1
00:00:45,000 --> 00:00:46,166
అంధకారం!

2
00:00:51,416 --> 00:00:53,666
ప్రతిచోటా అంధకారం ఉంది.

3
00:00:55,583 --> 00:00:58,708
ధైర్యమూ లేదు, ఆశ కూడా లేదు.

4
00:01:00,791 --> 00:01:02,625
నేను కూడా నీలాగే భయపడ్డాను.

5
00:01:04,458 --> 00:01:07,750
ఆ తర్వాత, నాకు జవాబు దొరికింది.

6
00:01:09,000 --> 00:01:11,500
అప్పుడు భయం లేదు, బాధ లేదు,

7
00:01:13,833 --> 00:01:14,833
నిరాశ లేదు.

8
00:01:19,083 --> 00:01:21,041
నేను స్వేచ్ఛగా ఉన్నాను. చివరకు.

9
00:01:23,791 --> 00:01:25,083
నువ్వు కోరుకునేదీ అదేగా?

10
00:01:33,000 --> 00:01:33,958
రా.

11
00:01:34,625 --> 00:01:36,125
నీకు జవాబు చూపిస్తాను.

12
00:02:00,083 --> 00:02:01,625
వెనుక్కు తగ్గకు.

13
00:02:02,208 --> 00:02:03,750
అలా వదిలెయ్.

14
00:02:04,166 --> 00:02:05,250
లొంగిపో, బాని.

15
00:02:05,708 --> 00:02:06,750
నాకు లొంగిపో.

16
00:02:09,083 --> 00:02:09,916
ప్రిథ్వి.

17
00:04:00,625 --> 00:04:02,958
డా. ప్రిథ్వి
కాలింగ్...

18
00:04:09,166 --> 00:04:12,125
మీరు కాల్ చేస్తున్న నంబర్
ప్రస్తుతం స్విచాఫ్ చేసి ఉంది.

19
00:04:12,208 --> 00:04:13,416
తర్వాత ప్రయత్నించండి.

20
00:04:28,500 --> 00:04:30,750
నాన్న
ఇన్‌కమింగ్ కాల్

21
00:04:33,083 --> 00:04:35,333
-హలో? నాన్నా.
-హలో!

22
00:04:35,625 --> 00:04:37,500
అవును, ఇప్పుడే ఆఫీసుకు వచ్చాను.

23
00:04:37,708 --> 00:04:38,875
హలో, బాని.

24
00:04:39,750 --> 00:04:40,583
హలో?

25
00:04:40,958 --> 00:04:42,625
హలో? హలో?

26
00:04:43,625 --> 00:04:47,375
-హలో, నాన్నా?
-ఆఫీస్ ఏంటి? నువ్వు అబద్ధం చెబుతున్నావు.

27
00:04:48,625 --> 00:04:51,583
-మీరు అలా ఎందుకు అంటున్నారు, నాన్నా?
-నాకు అంతా తెలుసు.

28
00:04:52,291 --> 00:04:54,041
ఉద్యోగం కాదు, వ్యభిచారం చేస్తావు.

29
00:04:57,666 --> 00:05:01,458
అంతా సర్వనాశనం చేశావు.
నీకు సిగ్గు ఉంటే, నువ్వు చచ్చిపో.

30
00:05:08,375 --> 00:05:09,208
నాన్న

31
00:05:09,291 --> 00:05:10,625
బాని, బాగానే ఉన్నావా?

32
00:05:12,375 --> 00:05:13,291
ఏం జరిగింది?

33
00:05:14,250 --> 00:05:15,166
బాని!

34
00:05:23,166 --> 00:05:25,833
హలో? బాని, ఏం జరిగింది?

35
00:05:29,375 --> 00:05:30,583
బాగానే ఉన్నావా, తల్లీ?

36
00:05:32,333 --> 00:05:33,166
బాని.

37
00:05:35,333 --> 00:05:37,750
వద్దు, వద్దు.

38
00:06:37,041 --> 00:06:39,666
అంధేరా

39
00:06:48,666 --> 00:06:51,875
ఒక నెల తరువాత

40
00:07:09,291 --> 00:07:10,125
జై హింద్, మేడం.

41
00:07:14,958 --> 00:07:16,791
-అది ఇలా ఇవ్వండి.
-ఫైల్ ఇచ్చి వస్తా.

42
00:07:27,666 --> 00:07:30,333
కొత్త నిబంధనలను పెట్టేముందు
ప్రభుత్వం అంతగా ఆలోచించదు.

43
00:07:30,916 --> 00:07:32,333
కానీ వాటిని మనం పట్టించాలి.

44
00:07:32,541 --> 00:07:33,500
ఈ కొత్త విషయం ఏంటి?

45
00:07:33,750 --> 00:07:36,458
మహిళల కేసు అయితే,
మహిళా పోలీసులే నిర్థారించాలి.

46
00:07:36,541 --> 00:07:38,333
ఎందుకు?
నాకు నా పని చేయడం రాదా?

47
00:07:39,000 --> 00:07:39,916
మంచి ఉపాయం ఉంది.

48
00:07:40,291 --> 00:07:43,791
లింగం బట్టి బాత్రూంలు మాదిరిగా,
పోలీస్ స్టేషన్‌లు కూడా వేరుగా ఉండాలి.

49
00:07:43,958 --> 00:07:47,083
అప్పుడు అందరికీ స్పష్టత,
ఎవరికి ఎక్కడ ఊరట దొరుకుతుందో.

50
00:07:48,666 --> 00:07:50,833
-జై హింద్, సర్.
-జై హింద్, కదం.

51
00:07:51,583 --> 00:07:54,875
ఇది టీవీ నటుడి భార్య
సంజనా రెడ్డి వాంగ్మూలం.

52
00:07:55,375 --> 00:07:57,750
అతనికి తనే డ్రగ్స్
సరఫరా చేశానని ఒప్పుకుంది.

53
00:07:58,458 --> 00:07:59,583
అవునా?

54
00:08:06,500 --> 00:08:08,041
అయితే, చివరకు ఒప్పుకుంది.

55
00:08:08,916 --> 00:08:10,666
కదం రాపిడ్ ఫైర్‌లా అడిగుండాలి.

56
00:08:11,125 --> 00:08:12,375
అందుకే నిజం బయటకొచ్చింది.

57
00:08:12,916 --> 00:08:16,000
పోలీసు ఉద్యోగం మానేసెయ్.
సొంత టాక్ షో మొదలుపెట్టు.

58
00:08:16,500 --> 00:08:17,583
కాఫీ విత్ కదం.

59
00:08:21,291 --> 00:08:25,000
అవును. ఇంతకీ, కదం,
ఒక కనబడని వ్యక్తి కేసు ఉంది.

60
00:08:25,500 --> 00:08:26,666
ఒక అమ్మాయి కనబడడం లేదు.

61
00:08:26,750 --> 00:08:31,125
ఆమె పేరు బాని బరువా.
నాయక్ దర్యాప్తు పూర్తి చేశారు.

62
00:08:31,375 --> 00:08:34,791
అందులో నేరం లేదు. కానీ ఆమె తండ్రి
నమ్మడం లేదు. తను రోజూ వస్తాడు.

