1
00:00:08,259 --> 00:00:10,177
ఇంతకుముందు "బటర్ ఫ్లై"లో

2
00:00:10,970 --> 00:00:12,596
నా దగ్గర ఒక పని ఉంది.

3
00:00:12,680 --> 00:00:14,181
లక్ష్యం ఎవరు?

4
00:00:14,265 --> 00:00:16,225
డేవిడ్ జంగ్, నా పాత భాగస్వామి.

5
00:00:22,273 --> 00:00:23,733
నేను జూనోకు ఫోన్ చేయాలి.

6
00:00:25,359 --> 00:00:28,779
నువ్వు ఎక్కడ ఉన్నావో చెబితే చాలు,
ఒక బృందాన్ని పంపిస్తాను.

7
00:00:28,863 --> 00:00:30,156
ఏదో తేడాగా ఉంది.

8
00:00:34,201 --> 00:00:35,661
మనం అతన్ని ఎందుకు కనిపెట్టాలేకపోయాం?

9
00:00:35,745 --> 00:00:37,747
-సయావోంగ్ అతన్ని చూశాడు.
-అతని అంతు చూడు.

10
00:00:42,334 --> 00:00:43,586
నాన్నా, నువ్వు గాయపడ్డావు.

11
00:00:43,669 --> 00:00:44,920
నీకు కూతురు ఉందా?

12
00:01:10,905 --> 00:01:12,531
హలో?

13
00:01:12,615 --> 00:01:17,453
నేను. వీలైనంత తొందరగా
నాకు నా ఆర్డర్ కావాలి.

14
00:01:17,536 --> 00:01:22,124
నువ్వు చాలా ఆహారం ఆర్డర్ చేశావు.
అది ఇంకా తయారు కాలేదు.

15
00:01:22,208 --> 00:01:24,043
నువ్వు కొన్ని రోజుల్లో తీసుకెళ్ళొచ్చు.

16
00:01:24,126 --> 00:01:25,961
లేదు, నాకు దాని డెలివరీ రేపు కావాలి.

17
00:01:26,754 --> 00:01:28,005
డెలివరీనా‌?

18
00:01:28,714 --> 00:01:30,716
చేయలేను. నాకు ఇంకా సమయం కావాలి.

19
00:01:31,342 --> 00:01:34,595
మాకు చాలా ఆకలిగా ఉంది. అంతసేపు ఆగలేము.

20
00:01:35,763 --> 00:01:38,599
నీలాంటి కస్టమర్ల వల్లే
నేను తొందరగా రిటైర్ కావాలనుకుంటాను.

21
00:01:38,682 --> 00:01:42,812
నువ్వు సహాయం చేయకపోతే,
జగల్చి మార్కెట్ నుండి ఆర్డర్ చేస్తాను.

22
00:01:42,895 --> 00:01:45,147
వద్దు, వద్దు, నేను చేస్తాను.

23
00:01:46,148 --> 00:01:48,067
రాత్రి 8:00 గంటలకైతే పరవాలేదా?

24
00:01:48,150 --> 00:01:49,610
పరవాలేదు. ఉంటాను.

25
00:01:51,028 --> 00:01:52,321
ఇదిగో, యోంగ్ షిక్.

26
00:01:53,405 --> 00:01:56,534
ఇప్పుడు మనకి చెల్లయింది.

27
00:01:58,244 --> 00:01:59,537
లేదు. ఎప్పటికీ కాదు.

28
00:02:06,794 --> 00:02:08,712
రాత్రి 8:00 గంటలకు జగల్చి మార్కెట్.

29
00:02:17,680 --> 00:02:20,099
అయితే నేను నిన్ను అమ్మా అని పిలవాలా?

30
00:02:21,851 --> 00:02:23,269
నువ్వు అదే కావాలనుకుంటే పిలవొచ్చు.

31
00:02:24,687 --> 00:02:26,230
నువ్వు నా కూతురిలా కనిపిస్తావు.

32
00:02:26,313 --> 00:02:27,731
నేను ఆమెలా ఏమాత్రం ఉండను.

33
00:02:30,776 --> 00:02:32,903
అతను నీకు మిన్హీ గురించి చెప్పలేదా.

34
00:02:38,325 --> 00:02:40,536
ఓరి దేవుడా, డేవిడ్?

35
00:02:44,707 --> 00:02:46,041
ఏం చదువుతున్నావు?

36
00:02:47,167 --> 00:02:49,795
ఇంగ్లీషులో, అది "ద సీక్రెట్ గార్డెన్."

37
00:02:50,296 --> 00:02:51,714
అది అంటే నీకు ఇష్టమా?

38
00:02:51,797 --> 00:02:53,883
నీకు ఆ పుస్తకం ఇష్టమా అని అక్క అడుగుతోంది.

39
00:02:53,966 --> 00:02:55,092
ఇది నాకు ఇష్టం.

40
00:02:55,467 --> 00:02:58,512
ఇది ఒక చిన్నమ్మాయిని తన తల్లిదండ్రులు
వద్దనుకోవడం గురించి.

41
00:02:59,513 --> 00:03:01,181
ఇది బాధాకరమైనది, కదా?

42
00:03:02,683 --> 00:03:04,184
నీ వయసు ఎ౦త? ఐదేళ్ళా?

43
00:03:04,268 --> 00:03:05,561
నాకు ఏడేళ్ళు.

44
00:03:06,228 --> 00:03:08,105
ఈరోజు నా పుట్టినరోజు.

45
00:03:11,775 --> 00:03:14,904
మా నాన్న తొమ్మిదేళ్ళ క్రితం మాయమయ్యాడు.
తనకు ఏడేళ్ళ కూతురు ఉందా?

46
00:03:15,529 --> 00:03:17,656
అతను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు
మీరిద్దరూ కలిసే ఉన్నారా?

47
00:03:17,740 --> 00:03:19,116
లేదు, అలాంటిదేమీ లేదు.

48
00:03:19,199 --> 00:03:21,827
అతను అజ్ఞాతంలో ఉన్నప్పుడు
ఇక్కడ కలిసాను. మేము...

49
00:03:21,911 --> 00:03:23,162
అది చాలా తొందరగా జరిగిపోయింది.

50
00:03:25,497 --> 00:03:27,207
మిన్హీ ఏడాది తర్వాత పుట్టింది.

51
00:03:28,667 --> 00:03:31,629
నువ్వు చనిపోయాడు అనుకున్న వ్యక్తిని
ఎలా కలిశావు?

52
00:03:31,712 --> 00:03:33,255
దానికి కూడా ఏదైనా యాప్ ఉందా?

53
00:03:33,881 --> 00:03:36,508
అతనికి కొత్త గుర్తింపు,
కొత్త జీవితం కావాల్సొచ్చి౦ది.

54
00:03:36,592 --> 00:03:37,760
అతనికి నేను సహాయం చేసాను.

55
00:03:37,843 --> 00:03:38,844
అతనితో పడుకునా?

56
00:03:48,020 --> 00:03:50,314
నువ్వు ఏం చేస్తున్నావో
నాకు తెలుసు, రెబెక్కా,

57
00:03:52,232 --> 00:03:53,776
కానీ నేను నీ శత్రువును కాదు.

58
00:04:00,115 --> 00:04:01,325
పాపం అమ్మాయి.

59
00:04:03,494 --> 00:04:05,287
మహా అయితే ఇంకో పదేళ్ళు పట్టొచ్చు.

60
00:04:05,788 --> 00:04:08,290
తను కూడా మనలా సైకోలా తయారవుతుంది.

61
00:04:13,420 --> 00:04:15,631
నీకు కూతురు ఉందని నాకు ఎందుకు చెప్పలేదు?

62
00:04:17,049 --> 00:04:19,677
నువ్వు అపార్థం చేసుకుంటావని
నాకు ఎ౦దుకో అనిపి౦చి౦ది.

63
00:04:19,760 --> 00:04:23,722
నువ్వు నన్ను, చనిపోయిన నా అమ్మను
మాలానే ఉన్న కొరియన్ వాళ్ళతో భర్తి చేశావు.

64
00:04:23,806 --> 00:04:25,724
ఎవరిని భర్తి చెయ్యలేదు.

