనం" గురించి ఆలోచించు.

266
00:19:43,184 --> 00:19:45,395
ఆ తెరచాపని పైకి లేపు, పిగ్పెన్.

267
00:19:45,478 --> 00:19:49,524
మజేలియన్ కి నమ్మకమైన ఓడ, విక్టోరియా
ఈ భూగోళం అంతా ప్రయాణించిన విధంగా,

268
00:19:49,608 --> 00:19:53,612
మనం కూడా ఈ పొరుగు ప్రాంతం అంతా తిరిగి
రేసుని గెలుద్దాం.

269
00:19:54,279 --> 00:19:55,906
నిన్ను ఒక ప్రశ్న అడగచ్చా?

270
00:19:56,531 --> 00:19:59,451
ఆ పిల్లవాడు ఇంకా అతని గుమ్మడి తోట పరిస్థితి ఏంటి?

271
00:19:59,534 --> 00:20:01,202
ఎవరు? లైనస్ గురించా?

272
00:20:01,286 --> 00:20:02,746
అతనికి కొన్ని విచిత్రమైన అలవాట్లు ఉన్నాయి.

273
00:20:02,829 --> 00:20:06,499
కానీ ఒకసారి అతనితో పరిచయం పెరిగాక,
అతనంత మంచివాడు ఇంకెవరూ ఉండరు.

274
00:20:06,583 --> 00:20:08,209
అతను నా ప్రాణ స్నేహితులలో ఒకడు.

275
00:20:09,711 --> 00:20:11,713
నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ ని మిస్ అవుతుంటావేమో.

276
00:20:11,796 --> 00:20:15,717
బెస్ట్ ఫ్రెండ్ అని అనుకోవడానికి నాకు ఎవరు ఉన్నారు?

277
00:20:15,800 --> 00:20:22,307
అంటే, నా ఉద్దేశంలో, బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు
ప్రత్యేకంగా ఇంకా భిన్నంగా ఉంటాడు.

278
00:20:22,849 --> 00:20:27,145
నువ్వు పూర్తిగా నమ్మదగిన మనిషి,
ఇంకా ఎప్పుడూ నీ వెంటనే ఉండేవాడు.

279
00:20:28,021 --> 00:20:32,359
కొన్ని విషయాలలో, నీ గురించి నీకంటే
నీ బెస్ట్ ఫ్రెండ్ కే బాగా తెలుస్తుంది.

280
00:20:48,833 --> 00:20:51,586
అక్కడ నీ విచిత్రమైన కుక్క ఏం చేస్తోందో చూడు, చార్లీ బ్రౌన్.

281
00:20:52,170 --> 00:20:53,463
నిజం చెప్పావు.

282
00:20:59,261 --> 00:21:01,638
ఇది చాలా ప్రత్యేకమైన సందర్భం, పార్ట్ నర్.

283
00:21:01,721 --> 00:21:05,100
అన్ స్టాపబుల్ ని మనం మొదటిసారి పరీక్షిస్తున్నాం.

284
00:21:07,310 --> 00:21:09,437
అన్ స్టాపబుల్

285
00:21:10,730 --> 00:21:12,315
సిస్టమ్స్: చెక్ చేశాం.

286
00:21:12,399 --> 00:21:13,400
హెల్మెట్లు?

287
00:21:14,484 --> 00:21:15,485
చెక్ చేశాం.

288
00:21:15,569 --> 00:21:16,611
సీటు బెల్టులు?

289
00:21:16,695 --> 00:21:18,488
చెక్ చేశాం. స్టీరింగ్?

290
00:21:20,782 --> 00:21:21,616
-చెక్ చేశాం.
-చెక్ చేశాం.

291
00:21:21,700 --> 00:21:27,163
విను. మనం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం,
టి మైనస్ మూడు, రెండు, ఒకటి.

292
00:21:42,554 --> 00:21:43,972
మనం నిదానంగా వెళ్లాలి.

293
00:21:49,019 --> 00:21:51,688
మనం బ్రేకులు నొక్కుకుంటూ వెళితే గెలవలేం.

294
00:21:51,771 --> 00:21:54,107
అన్ స్టాపబుల్ నిజంగా ఎంత వేగంగా వెళుతుందో చూద్దాం.