63
00:08:35,000 --> 00:08:37,666
-ఇంకా బయటే కూర్చున్నాడు.
-సర్, అతని కూతురు ఓ వేశ్య.

64
00:08:37,791 --> 00:08:40,041
హే, నాయక్! అలాంటి పదాలు మాట్లాడకు.

65
00:08:41,125 --> 00:08:42,500
ఆమెను సెక్స్ వర్కర్ అను.

66
00:08:42,875 --> 00:08:45,000
ఈ రోజుల్లో, అందరినీ గౌరవించడం తప్పనిసరి.

67
00:08:45,166 --> 00:08:47,666
మీరు ఎలా పిలిచినా,
ఆమె చేసే పని మారదు.

68
00:08:47,916 --> 00:08:49,583
కదం, నేను అనుకోవడం

69
00:08:49,875 --> 00:08:54,166
ఇందులో మనకు అవసరం...
మహిళ ప్రమేయం. కదా?

70
00:08:54,583 --> 00:08:56,625
ఆమె తండ్రితో మాట్లాడు.
అర్థమయేలా చెప్పు.

71
00:08:56,791 --> 00:08:58,791
తర్వాత, నాయక్ నివేదికపై
సంతకం చెయ్.

72
00:08:58,875 --> 00:08:59,708
విషయం ఏంటంటే...

73
00:08:59,791 --> 00:09:02,041
ఇప్పుడు కేసు మూసివేయడానికి
మహిళా పోలీసు

74
00:09:02,291 --> 00:09:04,166
సంతకం తప్పనిసరి. అవునా?

75
00:09:04,708 --> 00:09:05,875
ఆ పని చెయ్.

76
00:09:10,375 --> 00:09:11,416
సరే, సర్.

77
00:09:15,291 --> 00:09:16,625
ఆమె సంతకం పెడుతుంది.

78
00:09:18,541 --> 00:09:20,875
అయితే, ఆ అమ్మాయిని చూశావు, తర్వాత?

79
00:09:23,250 --> 00:09:26,416
ఆమె... కిటికీ పక్కన నిలబడింది.

80
00:09:28,083 --> 00:09:30,916
-ఆ తర్వాత...
-ఆత్మహత్యా?

81
00:09:36,333 --> 00:09:38,000
ఆమె తనంతట తానుగా దూకలేదు.

82
00:09:39,833 --> 00:09:43,458
ఆమెను ఏదో శక్తి
కిటికీ నుండి బయటకు లాగింది.

83
00:09:46,791 --> 00:09:47,666
శక్తి లాగిందా?

84
00:09:48,416 --> 00:09:49,666
ఆమెను లాగిందెవరు?

85
00:09:53,750 --> 00:09:56,416
-ఒక నీడ ఉంది.
-ఎవరి నీడ?

86
00:09:57,041 --> 00:09:59,250
కాదు, అది మనిషి నీడ కాదు.

87
00:10:00,125 --> 00:10:03,166
అంధకారాన్ని ఊహించండి.
అంధకారం, అయినా ప్రాణంతో ఉంది.

88
00:10:05,375 --> 00:10:08,291
ఏమిటిది? అసలు ఏం మాట్లాడుతున్నాను?

89
00:10:08,791 --> 00:10:11,083
పర్వాలేదు. సరిగ్గా ఉండాలనకోకు.
చెబుతూ ఉండు.

90
00:10:11,458 --> 00:10:13,416
ఏం చెప్పాలనుకుంటే అదే చెప్పు.

91
00:10:14,125 --> 00:10:15,375
ఆ అంధకారం ప్రాణాలతో ఉంది.

92
00:10:15,708 --> 00:10:17,250
అది తనకు తానే కదులుతుంది.

93
00:10:17,750 --> 00:10:20,500
అప్పుడు, ఆ అంధకారం
ఆ అమ్మాయిని కిటికీ నుండి లాగేసింది.

94
00:10:24,208 --> 00:10:25,500
కనబడడం లేదు
నమోదు పత్రం

95
00:10:25,583 --> 00:10:27,583
తను ఏమీ చెప్పకుండా
ఆత్మహత్య ఎందుకు?

96
00:10:27,666 --> 00:10:30,666
మేము చాలా సన్నిహితం.
ఆమె మాకు అన్నీ చెబుతుంది.

97
00:10:31,250 --> 00:10:33,166
తను ఎస్కార్ట్‌నని
మీకు చెప్పిందా?

98
00:10:33,458 --> 00:10:35,958
కాల్ సెంటర్‌లో
పని చేస్తానని అబద్ధమెందుకు?

99
00:10:38,166 --> 00:10:41,958
చూడండి, సర్, మనిషి కనబడని కేసులో
మేము ప్రతి విధానం అనుసరించాం.

100
00:10:42,208 --> 00:10:43,208
ఫలితం లేదు.

101
00:10:43,416 --> 00:10:45,416
పైగా, బాణీ మానసిక ఆరోగ్యం...

102
00:10:45,500 --> 00:10:47,625
ఆమె బైపోలార్. తను ఎస్కార్ట్ కూడా.

103
00:10:48,291 --> 00:10:49,541
కానీ ఆమె నా కూతురు.

104
00:10:50,250 --> 00:10:52,708
అలాగని తన కేసుకు
దర్యాప్తు అర్హత లేదా?

105
00:10:52,875 --> 00:10:54,166
నేను అలా చెప్పానా?

106
00:10:54,458 --> 00:10:57,000
నేను చెబుతున్నదల్లా నివేదికలో

107
00:10:57,083 --> 00:10:58,958
మరొకరి పాత్ర ఉందని సూచించడం లేదు.

108
00:10:59,166 --> 00:11:02,291
మరి ఆమె ఎందుకు అరిచింది?
హలో, హలో అని ఫోన్‌లో అరుస్తూనే ఉన్నా,

109
00:11:02,666 --> 00:11:03,875
కానీ తనేమీ మాట్లాడలేదు.

110
00:11:04,875 --> 00:11:06,375
-ఆమె అరిచిందా?
-అవును.

111
00:11:06,500 --> 00:11:08,208
-ఫోన్‌లోనా?
-కచ్చితంగా.

112
00:11:13,583 --> 00:11:15,000
ఇందులో ఏమీ రాయలేదు.

113
00:11:15,416 --> 00:11:17,666
నేను చెప్పాను... ఆ, అధికారికి...

114
00:11:19,125 --> 00:11:20,083
నాయక్.

115
00:11:26,583 --> 00:11:32,375
నీకు ఈ అమ్మాయి తెలుసా,
నీ కలలో వచ్చే అమ్మాయి?

116
00:11:35,666 --> 00:11:40,833
జయ్, ఈ నీడ అనేది
నీ నిగూఢ ఊహలలో కల్పన కావచ్చు.

117
00:11:41,416 --> 00:11:42,708
ఎంబీబీఎస్ విద్యార్థిని.

118
00:11:42,958 --> 00:11:45,958
కార్ల్ జంగ్, ఇంకా నీడ గురించి
తన విధానం గురించి బాగా తెలుసు.

119
00:11:47,500 --> 00:11:52,083
ఈ పీడకలలు, స్వప్నాలు, నీ ప్రమాదంతో
వీటికి సంబంధం ఉందనుకుంటావా?