65
00:04:26,934 --> 00:04:29,687
చూడు, నిన్ను కనిపెట్టడానికి
నా సర్వస్వాన్ని ఒడ్డాను.

66
00:04:29,770 --> 00:04:31,480
నిన్ను కోల్పోవాలని అనుకోలేదు.

67
00:04:31,563 --> 00:04:33,273
ఇప్పుడు మనమంతా ఒకచోట ఇరుక్కుపోయాము.

68
00:04:33,899 --> 00:04:35,859
పరమ సంతోషకరమైన పెద్ద కుటుంబం.

69
00:04:35,943 --> 00:04:39,071
చూడు, మనం సురక్షిత గృహానికి
వెళ్ళి చేరుకు౦దా౦, సరేనా?

70
00:04:39,154 --> 00:04:42,491
నా దగ్గర ఆయుధాలు, డబ్బు, మందులు ఉన్నాయి.

71
00:04:42,574 --> 00:04:46,453
మనం ఈ రాత్రికి అక్కడ ఉండి,
ఉదయాన్నే ఫుకుయోకాకు పడవలో వెళ్దాం.

72
00:04:46,954 --> 00:04:48,622
నాకు పాస్‌పోర్ట్ కావాలి. నాది పనికిరాదు.

73
00:04:48,706 --> 00:04:51,667
అవి తయారవుతున్నాయి.
మనకు వాటిని బూసాన్‌లో ఇస్తారు.

74
00:04:51,750 --> 00:04:53,627
మనం అసలు బూసాన్ చేరుకోలేము.

75
00:04:53,711 --> 00:04:58,007
వచ్చే స్టేషన్‌లో జూనో తన మనుషుల చేత
రైలు మీద దాడి చేయిస్తుంది.

76
00:04:58,716 --> 00:04:59,925
ఆ పని మీదే ఉన్నాను.

77
00:05:04,763 --> 00:05:06,682
అతడిని తప్పించుకుపోనిచ్చావు.

78
00:05:06,765 --> 00:05:08,809
అతనికి సహాయం చేసే వాళ్ళున్నారని
నాకు తెలియదు.

79
00:05:09,643 --> 00:05:11,854
అతనితో పాటు ఉన్న ఆ అమ్మాయి ఎవరు?

80
00:05:11,937 --> 00:05:12,980
అతని కూతురు.

81
00:05:14,148 --> 00:05:16,859
-ఆమెకు పోరాటం నేర్పించాడా?
-అతనికి దానితో సంబంధం లేదు.

82
00:05:16,942 --> 00:05:18,902
రెబెక్కాను నేనే ఇలా తయారు చేసాను.

83
00:05:18,986 --> 00:05:20,612
నేను మీకు అభినందనలు తెలపాలా?

84
00:05:20,696 --> 00:05:24,450
నీ పని నువ్వు చూసుకో.
నేను నీకు పని అప్పజెప్పి పొరపాటు చేశానా?

85
00:05:25,159 --> 00:05:26,744
అందులో ఎలాంటి పొరపాటు లేదు.

86
00:05:26,827 --> 00:05:28,203
చూద్దా౦.

87
00:05:28,287 --> 00:05:30,956
అతని రైలు ఏ దిక్కున వెళుతుందో నీకు తెలుసు.

88
00:05:31,040 --> 00:05:33,667
ఒక టీమ్ వచ్చే స్టేషన్‌కు వెళుతోంది.
అక్కడ ఉండు.

89
00:05:37,713 --> 00:05:39,506
మళ్ళీ నన్ను నిరాశపరచకు.

90
00:05:40,340 --> 00:05:41,425
ఏం జరిగింది?

91
00:05:41,508 --> 00:05:44,470
డోంగ్‌డేగూ స్టేషన్‌లో జరిగిన దానికి
హ్వాంగ్ కోపంగా ఉన్నారు.

92
00:05:44,553 --> 00:05:47,639
భయాందోళనకు గురైన ప్రయాణికులంతా
అతని ఆఫీసుకు అత్యవసర ఫోన్లు చేస్తున్నారు.

93
00:05:47,723 --> 00:05:49,558
అందుకని మన నిఘా కెమెరాల
కనెక్షన్ కట్ చేసారు.

94
00:05:49,641 --> 00:05:52,853
అంతేకాకుండా, రెబెక్కా క్యాడిస్ సభ్యురాలని
అతనికి తెలుసు.

95
00:05:52,936 --> 00:05:56,690
ఇది కంపెనీ అంతర్గత వ్యవహారమని చెప్పి,
మనల్ని పూర్తిగా దూరం చేసారు.

96
00:05:56,774 --> 00:05:59,234
మనం అతని పైనున్న వారి మీద ఆధారపడదాం.

97
00:05:59,318 --> 00:06:02,696
వద్దు. రైలు స్టేషన్‌లోకి రావడానికి
ఇంకా ఎంత సమయం పడుతుంది?

98
00:06:02,780 --> 00:06:03,822
తొమ్మిది నిమిషాలు.

99
00:06:15,959 --> 00:06:19,296
మిన్హీని సిద్ధంగా ఉండుమను.
మనం రైలు దిగబోతున్నాం.

100
00:06:19,379 --> 00:06:20,964
మనం స్టేషన్ చేరుకోలేదు.

101
00:06:21,048 --> 00:06:23,759
తొందరగా. మన దగ్గర ఎక్కువ సమయం లేదు.
తొందరగా కానీయ్.

102
00:06:31,850 --> 00:06:35,229
సరే. బయట నిలబడు. ధైర్యంగా ఉండు.
దేన్నైనా పట్టుకో.

103
00:06:38,440 --> 00:06:39,441
అలాగే.

104
00:06:39,900 --> 00:06:41,110
అందరూ సిద్ధమా?

105
00:06:55,415 --> 00:06:58,794
రైలు స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో
అత్యవసరంగా ఆగిపోయింది.

106
00:06:59,419 --> 00:07:00,546
అది డేవిడ్ పనే.

107
00:07:01,255 --> 00:07:02,881
ఇప్పుడు మన టీమ్‌ను అక్కడికి తీసుకెళ్ళండి.

108
00:07:05,801 --> 00:07:07,177
మిన్హీ. సరేనా?

109
00:07:21,483 --> 00:07:23,485
పదండి. రండి.

110
00:07:29,491 --> 00:07:30,450
మళ్ళీ ఏంటి?

111
00:07:30,534 --> 00:07:32,744
డేవిడ్ స్టేషన్ ఉత్తరాన
రైలు దిగి వెళ్ళిపోయాడు.

112
00:07:32,828 --> 00:07:35,914
దగ్గరలోనే ట్రక్ డిపో ఉంది.
పారిపోవడానికి తప్పకుండా అక్కడికే వెళ్తాడు.

113
00:07:35,998 --> 00:07:37,416
అర్థమైంది.

114
00:07:55,642 --> 00:07:56,476
ఏయ్.

115
00:07:56,560 --> 00:07:59,271
ఏమండీ, మీరు బూసాన్ వెళ్తున్నారా?

116
00:07:59,354 --> 00:08:00,355
అవును.

117
00:08:00,439 --> 00:08:01,857
హమ్మయ్య.

118
00:08:01,940 --> 00:08:04,443
మాకు లిఫ్ట్ ఇవ్వగలరా?

119
00:08:04,526 --> 00:08:06,320
అందుకు డబ్బులు ఇస్తాం.

120
00:08:07,821 --> 00:08:10,949
మన్నించండి, కానీ మా కారు చెడిపోయింది.

121
00:08:11,992 --> 00:08:15,913
మాకు టాక్సీ దొరకడం లేదు.
ఈరోజు నా కూతురు పుట్టినరోజు.

122
00:08:15,996 --> 00:08:17,497
దయచేసి మాకు సహాయం చేయగలరా?

123
00:08:23,462 --> 00:08:24,630
అటువైపు నుండి వచ్చి కూర్చోండి.

124
00:08:24,713 --> 00:08:26,006
చాలా ధన్యవాదాలు.

125
00:09:10,842 --> 00:09:12,010
అందరూ దిగండి.

