1
00:00:08,175 --> 00:00:10,469
గతంలో బటర్ ఫ్లై లో..

2
00:00:12,263 --> 00:00:14,265
అంతా బాగుంది. లక్ష్యం గురిపై ఉంది.

3
00:00:18,519 --> 00:00:19,520
ఛ!

4
00:00:20,855 --> 00:00:22,148
ఆమె నా కూతురు.

5
00:00:23,607 --> 00:00:25,317
ఒకవేళ ఆమెను రక్షించలేకపోతే?

6
00:00:25,401 --> 00:00:27,987
ఆమెను ఇంతవరకు కలవలేకపోయాము.

7
00:00:28,070 --> 00:00:30,573
ఆమె మనకున్న చాలా విలువైన గూఢచారి.

8
00:00:30,656 --> 00:00:31,782
నీకు అతను దొరికాడా?

9
00:00:31,866 --> 00:00:33,534
ఇంకా లేదు, కానీ ఎక్కడున్నాడో నాకు తెలుసు.

10
00:00:33,617 --> 00:00:35,494
ఉదయానికల్లా పని పూర్తి చేస్తాను.

11
00:00:39,665 --> 00:00:40,624
వద్దు!

12
00:00:42,460 --> 00:00:43,753
అది అతనే అని నీకు తెలుసా?

13
00:00:44,044 --> 00:00:45,087
అతను బ్రతికే ఉన్నాడా?

14
00:00:47,465 --> 00:00:48,591
రెబెక్కా.

15
00:00:51,177 --> 00:00:52,178
నాన్నా?

16
00:01:50,694 --> 00:01:52,112
ఇది చాలా వింతగా ఉంది.

17
00:01:55,241 --> 00:01:57,201
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం.
అది పురోగతే.

18
00:01:58,369 --> 00:01:59,995
ఒక గంట క్రితం వరకు,

19
00:02:00,079 --> 00:02:03,082
మా నాన్న బ్రతికి ఉన్నాడని తెలుసుకోవడానికి
నేను ఏదైనా చేసేదాన్ని.

20
00:02:03,165 --> 00:02:07,169
ఇప్పుడు మనం ఇక్కడ
తినుబండారాలు కొనుకు౦టున్నా౦.

21
00:02:08,504 --> 00:02:10,256
నేను వెళ్ళడ౦ మంచిదేమో.

22
00:02:10,339 --> 00:02:11,715
వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా?

23
00:02:11,799 --> 00:02:14,134
మనం ఎక్కడికి వెళ్తున్నామో
చెప్పాలని అనుకుంటున్నావా?

24
00:02:19,390 --> 00:02:21,183
-బూసాన్.
-ఎందుకు?

25
00:02:22,977 --> 00:02:24,895
మనం కొన్నిటిని మనతో తీసుకెళ్ళాలి.

26
00:02:24,979 --> 00:02:27,231
-ఆ తర్వాత ఏంటి?
-ఆ తర్వాత దేశం వదిలి వెళ్ళిపోతాం.

27
00:02:27,314 --> 00:02:28,607
తిరిగి వర్జీనియాకా?

28
00:02:30,985 --> 00:02:33,904
నిజమే, నువ్వు చనిపోయినప్పుడు
అధికారికంగా కస్టమ్స్ గుండా వెళ్ళలేవు.

29
00:02:34,780 --> 00:02:36,949
అయితే, ఎక్కడికి?

30
00:02:42,788 --> 00:02:43,914
వియత్నాం.

31
00:02:43,998 --> 00:02:45,332
ఏంటి?

32
00:02:45,416 --> 00:02:47,209
అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాను.

33
00:02:47,293 --> 00:02:50,254
అది అందమైన దేశం. వాళ్ళు అప్పగించరు.

34
00:02:51,338 --> 00:02:54,758
సరే. అయితే ఇక వియత్నాంలో
కలకాలం సంతోషంగా ఉంటామా?

35
00:02:57,469 --> 00:02:59,054
నేను నా జీవితాన్ని ఇష్టపడ్డాను.

36
00:02:59,722 --> 00:03:03,058
నాకు డబ్బు, స్వేచ్ఛ ఉండేవి.
జూనో ఎల్లప్పుడూ నన్ను చూసుకునేది.

37
00:03:03,142 --> 00:03:06,020
నన్ను పెంచకుండా తప్పించుకోవడానికి,

38
00:03:06,103 --> 00:03:09,023
తను చనిపోయినట్లు నటించిన వ్యక్తి కోసం
అంతా కోల్పోయాను.

39
00:03:10,065 --> 00:03:11,567
జరిగింది అది కాదు.

40
00:03:15,529 --> 00:03:16,989
నేను జూనోకు ఫోన్ చేయాలి.

41
00:03:19,241 --> 00:03:23,162
అంటే, నేనెందుకు పారిపోతున్నాను?
ఆమె చంపాలనుకున్నది నిన్ను.

42
00:03:23,245 --> 00:03:25,122
నువ్వు ఆమె ఏజెంటును చంపావు.

43
00:03:25,205 --> 00:03:28,250
ఆట్వుడా?
అక్కడ చాలామంది ఆట్వుడ్‌లు ఉన్నారు.

44
00:03:28,751 --> 00:03:31,670
ఆమెకు ఎదురు తిరిగావు. నీకు జూనో
గురించి తెలుసు. ఆమె దాన్ని ఎప్పటికీ వదలదు.

45
00:03:31,754 --> 00:03:33,088
బహుశా.

46
00:03:34,006 --> 00:03:37,593
కానీ... అది నేనే చేశానని
మనం కచ్చితంగా చెప్పగలమా?

47
00:03:49,355 --> 00:03:50,731
ఒకప్పుడు నీకు అవంటే ఇష్టం.

48
00:03:53,609 --> 00:03:55,569
అవును, వాటి రుచి నాకు గుర్తున్నట్లే ఉంది.

49
00:04:03,827 --> 00:04:05,579
నువ్వు వాటికి చెల్లించాలి.

50
00:04:05,663 --> 00:04:08,582
-ఏయ్. ఏయ్!
-శాంతించు. మూత్రానికి వెళ్తున్నాను.

51
00:04:13,879 --> 00:04:17,091
సరే.

52
00:04:28,727 --> 00:04:29,979
హలో.

53
00:04:30,062 --> 00:04:31,814
నువ్వు అతన్ని చంపడానికి ప్రయత్నించావా?

54
00:04:32,189 --> 00:04:33,190
రెబెక్కా.

55
00:04:35,818 --> 00:04:39,905
జూనో, ఇప్పుడు నాతో అబద్ధం చెప్పకు.
నువ్వు ఆట్వుడ్‌కు పంపిన సందేశం చూసాను.

56
00:04:39,989 --> 00:04:41,407
ఆ నంబర్ జాడ కనిపెట్టండి.

57
00:04:41,490 --> 00:04:43,200
ఎక్కడ ఉన్నావు? అతనితో ఉన్నావా?