120
00:11:52,708 --> 00:11:54,791
నా ప్రమాదాన్ని తెస్తూనే ఉంటారెందుకు?

121
00:11:55,041 --> 00:11:56,416
మీకు ఇంకా ఏం తెలియాలి?

122
00:11:56,500 --> 00:11:58,916
నేను మొత్తం చెప్పా.
వేరే ఏదీ గుర్తు లేదు.

123
00:11:59,000 --> 00:12:03,416
గుర్తు లేదా,
లేక మరిచిపోవాలని చూస్తున్నారా, జయ్?

124
00:12:04,500 --> 00:12:08,083
ఈ స్వప్నాలు, పీడకలలు
ఆ ప్రమాదం తర్వాతే మొదలయ్యాయి.

125
00:12:08,375 --> 00:12:10,708
ఆ ప్రమాదమే వీటికి మూలం కావచ్చు.

126
00:12:10,916 --> 00:12:13,958
మీరు చేయాల్సినది
మీ ప్రమాదం గురించి మాట్లడడమే, జయ్.

127
00:12:14,416 --> 00:12:17,125
ఒకటి చెప్పానా? ఇక నావల్ల కాదు.

128
00:12:18,250 --> 00:12:19,958
జయ్! జయ్!

129
00:12:23,208 --> 00:12:26,208
కేసు ముగింపు నివేదిక

130
00:12:50,708 --> 00:12:52,500
దర్యాప్తు అధికారి సంతకం

131
00:12:52,583 --> 00:12:55,791
కల్పనా కదం
పోలీస్ అధికారి

132
00:13:01,333 --> 00:13:03,208
అదే చివరిది.

133
00:13:04,125 --> 00:13:06,875
మీరు సంతకం చేయరని
నేను పందెం కాశాను.

134
00:13:08,083 --> 00:13:09,208
నేను ఓడిపోయా, మేడం.

135
00:13:30,000 --> 00:13:30,916
ఇదిగో.

136
00:13:34,458 --> 00:13:36,458
డా. అజీజ్‌తో నీ సెషన్ ఎలా జరిగింది?

137
00:13:37,041 --> 00:13:38,250
అదే నా ఆఖరి సెషన్.

138
00:13:38,625 --> 00:13:40,208
నేను ఇక మళ్లీ వెళ్లను.

139
00:13:40,291 --> 00:13:42,458
అయితే నీకెలా నయం అవుతుంది? దానంతటదే?

140
00:13:45,875 --> 00:13:49,166
ఆయనతో కనీసం కొన్ని సెషన్‌లు చెయ్, బాబూ.
ఆయనకు మరో అవకాశం ఇవ్వు.

141
00:13:50,375 --> 00:13:54,250
నువ్వు సరిగా తినడం లేదే?
ఇవాళ కూడా చాలా మిగిలిపోయాయి.

142
00:13:54,583 --> 00:13:57,541
ఎందుకంటే నువ్వు ప్రిథ్వికి కూడా
వండేశావు. మళ్లీ.

143
00:16:09,875 --> 00:16:12,375
-వేగంగా చేయాలా, హా?
-నీకు ఎందుకంత తొందర?

144
00:16:12,666 --> 00:16:14,583
లేదు. నిజానికి. అతిథులు వేచి ఉన్నారు.

145
00:16:51,916 --> 00:16:55,250
నాకు సంఘటనకు ముందు, వెనుక
వారం సీసీటీవీ ఫుటేజ్ కావాలి.

146
00:16:55,375 --> 00:16:58,625
ఫుటేజీ లేదు, మేడం. ఆ రాత్రి
సర్వర్ రూమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.

147
00:16:59,000 --> 00:17:01,708
అగ్నిమాపక సిబ్బందిని పిలిచాం.
అంతా తగలబడింది.

148
00:17:02,208 --> 00:17:03,416
నాయక్ గారికి తెలుసు.

149
00:17:05,875 --> 00:17:08,500
కనిత్కర్, అగ్నిమాపక విభాగం నుంచి
నివేదిక తీసుకో.

150
00:17:08,625 --> 00:17:09,750
సరే, మేడం.

151
00:17:11,208 --> 00:17:13,083
-నీకు కుక్కలు ఇష్టమా?
-హూ?

152
00:17:14,375 --> 00:17:15,833
-కుక్కలు?
-ఏమన్నారు?

153
00:17:16,375 --> 00:17:17,625
ముధోల్ వేటకుక్క తెలుసా?

154
00:17:19,000 --> 00:17:20,458
వాటిని వేటకు వాడతారు.

155
00:17:20,750 --> 00:17:23,458
ఒక్కసారి అవి వాసన పసిగట్టాయంటే,

156
00:17:24,583 --> 00:17:25,625
ఏనాటికీ మరిచిపోవు.

157
00:17:28,083 --> 00:17:32,875
మా కేకే మేడం...
ఆవిడ సరిగ్గా వేటకుక్క లాంటిదే.

158
00:17:34,000 --> 00:17:37,166
ఆవిడ కరిచిందంటే,
నీకు హామీ ఇస్తున్నా,

159
00:17:37,750 --> 00:17:41,083
దానికి ఇంజక్షన్
ఆ నాయక్ గారి దగ్గర కూడా ఉండదు.

160
00:17:42,541 --> 00:17:44,125
ఈ కిటికీ కొత్తగా పెట్టారా?

161
00:17:48,166 --> 00:17:49,291
పద.

162
00:17:52,791 --> 00:17:54,791
ఈ కిటికీ... ఇది కొత్తదా?

163
00:17:55,250 --> 00:17:59,208
మేడం, అదే రోజు రాత్రి, అగ్నిమాపక సిబ్బంది
పగలగొట్టాల్సి వచ్చింది, అందుకే...

164
00:18:00,208 --> 00:18:01,750
ఆ రాత్రి చాలా జరిగాయి, కదా?

165
00:18:03,916 --> 00:18:06,916
ఇంత జరిగితే, మిగతా సిబ్బందితో కూడా
మనం మాట్లాడాల్సి ఉంటుంది.

166
00:18:08,041 --> 00:18:10,000
కనిత్కర్, ఆ రాత్రి
అతిథుల జాబితా తీసుకో.

167
00:18:10,083 --> 00:18:11,500
-ఆ, మేడం.
-కానీ, నాయక్ సర్...

168
00:18:14,291 --> 00:18:16,125
పద.

169
00:18:18,916 --> 00:18:22,208
ఏం చెప్పానో గుర్తుందా? వేటకుక్క, హూ?

170
00:18:27,333 --> 00:18:29,583
హోటల్ బాంబే మూన్

171
00:18:33,250 --> 00:18:36,041
కనిత్కర్, ఆ కెమెరా
హోటల్ ఆవరణకు బయట ఉంది, కదా?

172
00:18:36,208 --> 00:18:38,166
-హుమ్.
-దాని ఫుటేజీ తెప్పించు.

173
00:18:41,250 --> 00:18:44,666
ఐబీడీని గుర్తించడానికి
కొలనోస్కోపీ సహాయపడుతుంది.

174
00:18:44,791 --> 00:18:46,416
అంధకారం ప్రాణాలతో రాగలదా?