126
00:09:27,276 --> 00:09:29,403
అతను తెల్ల క్యాబ్ ఉన్న
షిప్పింగ్ ట్రక్‌లో ఉన్నాడు.

127
00:09:29,820 --> 00:09:31,571
రిజిస్ట్రేషన్ నంబర్ 8052.

128
00:09:31,655 --> 00:09:34,157
తెల్ల క్యాబ్. రిజిస్ట్రేషన్ 8052.

129
00:09:34,616 --> 00:09:36,493
తెల్ల క్యాబ్. 8052. చుట్టుముట్టండి.

130
00:09:53,510 --> 00:09:54,344
ఛ.

131
00:09:54,428 --> 00:09:55,262
దిగు!

132
00:09:58,765 --> 00:10:01,310
తలుపు తెరువు, ఇప్పుడే!

133
00:11:14,633 --> 00:11:16,593
బటర్ ఫ్లై

134
00:11:29,898 --> 00:11:34,403
బూసాన్

135
00:11:51,795 --> 00:11:54,297
సరే, పదండి. రా.

136
00:12:06,309 --> 00:12:08,937
అక్కా, చెప్పులు ఇక్కడే విడవాలి.

137
00:12:18,029 --> 00:12:21,741
నాన్నా, నా పుట్టినరోజు
ఇక్కడే జరుపుకుంటున్నామా?

138
00:12:21,825 --> 00:12:24,286
లేదు, ఇక్కడ కేవలం ఒక రాత్రి ఉంటామంతే.

139
00:12:24,786 --> 00:12:26,455
ఆ తర్వాత పడవలో వెళతాము.

140
00:12:26,538 --> 00:12:29,791
ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన చోటికి
విమానంలో వెళ్తాము.

141
00:12:30,834 --> 00:12:34,171
మిన్హీ, కాళ్ళు చేతులు కడుక్కొని,
బట్టలు మార్చుకుందాము.

142
00:12:34,254 --> 00:12:35,255
సరే.

143
00:12:35,630 --> 00:12:36,631
పై అంతస్తుకు వెళ్ళండి.

144
00:12:41,845 --> 00:12:43,889
ఈ చోటు గురించి ఎవరికైనా తెలుసా?

145
00:12:43,972 --> 00:12:45,182
లేదు, ప్రమాదం లేదు.

146
00:12:45,265 --> 00:12:46,433
కచ్చితంగానా?

147
00:12:46,516 --> 00:12:48,059
ఎల్లప్పుడూ క్యాడిస్ ఏదోలా కనిపెడుతుంది.

148
00:12:48,643 --> 00:12:50,770
క్యాడిస్‌ను స్థాపించింది నేనే.
అది మర్చిపోకు.

149
00:12:51,396 --> 00:12:52,272
ఎప్పుడూ మరవను.

150
00:12:54,483 --> 00:12:55,442
కిటికీ.

151
00:13:01,656 --> 00:13:02,741
ఇక్కడే ఉండు.

152
00:13:22,093 --> 00:13:22,928
జిన్-సూ?

153
00:13:25,388 --> 00:13:28,600
సార్, మీరు వస్తారనుకోలేదు.

154
00:13:32,521 --> 00:13:35,190
మీరు వస్తారని తెలిస్తే...

155
00:13:41,488 --> 00:13:43,490
ఇక్కడ ప్రమాదం లేదని చెప్పావనుకున్నాను?

156
00:13:43,573 --> 00:13:44,783
అవును.

157
00:13:44,866 --> 00:13:46,701
అవునా? అయితే అతను ఎవరు?

158
00:13:47,577 --> 00:13:48,995
అతను క్వాన్ గారు.

159
00:13:49,496 --> 00:13:51,498
ఈ ఇంటిని చూసుకునేది అతనే.

160
00:13:51,581 --> 00:13:53,875
చింతించకు. నేను మారుపేరు వాడి,
నగదు రూపంలో చెల్లిస్తాను.

161
00:13:53,959 --> 00:13:55,835
అతడి వల్ల ఏదైనా సమస్య ఉంటుందా?

162
00:13:55,919 --> 00:13:57,462
ఎవరు సమస్య కాబోతున్నారు?

163
00:13:57,546 --> 00:13:58,463
ఎవరూ కాదు.

164
00:13:59,256 --> 00:14:00,340
మిన్హీ ఎక్కడ‌?

165
00:14:00,632 --> 00:14:03,343
తను స్నానం చేస్తోంది.
ఎవరి గురించి మాట్లాడుతున్నావు?

166
00:14:03,426 --> 00:14:04,928
దాని గురించి చింతించాల్సిన పనిలేదు.

167
00:14:10,100 --> 00:14:11,685
మనం కాస్త మాట్లాడుకుందాం.

168
00:14:26,950 --> 00:14:29,786
ఇది నీ కోసం, రెబెక్కా కోసం
నువ్వు చేయాల్సి వచ్చిందని నాకు తెలుసు.

169
00:14:29,869 --> 00:14:32,330
కానీ ఇందులోకి నన్ను, మిన్హీని కూడా లాగావు.

170
00:14:34,791 --> 00:14:35,792
నువ్వు అన్నది నిజమే.

171
00:14:38,086 --> 00:14:39,087
నన్ను మన్నించు.

172
00:14:41,298 --> 00:14:43,174
నువ్వు బాధపడాల్సిన పని లేదు.

173
00:14:44,050 --> 00:14:47,804
మనం ఒక కుటుంబంగా ఉండాలంటే, అలాగే ఉండాలి.

174
00:14:49,055 --> 00:14:51,891
ప్రపంచంతో పోరాడేది
నువ్వు, రెబెక్కా మాత్రమే కాకూడదు.

175
00:14:54,102 --> 00:14:55,353
ధన్యవాదాలు.

176
00:14:56,438 --> 00:14:58,148
ఇది నీకు ఇబ్బందికరమని నాకు తెలుసు.

177
00:14:58,231 --> 00:15:00,775
దీన్ని రెబెక్కా ఏమి సునాయాసం చేయడం లేదు.

178
00:15:02,444 --> 00:15:03,862
ఆమె ఎందుకు అలా చెయ్యాలి?

179
00:15:06,573 --> 00:15:09,576
ఆమె ఎంత బాధ అనుభవిస్తుందో ఊహించలేను.

180
00:15:21,838 --> 00:15:23,048
నువ్వంటే నాకు ప్రేమ.

181
00:15:45,278 --> 00:15:46,279
ఏమైంది?

182
00:15:47,155 --> 00:15:48,281
రెబెక్కా.

183
00:15:50,116 --> 00:15:51,201
ఆమె...

184
00:15:53,620 --> 00:15:54,621
ఆమె ఏంటి?

185
00:15:58,041 --> 00:15:59,042
భిన్నమైనది.

186
00:16:11,471 --> 00:16:14,099
కార్పోవ్ దర్యాప్తు ఎలా జరుగుతోంది, జార్జ్?

187
00:16:14,182 --> 00:16:16,476
నిజానికి నేను దానికోసం రాలేదు.

188
00:16:19,312 --> 00:16:21,398
ఇంతకుముందు చూసిన దానికంటే
ఆలివర్ పెద్దవాడయ్యాడు.

189
00:16:21,481 --> 00:16:23,066
మనం ఆశించినంతగా కాదు.

190
00:16:23,149 --> 00:16:26,111
తన నాన్న ఎత్తుకు, నా ఎత్తుకు మధ్య,
6'2" ఎత్తు ఉంటాడని అనుకున్నాను.

191
00:16:26,194 --> 00:16:28,697
అతనికి తన తల్లిలాగే
రాత్రి జీవితం అంటే ఇష్టం.

192
00:16:29,239 --> 00:16:32,409
మీరు ఓ'షియా'స్‌ను క్రమం తప్పకుండా
మూసివేయించడం నాకు గుర్తుంది.

193
00:16:32,492 --> 00:16:34,994
నువ్వు మా మొదటి సంవత్సరం
విశ్లేషకులందరికీ తాగించావు.

194
00:16:35,078 --> 00:16:36,788
దాన్ని టీమ్ బిల్డింగ్ అంటారు.

195
00:16:37,539 --> 00:16:40,750
అతను నీలాగే
ఆసక్తికరమైన వ్యక్తులను ఆకర్షిస్తాడు.