58
00:04:45,536 --> 00:04:48,372
అతను ప్రమాదకరమైనవాడు.
అతని పన్నాగం ఏంటో నాకు తెలియదు.

59
00:04:50,958 --> 00:04:52,292
అతను ఆట్వుడ్‌ను చంపాడు.

60
00:04:55,087 --> 00:04:58,173
నువ్వు ఎక్కడ ఉన్నావో చెబితే చాలు,
ఒక బృందాన్ని పంపిస్తాను.

61
00:05:09,643 --> 00:05:10,978
నన్ను వెనక్కి రానిస్తావా?

62
00:05:11,854 --> 00:05:12,855
తప్పకుండా.

63
00:05:14,481 --> 00:05:16,734
నీకు ఇక్కడ ఎల్లప్పుడూ చోటు ఉంటుంది.

64
00:05:20,821 --> 00:05:22,698
ఇది వినడానికి చాలా బాగుంది.

65
00:05:24,491 --> 00:05:26,035
ఇది నిజం కాకపోయినా.

66
00:05:26,118 --> 00:05:27,953
ఇది నిజం, రెబెక్కా.

67
00:05:29,705 --> 00:05:31,373
నీ చోటు ఇక్కడే.

68
00:05:37,504 --> 00:05:38,756
మరి మా నాన్న సంగతి ఏంటి?

69
00:06:05,115 --> 00:06:06,116
ఛ!

70
00:06:19,463 --> 00:06:20,547
ఏమైంది?

71
00:06:24,218 --> 00:06:25,469
నేనేమనుకున్నానంటే నువ్వు...

72
00:06:26,011 --> 00:06:27,137
పారిపోయానని అనుకున్నావా?

73
00:06:31,266 --> 00:06:32,726
చాలా బాధగా ఉంటుంది, కదా?

74
00:06:58,252 --> 00:06:59,545
ఆమెకు ఫోన్ చేసావా?

75
00:07:08,804 --> 00:07:10,806
నీ ఇష్టానికి వ్యతిరేకంగా
నిన్ను ఇక్కడ ఉంచలేను.

76
00:07:10,889 --> 00:07:14,685
నువ్వు జూనో విషయంలో రిస్కు తీసుకుంటానంటే
నేను నిన్ను ఆపలేను.

77
00:07:14,768 --> 00:07:16,019
కానీ నాకు ఆ విషయం తెలియాలి.

78
00:07:16,562 --> 00:07:18,897
నేను ఆమెకు ఫోన్ చేయలేదు, సరేనా? ఒట్టు.

79
00:07:33,537 --> 00:07:34,788
నీకు వయసు మీద పడింది.

80
00:07:34,872 --> 00:07:36,248
నువ్వు పెద్దదానివి అయ్యావు.

81
00:07:56,768 --> 00:07:57,769
అదేంటి?

82
00:07:58,687 --> 00:07:59,855
నాకు తెలియదు.

83
00:08:00,522 --> 00:08:03,233
-రోడ్డు ప్రమాదం జరిగిందేమో.
-ఏమో.

84
00:08:05,485 --> 00:08:06,820
-ఛ.
-ఏమైంది?

85
00:08:07,321 --> 00:08:09,239
ఇది పోలీస్ చెక్‌పోస్ట్.

86
00:08:38,560 --> 00:08:41,271
-ఏం చేస్తున్నావు?
-నేను ఏం చేస్తున్నట్లు కనిపిస్తోంది?

87
00:08:43,315 --> 00:08:44,942
నువ్వు ఎవరినీ కాల్చకూడదు.

88
00:08:45,442 --> 00:08:46,443
ఆ మాట ఎవరంటున్నారు?

89
00:08:47,027 --> 00:08:50,864
చూడు, మనం శాంతంగా ఉంటే చాలు, సరేనా?
ఇది సాధారణ చెక్‌పోస్ట్ అయితే

90
00:08:50,948 --> 00:08:53,784
మనం ఎవరినీ గాయపరచకుండా తప్పించుకోవచ్చు.

91
00:08:53,867 --> 00:08:54,910
ఒకవేళ కాకపోతే?

92
00:09:02,209 --> 00:09:03,126
హలో.

93
00:09:03,710 --> 00:09:05,003
మీ లైసెన్స్ చూపిస్తారా?

94
00:09:05,087 --> 00:09:06,046
సరే.

95
00:09:11,301 --> 00:09:12,386
ఇదిగోండి.

96
00:09:18,433 --> 00:09:20,060
మీరెక్కణ్నుంచి వస్తున్నారు?

97
00:09:20,143 --> 00:09:21,103
సోల్.

98
00:09:23,355 --> 00:09:24,690
అసలు ఇదంతా ఏమిటి?

99
00:09:26,358 --> 00:09:27,276
హేయ్, ఆఫీసర్

100
00:09:32,948 --> 00:09:33,991
ఒకటి దొరికింది.

101
00:09:35,617 --> 00:09:36,535
చూపించు.

102
00:09:36,994 --> 00:09:40,330
ఇది గూమిలోని మన చెక్‌పోస్ట్ నుండి.
స్థానిక పోలీసులకు సరిపోలినవారు దొరికారట.

103
00:09:40,414 --> 00:09:42,582
దయచేసి మీరు కారులోంచి బయటకు వస్తారా?

104
00:09:43,083 --> 00:09:44,501
మేము సెలవులకు వెళ్తున్నాం.

105
00:09:44,584 --> 00:09:45,836
కారునుంచి బయటికి రండి, ఇప్పుడే.

106
00:09:45,919 --> 00:09:47,421
ఇది నిజంగా అవసరమా?

107
00:09:50,215 --> 00:09:51,550
కారులోంచి బయటకు రండి.

108
00:09:51,883 --> 00:09:55,387
నా దారిన నన్ను పంపకూడదా?
నాతోపాటు నా కూతురు ఉంది.

109
00:09:55,470 --> 00:09:57,556
నేను మళ్ళీ అడగను.

110
00:09:59,057 --> 00:10:00,475
బయటికి రండి. ఇప్పుడే!

111
00:10:02,019 --> 00:10:04,646
పోలీసులు వారికి తుపాకీ గురిపెట్టారు.
వాళ్ళ పని అయిపోయినట్టే.

112
00:10:04,730 --> 00:10:06,273
నీకు డేవిడ్ జంగ్ గురించి తెలియదు.

113
00:10:07,149 --> 00:10:07,983
ఒకటి...

114
00:10:10,819 --> 00:10:11,737
రెండు...

115
00:10:11,820 --> 00:10:14,072
సరే! సరే!

116
00:10:16,908 --> 00:10:19,828
-నీ చేతులు నాకు కనిపించేలా పెట్టు!
-సరే, సరే.

117
00:10:19,911 --> 00:10:21,204
నేను బయటకు వస్తున్నాను.

118
00:10:26,668 --> 00:10:27,794
మిస్,

119
00:10:27,878 --> 00:10:29,129
బయటకు రా.

120
00:10:32,716 --> 00:10:34,217
నిన్ను చివరిసారిగా హెచ్చరిస్తున్నాను.