175
00:18:46,500 --> 00:18:49,583
ఇది అల్సరేటివ్ కొలైటిస్ కేసు.

176
00:18:49,666 --> 00:18:51,041
అంధకారం లోకి - కనబడని
అతీంద్రియ శక్తులు

177
00:18:51,750 --> 00:18:54,458
హాయ్, గయ్స్!
అతీంద్రియ ప్రపంచంలోకి స్వాగతం.

178
00:18:54,708 --> 00:18:56,125
నేను, మీ రూమితో కలిసి,

179
00:18:56,333 --> 00:18:58,416
నా కొత్త షోలోకి, "అంధకారం లోకి,"

180
00:18:58,500 --> 00:19:01,708
కేవలం నా వ్లాగ్ టీవీ ఛానెల్,
అన్‌సీన్ సూపర్‌నేచురల్ క్లబ్‌లో.

181
00:19:02,625 --> 00:19:04,666
అన్ని పనులు ఆపేసి, చుట్టూ చూడండి.

182
00:19:04,958 --> 00:19:07,083
ప్రపంచం మరింత నిగూఢంగా మారడం లేదా?

183
00:19:07,375 --> 00:19:10,166
ఆశ తుడుచుకుపోతోంది.
హింసాత్మక నేరాలు పెరుగుతున్నాయి.

184
00:19:10,625 --> 00:19:13,166
దీనికంటే ఇంకా ఎక్కువ ఉందని
నేను మీకు చెబితే?

185
00:19:14,208 --> 00:19:18,625
అంధకారం అనేది సాధారణం కాదని,
అది అతీంద్రియమని నేను మీకు చెబితే?

186
00:19:20,291 --> 00:19:23,208
మన అజ్ఞానమే అంధకారానికి అతిపెద్ద బలం.

187
00:19:24,083 --> 00:19:28,291
మనం దానిని పట్టించుకోము,
కానీ అది మనను అనుక్షణం చూస్తూనే ఉంటుంది.

188
00:19:28,750 --> 00:19:30,791
కొలనోస్కోపీ ఏం చూపుతుంది?

189
00:19:33,583 --> 00:19:35,583
కొలనోస్కోపీ ఏం చూపుతుంది?

190
00:19:37,750 --> 00:19:39,708
కొలనోస్కోపీ ఏం చూపుతుంది?

191
00:19:40,041 --> 00:19:42,958
దానిని తెలుసుకోవడం అంటే
చీకటి గుహలోకి వెళ్లడం.

192
00:19:44,041 --> 00:19:46,625
సూర్యుడు లేదా సూర్య కిరణాలు
చొచ్చుకుపోలేని ప్రదేశం.

193
00:19:47,208 --> 00:19:50,791
వింత విషయం, కదా? ఒకసారి దానిని చూస్తే
ఇక చూడకపోవడం ఉండదు.

194
00:19:56,291 --> 00:19:58,083
హే! ఎక్కడకు వెళుతున్నావు?

195
00:20:03,208 --> 00:20:05,541
రా, రా. మరొకటి. మరొకటి.

196
00:20:06,500 --> 00:20:08,291
ఏం చేస్తున్నావు, బాబూ? తీసుకో.

197
00:20:10,208 --> 00:20:12,291
కానీయండి, గయ్స్! క్యాచ్, క్యాచ్.

198
00:20:15,541 --> 00:20:19,708
హే, రూమి. వీడి అమ్మ నిన్ను కలవాలట.

199
00:20:22,166 --> 00:20:24,500
-ఎందుకు?
-వీడికి క్రికెట్ దెయ్యం పట్టింది.

200
00:20:24,666 --> 00:20:25,791
ఆమె దానిని వదిలించాలట.

201
00:20:34,833 --> 00:20:37,125
-హలో, ఎలా ఉన్నావు?
-బాగున్నాను.

202
00:20:41,500 --> 00:20:43,708
రూమి

203
00:20:46,083 --> 00:20:49,916
నీకు ఇష్టమైన బ్రౌనీలు!
చల్లగా ఉండు! మామయ్య

204
00:21:13,250 --> 00:21:15,916
ఇక ఈ అంధకారం కళ్లలోకి
నేరుగా చూడండి.

205
00:21:16,125 --> 00:21:17,458
ఎలాంటి భయం,
బెరుకు లేకుండా.

206
00:21:17,875 --> 00:21:21,291
నేను, మీ రూమితో కలిసి,
నా కొత్త షో లో, "అంధకారం లోకి,"

207
00:21:21,791 --> 00:21:25,166
కేవలం నా వ్లాగ్ టీవీ ఛానెల్,
అన్‌సీన్ సూపర్‌నేచురల్ క్లబ్‌లో.

208
00:21:25,416 --> 00:21:28,291
మీకు ఈ వీడియో నచ్చితే, తప్పకుండా
లైక్ బటన్ నొక్కండి.

209
00:21:28,375 --> 00:21:31,041
నా ఛానెల్‌కు సబ్‌స్క్రైబ్ చేయండి,
కామెంట్ చేయండి.

210
00:21:31,125 --> 00:21:33,750
మీ చుట్టూరా చూడండి.
అనేక విషయాలు,

211
00:21:33,875 --> 00:21:37,708
గృహ హింస, రోడ్డుపై కోపాలు,
విపత్తులు, ఆత్మహత్యలు పెరగడం లాంటివి.

212
00:21:38,166 --> 00:21:42,250
ఈ సంఘటనలన్నీ తరచుగా
అతీంద్రియ అనుభవాలతో లేదా

213
00:21:42,500 --> 00:21:44,500
వివరించలేని దృశ్యాలతో కలిసుంటాయి.

214
00:21:44,916 --> 00:21:46,916
అనేక ఉదాహరణలు ఉంటాయి, ఎలాగంటే,

215
00:21:47,000 --> 00:21:49,833
డెట్రాయిట్ అల్లర్ల సమయంలో
నైన్ రూజ్ భూతాన్ని చూడడం.

216
00:21:49,916 --> 00:21:53,166
లేదా ఆస్ట్రేలియన్ బుష్‌ఫైర్ల సమయంలో,
క్రాంపస్ అనే భూతం ఉంది.

217
00:21:53,250 --> 00:21:54,250
ఇలాంటి అనేక కథలు.

218
00:21:54,833 --> 00:21:58,125
ఇక వ్యక్తిగతంగా, నేను నమ్మేది...
ఇప్పుడు, తెలియదు, దానిని

219
00:21:58,333 --> 00:22:00,875
అంతరాత్మ లేదా దృక్పథం,
లేదా ఇంద్రియ జ్ఞానం అనండి,

220
00:22:01,791 --> 00:22:05,208
కానీ ప్రస్తుతం, ముంబైలో కూడా
ఒక విచిత్రమైన ఉనికి ఉంది.

221
00:22:07,791 --> 00:22:11,000
అందుకే, మీలో ఎవరైనా
అతీంద్రియ కార్యకలాపం అనుభవిస్తే,

222
00:22:11,083 --> 00:22:12,208
దయచేసి చెప్పండి.

223
00:22:12,666 --> 00:22:13,958
మొదట ఎవరు చెబుతారు?