295
00:22:02,949 --> 00:22:03,950
ఏం చేస్తున్నావు?

296
00:22:04,034 --> 00:22:06,995
గుర్తుంచుకో, బ్రేకుల్ని ముట్టుకోకు.

297
00:22:07,078 --> 00:22:08,246
సారీ.

298
00:22:15,170 --> 00:22:18,006
వాటిని ముట్టుకోవాలని చూడకు! బ్రేకులు వేయద్దని చెప్పా కదా.

299
00:22:18,798 --> 00:22:20,217
నేను చూసుకుంటాను.

300
00:22:51,039 --> 00:22:52,040
ఫ్రాంక్లిన్?

301
00:22:55,460 --> 00:22:56,753
నువ్వు ఎంత పని చేశావో చూడు.

302
00:22:56,836 --> 00:22:58,672
నీకు చెప్పాను కదా, "బ్రేకులు ముట్టుకోకు" అని.

303
00:22:58,755 --> 00:23:01,925
ఏంటి? మనం దేనినీ ఢీ కొట్టకుండా ఆపాలని చూశాను.

304
00:23:02,008 --> 00:23:03,802
నువ్వు నా మాట ఎందుకు వినలేదు?

305
00:23:03,885 --> 00:23:07,514
బాబూ, ఆ నిమ్మరసం అమ్మాయి నీ గురించి చెప్పింది నిజమే.

306
00:23:07,597 --> 00:23:08,974
దాని ఉద్దేశం ఏంటి?

307
00:23:12,602 --> 00:23:13,603
ఆ విషయం వదిలేయ్.

308
00:23:15,939 --> 00:23:19,150
ఇప్పటికే ఆలస్యం అయింది. నేను ఇంక ఇంటికి వెళ్లాలి.

309
00:23:39,212 --> 00:23:41,339
స్నూపీ

310
00:24:00,150 --> 00:24:03,737
ఇలాంటి పరిస్థితికి ఎలాంటి మంచి సూచనలు ఇందులో లేవు.

311
00:24:22,255 --> 00:24:24,507
అన్ స్టాపబుల్

312
00:24:25,300 --> 00:24:28,970
బాబూ, ఈ ఊరిలో నేను కొత్త ఫ్రెండ్స్ ని ఎలా చేసుకోవాలి?

313
00:24:31,306 --> 00:24:32,724
అక్కడ ఎవరు?

314
00:24:36,561 --> 00:24:37,687
-ఏం చేస్తున్నావు…
-నేను అనుకోలేదు…

315
00:24:38,438 --> 00:24:40,774
లేదు, లేదు. ముందు నువ్వు చెప్పు.

316
00:24:42,859 --> 00:24:45,904
నువ్వు తిరిగి రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది, చార్లీ బ్రౌన్.

317
00:24:46,821 --> 00:24:50,492
నేను ఓటమిని ఒప్పుకుని తప్పుకునే వాడిని కాను,
అలాగే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని అనుకోవడం లేదు.

318
00:24:51,201 --> 00:24:53,620
నేను గతంలో ఎప్పుడూ ఏదీ గెలవలేదు,

319
00:24:53,703 --> 00:24:57,040
కాబట్టి మనం ఈ రేసుని గెలవడానికి
గట్టిగా ప్రయత్నించవచ్చని అనుకున్నాను.

320
00:24:57,791 --> 00:24:58,792
నిజంగానా?

321
00:24:59,918 --> 00:25:01,461
కానీ మన కారు సంగతి ఏంటి?

322
00:25:01,545 --> 00:25:03,755
ఇది మరీ అంతగా పాడయిపోలేదు.

323
00:25:04,631 --> 00:25:07,634
మనం కలిసికట్టుగా పని చేస్తే రేపటి రేసుని గెలవడానికి

324
00:25:08,134 --> 00:25:09,678
మనకి ఇంకా అవకాశం ఉంది.

325
00:25:10,679 --> 00:25:13,598
నువ్వు ఇంకా నా పార్ట్ నర్ గా ఉండాలని అనుకుంటున్నావా?

326
00:25:14,182 --> 00:25:15,225
అవును.

327
00:25:22,566 --> 00:25:24,776
-త్వరగా అది కారులో పెట్టు.
-నేను అందుకున్నాను.