121
00:10:34,801 --> 00:10:36,428
కారులోంచి బయటకు రా, ఇప్పుడే!

122
00:10:36,762 --> 00:10:37,804
నేను వచ్చేలా చెయ్.

123
00:10:48,565 --> 00:10:49,483
రెబెక్కా...

124
00:10:53,737 --> 00:10:54,738
వద్దు!

125
00:10:59,242 --> 00:11:00,160
తుపాకీ కింద పడేయ్!

126
00:11:06,958 --> 00:11:08,293
-ముందు భాగానికి వెళ్ళు.
-సరే.

127
00:11:30,357 --> 00:11:31,400
ఎక్కు!

128
00:12:44,347 --> 00:12:46,308
బటర్ ఫ్లై

129
00:12:55,692 --> 00:12:57,319
అతను బ్రతికే ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాను.

130
00:12:59,112 --> 00:13:01,573
ఇన్ని సంవత్సరాల తర్వాత
మళ్ళీ తిరిగి ప్రత్యక్షమయ్యాడు.

131
00:13:03,867 --> 00:13:05,076
అతను నీకు గుర్తున్నాడా?

132
00:13:06,578 --> 00:13:07,954
అతని అంత్యక్రియలు గుర్తున్నాయి.

133
00:13:09,623 --> 00:13:11,374
నా చిన్నప్పుడు అతను నాతో మంచిగా ఉండేవాడు.

134
00:13:17,088 --> 00:13:18,882
మీరు కూడా ఆత్మీయంగా ఉండేవారు, కదా?

135
00:13:18,965 --> 00:13:21,927
కలిసి కంపెనీని నడిపేటప్పుడు
మరో మార్గం ఉండదు.

136
00:13:23,011 --> 00:13:23,929
రా.

137
00:13:24,721 --> 00:13:26,223
వాళ్ళు దొరికారా?

138
00:13:26,306 --> 00:13:28,767
ఇంకా లేదు. కానీ నేను ఇప్పుడే

139
00:13:28,850 --> 00:13:31,811
కొరియన్ నేషనల్ పోలీస్ కమిషనర్
జనరల్ హ్వాంగ్‌తో ఫోనులో మాట్లాడాను.

140
00:13:31,895 --> 00:13:34,898
ఇప్పటికీ అన్ని చెక్‌పోస్ట్‌లు
పనిచేస్తున్నాయని అతను చెప్పారు.

141
00:13:34,981 --> 00:13:38,610
వాళ్ళు చివరిసారిగా కనిపించిన ప్రదేశం యొక్క
100 కిలోమీటర్ల పరిధిలో

142
00:13:38,693 --> 00:13:41,071
-పోలీసుల సంఖ్యను పెంచుతున్నారని చెప్పారు.
-ధన్యవాదాలు.

143
00:13:44,783 --> 00:13:47,452
సరే. డేవిడ్ వెళ్ళే ఒక చిరునామా ఉంది.

144
00:13:47,536 --> 00:13:50,288
ఆ ఇల్లు సోజు డిస్టిలరీకి
ఒక గంట దూరంలో ఉంది.

145
00:13:50,372 --> 00:13:53,416
ఆ రెండూ అంజూ కిమ్ అనే మహిళవే.

146
00:13:53,500 --> 00:13:55,168
ఆమె వయసు 43 సంవత్సరాలు.

147
00:13:56,086 --> 00:14:00,715
ఆమె సోల్లో ఓ షిప్పింగ్ కంపెనీ ఉన్న
ప్రముఖ వ్యాపారవేత్త కూతురు.

148
00:14:00,799 --> 00:14:04,636
ఏడు సంవత్సరాల క్రితం,
ఆమె డే హో జంగ్ అనే వ్యక్తిని పెళ్ళాడింది.

149
00:14:05,136 --> 00:14:06,263
అతను డేవిడ్.

150
00:14:08,473 --> 00:14:09,766
మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు.

151
00:14:11,977 --> 00:14:13,979
అతన్ని ఏం చేయబోతున్నాం?

152
00:14:16,273 --> 00:14:19,359
మనం కార్పోవ్‌ను చంపామని అతనికి తెలుసు.
మనం అతన్ని అడ్డు తొలగించుకోవాలి.

153
00:14:20,068 --> 00:14:22,529
సరే. నేను...

154
00:14:23,613 --> 00:14:25,073
ఆ పని చూస్తాను.

155
00:14:30,829 --> 00:14:31,746
చూడు, అమ్మా?

156
00:14:35,250 --> 00:14:37,377
అతనికి జే-హున్ గురించి
తెలుసని అనుకుంటున్నావా?

157
00:14:39,170 --> 00:14:42,424
మనం చింతించాల్సినవి
ఒక చనిపోయిన కొరియన్‌ను మించి ఉన్నాయి.

158
00:14:45,135 --> 00:14:46,052
సరే.

159
00:14:55,395 --> 00:14:57,981
అరే, గృహ భద్రతా సంస్థ నుండి ఎవరో వచ్చారు.

160
00:15:02,652 --> 00:15:04,654
హలో. నేను సీసీటీవీని
బాగు చేయడానికి వచ్చాను.

161
00:15:04,738 --> 00:15:06,781
రా, రా.

162
00:15:06,865 --> 00:15:07,866
ధన్యవాదాలు.

163
00:15:08,617 --> 00:15:11,328
నేను కాసేపాగి మళ్ళీ ఫోన్ చేస్తాను.

164
00:15:15,665 --> 00:15:17,959
నువ్వు పర్సిమన్ పండు తింటావా?

165
00:15:18,043 --> 00:15:19,044
ఏమన్నారు?

166
00:15:19,836 --> 00:15:22,672
ఊరి నుండి ఒక పెట్టె పంపించారు.

167
00:15:22,756 --> 00:15:25,425
వద్దండి.

168
00:15:25,508 --> 00:15:27,135
అవి చుంగ్డో పర్సిమన్ పండ్లు.

169
00:15:27,927 --> 00:15:29,888
సరే... మీరు అంతగా అంటున్నారు కాబట్టి.

170
00:15:32,307 --> 00:15:33,975
-కూర్చో.
-ధన్యవాదాలు.

171
00:15:41,733 --> 00:15:43,485
కుక్క ఎంత ముద్దుగా ఉంది.

172
00:15:44,486 --> 00:15:46,237
కావాలంటే నువ్వు తీసుకెళ్ళొచ్చు.

173
00:15:46,321 --> 00:15:48,531
అది బాగా ఇబ్బంది పెడుతోంది.

174
00:15:49,532 --> 00:15:51,493
నేను ఇంతకుముందు ఎన్నడూ కుక్కను పెంచలేదు.

175
00:16:00,502 --> 00:16:02,587
మీరు చాలా మంచి తల్లి అయ్యేవారు.

176
00:16:04,464 --> 00:16:05,507
ఏమంటున్నావు?

177
00:16:08,635 --> 00:16:10,804
మీకు పిల్లలు ఎందుకు లేరు?