224
00:22:16,875 --> 00:22:20,500
మన కొత్త సభ్యుడు చేయి ఎత్తుతున్నారు.
జయ్ షేత్

225
00:22:20,666 --> 00:22:24,708
హాయ్, జయ్. "అన్‌సీన్ సూపర్‌నేచురల్
క్లబ్"లో చేరినందుకు ధన్యవాదాలు.

226
00:22:24,833 --> 00:22:26,333
దయచేసి ఇది వెంటనే ఆపు.

227
00:22:26,708 --> 00:22:30,375
ప్రజల మానసిక అనారోగ్యం, మానసిక సమస్యలను
అతీంద్రియం అంటున్నావు.

228
00:22:30,500 --> 00:22:33,583
దేనికి? సభ్యులు, కంటెంట్, లైక్‌ల కోసమా?
నీకు పిచ్చా?

229
00:22:33,666 --> 00:22:35,000
బాబూ, ఏది పిచ్చో తెలుసా?

230
00:22:35,291 --> 00:22:39,208
ఓ పారానార్మల్ యాక్టివిటీని అనుభవిస్తే,
దానిని చెప్పుకోలేవు.

231
00:22:39,291 --> 00:22:41,666
ఎందుకంటే జనాల వెటకారం,
అభిప్రాయాలకు భయపడి.

232
00:22:42,083 --> 00:22:45,250
ఈ అనుభవాలను మానసిక అనారోగ్యం అనడమే
అసలైన పిచ్చి,

233
00:22:45,333 --> 00:22:47,208
సంకుచిత నిర్లక్ష్యపు వెధవ.

234
00:22:47,458 --> 00:22:50,625
నా వ్లాగ్‌లో ఏమీ వాగకు.
ఇంకా ఎవరైనా?

235
00:23:00,958 --> 00:23:03,833
మేడం, బాని కాల్ రికార్డ్‌లు.

236
00:23:05,750 --> 00:23:08,250
హోటల్ సిబ్బందితో మాట్లాడావా?
ఏమైనా దొరికిందా?

237
00:23:08,333 --> 00:23:11,666
వాళ్లూ అదే చెబుతున్నారు,
ఏదో స్క్రిప్ట్ చదివినట్లుగా.

238
00:23:16,541 --> 00:23:18,583
తను డాలీ. ఒక్క క్షణం, మేడం.

239
00:23:19,291 --> 00:23:20,333
హలో.

240
00:23:20,750 --> 00:23:23,250
నాకు కాల్ చేస్తూ ఉండకు.
ఒత్తిడి భరించలేను.

241
00:23:45,791 --> 00:23:49,125
కాలర్‌ను కనుగొనండి
కాల్ లాగ్ - పరిచయం - శోధన

242
00:23:52,666 --> 00:23:54,416
డా. ప్రిథ్వి షేత్
కాలింగ్...

243
00:23:54,708 --> 00:23:59,291
మీరు డయల్ చేసిన నంబర్
స్విచాఫ్ చేసి ఉంది, మళ్లీ ప్రయత్నించండి.

244
00:24:08,958 --> 00:24:13,208
ప్రిథ్వి షేత్
పాస్‌వర్డ్ - లాగిన్

245
00:24:37,125 --> 00:24:39,583
ప్రాక్టీస్ చేస్తేనే నేర్చుకుంటావుగా?

246
00:24:41,833 --> 00:24:43,041
రా. పద.

247
00:24:45,875 --> 00:24:49,708
జనాలు కొత్త కారు కొన్నాక, కొబ్బరికాయ
కొడతారు. నేను హెడ్‌లైట్ బద్దలుకొట్టనా?

248
00:24:52,291 --> 00:24:56,041
శాంతించు. మనకు ఇది ఉంది.
మన అదృష్ట బీమా.

249
00:25:07,750 --> 00:25:11,041
ఎం-ఈ-డీ-ఏ-ఎల్

250
00:25:12,500 --> 00:25:13,458
పాస్‌వర్డ్ తప్పుగా ఉంది

251
00:26:19,041 --> 00:26:19,916
ఏం జరిగింది.

252
00:26:23,000 --> 00:26:24,250
పీడకల వచ్చిందా?

253
00:26:26,958 --> 00:26:28,208
కాలేజీకి వెళ్లవా?

254
00:26:34,166 --> 00:26:37,291
వెళ్లాలని లేకపోతే వెళ్లకు.
విశ్రాంతి తీసుకో.

255
00:26:37,666 --> 00:26:39,875
పర్వాలేదమ్మా. వదిలేసెయ్.

256
00:26:40,250 --> 00:26:42,125
పోహా చేశాను. తిను, సరేనా?

257
00:26:42,500 --> 00:26:44,750
నీ మందులు వేసుకోవడం మరిచిపోకు.

258
00:26:46,875 --> 00:26:48,958
సమయానికి వేసుకో, బాబూ.

259
00:26:49,041 --> 00:26:51,666
సరేనా? మరిచిపోకు. సరే, వెళతాను.

260
00:27:00,875 --> 00:27:04,500
డా. ప్రిథ్వి షేత్.
బాణీ అతని పేరు మీతో చెప్పిందా?

261
00:27:15,000 --> 00:27:15,833
లేదు.

262
00:27:17,000 --> 00:27:21,041
సర్, బాని మాయమైపోయిన రోజున
అతనికి 13 సార్లు కాల్ చేసింది.

263
00:27:22,708 --> 00:27:24,083
అతని పేరు ఏనాడూ చెప్పలేదు.

264
00:27:42,375 --> 00:27:44,125
నేను బాని గది చూడవచ్చా?

265
00:27:44,291 --> 00:27:46,125
హా, తప్పకుండా. ఇటు వైపు.

266
00:28:47,791 --> 00:28:48,791
ఆత్మ హీలింగ్

267
00:28:48,875 --> 00:28:49,833
ఏమిటిది...

268
00:28:50,791 --> 00:28:52,000
ఆత్మ?

269
00:28:54,625 --> 00:28:57,708
ఏదో థెరపీ కోసం
బాని అక్కడకు వెళ్లేది.

270
00:28:58,375 --> 00:29:00,666
అది సందర్శించాక తనకు మెరుగ్గా ఉండేది.

271
00:29:01,541 --> 00:29:03,791
బాని బరువా బరువా
ఐడీ సం: 4198

272
00:29:03,875 --> 00:29:05,125
పద, కనిత్కర్.

273
00:29:56,125 --> 00:29:57,208
బయటకు వచ్చెయ్.

274
00:29:58,250 --> 00:29:59,375
వాళ్లు వెళ్లిపోయారు.

275
00:30:00,250 --> 00:30:01,291
వచ్చెయ్.

276
00:30:15,500 --> 00:30:19,833
ఆత్మ
హీలింగ్

277
00:30:21,166 --> 00:30:22,833
వేరే దేశంలో ఉన్నట్లుంది.

278
00:30:22,916 --> 00:30:27,833
నమస్కారం. నా పేరు చైతన్య శర్మ,
మేనేజింగ్ డైరెక్టర్, ఆత్మ హీలింగ్.

279
00:30:28,666 --> 00:30:30,958
వెళదామా? రండి.