328
00:25:24,859 --> 00:25:27,862
-నేను ఇది పెడతాను.
-ఇదిగో. ఇది తీసుకో.

329
00:25:27,946 --> 00:25:30,156
ఈ రాత్రంగా మనం మెలకువగా ఉండాలి.

330
00:25:33,493 --> 00:25:36,621
చాంపియన్ సోప్ బాక్స్ డెర్బీ రేసుకి స్వాగతం.

331
00:25:38,415 --> 00:25:43,628
ఈ రోజు మన రేసర్లని
మెలికలు, మలుపులు ఇంకా గుట్టలతో కూడిన

332
00:25:43,712 --> 00:25:45,297
చాలా అద్భుతమైన కాంబినేషన్ లో పరీక్షించబోతున్నాం.

333
00:25:45,380 --> 00:25:50,093
ఒక ఏడాది పాటు ఉచిత పిజ్జాల్ని విజేతలు గెలుచుకుంటారు,
కానీ ఆ రుచికరమైన విందుకు మించిన సవాళ్లు

334
00:25:50,176 --> 00:25:54,389
అక్కడ వంద అడుగుల ఎత్తయిన కొండ అంచున
ఈ కుర్ర డ్రైవర్లకు ఎదురుకాబోతున్నాయి.

335
00:25:54,472 --> 00:25:57,684
వెళ్లి వాళ్లని ఓడించు, నా స్వీట్ బబ్బూ.

336
00:26:13,700 --> 00:26:17,203
కానివ్వు. త్వరగా. మనం టైమ్ దాటిపోతున్నాం.

337
00:26:18,204 --> 00:26:22,042
ముప్పై సెకన్ల కార్డు పైకి లేచింది.
ఆ రేసు ఇంక మొదలుకాబోతోంది.

338
00:26:22,125 --> 00:26:26,129
మా తాతయ్య ఎప్పుడూ చెబుతూండే వాడు,
"మనం గెలవాలంటే ముందు గట్టిగా కోరిక ఉండాలి" అని.

339
00:26:26,213 --> 00:26:27,214
ఫ్రెండ్షిప్

340
00:26:27,297 --> 00:26:29,633
మరి, చార్లీ బ్రౌన్, నీలో ఆ కోరిక ఉందా?

341
00:26:30,383 --> 00:26:31,718
వెళ్లి గెలుద్దాం పద.

342
00:26:38,767 --> 00:26:40,310
ఇంక మనం ప్రారంభిద్దాం!

343
00:26:46,858 --> 00:26:48,818
ఈ రేసు ఎంతో ఉత్సాహంగా మొదలైంది.

344
00:26:48,902 --> 00:26:50,820
లూసీ ఇంకా ష్రోడర్ ముందంజలో ఉన్నారు.

345
00:26:52,280 --> 00:26:53,782
ఇప్పుడు బ్రేక్ కుడి వైపు వేయి!

346
00:27:00,330 --> 00:27:03,166
ఫ్రాంక్లిన్ ఇంకా చార్లీ బ్రౌన్
ఎంత ధైర్యంగా ముందుకు సాగారో చూడండి.

347
00:27:03,959 --> 00:27:05,293
ఎడమ వైపు!

348
00:27:07,087 --> 00:27:08,213
ఇది పని చేస్తోంది.

349
00:27:19,975 --> 00:27:21,935
ప్యాటీ, స్టీరింగ్ విరిగిపోయింది.

350
00:27:22,018 --> 00:27:24,062
ఇది మనం ముందుగా అనుకోలేదు.

351
00:27:36,992 --> 00:27:38,535
నా దెబ్బ రుచి చూడు.

352
00:28:03,768 --> 00:28:06,313
లూసీ ఇంకా ష్రోడర్ ముందంజలో ఉన్నారు,

353
00:28:07,397 --> 00:28:10,525
కానీ ఫ్రాంక్లిన్ ఇంకా చార్లీ బ్రౌన్ వేగంగా దూసుకొస్తున్నారు.

354
00:28:10,609 --> 00:28:14,446
హేయ్, మనం బ్రేకులు వేయకుండా
ఆ మలుపులో వేగంగా పోనిద్దాం.