178
00:16:13,139 --> 00:16:16,267
అది... వ్యక్తిగతమైన విషయం, కదా?

179
00:16:16,351 --> 00:16:20,021
ఒక కుక్కను పెంచే కంటే
బిడ్డను పెంచడం మేలు కాదా?

180
00:16:24,067 --> 00:16:26,194
మేము చాలా కాలం... ప్రయత్నించాము.

181
00:16:29,406 --> 00:16:31,574
అదే మంచిదయిందేమో.

182
00:16:33,535 --> 00:16:35,578
ఎందుకంటే మీ భర్త కారణంగా...

183
00:16:38,707 --> 00:16:41,292
ఎలాగూ ఈరోజు మీరంతా చనిపోయేవారు.

184
00:16:41,376 --> 00:16:42,752
నువ్వేం చేస్తున్నావు?

185
00:16:45,046 --> 00:16:46,631
మీ భర్త మిస్టర్ ఛుల్సూ లిమ్...

186
00:16:51,136 --> 00:16:54,180
ఆయన కొందరు ప్రమాదకరమైన వ్యక్తుల దగ్గర
డబ్బు తీసుకున్నారు.

187
00:16:54,264 --> 00:16:56,349
దయచేసి మా ఇంట్లో నుంచి వెళ్ళిపో!

188
00:17:54,407 --> 00:17:55,241
ఏంటి?

189
00:17:55,325 --> 00:17:58,328
హలో, ఇది ఆరిరంగ్ సొల్యూషన్సా?

190
00:17:59,037 --> 00:18:00,830
మీరు పాత కస్టమరా?

191
00:18:02,123 --> 00:18:03,833
మనం ఇంతకుముందు కలిసి పని చేయలేదు,

192
00:18:03,917 --> 00:18:07,128
కానీ మీకు మంచి పేరుంది, మిస్టర్ లీ.

193
00:18:07,212 --> 00:18:09,422
నన్ను గన్ అని పిలవండి.

194
00:18:10,924 --> 00:18:12,175
మీరు?

195
00:18:13,718 --> 00:18:17,722
నా పేరు జూనో లండ్.
నేను క్యాడిస్ గ్రూప్ సహవ్యవస్థాపకురాలిని.

196
00:18:18,348 --> 00:18:19,808
మీరు ఎవరో నాకు తెలుసు.

197
00:18:20,350 --> 00:18:22,852
నీకు ఇష్టమైతే నా దగ్గర ఒక పని ఉంది.

198
00:18:23,603 --> 00:18:24,771
లక్ష్యం ఎవరు?

199
00:18:25,563 --> 00:18:27,649
డేవిడ్ జంగ్, నా పాత భాగస్వామి.

200
00:18:29,442 --> 00:18:30,944
అతను చనిపోయాడని అనుకున్నాను.

201
00:18:31,611 --> 00:18:33,071
నేను కూడా అలాగే అనుకున్నాను.

202
00:18:35,114 --> 00:18:36,366
ఇది అంత సులభం కాదు.

203
00:18:37,367 --> 00:18:38,743
నాకు సవాల్ అంటే ఇష్టం.

204
00:18:43,665 --> 00:18:45,041
ఇది బూసాన్ కాదు.

205
00:18:45,124 --> 00:18:46,376
కాదు. ఇది డేగూ.

206
00:18:46,459 --> 00:18:47,836
బూసాన్ వెళ్తున్నామని అనుకున్నాను,

207
00:18:47,919 --> 00:18:50,463
ఆ తర్వాత
అందమైన, అప్పగింతలు లేని వియత్నాంకు.

208
00:18:50,547 --> 00:18:51,923
పథకం మారిపోయింది.

209
00:18:54,509 --> 00:18:55,635
దేవుడా.

210
00:18:57,554 --> 00:18:58,972
మనం ఎక్కడికి వెళ్తున్నాం?

211
00:18:59,055 --> 00:19:02,141
మనం దాగి ఉండడానికి ఒక చోటు ఉంది.
తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం.

212
00:19:05,353 --> 00:19:07,856
-ఇదే.
-ఇది మూసేసినట్లుంది.

213
00:19:08,523 --> 00:19:10,942
దీని యజమాని నా క్లయింట్. మంచివాడు.

214
00:19:14,237 --> 00:19:15,738
మరీ అమాయకుడు.

215
00:19:25,874 --> 00:19:28,126
మనం కలిసి కొరియాకు వచ్చింది గుర్తుందా?

216
00:19:28,751 --> 00:19:30,837
అప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? తొమ్మిది.

217
00:19:30,920 --> 00:19:33,298
అవును. అది అమ్మ చనిపోగానే.

218
00:19:36,926 --> 00:19:40,889
ఎల్లప్పుడూ నిన్ను ఇక్కడికి తీసుకువచ్చి,
చాలా చూపించాలని అనుకున్నాను.

219
00:19:41,806 --> 00:19:43,641
నువ్వు చాలా గొప్ప టూర్
గైడ్‌ అయ్యూ౦డేవాడీవి.

220
00:19:45,852 --> 00:19:46,853
మంచిది.

221
00:19:49,439 --> 00:19:50,440
నువ్వు తాగుతావా?

222
00:19:51,816 --> 00:19:53,276
ఊరకే అంటున్నావు, కదా?

223
00:19:54,235 --> 00:19:56,195
నా చిట్టి తల్లి పెద్దదయింది.

224
00:19:59,282 --> 00:20:02,410
నీకు తెలుసా, ఇక్కడి సంప్రదాయం ప్రకారం
పాత్రలను తాకించాలి.

225
00:20:09,375 --> 00:20:10,376
చీర్స్.

226
00:20:10,460 --> 00:20:11,502
చీర్స్.

227
00:20:16,633 --> 00:20:18,384
ఇది నిజంగా నువ్వే చేసావా?

228
00:20:18,468 --> 00:20:20,386
మక్గోలి మరియు సోజు.

229
00:20:20,470 --> 00:20:24,349
నేనే తయారు చేసి, పంపిణీదారులను కనుగొని,
అకౌంట్లు చూసుకుంటాను.

230
00:20:24,432 --> 00:20:25,934
ఇది నా పూర్తికాల పని.

231
00:20:26,559 --> 00:20:28,895
నిజంగా హిప్‌స్టర్‌లా జీవించడానికే
కొరియాకు వచ్చావా?

232
00:20:30,355 --> 00:20:31,397
హిప్‌స్టరా?

233
00:20:31,856 --> 00:20:37,070
అవును. ఈ చేత్తో చేసిన మక్గోలి.
ఫిల్టర్ చేయని సోజు, ఇవన్నీ?

234
00:20:37,153 --> 00:20:39,489
ఇది కొరియాలోని అతి పురాతనమైన మద్యం.

235
00:20:39,572 --> 00:20:42,200
వారు సోజు కంటే శతాబ్దాల ముందే
దీన్ని తయారు చేస్తున్నారు.

236
00:20:42,951 --> 00:20:44,953
చూసావా? హిప్‌స్టర్.