280
00:30:59,416 --> 00:31:02,666
తను మిస్ అయేషా.
మా చీఫ్ వెల్‌నెస్ కన్సల్టెంట్.

281
00:31:03,625 --> 00:31:06,000
ఆమె మీకు సహకరిస్తారు, సరేనా?

282
00:31:06,375 --> 00:31:07,750
-తప్పకుండా, సర్.
-వెళతాను.

283
00:31:08,791 --> 00:31:10,500
దయచేసి కూర్చోండి.

284
00:31:11,916 --> 00:31:15,708
మాకు ఒక వ్యక్తి కనబడలేదనే కేసు ఉంది.
తను మీ విద్యార్థి, బాని బరువా.

285
00:31:17,250 --> 00:31:18,250
నేను చూస్తాను.

286
00:31:23,875 --> 00:31:25,416
నాలుగు నెలలు అయింది.

287
00:31:26,750 --> 00:31:28,625
బాని బరువా రావడం లేదు.

288
00:31:32,958 --> 00:31:36,083
మీరు ఇతనిని ఇక్కడేమైనా చూశారా?
డా. ప్రిథ్వి షేత్.

289
00:31:55,875 --> 00:32:00,541
లేదు. ప్రిథ్వి అని ఇక్కడ ఎవరూ లేరు.

290
00:32:02,958 --> 00:32:06,291
నాకు బాని ఇన్‌స్ట్రక్టర్,
తన బ్యాచ్ వాళ్ల వివరాలు కావాలి.

291
00:32:06,458 --> 00:32:08,083
తప్పకుండా, అవి తెప్పిస్తాను.

292
00:32:11,583 --> 00:32:14,125
మన దగ్గర బాని బరువా అనే విద్యార్థిని ఉంది.

293
00:32:19,500 --> 00:32:21,333
ఎవరో చూస్తున్నారు. కాసేపు పడుతుంది.

294
00:32:21,708 --> 00:32:23,708
అప్పటి వరకు ఏమైనా తీసుకుంటారా?

295
00:32:23,833 --> 00:32:25,000
గ్రీన్ టీ లేదా ఏమైనా?

296
00:32:25,208 --> 00:32:26,625
-లేదు.
-టీ.

297
00:32:27,083 --> 00:32:28,291
-తప్పకుండా.
-టీ?

298
00:32:29,625 --> 00:32:32,375
-ఒక కప్పు టీ పంపించు.
-మామూలుగానే. బెల్లంతో.

299
00:32:33,000 --> 00:32:34,875
-ఇంకేమైనా?
-బిస్కెట్లు.

300
00:32:35,208 --> 00:32:38,375
తప్పకుండా. కుకీస్ కూడా.

301
00:32:39,041 --> 00:32:41,541
ఖాళీ కడుపుతో టీ తాగవద్దని
డాలీ చెప్పింది.

302
00:32:44,958 --> 00:32:48,166
ఒక్క నిమిషం. హలో.
హా, చెప్పు, షిండే.

303
00:32:53,375 --> 00:32:55,208
మీరు ఇక్కడ ధ్యానం చేయిస్తారా?

304
00:32:55,583 --> 00:32:58,750
ధ్యానం మాత్రమే కాదు.
ఇది అంతకంటే ఎక్కువ.

305
00:32:59,000 --> 00:33:01,291
మరింత సాంకేతికం. దానిని ఆటెమ్ అంటారు.

306
00:33:01,916 --> 00:33:04,083
అడ్వాన్స్‌డ్ టెక్-ఎనేబుల్డ్
మైండ్‌ఫుల్‌నెస్.

307
00:33:04,833 --> 00:33:08,333
నిజానికి, పోలీసుల కోసం కూడా
థెరపీ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తాం.

308
00:33:08,875 --> 00:33:11,625
స్పెషల్ థెరపీ.
మీరేమైనా ప్రయత్నిస్తారా?

309
00:33:13,500 --> 00:33:16,583
నాకు థెరపీ మీద ఆసక్తి లేదు.

310
00:33:17,791 --> 00:33:18,958
ఎవరికి ఉంటుంది?

311
00:33:19,875 --> 00:33:22,083
కొన్నిసార్లు మనకు అది కావాలి. అందరికీ.

312
00:33:24,791 --> 00:33:28,791
ఏదేమైనా, ఇది నా కార్డ్.
ఒకవేళ మీరు మనసు మార్చుకుంటే.

313
00:33:33,458 --> 00:33:36,583
మేడం, ప్రిథ్వి షేత్
చిరునామా దొరికింది.

314
00:33:39,916 --> 00:33:41,541
మీ సహకారానికి ధన్యవాదాలు.

315
00:33:46,291 --> 00:33:47,583
బుధవారం, జూలై 24
1 కొత్త సందేశం

316
00:33:53,125 --> 00:33:55,791
జయ్ షేత్
అంధకారం ప్రాణాలతో రాగలదా?

317
00:33:55,875 --> 00:33:57,125
జయ్ షేత్?

318
00:34:01,708 --> 00:34:05,958
రూమి
అరే, నిన్న ట్రాల్ చేసినది నువ్వేగా?

319
00:34:06,125 --> 00:34:09,625
జయ్ షేత్
అది ప్రాణంతో రాగలదా?

320
00:34:10,583 --> 00:34:12,791
రూమి
ఎందుకు అడుగుతున్నావు?

321
00:34:19,416 --> 00:34:22,500
జయ్ షేత్
ఎందుకంటే... నేను ఆ అంధకారాన్ని చూశాను.

322
00:34:29,083 --> 00:34:32,125
రూమి - ఈ వీడియోను చూడు.
ఇది స్థానిక వార్తా ఛానెల్‌ది.

323
00:34:32,208 --> 00:34:33,625
అంధకారం ఆమెను కబళించింది.

324
00:34:36,875 --> 00:34:41,166
తను ఒక నటుడి కూతురో
లేదా రాజకీయ నేత కూతురు అయితే?

325
00:34:41,875 --> 00:34:44,125
పోలీసులు ఆ కేసు పరిష్కారం పైనే
పని చేసేవారు.

326
00:34:44,208 --> 00:34:46,583
పోలీసులు తీవ్రంగా తీసుకోలేదని
ఎందుకు అనుకుంటారు?

327
00:34:46,666 --> 00:34:48,583
ఎవరూ ఆమెను కనుగొనలేరు.

328
00:34:50,583 --> 00:34:53,541
బాని వెళ్లిపోయింది.
అది ఆమెను తీసుకుపోయింది.

329
00:34:54,041 --> 00:34:55,083
ఎవరు?

330
00:34:57,208 --> 00:34:58,250
అంధకారం.

331
00:35:00,708 --> 00:35:02,041
అది నా కూతురును
మింగేసింది.

332
00:35:02,500 --> 00:35:05,375
ఈ ముసలి తల్లి
ఏం ఎదుర్కుంటోందో నువ్వు చూడవచ్చు.

333
00:35:05,458 --> 00:35:08,125
తన కూతురు కనబడడం లేదని
ఆమె ఎంతగా బాధపడుతోందో.

334
00:35:39,291 --> 00:35:42,791
-ఇది ప్రిథ్వి షేత్ ఇల్లేనా?
-ఎందుకు? ఏం జరిగింది?