355
00:28:14,529 --> 00:28:16,156
నిజంగానే అంటున్నావా, చార్లీ బ్రౌన్?

356
00:28:16,239 --> 00:28:17,449
నన్ను నమ్ము.

357
00:28:26,875 --> 00:28:28,001
మనం ముందంజలో ఉన్నాం.

358
00:28:32,464 --> 00:28:33,715
నాకు కనిపించడం లేదు.

359
00:28:37,844 --> 00:28:42,057
హేయ్! ఇక్కడ ఈ తాడుని ఎవరు పెట్టారు?
ఇది ప్రమాదం కదా.

360
00:28:43,350 --> 00:28:44,392
అయ్యో.

361
00:28:50,565 --> 00:28:52,484
మనం ముందుగా చేరుకోగలం.

362
00:28:54,110 --> 00:28:56,196
కానీ మిగతా వాళ్లు చేరుకోలేరు.

363
00:28:56,279 --> 00:28:58,949
నేను చెప్పినప్పుడు, బ్రేకులు వేసేయ్.

364
00:28:59,032 --> 00:29:02,369
ఏంటి? లేదు, మనం గెలుస్తాం.

365
00:29:03,703 --> 00:29:05,372
బ్రేక్స్ వేయి, వెంటనే!

366
00:29:09,376 --> 00:29:10,502
అయ్యబాబోయ్!

367
00:29:23,431 --> 00:29:24,683
గెలుపు మాదే!

368
00:29:28,270 --> 00:29:32,983
మొదటి స్థానంలో నిలిచిన లూసీ ఇంకా ష్రోడర్ కే ట్రోఫీ…

369
00:29:33,066 --> 00:29:34,943
థాంక్యూ. నేను స్వీకరిస్తున్నాను.

370
00:29:35,026 --> 00:29:38,321
ఇంకా ఇప్పుడు నేను రాసుకొచ్చిన
చిన్న ప్రసంగాన్ని చదువుతాను.

371
00:29:49,040 --> 00:29:53,253
నేను నమ్మలేకపోతున్నాను. మనం చాలా దగ్గరగా వచ్చాం.

372
00:29:54,421 --> 00:29:56,339
అన్నీ దాటుకుని వచ్చాక,

373
00:29:56,423 --> 00:29:59,509
కేవలం ఒక చెత్త తోపుడు బండి కారణంగా మనం ఓడిపోయాం.

374
00:30:00,010 --> 00:30:01,928
ఎంత విషాదం.

375
00:30:03,388 --> 00:30:06,099
నువ్వు అక్కడ ఎలా నిలబడగలుగుతున్నావు?

376
00:30:06,182 --> 00:30:08,101
నువ్వు ఏమీ మాట్లాడవా?

377
00:30:08,184 --> 00:30:11,021
నీకు అసలు ఈ రేసుని గెలవాలని ఉందా?

378
00:30:11,104 --> 00:30:13,440
ఈ రేసు నాకు అన్నింటికన్నా ముఖ్యం.

379
00:30:13,523 --> 00:30:16,943
నేను ఈ రేసులో గెలిస్తే, అప్పుడు…

380
00:30:18,111 --> 00:30:19,571
అప్పుడు ఏంటి?

381
00:30:21,615 --> 00:30:25,452
మీ అందరిలో ఒకడిగా ఉంటాను,
ఈ ఊరిలో కొత్తగా ఫ్రెండ్స్ ని చేసుకుంటాను అనుకున్నాను.

382
00:30:26,286 --> 00:30:29,372
నేను కూడా మీ అందరిలో కలవడం కోసం
మీ అందరి మెప్పు పొందాలని ఆశించాను.

383
00:30:29,456 --> 00:30:32,626
అయితే మరి ఎందుకు కావాలని ఓడిపోయావు?

384
00:30:34,085 --> 00:30:36,755
మిగతా వాళ్లు నాలాగ బాధపడటం నాకు ఇష్టం లేదు.

385
00:30:37,589 --> 00:30:39,799
కొన్ని విషయాలు గెలవడం కన్నా చాలా ముఖ్యమైనవి.

386
00:30:41,343 --> 00:30:44,804
నన్ను నీ భాగస్వామిగా ఎంచుకున్నందుకు
నువ్వు నిరాశపడవని ఆశిస్తాను.