196
00:16:41,209 --> 00:16:43,336
అతని పక్కన ఉన్న వ్యక్తి నీకు తెలుసు, కదా?

197
00:16:43,795 --> 00:16:45,255
లేదు, నేను అతన్ని గుర్తుపట్టలేదు.

198
00:16:45,338 --> 00:16:46,506
అతను జే-హున్ లీ.

199
00:16:47,215 --> 00:16:50,802
అమెరికాలో చదువుకున్నాడే?
గంగ్నమ్‌లో సగం భవనాలు తన కుటుంబానివే?

200
00:16:51,219 --> 00:16:54,472
అతని హత్య గురించి వినే ఉంటావు.
అది వార్తల్లో వచ్చింది.

201
00:16:55,974 --> 00:16:56,975
అవును.

202
00:16:57,517 --> 00:17:01,563
ఆలివర్ చాలా బాధపడ్డాడు.
వారు గత కొన్ని నెలలుగా స్నేహితులయ్యారు.

203
00:17:06,818 --> 00:17:07,861
జూనో.

204
00:17:09,738 --> 00:17:12,824
మిఖాయిల్ కార్పోవ్ క్యాడిస్‌కు
చాలా ఎక్కువే చేశాడని నాకు తెలుసు.

205
00:17:14,325 --> 00:17:16,536
ఇప్పుడు మీ అబ్బాయికి,
సీఐఏ మనిషికి మధ్య ఉన్న

206
00:17:16,619 --> 00:17:19,914
సన్నిహిత సంబంధం గురించి
మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావు.

207
00:17:22,333 --> 00:17:25,628
నా కొడుకుపై
సీఐఏ గూఢచర్యం చేస్తోందా, జార్జ్?

208
00:17:26,838 --> 00:17:28,173
అలాగే అనుకోవచ్చు.

209
00:17:30,049 --> 00:17:32,385
అతను ఏ తప్పు చేయకపోతే
చింతించాల్సిన పనిలేదు.

210
00:17:33,762 --> 00:17:36,806
దాన్ని నిరూపించడానికి
చేయాల్సిన మంచి పని సహకరించడమే.

211
00:17:37,182 --> 00:17:38,433
నేను దాన్ని ఎలా చేయాలి?

212
00:17:39,601 --> 00:17:41,978
ముందుగా నన్ను ఆలివర్‌తో మాట్లాడించాలి.

213
00:17:42,520 --> 00:17:43,938
అతను నా ఆధీనంలో లేడు.

214
00:17:45,482 --> 00:17:47,275
నేను ఎక్కడ ఉంటానో అతనికి చెప్పు.

215
00:17:55,617 --> 00:17:57,452
ఒక గొప్ప విలుకాడు ఎలా అవుతాడో తెలుసా?

216
00:17:58,203 --> 00:18:00,163
పద్ధతి మీద ధ్యాస,

217
00:18:01,539 --> 00:18:04,417
చిన్న వివరాల్లో పరిపూర్ణత ఉండాలి.

218
00:18:05,418 --> 00:18:07,212
నేను ఇప్పుడే సెనెటర్ డాసన్‌ను కలిసాను.

219
00:18:07,295 --> 00:18:09,923
అతను చనిపోయిన రాత్రి నువ్వు,
జే-హున్ కలిసున్న ఫోటో అతని దగ్గర ఉంది.

220
00:18:10,006 --> 00:18:10,924
ఏంటి?

221
00:18:11,007 --> 00:18:13,051
ఇ౦టర్నెట్ అ౦తా అదే.

222
00:18:13,134 --> 00:18:16,095
-ఆ రాత్రిది ఇంకేమైనా మిస్ అవుతున్నావా?
-లేదు.

223
00:18:16,179 --> 00:18:18,932
-సెక్యూరిటీ ఫుటేజీని తొలగించావా?
-అవును.

224
00:18:19,015 --> 00:18:21,309
-వెళ్ళిన చోట నిన్నెవరైనా గుర్తుపట్టారా?
-అమ్మా!

225
00:18:22,268 --> 00:18:23,186
జాగ్రత్తగా ఉన్నాను.

226
00:18:23,686 --> 00:18:27,273
నీపై సీఐఏ వారాల తరబడి నిఘా పెట్టినా
నీకు తెలియలేదు

227
00:18:27,357 --> 00:18:29,275
ఇప్పుడు వాళ్ళ మనిషిని
చంపావని అనుకుంటున్నారు.

228
00:18:29,359 --> 00:18:31,110
నువ్వు అనుకుంటున్న జాగ్రత్త సరిపోదు.

229
00:18:31,194 --> 00:18:34,197
రష్యన్లకు రహస్యసమాచారాన్ని అమ్మడానికి
కార్పోవ్‌ను వాడుకోవడం నా ఆలోచన కాదు.

230
00:18:34,280 --> 00:18:37,617
కానీ అందుకోసం డాసన్ నన్ను అరెస్టు చేస్తే
అది నీ తప్పు కావచ్చు.

231
00:18:41,704 --> 00:18:43,122
చాలా పెద్ద తప్పు చేశానని తెలుసు.

232
00:18:44,374 --> 00:18:47,043
నాకు ప్రతిరోజూ
ఆ విషయం గుర్తు చేస్తున్నావు.

233
00:18:47,794 --> 00:18:50,713
కానీ క్యాడిస్‌ను నాశనం చేయడానికి
ప్రయత్నిస్తున్నది నేను కాదు, డేవిడ్ జంగ్.

234
00:18:50,922 --> 00:18:53,174
నేను ఊరకే ఉంటానని
నాపట్ల ఇలా ప్రవర్తిస్తావు.

235
00:18:53,299 --> 00:18:55,093
నిన్ను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాను.

236
00:18:55,176 --> 00:18:56,928
నాకు రక్షణ అక్కర్లేదు.

237
00:18:57,637 --> 00:18:59,055
నేను సహాయం చేయాలనుకుంటున్నాను.

238
00:19:03,268 --> 00:19:06,187
నువ్వు రెబెక్కాను నమ్మినట్లే
నన్ను నమ్మాలని కోరుకుంటున్నాను.

239
00:19:07,188 --> 00:19:08,439
నువ్వు రెబెక్కావు కాదు.

240
00:19:09,148 --> 00:19:11,526
నేను కాను.

241
00:19:12,151 --> 00:19:13,528
ఆమె నిన్ను వదిలి వెళ్ళిపోయింది.

242
00:19:18,408 --> 00:19:19,909
చూడు, దీన్ని సరిదిద్దగలను.

243
00:19:21,244 --> 00:19:23,079
నన్ను ఉపయోగపడేలా ఉండనివ్వు.

244
00:19:23,162 --> 00:19:25,206
నాకు రెబెక్కా తెలుసు.
ఆమె ఎలా ఆలోచిస్తుందో తెలుసు.

245
00:19:25,290 --> 00:19:28,126
మనం ఆమెను వెతికి పట్టుకుంటే,
ఇదంతా పోతుంది.

246
00:19:29,460 --> 00:19:33,131
నన్ను ఆమెను వెంటాడడానికి పంపిస్తే,
నీకు నా సత్తా ఏంటో చూపిస్తాను.

247
00:19:36,175 --> 00:19:38,261
అది పూర్తిగా నిండిపోగానే,

248
00:19:39,345 --> 00:19:43,516
దీన్ని ఇక్కడకు జరపాలి.

249
00:19:44,601 --> 00:19:45,602
నెట్టు.

250
00:19:50,940 --> 00:19:53,568
అప్పుడు దీన్ని పట్టుకుని,

251
00:19:53,651 --> 00:19:56,029
వెనుకకు లాగాలి,

252
00:19:56,738 --> 00:19:58,990
ఛాంబర్‌లోకి గుండు వెళ్ళే వరకు.

253
00:20:00,700 --> 00:20:01,576
కానీయు.

254
00:20:01,659 --> 00:20:02,535
నాకు చూపించు.

255
00:20:05,413 --> 00:20:06,581
నేను లాగలేను.

256
00:20:06,664 --> 00:20:09,584
కష్టమైన పనులు
చేయగల అమ్మాయివి కావాలని నీకు లేదా?