237
00:20:55,213 --> 00:20:58,800
నా చిన్నప్పుడు
నువ్వు పాడే పాట నీకు గుర్తుందా?

238
00:21:00,343 --> 00:21:02,929
అది ఇంట్లో
ఒంటరిగా ఉన్న పాప గురించి అనుకుంటాను.

239
00:21:05,556 --> 00:21:07,016
అది ఇలా...

240
00:22:14,125 --> 00:22:16,252
దీంతో ఎంత మత్తు వస్తుంది?

241
00:22:31,559 --> 00:22:33,102
ఏదో తేడాగా ఉంది.

242
00:22:34,937 --> 00:22:37,148
నిన్ను పట్టుకున్నాను.

243
00:22:40,651 --> 00:22:41,736
ఏదో...

244
00:22:44,155 --> 00:22:45,239
కాస్త పడుకో.

245
00:22:46,240 --> 00:22:47,241
పడుకో.

246
00:24:04,819 --> 00:24:07,655
ఫోన్ లాగ్
జూనో

247
00:24:18,624 --> 00:24:19,792
ఊ, రా.

248
00:24:21,210 --> 00:24:23,421
మీకోసం సెనెటర్ డాసన్.

249
00:24:23,504 --> 00:24:27,175
నేను దేశంలో లేనని...
రాగానే ఫోన్ చేస్తానని అతనికి చెప్పు.

250
00:24:27,258 --> 00:24:31,220
మన్నించాలి. తను వచ్చారు. కింద ఉన్నారు.

251
00:24:37,894 --> 00:24:39,312
జార్జ్ డాసన్.

252
00:24:39,937 --> 00:24:41,147
జూనో లండ్.

253
00:24:42,064 --> 00:24:43,691
బలే ఆశ్చర్యం.

254
00:24:45,318 --> 00:24:47,737
నువ్వు సోల్లో
ఆఫీసు ప్రారంభిస్తున్నావని విన్నాను,

255
00:24:47,820 --> 00:24:50,156
కానీ ఇది చాలా పెద్ద ఆపరేషన్‌లా ఉంది.

256
00:24:50,615 --> 00:24:53,034
ఇది ప్రైవేటు సెక్టారులో ఉండే మరో సౌలభ్యం.

257
00:24:53,117 --> 00:24:55,077
-ఎప్పుడు తిరిగి వచ్చావు?
-నిన్న రాత్రి.

258
00:24:56,204 --> 00:24:59,123
ఇది పట్టు సాధించడానికి మంచి చోటు,

259
00:24:59,207 --> 00:25:01,584
లాంగ్లీలోని ఇతరుల విషయాల్లో
తల దూర్చేవారికి దూరంగా.

260
00:25:02,501 --> 00:25:05,004
మీరు తిరిగి చూస్తారా?
మనం కాన్ఫరెన్స్ రూమ్‌లో మాట్లాడుకోవచ్చు.

261
00:25:05,087 --> 00:25:08,299
వద్దు. నిన్ను చాలా కాలంగా చూడలేదు.
నిన్ను బయటకు తీసుకెళ్తాను.

262
00:25:10,009 --> 00:25:10,927
అబ్బా.

263
00:25:16,307 --> 00:25:18,392
ఇది ఇంతకుముందు తిన్నావా?

264
00:25:18,476 --> 00:25:21,646
బుడేజ్జిగే, ఆర్మీలో చేసే వంటకం.

265
00:25:21,729 --> 00:25:25,149
యుద్ధానంతరం కొరియా ఆపత్కాలంలో
ఇది పుట్టింది.

266
00:25:25,233 --> 00:25:29,654
అమెరికా మిగులు ధాన్యాన్ని ఉడకబెట్టాల్సి
వచ్చింది. కాల్చిన బీన్స్, హాట్ డాగ్‌లు.

267
00:25:30,196 --> 00:25:31,030
ఘుమఘుమలాడుతోంది.

268
00:25:31,113 --> 00:25:34,033
కొన్నిసార్లు జాన్సన్ స్టూ అని పిలుస్తారు,
పెద్దాయన ఎల్‌బీజే పేరు మీద.

269
00:25:36,244 --> 00:25:39,247
మీరు ప్రెసిడెంట్ అయ్యాక
దానికి మీ పేరు పెడతారేమో.

270
00:25:40,414 --> 00:25:43,084
డాసన్ సూప్.

271
00:25:45,253 --> 00:25:46,837
అది నాకు నచ్చింది.

272
00:25:48,422 --> 00:25:51,926
మీరు సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీకి నాయకత్వం
వహిస్తున్నందున, అదేం పెద్ద విషయం కాదు.

273
00:25:52,009 --> 00:25:53,052
రాజకీయాలు.

274
00:25:55,137 --> 00:25:58,099
నువ్వు లాంగ్లీలో పనిచేశాక,
ప్రైవేటు రంగంలోకి వెళ్ళడం మంచి ఆలోచనేమో.

275
00:25:58,182 --> 00:26:00,268
నేను ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం
చేయాల్సి వచ్చింది.

276
00:26:00,351 --> 00:26:03,896
నేనింకా ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నాను.
అందుకు నాకు చాలా డబ్బు, అధికారం కావాలి.

277
00:26:08,943 --> 00:26:10,820
నిన్ను చూడడం ఆనందంగా ఉంది, జూనో.

278
00:26:12,113 --> 00:26:14,407
నువ్వు ఇక్కడ ఉండటం యాదృచ్ఛికం.

279
00:26:14,490 --> 00:26:15,491
అదెలా?

280
00:26:17,285 --> 00:26:20,621
నేను చనిపోయిన మిఖాయిల్ కార్పోవ్‌తో
మాట్లాడటానికి సోల్కు వచ్చాను.

281
00:26:21,706 --> 00:26:24,083
అతను క్యాడిస్‌కు
కాస్త పనిచేసి పెట్టాడు, కదా?

282
00:26:25,251 --> 00:26:28,462
అది కొన్నేండ్ల క్రితం, కానీ మేము అతనితో
కొన్నిసార్లు ఒప్పందం కుదుర్చుకున్నాము.

283
00:26:28,546 --> 00:26:30,756
ఈ వ్యాపారంలోని అందరూ
కార్పోవ్‌తో కలిసి పని చేసారు.

284
00:26:31,966 --> 00:26:34,093
అతనికి అందరి రహస్యాలు తెలుసని అంటారు.

285
00:26:34,176 --> 00:26:36,137
అతను హత్యకు గురికావడంలో ఆశ్చర్యం లేదు.

286
00:26:36,804 --> 00:26:38,389
ఎందుకు? నువ్వు ఏం విన్నావు?

287
00:26:39,724 --> 00:26:40,975
-జార్జ్...
-మన్నించు.

288
00:26:41,559 --> 00:26:43,769
నువ్వు ఇంకా ఏదో
చెప్పాలనుకున్నట్లు అనిపించింది.

289
00:26:45,271 --> 00:26:47,982
మనం దేనికోసం కలిశామో అడగవా?

290
00:26:48,065 --> 00:26:49,859
అది రహస్యమని అనుకుంటాను.