335
00:35:43,208 --> 00:35:46,166
-మేము లోపలకు రావచ్చా?
-అతను ఇంటిలో లేడు.

336
00:35:48,000 --> 00:35:50,500
పక్కకు జరుగు.

337
00:35:50,666 --> 00:35:53,458
మీరు వారంట్ లేకుండా
ఇలా లోపలకు రాకూడదు.

338
00:35:53,708 --> 00:35:56,041
ఏమండీ. ఇది దేని గురించి?
ఎవరూ లేరని చెప్పాను.

339
00:35:56,125 --> 00:35:58,375
ఏం జరిగిందో చెబుతారా?
మీరు ఏం వెతుకుతున్నారు?

340
00:35:58,500 --> 00:36:00,666
మీరు ఇలా ఎలా లోపలకు వస్తారు?

341
00:36:00,750 --> 00:36:04,166
మీరు ఇలా ఎవరి ఇంట్లోకి అయినా
ఎలా రాగలుగుతారు? ఇది దారుణం.

342
00:36:04,875 --> 00:36:06,791
మేడం. ఇంటిలో వేరే ఎవరూ లేరు.

343
00:36:07,166 --> 00:36:09,416
అతని లాప్‌టాప్, ఫోన్,
స్మార్ట్‌వాచ్ వెతుకు.

344
00:36:09,583 --> 00:36:11,000
దేని కోసం వెతకడం?

345
00:36:11,500 --> 00:36:13,500
మీరు ఏం జరిగిందో చెబుతారా?

346
00:36:15,250 --> 00:36:16,750
నీ పేరు ఏంటి?

347
00:36:20,083 --> 00:36:22,125
-నీ పేరేంటి?
- జయ్ షేత్.

348
00:36:23,291 --> 00:36:24,375
ప్రిథ్వి
తమ్ముడివా?

349
00:36:26,916 --> 00:36:28,875
-అతను ఎక్కడ?
-ఇక్కడ లేడని చెప్పాను.

350
00:36:29,041 --> 00:36:31,875
నాకది కనబడుతోంది.
మీ అమ్మానాన్నలు ఎక్కడ?

351
00:36:32,958 --> 00:36:35,916
-ఎందుకు?
-అడిగిన దానికి జవాబు చెప్పు. అర్థమైందా?

352
00:36:36,000 --> 00:36:37,083
మీ అమ్మానాన్నలు ఏరి?

353
00:36:38,166 --> 00:36:40,166
-అమ్మ ఆఫీసులో ఉంది.
-మరి మీ నాన్న?

354
00:36:42,833 --> 00:36:43,708
ఇది ప్రిథ్విదేనా?

355
00:36:43,791 --> 00:36:46,000
లాప్‌టాప్, ఫోన్ నావి.
అవి తిరిగిచ్చేయండి.

356
00:36:46,083 --> 00:36:47,958
ప్రిథ్విని స్టేషన్‌కు తెచ్చి,
తీసుకో.

357
00:36:48,041 --> 00:36:50,291
నన్ను ఇలా ఎలా వేధిస్తారు?
ఏం జరుగుతోంది?

358
00:36:51,833 --> 00:36:53,000
నీకు ఈమె తెలుసా?

359
00:37:01,291 --> 00:37:02,541
ఈమె ప్రిథ్వి ప్రియురాలా?

360
00:37:03,375 --> 00:37:04,333
నాకు తెలియదు.

361
00:37:06,750 --> 00:37:08,416
చెప్పాగా, ఆమె ఎవరో తెలియదని.

362
00:37:10,250 --> 00:37:12,875
ఏంటి విషయం? ఏం జరుగుతోంది? జయ్?

363
00:37:13,166 --> 00:37:15,666
మేము ప్రిథ్వి షేత్ ను కలవాలి.
మీరు అతని తల్లేనా?

364
00:37:15,958 --> 00:37:19,666
అవును. కానీ...
మీరు ప్రిథ్విని ఎందుకు కలవడం?

365
00:37:20,458 --> 00:37:23,208
మీకు ఈమె తెలుసా?
ఈమెను ప్రిథ్వితో ఎప్పుడైనా చూశారా?

366
00:37:25,666 --> 00:37:27,666
ఈమె నెల రోజులుగా కనబడడం లేదు.

367
00:37:28,000 --> 00:37:30,125
ఈమె మాయం కావడంలో
ప్రిథ్వికి సంబంధం ఉండగలదు.

368
00:37:30,583 --> 00:37:32,291
-అది అసాధ్యం.
-ఎందుకు?

369
00:37:49,833 --> 00:37:50,791
తనిక్కడ
ఎప్పటినుండి?

370
00:37:52,208 --> 00:37:55,625
గత నెల నుండి. జూన్ 22.

371
00:37:57,708 --> 00:37:59,541
ఇరవై మూడు.

372
00:38:04,250 --> 00:38:05,083
మన్నించండి.

373
00:38:09,500 --> 00:38:12,625
-ఒక నిమిషం ఆగండి. నా లాప్‌టాప్.
-అతని లాప్‌టాప్ ఇచ్చేసెయ్.

374
00:38:16,875 --> 00:38:18,250
ప్రిథ్వి టాబ్లెట్
ఫోన్ కూడా.

375
00:38:18,333 --> 00:38:22,583
మేము తనిఖీ చేశాక తిరిగి ఇస్తాము.
అతనికి స్పృహ వస్తే మాకు కాల్ చేయండి.

376
00:38:24,416 --> 00:38:25,333
పద.

377
00:38:33,666 --> 00:38:34,500
ఇంకేంటి, మేడం?

378
00:38:35,416 --> 00:38:37,500
బాని జూన్ 23 నుండి కనబడడం లేదు.

379
00:38:38,208 --> 00:38:40,541
అతను 22 నుండి మంచం మీద ఉన్నాడు.

380
00:38:41,833 --> 00:38:42,666
ఇప్పుడేంటి?

381
00:38:42,750 --> 00:38:45,250
బాని ఫోటో చూశాక
అతను షాక్ కావడం గమనించారా?

382
00:38:46,791 --> 00:38:49,083
తావడేను వెంబడించమను. పద.

383
00:38:52,875 --> 00:38:55,083
మేడం, ఇది అగ్నిమాపక విభాగం నివేదిక.

384
00:38:56,708 --> 00:38:58,041
మేడం, ఇది వింతగా లేదా?

385
00:38:59,375 --> 00:39:01,041
నాయక్ గారు ఇదేం
దర్యాప్తు చేయలేదే?

386
00:39:02,458 --> 00:39:05,458
కదం! ఏంటి...

387
00:39:05,916 --> 00:39:07,458
బాని ఫైల్‌లో అప్‌డేట్ ఏంటి?

388
00:39:07,625 --> 00:39:10,083
-చదివేందుకు సమయం దొరకలేదు.
-ఏం చదవాలి?

389
00:39:10,333 --> 00:39:13,416
ఆమె పిచ్చిది.
మొత్తం కుటుంబానికి పిచ్చి.

390
00:39:13,750 --> 00:39:15,041
ఆమె తల్లి కూడా పిచ్చిదే.

391
00:39:15,250 --> 00:39:17,041
అందుకే తండ్రి ఆమెను తీసుకురాడు.