387
00:30:44,888 --> 00:30:46,723
కొద్దిగా కూడా నిరాశ లేదు, ఫ్రాంక్లిన్.

388
00:30:47,724 --> 00:30:52,479
నువ్వు పరిచయం కావడమే ఈ ఏడాదిలో
నాకు జరిగిన చాలా మంచి మేలు.

389
00:30:53,980 --> 00:30:56,900
సారీ, కొత్త స్నేహాలు చేసుకోవడం

390
00:30:56,983 --> 00:30:59,194
ఇంత కష్టమైన విషయమని నేను ఎప్పుడూ గ్రహించలేదు.

391
00:30:59,277 --> 00:31:00,737
అది కష్టమైన పని.

392
00:31:00,820 --> 00:31:03,240
మన గురించి మిగతా వాళ్లు ఏం అనుకుంటారో
తెలుసుకోలేకపోవడం,

393
00:31:03,740 --> 00:31:06,534
వాళ్లలో కలుస్తామో లేదో తెలియకపోవడం.

394
00:31:07,369 --> 00:31:10,997
ఎవరి గురించి అయినా నేను తెలుసుకోవడానికి
నాకు ఎప్పుడూ సమయం సరిపోదు.

395
00:31:11,081 --> 00:31:13,583
అలాగే నా గురించి తెలుసుకోవడానికి
ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించరు.

396
00:31:14,626 --> 00:31:18,588
నేను పట్టించుకుంటాను, ఫ్రాంక్లిన్.
నిన్ను నా ఫ్రెండ్ అని పిలవడం నాకు గర్వంగా ఉంది.

397
00:31:21,258 --> 00:31:22,968
మనం ఈ రేసులో గెలవకపోయి ఉండచ్చు,

398
00:31:23,593 --> 00:31:25,679
కానీ కనీసం దానిని ముగించి ఉంటే బాగుండేది.

399
00:31:31,685 --> 00:31:34,604
కొందరు పుట్టుకతోనే విజేతలుగా పుడతారు.

400
00:31:34,688 --> 00:31:37,274
నేను గొప్పలు చెబుతున్నాననో లేదా మరొకటో కాదు…

401
00:31:37,357 --> 00:31:39,943
చార్లీ బ్రౌన్ ఇంకా ఆ కొత్త పిల్లవాడు ఏం చేశారో చూశావా?

402
00:31:40,527 --> 00:31:42,070
వాళ్లు బాగానే ఉన్నారు అనుకుంటా.

403
00:31:42,153 --> 00:31:43,822
మనం వెళ్లి వాళ్లని చూసి వద్దామా?

404
00:31:44,656 --> 00:31:46,324
అదిగో, వాళ్లు వస్తున్నారు.

405
00:31:46,408 --> 00:31:47,659
ఏంటి?

406
00:31:57,419 --> 00:31:59,129
-అటు చూడు.
-ఒక నిమిషం ఆగండి.

407
00:31:59,212 --> 00:32:01,548
-ఏం జరుగుతోంది?
-అంతా ఎక్కడికి వెళ్తున్నారు?

408
00:32:01,631 --> 00:32:03,717
మీరంతా ఏం చూస్తున్నారు?

409
00:32:03,800 --> 00:32:05,343
నేను విన్నర్ ని.

410
00:32:11,057 --> 00:32:12,183
అయ్యో.

411
00:32:15,729 --> 00:32:16,730
ప్రయత్నం ఆపకండి.

412
00:32:18,189 --> 00:32:19,274
మీరు చేరుకోగలరు.

413
00:32:24,738 --> 00:32:27,449
వీళ్లు మన కోసం కేరింతలు కొడుతున్నారా, చార్లీ బ్రౌన్?

414
00:32:27,532 --> 00:32:28,742
-రండి!
-ప్రయత్నం మానకండి!

415
00:32:28,825 --> 00:32:30,285
-భలే, చార్లీ బ్రౌన్.
-కానివ్వండి!

416
00:32:30,368 --> 00:32:31,620
-రండి!
-ఫ్రాంక్లిన్!

417
00:32:31,703 --> 00:32:33,288
మన కోసమే కేరింతలు కొడుతున్నట్లుంది, ఫ్రాంక్లిన్.