291
00:26:51,068 --> 00:26:53,487
అంటే, మనిద్దరి మధ్యే ఉండాలి,

292
00:26:53,571 --> 00:26:56,866
అతను కీలకమైన యూఎస్ నిఘా సమాచారాన్ని
రష్యా యొక్క ఎఫ్ఎస్‌బీకి చేరవేసేవాడు.

293
00:26:56,949 --> 00:26:58,617
దాని వెనుక ఎవరున్నారో నాకు తెలియాలి.

294
00:27:00,328 --> 00:27:02,913
నాకు తెలియజేయ తగ్గది
ఏదైనా తెలిస్తే నీకు చెబుతాను.

295
00:27:04,206 --> 00:27:05,624
సహాయానికి సంతోషం.

296
00:27:07,126 --> 00:27:09,545
-పాత రోజుల్లా ఉంటుంది.
-తప్పకుండా.

297
00:27:12,757 --> 00:27:15,593
ఇక ఆలివర్ ఎలా ఉన్నాడు?

298
00:27:16,969 --> 00:27:20,389
నీ కొడుకు కుటుంబ వ్యాపారంలో చేరాడు.
అందుకు నువ్వు గర్వపడాలి.

299
00:27:23,100 --> 00:27:24,226
నేను అడిగానని చెప్పు.

300
00:27:50,961 --> 00:27:52,797
నాకు మత్తుమందు ఇచ్చావా?

301
00:27:52,880 --> 00:27:54,548
నిన్ను బాధపెట్టాలని కాదు.

302
00:27:55,424 --> 00:27:56,759
నేను తెలుసుకోవాలనుకున్నాను అంతే.

303
00:28:04,100 --> 00:28:06,477
అవును, సరే. ఆమెకు ఫోన్ చేసాను.

304
00:28:08,646 --> 00:28:09,772
నన్ను పట్టుకున్నావు.

305
00:28:11,690 --> 00:28:14,151
అందుకు నేను బాధపడాలని అనుకుంటున్నావా?

306
00:28:14,235 --> 00:28:18,072
నువ్వు నన్ను క్యాడిస్‌కు అప్పగించాలనుకుంటే
నేను నిన్ను నాతో తీసుకెళ్ళలేను.

307
00:28:20,032 --> 00:28:21,367
ఆమెకు ఏం చెప్పావు?

308
00:28:21,951 --> 00:28:23,244
-ఏం లేదు.
-ఏం లేదా?

309
00:28:23,619 --> 00:28:25,413
కేవలం ఆమెతో మాట్లాడాలని అనుకున్నాను.

310
00:28:29,083 --> 00:28:30,418
నువ్వు నన్ను కనిపెట్టావు.

311
00:28:31,710 --> 00:28:34,505
నువ్వు క్యాడిస్‌తో
నాకున్న సంబంధాన్ని తెంచేసి,

312
00:28:34,588 --> 00:28:37,925
ఈ పనికిమాలిన
తండ్రికూతుళ్ళ సాహసయాత్రకు తీసుకొచ్చావు.

313
00:28:38,008 --> 00:28:40,344
-నువ్వు ఆ పని చేయాల్సిన అవసరం లేదు.
-అవును, చేసాను.

314
00:28:40,428 --> 00:28:42,555
ఓ... ఎందుకు?

315
00:28:43,305 --> 00:28:44,640
నువ్వంటే నాకిష్టం కాబట్టి.

316
00:28:49,812 --> 00:28:51,480
లేదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు.

317
00:28:53,190 --> 00:28:57,069
నిన్ను తీవ్రవాదులు చంపేశారని
నేను భావిస్తూ పెరిగేలా చేశావు.

318
00:28:57,903 --> 00:29:00,531
నిన్ను సురక్షితంగా ఉంచే మార్గం
అదొక్కటే ఉండింది.

319
00:29:00,614 --> 00:29:01,532
ఆగు.

320
00:29:02,450 --> 00:29:05,953
ఇంతకాలం నీకు నువ్వు అదే చెప్పుకుంటున్నావా?

321
00:29:28,684 --> 00:29:29,643
ఏయ్.

322
00:29:41,238 --> 00:29:42,239
రా.

323
00:29:51,916 --> 00:29:53,501
వదులు.

324
00:30:02,218 --> 00:30:05,888
నేను ఫిలిప్పీన్స్‌లోని జోలో దీవిలో
ఒక బృందానికి నాయకత్వం వహిస్తున్నాను.

325
00:30:07,765 --> 00:30:11,852
హ్యూగో మాల్డొనాడోను, అతని ఉగ్రవాద సెల్‌ను
వేటాడేందుకు మమ్మల్ని నియమించారు.

326
00:30:13,771 --> 00:30:15,481
వాళ్ళు ప్రమాదకరమైనవారని మాకు తెలుసు,

327
00:30:15,564 --> 00:30:17,399
కానీ తక్కువ అంచనా వేశాము.

328
00:30:42,716 --> 00:30:43,676
వెళ్ళండి!

329
00:30:43,759 --> 00:30:47,054
వారికి అన్ని ఖండాల్లో నెట్‌వర్క్ ఉంది.

330
00:30:47,137 --> 00:30:48,847
మేము వస్తున్నామని వారికి తెలుసు.

331
00:30:49,306 --> 00:30:50,641
మీరు ఇది చూడాలి.

332
00:30:59,358 --> 00:31:02,152
వీళ్ళు క్రూరమైన వాళ్ళని ప్రఖ్యాతి.

333
00:31:03,320 --> 00:31:06,240
వాళ్ళు ఇళ్ళను తగలబెట్టి,
మొత్తం కుటుంబాలను చంపారు.

334
00:31:06,323 --> 00:31:08,242
తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి
ఏదైనా చేసేవారు.

335
00:31:08,325 --> 00:31:12,830
జంగ్, రెబెక్కా

336
00:31:19,378 --> 00:31:22,965
వాళ్ళ దగ్గర నీ ఫోటో,
జనన ధ్రువీకరణ పత్రం ఉన్నాయి...

337
00:31:24,842 --> 00:31:26,093
నీ స్కూల్ షెడ్యూల్.

338
00:31:28,512 --> 00:31:30,055
వాళ్ళ లక్ష్యం మేము.

339
00:31:31,557 --> 00:31:35,144
నేను నీ దగ్గరకు చేరుకునే లోపే,
మాపై మెరుపుదాడి చేసారు.

340
00:31:35,227 --> 00:31:37,313
నా బృందంలోని వారంతా చనిపోయారు.

341
00:31:38,147 --> 00:31:42,443
నేను బ్రతికాను, కానీ నేను
చనిపోయేంత వరకు వాళ్ళు ఆగరని తెలుసు.

342
00:31:42,526 --> 00:31:45,988
వాళ్ళు నన్ను చేరుకోవడానికి
నిన్ను వెంటాడి చంపుతారని నాకు తెలుసు!

343
00:31:47,448 --> 00:31:49,033
అందుకే నేను చనిపోవాల్సి వచ్చింది.