257
00:20:09,667 --> 00:20:11,377
ఇంగ్లీష్ కష్టమైనది.

258
00:20:11,461 --> 00:20:12,879
కానీ అది నీకు బాగావచ్చు.

259
00:20:13,338 --> 00:20:14,589
నాన్న నాకు సహాయం చేస్తాడు.

260
00:20:15,381 --> 00:20:17,926
కానీ నువ్వు ఎల్లప్పుడూ
నాన్న మీద ఆధారపడకూడదు.

261
00:20:19,636 --> 00:20:20,470
చేయు.

262
00:20:22,597 --> 00:20:23,431
లాగు.

263
00:20:25,099 --> 00:20:26,643
మంచి అమ్మాయి.

264
00:20:28,603 --> 00:20:29,687
గురి పెడతావా?

265
00:20:32,023 --> 00:20:33,316
అలా.

266
00:20:34,692 --> 00:20:35,652
ఢాం.

267
00:20:35,985 --> 00:20:37,320
అవును.

268
00:20:37,737 --> 00:20:38,821
ఢాం.

269
00:20:39,113 --> 00:20:40,114
ఢాం.

270
00:20:40,573 --> 00:20:42,575
మిన్హీ. మిన్హీ.

271
00:20:43,660 --> 00:20:47,080
-అసలు ఏం చేస్తున్నావు?
-ఇది లోడ్ చేసి లేదు.

272
00:20:47,664 --> 00:20:51,250
ఒక చిన్న అమ్మాయిని తుపాకీతో ఆడుకోనివ్వడం
సరైన పని అనుకుంటున్నావా?

273
00:20:51,334 --> 00:20:52,585
నీకు మతి పోయిందా?

274
00:20:52,669 --> 00:20:53,628
ఏం జరుగుతోంది?

275
00:20:54,504 --> 00:20:56,673
ఆమె మిన్హీని తుపాకీతో ఆడుకోనిచ్చింది.

276
00:20:57,173 --> 00:20:58,549
ఆది లోడ్ చేసి లేదు.

277
00:20:58,633 --> 00:21:00,301
విషయం అది కాదు!

278
00:21:00,385 --> 00:21:02,053
ఊరుకో, ఊరుకో.

279
00:21:03,513 --> 00:21:06,140
ఆమె మన ఏడేళ్ళ అమ్మాయికి తుపాకీ ఇచ్చింది.

280
00:21:08,893 --> 00:21:10,478
నీకు ఏమైంది?

281
00:21:12,480 --> 00:21:13,481
అదిగో అదే.

282
00:21:13,564 --> 00:21:16,401
-ఆ సవతితల్లి ప్రేమంతా నటన అని నాకు తెలుసు.
-రెబెక్కా.

283
00:21:16,484 --> 00:21:18,736
నేను ఆమె అంత ఉన్నప్పుడు
నాకు తుపాకీ వాడటం నేర్పించావు.

284
00:21:18,820 --> 00:21:21,239
-అది వేరు.
-అంటే నేను వేరేలా ఉన్నానా?

285
00:21:21,322 --> 00:21:24,158
-ఆమెకు అదేగా చెప్పావు?
-నా ఉద్దేశ్యం అది కాదు.

286
00:21:25,076 --> 00:21:27,453
చూడు, ఇది కష్టమని నాకు తెలుసు, సరేనా?

287
00:21:27,537 --> 00:21:29,038
కానీ మనం రేపటి వరకు ఆగితే,

288
00:21:29,122 --> 00:21:32,417
ఉదయం ఇక్కడి నుండి బయలుదేరి,
కొత్త దేశంలో కొత్త జీవితం గడుపుతాం.

289
00:21:33,084 --> 00:21:37,463
కానీ మనం అప్పటివరకు సర్దుకుపోదామా? దయచేసి.

290
00:21:41,426 --> 00:21:42,343
మిన్హీ ఎక్కడ?

291
00:21:44,804 --> 00:21:45,888
మిన్హీ.

292
00:21:47,557 --> 00:21:48,725
మిన్హీ.

293
00:21:56,315 --> 00:21:58,484
మా మిన్హీ ఎక్కడ?

294
00:21:59,819 --> 00:22:02,697
మిన్హీ ఎక్కడ?

295
00:22:03,239 --> 00:22:04,574
మిన్హీ ఎక్కడ?

296
00:22:04,657 --> 00:22:07,952
దొరికావు! మా చిన్ని యువరాణి దొరికింది.

297
00:22:08,036 --> 00:22:09,662
ఎక్కడ దాక్కున్నావు?

298
00:22:10,288 --> 00:22:12,665
ఎక్కడ దాక్కున్నావు, తుంటరి పిల్ల?

299
00:22:15,251 --> 00:22:16,669
సరే, చూడు,

300
00:22:17,754 --> 00:22:19,464
నువ్వు ఆడుకోవాలనుకుంటున్నావని నాకు తెలుసు.

301
00:22:19,547 --> 00:22:21,466
కానీ మనం ఇంటి లోపల ఉండాలి.

302
00:22:21,549 --> 00:22:22,467
సరేనా?

303
00:22:22,550 --> 00:22:23,384
సరే.

304
00:22:23,468 --> 00:22:25,595
అమ్మ దగ్గరకు వెళ్ళు.

305
00:22:28,181 --> 00:22:29,807
మనం అలా ఆడుకునే వాళ్ళం.

306
00:22:31,934 --> 00:22:33,936
నువ్వు అంత సులభంగా దొరికేదానివి కాదు.

307
00:22:35,938 --> 00:22:38,066
నీ చిన్నప్పటిది గుర్తుందా?

308
00:22:38,149 --> 00:22:42,779
నేను నిన్ను పదే పదే గాలిలోకి ఎగరేసేవాడిని.

309
00:22:43,654 --> 00:22:46,449
కానీ నేను ఆపగానే
గట్టిగా అరుస్తూ ఉండే దానివి,

310
00:22:47,241 --> 00:22:48,785
నేను మళ్ళీ అలా చేసేవరకు.

311
00:22:50,036 --> 00:22:51,996
మనం దాన్ని ఏమనేవాళ్ళమో నీకు గుర్తుందా?

312
00:22:56,542 --> 00:22:57,460
నీకు గుర్తుందా?

313
00:23:00,338 --> 00:23:01,172
లేదు.

314
00:23:17,021 --> 00:23:18,731
మేము ఇప్పుడు విరామంలో ఉన్నాము.

315
00:23:19,649 --> 00:23:21,275
దయచేసి తర్వాత రండి.

316
00:23:27,323 --> 00:23:28,950
యోంగ్ షిక్ చోయ్ ఎక్కడున్నాడు?

317
00:23:29,492 --> 00:23:31,160
అతను ఇక్కడ లేడు.

318
00:23:39,377 --> 00:23:42,797
-చోయ్ గారు? చోయ్ గారు?
-ఏంటి?

319
00:23:44,340 --> 00:23:45,925
నేను మీతో ఒక్క క్షణం మాట్లాడవచ్చా?

320
00:23:47,218 --> 00:23:48,052
ఎందుకు?

321
00:23:49,387 --> 00:23:51,222
నేను మీతో ఒక్క క్షణం మాట్లాడవచ్చా?

322
00:23:55,685 --> 00:23:57,687
ఏంటిది? నేను బిజీగా ఉన్నాను--

323
00:24:57,663 --> 00:24:59,123
డేవిడ్ జంగ్ ఎక్కడ ఉన్నాడు?

324
00:25:00,666 --> 00:25:05,046
నా రోజుల్లో,
నేను నిన్ను చేపలాగా చీరేసేవాడిని.

325
00:25:07,298 --> 00:25:09,175
డేవిడ్ జంగ్ ఎక్కడ ఉన్నాడు?

326
00:25:25,399 --> 00:25:28,277
నువ్వు అతనికి బదులుగా
నీ ప్రాణాన్ని ఇస్తావా?

327
00:25:29,946 --> 00:25:33,908
నీకు విధేయత గురించి
ఏమీ తెలియదురా, మూర్ఖుడా.

328
00:26:34,260 --> 00:26:36,220
నాకు కావలసిన విషయం చెప్పు.