392
00:39:18,291 --> 00:39:21,458
గోఖలే గారు మీకేం చెప్పారు?
సంతకం చేసి, కేసు మూసేసెయ్.

393
00:39:22,791 --> 00:39:24,166
నాకు సమయం దొరకగానే చేస్తా.

394
00:39:24,541 --> 00:39:25,625
ఏమిటంత తొందర?

395
00:39:40,833 --> 00:39:43,958
అతను చెప్పినదానిలో విషయం ఉంది, మేడం.
ఆమె పిచ్చిదానిలా ఉంది.

396
00:39:44,666 --> 00:39:46,041
ఆమె ఏదో భ్రమలో ఉండవచ్చు.

397
00:39:47,958 --> 00:39:50,458
ఇది భ్రమ కాదు. ఇది భయం.

398
00:39:51,958 --> 00:39:52,791
భయమా?

399
00:40:01,666 --> 00:40:02,958
నాకు ఈ భయం తెలుసు.

400
00:40:19,291 --> 00:40:20,958
హంగ్రీ స్నాక్స్
ఫుడ్ పాయింట్

401
00:40:21,125 --> 00:40:21,958
జయ్ షేత్?

402
00:40:22,500 --> 00:40:24,291
అవును. హాయ్.

403
00:40:27,250 --> 00:40:29,791
ఏమీ అనుకోకపోతే నేను తినవచ్చా?
బాగా ఆకలిగా ఉంది.

404
00:40:33,416 --> 00:40:34,500
అంకుల్
మొబైల్

405
00:40:44,916 --> 00:40:45,750
చెప్పు.

406
00:40:48,708 --> 00:40:51,541
నీ వీడియోలో అంధకారం గురించి
ఏదో ప్రస్తావించావు.

407
00:40:52,958 --> 00:40:56,333
నేను ఆ అంధకారాన్ని చూశా...
బానిని తీసుకువెళ్లిపోవడాన్ని.

408
00:40:57,750 --> 00:40:58,833
ఆ రాత్రి
అక్కడున్నావా?

409
00:40:59,125 --> 00:41:02,875
చూడడం అంటే, నేనది కలలో చూశాను.
ఒక పీడకల.

410
00:41:03,291 --> 00:41:04,208
కలా?

411
00:41:06,250 --> 00:41:09,750
నన్ను ఆన్‌లైన్‌లో వెంబడించారు,
పురుషాంగం ఫోటోలు కూడా వచ్చాయి,

412
00:41:09,833 --> 00:41:12,291
-కానీ ఈ కల వ్యవహారం మరీ అతి.
-ఆగు.

413
00:41:13,875 --> 00:41:16,166
లేదు. తప్పుగా అనుకుంటున్నావు.
అబద్ధం కాదు.

414
00:41:16,250 --> 00:41:18,083
నేను ఆ అంధకారాన్ని నిజంగానే చూశాను.

415
00:41:21,416 --> 00:41:22,583
జూన్ 22న.

416
00:41:23,166 --> 00:41:25,416
మా అన్నకు, నాకు ప్రమాదం జరిగింది.

417
00:41:25,625 --> 00:41:27,791
ఆ రాత్రి, ఆ అంధకారాన్ని
నా కళ్లతో చూశాను.

418
00:41:28,333 --> 00:41:30,000
ఆ మరుసటి రోజున, జూన్ 23న,

419
00:41:30,250 --> 00:41:33,041
నా కలలో బానిని
అంధకారం కబళించడం చూశాను.

420
00:41:33,333 --> 00:41:36,333
ఏం జరుగుతుందో నాకు తెలియదు.
జరుగుతున్నది ఏంటి?

421
00:41:36,625 --> 00:41:38,583
ఎవరితో మాట్లాడాలి?
నన్నెవరు నమ్ముతారు?

422
00:41:38,916 --> 00:41:40,833
అందుకే నిన్ను సంప్రదించాను.

423
00:41:42,958 --> 00:41:44,833
ఈ ప్రమాదం గురించి ఇంకా చెప్పు.

424
00:41:52,666 --> 00:41:53,500
ప్రిథ్వి!

425
00:42:11,375 --> 00:42:14,000
ప్రమాదం తరువాత నేను స్తంభించిపోయాను.

426
00:42:38,583 --> 00:42:39,458
ప్రిథ్వి.

427
00:42:42,500 --> 00:42:43,333
ప్రిథ్వి!

428
00:42:45,625 --> 00:42:46,541
పృథ్...

429
00:43:30,000 --> 00:43:31,000
ప్రిథ్వి!

430
00:44:05,000 --> 00:44:10,083
ప్రిథ్వి! అన్నయ్యా! అన్నయ్యా, పైకి లే!
చూడు, ఇక్కడ ఉన్నాను.

431
00:44:11,541 --> 00:44:12,750
ప్రిథ్వి!

432
00:44:20,041 --> 00:44:22,708
విను, నాకు నిజంగా నీ సహాయం కావాలి.

433
00:44:23,041 --> 00:44:25,666
నాకు ఇదంతా ఎందుకు జరుగుతోందో
నేను అర్థం చేసుకోవాలి.

434
00:44:25,916 --> 00:44:29,791
ఈ అంధకారం, అసలు దీనంతటికీ అర్థమేంటి?

435
00:44:32,250 --> 00:44:35,500
నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు.

436
00:44:36,041 --> 00:44:38,875
నేను అనుకోవడం, బానికి ప్రిథ్వికి
ఏదో రకంగా సంబంధం ఉంది.

437
00:44:39,416 --> 00:44:41,166
ఎలా? నేనది తెలుసుకోవాలి.

438
00:44:42,125 --> 00:44:46,208
నేను... నేను బాని తల్లిని కలవడానికి
నాకు సహాయం చేయగలవా?

439
00:44:46,833 --> 00:44:49,208
దయచేసి నాకు సహాయం చేయగలవా? దయచేసి.

440
00:44:55,083 --> 00:44:56,083
సరే.

441
00:45:06,458 --> 00:45:08,958
-ధన్యవాదాలు.
-రేపు.

442
00:45:55,208 --> 00:45:56,541
ఎక్కు.

443
00:46:00,583 --> 00:46:01,958
ఏం జరుగుతోంది?

444
00:46:02,833 --> 00:46:04,333
నీకు అంతా తెలుసు, జయ్.

445
00:46:07,666 --> 00:46:09,625
ఎందుకలా చేశావు, జయ్?

446
00:46:09,708 --> 00:46:11,416
లేదు, నేనేమీ చేయలేదు.

447
00:46:11,791 --> 00:46:16,583
నువ్వు ప్రపంచానికి అబద్ధం చెప్పవచ్చు,
నీకు అబద్ధం చెప్పుకోవచ్చు.

448
00:46:17,083 --> 00:46:21,625
కానీ అంధకారం...
దానికి అంతా తెలుసు, జయ్.

449
00:46:26,916 --> 00:46:28,041
ప్రిథ్వి!

450
00:48:59,333 --> 00:49:01,333
సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల

451
00:49:01,416 --> 00:49:03,416
క్రియేటివ్ సూపర్‌వైజర్ శిరీష దర్భా
ంగిరాల