344
00:31:51,577 --> 00:31:52,494
అంటే...

345
00:31:54,079 --> 00:31:58,000
వేరే దేశంలోని దుష్టుల నుండి
నన్ను రక్షించడానికే మాయమయ్యావు.

346
00:31:59,501 --> 00:32:01,920
నేను సరైన పనే చేస్తున్నానని అనుకున్నాను,

347
00:32:03,005 --> 00:32:04,590
అది కఠినమైన పని.

348
00:32:04,673 --> 00:32:06,800
ఏ తండ్రి అయినా అదే చేస్తాడని అనుకున్నాను.

349
00:32:09,219 --> 00:32:12,222
చూడు, దీన్ని నువ్వు అనుభవించిన దానితో
పోల్చలేమని నాకు తెలుసు...

350
00:32:14,975 --> 00:32:16,727
కానీ అది నన్ను కృంగదీసింది.

351
00:32:25,569 --> 00:32:27,112
నాకు ప్రతిరోజు గుర్తొచ్చేదానివి.

352
00:32:30,699 --> 00:32:34,787
ప్రతిరోజూ, తప్పు నిర్ణయం తీసుకున్నానా అని
నన్ను నేను ప్రశ్నించుకునే వాడిని.

353
00:32:38,082 --> 00:32:41,669
కానీ నిన్ను ఇక్కడ నా ముందు చూడగానే,

354
00:32:42,544 --> 00:32:43,754
సజీవంగా...

355
00:32:47,257 --> 00:32:48,884
నాకు అదంతా సమంజసమే అనిపించింది.

356
00:33:02,564 --> 00:33:06,235
నువ్వు చనిపోయిన రోజు గురించి
తెలుసుకోవాల్సినవన్నీ నేను చదివాను.

357
00:33:08,529 --> 00:33:10,322
మాల్డొనాడో మరింతగా బలపడ్డాడు.

358
00:33:13,409 --> 00:33:15,786
అందుకే నా కోసం తిరిగి రాలేదా?

359
00:33:29,425 --> 00:33:31,677
ఏయ్, ఏమైంది?

360
00:33:32,344 --> 00:33:33,971
నన్ను ఎవరో అనుసరిస్తున్నారని అనిపిస్తోంది.

361
00:33:34,638 --> 00:33:35,514
ఏంటి?

362
00:33:37,850 --> 00:33:39,977
నేను అనవసరంగా భయపడుతున్నానని అనుకున్నాను,

363
00:33:40,394 --> 00:33:42,813
కానీ అక్కడ వాకీటాకీలు పట్టుకుని
ఇద్దరు వ్యక్తులున్నారు...

364
00:33:42,896 --> 00:33:44,648
వాళ్ళు క్యాడిస్ మనుషులని అనుకుంటున్నాను.

365
00:33:46,775 --> 00:33:47,985
ఎక్కడున్నావు?

366
00:33:48,068 --> 00:33:49,319
డోంగ్‌డేగూ స్టేషన్.

367
00:33:51,321 --> 00:33:52,823
అక్కడి నుండి రాగలవా?

368
00:33:56,910 --> 00:34:00,122
నేను... రాలేను. వాళ్ళు నన్ను పసిగడతారు.

369
00:34:01,123 --> 00:34:03,500
సరే, నేను చెప్పేది విను.

370
00:34:04,126 --> 00:34:08,172
ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళు.
లోపలి నుండి గడియ పెట్టుకోగలిగే చోటికి.

371
00:34:08,922 --> 00:34:11,800
నేను దగ్గర్లోనే ఉన్నాను.
అక్కడికి 15 నిమిషాల్లో చేరుకుంటాను, సరేనా?

372
00:34:12,509 --> 00:34:14,344
సరే. తొందరగా రా.

373
00:34:18,515 --> 00:34:20,309
అది ఒక మహిళ, కదా?

374
00:34:22,644 --> 00:34:23,771
తను నా భార్య.

375
00:34:29,067 --> 00:34:30,110
క్యాడిస్ తనను కనిపెట్టిందా?

376
00:34:31,653 --> 00:34:32,488
అవును.

377
00:34:33,822 --> 00:34:35,824
నీకు నా సహాయం కావాలనుకుంటాను.

378
00:34:37,409 --> 00:34:39,203
-చేస్తానని అనడం లేదు.
-అక్కర్లేదు.

379
00:34:40,370 --> 00:34:43,582
నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది
మళ్ళీ ప్రమాదంలోకి నెట్టడానికి కాదు.

380
00:34:43,665 --> 00:34:46,835
నువ్వు ఆమె కోసం వెళితే
నేను ఇక్కడ ఊరకే కూర్చోవాలా?

381
00:34:46,919 --> 00:34:49,421
నిన్ను నాకోసం
వేచి ఉండేలా చేయలేనని నాకు తెలుసు.

382
00:34:50,964 --> 00:34:52,591
కానీ నేను వీడ్కోలు చెప్పడం లేదు.

383
00:34:57,554 --> 00:34:58,555
దయచేసి...

384
00:34:59,973 --> 00:35:01,016
ఇక్కడే ఉండు.

385
00:35:03,060 --> 00:35:04,603
ఒకవేళ నువ్వు మళ్ళీ చనిపోతే?

386
00:35:04,978 --> 00:35:06,605
నన్ను అంత సులభంగా చంపలేరు.

387
00:35:21,161 --> 00:35:22,579
ఇడియట్.

388
00:35:46,144 --> 00:35:47,104
ఊ.

389
00:35:47,187 --> 00:35:49,189
నేను. ఒక విషయం ఉంది.

390
00:36:08,625 --> 00:36:11,545
మనం ఇక్కడ ఉన్నామని ఆమెకు తెలుసు.
మనం ఎందుకు దాడి చేయకూడదు?

391
00:36:11,628 --> 00:36:13,589
మన లక్ష్యం డేవిడ్, అతని భార్య కాదు.

392
00:36:14,047 --> 00:36:16,216
-అతను వస్తాడని అనుకుంటున్నావా?
-అనుకుంటున్నాను.

393
00:36:17,050 --> 00:36:18,802
డేవిడ్ ఎప్పుడూ రక్షి౦చెవాడవుతాడు.

394
00:36:20,429 --> 00:36:23,515
చూడు, అతనికి కార్పోవ్ గురించి తెలుసని
నాకు తెలుసు, కానీ...

395
00:36:25,309 --> 00:36:27,102
అతని నుండి ఇంకా ముప్పు ఉందా?

396
00:36:28,270 --> 00:36:32,566
అంటే, అతను క్యాడిస్‌కు దూరంగా ఉండాలని
ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది.

397
00:36:32,649 --> 00:36:34,318
మనం అతన్ని వదిలేయాలని అనుకుంటున్నావా?

398
00:36:35,569 --> 00:36:37,487
నేను అడుగుతున్నానంతే.

399
00:36:39,698 --> 00:36:42,117
నీలో అలా అనిపించే భాగాన్ని,

400
00:36:42,743 --> 00:36:46,413
అతన్ని లక్ష్యంగా కాకుండా
మనిషిగా చూసే భాగాన్ని...