329
00:26:36,304 --> 00:26:39,640
డేవిడ్ బుసాన్‌లో ఉన్నాడు.
దేశం విడిచి వెళ్ళే ప్లాన్ చేస్తున్నాడు.

330
00:26:39,724 --> 00:26:40,808
నీకెలా తెలుసు?

331
00:26:40,891 --> 00:26:44,687
అతను ఈ రాత్రి పాస్‌పోర్ట్‌లు తీసుకోవడానికి
తన పరిచయస్తుడిని కలవాల్సి ఉంది.

332
00:26:46,731 --> 00:26:48,607
అందులో రెబెక్కాది కూడా ఉందా?

333
00:26:57,074 --> 00:27:00,202
కలవడానికి నేను ఒక బృందాన్ని పంపుతాను.
మా అబ్బాయి వాళ్ళతో వస్తాడు.

334
00:27:02,747 --> 00:27:03,748
మీ అబ్బాయా?

335
00:27:04,457 --> 00:27:05,833
అతనికి రెబెక్కా తెలుసు.

336
00:27:06,751 --> 00:27:08,085
అతను సహాయం చేయగలడు.

337
00:27:09,545 --> 00:27:11,756
అతన్ని నీ వెనుక
సురక్షితంగా ఉంచు, అర్థమైందా?

338
00:27:12,673 --> 00:27:16,135
మీ అబ్బాయి, అతని కూతురు.

339
00:27:19,805 --> 00:27:21,182
ఇంకా ఏమైనా చెప్పాలా?

340
00:27:22,266 --> 00:27:25,895
రెబెక్కా, పోయినసారి
ఆమె నా దారికి అడ్డు వచ్చింది.

341
00:27:26,896 --> 00:27:28,564
ఆమె మళ్ళీ అలా చేస్తే?

342
00:27:31,317 --> 00:27:32,193
ఆమెను చంపేయు.

343
00:27:43,329 --> 00:27:47,249
అక్కా, నువ్వు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నావా?

344
00:27:49,960 --> 00:27:52,588
అమ్మా, నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు?

345
00:27:54,340 --> 00:27:55,883
దీన్ని నమ్మలేకుండా ఉన్నాను.

346
00:27:56,258 --> 00:27:59,011
కానీ నిజానికి
ఈ వంటకానికి కావలసినవన్నీ మన దగ్గరున్నాయి.

347
00:27:59,845 --> 00:28:04,100
మిన్హీ, ఇది నువ్వు కోరుకున్న
పుట్టినరోజు కాదని నాకు తెలుసు.

348
00:28:04,183 --> 00:28:06,602
-పుట్టినరోజులో మంచి విషయం ఏంటి?
-కానుకలు!

349
00:28:06,685 --> 00:28:08,354
కానుకలు! అవును, నాకు తెలుసు.

350
00:28:08,437 --> 00:28:09,438
దాని తర్వాత?

351
00:28:09,522 --> 00:28:11,107
-కేకు!
-కేకు!

352
00:28:12,608 --> 00:28:15,027
మనం కలిసి కేకు తయారు చేద్దామా?

353
00:28:18,364 --> 00:28:20,991
మిన్హీ, కేకు తయారు చేస్తావా?

354
00:28:28,207 --> 00:28:30,292
నేను అక్కతో కలిసి చేస్తాను.

355
00:28:32,545 --> 00:28:35,131
అక్కకు వంట చేయడం
నచ్చుతుందో లేదో నాకు తెలియదు...

356
00:28:37,133 --> 00:28:38,467
ఈసారి తుపాకులు ఉ౦డవులే.

357
00:28:52,648 --> 00:28:53,524
ఊరుకో.

358
00:28:54,650 --> 00:28:56,444
నువ్వు లేకుండా నేనిది చేయలేను.

359
00:28:59,905 --> 00:29:01,323
మన దగ్గర గుడ్లు కూడా లేవు.

360
00:29:02,241 --> 00:29:04,869
పరవాలేదు. అవి లేకుండా చేయడం నాకు తెలుసు.

361
00:29:08,414 --> 00:29:09,540
ఇంకా.

362
00:29:10,291 --> 00:29:11,917
బాగా చేసావు. సరే.

363
00:29:12,418 --> 00:29:14,170
సరే, ఇప్పుడు ఇది అమ్మకు ఇవ్వు.

364
00:29:16,881 --> 00:29:18,716
ఇది కూడా. అది ఇక్కడ పెట్టు.

365
00:29:21,010 --> 00:29:21,969
సరే.

366
00:29:22,928 --> 00:29:23,804
ఉజ్జాయింపుగా వేయు.

367
00:29:24,722 --> 00:29:28,100
ఇప్పుడు దాన్ని కలపాలి. బాగా కలుపు.

368
00:29:28,184 --> 00:29:30,311
బాగుంది, కలుపుతూనే ఉండు. సరే.

369
00:29:30,811 --> 00:29:33,898
-చాలా ఉన్నాయి.
-ఇదిగో, నీకు సహాయం చేస్తాను.

370
00:29:40,070 --> 00:29:41,739
నా దగ్గర ఏముందో చూడు.

371
00:29:42,448 --> 00:29:44,325
మిన్హీ, ఇది తిని చూస్తావా?

372
00:29:44,867 --> 00:29:46,410
సరే, చెంచా తీసుకో.

373
00:29:49,580 --> 00:29:51,415
ధన్యవాదాలు. ఆగు.

374
00:29:56,629 --> 00:29:57,588
సిద్ధమా?

375
00:29:58,339 --> 00:30:00,174
ఎలా ఉంది? రుచి బాగుందా?

376
00:30:00,257 --> 00:30:01,926
-రుచికరంగా ఉంది!
-మంచిది.

377
00:30:02,635 --> 00:30:03,677
ఇంకొకటి కావాలా?

378
00:30:07,515 --> 00:30:08,641
నువ్వు తిని చూడు.

379
00:30:15,356 --> 00:30:16,398
బాగుంది.

380
00:30:21,654 --> 00:30:22,613
బటర్ ఫ్లై.

381
00:30:23,948 --> 00:30:25,574
మనం ఆ ఆట ఆడే వాళ్ళం.

382
00:30:26,659 --> 00:30:28,786
నాకు ఒక నిమిషం పట్టింది,
కానీ గుర్తొచ్చింది.

383
00:30:44,843 --> 00:30:45,803
రెబెక్కా.

384
00:30:46,554 --> 00:30:47,471
ఆగు.

385
00:30:49,348 --> 00:30:51,183
నువ్వు స్వార్థపరుడైన చెత్త వెధవవి.

386
00:30:52,309 --> 00:30:55,854
నువ్వు నా రక్షణ కోసమే
నన్ను వదిలేశావని చెప్పావు కదా?

387
00:30:55,938 --> 00:30:58,941
నీ ప్రమాదకరమైన జీవితానికి,
నీ కూతురుకు మధ్య

388
00:30:59,024 --> 00:31:01,360
-దూరం ఉంచాలనుకున్నావు.
-నేను చెప్పాను...

389
00:31:01,443 --> 00:31:03,988
ఆపై వెళ్ళి మరో కూతురును కన్నావు!

390
00:31:04,989 --> 00:31:06,991
నువ్వు గూఢచారివి, హంతకుడివి.

391
00:31:07,074 --> 00:31:09,827
నీ కుటుంబాన్ని నాశనం చేయకుండా
ఈ జీవితాన్ని గడపలేవు.

392
00:31:14,290 --> 00:31:17,710
నువ్వు చెప్పింది నిజమే.
నాలాంటి వాళ్ళు పిల్లల్ని కనకూడదు.

393
00:31:18,544 --> 00:31:21,046
కానీ అందుకే నేను ఇవన్నీ
వదిలేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను.

394
00:31:21,130 --> 00:31:22,172
నువ్వు ప్రయత్నిస్తున్నావు.

395
00:31:23,757 --> 00:31:25,217
నువ్వు వదిలేయలేదు.

396
00:31:25,301 --> 00:31:29,680
నువ్వు గాని, మిన్హీ గాని నా జీవితంలో
ఉన్నందుకు నేను బాధపడతానా?