418
00:32:39,711 --> 00:32:41,630
మీరు దాదాపు వచ్చేశారు!

419
00:32:45,175 --> 00:32:46,843
ఇంకాస్త దూరమే.

420
00:32:55,435 --> 00:32:56,853
నువ్వు సాధించావు, ఫ్రాంక్లిన్.

421
00:32:57,437 --> 00:33:00,398
లేదు, మనం సాధించాము, చార్లీ బ్రౌన్.

422
00:33:00,482 --> 00:33:03,860
ఇది నువ్వు చెప్పినట్లే జరిగింది.
మనం ముగించడానికి గెలవనక్కరలేదు.

423
00:33:07,239 --> 00:33:10,408
-మీరు అక్కడ చేసినదంతా మేము చూశాం.
-అవును.

424
00:33:10,492 --> 00:33:12,244
అది ఫ్రాంక్లిన్ ఐడియా.

425
00:33:12,327 --> 00:33:13,787
అతను ఆ పనిని చేయకపోయి ఉంటే,

426
00:33:13,870 --> 00:33:16,665
మీరందరూ ఐస్ క్రీమ్ లో మునిగి ఉండేవారు.

427
00:33:17,290 --> 00:33:20,293
-మంచి పని చేశావు, ఫ్రాంక్లిన్.
-మంచి పని చేశావు, చార్లీ బ్రౌన్.

428
00:33:20,377 --> 00:33:21,545
హేయ్, నువ్వు!

429
00:33:22,754 --> 00:33:25,465
నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను.

430
00:33:26,550 --> 00:33:29,469
నువ్వు అక్కడ చాలా ధైర్యంగా
కారుని అదుపు చేశావు, ఫ్రాంక్లిన్.

431
00:33:29,553 --> 00:33:31,638
నువ్వు నిజంగా అందరినీ కాపాడావు.

432
00:33:32,138 --> 00:33:34,975
ఈ రాత్రి ఉచితంగా పిజ్జాల పార్టీ నేను ఇస్తున్నాను.

433
00:33:35,058 --> 00:33:36,810
నా ఉద్దేశం మేము ఇద్దరం.

434
00:33:42,816 --> 00:33:44,234
నేను ఇప్పుడే వస్తాను.

435
00:33:44,317 --> 00:33:46,236
మా పేరెంట్స్ నన్ను పిలుస్తున్నారు.

436
00:33:47,070 --> 00:33:48,196
నిన్ను రాత్రి కలుస్తాను.

437
00:33:49,114 --> 00:33:52,158
నేను ఇంకా నా ఫ్రెండ్ చార్లీ బ్రౌన్ ఏం చేశామో చూశారా?

438
00:34:19,102 --> 00:34:21,938
అవును, అవును, నువ్వు మాకు దగ్గరగా వచ్చావు.

439
00:34:22,021 --> 00:34:23,106
కానీ అప్పుడు మేము దూరంగా వెళ్లి,

440
00:34:23,189 --> 00:34:25,650
మిమ్మల్ని కట్ చేసి మీ ముందు నుండి దూసుకువెళ్లాం.

441
00:34:25,733 --> 00:34:27,777
తరువాత మలుపు దగ్గరకి మిమ్మల్ని పోనిచ్చాం.

442
00:34:28,486 --> 00:34:30,572
అదంతా మా వ్యూహంలో భాగమే.

443
00:34:35,327 --> 00:34:38,663
ఫ్రాంక్లిన్, నువ్వు మొత్తానికి రావడం సంతోషంగా ఉంది.

444
00:34:38,747 --> 00:34:41,041
హేయ్, చార్లీ బ్రౌన్. సారీ, నేను రావడం ఆలస్యం అయింది.

445
00:34:41,124 --> 00:34:43,876
మా తల్లిదండ్రులు నాతో ఒక ముఖ్యమైన విషయం చెప్పారు.

446
00:34:43,960 --> 00:34:47,172
మా నాన్న కొత్త ఉద్యోగంలో చేరుతున్నాడు.
ఇంకా దాని అర్థం…

447
00:34:47,255 --> 00:34:48,882
నువ్వు వెళ్లిపోతున్నావు.