401
00:36:47,581 --> 00:36:51,335
దాని గొంతు చుట్టూ చేతులు బిగించి

402
00:36:51,418 --> 00:36:54,046
అది చనిపోయే వరకు వదలకు.

403
00:36:56,298 --> 00:36:57,382
అర్థమైందా?

404
00:38:27,305 --> 00:38:29,057
తూర్పు ప్రవేశ ద్వారం దగ్గర. ఇక్కడేం లేదు.

405
00:38:39,943 --> 00:38:41,486
నేను లిమ్‌ను, లైన్‌లో ఉన్నాను.

406
00:38:50,954 --> 00:38:52,831
ఏయ్, ఈ ప్రదేశంపై దృష్టి పెట్టు.

407
00:39:00,672 --> 00:39:03,050
ర్యూ, నీకు వినపడుతోందా? ర్యూ?

408
00:39:03,717 --> 00:39:05,052
అసలేం జరుగుతోంది?

409
00:39:06,386 --> 00:39:08,388
తను డేవిడ్. ఇక్కడికి వచ్చాడు.

410
00:39:19,566 --> 00:39:20,901
మనకు ఏదైనా సమస్యనా?

411
00:39:21,401 --> 00:39:22,778
లిమ్, మాట్లాడు!

412
00:39:26,615 --> 00:39:28,492
జూనో, నువ్వు వింటున్నావని నాకు తెలుసు.

413
00:39:30,869 --> 00:39:32,287
కలిసి చాలా కాలమైంది.

414
00:39:33,955 --> 00:39:34,831
ఏదో ఒకటి చేయు.

415
00:39:36,625 --> 00:39:39,169
క్యాడిస్ అంటే ఒక గదిలో
ఉన్న మనమే అనే రోజులు గుర్తున్నాయా?

416
00:39:39,252 --> 00:39:40,629
నీ దగ్గర ఏముందో చూపించు.

417
00:39:40,712 --> 00:39:43,799
ఇది పగటి కల కాదని నీకు మాటిచ్చాను, కదా?

418
00:39:44,633 --> 00:39:48,261
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారితో
ఒక ప్రధాన భాగస్వామి అవుతామని చెప్పాను.

419
00:39:48,970 --> 00:39:51,181
ఇది మన వారసత్వం అవుతుందని చెప్పాను.

420
00:39:51,264 --> 00:39:53,683
ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్న కెమెరాలేనా?

421
00:39:53,767 --> 00:39:55,477
మనం అతన్ని ఎందుకు కనిపెట్టాలేకపోయాం?

422
00:39:57,020 --> 00:39:58,355
నేను చెప్పింది నిజమే, కదా?

423
00:40:02,984 --> 00:40:04,402
సయావోంగ్ చూశాడు.

424
00:40:04,486 --> 00:40:05,987
అయితే అతని అంతు చూడు.

425
00:40:06,947 --> 00:40:09,324
ఇప్పుడు ఇక్కడ
కొరియాలో నన్ను వేటాడుతున్నావు.

426
00:40:09,407 --> 00:40:10,283
అది నాకివ్వు.

427
00:40:13,954 --> 00:40:16,123
అందుకే నేను నీకు మరో మాటిస్తాను.

428
00:40:17,290 --> 00:40:21,837
నువ్వు నా కుటుంబం జోలికొస్తే,
నీకు కావాల్సిందల్లా నాశనం చేస్తాను.

429
00:40:23,004 --> 00:40:24,506
నీకు ఏమీ మిగలదు.

430
00:40:25,757 --> 00:40:26,758
హాయ్, డేవిడ్.

431
00:40:27,926 --> 00:40:29,469
నీ గొంతు వినడం బాగుంది.

432
00:40:30,846 --> 00:40:34,182
నువ్వు చనిపోయినట్లు నటించగా,
నేను ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాను.

433
00:40:34,975 --> 00:40:36,393
నువ్వు నన్ను ముట్టుకోలేవు.

434
00:40:36,476 --> 00:40:37,394
అదీ చూద్దాం.

435
00:41:21,855 --> 00:41:22,772
నడుస్తూనే ఉండు.

436
00:41:22,856 --> 00:41:25,817
-నిన్ను బార్ దగ్గర ఉండుమని చెప్పాను.
-నీ భార్యను కలవాలనుకున్నాను.

437
00:41:26,818 --> 00:41:27,861
అక్కడున్నాడు!

438
00:41:30,697 --> 00:41:32,032
తను రెబెక్కా.

439
00:41:33,575 --> 00:41:34,743
అతనికి సహాయం చేస్తోంది.

440
00:41:44,294 --> 00:41:45,795
ఆమె అక్కడ ఉందనుకుంటున్నావా?

441
00:41:45,879 --> 00:41:48,465
అవును. నాలుగు నిమిషాల్లో
రైలు బయలుదేరుతుంది.

442
00:41:48,548 --> 00:41:51,343
నువ్వు వాళ్ళ సంగతి చూడగా,
నేను ఆమెను కలిస్తే ఎలా ఉంటుంది?

443
00:41:51,426 --> 00:41:54,971
వద్దు. ఎలాగూ వచ్చావు కాబట్టి నాతో ఉండు.
మనం వాళ్ళను దూరంగా తీసుకెళ్దాం.

444
00:42:03,438 --> 00:42:06,024
వీలైనంత తొందరగా రైలు దగ్గరకెళ్ళు.
నిన్ను అక్కడ కలుస్తాను.

445
00:42:06,107 --> 00:42:07,025
వెళ్ళు! ఇప్పుడే!

446
00:44:46,017 --> 00:44:48,978
ఓ, ఛ! రా.

447
00:44:49,062 --> 00:44:50,563
సరే, సరే, సరే.

448
00:44:52,649 --> 00:44:53,942
సరే.

449
00:44:54,025 --> 00:44:56,152
సరే, కూర్చో.

450
00:44:57,946 --> 00:44:59,614
-సరే.
-ఏయ్.

451
00:45:00,490 --> 00:45:01,324
ఓరి దేవుడా.

452
00:45:01,408 --> 00:45:03,576
-నీకు ఒక విషయం చెప్పాలి.
-నేను వేచి ఉండగలను.

453
00:45:03,660 --> 00:45:06,413
-అలా కాదు.
-కాస్త నోరు మూసుకుంటావా?

454
00:45:06,496 --> 00:45:07,455
ఏం కాలేదు.

455
00:45:15,505 --> 00:45:16,840
ఏం జరిగింది?

456
00:45:16,923 --> 00:45:17,966
నాన్నా.

457
00:45:18,633 --> 00:45:20,176
నాన్నా, నీకు దెబ్బతగిలింది.

458
00:45:30,937 --> 00:45:32,188
నీకు కూతురు ఉందా?

459
00:46:32,582 --> 00:46:34,584
సబ్‌టైటిల్ అనువాద కర్త
నల్లవల్లి రవిందర్ రెడ్డి