397
00:31:34,602 --> 00:31:37,813
నన్ను మన్నించు.
మనం ఇది తర్వాత మాట్లాడుకుందామా?

398
00:31:37,896 --> 00:31:40,899
నేను మన పాస్‌పోర్ట్‌లు తీసుకురావాలి,
లేదంటే మనం దేశం విడిచి వెళ్ళలేము.

399
00:31:40,983 --> 00:31:42,651
నేను అరగంటలో తిరిగి వస్తాను.

400
00:31:43,068 --> 00:31:43,902
నన్ను మన్నించు.

401
00:31:57,291 --> 00:31:58,667
-స్వాగతం.
-ధన్యవాదాలు.

402
00:32:00,502 --> 00:32:03,756
-ఇదేంటి?
-కార్పోవ్‌ను చంపిన క్యాడిస్ మనిషి.

403
00:32:05,341 --> 00:32:08,886
ఆమె మానసిక రోగి, దారి తప్పింది.
ఆమెకు నాకు సంబంధం లేదు.

404
00:32:08,969 --> 00:32:11,639
ఇది ఆమె మానసిక ప్రొఫైల్, వ్యక్తిగత ఫైల్.

405
00:32:11,722 --> 00:32:14,016
ఆమెను హత్యతో ముడిపెట్టే
అన్ని ఆధారాలున్నాయి.

406
00:32:19,104 --> 00:32:20,397
"రెబెక్కా జంగ్."

407
00:32:20,481 --> 00:32:22,858
అంతగా చనిపోని నీ మాజీ భాగస్వామికి
ఏదైనా సంబంధం ఉందా?

408
00:32:22,941 --> 00:32:24,318
ఆమె అతని కూతురు.

409
00:32:24,693 --> 00:32:26,236
కానీ ఆమె నీ దగ్గర పనిచేస్తుందా?

410
00:32:33,494 --> 00:32:34,578
కొంతకాలంగా పనిచేయడం లేదు.

411
00:32:36,121 --> 00:32:38,415
అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, జూనో.

412
00:32:38,499 --> 00:32:40,876
మాజీ గూఢచారి దారి తప్పింది.

413
00:32:40,959 --> 00:32:43,462
ఆమె తండ్రి అజ్ఞాతం నుండి బయటకు వచ్చి
ఆమెను తప్పించాడు.

414
00:32:44,004 --> 00:32:44,838
అంతే.

415
00:32:45,714 --> 00:32:47,341
జే-హున్ లీ సంగతేంటి?

416
00:32:47,424 --> 00:32:51,970
నేను చెప్పాను, అతని గురించి నాకు గాని,
నా కొడుకుకు గాని ఏమీ తెలియదు.

417
00:32:55,015 --> 00:32:56,934
ఇక చాలా, జార్జ్?

418
00:32:58,727 --> 00:33:00,187
ఒకవేళ ఇది నిజమైతే.

419
00:33:05,984 --> 00:33:06,819
సరే.

420
00:33:20,582 --> 00:33:26,588
జగల్చి మార్కెట్

421
00:33:39,143 --> 00:33:43,147
నేను చోయ్ యోంగ్ షిక్.
బీప్ తర్వాత సందేశం పంపండి.

422
00:33:50,446 --> 00:33:51,405
హలో?

423
00:33:51,488 --> 00:33:54,742
హలో. ఇది సోయోన్ నూడిల్ హౌసా?

424
00:33:54,825 --> 00:33:59,204
అవును, కానీ మేము మూసివేసాము. ఏదో జరిగింది.

425
00:35:07,689 --> 00:35:09,775
అతను నడుచుకుంటూ పశ్చిమం వైపు వెళ్ళాడు.

426
00:35:09,858 --> 00:35:13,070
టీమ్‌ను తిరిగి వాహనాల దగ్గరకు తీసుకెళ్ళు.
నేను అతన్ని అనుసరిస్తాను.

427
00:35:23,372 --> 00:35:25,582
నాన్నా, మేము నీకోసం ఎదురు చూస్తున్నాము.

428
00:35:25,666 --> 00:35:27,876
-ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి.
-ఎందుకు? ఏం జరిగింది?

429
00:35:27,960 --> 00:35:29,545
క్యాడిస్ ఇక్కడికి వచ్చింది.

430
00:35:29,628 --> 00:35:31,004
వాళ్ళకు చోయ్ దొరికాడు.

431
00:35:31,088 --> 00:35:32,339
అతను నా పరిచయస్తుడు

432
00:35:33,924 --> 00:35:38,095
వాళ్ళకు ఈ చోటు గురించి తెలుసో లేదో
నాకు తెలియదు కానీ ఇది మనకు సురక్షితం కాదు.

433
00:35:38,178 --> 00:35:41,723
పాస్‌పోర్ట్‌లు లేకుండా, మనకు జియోజే దీవి
ఉత్తమం. మీరు ఏమనుకుంటున్నారు?

434
00:35:41,807 --> 00:35:42,891
మనం అక్కడికి ఎలా చేరుకోవాలి?

435
00:35:43,267 --> 00:35:46,812
మనల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి ఒక జాలరికి
డబ్బులిస్తాను, కానీ మనం వెళ్ళిపోవాలి.

436
00:35:46,895 --> 00:35:47,855
పదండి.

437
00:35:56,947 --> 00:35:57,948
అతను ఎక్కడ ఉన్నాడు?

438
00:35:59,533 --> 00:36:01,243
ఆ ఇల్లు ఈ బ్లాక్ చివరలో ఉంది.

439
00:36:02,411 --> 00:36:04,413
-రెబెక్కా అతనితో ఉందా?
-నేను ఆమెను చూడలేదు.

440
00:36:06,415 --> 00:36:07,374
సరే.

441
00:36:08,208 --> 00:36:09,042
ఇదిగో.

442
00:36:10,168 --> 00:36:12,337
నువ్వు వెనుక ఉండాలని అనుకుంటాను.

443
00:36:14,381 --> 00:36:15,465
నేను ఈ పని చేయాలి.

444
00:36:27,978 --> 00:36:28,937
వాళ్ళు వచ్చారు.

445
00:36:30,230 --> 00:36:33,066
రెబెక్కా, నువ్వు ముందు ఉండు.
వెనుక నుండి వెళ్ళాలి. పదండి.

446
00:36:33,150 --> 00:36:35,152
మనం తొందరగా వెళ్ళాలి.

447
00:36:57,925 --> 00:36:59,551
మిన్హీ, పరిగెత్తుదాం, సరేనా?

448
00:37:02,596 --> 00:37:04,932
సరే, నలువైపులా వెళ్ళండి.
పరిసరాల్లో వెతకండి.

449
00:37:05,015 --> 00:37:06,558
వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళి ఉండరు.

450
00:37:19,613 --> 00:37:23,492
పుట్టినరోజు శుభాకాంక్షలు మిన్హీ

451
00:37:38,715 --> 00:37:39,591
ఇటువైపు.

452
00:37:51,561 --> 00:37:54,481
అది వెయ్యి డాలర్లు.
మమ్మల్ని జియోజే దీవికి తీసుకెళ్ళండి.

453
00:37:55,440 --> 00:37:57,484
-సరే, సరే!
-ధన్యవాదాలు.

454
00:37:57,567 --> 00:37:59,987
మీరు పట్టుకున్న ఏ చేప అయినా, అది మీదే.

455
00:38:00,070 --> 00:38:03,115
చేపలు వద్దండి. మేము వీలైనంత త్వరగా
బయలుదేరాలని అనుకుంటున్నాము.

456
00:38:03,198 --> 00:38:05,659
పూర్తిగా వెనుకకు వెళ్ళండి.

457
00:38:05,742 --> 00:38:07,828
ఇంతే. ఇప్పుడు బయలుదేరుదామా?

458
00:38:07,911 --> 00:38:13,083
త్వరలోనే బయలుదేరుతాము. కానీ నాకు ఇంజిన్‌ను
మొదలెట్టడానికి కొన్ని నిమిషాలు కావాలి.

459
00:38:20,757 --> 00:38:22,384
మనం తప్పించుకోలేము.

460
00:38:28,765 --> 00:38:30,976
మిన్హీని కిందకు తీసుకెళ్ళు, సరేనా?