448
00:34:50,675 --> 00:34:53,678
ఏంటి? వెళ్లిపోతున్నావా? ఫ్రాంక్లిన్?
అది కాదని చెప్పు.

449
00:34:53,762 --> 00:34:57,307
లేదు, లేదు. ఆ ఉద్యోగం ఈ ఊరిలోనే.

450
00:34:57,390 --> 00:34:59,976
మాకు ఈ ఊరు చాలా నచ్చింది. మేము ఇక్కడే ఉంటున్నాము.

451
00:35:09,486 --> 00:35:11,321
ఒక ముక్క తీసుకో, ఫ్రాంక్లిన్.

452
00:35:11,404 --> 00:35:12,405
థాంక్స్, పిగ్పెన్.

453
00:35:14,032 --> 00:35:16,243
కోల్ ట్రేన్. మంచి ఎంపిక.

454
00:35:21,414 --> 00:35:24,751
హేయ్, ఫ్రాంక్లిన్. రేపు బేస్ బాల్ మైదానంలో
పికప్ ఆట ఆడబోతున్నాం.

455
00:35:24,834 --> 00:35:27,087
-నువ్వు కూడా వస్తావా?
-నన్ను లెక్క వేసుకో.

456
00:35:29,839 --> 00:35:32,092
చార్లీ బ్రౌన్ లాంటి భాగస్వామితో ఈ రేసులో పాల్గొనడం వల్ల

457
00:35:32,175 --> 00:35:34,678
ఫ్రెండ్షిప్ గురించి ఒకటి రెండు విషయాలు నేర్చుకోగలిగాను.

458
00:35:34,761 --> 00:35:36,096
వాళ్లు అన్ని విషయాలలో సరిగ్గా లేకపోవచ్చు.

459
00:35:36,596 --> 00:35:38,348
నేను సరిగ్గా ఉండకపోవచ్చు.

460
00:35:38,932 --> 00:35:43,144
కానీ ఫ్రెండ్స్ గా మనం మన లోపాలని సరిచేసుకుని
కలిసి ప్రయాణించవచ్చు.

461
00:35:43,895 --> 00:35:47,274
హేయ్, ఫ్రాంక్లిన్. నీ కోసం ఇక్కడ ఒక సీటు ఉంచాం.

462
00:35:47,941 --> 00:35:49,025
వచ్చి మాతో పాటు చేరు.

463
00:35:50,402 --> 00:35:52,779
ఫ్రెండ్షిప్స్ అంటే నిజంగా అంతే కదా?

464
00:36:10,046 --> 00:36:12,048
ఆర్మ్ స్ట్రాంగ్

465
00:36:33,320 --> 00:36:36,948
ఇంక ఆ సూట్ కేసుతో పని లేకపోవడం
నీకు గొప్పగా అనిపిస్తూ ఉండచ్చు.

466
00:36:37,949 --> 00:36:40,035
ఖచ్చితంగా అలాగే అనిపిస్తోంది, చార్లీ బ్రౌన్.

467
00:36:47,792 --> 00:36:52,297
"మన చుట్టూ మంచి స్నేహితులు ఉంటే
మనం సొంత ఇంటిని కనుగొన్నట్లే అని గ్రహించు."

468
00:36:52,380 --> 00:36:54,716
మీ తాతయ్య ఎప్పుడూ ఈ మాటలు చెబుతుండేవాడా?

469
00:36:54,799 --> 00:36:57,552
లేదు, అది నా సొంతం, చార్లీ బ్రౌన్.

470
00:37:16,196 --> 00:37:19,074
పార్కులో మజా చేయడానికి అంతా సిద్ధంగా ఉన్నారా?

471
00:37:19,658 --> 00:37:20,825
గట్టిగా పట్టుకోండి.

472
00:37:25,538 --> 00:37:27,916
అన్నయ్యా!

473
00:37:30,961 --> 00:37:32,420
పీనట్స్ కామిక్ కథల ఆధారంగా

474
00:37:32,504 --> 00:37:33,505
చార్ల్స్ ఎం. షుల్జ్ రచన

475
00:38:47,954 --> 00:38:49,956
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్

476
00:38:59,049 --> 00:39:01,009
థాంక్యూ, స్పార్కీ.
ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు.