461
00:38:31,059 --> 00:38:34,688
ఎక్కడైనా దాక్కుని గొళ్ళెం వేసుకో.
నాకు మాత్రమే తలుపు తెరవాలి.

462
00:38:34,771 --> 00:38:35,897
సరేనా? మిన్హీ.

463
00:38:38,442 --> 00:38:39,568
నేను ఇప్పుడే వస్తాను.

464
00:38:39,651 --> 00:38:41,028
నీకు చెప్పినట్టు చేయు, సరేనా?

465
00:38:42,946 --> 00:38:45,032
ఒకవేళ వాళ్ళు నీకోసం వస్తే. సరేనా.

466
00:38:45,407 --> 00:38:47,909
సరే. మళ్ళీ కలుస్తాను. సరేనా?

467
00:38:49,786 --> 00:38:50,787
నీకు ఏం కావాలి?

468
00:38:57,544 --> 00:38:58,462
సమయం.

469
00:39:32,829 --> 00:39:33,705
రెబెక్కా.

470
00:40:19,251 --> 00:40:21,336
రెబెక్కా! నేను లెక్కపెట్టగానే
వెనక్కి వెళ్ళు.

471
00:40:21,419 --> 00:40:24,965
మూడు, రెండు, ఒకటి.

472
00:40:33,056 --> 00:40:33,974
వెళ్ళు!

473
00:40:39,980 --> 00:40:40,897
వద్దు.

474
00:40:41,940 --> 00:40:43,400
వాళ్ళను దగ్గరకు రానీ.

475
00:40:51,116 --> 00:40:52,909
వెళదాం పద. రా.

476
00:41:00,500 --> 00:41:01,334
పరుగెత్తండి!

477
00:41:40,123 --> 00:41:43,043
ఇదిగో, డేవిడ్‌ను నాకు వదిలేయు.

478
00:41:43,126 --> 00:41:44,294
నువ్వు అమ్మాయిని పట్టుకో.

479
00:43:02,414 --> 00:43:04,958
ఆలీ, ఆలీ బయటకు రా.

480
00:43:08,878 --> 00:43:11,756
వద్దు, వద్దు, ఆగు. ఆగు!

481
00:43:15,051 --> 00:43:18,388
అమ్మా, అదేంటి?

482
00:43:19,222 --> 00:43:22,684
మిన్హీ, మనం ఒక ఆట ఆడుకుందాం, సరేనా?

483
00:43:23,643 --> 00:43:27,439
నీవు వీలైనంత సేపు దాక్కుని మౌనంగా ఉండాలి.
నువ్వు అలా చేయగలవా?

484
00:43:28,148 --> 00:43:30,483
సరే, అమ్మా.

485
00:43:32,319 --> 00:43:33,903
నిశ్శబ్దంగా ఉండు, సరేనా?

486
00:44:28,583 --> 00:44:30,168
నేనెవరో నీకు తెలుసా?

487
00:44:33,171 --> 00:44:34,381
నన్ను "గన్" అంటారు.

488
00:45:07,622 --> 00:45:10,542
-అమ్మా?
-మిన్హీ, అక్కడే ఉండు!

489
00:45:15,463 --> 00:45:16,589
బయటకు రా.

490
00:45:16,673 --> 00:45:19,509
నువ్వు భయపడుతున్నావని నాకు తెలుసు.
ఈసారి అమ్మ నీకు సాయం చేయలేదు.

491
00:45:37,152 --> 00:45:38,069
రా.

492
00:45:38,486 --> 00:45:39,612
ఇప్పుడు నీకు ఇబ్బంది ఉంది.

493
00:46:00,341 --> 00:46:02,135
అంజూ, నేను!

494
00:46:05,763 --> 00:46:06,723
నీకు ఏం కాలేదు కదా?

495
00:46:15,106 --> 00:46:17,442
మిన్హీ, నువ్వు అమ్మ చెప్పినట్లు
చాలా బాగా విన్నావు.

496
00:46:17,525 --> 00:46:20,487
మంచి అమ్మాయివి. మంచి అమ్మాయివి.

497
00:46:21,237 --> 00:46:22,322
రెబెక్కా ఎక్కడ ఉంది?

498
00:46:39,255 --> 00:46:40,715
వెనుకకు రా, ఆలీ.

499
00:46:41,883 --> 00:46:42,717
ఛ.

500
00:46:42,800 --> 00:46:44,219
ఇది ఆరంభం మాత్రమే.

501
00:47:00,777 --> 00:47:01,986
నా కుటుంబం?

502
00:47:02,070 --> 00:47:04,322
నువ్వు నా కుటుంబం వెంట పడతావా?

503
00:47:05,323 --> 00:47:07,992
నీ చావును చూడటానికి
మీ అమ్మ ఇక్కడ ఉంటే బాగుండేది.

504
00:47:08,535 --> 00:47:11,120
ఇది ఆమె మీ వెంట పడకుండా ఆపదు, నీకు తెలుసు.

505
00:47:11,204 --> 00:47:13,790
ఆమె చాలా కాలంగా
నువ్వు చనిపోవాలని కోరుకుంటోంది.

506
00:47:16,084 --> 00:47:17,210
మాటలు ఆపు.

507
00:47:18,753 --> 00:47:19,837
ఓరి దేవుడా.

508
00:47:21,631 --> 00:47:23,591
నువ్వు దాన్ని కనిపెట్టలేదు, కదా?

509
00:47:26,553 --> 00:47:29,013
డేవిడ్, నిన్ను ఇరికించింది జూనోనే.

510
00:47:32,767 --> 00:47:33,685
ఏంటి?

511
00:47:33,768 --> 00:47:36,938
తొమ్మిదేళ్ళ క్రితం, ఫిలిప్పీన్స్‌లో?

512
00:47:40,775 --> 00:47:41,651
ఆ పని చేసింది ఆమెనే.

513
00:47:41,734 --> 00:47:44,571
-నువ్వు నిజం చెబితే మంచిది!
-నిజమే చెబుతున్నాను!

514
00:47:45,446 --> 00:47:47,407
ఆమె నిన్ను మాల్డొనాడోకు అప్పగించింది.

515
00:47:48,283 --> 00:47:50,076
ఆమె అతనికి నీ ఫైల్ ఇచ్చింది,

516
00:47:50,159 --> 00:47:53,746
అతనికి నీ గుర్తింపు, నీ ఇంటి చిరునామా,
నీ వివరాలు అన్నీ ఇచ్చింది.

517
00:47:58,960 --> 00:48:00,003
రెబెక్కాది కూడా.

518
00:48:12,473 --> 00:48:13,474
ఆలివర్?

519
00:48:13,891 --> 00:48:15,268
ఆ పని చేసింది నువ్వు.

520
00:48:16,686 --> 00:48:18,646
ఇదంతా చేసింది నువ్వే.

521
00:48:18,730 --> 00:48:21,149
నేను నిన్ను నమ్మితే,
నువ్వు నన్ను మోసం చేశావు.

522
00:48:21,232 --> 00:48:24,068
అమ్మా. నన్ను మన్నించు.

523
00:48:24,944 --> 00:48:26,070
ఆలివర్?

524
00:48:26,446 --> 00:48:28,281
డేవిడ్, దయచేసి, నేను... దయచేసి.

525
00:48:28,364 --> 00:48:29,616
నువ్వు నా కూతురును తీసుకున్నావు.

526
00:48:31,451 --> 00:48:32,994
నువ్వు నా జీవితాన్ని తీసుకున్నావు.

527
00:48:33,077 --> 00:48:34,495
దయచేసి ఇలా చేయకు.

528
00:48:35,204 --> 00:48:36,581
నీకు ఏం కావాలో చెప్పు.

529
00:48:41,711 --> 00:48:44,422
ఇప్పుడు నీ దగ్గరి నుండి తీసుకోవడం నా వంతు.

530
00:49:46,150 --> 00:49:48,152
సబ్‌టైటిల్ అనువాద కర్త
నల్లవల్లి రవిందర్ రెడ్డి

531
00:49:48,236 --> 00:49:50,238
క్రియేటివ్ సూపర్‌వైజర్
నిశాంతి ఈవని
ందర్ రెడ్డి

